• TFIDB EN
  • కురుప్ (2021)
    U/ATelugu2h 35m

    కురుప్‌కు డబ్బుపై ఉన్న దురాశ అబద్ధాలు, దొంగతనాల వైపు వెళ్లేలా చేస్తుంది. అయితే ఓ పోలీసు అధికారి అతని దారికి అడ్డుపడినప్పుడు పరిస్థితులు మారుతాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    సిబ్బంది
    శ్రీనాథ్ రాజేంద్రన్దర్శకుడు
    సుశీన్ శ్యామ్సంగీతకారుడు
    కథనాలు
    <strong>శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. 'రామన్‌ రాఘవ్‌ 2.0' అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..&nbsp; బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం.&nbsp; శోభిత దూళిపాళ ఎప్పుడు పుట్టింది? 1991, మే 31న జన్మించింది శోభిత దూళిపాళ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? రామం రాఘవం 2.o శోభిత దూళిపాళ ఎత్తు ఎంత? 5 అడుగుల 9అంగుళాలు&nbsp; శోభిత దూళిపాళ ఎక్కడ పుట్టింది? తెనాలి, ఆంధ్రప్రదేశ్ శోభిత దూళిపాళ తెలుగులో నటించిన తొలి సినిమా? గూడాచారి(2018) శోభిత దూళిపాళ అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ శోభిత దూళిపాళకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, టిబెటన్ వంటకాలు, నూడిల్స్ శోభిత దూళిపాళకు ఇష్టమైన కలర్? &nbsp;వైట్, బ్లాక్ శోభిత దూళిపాళకు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, మహేష్ బాబు శోభిత దూళిపాళ తల్లిదండ్రుల పేరు? వేణు గోపాల్ రావు, శాంత శోభిత దూళిపాళ ఏం చదివింది? BCom, శోభిత దూళిపాళ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. శోభిత దూళిపాళ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది. శోభిత దూళిపాళ అవార్డులు? శోభిత దూళిపాళ 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచింది. 2013లోనే జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో విజేతగా నిలిచింది. శోభిత దూళిపాళకు ఎఫైర్స్ ఉన్నాయా? టాలీవుడ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sobhitad/?hl=en&amp;img_index=6 https://www.youtube.com/watch?app=desktop&amp;v=nJyjdLURscA
    ఏప్రిల్ 05 , 2024
    <strong>Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!</strong>
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా&nbsp; రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన&nbsp; సినిమాలివే!!
    100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా&nbsp; రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన&nbsp; సినిమాలివే!!
    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం. హీరో -సినిమాలు హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్‌4ఎన్టీఆర్‌ 4చిరంజీవి 3రామ్‌ చరణ్‌ 3పవన్‌ కల్యాణ్3బాలకృష్ణ 2 మహేశ్‌ బాబు 100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్‌ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు ప్రభాస్‌&nbsp; ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్‌ నుంచే రావాలి. సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్‌151 కోట్లు చిరంజీవి&nbsp; ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్‌ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్‌ క్రేజ్‌కు నిదర్శనం సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు అల్లు అర్జున్ పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ ఆ సినిమా కంటే&nbsp; ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది. సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్‌369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు రామ్‌ చరణ్‌ RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్‌, అంతకు ముందే&nbsp; తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు. సినిమాకలెక్షన్‌RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు జూ. ఎన్టీఆర్‌ RRRతో రామ్‌ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్‌. తనకున్న వాక్‌ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్‌ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్‌ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు. సినిమాకలెక్షన్‌RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్‌126 కోట్లు పవన్ కల్యాణ్ టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్‌ ప్రస్తుత సినిమా లైనప్‌ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది. సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్‌ 161 కోట్లువకీల్‌ సాబ్‌138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు బాలకృష్ణ అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు. సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు మరికొన్ని సినిమాలు వెంకటేశ్‌, వరుణ్ తేజ్‌ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి.&nbsp; రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి. సినిమాహీరో కలెక్షన్‌F2 వెంకటేశ్‌-వరుణ్‌ తేజ్‌143 కోట్లుగీత గోవిందంవిజయ్‌ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు పాత రోజుల్లో సినిమా హిట్‌ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్‌ జుబ్లీ, 100 డేస్‌ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్‌ అయిపోయింది. హిట్‌ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
    ఏప్రిల్ 26 , 2023
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    3rd Day BOX OFFICE: స్టార్‌ హీరో లేకున్నా కలెక్షన్లు&nbsp; కుమ్మేసిన టాప్‌-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
    కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్‌ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్‌ ఇమేజ్‌ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా&nbsp; తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.&nbsp; ఉప్పెన మెగాస్టార్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించినా.. హిట్‌ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి.&nbsp; ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్‌ వచ్చింది. దసరా&nbsp; నేచురల్‌ స్టార్‌ నాని నటించిన పవర్‌ ప్యాక్డ్‌ మాస్ చిత్రం దసరా. లుక్‌, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్‌ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇచ్చి హిట్‌ కొట్టాడు నాని.&nbsp; విరూపాక్ష సాయిధరమ్ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html లవ్‌ స్టోరీ శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్‌ చిత్రం లవ్‌ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.&nbsp; బింబిసార కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్‌ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్‌ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్‌. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.&nbsp; భీష్మ వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌ భీష్మ. బాక్సీఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు. జాతి రత్నాలు కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్‌ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీకేయ 2 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్‌ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్‌ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
    ఏప్రిల్ 24 , 2023
    <strong>Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రణ్‌బీర్ కపూర్ సతీమణి అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో 100 మోస్ట్ ఇన్‌ప్లూయెన్సియల్ పీపుల్ జాబితలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమై వ్యక్తుల జాబితాను ఏటా టైమ్స్ మ్యగజైన్ విడుదల చేస్తుంటుంది. గతేడాది.. మూవీ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్‌ ఖాన్ మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది అలియా భట్ చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సినీవర్గాల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంలో అలియా భట్ గురించి టాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; అలియా భట్ ముద్దు పేరు? అలూ.. అలియా భట్ వయస్సు ఎంత? అలియా భట్&nbsp; 1993 మార్చి 15న జన్మించింది అలియా భట్ తెలుగులో నటించిన తొలి సినిమా? RRR అలియా భట్ హిందీలో నటించిన తొలి సినిమా? సంఘర్ష్‌(1999) చిత్రంలో బాల నటిగా పరిచయమైంది అలియా భట్ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం? స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్(2012) అలియా భట్ ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు (160cm) అలియా భట్ ఫిగర్ మెసర్‌మెంట్స్ ? 33-26-34 అలియా భట్ ఎక్కడ పుట్టింది? ముంబై, మహారాష్ట్ర అలియా భట్&nbsp; ఏం చదివింది? హైస్కూల్ అలియా భట్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? జమ్నాబాయి నార్సీ స్కూల్, ముంబై అలియా భట్ అభిరుచులు? సింగింగ్, యోగా చేయడం, షాపింగ్, ట్రావెలింగ్, కూకింగ్ అలియా భట్‌కు ఇష్టం లేని పనులు? వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినడం అలియా భట్‌కు ఎక్కడ టాటూ ఉంది? అలియా వీపు వెనుక భాగంలో 'Pataka' అని హిందీలో రాని ఉంటుంది అలియా భట్‌కి ఇష్టమైన ఆహారం? పోహా, ఫిష్, రాగి చిప్స్, రసగుల్ల, మూంగ్ దాల్ హల్వా అలియా భట్‌కు అఫైర్స్ ఉన్నాయా? అలియా తొలుత వరుణ్ ధావన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత వ్యాపారవేత్త కవిన్ మిట్టల్‌తో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలియా భట్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అలియా భట్ వివాహం ఎప్పుడు జరిగింది? అలియా భట్ వివాహం బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో 2022లో ఏప్రిల్ 14న పెళ్లి జరిగింది&nbsp; అలియా భట్, రణ్‌బీర్ దంపతులకు ఎంత మంది పిల్లలు? 2022 నవంబర్ 6న ఈ దంపతులకు పాప జన్మించింది. పాప పేరు రహా అలియా భట్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రణ్‌బీర్ కపూర్, హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో అలియా భట్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్, కంగనా రనౌత్ అలియా భట్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఏఆర్ రెహ్మాన్ అలియా భట్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.10 కోట్ల&nbsp; వరకు ఛార్జ్ చేస్తోంది. అలియా భట్‌ తల్లిదండ్రుల పేరు? మహేష్ భట్, సోని రజదాన్ https://twitter.com/DexterBaddie/status/1694933272059642020 అలియా భట్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అలియా భట్‌ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది అలియా భట్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/aliaabhatt/ అలియా భట్ నెట్‌వర్త్ ఎంత? అలియా భట్ నెట్ వర్త్ సుమారు రూ.40 కోట్లు&nbsp; అలియా భట్ అల్కాహాల్ తాగుతుందా? అవును తాగుతుంది. అలియా భట్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి? ల్యాండ్ రోవర్, ఆడీ క్యూ7, ఆడీ క్యూ5,BMW7 సిరీస్ అలియా భట్ గురించి మరికొన్ని ఆసక్తి విషయాలు అలియా భట్‌కు చీకటి అంటే భయం, రాత్రి సమయంలో లైట్లు వేసుకునే పడుకుంటుంది.అలియా భట్‌కు హాట్ డ్రింక్స్‌కంటే కూల్ డ్రింక్స్ అంటే ఇష్టంస్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ సినిమా కోసం చేసి ఆడిషన్స్‌లో అలియా భట్ 400 మంది అమ్మాయిలతో పోటీ పడి మరి హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయింది.అలియా ఎప్పుడు తన ఫింగర్స్‌ను వాసన చూసే అలవాటు ఉంది.అలియాకు పెంపుడు జంతువులంటే ఇష్టం 'పెటా'తో కలిసి హోమ్‌లెస్ జంతువులను కాపాడుతుంటుంది.అలియా భట్‌కు విమానంలో వెళ్లడమంటే భయం https://www.youtube.com/watch?v=CgwSY4DZHwM
