ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్JioCinema
ఇన్ ( Telugu )నాట్ అవైలబుల్ ఇన్ తెలుగు
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగ శౌర్య
సాయి ప్రసాద్అవికా గోర్
లక్ష్మిరావు రమేష్
టౌన్ ప్లానర్ మరియు లక్ష్మి తండ్రినరేష్
సాయి తండ్రిపవిత్ర లోకేష్
ఆనందరావు ప్రేమికుడుసప్తగిరి
సాయి సహాయకుడు మరియు స్నేహితుడుప్రగతి మహావాది
సాయి తల్లిసత్యం రాజేష్
వెన్నెల కిషోర్
సాఫ్ట్‌వేర్ సుబ్రమణ్యంసిబ్బంది
నంద్యాల రవిదర్శకుడు
ఎం. గిరిధర్నిర్మాత
KM రాధా కృష్ణన్
సంగీతకారుడుకథనాలు
Avika Gor: వెస్టిండీస్ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్!
సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇక్కడి సినిమాలపై రీల్స్ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్ క్రికెటర్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. టాలీవుడ్ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చీరకట్టులో అందాల జాతర
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. ఓ వైపు క్రికెట్.. మరోవైపు పాటల ఆల్బమ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్.. యంగ్ హీరోయిన్ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్‌చల్ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.
https://twitter.com/i/status/1788784603085582657
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ..
బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)
నెట్టింట హాట్ ట్రీట్
యంగ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూ వారిని ఎంటర్‌టైన్ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024
Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్ ఎక్కడ అంటే?
టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్.
ఆశీస్సులు కోరుకుంటూ..
“మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు.
https://twitter.com/i/status/1634070240366850049
హనీమూన్ ఎక్కడంటే?
వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని దుబాయి మొత్తం కలియతిరుగుతున్నారు.
శుభాకాంక్షలు
నరేశ్, పవిత్ర జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఫ్యాన్స్ ఆశీర్వదిస్తున్నారు. మరికొందరూ ఈసారైన విడాకులు ఇవ్వకుండా జీవితాంతం పవిత్రతో కలిసి ఉండాలని సూచిస్తున్నారు.
ఆయనకి 3 ఆమెకి 2
ఇప్పటికే నరేశ్‌కు మూడుసార్లు పెళ్లి అయ్యింది. పవిత్రతో ఆయనకు నాలుగో వివాహం. పవిత్రకి కూడా ఇది రెండో పెళ్లి. పవిత్ర మొదటి భర్త పేరు సుచేంద్ర. ఆయన కన్నడ సీరియళ్లలో నటించాడు.
కొద్దిరోజులుగా సహజీవనం
భార్యతో విడిపోయిన తర్వాత నుంచి నరేశ్, పవిత్ర మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి కొద్దిరోజులుగా కలిసే ఉంటున్నారు.
ముద్దుతో ప్రకటన
కొత్త సంవత్సరం రోజున పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఈ జంట. అదర చుంబనంతో వీడియో విడుదల చేసి అందరికి షాకిచ్చారు.
https://twitter.com/i/status/1609067421507407873
మా ఎన్నికలే సాక్ష్యం
మా అసోసియేషన్ ఎన్నికల వేళ నరేశ్‌కు మద్దతుగా ప్రచారం చేసింది పవిత్ర. విజయం తర్వాత ఆయన ఐ లవ్‌యూ పవిత్ర అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కలిసి నటించిన సినిమాలు
వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. లక్ష్మి రావే మా ఇంటికి, మిడిల్ క్లాస్ అబ్బాయ్, సమ్మోహనం, హ్యపీ వెడ్డింగ్, ఎంత మంచివాడవురా, అంటే సుందరానికిలో నటనతో మెప్పించారు.
రమ్య రఘుపతి
నరేశ్, పవిత్రలు ఒకే హోటల్‌లో ఉన్నప్పుడు రమ్య అక్కడ రచ్చరచ్చ చేసింది. వారిద్దరికి పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకుంటానని విమర్శలు చేసింది రమ్య.
ఫిర్యాదుల వెల్లువ
నరేశ్, రమ్యల వివాదం పోలీస్ స్టేష్‌కు చేరింది. తనని చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశాడు నరేశ్.
మార్చి 10 , 2023
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం.
అవికా గోర్ పూర్తి పేరు?
అవికా సమీర్ గోర్
అవికా గోర్ ఎందుకు ఫేమస్
అవికా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది.
అవికా గోర్ వయస్సు ఎంత?
1997, జూన్ 30న జన్మించింది
అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా?
ఉయ్యాల జంపాల(2013)
అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా?
కేర్ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009)
అవికా గోర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు
అవికా గోర్ ఎక్కడ పుట్టింది?
