• TFIDB EN
  • మెయిల్
    UTelugu1h 56m
    రవి (హర్షిత్‌ రెడ్డి)కి కంప్యూటర్‌ అంటే చాలా ఇష్టం. ఊరిలో కంప్యూటర్‌ సెంటర్‌ పెట్టిన హైబత్‌ (ప్రియదర్శి) దగ్గరకు వెళ్లి కంప్యూటర్‌ నేర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రవి క్రియేట్ చేసుకున్న మెయిల్‌ ఐడీకి లాటరీ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రియదర్శి పులికొండ
    హైబాత్
    మణి ఏగుర్లసుబ్బు
    గౌరీ ప్రియరోజా
    రవీందర్ బొమ్మకంటిశివన్న
    శ్రీకాంత్ పల్లెసురేష్
    అనూష నేతగిరిజ
    అంజి బాబుకనకయ్య
    Yennengeeమెకానిక్ షకీల్
    రమేష్ కుమార్రణగన్న
    హర్షిత్ మల్గిరెడ్డిరవి
    సిబ్బంది
    ఉదయ్ గుర్రాలదర్శకుడు
    ప్రియాంక దత్
    నిర్మాత
    కమ్రాన్సంగీతకారుడు
    స్వీకర్ అగస్తీ
    సంగీతకారుడు
    కథనాలు
    శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో 'మ్యాడ్‌' (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన 'లవర్‌' సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది.  శ్రీ గౌరి ప్రియ ఎప్పుడు పుట్టింది? 1998, డిసెంబర్ 13న జన్మించింది శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? మెయిల్(2021) అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా పరిచయమైంది. కానీ మ్యాడ్(2023) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. శ్రీ గౌరి ప్రియ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  శ్రీ గౌరి ప్రియ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ శ్రీ గౌరి ప్రియ అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, ఇండియన్, చైనీస్ వంటకాలు శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు శ్రీ గౌరి ప్రియ తల్లిదండ్రుల పేరు? శ్రీనివాస్ రెడ్డి, వసుంధర శ్రీ గౌరి ప్రియ ఏం చదివింది? BBA శ్రీ గౌరి ప్రియ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.15-20 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. శ్రీ గౌరి ప్రియ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది శ్రీ గౌరి ప్రియ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/srigouripriya/?hl=en https://www.youtube.com/watch?v=ugEm7OrVkfE
    ఏప్రిల్ 05 , 2024
    <strong>HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?</strong>
    HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?
    టాలీవుడ్‌కు టాలెంటెడ్‌ యంగ్‌ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్‌’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్‌లో స్టార్‌ హీరోయిన్‌ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం. శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్‌ రెడ్డి, వసుంధర. శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తి చేసింది.&nbsp; స్కూల్‌ డేస్‌ నుంచే కల్చరల్‌ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్‌, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది. శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్‌ సింగర్‌ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్‌ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. ప్రముఖ టెలివిజన్‌ షో ‘బోల్‌ బేబీ బోల్‌’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్‌ సీజన్‌లో రన్నరప్‌గా, మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్‌ చాతుర్యంతో టెలివిజన్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసింది.&nbsp; 2016లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్‌' మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు.&nbsp; ఆ తర్వాత చేసిన 'మనలో ఒకడు', 'ఫిదా' చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్‌ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు. దీంతో మోడలింగ్‌ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్‌ హైదరాబాద్‌ టైటిల్‌ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది.&nbsp; View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ఆహాలో వచ్చిన ‘మెయిల్‌’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది.&nbsp; ఆ తర్వాత సుహాస్‌ నటించిన 'రైటర్‌ పద్మభూషణ్‌' సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.&nbsp; గతేడాది వచ్చిన 'మ్యాడ్‌' చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది.&nbsp; ఈ ఏడాది తమిళంలో 'ట్రూ లవర్‌' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్‌ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ప్రస్తుతం మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 'ప్రొడక్షన్ నెం.27' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ', 'మనలో ఒక్కడు' చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది.&nbsp; తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది.&nbsp; ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్‌ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్‌ అని స్పష్టం చేసింది.&nbsp; ఫుడ్‌ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్‌, జపనీస్‌ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది.&nbsp; ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.&nbsp; శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.
    నవంబర్ 13 , 2024
    <strong>Raj Tarun Case: </strong><strong>రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!</strong>
    Raj Tarun Case: రాజ్‌తరుణ్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. ప్రేయసికి షాకిచ్చిన పోలీసులు!
    హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) తనను మోసం చేశాడంటూ అతడి మాజీ ప్రేయసి లావణ్య శుక్రవారం (జులై 5) పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో యంగ్‌ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజ్‌తరుణ్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. లావణ్యతో గతంలో జరిగిన వ్యవహారం మెుత్తాన్ని బయటపెట్టాడు. టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారిపోయిన ఈ కేసులో శనివారం (జులై 6) ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకి ఉల్టాగా పోలీసులు నోటీసులు పంపారు.&nbsp; నోటీసులు ఎందుకంటే? హీరో రాజ్‌తరుణ్‌పై మాజీ ప్రేయసి లావణ్య.. శుక్రవారం (జులై 5) నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని పేర్కొంది. హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. మాల్వీ మల్హోత్ర, ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కూడా కంప్లైంట్‌లో పేర్కొంది. మరోవైపు అందులో ఎలాంటి వాస్తవం లేదని రాజ్‌తరుణ్‌ కూడా వివరణ ఇచ్చాడు. దీంతో నార్సింగి పోలీసులు లావణ్యకు ఊహించని షాక్‌ ఇచ్చారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ నోటీసుల్లో కోరారు. 91 CRPC కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ నోటీసులపై లావణ్య ఇప్పటివరకూ స్పందించలేదని తెలుస్తోంది. ఆమె సమర్పించే ఆధారాలను బట్టి ఈ కేసు ముందుకు కదలనుంది.&nbsp; ఫిర్యాదులోని మరిన్ని విషయాలు! శుక్రవారం నార్సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య మరిన్ని ఆరోపణలు చేశారు. 2012 నుంచి రాజ్‌తరుణ్‌ తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి మాల్వీ మల్హోత్రాతో రిలేషన్‌ స్టార్ట్‌ చేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు గురువారమే స్పష్టం చేశారు. అయితే స్టార్‌ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆధారాల కోసం ఇవాళ లావణ్యకు నోటీసులు పంపారు. అది చూసి తట్టుకోలేకపోయా: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ శుక్రవారమే (జులై 5) స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; ‘తన తండ్రినీ బెదిరించింది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 06 , 2024
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    Raj Tarun: ఆ అమ్మాయితో 3 ఏళ్లు ఒకే రూమ్‌లో ఉన్నా… తన అఫైర్‌పై స్పందించిన రాజ్‌ తరుణ్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో రాజ్‌ తరుణ్‌ ఒకరు. తొలి చిత్రం 'ఉయ్యాల జంపాల' (Uyyala Jampala) తో మంచి సక్సెస్‌ అందుకున్న రాజ్‌తరుణ్‌.. ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల వరుసగా ఫ్లాపులను చవిచూశాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్‌తరుణ్‌పై అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్‌ తరుణ్‌ కూడా ఘాటుగా స్పందించడంతో.. ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది.&nbsp; ‘ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌’ సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని ఇటీవల ఒక హీరోయిన్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్‌ కొనసాగిస్తున్నట్టు ఆరోపించింది. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే తనని దుర్భాషలాడాడని తెలిపింది. తనను సంబంధం లేని కేసు (డ్రగ్స్‌)లో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్‌తరణ్‌ ఎఫైర్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నటి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘తిరగబడర సామీ’లో ఈ భామే కథానాయికగా చేస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు.&nbsp; https://twitter.com/galli2delhi/status/1809123625074614310 అది నిజం కాదు: రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నటుడు రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో సాయం చేసింది. మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నది వాస్తవమే. 2014 నుంచి 2017 వరకు కలిసున్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధంలేదు. ఆమె ఫ్రెండ్స్‌ సర్కిల్‌, తను డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేకపోయా. వదిలేసి వెళ్లిపోదామనుకుంటే.. మీడియా ముందుకెళ్తానని నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చా. ఆమెపై డ్రగ్స్‌ కేసు నమోదవగా దానికి నేనే కారణమని ఆరోపణలు చేస్తోంది’ అని మండిపడ్డారు.&nbsp; https://twitter.com/BunnyJashu3/status/1769400224081219797 ‘మరో అబ్బాయితో నా ఇంట్లోనే ఉంది’ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లావణ్యపై రాజ్‌తరుణ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను ఉండగానే ఆమె మరో యువకుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. 'మరో అబ్బాయితో ఆమె రిలేషన్‌ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడంటూ ఆ వ్యక్తిపైనా కేసు పెట్టింది. మళ్లీ అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లు ఉంది. నేనే బయటకు వచ్చేశా. తన తండ్రినీ బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మాకు పెళ్లి కాలేదు. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్‌ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకూ ఆ విషయం తెలుసు. ముంబయికి చెందిన నటితో సహజీవనం చేస్తున్నట్టు ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. ఆమె ముంబయిలో నివాసముంటోంది. మేం సహజీవనం ఎలా చేస్తాం? తనను ఇంట్లోంచి నేను పంపించేస్తానన్న భయంతో ఇదంతా చేస్తోంది’ అని రాజ్‌తరుణ్‌ ఆరోపించాడు.&nbsp;
    జూలై 05 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    Sreelakshmi Satheesh: సంచలనాలు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఈ మధ్య ఓ యువతిపై మనసు పారేసుకున్నారు. ఆమెనే శ్రీ లక్ష్మీ సతీష్. రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మీ సతీష్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది. శ్రీలక్ష్మీ అందానికి దాసోహం అయ్యానని RGV చెప్పడంతో తెలుగు రాష్ట్రాలో ఈ కేరళ అందం హాట్‌ ఆఫ్ ది టాక్‌గా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఆమెను గుర్తించక ముందు జస్ట్ ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు 30 వేలు మించలేదు. ఎప్పుడైతే శ్రీలక్ష్మీ అందాన్ని ఆర్జీవీ గుర్తించాడే ఆమె ఫాలోవర్ల సంఖ్య జెట్ వేగంతో దూసుకెళ్లింది. తాజాగా రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మి సతీష్‌తో 'చీర' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈసినిమా చేసేందుకు ఒప్పుకుంది. శ్రీలక్ష్మీతో ఆర్జీవీ ఫోన్‌లో మాట్లాడటం.. ఆమె గురించి వరుస ఫోస్ట్‌లు పెట్టడంతో నెటిజన్లను పెద్ద పని కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తీరికలేకుండా తనకు నోటిఫికేషన్లు వస్తున్నట్లు శ్రీలక్ష్మీ సతీష్ తెలిపింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎలాగు క్రేజ్ వస్తోంది కదా అని … ఈ అందాల తెగింపు వరుస హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. నేరుగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. చాలా మంది ఆమె అందాల షేపులు, సౌందర్యం, ఒంపుసొంపుల గురించి ప్రశ్నలు సంధించారు. వాటి రహస్యం ఏమిటని బహిరంగంగానే అడిగారు. మీ కళ్లు సూదుల్లా మా గుండెల్ని గుచ్చుతున్నాయి అని ఓ నెటిజన్ అనగా… నీవు మానవ కన్యవు కావు, పైనుంచి దిగివచ్చిన దేవకన్యవు అంటూ తెగ పొగిడేశారు. నీ ఎద షేపులు, నడుమందాలు బాగున్నాయి.. ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్ అని అడిగితే… శ్రీలక్ష్మీ సతీష్ తెగ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది. అందరిలాగే నార్మల్ వాకింగ్, టైమ్‌ టూ టైమ్ డైట్‌ తీసుకుంటాను. అదే నా సౌందర్య రహస్యం అని చెప్పుకొచ్చింది. RGVపై ఒక్కమాటలో చెప్పండి అంటే… ఆయనపై కొండంత ప్రేమ దాగుందని ఆన్సర్ ఇచ్చింది… ఈ కొంటె కోనంగి.
