• TFIDB EN
  • మంగళవారం (2023)
    ATelugu
    మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్రమ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్రజ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?

    RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాం...read more

    How was the movie?

    @maheshYadavv

    10 months ago

    తారాగణం
    పాయల్ రాజ్‌పుత్
    నందితా శ్వేత
    దివ్య పిళ్లై
    రవీంద్ర విజయ్
    చైతన్య కృష్ణ
    అజయ్ ఘోష్
    శ్రీతేజ్
    సిబ్బంది
    అజయ్ భూపతి
    దర్శకుడు
    స్వాతి గునుపాటినిర్మాత
    సురేష్ వర్మ ఎంనిర్మాత
    దాశరధి శివేంద్రసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.  కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ  ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌  నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!
    గతవారం సలార్ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఆ సినిమాకు పోటీగా ఈవారం పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. చాలావరకు తమ సినిమాలను కొత్త ఏడాది జనవరిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో డిసెంబర్ ఇయర్ ఎండింగ్‌లో దాదాపు 25కు పైగా చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. డెవిల్ సినిమాను అభిషేక్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.  ధృవ నక్షత్రం తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదులను ఏరిపారేసే ఆర్మి అధికారిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు మంగళవారం వారం రోజులుగా ఓటీటీ రిలీజ్‌పై దాగుడు మూతలు ఆడుతున్న మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో హర్రర్ చిత్రంగా మంగళవారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి.  అన్నపూరాణి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన రిసెంట్ చిత్రం 'అన్నపూరాణి' డిసెంబర్ 29 నుంటి ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ  డెరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ OTTలో తెలుగు, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateMangalavaaramMovieTeluguDisney Plus HotstarDec 2612th FailMovieTelugu/HindiDisney Plus HotstarDec 29Katatan Si BoyMovieIndonesianAmazon PrimeDec 27Tiger 3MovieHindiAmazon PrimeDec 31Ricky Gervais: Armageddon Standup Comedy ShowEnglishNetflixDec 25Snag MovieEnglishNetflixDec 25Ko Gaye Hum Kaha MovieHindiNetflixDec 26Thank You I'm Sorry MovieSwedishNetflixDec 26Hell Camp: Teen Night Mare MovieEnglishNetflixDec 27A Very Good GirlMovieTagalogNetflixDec 27Miss SampoMovieMandarinNetflixDec 28Little DixieMovieEnglishNetflixDec 28Pokemon Concierge Web SeriesJapaneseNetflixDec 28AnnapooraniMovieTelugu Dubbed NetflixDec 29Shastri Virudh Shastri MovieHindiNetflixDec 29Three of UsMovieHindiNetflixDec 29Bad LandsMovieJapaneseNetflixDec 29Berlin MovieSpanishNetflixDec 29Dangerous Game: The Legacy MurdersMovieEnglishNetflixDec 31The AbandonedMovieMandarinNetflixDec 31Dono MovieHindiZee5Dec 29Once Upon Two TimesMovieHindiZee5Dec 29Safed MovieHindiZee5Dec 29Trolls and TogetherMovieEnglishBook My ShowDec 29The CurseWeb SeriesEnglishLion's Gate PlayDec 29
    డిసెంబర్ 26 , 2023
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో  హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.  ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.  సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.  జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.  మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.  ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌  సిద్ధపడుతున్నట్లు  తెలుస్తోంది.  RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.  అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. 
    ఏప్రిల్ 25 , 2023
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    ఆర్‌ఎక్స్‌ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్‌ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.  అసలు ఏ జరిగిందంటే! 2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్‌ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ ‘రక్షణ’ మేకర్స్‌ వేధింపులపై నటి పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్‌ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ తెలిపింది.  View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) పాయల్‌ బిజీ బిజీ 'మంగళవారం' మూవీ సక్సెస్‌తో పాయల్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌' చిత్రాల్లో పాయల్‌ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్‌ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. 