ముంబై
అవికా గోర్ అభిరుచులు?
ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్
అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం?
పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్
అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా?
మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.
అవికా గోర్‌కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
అవికా గోర్‌కు ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, షాహిద్ కపూర్
అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అవికా గోర్ తల్లిదండ్రుల పేరు?
సమీర్ గోర్, చేతన గోర్
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది
అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/avikagor/?hl=en
అవికా గోర్ పెట్ పేరు?
షీరో
https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
ఏప్రిల్ 02 , 2024
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరీ కృష్ణ
సంగీతం: జ్ఞాని
సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిదంటే
పొలిమేర పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్ 1లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్-1లో లాగే పార్ట్-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశారు.
ఎవరెలా చేశారంటే?
కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ అదరగొట్టాడు. పార్ట్ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంలాజిక్ లేని సీన్స్
చివరిగా: థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్ సీన్స్, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023
కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
కాజల్ అగర్వాల్ ఎవరు?
కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్?
కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది.
కాజల్ అగర్వాల్ వయస్సు ఎంత?
కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు 38 సంవత్సరాలు
కాజల్ అగర్వాల్ మందన్న ముద్దు పేరు?
కాజు
కాజల్ అగర్వాల్ మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
కాజల్ అగర్వాల్ ఎక్కడ పుట్టింది?
ముంబాయి
కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా?
2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది
కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు?
కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ
కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు?
వైట్, రెడ్, బ్లూ
కాజల్ అగర్వాల్ అభిరుచులు?
డ్యాన్సింగ్, ట్రావెలింగ్
కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం?
ఎగ్స్, తియ్యని పండ్లు
కాజల్ అగర్వాల్ అభిమాన నటుడు?
జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్
కాజల్ అగర్వాల్ తొలి సినిమా?
లక్ష్మి కళ్యాణం(2007)
కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
మగధీర, బృందావనం, డార్లింగ్
కాజల్ అగర్వాల్ ఏం చదివింది?
మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది
కాజల్ అగర్వాల్ పారితోషికం ఎంత?
కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
కాజల్ అగర్వాల్ తల్లిదండ్రుల పేర్లు?
వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది.
కాజల్ అగర్వాల్ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
కాజల్ అగర్వాల్ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.
కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు?
నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది.
కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en
కాజల్ అగర్వాల్ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
కాజల్ అగర్వాల్ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది.
కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రామ్ చరణ్, తమన్నా భాటియా
https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
ఏప్రిల్ 27 , 2024
Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్ హీరో సిద్ధార్థ్, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
[toc]
వైభవంగా సిద్ధార్థ్ వివాహం
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్ - అదితి జంట చెక్ పెట్టింది.
https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477
ఓవైపు పెళ్లిళ్లు..
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850
మరోవైపు విడాకులు
ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్ పెట్టి తన భార్య, సింగర్ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.
గతంలో విడాకులు తీసుకున్న పాపులర్ సెలబ్రిటీలు
నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.
పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.
సుమంత్ - కీర్తి రెడ్డి
నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావు
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్
అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్
కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సైఫ్ అలీఖాన్ - అమృతా
సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
సంజయ్ దత్ - రిచా శర్మ
1987లో నటి రిచా శర్మతో సంజయ్ దత్ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్‌ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.
సెప్టెంబర్ 16 , 2024
Raai Laxmi: బికినీలో రాయ్ లక్ష్మి సొగసుల సెగలు.. కుర్రాళ్లకు రత్తాలు హాట్ ట్రిట్
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
సెప్టెంబర్ 08 , 2023
Maharaja Movie Review: కర్మ సిద్దాంతంతో వచ్చిన రీవేంజ్ డ్రామా.. ‘మహారాజా’ మెప్పించాడా?
