• TFIDB EN
 • కుమారి 21F (2015)
  ATelugu2h 15m

  సిద్ధూ, కుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. బోల్డ్ యాటిట్యూడ్ వల్ల ఆమె ప్రేమను అనుమానిస్తాడు. ఓ రోజు ఓ సంఘటన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
  Watch
  Free
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  హెబ్బా పటేల్మీనా కుమారి
  నవీన్ నేనిఫోటోల సురేష్
  సుదర్శన్సొల్లు శ్రీను
  భాను శ్రీమధు
  హేమసిద్ధు తల్లి
  కమల్రవికాంత్
  గిరిధర్నర్సింగ్
  అరవింద్పవన్ సురేష్
  జోగి బ్రదర్స్ కన్సల్టెన్సీ అధికారులు
  సత్య కృష్ణడాక్టర్
  ఇర్ఫాన్ సతీష్
  చాణిక్యరాకేష్
  సుధా రెడ్డిమాల
  కెఎస్ రాజుస్టీఫెన్ పాల్
  సిబ్బంది
  విజయ్ బండ్రెడ్డినిర్మాత
  దేవి శ్రీ ప్రసాద్సంగీతకారుడు
  ఆర్. రత్నవేలుసినిమాటోగ్రాఫర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  <strong>హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,&nbsp; జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
  ఏప్రిల్ 02 , 2024
  <strong>రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్.. తక్కువ టైంలోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ పొందిన రాజ్ తరుణ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ ముద్దు పేరు? రాజ్ రాజ్ తరుణ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రాజ్ తరుణ్ తొలి సినిమా? ఉయ్యాల జంపాల రాజ్ తరుణ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజ్ తరుణ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, మే11 రాజ్ తరుణ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. రాజ్‌ తరుణ్‌కు లవర్ ఉందా? కుమారి21F సినిమా సమయంలో హెబ్బా పటెల్‌తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్లు వచ్చాయి. రాజ్‌ తరుణ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి రాజ్ తరుణ్ తొలి హిట్ సినిమా? కుమారి 21F రాజ్ తరుణ్ ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్, గ్రీన్ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పేరు? తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి? రాజ్ తరుణ్ ఫెవరెట్ హీరోయిన్? సమంత, అనుష్క శెట్టి రాజ్ తరుణ్‌కు ఇష్టమైన ప్రదేశం? లండన్ రాజ్‌ తరుణ్‌కు ఇష్టమైన సినిమాలు? టైటానిక్, జగడం రాజ్ తరుణ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. రాజ్ తరుణ్ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కథలు రాయడం రాజ్ తరుణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.&nbsp; రాజ్ తరుణ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? &nbsp;ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=1nbxCrXjMeY
  మార్చి 21 , 2024
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
  ఏప్రిల్ 06 , 2023
  New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
  New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
  సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం&nbsp; ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.&nbsp; ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.&nbsp; విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.&nbsp; హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.&nbsp; సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. &amp; Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self&nbsp;MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
  జనవరి 29 , 2024
  <strong>This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!</strong>
  This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
  గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush). నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; అనన్య జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దులేదురా ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహించారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.&nbsp; సుందరం మాస్టార్ టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.&nbsp; ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు. అబ్రహాం ఓజ్లర్‌ జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam&nbsp;MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu&nbsp;ETV WinMarch 22
  మార్చి 18 , 2024
  REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
  REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
  REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?కార్తీకేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. వీరిద్దరూ మరోసారి 18 పేజేస్ అనే ప్రేమకథను పరిచయం చేసే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.సుకుమార్ కథను అందించడం, అతడి శిష్యుడి దర్శకత్వం, అల్లు అరవింద్ సమర్పణ ఎప్పటిలాగే అంచనాలు పెంచాయి. ఈ వారం విడుదలైన చిత్రాలతో పోటీ పడుతుందా? బాక్సాఫీస్‌ వద్ద నిలబడిందో లెేదో తెలుసుకోండి.సోషల్ మీడియా కారణంగా ప్రేమలో విఫలమైన కుర్రాడు అనుకోకుండా ఓ యువతి రాసిన డైరీ చదువుతాడు. ఆమెను చూడకపోయినా వ్యక్తిత్వంతో &nbsp;లవ్‌లో పడతాడు.కథఇక ఆమెను కలుసుకుందాం అనే సరికి యువతి గురించి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అసలు ఆమెకు ఏం జరిగింది? హీరో ఏం చేశాడు ? ఇలాంటివి తెరపై చూడాల్సిందే.సినిమా ప్రారంభంలో దర్శకుడు ప్రేమ కథను పరిచయం చేశాడు. అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిపోతాడు. ఇలాంటి సినిమాలు ఉన్నా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కామెడీ ట్రాక్స్‌తో చిత్రాన్ని సాఫీగా నెట్టుకొచ్చారు.సాఫీగా సాగిపోయే18 పేజేస్ ట్రైలర్, పాటలు చూస్తే కచ్చితంగా ప్రేమ కథ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ వెళ్లే సరికి సినిమాను థ్రిల్లర్‌ జోనర్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.ప్రేమకథ అన్నారు?తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేపి వదిలేశాడు. ప్రేమకథ అయినా చాలా ట్విస్టులు ఉన్నాయనే హీరో నిఖిల్ మాటలు గుర్తుకురాక తప్పదు.హీరోయిన్‌కు ఏం అయిందనే వేటలో నిఖిల్ చేసే ప్రయత్నాలతో సెకాండాఫ్ ప్రారంభమై ప్రీ క్లైమాక్స్ వరకు పరుగులు తీస్తుంది. అన్ని సినిమాల్లోగానే లాజిక్ లేని సీన్లు కొన్ని కనిపిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ముందే ఊహిస్తారు.కథనంలో వేగంసుకుమార్ కథ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ కథనం నడిపించడం బాగుంది.రచన, దర్శకత్వందర్శకుడు సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్‌తో హిట్ అందుకొని కాస్త అనుభవం సాధించారనే చెప్పాలి. కథను నడిపించిన తీరు ఫర్వాలేదు.సినిమాలో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.సాంకేతిక నిపుణులునిఖిల్ సిద్ధార్థ్ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటన బాగుంది. మిగతావారు పరిధి మేరకు నటించారు.ఎవరెలా చేశారు?కథ కథనం థ్రిల్లింగ్ అంశాలురేటింగ్ : 3 / 5ప్లస్ఊహించే సీన్లుమైనస్
  ఫిబ్రవరి 13 , 2023
  HER movie review: ‘హిట్‌’ మూవీని తలపిస్తున్న ‘ హర్‌ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?
  HER movie review: ‘హిట్‌’ మూవీని తలపిస్తున్న ‘ హర్‌ ’.. మరి సినిమా హిట్టా..? ఫట్టా..?
  న‌టీన‌టులు: రుహానీ శ‌ర్మ‌, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్ స్వ‌రాఘ‌వ్‌ సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి సంగీతం: పవన్ నిర్మాతలు:&nbsp; ర‌ఘు సంకురాత్రి, దీప సంకురాత్రి ఈ శుక్రవారం (జులై 21) బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల తాకిడి ఎక్కువైంది. చిన్న చిత్రాలు క‌ట్ట క‌ట్టుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేశాయి. అందులో ఒక‌టే ‘హర్‌’. రుహానీశ‌ర్మ కీల‌క పాత్ర పోషించిన చిత్ర‌మిది. ‘చి.ల‌.సౌ’ మొద‌లుకొని ప‌లు సినిమాల్లో త‌న న‌ట‌న‌తో మెప్పించిన రుహానీ ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మ‌రి ఆ ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హైద‌రాబాద్ శివార్ల‌లో జంట హ‌త్య‌లు జరుగుతాయి. ఆ హ‌త్య‌ల వెన‌క కార‌ణాల్ని నిగ్గు తేల్చేందుకు ACP అర్చ‌నా ప్ర‌సాద్ (రుహానీ శ‌ర్మ‌) రంగంలోకి దిగుతుంది. ప‌లు కోణాల్లో ప‌రిశోధిస్తున్న క్ర‌మంలో కేసు ఊహించ‌ని మ‌లుపులు తీసుకుంటుంది. ఇంత‌కీ ఆ హ‌త్య‌ల్ని ఎవ‌రు చేశారు? హంతకుల్ని ప‌ట్టుకునే క్ర‌మంలో అర్చ‌న‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? మ‌రోవైపు ఆమె NIA (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ)లోకి వెళ్లాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది? త‌దిత‌ర అంశాలపై స్పష్టత కావాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. ఎవ‌రెలా చేశారంటే క‌థానాయిక రుహానీశ‌ర్మ తన నటనతో ఎప్పటిలాగే ఆక‌ట్టుకుంటుంది. పోలీస్ అధికారిణి పాత్ర‌లో ఆమె ఒదిగిపోయిన తీరు సినిమాకి బ‌లాన్నిచ్చింది. క‌థ మెుత్తాన్ని త‌న భుజాల‌పై మోస్తూ ఆమె&nbsp; ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌థ‌మార్ధంలో పాట‌లో వికాస్ వ‌శిష్ట‌తో క‌లిసి ఆమె అందంగా క‌నిపించి మెప్పించింది. జీవ‌న్‌కుమార్ త‌న‌దైన న‌ట‌న‌తోనూ, త‌న మార్క్ సంభాష‌ణ‌ల‌తోనూ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. ప్ర‌దీప్ రుద్ర మ‌రో పోలీస్ అధికారిగా క‌నిపించారు. అభిగ్న్య‌, సంజ‌య్ స్వ‌రూప్‌, బెన‌ర్జీ, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.