    మే 20 , 2024
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) మిల్లీ బాబీ బ్రౌన్‌… నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీసెస్‌లో నటించి చాలా ఫేమస్‌ అయింది. స్టేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌ల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె నటనకు గాను యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత గాడ్జిల్లా, ఎనోలా హోమ్స్‌, గాడ్జిల్లా Vs కాంగ్‌, ఎనోలా హోమ్స్‌-2 వంటి చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూనే పాటల ఆల్బమ్స్‌ చేస్తూ మిల్లీ వరల్డ్‌ ఫేమస్‌గా మారిపోయింది. ఈ తరం యువకుల కలల రాకుమారిగా కీర్తింప బడుతోంది. అటువంటి మిల్లీ వివాహ బందంలోకి అడుగు పెడుతుండంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లకే పెళ్లి ఏంటంటూ వ్యంగ్యంగా మీమ్స్‌ పెడుతున్నారు. మిల్లీ వయసులో తాము ఏం చేసేవారమో చెబుతూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.  19 వయసుకే మిల్లీ బాబీ బ్రౌన్‌ పెళ్లి చేసుకోబోతోంది. కానీ, 24 ఏళ్లు ఉన్న నేను ఏమీ సాధించకుండా ఉండిపోయానని అర్థం వచ్చేలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు అనన్య పాండేకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1645971994192785410 19 ఏళ్ల మిల్లీ పెళ్లికి సిద్ధమైతే.. 23 ఏళ్ల తాను "Ee Sala cup namde" #RCB అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  https://twitter.com/RakshanRak/status/1645857802722902017 19 ఏళ్ల వయసులో సమోసాలు తింటూ.. చట్నీ కోసం పోరాడేవాడినని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నవ్వులు పూయిస్తోంది.  https://twitter.com/ayusharyan09/status/1645891008130084864 మిల్లీ బాబీ బ్రౌన్‌ కేవలం 19 ఏళ్లేనా అని ఆశ్యర్యపోతూ... సినిమా/వెబ్‌సిరీస్‌లో ఆమె చేసిన పాత్రలను ఓ నెటిజన్ పోస్టు చేశాడు.  https://twitter.com/Mr_Stranger8/status/1645747169243332608 19 ఏళ్లకే మిల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతుంటే తాను మాత్రం సోల్‌మేట్‌ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని ఫీల్‌ అవుతూ నెటిజన్స్ పెట్టిన పోస్టులు తెగ ట్రెండింగ్ అవుతోంది. https://twitter.com/mukesh1yadav87/status/1646002836818501632 https://twitter.com/GunaPeram/status/1645842111236034560 https://twitter.com/i/status/1645915342185836544 మిల్లీ బాబీ బ్రౌన్‌కు 19 ఏళ్లు వచ్చేశాయా. చివరిసారిగా తనను ఓ చిన్నపిల్లగా చూసినట్లు గుర్తుందే అంటూ ఓ నెటిజన్‌ మిల్లీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.  https://twitter.com/swaraj_gadge/status/1645848151117684738 19 ఏళ్ల మిల్లీ తెలివైనది, సక్సెస్‌ఫుల్‌, టాలెంటెడ్‌, ధనవంతురాలు, అందమైనది కూడా.. 20 ఏళ్ల నేను మాత్రం కాలేజీకి వెళ్లడానికి నిద్ర కూడా లేవలేకపోతున్నా అంటూ ఓ నెటిజన్ పెట్టిన వీడియో నవ్వులు పూయిస్తోంది.  https://twitter.com/ggukksbae/status/1645829000483475457 19 ఏళ్లకే మిల్లీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే.. 24 ఏళ్ల తాను బెడ్‌పై కూర్చొని బనాన చిప్స్‌ తింటూ మిల్ #She is 19 ట్రెండ్‌ చూస్తున్నట్లు రియా చోప్రా అనే యువతి పోస్టు పెట్టింది.  https://twitter.com/riachops/status/1645835897773125633
    ఏప్రిల్ 12 , 2023
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    గ్లోబల్‌ స్టార్‌ కమల్‌ (Kamal Hassan) హాసన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం 'భారతీయుడు 2' (Bharateeyudu 2). స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ 'భారతీయుడు 2' (Bharateeyudu 2). హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా చేశారు. జులై 12న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్‌ 25) ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సేనాపతి పాత్రలో కమల్‌ హాసన్‌ అదరగొట్టారు. అయితే కొందరు మాత్రం కమల్‌ పాత్రను టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ట్రోల్స్‌కు కారణమిదే? 'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్‌ హాసన్‌ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికారులను ఎంతో సాహసోపేతంగా కమల్‌ హత్య చేయడం గమనించవచ్చు. అయితే వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆ వయసులో కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉంటుందని.. కానీ, సేనాపతి మాత్రం అలవోకగా స్టంట్స్‌ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్‌లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్‌ ఫ్రీడం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో కాదని హితవు పలుకుతున్నారు.&nbsp; శంకర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ 'భారతీయుడు 2'లో కమల్‌ పాత్ర గురించి వస్తోన్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ శంకర్‌ స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ, ఫైట్స్ చేస్తున్నారు. ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దాం’ అంటూ శంకర్‌ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్‌ శంకర్‌కు పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని.. లాజిక్స్‌ గురించి ఆలోచిస్తే ఏ మూవీ చూడలేరని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ట్రైలర్ ఎలా ఉందంటే? 'ఇండియన్‌ 2' నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్.. అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో.. హీరో సిద్దార్థ్‌ను ఓ స్టూడెంట్‌లా చూపించారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే పాత్రలో అతడు కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విటర్‌లో 'ఆయన మళ్లీ రావాలి' హ్యాష్‌టాగ్‌ను యూత్‌ ట్రెండ్‌ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతి చేసిన కొందరిని శిక్షించడం ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్‌ పరంగా ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను డైరెక్టర్‌ శంకర్‌ తనదైన మార్క్‌తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అనిరుధ్‌ అందించిన నేపథ్యం సంగీతం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=H1GFcXaNXHU
    జూన్ 26 , 2024
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.&nbsp; https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.&nbsp; కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.&nbsp; రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.&nbsp; శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.&nbsp; https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.&nbsp; https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.&nbsp; విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.&nbsp; దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్&nbsp; 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.&nbsp; శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్&nbsp; అభిరుచులు? &nbsp;మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్&nbsp; బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు? &nbsp;తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). దిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్‌ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్‌ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ కథను లీక్‌ చేయడం గమనార్హం.&nbsp; కథ ఏంటంటే? మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్‌ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌ను అమెజాన్‌ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) వామ్మో ఏకంగా అన్ని కోట్లా! ‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది.&nbsp; గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్‌ శంకర్‌, హీరోయిన్ జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోని కపూర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/1012_raj/status/1770365882738573469 ఆ రోజున డబుల్‌ ధమాకా! మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్‌’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్‌ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్‌ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్ లభించనుంది.&nbsp;&nbsp;
