రివ్యూస్
How was the movie?
తారాగణం
రజనీకాంత్
అనుష్క శెట్టి
సోనాక్షి సిన్హా
జగపతి బాబు
కె. విశ్వనాథ్
సంతానం
కరుణాకరన్
బ్రహ్మానందం
దేవ్ గిల్
రాధా రవి
విజయకుమార్
నిజల్గల్ రవి
ఆర్. సుందరరాజన్
మనోబాల
ఇళవరసు
పొన్వన్నన్
జయప్రకాష్
మధన్ బాబ్
క్రేన్ మనోహర్
అను మోహన్
వాసు విక్రమ్
విలియం ఒరెండోర్ఫ్
రవి మరియ
రాజ్‌కమల్
సి. రంగనాథన్
కమలేష్ కుమార్
సుచిత్ర
సిసోర్ మనోహర్
పెదయప్ప రమేష్
ఈరోడ్ సౌందర్
SVS కుమార్
తాడి బాలాజీ
బి. బాలాజీ శంకర్
ఫాక్ న్యూమాన్
లారెన్ J. ఇర్విన్
రజిత
అమృత అయ్యర్
కెఎస్ రవికుమార్
ఆర్. రత్నవేలు
రాక్‌లైన్ వెంకటేష్
సిబ్బంది
కెఎస్ రవికుమార్
దర్శకుడురాక్లైన్ వెంకటేష్
నిర్మాతAR రెహమాన్
సంగీతకారుడుపొన్ కుమారన్
కథఆర్. రత్నవేలు
సినిమాటోగ్రాఫర్కథనాలు
Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘రజనీ.. గందరగోళం చేసేశారు’
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూడు చిత్రాలకు వర్క్!
దర్శకుడు కె.ఎస్. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.
33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..!
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్ 3 రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దసరా బరిలో రజనీ చిత్రం
రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘కూలీ’లో స్టార్ క్యాస్ట్!
ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
అక్టోబర్ 07 , 2024
Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్.. ఇది మామూలు హైప్ కాదు భయ్యా!
‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ జరగ్గా రానాపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘రానా భయపెట్టాడు’
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్ లుక్ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1843720706057724332
కథ మార్చేసిన రజనీ
వేట్టయన్ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.
రజనీపై తమిళ డైరెక్టర్ ఆరోపణలు
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చేయనున్నారు రజనీ.
అక్టోబర్ 09 , 2024
Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్’తో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, గెటప్ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ: 04-10-2024
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నగర్కర్ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్ లభించలేదు. రవి బాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్ తక్కువే అయినా మంచి రిచ్ ఔట్‌పుట్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్
కథశ్రీవిష్ణు నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
Sonakshi Sinha: సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్ నటుడితో రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి నెట్టింట పంచుకోవడంతో పెళ్లి విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసుపత్రి బయట సోనాక్షి సిన్హా కనిపించడం చర్చనీయాశంగా మారింది. పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అయ్యిదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతా? సోనాక్షి ఎందుకు ఆస్పత్రికి వెళ్లింది? అందుకు గల కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ఆస్పత్రి వీడియో వైరల్
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెకు పెగ్నెన్సీ వచ్చిందన్న రూమర్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పెళ్లైన ఐదు రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చెకప్ చేయించుకోవడం కోసమే నవ దంపతులు ఆసుపత్రికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లై వారం కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
https://twitter.com/i/status/1806851946453574006
https://twitter.com/kapil9994/status/1806705767241715793
నిజం ఏంటంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా.. సోనాక్షి సిన్హాకు స్వయానా తండ్రి. అయితే ఒత్తిడి కారణంగా శత్రుఘ్న కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలో కోకిలా బెన్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రిని యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సోనాక్షి సిన్హా తన భర్తతో ఆసుపత్రికి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చాయి.