    అక్టోబర్ 31 , 2023
    వీరసింహారెడ్డి.. బాలయ్య ఫ్యాన్స్‌కి సంక్రాంతి విందు భోజనం
    వీరసింహారెడ్డి.. బాలయ్య ఫ్యాన్స్‌కి సంక్రాంతి విందు భోజనం
    ]రేటింగ్: 3.0/5బాలయ్య మాస్ డైలాగ్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ పాత్రల నటన తమన్ మ్యూజిక్ శృతిహాసన్ గ్లామర్ప్లస్‌ పాయింట్స్‌స్లోనరేషన్ ఫస్టాఫ్‌లో అనవసర సన్నివేశాలు కథలోని మెయిన్ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. మితిమీరి ఫైట్స్మైనస్ పాయింట్స్
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Bhuma Mounika: </strong><strong>మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!</strong>
    Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!
    మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్‌ మీడియా, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా సైతం మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదాన్ని హైలేట్‌ చేస్తున్నాయి. అయితే చిన్న కోడలు, మంచు మనోజ్‌ భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే చిన్న కోడలు మౌనికకు టీడీపీ (Telugu Desam Party) బ్యాక్‌గ్రౌండ్‌ ఉండటంతో ఆ పార్టీ నేతలు ఈ వ్యవహరంలో తలదూర్చబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పెద్ద కోడలు విరానిక రెడ్డి (Viranica Reddy)కి వైసీపీ (YSRCP Party) బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కారణంగా మంచు ఫ్యామిలీ వివాదం పొలిటికల్‌ టర్న్‌ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; చిన్న కోడలికి టీడీపీతో సత్సంబంధాలు మంచు మోహన్‌ బాబు (Manchu Mohan Babu) రెండో కుమారుడు మనోజ్.. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక (Bhuma Mounika)ను గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనికది ఆళ్లగడ్డలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఫ్యాక్షన్‌ ఫ్యామిలీగా చెబుతుంటారు. మౌనిక తల్లి భూమా శోభా నాగిరెడ్డి (Bhuma Shobha Nagi Reddy) నాలుగు పర్యాయాలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి (Bhuma Nagi Reddy) కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి మరణానంతరం సోదరి భూమా అఖిల ప్రియా (Bhuma Akhila Priya) టీడీపీ తరుపున రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తండ్రితో మంచు మనోజ్‌ వివాదం నేపథ్యంలో మరిదికి అండగా పలువురిని ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ పంపినట్లు కథనాలు వచ్చాయి.&nbsp; పెద్ద కోడలికి జగన్‌తో బంధుత్వం&nbsp; మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu)కి వైకాపా అధినేత జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)తో దగ్గరి బంధుత్వం ఉంది. జగన్‌, భారతీ దంపతులకు విష్ణు చాలా ఆత్మీయుడు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasekhar Reddy) సోదరుడు సుధీకర్‌ రెడ్డి కుమార్తె విరానిక రెడ్డి (Viranica Reddy)ని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. దీంతో వైఎస్‌ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి బలమైన బంధం ఏర్పడింది. వైయస్‌ కుటుంబంలో జరిగే ఫంక్షన్స్‌కు విష్ణు తప్పక హాజరవుతుంటారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వూలలో సైతం స్పష్టం చేశాడు. ఈ కారణం చేతనే విష్ణుతో పాటు అతడి తండ్రి మోహన్‌ బాబు వైసీపీతో చాలా సన్నిహితంగా ఉండటాన్ని గమనించవచ్చు.&nbsp; టీడీపీ, వైకాపా జోక్యం తప్పదా! మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతుండటంతో రాజకీయ జోక్యం తప్పక జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని రెండు బలమైన పార్టీలకు చెందిన కోడళ్లు మంచు ఫ్యామిలో ఉండటంతో టీడీపీ, వైకాపా పార్టీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు.&nbsp; ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు మంచు మనోజ్‌ పక్కన అండగా నిలబడినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారంటూ మనోజ్‌తో పాటు మోహన్‌బాబు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ సమస్యను మోహన్‌బాబు ఫ్యామిలీ, పోలీసులు పరిష్కరించుకోలేక పోతే టీడీపీ, వైకాపా నేతల ప్రమేయం అనివార్యమవుతుందని టాక్‌ వినిపిస్తోంది. అదే జరిగితే ఒక ఫ్యామిలీకి చెందిన సమస్య కాస్త రెండు పార్టీల మధ్య గొడవగా మారే అవకాశముంది.