&nbsp; ఎలా సాగిందంటే ‘హిట్‌’ సినిమా ప్రేరణతో ఈ మూవీని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. జంట హ‌త్య‌లతో మొద‌ల‌య్యే ఈ చిత్రంలో మ‌రో కేస్ కూడా కీల‌కమే. ఆరంభ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ‌తాయి. ఆ త‌ర్వాతే సినిమా గాడి త‌ప్పుతుంది. కేసు ప‌రిశోధ‌న‌లోనే బ‌లం లేదు. బాధితుల కుటుంబ స‌భ్యుల్ని, అనుమానితుల్ని క‌లిసి వివ‌రాలు సేక‌రించే క్ర‌మం సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఓ కేస్‌ని నిగ్గు తేల్చేందుకు ఇంత హంగామానా? అనిపిస్తుంది. సినిమాలోని మలుపుల విషయానికొస్తే గతంలో ఎక్కడో చూసిన భావన కల్గుతుంది. దీంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ప్ర‌భావం చూపించ‌దు. ఓ పోలీస్ అధికారి ప‌రిశోధిస్తున్న రెండు కేసుల్ని ఒక‌దానితో మ‌రొక‌టి ముడిపెట్టిన విధాన‌మే మాత్రం మెప్పిస్తుంది.&nbsp;&nbsp; డైరెక్షన్‌ &amp; టెక్నికల్‌గా ద‌ర్శ‌కుడు స్వ‌రాఘ‌వ్ మేకింగ్ మెప్పించినా, ఆయ‌న రాసుకున్న కేసులోనే బ‌లం లేదు. కొన్ని మ‌లుపులున్నా అవి పెద్ద‌గా థ్రిల్‌ని పంచ‌లేవు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం, కూర్పు విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని ప్ర‌ద‌ర్శించాయి. నిడివి త‌క్కువ ఉండ‌టం ఈ సినిమాకి క‌లిసొచ్చింది. నిర్మాణ విలువలు స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ రుహానీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ కథకథనంకొత్తదనం లేకపోవడం రేటింగ్‌: 2.25/5 https://www.youtube.com/watch?v=5QTyvR0wIiY
  జూలై 21 , 2023
  Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
  Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
  నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌&nbsp; విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన&nbsp; ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక&nbsp; విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.&nbsp; ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
  డిసెంబర్ 21 , 2023
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.&nbsp; అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.&nbsp; విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna&nbsp;MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside&nbsp;MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
  డిసెంబర్ 11 , 2023
  Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
  Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ. &nbsp; బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో&nbsp; ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao&nbsp;MovieHindiJio CinemaAugust 25Invasion 2&nbsp;SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
  ఆగస్టు 21 , 2023
  OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
  OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
  ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హిడింబ అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై&nbsp; 20)&nbsp; ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని&nbsp; థ్రిల్లింగ్‌ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.&nbsp; అన్నపూర్ణ ఫొటో స్టూడియో చైతన్య రావ్‌, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్‌ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. హత్య ‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఒప్పెన్‌ హైమర్‌ ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్‌ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. హర్‌ రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. అలా ఇలా ఎలా ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా తెరకెక్కించిన&nbsp; సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. ఇతర సినిమాలు పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe deepest breathMovieEnglishNetflixJuly 19Sweet magnoliasWeb SeriesEnglishNetflixJuly 20The cloned tyroneMovieEnglishNetflixJuly 21BawaalMovieHindiAmazon PrimeJuly 21EstateMovieTamilZee5July 18Spider-Man: Across the Spider-VerseMovieEnglishZee5July 18Trial periodMovieHindiJioCinemaJuly 21
  జూలై 21 , 2023
  Hebah Patel: బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఏమాత్రం అందం తగ్గలేదుగా..!
