• TFIDB EN
  • మల్లేశం
    UTelugu
    చేనేత పనిలో తన తల్లి శ్రమను తగ్గించడంతో పాటు చేనేత వృత్తిని ఆదుకునేందుకు మల్లేశం 'ఆసు యంత్రాన్ని' ఎలా కనిపెట్టాడో తెలిపే అతని జీవన ప్రయాణం ఈ కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రియదర్శి పులికొండ
    చింతకింది మల్లేశం
    ఝాన్సీ లక్ష్మి
    లక్ష్మి
    అనన్య నాగళ్ల
    పద్మ
    ఆనంద చక్రపాణి
    నరసింహులు
    గంగవ్వ
    సీలింగ్ ఫ్యాన్ ఇంటి యజమాని
    జగదీష్ ప్రతాప్ బండారి
    అంజి
    దుర్గాప్రసాద్ కెఎలక్ట్రీషియన్ కిరణ్
    అన్వేష్ మైఖేల్
    రాజు
    తిరువీర్
    వీర ప్రతాప్
    తాగుబోతు రమేష్
    తాగుబోతు
    ధీర్ చరణ్ శ్రీవాస్తవ్
    అబ్దుల్
    సిబ్బంది
    రాజ్ రాచకొండదర్శకుడు
    రాజ్ రాచకొండనిర్మాత
    శ్రీ అధికారినిర్మాత
    మార్క్ కె రాబిన్సంగీతకారుడు
    కథనాలు
    అనన్య నాగళ్ల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనన్య నాగళ్ల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనన్య నాగళ్ల.. మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన "పద్మ" పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. వకీల్‌సాబ్ చిత్రంలో దివ్యా నాయక్ క్యారెక్టర్‌ ద్వారా గుర్తింపు పొందింది. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే  అనన్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి అనన్య నాగళ్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts Ananya nagalla) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనన్య నాగళ్ల దేనికి ఫేమస్? అనన్య నాగళ్ల మల్లేశం చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో పాటు వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించింది. అనన్య నాగళ్ల వయస్సు ఎంత? 1987 ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు అనన్య నాగళ్ల తొలి సినిమా? మల్లేశం  అనన్య నాగళ్ల ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు  అనన్య నాగళ్ల ఎక్కడ పుట్టింది? సత్తుపల్లి, ఖమ్మం అనన్య నాగళ్ల ఉండేది ఎక్కడ? హైదరాబాద్ అనన్య నాగళ్ల ఏం చదివింది? ఇంజనీరింగ్ అనన్య నాగళ్ల  తల్లిదండ్రుల పేర్లు విష్ణుప్రియ, వెంకటేశ్వరరావు అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరోయిన్ సావిత్రి అనన్య నాగళ్ల ఫెవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అనన్య నాగళ్ల అభిరుచులు? బాక్సింగ్, యోగా అనన్య నాగళ్లకు ఇష్టమైన ఆహారం? బిర్యాని అనన్య నాగళ్లకి  ఇష్టమైన కలర్ ? వైట్ అండ్ బ్లాక్ అనన్య నాగళ్ల పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.25లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? సినిమాల్లోకి రాకముందు ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత "షాది" అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు పొందింది. అనన్య నాగళ్ల ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ananya.nagalla/?hl=en https://www.youtube.com/watch?v=Tqjtq5lvnas
    ఏప్రిల్ 13 , 2024
    <strong>Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్</strong>
    Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె నటించి పొట్టేల్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనన్య నాగళ్ల హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా అనన్యకు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె ఇచ్చిన అదిరిపోయే సమాధానం నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; అసలేం జరిగిందంటే? అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా పొట్టేల్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్‌ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్‌ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్‌ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్‌ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.&nbsp; https://twitter.com/tfpcin/status/1847262295266865248 నెగిటివ్‌ వైపే చూస్తున్నారు: అనన్య మనిషి జీవితంలో లాగానే ఇండస్ట్రీలో కూడా నెగిటివ్‌, పాజిటివ్‌ అనే రెండు అంశాలు ఉంటాయని అనన్య అన్నారు. మీరు ఎక్కువగా నెగిటివ్‌ వైపే చూస్తున్నరంటూ రిపోర్టర్‌కు చురకలు అంటించారు. ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చే ముందు కమిట్‌మెంట్‌ ఉంటుందనేది బుల్‌ షిట్‌ వ్యవహారమంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక రేటు (రెమ్యూనరేష్‌), ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందని ఇండస్ట్రీ వాళ్లే చెబుతుంటారు' అని అన్నారు. అప్పుడు అనన్య బదులిస్తూ ‘మీరు ఎలాంటి ఎక్స్‌పిరియన్స్‌ లేకుండా విన్నమాట చెబుతున్నారు. కానీ నేను ఎక్స్‌పీరియన్స్‌ చేసి చెబుతున్నా. కమిట్‌మెంట్‌ ఇక్కడ లేదు' అంటూ ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్‌ అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్‌ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్‌ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్‌ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్‌ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్‌ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్‌ చేశారు. మహిళా రిపోర్టర్‌ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్‌ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.&nbsp; https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498 ఫ్లైట్‌లో అనన్య ప్రమోషన్స్‌ ‘పొట్టేల్‌’ చిత్రంలో చంద్ర కృష్ణ, అనన్య జంటగా నటించారు. ఈ నెల 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నటి అనన్య నాగళ్ల విమానంలో చిత్ర ప్రమోషన్స్‌ చేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మూవీ పోస్టర్లు, కరపత్రాలు పంచి పెట్టింది. తమ సినిమాను చూసి ఆదరించాలని కోరింది. అనన్యతో పాటు ‘పొట్టేల్‌’ టీమ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొత్త తరహా ప్రమోషన్స్‌కు అనన్య నాంది పలికారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/wareymedia/status/1846883443424272530
    అక్టోబర్ 19 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్‌ రెడ్డి వంగా.. ఏమైందంటే?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్‌ రెడ్డి వంగా.. ఏమైందంటే?
    తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘పొట్టేల్‌’ (Pottel). అక్టోబర్‌ 25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అనన్య బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ ఎవరికైనా ఇచ్చారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్న టాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అనన్య మరోమారు మాట్లాడారు. అలాగే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తమ టీమ్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.&nbsp; సందీప్‌పై అనన్య ప్రశంసలు యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్‌’ (Pottel). మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ వేడకకు&nbsp; 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్‌' చిత్రాల దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నటి అనన్య మాట్లాడారు. తమ ‘పొట్టేల్‌’ ప్రమోషన్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి కాదు రెండుసార్లు తమ మూవీ వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లడం కోసం మీరు చేస్తున్న సపోర్ట్‌ మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/i/status/1848603026728358266 'రంగస్థలం’ తర్వాత పొట్టేలే: సందీప్‌ రెడ్డి&nbsp; దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు సాహిత్‌ ఓ రోజు తనకు చెప్పాడని సందీప్‌ అన్నారు. కథ వినగానే 'ఇది చిన్న కథ కాదు పెద్దది' అని అనిపించిందన్నారు. తాను ఇప్పటికే సినిమా చూశానని బాగా నచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆ విధంగా ఉంటుందని అసలు ఊహించలేదన్నారు. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆడియన్స్‌ను ఉద్దేశించి చెప్పారు. 'రంగస్థలం' తర్వాత పూర్తి స్థాయి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో చూసిన సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. చిన్న సినిమాలను ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటూ ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేశారు.&nbsp; https://twitter.com/i/status/1848595831508652364 సంస్కారం ఉంటే ఆ ప్రశ్నలు వేయరు: అనన్య ‘పొట్టేల్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అనన్య నాగళ్ల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.&nbsp; కమిట్‌మెంట్‌పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను మరోమారు లేవనెత్తుతూ చురకలు అంటించారు. ‘ఇంత డైరెక్ట్‌గా సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నా. పొట్టేల్‌ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారని భావించా. కమిట్‌మెంట్‌ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. హీరోయిన్లు మేకప్‌ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య కోరారు. అసలేం జరిగిందంటే? పొట్టేల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్‌ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్‌ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్‌ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్‌ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్‌ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.&nbsp; https://twitter.com/tfpcin/status/1847262295266865248 రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్‌ అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్‌ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్‌ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్‌ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్‌ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్‌ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్‌ చేశారు. మహిళా రిపోర్టర్‌ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్‌ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.&nbsp; https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498
    అక్టోబర్ 22 , 2024
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం&nbsp; సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)&nbsp; షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.&nbsp;&nbsp; అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా&nbsp; ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.&nbsp; సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’&nbsp; (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా&nbsp; ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.&nbsp; ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.&nbsp;
    మార్చి 14 , 2024
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ&nbsp; వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్‌ ఏంజెల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి&nbsp; ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్‌ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో&nbsp; బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు. చిన్న సినిమాలతో మొదలై.. అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్‌ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్‌… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఫిదా లేడీ సూపర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్‌ మొదలుకుని టైటిల్‌ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్‌ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్‌ అనుకున్నారట. ఈ నగరానికి ఏమైంది? పెళ్లి చూపులు తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. డీజే టిల్లు 2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్‌ అదిరిపోయాయి. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా త్వరలోనే రాబోతోంది. మల్లేశం ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లవ్‌ స్టోరీ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్‌ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి&nbsp; తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ పూరి జగన్నాథ్‌, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ పూరీకి కమ్‌బ్యాక్‌ మూవీ అయ్యింది. రామ్‌ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్‌ పిల్లగా హీరోయిన్‌ నభా నటేశ్‌ అమితంగా ఆకట్టుకుంది. విరాట పర్వం నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు&nbsp;అందుకుంది. NBK108లోనూ.. నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు. ఆస్కార్‌ స్థాయికి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్‌ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్‌ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్‌ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్‌ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్‌ ఇప్పుడు టాప్‌ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
    ఏప్రిల్ 01 , 2023

    @2021 KTree