    డిసెంబర్ 11 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్</strong>
    Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె నటించి పొట్టేల్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనన్య నాగళ్ల హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా అనన్యకు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె ఇచ్చిన అదిరిపోయే సమాధానం నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; అసలేం జరిగిందంటే? అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా పొట్టేల్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్‌ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్‌ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్‌ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్‌ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.&nbsp; https://twitter.com/tfpcin/status/1847262295266865248 నెగిటివ్‌ వైపే చూస్తున్నారు: అనన్య మనిషి జీవితంలో లాగానే ఇండస్ట్రీలో కూడా నెగిటివ్‌, పాజిటివ్‌ అనే రెండు అంశాలు ఉంటాయని అనన్య అన్నారు. మీరు ఎక్కువగా నెగిటివ్‌ వైపే చూస్తున్నరంటూ రిపోర్టర్‌కు చురకలు అంటించారు. ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చే ముందు కమిట్‌మెంట్‌ ఉంటుందనేది బుల్‌ షిట్‌ వ్యవహారమంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక రేటు (రెమ్యూనరేష్‌), ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందని ఇండస్ట్రీ వాళ్లే చెబుతుంటారు' అని అన్నారు. అప్పుడు అనన్య బదులిస్తూ ‘మీరు ఎలాంటి ఎక్స్‌పిరియన్స్‌ లేకుండా విన్నమాట చెబుతున్నారు. కానీ నేను ఎక్స్‌పీరియన్స్‌ చేసి చెబుతున్నా. కమిట్‌మెంట్‌ ఇక్కడ లేదు' అంటూ ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్‌ అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్‌ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్‌ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్‌ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్‌ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్‌ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్‌ చేశారు. మహిళా రిపోర్టర్‌ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్‌ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.&nbsp; https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498 ఫ్లైట్‌లో అనన్య ప్రమోషన్స్‌ ‘పొట్టేల్‌’ చిత్రంలో చంద్ర కృష్ణ, అనన్య జంటగా నటించారు. ఈ నెల 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నటి అనన్య నాగళ్ల విమానంలో చిత్ర ప్రమోషన్స్‌ చేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మూవీ పోస్టర్లు, కరపత్రాలు పంచి పెట్టింది. తమ సినిమాను చూసి ఆదరించాలని కోరింది. అనన్యతో పాటు ‘పొట్టేల్‌’ టీమ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొత్త తరహా ప్రమోషన్స్‌కు అనన్య నాంది పలికారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/wareymedia/status/1846883443424272530
    అక్టోబర్ 19 , 2024
    <strong>హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    హీరోయిన్ ఆనంది గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    వరంగల్‌కు చెందిన ఆనంది(Anandi).. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ తెలుగింటి అందం మెయిన్‌ హీరోయిన్‌గా చేసింది. మరి ఆనంది గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆనంది అసలు పేరు? రక్షిత ఆనంది ముద్దు పేరు? హసిక ఆనంది ఎప్పుడు పుట్టింది? 1993, జులై&nbsp; 30న జన్మించింది ఆనంది ఎక్కడ పుట్టింది? ఆనంది వరంగల్‌లో జన్మించింది. ఆనంది నటించిన తొలి సినిమా? ఈరోజుల్లో(2012)&nbsp; ఆనంది తమిళ్‌లో నటించిన తొలి సినిమా పోఱియాళన్ ఆనంది ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; ఆనంది అభిరుచులు? డ్యాన్సింగ్ ఆనందికి&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ ఆనందికి ఇష్టమైన కలర్?&nbsp; &nbsp;బ్లాక్ ఆనందికి ఇష్టమైన హీరో? మహేష్ బాబు ఆనంది&nbsp; ఏం చదివింది? డిగ్రీ ఆనంది పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 50లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఆనంది సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది ఆనంది వివాహం ఎప్పుడు జరిగింది? 2021 జనవరి 7న తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆనంది పెళ్లి జరిగింది. https://www.youtube.com/watch?v=LzEupj3YxAc ఆనంది&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kayal_anandhi/
    అక్టోబర్ 22 , 2024
    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?&nbsp;
    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?&nbsp;
    ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి కంటెంట్‌ను మిస్‌ అయినట్లే. ఇంతకీ ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తదితర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; సినిమా ఏదంటే? బాలీవుడ్‌లో వచ్చిన 'మస్త్‌ మెయిన్‌ రెహ్‌నే కా’ (Mast Mein Rehne Ka) మూవీ.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వీక్షకులను ఆకట్టుకుంది. విజయ్ మౌర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మంచి వ్యూస్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, అభిషేక్‌ చౌహాన్‌, నీనా గుప్తా, మౌనికా పన్వార్‌, ఫైజల్‌ మాలిక్‌ ముఖ్య పాత్రల్లో చేశారు. IMDBలో ఈ సినిమా.. 7.1 రేటింగ్‌ కలిగి ఉంది. ఎందుకు చూడాలంటే? ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగిపోతోంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కష్టపడుతూనే ఉన్నారు. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? అని నిత్యం ఆలోచించే వారికి ఈ సినిమా చక్కటి సమాధానంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తుంది. చిన్న విషయాలకే బాధపడిపోయి.. ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక తికమక పడేవారికి పరిష్కారాన్ని చూపుతుంది.&nbsp;&nbsp; కథేంటి ముంబయికి చెందిన వీ.ఎస్‌ కామత్‌ (జాకీ ష్రాఫ్‌).. రిటైర్మెంట్‌ జీవితాన్ని కష్టంగా గడుపుతుంటాడు. అతడి భార్య 12 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంటాడు. నిరాశ, నిస్పృహలతో సాగిపోతున్న అతడికి భర్తపోయి ఒంటరిగా జీవిస్తున్న నీనా గుప్తా పరిచయం అవుతుంది. వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. వారిద్దరు తమ వృద్ధాప్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు? ఎలాంటి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు? వారు తమ జీవితాలను కొత్తగా ఏ కోణంలో చూడటం ప్రారంభించారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. Telugu.yousay.tv Rating : 3/5 