  Hebah Patel: బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఏమాత్రం అందం తగ్గలేదుగా..!
  కుమారి 21ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన నటి హెబ్బా పటేల్. ఇటీవల టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఈవెంట్‌కి హాజరై ర్యాంప్ వాక్ చేసింది. ఈ మేరకు హెబ్బా ఫొటోలు వైరల్ అయ్యాయి. వరుసగా వెబ్‌సిరీస్‌లు చేస్తూ హెబ్బా పటేల్ బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాల్లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. కుమారి 21ఎఫ్ సినిమా సమయంలో నాజూకుగా కనిపించిన ఈ చిన్నది రాను రాను బొద్దుగా తయారైంది. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలోనూ కాస్త బొద్దుగా కనిపించింది. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లోనూ ‘హెబ్బా పటేల్’ బొద్దుగానే కనిపిస్తోంది. థైస్ అందాలను చూపిస్తూ ఫొటోలు దిగింది. కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఆశించిన మేర విజయం లభించలేదు. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తరువాత సినిమాలు పరాజయం చవిచూశాయి. అందం, నటన పరంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి స్టార్ హీరోయిన్‌గా ఎదగలేక పోయింది. హెబ్బా పటేల్ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తోంది. 2014లోనే ‘తిరుమనం ఎనుం నిఖా’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలోనూ అధ్యక్ష మూవీలో తళుక్కుమంది.
  ఫిబ్రవరి 23 , 2023
  <strong>Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?</strong>
  Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?
  ప్రముఖ నటి సునైనా (Sunaina).. తాజాగా వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ (Inspector Rishi) సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ శోభన పాత్రలో అదరగొట్టింది. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. దీంతో ఈ భామకు సంబంధించిన సమాచారం కోసం తెలుగు ఆడియన్స్‌ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ తెలుగు చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; సునైన ఎవరు? సునైనా ప్రముఖ నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.&nbsp; సునైన ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ భామ పుట్టింది.&nbsp; సునైన పుట్టిన రోజు? ఏప్రిల్‌ 17, 1989 సునైన వయసు ఎంత? 34 సంవత్సరాలు (2024) సునైన ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు (166 సెం.మీ) సునైన ఏం చదువుకుంది? నాగుపూర్‌ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది.&nbsp; సునైన తల్లిదండ్రులు ఎవరు? హరీష్‌ ఎల్లా, సంధ్యా ఎల్లా సునైనకు తోబుట్టువులు ఉన్నారా? సునైనా ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు.&nbsp; సినిమాల్లోకి రాకముందు సునైనా ఏం చేసింది? మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించి గుర్తింపు పొందింది.&nbsp; సునైన తొలి తెరంగేట్ర చిత్రం? 2005లో తెలుగులో వచ్చిన కుమార్‌ vs కుమారి చిత్రం సునైనా తొలి సినిమా. ఈ చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలో ఆమె కెరీర్‌ మెుదలైంది.&nbsp; సునైన తొలి కన్నడ చిత్రం? 2008లో వచ్చిన 'గ్యాంగ్‌ బారే థుంగే బారే'&nbsp; (Gange Baare Thunge Baare)చిత్రం.. ఆమెకు కన్నడలో మెుదటి సినిమా. సునైన తొలి తమిళ చిత్రం? 'కధలిల్‌ విఝున్తెన్‌' (2008) సునైన డెబ్యూట్‌ వెబ్‌ సిరీస్‌? 'నిలా నిలా ఒడి వా' (2018) సునైన ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు? ‘కుమార్‌ vs కుమారి’, ‘10th క్లాస్‌, మిస్సింగ్‌’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజ రాజ చోర’, ‘రెజీనా’ (డబ్బింగ్‌) సునైన ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? 'నిలా నిలా ఒడి వా' (2018), ‘హై ప్రీస్ట్స్‌’ (2019), ‘ఫింగర్‌టిప్‌’ (2019), చదరంగం (2020), మీట్‌ క్యూట్‌ (2022), ఇన్‌స్పెక్టర్‌ రిషి (2024). సునైన ఫేవరేట్‌ ఫుడ్‌? పోహా, పిజ్జా, ఇడ్లి, దోశ, చైనీస్‌ ఫుడ్‌, కాఫీ.&nbsp; సునైన ఫేవరేట్‌ నటులు? తమిళంలో రజనీకాంత్‌.. తెలుగులో అల్లుఅర్జున్‌, మహేష్‌ బాబు అంటే తనకు ఇష్టమని సునైనా తెలిపింది.&nbsp; సునైనకు ఇష్టమైన కలర్స్‌? గ్రే, పింక్‌, రెడ్‌. సునైనకు ఇష్టమైన క్రీడ? క్రికెట్‌ సునైన ఏ డ్రెస్‌ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది? చీర అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట. ఏ మాత్రం సందర్భం దొరికిన చీర కట్టేస్తానని ఓ ఇంటర్యూలో తెలిపింది.&nbsp; సునైనకు ఇష్టమైన ప్రదేశాలు? కేరళ, గోవా, శిమ్లా, జమ్ముకశ్మీర్‌, దుబాయి సునైన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా? https://www.instagram.com/thesunainaa/ https://www.youtube.com/watch?v=xIZ8KW7tvTE
  ఏప్రిల్ 05 , 2024
  అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అల్లరి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కితకితలు, బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. నాంది చిత్రం వంటి సూపర్ హిట్ తర్వాత యాక్షన్ చిత్రాల వైపు తన పంథాను మార్చుకున్నాడు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ మీకోసం. అల్లరి నరేష్ అసలు పేరు? ఎడారా నరేష్ అల్లరి నరేష్ ముద్దు పేరు? సడెన్ స్టార్ అల్లరి నరేష్ ఎత్తు ఎంత? 6 అడుగులు అల్లరి నరేష్ తొలి సినిమా? రఘుబాబు డైరెక్షన్‌లో వచ్చిన అల్లరి అతని మొదటి చిత్రం. ఈ చిత్రం పేరే తర్వాత అతని ఇంటి పేరుగా మారిపోయింది.&nbsp; అల్లరి నరేష్ ఎక్కడ పుట్టాడు? చెన్నై, తమిళనాడు అల్లరి నరేష్ పుట్టిన తేదీ ఎప్పుడు? జూన్ 30, 1982 అల్లరి నరేష్‌కు వివాహం అయిందా? విరూప కంటమనేనితో (2015) అల్లరి నరేష్‌కు పెళ్లి జరిగింది. అల్లరి నరేష్ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫర్జానా. ఈమె అల్లరి నరేష్‌తో కలిసి సీమశాస్త్రి సినిమాలో నటించింది. అల్లరి నరేష్ ఫెవరెట్ హీరో? నాగార్జున అల్లరి నరేష్ తొలి హిట్ సినిమా? తొలి చిత్రం అల్లరి మంచి గుర్తింపు తెచ్చింది. బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌, నాంది, కితకితలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అల్లరి నరేష్‌కు ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లాక్ అల్లరి నరేష్‌కు ఇష్టమైన సినిమా? గీతాంజలి అల్లరి నరేష్ తల్లిదండ్రుల పేర్లు? సరస్వతి కుమారి, ఈవీవీ సత్యనారాయణ అల్లరి నరేష్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా అల్లరి నరేష్ చదువు? B.com అల్లరి నరేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.&nbsp; అల్లరి నరేష్‌కు ఇష్టమైన ఆహారం? చేపల పులుసు అల్లరి నరేష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.2.5 నుంచి రూ.3 వరకు తీసుకుంటున్నాడు అల్లరి నరేష్ అభిరుచులు? క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్? రఘుబాబు https://www.youtube.com/watch?v=L6NPy-viALo
  మార్చి 21 , 2024
  Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
  Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
  ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రణ్‌బీర్ కపూర్‌ - అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (40)&nbsp; - అలియా భట్‌ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్‌ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.&nbsp; ఫహద్‌ - నజ్రియా మలయాళం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ (40) నటి నజ్రియా నజిన్‌ (28)ను 2014లో లవ్‌ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్‌ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.&nbsp; ప్రియాంక చోప్రా - &nbsp;నిక్ జోనాస్‌ బాలీవుడ్ ‌అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు నిక్ జోనాస్‌ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్‌ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి. సైఫ్ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్‌ అలీఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్‌ వైఫ్‌ అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.&nbsp; ఆర్య - సయేషా సైగల్&nbsp; తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్‌ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.&nbsp;&nbsp; ప్రకాష్‌ రాజ్‌ - పోనీ వర్మ ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌(58) కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్‌ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్‌ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.&nbsp; దిల్‌ రాజు - తేజస్విని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.&nbsp;&nbsp; అర్జున్‌ కపూర్‌ - మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.&nbsp;
  మే 16 , 2023
  <strong>ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  ప్రేమ కావాలి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన  ఆది సాయి కుమార్.. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. లవ్లీ, బ్లాక్, పులిమేక వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. ఆది సాయికుమార్ ముద్దు పేరు? ఆది ఆది సాయికుమార్ ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు ఆది సాయి కుమార్ తొలి సినిమా? ప్రేమకావాలి ఆది సాయికుమార్ ఎక్కడ పుట్టాడు? ఆముదాలవలస, ఏపీ ఆది సాయికుమార్ పుట్టిన తేదీ ఎప్పుడు? డిసెంబర్ 29, 1989 ఆది సాయికుమార్ బార్య పేరు? అరుణ ఆది సాయికుమార్ పెళ్లి ఎప్పుడు జరిగింది? 2014 ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరోయిన్? కాజల్ అగర్వాల్ ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరో? సాయికుమార్, మెగాస్టార్ చిరంజీవి ఆది సాయికుమార్ తొలి హిట్ సినిమా? ప్రేమ కావాలి తొలి హిట్ అందించింది. ఆ తర్వాత లవ్లీ, బ్లాక్, పులి మేక వంటి చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఆది సాయికుమార్ ఇష్టమైన కలర్? వైట్ కలర్ ఆది సాయికుమార్ ఇష్టమైన సినిమా? పోలీస్ స్టోరీ, గ్యాంగ్ లీడర్ ఆది సాయికుమార్ తల్లి పేరు? సురేఖ ఆది సాయి కుమార్ ఏం చదివాడు? BSC &nbsp;ఆది సాయికుమార్ అభిరుచులు? ఆది సాయికుమార్‌కు క్రికెట్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు అండర్19 రంజీ ట్రోఫికి సెలెక్ట్ అయ్యాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు నచ్చిన ప్రదేశం? అమెరికా ఆది సాయికుమార్ ఎన్ని సినిమాల్లో&nbsp; నటించాడు? &nbsp;2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు ఇష్టమైన ఆహారం? మంసాహారం ఏదైనా ఆది సాయికుమార్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు? &nbsp;దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఆది సాయికుమార్‌కు ఎంత మంది పిల్లలు? ఒక పాప, పేరు అయానా(Ayaana) https://www.youtube.com/watch?v=ex3TOcgOmqI