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు
రచన, దర్శకత్వం: నిథిలన్ స్వామినాథన్
సంగీతం: అజనీశ్ లోకనాథ్
ఎడిటింగ్: ఫిల్లోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్తమన్
నిర్మాత: సుదర్శన్ సుందరమ్, జగదీశ్ పళనిస్వామి
విడుదల : 14-06-2024
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ చిత్రం 'మహా రాజా' (Maharaja). అతడి కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది రూపొందింది. దీంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నిథిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీశ్ కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. మరి ‘మహా రాజా’ ఎలా ఉంది? ఎప్పటిలాగే విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టాడా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
బార్బర్‌గా పనిచేసే మహారాజా (విజయ్ సేతుపతి) ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్ చేస్తే ఒక రోజు మహారాజా గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాడు. ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్రమంలోనే తన బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మీని ఎత్తుకెళ్లిపోయారని చెబుతాడు. ఎలాగైన ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులను వేడుకుంటాడు. ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? చివరికీ లక్ష్మీ దొరికిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి ఎప్పటిలాగే అద్భుత నటన కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై మోశారు. తన కూతురికి అన్యాయం చేసిన వారిని వెంటాడి హతమార్చే క్రమంలో వచ్చే మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ఇక కూతురు జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె నటన శభాష్ అనేలా ఉంటుంది. అటు ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్ కశ్యప్ ఆకట్టుకున్నారు. మమతా మోహన్‌దాస్, భారతీరాజా, మణికందన్, అరుళ్‌దాస్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు నిథిల స్వామినాథన్.. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాను తెరకెక్కించినట్లు అనిపించినా కథకు కర్మ సిద్దాంతాన్ని జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరు.. విజయ్ సేతుపతి విలక్షణమైన నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఊహలకు అందని ట్విస్టులతో భావోద్వేగభరితంగా దర్శకుడు సినిమాను ముగించారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వచ్చే మలుపులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయాలకే కేటాయించినప్పటికీ డైరెక్టర్ ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఓ వైపు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా.. మరోవైపు లక్ష్మీ, జ్యోతి ఎపిసోడ్స్‌ను సమాంతరంగా చూపిస్తూనే వాటన్నింటిని లింకప్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఈ కథకు ముగింపు పలికిన తీరు ప్రేక్షకులకు సంతృప్తికరంగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్రతిభ.. దినేశ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్
విజయ్ సేతుపతి నటనట్విస్టులుసంగీతం
మైనస్ పాయింట్
స్లో నారేషన్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 14 , 2024
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి.
[toc]
Samantha Ruth Prabhu
సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.
Samantha bikini images
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.
Kajal Agarwal bikini video
https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250
Tamannaah Bhatia
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
Tamannaah Bhatia Bikini images
View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial)
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
Anushka Shetty
అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
Anushka shetty Bikini Images
Disha Patani
దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది.
Disha Patani Bikini images
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి.
Pragya Jaiswal bikini Images
ShwetaTiwari
శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి.
ShwetaTiwari Bikini Images
Deepika Padukone
దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది.
deepika padukone bikini Images
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి.
Pooja Hegde Bikini Images
Pooja Hegde Hot Videos
https://twitter.com/RakeshR86995549/status/978983052364808194
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
Raashii Khanna
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్. ఐఏఎస్ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి.
Raashii Khanna Bikini images
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్ బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్ వేయండి
https://twitter.com/PicShareLive/status/1525365506471231488
Ketika Sharma Bikini Images
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి
Ketika Sharma Bikini Images
Catherine Tresa
కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి.
Catherine Tresa Bikini images
Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి.
Mrunal Thakur Bikini images
Mrunal Thakur hot video
https://twitter.com/MassssVishnu/status/1786566946600988750
https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193
https://twitter.com/SastaJasoos/status/1788498532162236427
Anasuya Bharadwaj
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి.
Anasuya Bharadwaj Bikini images
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి.
Nidhhi Agerwal Bikini Images
Mehreen Kaur Pirzada
మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది.
Mehreen Kaur Pirzada Bikini Videos
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
Manushi Chillar
మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి.
Manushi Chillar Bikini Images
Manushi Chillar Bikini videos
View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)
https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి.
Sobhita Dhulipala bikini images
Hot videos
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
Tripti Dimri
తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి.
Tripti Dimri Bikini images
View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri)
Shirley Setia
షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shirley Setia Bikini Images
మే 11 , 2024
Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
HBD SAMANTHA: ఆ ఒక్కటి సమంతకే చెల్లింది.. బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్తమాన హీరోయిన్స్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం…
రంగస్థలం రామ లక్ష్మి
రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మజిలీ శ్రావణి
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్ నటన నెక్స్ట్ లెవల్. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఓ బేబీ
సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ.
యశోద
అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి.
శకుంతల
కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.
పుష్ప ది రైజ్
పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఫ్యామిలీ మెన్ రాజీ
మనోజ్ బాజ్‌పేయ్ లీడ్ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పార్ట్ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్ అంటే నక్సలైట్ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్ సీన్‌లో నటించి షాకిచ్చింది.
సిటాడెల్
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.
ఏప్రిల్ 27 , 2023
Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్ అవుతారు!
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba)
తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్.
ఆదిత్య 369 (Aditya 369)
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.
నాని (Nani)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.
దశావతరం (Dasavatharam)
ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.
దొంగల ముఠా (Dongala Mutha)
రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించారు.
మిథునం (Mithunam)
పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.
అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju)
2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
అ! (Awe!)
టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్ (Hanu Man) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
మనం (Manam)
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.
ఒక్కడున్నాడు (Okkadunnadu)
గోపిచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.