    ఏప్రిల్ 18 , 2024
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా.. విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన 'గామి' (Gaami) చిత్రం.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విష్వక్‌ తొలిసారి అఘోరా పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా&nbsp; 'గామి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్వక్‌కు ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌ను మరోస్థాయికి ‘గామి’ తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘గామి’ ట్రైలర్‌ చూసిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.&nbsp; ప్రభాస్‌ ఏమన్నాడంటే! విజువల్‌ వండర్‌గా విడుదలైన 'గామి' (Gaami) ట్రైలర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. హీరో ప్రభాస్‌ ‘గామి’ ట్రైలర్‌పై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో బైట్‌నే రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటాడని ప్రశంసించాడు. ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా ఉందని.. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రతీ ఒక్కరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తోందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1763423427510370770 ‘గామి’ అరుదైన చిత్రం’ ‘గామి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశాడు. అనంతరం సందీప్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు.&nbsp; https://twitter.com/HanuNews/status/1763062517746831765 ‘గామి’ అంటే అర్థం ఇదే! ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేసినప్పటి నుంచి 'గామి' టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికి అర్థం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థంపర్థం లేని టైటిల్‌గా అనిపిస్తోందంటూ కొందరు విమర్శలు సైతం చేశారు. అయితే దీనిపై ట్రైలర్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత క్లారిటి ఇచ్చారు. ‘గామి అంటే గమ్యాన్ని గమించేవాడు’ అని మీనింగ్ వస్తుందని తెలిపాడు. చిన్నగా మెుదలైన ‘గామి’.. విష్వక్‌, నిర్మాత ప్రోత్సాహంతో పెద్ద చిత్రంగా మారిందని అన్నారు. విజువల్‌ వండర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/NtvTeluguEnt/status/1763212759653810231 ‘ఫీచర్ ఫిల్మ్ అంటే నమ్మలేదు’ డెఫ్‌ &amp; డంబ్‌ నటి అభినయ (Actress Abhinaya) ‘గామి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దేవదాసి పాత్రలో ఆమె కనిపించనుంది. మాటలు రాకపోయినా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అభినయ సైగలతో చేసిన స్పీచ్‌ ఆసక్తి రేపుతోంది. ‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తొలుత నమ్మలేదు. వైజాగ్‌ షూటింగ్‌లో ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్‌ పూర్తి చేసేశారు డైరెక్టర్‌’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ. https://twitter.com/i/status/1763209148253213116
    మార్చి 01 , 2024
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం&nbsp; 'ఆపరేషన్ వాలంటైన్' (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్‌ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్‌ ఫిక్స్‌ కావడం విశేషం.&nbsp; నెల రోజుల్లో ఓటీటీలోకి! 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. కెరీర్‌ బెస్ట్‌ నటన మరోవైపు ఆపరేషన్‌ వాలెంటైన్‌లో వరుణ్‌ తేజ్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 01 , 2024
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Medha Shankar: ‘12th ఫెయిల్‌’ సంచలనం.. మేధా శంకర్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    హిందీలో తెరకెక్కిన '12th ఫెయిల్‌' (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మేధా శంకర్‌ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.&nbsp; నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.&nbsp; మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.&nbsp; నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. 'విత్‌ యు ఫర్ యు ఆల్వేజ్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌తో నటిగా మారింది.&nbsp; ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్‌ హౌజ్‌ (2019), దిల్‌ బేకరార్‌ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'శాదీస్తాన్‌' (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.&nbsp; 2022లో వచ్చిన 'మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజికీ'లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.&nbsp; ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్‌ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది. మూడో సినిమా '12th ఫెయిల్‌'తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది మేధా. అందులోని 'బోలో నా' పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.&nbsp; ‘12th ఫెయిల్‌’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.&nbsp; సోషల్‌మీడియా మేధా క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్‌ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక '12th ఫెయిల్‌' సినిమాకు వస్తే.. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.&nbsp; ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.&nbsp; సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.&nbsp;