    ఏప్రిల్ 20 , 2024
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
    యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.&nbsp; విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.&nbsp; యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.&nbsp; ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
    ఫిబ్రవరి 29 , 2024
    Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ
    Malaika Arora: ఘాటు అందాలతో మలైకా రచ్చ రచ్చ… నెటిజన్లకు పెద్ద పని చెప్పిన హాట్ బ్యూటీ
    హాట్ డాల్ మలైకా అరోరా మరోసారి ఘాటు అందాలతో రచ్చ చేసింది. మిల్కీ వైట్ అవుట్‌ ఫిట్‌తో సోగసుల విందు చేసింది. లేటు వయసులోనూ వన్నె తగ్గని అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైట్ అండ్ వైట్ జార్జెట్‌లో టాప్‌ ఆండ్ బాటమ్స్‌లో టూ పాయింట్స్ వద్ద బ్లాక్ ప్లవర్స్‌ అద్దికతో సొగసును రెట్టింపు చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.&nbsp; ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అరోరా వయసు పెరుగుతుందా? తరగి పోతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందాలను విందు చేయడంలో కుర్ర హీరోయిన్లతో పొటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఊపిరి సలపకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. హాట్ హాట్ క్లీవేజ్ అందాలతో అబ్బా..! అనిపిస్తోంది. నిత్యం యోగా, బాడీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఇంపైన అందంతో బాడీని మెయిన్‌టెయిన్ చేస్తోంది ఆరోరా తన అందాన్ని కాపాడుకునేందుకు జిమ్‌, యోగా సెంటర్లలో గంటల తరబడి ఉంటానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది ఈ సొగసుల కోవా ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా.. ఇంకా 25+ అందంలా మెరిసిపోతూ మాయ చేస్తోంది మలైకా అరోరా 1973 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. హీందీతో పాటు పలు చిత్రాల్లో నటిగా, ఐటెం సాంగ్స్ చేసి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది షారుక్ ఖాన్ నటించిన దిల్‌సే చిత్రంలో చయ్య.. చయ్య పాటలో నర్తించి యావత్ సినీలోకం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ పాట తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది &nbsp;నటిగా మలైకా కాంటే (2002), EMI (2008) వంటి చిత్రాలలో లీడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. దబాంగ్, దబాంగ్ 2,&nbsp; బిచ్చు, భారతీయుడు, మా తుఝే సలామ్, డాలీ కీ డోలీ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో&nbsp; ప్రేక్షకులను అలరించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బసింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో నటించి పవర్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో రాత్రైనా నాకు ఓకే ఐటెం సాంగ్‌లో నర్తించి యూత్‌లో యమ క్రేజ్ సంపాదించింది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుని 2015వరకు కాపురం చేసింది. ఆ తర్వాత తనకన్న వయసులో చాలా చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. దీంతో తన అందానికి మరింత మెరుగులు దిద్దుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ సొగసుల కొమ్మ
    సెప్టెంబర్ 05 , 2023
    <strong>Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?</strong>
    Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్‌.. ఆమెను గుర్తుపట్టారా?
    తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.&nbsp; https://twitter.com/indiaforums/status/1863856572520362279 నవంబర్‌ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.&nbsp; 2021లో నేవీ అధికారి రాహుల్‌ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ఆగస్టు 17న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేసింది. సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై శ్రద్ధా ఆర్య మెరిసింది. జీ టీవీ (హిందీ)లో వచ్చిన 'ఇండియాస్‌ బెస్ట్‌ సినీ స్టార్స్‌ కి కోజ్‌' షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.&nbsp; ప్రముఖ నటుడు ఎస్‌.జే.సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం 'కల్వనిన్‌ కాదలి' (2006) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'నిశబ్ద్‌' (2007) సినిమాలో నటించింది. అందులో రీతు ఆనంద్‌ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అదే ఏడాది 'గొడవ' (Godava) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమైంది. ఇందులో వైభవ్‌కు జోడీగా అంజలి పాత్రలో మెరిసింది.&nbsp; ఆ తర్వాత తెలుగులో ‘కోతి మూక’ (Kothi Muka), ‘రోమియో’ (Romeo) వంటి చిత్రాల్లో శ్రద్ధా నటించింది. అయితే అవేమి పెద్దగా సక్సెస్‌ కాకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.&nbsp; దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి పోయిన శ్రద్ధా.. అక్కడ షాహిద్‌ కపూర్‌తో కలిసి 'పాఠశాల' (2010) సినిమా చేసింది. అందులో నటాషా సింగ్‌ పాత్రలో తళుక్కుమంది.&nbsp; ఆ తర్వాత కన్నడలో అడుగుపెట్టిన ఆమె అక్కడ 'డబుల్‌ డెక్కర్‌', 'మదువే మానే' చిత్రాలు చేసింది. పంజాబిలో 'బంజారా' (2018) ఫిల్మ్‌లోనూ నటించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ శ్రద్ధా ఆర్య నటించింది. 'ష్‌ష్‌ష్‌.. పిర్‌ కోయి హై' (2008) అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.