  మార్చి 21 , 2024
  Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
  Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
  నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు రచన, దర్శకత్వం: అమిత్ రాయ్ విడుదల తేదీ: ఆగస్టు 11 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటంటే? కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్‌లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20 ఎలా ఉంది?&nbsp; ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎవరెలా చేశారు? ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది. https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20 &nbsp; టెక్నికల్‌గా సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం. పాజిటివ్ పాయింట్స్ నటీనటులు కథ కామెడీ&nbsp; రచన నెగెటివ్ పాయింట్స్ కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్ కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 3.25/5 https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
  ఆగస్టు 11 , 2023
  Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
  Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
  రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.&nbsp; భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.&nbsp; వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.&nbsp; రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
  ఆగస్టు 14 , 2023
  Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
  Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
  నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు. డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20 ఎలా ఉంది? కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20 ఎవరెలా చేశారు? జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.&nbsp; టెక్నికల్‌గా.. గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్‌ బాగున్నాయి. https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20 పాజిటివ్ పాయింట్స్ రజినీ ఎలివేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ కామెడీ నెగెటివ్ పాయింట్స్ బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 2.75/5
  ఆగస్టు 11 , 2023
  Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే?&nbsp;
  Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే?&nbsp;
  నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు. దర్శకుడు: పురుషోత్తం రాజ్ సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి విడుదల తేదీ : మార్చి 01, 2024 టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంట‌బ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ డిటెక్టివ్‌ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్‌.. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడిగా చేశాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్‌ కిల్లర్‌ మహిళల్ని టార్గెట్‌ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్‌ డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్‌ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్‌ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. అటు హీరోయిన్‌ రాశిసింగ్ చాలా అందంగా క‌నిపించింది. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే&nbsp; డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్‌.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్‌ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా చూపించడం అంద‌రినీ క‌నెక్ట్ అయ్యేలా చేస్తుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి హీరో ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్‌ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్‌ దర్శకత్వం ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర&nbsp; విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది.&nbsp; నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనక‌థ‌లో పురాణ నేప‌థ్యంద్వితీయార్థం మైనల్‌ పాయింట్స్‌ ప్ర‌థ‌మార్థంలో కొన్ని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
  మార్చి 02 , 2024

  @2021 KTree