రివ్యూస్
How was the movie?
తారాగణం
కృష్ణం రాజు
ఇన్స్పెక్టర్శారద
రాధా దేవిశోభన్ బాబు
డా. వేణు మరియు జగన్ (ద్వంద్వ పాత్రలు)కైకాల సత్యనారాయణ
భుజంగంకృష్ణ కుమారి
సీతరాజా బాబు
PJ శర్మ
నారాయణముక్కామల కృష్ణమూర్తి
ముక్కామలసిబ్బంది
పి. చంద్రశేఖర రెడ్డిదర్శకుడు
పి.చిన్నప రెడ్డినిర్మాత
మోదుకూరి జాన్సన్రచయిత
అశ్వత్థామ
సంగీతకారుడుకథనాలు
EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి ఓసారి చూద్దాం.
అడవి శేషు(Adivi Sesh)
ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు. 'కర్మ' అనే సినిమాతో డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.
విశ్వక్ సేన్(Vishwak Sen)
ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. మరో నాలుగేళ్ల తర్వాత దాస్ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)
ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)
'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
ఆర్ నారాయణ మూర్తి(R. Narayana Murthy)
విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ
లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఏప్రిల్ 01 , 2024
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్' (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్ ఎక్స్' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
నవంబర్ 25 , 2023
Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం.
జూ.ఎన్టీఆర్
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’ పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు.
https://youtu.be/b02ieSLiyRI?feature=shared
పవన్ కళ్యాణ్
ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు.
https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU
నాగార్జున
మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు.
సునీల్
విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు..
https://youtu.be/VhyejE23l4M?feature=shared
రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
బాలకృష్ణ
పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు.
https://youtu.be/wcJhLH_T6N0?feature=shared
శోభన్ బాబు:
వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు. బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు.
https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared
కాంతరావు
ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్
తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.
https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
సెప్టెంబర్ 06 , 2023
Veena Rao: ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి.. ఆమె ఎవరంటే?
నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వై.వి.ఎస్. చౌదరి సతీమణి గీత ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా వీణారావు పరిచయం కాబోతోంది.
వీణారావు ఎవరంటే( Who is Veena Rao)
విజయవాడకు చెందిన వీణారావు( Veena Rao) ఈ సినిమాలో నందమూరి తారక రామారావు(Nandamuri Traraka Rama Rao) సరసన కనిపించనున్నారు. ఆమెకు కూచిపూడి నాట్యంలో మంచి ప్రావిణ్యం ఉందని వై.వి.ఎస్. చౌదరి(Y.V.S Chowdary) తెలిపారు. వీణారావు అచ్చతెలుగు అమ్మాయి అని, ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
మీడియా సమావేశం ద్వారా పరిచయం
హీరోయిన్‌ను మీడియా సమావేశంలో పరిచయం చేసిన వై.వి.ఎస్. చౌదరి మాట్లాడుతూ, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా 1979 నవంబర్ 30న విడుదలైందని, అందుకే అదే రోజున వీణారావును పరిచయం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
సుప్రియ, స్వప్నదత్ అభినందనలు
ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ మాట్లాడుతూ, “వైవీఎస్ చౌదరి గారు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ద్వారా వీణారావుకు మంచి భవిష్యత్తు ఉంటుంది” అన్నారు.
స్వప్నదత్ మాట్లాడుతూ, “తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సినీ పరిశ్రమలోకి రావాలి. అచ్చ తెలుగుతనం ఉన్న విజయవాడ అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవ్వడం హర్షణీయం” అన్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
వీణారావు ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఈ నూతన జంటను తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నారు.
గీత ధన్యవాదాలు
చిత్ర నిర్మాత గీత మాట్లాడుతూ, వీణారావును ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సుప్రియ, స్వప్నదత్‌ల పాత్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆకాంక్షించారు.
సినిమా విశేషాలు
తారక రామరావు, వీణారావు జంటగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2025లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తెలిపారు. వీణారావు తన నాట్య నైపుణ్యంతో పాటు అచ్చతెలుగు సౌందర్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారని ఆశిద్దాం.
నవంబర్ 30 , 2024
రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన నటనతో విలక్షణ నటుడిగా ఎదిగాడు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ భాషల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు. బాహుబలి1, బాహుబలి2, నేనేరాజు నేనే మంత్రి, లీడర్ చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రానా దగ్గరయ్యాడు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రానా అసలు పేరు?
రామానాయుడు
రానా ఎవరు?