    జనవరి 20 , 2024
    RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
    RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
    RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్&nbsp; రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు.&nbsp; దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.&nbsp; RRR చిత్రబృందం ఆస్కార్‌ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.&nbsp; “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు” అంటూ ప్రధాని కొనియాడారు.&nbsp; https://twitter.com/narendramodi/status/1635132805628956674 బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు వెంకయ్య.&nbsp; https://twitter.com/MVenkaiahNaidu/status/1635135662734319616 దేశం మెుత్తం స్టెప్పులు వేసిన పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కీరవాణి, చంద్రబోస్‌ సహా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.&nbsp; https://twitter.com/RahulGandhi/status/1635140606862454784 ఆస్కార్‌ గెలిచి ఆర్ఆర్‌ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. భారతదేశ గర్వించ దగ్గ విషయం ఒకటైతే, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి మరింత గర్వకారణంం అన్నారు.&nbsp; https://twitter.com/ncbn/status/1635117591806234624 దర్శక ధీరుడు రాజమౌళి దార్శనికత, సాహసం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కారం అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో చరణ్ కూడా భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు. https://twitter.com/KChiruTweets/status/1635113504758964227 ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు జనసేనాని పవన్ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. “ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన RRRలోని ఈ నాటు నాటు… గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారత సినిమా స్థాయి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు” చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు తమిళిసై. https://twitter.com/DrTamilisaiGuv/status/1635141311887192064 విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ.. ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ఆస్కార్ అవార్డుతో&nbsp; తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని చెప్పారు సీఎం. ఆర్ఆర్‌ఆర్ ఆస్కార్ అందుకోవటంతో ఆనందంలో మునిగి తేలుతున్న వారిలో తాను కూడా చేరానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్‌. https://twitter.com/KTRBRS/status/1635138037549248512 RRR హీరోయిన్ అలియా భట్ నాటు నాటుకు ఆస్కార్‌ రావడం పట్ల తన సంతోషాన్ని ఇన్‌స్టా స్టోరీలో వ్యక్తపరిచింది. సెలబ్రేషన్ ఎమోజీలతో ఆనందాన్ని పంచుకుంది. ఆస్కార్ అవార్డు గెలవటంపై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “ ఇప్పటికీ నాకు కలగానే ఉంది. మాకు అంతులేని మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప వ్యక్తులు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు పొందటానికి కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌కు అభినందనలు. తారక్‌తో కలిసి మరోసారి డాన్స్ చేసి రికార్డులు బద్ధలుకొట్టాలని ఆశిస్తున్నాను. ఈ అవార్డు భారత చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క నటుడు, టెక్నిషియన్‌కు అంకితం” అన్నారు.&nbsp;&nbsp; https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?s=20 నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఆస్కార్ సాధించాం అంటూ తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, నాటు నాటు సాంగ్ రాసిన గేయ రచయిత చంద్రబోస్‌ను తారక్ అభినందించారు. మొత్తం RRR చిత్రబృందానికి ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు. https://twitter.com/tarak9999/status/1635151033432432641?s=20
    మార్చి 13 , 2023
    <strong>Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!</strong>
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.&nbsp; డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఏప్రిల్ 23 , 2024
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’&nbsp; పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన&nbsp; జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన&nbsp; శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.&nbsp; బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&amp;v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.&nbsp; అరవింద సమేత వీరరాఘవ హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=qmqQHtla20w S/O సత్యమూర్తి ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’&nbsp; (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది. https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ అజ్ఞాతవాసి ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు. https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc జులాయి తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U ఖలేజా&nbsp; మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.  https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