గగనం (Gaganam)
నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది.
మార్చి 20 , 2024
Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్ ఆ హీరో పాత్రలను ఓన్ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో హీరో వెంకటేష్ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.
రఘువరన్ బీటెక్
ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్ (ధనుష్) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.
తమ్ముడు
ఈ (Thammudu) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్ కోర్టులో బుద్ది చెప్తాడు.
అలా వైకుంఠపురంలో
ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.
అ ఆ
ఇందులో (A Aa) నితిన్ (Nithin) పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
జెర్సీ (Jersey)
క్రికెటర్ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.
నేనింతే
ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.
యోగి
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్ క్లాస్ యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది.
మార్చి 01 , 2024
This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.
రామబాణం
హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది.
ఉగ్రం
నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
ది కేరళ స్టోరీ
విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది.
విరూపాక్ష(మళయాలం)
తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.
అరంగేట్రం
కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
యాద్గిరి అండ్ సన్స్
వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.
OTT విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4MeterMovieTeluguNetflix May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
మే 02 , 2023
Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
https://twitter.com/i/status/1752914245170364419
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.
ఫిబ్రవరి 23 , 2024
S. S. Rajamouli Style: రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు. రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను ఎమోషన్‌తో బైండ్ చేసి సినిమాకి మంచి ఊపు తీసుకొస్తాడు.
స్టూడెంట్ నం.1 సినిమాలో కొడుకుగా తన తండ్రి ఆదరణ కోసం ఆరాటే పడే కుర్రాడి పాయింటు. అందు కోసం జైలు నుంచి కాలేజీకి వెళ్ళడమనే ట్విస్టు. బ్రాగ్రౌండ్‌లో ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ వ్యక్తిని చంపడం, దీంతో అక్కడ ప్రేక్షకులను రాజమౌళి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగాడు.
సింహాద్రిలో ఒక పనిపై హీరో కేరళ వెళ్ళినపుడు అక్కడ అన్యాయన్ని ఎదురించి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం అనే అంశం ఆధారంగా సినిమా తీశాడు. భూమిక ఎన్టీఆర్‌ను పొడవటం ట్విస్ట్.
సైలో రగ్బీ ఆట మేయిన్ పాయింట్ అయితే... తన కాలేజీని ఆక్రమించకున్న విలన్ భిక్షు యాదవ్‌పై పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ కనెక్టివిటీని తీసుకొచ్చాడు. ఇందులో విలనే రగ్బీకి సవాలు చెయ్యటం ట్విస్టు.
ఛత్రపతిలో హీరో వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండిస్తాడు హీరో. తల్లీ కొడుకుల మధ్య దూరం మెయిన్ పాయింటు అయితే.. తన తమ్ముడు తనను తల్లికి దూరం చేయాలనుకోవడం ట్విస్ట్.
ఈగ సినిమాలో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగా మారి ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్ పాయింట్. చివర్లో ఈగ ఆత్మార్పణ చేసుకుని విలన్‌ను చంపే విధానాన్ని ఎమోషనల్ బైండింగ్ చేశాడు రాజమౌళి.
RRRలో రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట ఇచ్చి అందు కోసం పోలీస్ ఆఫీసర్ అవడం మెయిన్ పాయింట్. తన లక్ష్య సాధనలో అడ్డుగా ఉన్న భీంను హింసించడం ఎమోషనల్ కనెక్టివిటీ. చివరకు భీంతో కలిసి బ్రిటీష్ వారిపై పోరాడి ఆయుధాలు సంపాందించి తన నాన్న కల నెరవేరుస్తాడు రామ్.
అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు. 1st హాఫ్‌లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఉంటుంది. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ... ఆ స్టోరీ ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో ఆది సాధిస్తాడు.
జూలై 06 , 2023
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
1. సంఘర్షణ
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది.
2. స్వయం కృషి
చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
3. దేవాంతకుడు
వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు.
4. మహానగరంలో మాయగాడు
చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు.
5. ఛాలెంజ్
చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది.
6. చిరంజీవి
చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది.
7. కొండవీటి రాజా
చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. 'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.
8. ధైర్యవంతుడు
చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు.
9. చాణక్య శపథం
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది.
10. పసివాడి ప్రాణం
చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. మంచి దొంగ
రాఘవేంద్ర రావు డైరెక్షన్ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది.
12. యముడికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.
13. యుద్ధ భూమి
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు.
14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
15. కొండవీటి దొంగ
చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది.
17. గ్యాంగ్ లీడర్
చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది.
18. మెకానిక్ అల్లుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు.
19. రుద్ర నేత్ర
కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు.
నవంబర్ 07 , 2023