తెలుగులో దిగ్గజ నిర్మాత అయిన డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు
రానా ఎత్తు ఎంత?
6 అడుగుల 2 అంగుళాలు
రానా ఎక్కడ పుట్టారు?
నిజామాబాద్
రానా వివాహం అయిందా?
మిహికా బజాజ్‌తో 2020లో పెళ్లి జరిగింది.
రానాకి ఇష్టమైన రంగు?
బ్లాక్
రానా తల్లిదండ్రుల పేరు
డి.సురేష్ బాబు, లక్ష్మి దగ్గుబాటి
రానా అభిరుచులు?
చెత్తను రీ సైక్లింగ్ చేయడం, బాక్సింగ్, ఫొటోగ్రఫి, వంటచేయడం వంటివి అతని అభిరుచులు
రానాకి ఇష్టమైన ఆహారం?
నాటు కోడి పులుసు
రానా అభిమాన నటుడు?
కమల్ హాసన్, అక్షయ్ కుమార్
రానాకు స్టార్ డం అందించిన సినిమాలు?
లీడర్, బాహుబలి సిరీస్, నేనేరాజు నేనే మంత్ర
రానా ఏం చదివాడు?
ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీలో డిగ్రీ చదివాడు
రానా ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 22 సినిమాల్లో నటించాడు
రానా సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=WHGxx6ganOY
రానా ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
బాహుబలి2 చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నాడు. అలాగే సైమా అవార్డుల్లో ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులను బాహుబలి1,2 చిత్రాలు, భీమ్లానాయక్ సినిమాలకు గాను గెలుచుకున్నాడు.
మే 29 , 2024
అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
అఖిల్ అక్కినేని ఎవరు?
అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు
అఖిల్ ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
అఖిల్ ఎక్కడ పుట్టారు?
కాలిఫోర్నియా, అమెరికా
అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1994 ఏప్రిల్ 08
అఖిల్ వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
అఖిల్‌కి ఇష్టమైన రంగు?
బ్లాక్
అఖిల్ అభిరుచులు?
డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం
అఖిల్‌కు ఇష్టమైన ఆహారం?
ఫిష్ ఫ్రై
అఖిల్ అభిమాన నటుడు?
నాగార్జున, పవన్ కళ్యాణ్
అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?
మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
అఖిల్ ఏం చదివాడు?
BBA
అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 8 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=-Qq6ff-0uQM
అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు.
అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.
మార్చి 21 , 2024
నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్టార్ కిడ్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. టాలీవుడ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నా నాగ చైత్య గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
నాగచైతన్య ఎవరు?
టాలీవుడ్‌లో స్టార్ హీరో నాగార్జున తనయుడు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు
నాగచైతన్య ముద్దు పేరు?
చై
నాగ చైతన్య ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
నాగచైతన్య ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
నాగ చైతన్య పుట్టిన తేదీ ఎప్పుడు?
1986 నవంబర్ 23
నాగ చైతన్య భార్య పేరు?
సమంత, ప్రస్తుతం వారు విడిపోయారు
సమంత- నాగ చైతన్య ఎప్పుడు విడిపోయారు?
వ్యక్తిగత కారణాలతో 2021 అక్టోబర్ 2న విడిపోయారు.
నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
లేదు, కానీ ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
నాగ చైతన్య అభిరుచులు?
ట్రావెలింగ్
నాగ చైతన్య అభిమాన నటుడు?
నాగార్జున, ఆమిర్ ఖాన్
నాగ చైతన్య అభిమాన హీరోయిన్?
అనుష్క శెట్టి
నాగ చైతన్యకు స్టార్ డం అందించిన సినిమాలు?
ఏ మాయా చేసావే, 100%లవ్,
నాగ చైతన్యకు ఇష్టమైన కలర్?
బ్లాక్
నాగ చైతన్య ఏం చదివాడు?
St. మేరీస్ కాలేజీలో డిగ్రీ
నాగ చైతన్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 28 సినిమాల్లో నటించాడు
నాగ చైతన్యకు ఇష్టమైన ఆహారం?
చేపల పులుసు
https://www.youtube.com/watch?v=1dHAFadok8g
నాగ చైతన్య సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు- రూ.12 తీసుకుంటున్నారు.
నాగ చైతన్య గెలుచుకున్న అవార్డులు?
మొదటి చిత్రం జోష్ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సౌత్ స్కోప్ సినిమా అవార్డ్స్, మనం చిత్రానికిగాను నంది అవార్డు అందుకున్నారు.