&nbsp; 'మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కీ', ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘కసమ్‌ తేరే ప్యార్‌ కి’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది.&nbsp; సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం శ్రద్ధా ఆర్య చేసింది. జీనా, సోనియో హిరియే, మెరీ జాన్‌, పీకే, కార్ గబ్రూ ది తదితర 10 మ్యూజిక్‌ వీడియోలు చేసింది.&nbsp; శ్రద్ధా ఆర్య వ్యక్తిగత విషయాలకు వస్తే పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. 2015లో తొలుత ఎన్నారై జయంత్‌ రట్టితో నిశ్చితార్థం చేసుకుంది. అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకుంది.&nbsp; ఆ తర్వాత 2019లో అలం సింగ్‌ మక్కర్‌తో రిలేషన్‌ షిప్‌లో అడుగుపెట్టింది. వారిద్దరు ‘నాచ్‌ బలియే’ (Nach Baliye) అనే డ్యాన్స్‌ షోలో కపుల్స్‌గా పోటీ చేశారు. షో పూర్తయ్యే సరికి వారి బంధం కూడా ముగిసింది.&nbsp; ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌, టెలివిజన్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను శ్రద్ధా ఎంజాయ్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.&nbsp;
    డిసెంబర్ 03 , 2024
    <strong>HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!</strong>
    HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాలిడ్‌ విజయాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇవాళ (నవంబర్‌ 23) నాగ చైతన్య పుట్టిన రోజు. 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో చైతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి ఘనమైన కుటుంబ నేపథ్యం అక్కినేని నాగ చైతన్యకు ఉంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని చైతూ కొణికి పుచ్చుకున్నాడు. 1986 నవంబర్‌ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మీ (డి. రామానాయుడు కూతురు, వెంకటేష్‌ సోదరి) దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. నాగచైతన్య చిన్నప్పుడే లక్ష్మీతో నాగార్జున విడిపోయారు. దీంతో చెన్నైలో తల్లి వద్దనే చైతన్య పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చాడు.&nbsp; హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ చేశాడు. చదువులో చైతన్య బ్రిలియంట్‌ ఏమి కాదు. తాను జస్ట్ యావరేజ్‌ స్టూడెంట్‌ అని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.&nbsp; ప్రస్తుతం నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)ను చూస్తే చాలా ఫిట్‌గా 38 ఏళ్లు వచ్చినట్లు అసలు కనిపించడు. కానీ టీనేజ్‌లో అతడు చాలా లావుగా ఉండేవాడు. 98 కేజీల వరకూ బరువు ఉండేవాడట. చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుండటంతో అప్పట్లో అందరూ 'డంబూ' అని చైతూను పిలిచేవారట. అక్కినేని కంటే దగ్గుబాటి ఫ్యామిలీ వారే చైతూనూ బాగా ముద్దు చేశారని సమాచారం.&nbsp; హీరో కావాలన్న కోరిక నాగచైతన్య చిన్నప్పటి నుంచి లేదట. డిగ్రీ మిడిల్‌కు వచ్చాక కూడా కెరీర్‌పై స్పష్టత లేదట. తండ్రితో షూటింగ్స్‌ వెళ్లడం వల్ల సినిమాలపై చైతూకి ఆసక్తి వచ్చింది.&nbsp; సినిమాల్లోకి వస్తానని నాగార్జునకు చైతూ చెప్పగా నీ ఇష్టమని ఆయన బదులిచ్చారు. అయితే బరువు తగ్గాలని మాత్రం సూచించినట్లు తెలిసింది.&nbsp; నాగార్జున సూచనతో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టిన నాగచైతన్య బాగా బరువు తగ్గాడు. దాంతోపాటు కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్‌ స్కూల్లో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాడు.&nbsp; అలా 2009లో 'జోష్‌' సినిమాతో నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చేసిన 'ఏం మాయ చేశావే' సినిమా నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుడు అనగానే ముందుగా నాగ చైతన్యనే గుర్తుకు వస్తాడు. ఈ మధ్య పర్వాలేదు గానీ మెుదట్లో మెయిన్ స్ట్రీమ్‌ మీడియాకు సైతం చైతూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు.&nbsp; సోషల్ మీడియాలో పంచుకుంటే ఇక మన ప్రైవసీ ఏముందని నాగ చైతన్య తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేటుగానే ఉండాలని ఈ కుర్ర హీరో అభిప్రాయం. నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) చూడటానికి సాఫ్ట్‌గా కనిపించినా రేసింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంటాడు. హైస్పీడ్‌ బైక్స్‌, కార్లు అవలీలగా నడిపేస్తుంటాడు వాస్తవానికి రేసర్ కావాలని తొలుత నాగ చైతన్య భావించాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నట్లు అతడి సన్నిహితులు చెప్పారు. కొన్ని కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.&nbsp; ప్రొఫెషనల్ రేసర్ కానప్పటికీ ఇప్పటికీ రేసర్‌గానే తనని తాను భావిస్తుంటాడు చైతూ. రేసింగ్ కార్లను కొనుగోలు చేయడం అభిరుచిగా పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో ఫుల్‌ స్పీడుతో డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ప్రస్తుతం చైతూ గ్యారేజీలో ఫెరారీ, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్‌ రోవర్‌ వోగ్‌ లాంటి అత్యంత వేగంగా వెళ్లే కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి రేసింగ్‌ బైక్స్‌ కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు చైతూ (HBD Akkineni Naga Chaitanya) చాలా ప్రాధాన్యత ఇస్తాడు. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు. ఇందుకోసం ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.&nbsp; చైతూకి మెుహమాటం చాలా ఎక్కువ. అతడితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరికైనా ఇది తెలిసిపోతుందని ఆయన ఫ్రెండ్స్‌ చెబుతుంటారు.&nbsp; చైతూకి ఫ్రెండ్స్‌ కూడా చాలా తక్కువేనట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా. బంధుత్వానికి మించిన స్నేహం చిన్నప్పటి నుంచి వారి మధ్య ఉంది.&nbsp; చైతూ మంచితనం, వ్యక్తిత్వం చూసి 'స్వీట్‌ కిడ్‌' అని పేరు పెట్టానని రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చైతూని ఎవరైనా ఇష్టపడతారని పేర్కొన్నారు.