    జూన్ 12 , 2023
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మను ఆ పాటలో చూపించారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1641693728367845377?s=20 బతుకమ్మ పాటలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. పూజా హెగ్డే తలపైన బతుకమ్మను మోస్తూ కనిపించారు. హెగ్డేతో పాటు వెంకటేష్‌, భూమికలు బతుకమ్మను తీసుకెళ్తూ కనిపించారు. భూమిక, పూజా హెగ్డే స్టెప్స్‌తో అదరగొట్టారు. పాట చివర్లో సల్మాన్‌ పంచలో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. పంచ, నుదిటిన బొట్టుతో సల్మాన్‌ తెలుగు తనం ఉట్టిపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; https://youtu.be/tdOg8X0RV9I బతుకమ్మ పండగ శోభ ఇప్పుడు బాలీవుడ్‌కు చేరడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సల్మాన్‌ సినిమాలో బతుకమ్మను చూపించడం ద్వారా ఈ పండుగ విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ పాటతో బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. బతుకమ్మ పాటపై సల్మాన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నటుడు వెంకటేష్‌ సూచన మేరకే సల్మాన్‌ బతుకమ్మను పాటను పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/RaoKavitha/status/1641699065447710721 ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ‘లవ్‌ యూ భాయ్’ అని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సంప్రదాయ లుక్‌లో సల్మాన్‌ అదిరిపోయాడని ప్రశంసిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు బతుకమ్మ ఆశీస్సులతో సూపర్‌ హిట్ లభిస్తుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.&nbsp; ‘కిసీ కా భాయ్‌, కిసీ కా జాన్‌’ చిత్రాన్ని తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఈ సినిమా డబ్‌ కూడా అయింది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు.ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతేగాక వెంకటేష్‌ నటిస్తుండటంతో తెలుగులోనూ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.
    మార్చి 31 , 2023
    <strong>Shubra Aiyappa: స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర&nbsp;</strong>
    Shubra Aiyappa: స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర&nbsp;
    శుభ్ర అయ్యప్ప తాజాగా హాటో ఫోటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది.  కంప్లీట్ క్రాప్ టాప్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. స్లీవ్ లెస్ టాప్‌లో నడుమందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ గ్లామర్ పిక్స్ చూసిన ఆమె అభిమానులు లుకింగ్ హాట్, గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  శభ్ర అయ్యప్ప తమిళ్ నటి. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. శుభ్ర అయ్యప్ప 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది.&nbsp; &nbsp;బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa) వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన 'రేయ్' సినిమాలో తొలిసారిగా కనిపించింది. &nbsp;ఆ తర్వాత 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా శుభ్ర అయ్యప్ప(Shubra Aiyappa)&nbsp; హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా యాక్ట్ చేసింది. 2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.&nbsp; అదే ఏడాదిలో వచ్చిన&nbsp; 'వజ్రకాయ' అనే కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది. &nbsp;ఈ సినిమాలో శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.&nbsp; ఆ తర్వాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది. శుభ్ర అయ్యప్ప గతేడాది జనవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త విశాల్‌ శివప్పతో ఆమె ఏడడుగులు వేసింది.&nbsp; View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa) అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో….150 ఏళ్ల ప్రాచీన గృహంలో గురువారం వీరి వివాహం జరిగింది.&nbsp; ప్రస్తుతం తమిళ్, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ... కన్నడలో మాత్రం దూసుకెళ్తోంది. అక్కడ తిమ్మయ్య తిమ్మయ్య, రామన అవతార వంటి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
    ఏప్రిల్ 01 , 2024
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది.&nbsp;సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్‌ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.&nbsp; మూడో మీటింగ్‌లోనే అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్‌ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.&nbsp;&nbsp; ఎవరీ పాయల్‌ 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. కశ్యపై కేసు గతంలోనే అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.&nbsp; తెలుగులోకి ఎంట్రీ అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్‌ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్‌ సినిమాలో చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.&nbsp; రాజకీయ నాయకురాలు ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్‌. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు.&nbsp; ‌అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది. సినిమాలు ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్‌ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.&nbsp;