మార్చి 19 , 2024
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.
మిస్టర్ కింగ్
కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.
డెడ్ లైన్
ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.
కోనసీమ థగ్స్
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.
OTT విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
ఫిబ్రవరి 22 , 2023
Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
[toc]
నాగ్ అశ్విన్ (Nag Ashwin)
ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు ‘నాగ్ అశ్విన్’. ప్రభాస్ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాగ్ అశ్విన్‌కు కెరీర్ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్ అశ్విన్.. విజన్, ఎగ్జిక్యూషన్, యునిక్ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.
టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్, వైవిధ్యమైన డైలాగ్స్, నెవర్‌బీఫోర్ హీరో ఎలివేషన్స్ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్ వెహికల్‌ను చిత్ర యూనిట్ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్ వాహనంతోనే హీరో ప్రభాస్ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
https://twitter.com/i/status/1793606030703927405
బుజ్జి అనే స్పెషల్ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని నాగ్ అశ్విన్.. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్ తయారీకి సహకరించిన ఆనంద్ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
https://twitter.com/i/status/1793303611583418579
సుకుమార్ (Sukumar)
‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్.. ఆ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ హీరోను.. ఎలాంటి మేకప్ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్ ఇంటర్వెల్ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్ దీనికి పూర్తి డిఫరెంట్ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లను డిజైన్ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేశారు సుకుమార్. అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.
ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2 : ది రూల్’ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్ 2, 3 ఏళ్లలో సుకుమార్.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ‘యానిమల్’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ వేసుకున్న పోలీసు డ్రెస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్ కాప్ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్‌తో స్పిరిట్ రానుంది ఇప్పటికే సందీప్ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్ టాక్ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.
ఇక స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి.. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన టాలెంట్ ఏంటో ‘హనుమాన్’ (HanuMan) ద్వారా యావత్ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయితే ప్రశాంత్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel)
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ (Salaar) రూపొందించి సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్ స్టైల్ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్ మెుత్తం ‘సలార్ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే ప్రశాంత్ క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.
కొరటాల శివ (Koratala Siva)
టాలీవుడ్ టాలెంటెడ్ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్. ఓ సీన్‌లో తారక్ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్ చేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్ పాత్రను ఎలివేట్ చేస్తూ రాసుకున్న లిరిక్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్ అయితే కొరటాల శివ క్రేజ్ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.
సుజీత్ (Sujeeth)
యంగ్ డైరెక్టర్ సుజీత్.. స్టైలిష్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్ స్కిల్స్ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ చిత్రానికి
సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్ మేకింగ్ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్ లభిస్తే సుజీత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే సుజీత్ కెరీర్ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.
బుచ్చిబాబు (Buchi Babu)
తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 22 , 2024
Jr NTR Sons: టాలీవుడ్ ఫ్యూచర్‌పై కర్చీఫ్ వేసిన తారక్ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లేనా!
దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్ ఏంజలిస్ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిడ్డల సినీ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే!
టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్, భార్గవ్ సినిమా ఎంట్రీని ఎక్స్‌పెక్ట్ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
తారక్.. నందమూరి వారసుడు కాదా?
ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.
హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం!
నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్, కల్యాణ్ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
'దేవర 2'.. తారక్ ఏం చెప్పారంటే?
కలెక్షన్స్ పరంగా దేవర సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర 2'పై తారక్ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్ అన్నారు.
అక్టోబర్ 07 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.
రన్ టైమ్ భయాలు!
నేచురల్ స్టార్ నాని హీరోగా 'సరిపోదా శనివారం' రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ టీమ్ యు/ఏ సర్టిఫికేట్ జారి చేసింది. అలాగే రన్ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
విలన్‌దే పైచేయి..!
'సరిపోదా శనివారం' చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్ అండ్ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్.జే. సూర్య యాక్టింగ్ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు.
కథని ముందే రివీల్ చేస్తున్నాడు!
‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో నిడివి గురించి సైతం సెన్సార్ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’
‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్‌లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్ పడుతున్న సమయంలో జేక్స్ బిజోయ్ మ్యూజిక్ వింటే ఆ టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్ అంతగా పని పెట్టాడు. నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు.
ఆగస్టు 27 , 2024
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి. ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
[toc]
Jersey
అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ.
Ee Nagaraniki Emaindi
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
Chi La Sow
అర్జున్ (సుశాంత్) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies)
C/o Kancharapalem
కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
Brochevarevarura
పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies)
Ninnila Ninnila
పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
Raja Raja Chora
భాస్కర్ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ.