విందుతో పరిచయం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ విందులో తొలిసారి సోనాక్షి, జహీర్ ఇక్బాల్ కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి 'డబుల్ ఎక్సెల్' ఫిల్మ్ కూడా చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురుంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లితో ఈ రూమర్లకు సోనాక్షి జంట బ్రేక్ వేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును జహీర్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోనాక్షి స్టార్‌డమ్
శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి చిత్రం 'దబాంగ్' (Dabangg) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన రాజో పాండే పాత్రలో సోనాక్షి అదరగొట్టింది. తన తర్వాతి చిత్రం అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో ‘రౌడీ రాథోడ్’ (Rowdy Rathore)లో కనిపించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు మారిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓమై గాడ్, దబాంగ్ 2, యాక్షన్ జాక్సన్, లింగా, అకిరా, ఫోర్స్ 2, దంబాగ్ 3, డబుల్ ఎక్స్ఎల్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కకుడా, నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్ చిత్రాల్లో సోనాక్షి నటిస్తోంది.
జూన్ 29 , 2024
Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్ తదితరులు
దర్శకత్వం: తేజ మర్నీ
సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్
నిర్మాతలు: బన్నీ వాసు, విద్యా
విడుదల తేదీ: నవంబర్ 24, 2023
ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్ అవార్డు అందుకున్న 'నయట్టు'కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్ ఖాతాలో మరో హిట్ చేరిందా? శివానీ రాజశేఖర్ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.
కథ
కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్, శివానీ, రాహుల్ విజయ్) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్, విజయ్, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు. మురళీ శర్మ యాక్టింగ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్ ఉండటం వల్ల కాస్త బోరింగ్ ఫీల్ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్ పని తీరును మెచ్చుకోవాల్సిందే.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రంజన్ రాజ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్ అయ్యింది. అటు జగదీష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథప్రధాన పాత్రల నటనసంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేబోరింగ్ సీన్లు
రేటింగ్: 3/5
నవంబర్ 24 , 2023
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆదికేశవ
మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కోట బొమ్మాళి పి.ఎస్
ప్రముఖ నటుడు శ్రీకాంత్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
ధృవ నక్షత్రం
విక్రమ్ (Vikram) హీరోగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
పర్‌ఫ్యూమ్
జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్’ (Perfume). చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
మాధవే మధుసూదన
‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్, సుమన్ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
నవంబర్ 21 , 2023
Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
అన్ని మంచి శకునములే
యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది.
బిచ్చగాడు-2
‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్ ఆంటోని తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ కూడా విజయ్ తెరకెక్కించాడు. బిచ్చగాడు-2 పేరుతో దానిని 19న ధియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ అంటోని ద్విపాత్రాభినయం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.
ఫాస్ట్ X
ఫాస్ట్ అండ్ ఫూరియస్ నుంచి మరో సిరీస్ ఈ వారం రానుంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో.. జాసన్ మొమోవా ప్రతినాయకుడిగా ఫాస్ట్ X ను తెరక్కించారు. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కూడా మే 19న విడుదల కానుంది. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
ఏజెంట్
భారీ అంచనాలతో రిలీజైన అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరి ఓటీటీలోనైనా ఏజెంట్ చిత్రం ఆకట్టుకుంటుందేమో చూడాలి.
డెడ్ పిక్సెల్స్
వివాహానంతరం నిహారిక కొణిదెల నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
TitleCategoryLanguagePlatformRelease DateAnt Man and Wasp: QuantumaniaMovieEnglishDisney+ HotstarMay 17Modern Love ChennaiSeriesTamilAmazon PrimeMay 18kadina kadoramee andakadahamMovieTamilSony LIVMay 19AyalvashiMovieMalayalamNetflixMay 19KathalMovieHindiNetflixMay 19Bayi AjaibMovieEnglishNetflixMay 19MutedMovieEnglishNetflixMay 19faithfully yoursMovieEnglishNetflixMay 17Selling Sunset: Season 6SeriesEnglishNetflixMay 19Young, Famous & African: Season 2SeriesEnglishNetflixMay 19
మే 15 , 2023
69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
నాని.. డబుల్ ధమాకా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్ నాన్న) నాని నామినేట్ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్ కేసరి), ధనుష్ (సర్), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఆనంద్ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.
బేబీ చిత్రం హవా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (సాయి రాజేష్), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్ రోహిత్) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164
ఫిల్మ్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే...