&nbsp; చైతూ ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే ‘బటర్‌ చికెన్‌’ అంటే అతడికి బాగా ఇష్టం. వారంలో కనీసం రెండుసార్లైనా అది ఉండాల్సిందేనని చైతూ చెబుతుంటాడు.&nbsp; నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)కు ఓ ఊతపదం ఉంది. బాగా అబ్జర్వ్‌ చేస్తే తప్ప అది గుర్తించలేరు. ఇంతకీ ఆ పదం ఏంటంటే 'యూ నో'. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిపై టీనేజ్‌ నుంచి నాగచైతన్యకు క్రష్‌ ఉండేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఏడేళ్ల పాటు ప్రేమించి స్టార్‌ హీరోయిన్‌ సమంతను 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతే నాలుగేళ్లకే (2021) వారు విడిపోయారు.&nbsp; ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను 2024 ఆగస్టు 8న చైతు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.&nbsp; ఇక సినిమాల విషయానికొస్తే విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్‌ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ (నవంబర్‌ 23) చైతూ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1860218199587062221 'NC 24' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మించనున్నారు.&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Sandeep Reddy Vanga: తన లుక్‌తో హీరో మేకోవర్‌ను డిసైడ్‌ చేస్తున్న సందీప్‌ రెడ్డి.. ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా!</strong>
    Sandeep Reddy Vanga: తన లుక్‌తో హీరో మేకోవర్‌ను డిసైడ్‌ చేస్తున్న సందీప్‌ రెడ్డి.. ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా!
    భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్‌ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్‌ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఒక సినిమాను ఇలా ఉంటూనే ఆడియన్స్‌ చూస్తారు? అనే అభిప్రాయం నుంచి కొత్తగా తీస్తే కచ్చితంగా ఆదరిస్తారని నిరూపించాడు. సంచనాల దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్‌ వర్మను సైతం తన మేకింగ్‌ స్కిల్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇదంతా ఆన్‌ స్క్రీన్‌పైన ప్రతీ ఒక్కరు గమనించినవే. కానీ ఆఫ్‌ స్క్రీన్‌లోనూ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కు ఓ ప్రత్యేకత ఉంది. చాలా నిశితంగా పరిశీలిస్తే తప్పా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; హీరోలకు తగ్గట్లు మేకోవర్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇప్పటివరకూ మూడు చిత్రాలు తీశాడు. తన ఫస్ట్ తెలుగు చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీసి సందీప్‌ సక్సెస్ అయ్యాడు. గతేడాది ‘యానిమల్‌’ (Animal)తో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామి సృష్టించాడు. ఇదిలా ఉంటే సందీప్‌ తన సినిమాల షూటింగ్ సమయంలో విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు. తమ సినిమాల్లో హీరోలు ఏ మేకోవర్‌లో అయితే ఉంటారో సరిగ్గా అదే స్టైల్‌లోకి తన లుక్‌ను మార్చుకుంటాడు. ఇది చాలా మంది గమనించకపోవచ్చు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు వస్తే అందులో విజయ్‌ దేవరకొండ లాంగ్‌ హెయిర్‌, గుబురు గడ్డంతో కనిపించాడు. సందీప్‌ కూడా షూటింగ్‌ సమయంలో సరిగ్గా అదే లుక్‌ను మెయిన్‌టెన్‌ చేశాడు. ‘యానిమల్‌’ మూవీలోనూ రణ్‌బీర్‌ సింగ్‌ పాత్రకు తగ్గట్లు హెయిర్‌ చాలా పొడుగ్గా పెంచి, రణ్‌బీర్‌ స్టైల్‌లో గడ్డం పెంచాడు. మూవీ ప్రమోషన్స్‌కు సైతం అదే లుక్‌లో హాజరయ్యారు.&nbsp; https://www.reddit.com/r/tollywood/comments/1gwzj5e/vanga/#lightbox స్పిరిట్‌ లుక్‌లోకి సందీప్‌! ‘యానిమల్‌’ తర్వాత రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)తో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. ‘స్పిరిట్‌’ (Spirit) అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆల్‌మోస్ట్‌ కాన్ఫర్మ్‌ అయ్యింది. ఈ క్రమంలోనే సందీప్‌ రెడ్డి వంగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఇప్పటివరకూ చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే స్పిరిట్‌లో ప్రభాస్‌ లుక్‌ ఇదే కావొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. రీసెంట్‌గా సందీప్‌తో దిగిన ఫొటోలను హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఇందులో సందీప్‌ గడ్డం లేకుండా కనిపించాడు. షార్ప్‌ మీసాలు, పిల్లి గడ్డంతో స్మార్ట్‌గా దర్శనమిచ్చాడు. దీంతో ‘స్పిరిట్‌’ ప్రభాస్‌ కూడా ఇదే మేకోవర్‌లో కనిపించే ఛాన్స్ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి జరుగుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1858346779604906308 మూడు విభిన్న లుక్స్‌లో ప్రభాస్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్‌ లుక్‌ అనుగుణంగా పోలీసు పాత్రకు ప్రభాస్‌ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది కాకుండా మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ‘యానిమల్‌’లో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్‌ అలరించే అవకాశముందని స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్‌ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.&nbsp; యూరప్‌లో ప్రభాస్‌ రొమాన్స్‌! పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం 'ది రాజాసాబ్‌' (The Raja Saab) చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి (Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ (S.S. Thaman) సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మెుత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో రెండు సాంగ్స్‌ విదేశాల్లో షూట్‌ చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్‌, హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కాంబోలో ఈ రెండు డ్యూయెట్ పాటలు ఉంటాయని సమాచారం. ఈ సాంగ్స్‌ షూట్‌ కోసం వారు త్వరలోనే యూరప్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.&nbsp;
    నవంబర్ 22 , 2024
    <strong>Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్‌’.. ఎంత వచ్చాయంటే?</strong>
    Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్‌’.. ఎంత వచ్చాయంటే?