Nootokka Jillala Andagadu
హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Balagam
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు.
Pareshan
ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
Nuvvu Naaku Nachchaav
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
Vedam
రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
Keedaa Cola
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Seethamma Vakitlo Sirimalle Chettu
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
Miss Shetty Mr Polishetty
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
Pilla Zamindar
అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ.
Josh
దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
Rowdy Boys
అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
Middle Class Melodies
రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
ఆగస్టు 24 , 2024
మెహ్రీన్ పిర్జాదా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
మెహ్రీన్... 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Mehreen Pirzada) ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
మెహ్రీన్ పిర్జాదా ఎప్పుడు పుట్టింది?
1995, జనవరి 5న జన్మించింది
మెహ్రీన్ పిర్జాదా తొలి సినిమా?
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016)
మెహ్రీన్ పిర్జాదా ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మెహ్రీన్ పిర్జాదా ఎక్కడ పుట్టింది?
బతిండా, పంజాబ్
మెహ్రీన్ పిర్జాదా ఏం చదివింది?
డిగ్రీ
మెహ్రీన్ పిర్జాదా అభిరుచులు?
పుస్తకాలు చదవడం, మోడలింగ్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ఆహారం?
చేపల వేపుడు, రాగి ముద్ద
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ప్రదేశం
లండన్
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరో?
రణబీర్ కపూర్
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరోయిన్?
ఐశ్వర్య రాయ్
మెహ్రీన్ పిర్జాదా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది
మెహ్రీన్ పిర్జాదా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/mehreenpirzadaa/?hl=en
మెహ్రీన్ పిర్జాదా బాయ్ ఫ్రెండ్?
హరియాణా ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి నిశ్చయమైనప్పటికీ... వ్యక్తిగత కారణాలతో వీరు విడిపోయారు.
మెహ్రీన్ పిర్జాదా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మెహ్రీన్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. డవ్ ఇండియా, పియర్స్, థమ్స్అప్ యాడ్స్‌లో నటించింది.
https://www.youtube.com/watch?v=5VD3YejRDhk
ఏప్రిల్ 06 , 2024
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు
నందమూరి బాలకృష్ణ ఎవరు?
బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం.
నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు?
చెన్నై
నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 జూన్ 10
నందమూరి బాలకృష్ణ భార్య పేరు?
వసుంధర దేవి
బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని)
నందమూరి బాలకృష్ణ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు?
తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ
బాలకృష్ణ అభిమాన నటుడు?
నందమూరి తారక రామారావు
బాలకృష్ణ అభిమాన హీరోయిన్?
సావిత్రి
బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు?
మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ.
బాలకృష్ణకు ఇష్టమైన కలర్?
వైట్
బాలకృష్ణ ఏం చదివాడు?
నిజాం కాలేజీలో డిగ్రీ
బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 108 సినిమాల్లో నటించాడు
బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం?
చికెన్ పలావు
బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.
బాలకృష్ణ 100వ సినిమా పేరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM
బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
హిందూపురం
బాలయ్య గెలుచుకున్న అవార్డులు?
బాలయ్య 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
మార్చి 19 , 2024
Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్ మాత్రం బాక్స్ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా.
అతడు- మహేష్ బాబు
"ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే... అతడే..
అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ
పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది
"బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.
https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K
ప్రభాస్- బాహుబలి 2
బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు.
https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92
దసరాలో నాని
దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్ ఫ్యాన్స్ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు.
https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF
బాలకృష్ణ- లెజెండ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ.
https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j-
రామ్ చరణ్- చిరుత
తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్ చేత పూనకాలు పెట్టించింది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
జూ.ఎన్టీఆర్- RRR
కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu
పవన్ కళ్యాణ్- పంజా
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
మహేష్ బాబు- పోకిరి
పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది.
https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg
అల్లు అర్జున్- ఆర్య
మ్యాన్ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు.
https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ
సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్
సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది.
https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE
స్టాలిన్- చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT
రామ్ చరణ్- మగధీర
ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i
ప్రభాస్- బిల్లా
హాలీవుడ్ రేంజ్ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.
https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta
ఘర్షణ- వెంకటేష్
ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు.
https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
ఫిబ్రవరి 26 , 2024
Telugu Films based on the Ramayana: సీతారాములు లేకున్నా రామాయాణాన్ని గుర్తు చేసిన చిత్రాలు ఇవే!
వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ - త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావణన్' చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ - త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ - హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
ఫిబ్రవరి 19 , 2024
Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమారుడితో వివాహం జరగనుంది.
వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు. మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది.
అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం.
మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 26 , 2023
Custody Review: ప్రేక్షకులను నాగచైతన్య తన ‘కస్టడీ’లో బంధించాడా? అక్కినేని ఫ్యామిలీకి హిట్ వచ్చిందా?
అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి కీలక పాత్రల్లో నటించారు. చైతూ కానిస్టేబుల్‌గా కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కినేని ఫ్యామిలీకి సరైన హిట్ లేని సమయంలో కస్టడీతో చై ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం హిట్ తెచ్చిపెట్టిందా? కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య ఆకట్టుకున్నాడా? కస్టడీ కథ ఏంటి, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నటీనటులు: నాగ చైతన్య, కృతిశెట్టి, ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్
దర్శకుడు: వెంకట్ ప్రభు
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: S.R కతిర్, సుమేర్ వర్మ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
కథ:
శివ (నాగ చైతన్య) నిజాయితీ గల కానిస్టేబుల్. ఎంతగానో ప్రేమించిన రేవతి(కృతి శెట్టి)ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద్ స్వామి) ని అరెస్ట్ చేసి ఉంచుతారు. డ్యూటీలో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అనే సమాచారం అందుతుంది. మరోవైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించారని తెలుస్తుంది. ఎలాగైనా న్యాయం గెలవాలని చెప్పి రాజన్నని కోర్టులో అప్పగించేందుకు అదే రాత్రి రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. అసలు రాజన్నను ఎందుకు అరెస్టు చేశారు? చంపాలనుకున్నది ఎవరు? శివ తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.
ఎలా ఉందంటే
సినిమా ఓ యాక్సిడెంట్‌తో మెుదలై కథలోకి వెళ్తోంది. దాదాపు 15 నిమిషాల పాత్రల పరిచయానికే సమయం పడుతుంది. ప్రియమణి, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంట్రో, ఫ్యామిలీ సన్నివేశాలతో స్లోగా సాగుతుంది. క్రూరమైన విలన్‌గా అరవింద్ స్వామి ఇంట్రోతో అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కథనంలో వేగం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్‌తో సెకాండాఫ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.
సెకాండాఫ్ స్లోగా స్టార్ట్ అవ్వటంతో పాటు కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్‌ను కొట్టిస్తాయి. కొన్ని సీన్లు ఇప్పటికే చూసేశాం అన్నట్లుగా అనిపిస్తాయి. కృతి శెట్టితో లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. యాక్షన్ ఎపిసోడ్‌లు, ట్విస్ట్‌లు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. వెంకట్ ప్రభు తరహా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం యువన్ ఇరగదీశాడు.
ఎవరెలా చేశారంటే?
కస్డడీ సినిమాలో నాగచైతన్య అదరగొట్టాడు. శివ పాత్రలో పరకాయప్రవేశం చేసి అలరించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివ పాత్రనే కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ చైతూ లుక్ సెట్ అవ్వలేదేమో అనిపించినా.. కథలో లీనమయ్యేకొద్ది శివపాత్రతో కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. యాక్షన్ సీన్లలో చైతూ తనదైన మార్క్ చూపించాడు. హీరోయిన్ కృతి శెట్టి కూడా నాగ చైతన్య కి సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంది. కొన్ని సీన్లలో శృతి తన గ్లామర్‌తో ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది. అరవింద్ స్వామి నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే ఆయన తన పాత్రని అద్భుతంగా పండించాడు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ మిగిలిన తారాగణం కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు.
సాంకేతికంగా
తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన మార్క్ కథనంతో తెరకెక్కిస్తారు. మానాడు చిత్రం ఇందుకు ఉదాహరణ.చై విషయంలో మంచి కథనే ఎంచుకున్నప్పటికీ కొన్ని చోట్ల తడబడ్డాడు.కథనం మరింత గ్రిప్పింగ్ రాసుంటే బాగుండేది. ఇళయ రాజా, యువన్ శంకర్ ఇద్దరు కలిసి పనిచేయడంతో మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. కానీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్ అని చెప్పాలి. కొన్ని సీన్లను BGM బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది.
బలాలు
నాగ చైతన్య నటనబ్యాక్ గ్రౌండ్ స్కోర్యాక్షన్ సీన్స్
బలహీనతలు
పాటలురొటీన్ కథసాగదీత సీన్లు
రేటింగ్: 2.5/5
మే 12 , 2023