    మార్చి 19 , 2023
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై&nbsp; ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.&nbsp; పార్కింగ్ స్థలంలో కారు తీసెటప్పుడు ఆమె కారు అడ్డుగా ఉండటంతో ఓసారి తాను డింపుల్‌ను రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుండటం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.&nbsp; ఈరోజు కూడా ఓ ఎమర్జెన్సీ పనిపై వెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న డింపుల్‌ కారును తీయాలని&nbsp; డ్రైవర్&nbsp; రిక్వెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ కారును గుద్దడంతో పాటు కాలుతో తన్నిందని అది సీసీటీవీలో కూడా రికార్డైందని పేర్కొన్నారు. దీంతో తన డ్రైవర్‌ డింపుల్‌పై కేసు పెట్టినట్లు వివరించారు.&nbsp; డింపుల్ రియాక్షన్ తాజా వివాదంపై డింపుల్ హయాతి కూడా రియాక్ట్ అయింది. ‘అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు ఆగదు, అధికార దుర్వినియోగం తప్పులను దాచదు’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/DimpleHayathi/status/1660877913200406529 https://twitter.com/DimpleHayathi/status/1660863210436583424 డింపుల్ కోపానికి కారణం ఇది! తాజా వివాదం నేపథ్యంలో డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత వారం రోజులుగా డింపుల్&nbsp; కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నట్లు తెలిసింది. ట్రాఫిక్‌ డీసీపీతో తలెత్తిన వివాదం వల్లే తన కారుకు అధికంగా చలాన్లు పడుతున్నట్లు డింపుల్‌ హయాతి భావించింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్‌ అంతా రాహుల్‌ హెగ్డే కారుపై చూపించినట్లు తెలుస్తోంది.&nbsp; డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ‘యురేక’ సినిమాలో ఆమె నటించింది. అభినేత్రి 2 సినిమాలో తన నటనతో డింపుల్ ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్‌ చిత్రంలో జర్ర జర్ర పాటలో స్టెప్పులేసి తెలుగు యువతను అలరించింది. ఆ తర్వాత ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ సినిమాలతో డింపుల్‌ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ లోనూ డింపుల్ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    మే 23 , 2023
    <strong>Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌, చిత్ర శుక్లా, రూపా&nbsp; లక్ష్మీ, అనీష్‌ కురువిల్ల, దేవి ప్రసాద్‌ తదితరులు.. దర్శకత్వం : రమాకాంత్‌ రెడ్డి సంగీతం : అజయ్‌ అరసద సినిమాటోగ్రాఫర్‌ : చరణ్‌ మాధవనేని నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ విడుదల తేదీ: 29-03-2024 విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విజయ్-సాగర్‌ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్‌ భయపడుతుంటే సాగర్‌ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్‌ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్‌ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్‌ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్‌ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్‌ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి&nbsp; క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్‌. ఓవరాల్‌గా రమాకాంత్‌ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్‌ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. చాలా సీన్లు లైవ్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్‌ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తోంది.&nbsp; ప్లస్ పాయింట్స్ కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 29 , 2024
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం. మీనాక్షి చౌదరి యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp; శ్రీలీల గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.&nbsp; ఆషికా రంగనాథ్‌ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ గతేడాది ‘అమిగోస్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.&nbsp; రుక్సార్‌ థిల్లాన్‌ యంగ్‌ హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; మిర్నా మీనన్‌ తమిళ నటి మిర్నా మీనన్‌.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్‌ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది. అమృత అయ్యర్‌ కన్నడ నటి అమృత అయ్యర్‌.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపొందిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కాబోతుంది. శ్రద్ధ శ్రీనాథ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ నటించిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్‌ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది. రుహానీ శర్మ 2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్‌ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఈగల్‌’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్‌ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది. కావ్యా థాపర్‌ 'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్‌ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్‌’ సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
    జనవరి 02 , 2024

    @2021 KTree