    కోలీవుడ్‌ స్టార్ యాక్టర్‌ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్‌ (Amaran). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.&nbsp; రూ.300 కోట్ల క్లబ్‌లోకి.. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్‌ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్‌ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్‌ బాస్టర్’ అంటూ మేకర్స్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.&nbsp; https://twitter.com/Dasarathan_1720/status/1858698464630063231 తెలుగులో లాభాలే లాభాలు.. ‘అమరన్‌’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్‌ (Amaran Collections) వసూళ్లను అమరన్‌ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్‌’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్‌ చూసి అమరన్‌ టీమ్‌ తెగ ఖుషీ అవుతోంది.&nbsp; కలిసొచ్చిన కంగువా ఫ్లాప్‌..&nbsp; నిజానికి అమరన్‌ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్‌ రన్‌ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్‌ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్‌ అమరన్‌ మెయిన్‌ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్‌ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; నెలాఖరులో ఓటీటీలోకి.. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్‌’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌ పోన్‌ చేయాల్సి వస్తే డిసెంబర్‌ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్‌’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు.&nbsp;
    నవంబర్ 19 , 2024
    <strong>Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్‌, తారక్‌కు బండ్ల గణేష్‌ చురకలు!&nbsp;</strong>
    Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్‌, తారక్‌కు బండ్ల గణేష్‌ చురకలు!&nbsp;
    ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్‌ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్‌ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్‌ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్‌ 9) తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలను టార్గెట్‌ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.&nbsp; టాలీవుడ్‌పై బండ్ల గణేష్‌ ఫైర్‌! తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నవంబర్‌ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్‌ రెడ్డికి ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్‌ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.&nbsp; ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/ganeshbandla/status/1855087509103165519 తారక్‌, ప్రభాస్‌కు చురకలు? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్‌ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్‌ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్‌ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్‌ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్‌, ప్రభాస్‌ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్‌ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.&nbsp; విష్‌ చేసిన స్టార్స్‌ వీరే! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సైతం రేవంత్‌ రెడ్డిని విష్‌ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్‌ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు. https://twitter.com/KChiruTweets/status/1854736624749625361 https://twitter.com/PawanKalyan/status/1854776671339262428 https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522 https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039 నంది అవార్డుల విషయంలో రగడ! ఈ ఏడాది జనవరిలో గద్దర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్‌ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్‌ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో సినీ పెద్దలు ‌అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.&nbsp; https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
    నవంబర్ 09 , 2024
    <strong>Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్‌ మల్టీ యూనివర్స్‌ ఫిల్మ్‌.. ‘రహస్యం ఇదం జగత్‌’ మెప్పించిందా?</strong>
    Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్‌ మల్టీ యూనివర్స్‌ ఫిల్మ్‌.. ‘రహస్యం ఇదం జగత్‌’ మెప్పించిందా?
    నటీనటులు: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు డైరెక్టర్‌ : కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ సంగీతం: గ్యానీ సినిమాటోగ్రాఫర్‌ : టేలర్‌ బ్లూమెల్‌ ఎడిటిర్‌: ఛోటా కె. ప్రసాద్‌ నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్‌ సెల్‌ యూనివర్స్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్‌లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్‌లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్‌ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని&nbsp; ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్‌ (విశ్వ, కల్యాణ్‌, అరు)తో ఓ ట్రిప్‌కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్‌ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్‌లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్‌ అరు మల్టీ యూనివర్స్‌పై రీసెర్చ్‌ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్‌ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్‌లోకి తీసుకెళ్లే వామ్‌ హోల్‌ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్‌ హోల్‌ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్‌ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్‌తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాడు. వామ్‌ హోల్‌లోకి ట్రావెల్‌ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్‌ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్‌ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ హాలీవుడ్‌ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్‌స్టెల్లార్‌’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్‌ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్‌కు దారితీసే వామ్‌ హోల్‌తో లింకప్‌ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్‌ హాఫ్ అంతా ఫ్రెండ్స్‌ ట్రిప్‌, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్‌కు ముందు మల్టీయూనివర్స్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో వామ్ హోల్‌ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్‌ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్‌ సీన్‌, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం, డైలాగ్స్‌ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్‌లుగా నిలిచాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్‌ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా చెప్పిస్తే బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ మల్టీ యూనివర్స్‌ కథపురాణాలతో లింకప్‌సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్‌ హాలీవుడ్‌ చిత్రాల ప్రభావంఫస్టాఫ్‌కమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024

    @2021 KTree