ఉత్తమ చిత్రం
బేబీబలగందసరాహాయ్ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టిసామజవరగమనసలార్: పార్ట్-1 సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్ కేసరి)చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)ధనుష్ (సర్)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)నవీన్ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)కీర్తిసురేశ్ (దసరా)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ దర్శకుడు:
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)కార్తిక్ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)సాయి రాజేశ్ (బేబీ)శౌర్యువ్ (హాయ్ నాన్న)శ్రీకాంత్ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం)
ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్ కేసరి)శ్రియారెడ్డి (సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్)శ్వేతరెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి -హాయ్ నాన్న)శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు -సర్)
ఉత్తమ గాయకుడు:
అనురాగ్ కుల్‌కర్ణి (సమయ-హాయ్ నాన్న)హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి -టైటిల్ సాంగ్)పీవీఎన్‌ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్ శ్రీరామ్ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:
బేబీ (విజయ్ బుల్గానిన్)బలగం (భీమ్స్ సిసిరిలియో)దసరా (సంతోష్ నారాయణ్)హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్)ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్)వాల్తేర్ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ -హాయ్ నాన్న)అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్)
జూలై 17 , 2024
Tollywood Stars Lungi Looks: లుంగీల్లో తెలుగు హీరోల ఊరమాస్ లుక్.. చూసేయండి!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జనవరి 06 , 2024
HBD Mokshagna Teja: ‘జై హనుమాన్’తో మోకజ్ఞ సినిమా లింకప్.. ఏం ప్లాన్ చేశావ్ ప్రశాంత్ మామా!
నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే
నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్ లుక్‌లో స్మైలింగ్ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407
తారక్ స్పెషల్ విషెస్
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్ పోస్టర్‌పై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.
రెండ్రోజులుగా వరుస హింట్స్
రెండు రోజులుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886
‘జై హనుమాన్’తో లింకప్!
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. సెకండ్ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్ బ్యాక్’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్ అంటూ ప్రశాంత్ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్ ఉంటుందని గతంలో ప్రశాంత్ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్ తర్వాత ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్'తో కనెక్షన్ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మామా ఏం ప్లాన్ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 06 , 2024
Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.
భూ కైలాస్
అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.
https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ
భక్త కన్నప్ప
1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే.
https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM
మహా శివరాత్రి
సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk
శ్రీ మంజునాథ
శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.
https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ
జగద్గురు ఆదిశంకర
ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు.
https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4
ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి.
మార్చి 08 , 2024
Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది.
కేజీఎఫ్‌తో సలార్ లింక్
సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చూపించారు. అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు.
అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.
ఫ్యాన్స్ రచ్చ రచ్చ
మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
సలార్‌తో నడిచేది వీరే..
ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది.
https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
జూలై 06 , 2023
పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా మంగ్లీ... ఆరు రాష్ట్రాలతో కథ లింక్
]ఇప్పటికే సింగర్‌గా తన ప్రతిభ చాటిన మంగ్లీ.. హీరోయిన్‌గా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని YouSay ఫ్యామిలీ కోరుకోంటోంది.
ఫిబ్రవరి 13 , 2023
Jawan: షారూక్ మూవీకి అల్లు అర్జున్ అందుకే నో చెప్పాడా?
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
మార్చి 02 , 2023
Rashmika Mandanna: పొట్టి డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న రష్మిక.. నెట్టింట ఒకటే రచ్చ..
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 27 , 2023
గత 20 ఏళ్లలో టాలీవుడ్‌లో విడుదలైన రోమాంటిక్ చిత్రాలు
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 17 , 2023
బాలీవుడ్‌లో తప్పక చూడాల్సిన ప్రేమకథా చిత్రాలు ఇవే..
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 17 , 2023
యంగ్ ఇండియన్ క్రెకెటర్స్ గర్ల్‌ఫ్రెండ్స్
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 14 , 2023
Samantha: మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు… ఆ కోరిక తీరుతుందా?
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 14 , 2023
Renu Desai: రేణూ దేశాయ్‌కు గుండె జబ్బు.. అసలు నిజం బయటపెట్టిన రేణూ
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 14 , 2023