    మార్చి 20 , 2024
    Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;
    Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్‌ కపుల్‌ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్‌ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే? మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్‌ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో చేసిన ‘సిటాడెల్‌ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్‌ కూాడా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్‌ యూనిట్‌ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్‌ కూడా త్వరలో రిలీజ్‌ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.&nbsp; https://twitter.com/i/status/1770184438099410982 చైతు - సమంత మాట్లాడుకున్నారా? అమెజాన్‌ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1770045272049279412 అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి.. మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్‌ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్‌ ఇండియా వెర్షన్‌’ త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించాడు. ఇటీవల ఈ సిరీస్‌ పేరును మేకర్స్‌&nbsp; ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.&nbsp; https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
    మార్చి 20 , 2024
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
    సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్‌ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్‌’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నెట్టింట సందీప్‌ మేనియా ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్‌ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1760151102740464016 https://twitter.com/i/status/1760137348128358646 ‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’ సందీప్‌ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్‌ ప్రతినిధి సందీప్‌ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి. https://twitter.com/i/status/1758682406754861236 సందీప్‌ ఫేవరేట్‌ స్టార్లు వారే! సందీప్‌ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్‌ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్‌ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్‌ అందరికీ కాంపీటిషన్‌ పెడితే తాను ఫస్ట్‌ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్‌ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1757377128511778830 ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్‌ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.&nbsp; సందీప్‌పై హీరోయిన్‌ సెటైర్! డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; మిగతా అవార్డులు.. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగంలో.. అటు టెలివిజన్‌ విభాగంలో దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.
    ఫిబ్రవరి 21 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్‌ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు మంగళవారం ‘RX 100’ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మై నేమ్‌ ఈజ్‌ శృతి ప్రముఖ హీరోయిన్‌ హన్సిక నటించిన లేటేస్ట్‌ మూవీ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi)&nbsp;సినీ ప్రియులను థ్రిల్‌ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పార్క్‌ లైఫ్‌ విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. సప్త సాగరాలు దాటి సైడ్‌-B కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన&nbsp; (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్వేషి విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna&nbsp;MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 13 , 2023
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.&nbsp; అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్‌ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో&nbsp; ప్రచారం జరుగుతోంది.&nbsp; వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్‌ తేజ్‌ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.&nbsp;
    నవంబర్ 01 , 2023
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
    అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2&nbsp; సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.&nbsp; కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని&nbsp; డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.&nbsp; ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని&nbsp; హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.&nbsp; రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.&nbsp;
    అక్టోబర్ 26 , 2023
    <strong>Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!</strong>
    Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్‌ తరపున ఆస్కార్‌ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘కల్కి’కి అన్యాయం జరిగిందా? కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్‌ తరపున నామినేట్‌ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్‌ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్‌ స్థాయిలో సక్కెస్‌ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్‌ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్‌ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాటలో కల్కి! గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్‌ తరపున ‘ఆర్ఆర్‌ఆర్‌’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్‌ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్‌ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్‌ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో షార్ట్‌ లిస్ట్‌ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్‌ కూడా భారత్‌ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్‌ చిత్రాల కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్‌ పంపాలని చిత్ర యూనిట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్‌’ టీమ్‌ కూడా జనరల్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్‌ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ‘లాపతా లేడీస్‌’ ఎంపికకు కారణం ఇదే లాపతా లేడీస్‌ చిత్రాన్ని భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్‌ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్‌ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్‌, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. సౌత్‌ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే! ఆస్కార్‌ అవార్డుల రేసులో భారత్‌ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్‌ కోసం ఈసారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్‌ నుంచి మూడు కాగా, కోలివుడ్‌ నుంచి 6 చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్‌ - ఎస్‌.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్‌ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్‌ లైఫ్‌), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్‌ నుంచి 13 సినిమాలు ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయ్యాయి. అయితే భారత్‌ నుంచి ‘లాపతా లేడిస్‌’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.&nbsp; లాపతా లేడీస్‌ ప్రత్యేకత ఏంటి? సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్‌’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్‌’కు దర్శకత్వం వహించిన కిరణ్‌, 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!</strong>
    Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!
    యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్‌కు 28 రోజుల సమయం ఉండగానే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ప్రీ బుకింగ్స్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో రిలీజ్‌కు ముందే ‘దేవర’ రికార్డుల వేట మెుదలైందంటూ తారక్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ జోరు! తారక్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్‌ 27 ఎప్పుడు వస్తుందా అని తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ తారక్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ కూడా ‘దేవర’పై మంచి హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ‘దేవర’ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేశారు. డల్లాస్‌లోని XD స్క్రీన్స్‌లో తొలుత ఈ టికెట్స్‌ అందుబాటులోకి తీసుకొని రాగా నిమిషాల వ్యవధిలోనే అవి సేల్ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటివరకూ 19 ప్రాంతాల్లో 52 షోల కోసం టికెట్స్‌ విక్రయించారు. దాని ద్వారా ఇప్పటికే 75,727 డాలర్లు దేవర ఖాతాలోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర ప్రీ బుకింగ్‌ కలెక్షన్స్ 100K డాలర్ల దిశగా పయనిస్తున్నట్లు అక్కడి ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.&nbsp; https://twitter.com/PrathyangiraUS/status/1829778068090863715 ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 31 , 2024
    <strong>Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!</strong>
    Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!
    జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) లాంటి బ్లాక్‌ బాస్టర్‌ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్‌ డేట్‌ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!</strong>
    Kalki 2898 AD OTT: ‘కల్కి 2898 ఏడీ’ స్ట్రీమింగ్‌ డేట్‌ లాక్? ఏకంగా రెండు ఓటీటీల్లో ప్రసారం!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రెండు వారాలుగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. అగ్రకథానాయకులు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ నటనతో పాటు యంగ్‌ హీరోలైన విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ క్యామియోలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ రెండు ఓటీటీల్లోకి.. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్‌లో చూసినప్పటికీ ఓటీటీలోనూ మరోమారు కల్కి చిత్రాన్ని వీక్షించాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌, డిజిటల్‌ ప్రీమియర్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సంస్థలు ‘కల్కి’ ఓటీటీ హక్కులను కొనుగోలు చేశాయి. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల హక్కులను అమెజాన్‌ దక్కించుకోగా, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఈ రెండింటిలో కల్కి స్ట్రీమింగ్‌ అవుతుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'కల్కి'ని థియేట్రికల్ రిలీజ్‌కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు 15న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా కల్కిని స్ట్రీమింగ్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనల్లో స్ట్రీమింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కల్కిని ఓటీటీలో చూడాలని భావించేవారికి ఇంకో నెల రోజులు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; రూ.1000 కోట్లు వచ్చినట్లేనా? కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు సోమవారం (జులై 8) చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రూ.100 కోట్ల దూరంలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే కల్కి కలెక్షన్స్‌కు సంబంధించి అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చి రెండ్రోజులు అవుతుంది. సోమ, మంగళవారం వసూళ్లు ఈ రూ.900&nbsp; కోట్లకు యాడ్‌ కావాల్సి ఉంది. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ఈ రెండు రోజుల వసూళ్లు కలుపుకుంటే కల్కి రూ.1000 కోట్ల క్లబ్‌లో అలవోకగా చేరిపోనుంది. దీనిపై అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడమే తరువాయి అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.&nbsp; హిందీలో వసూళ్ల ప్రభంజనం 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి బాలీవుడ్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు మహాభారతం కాన్సెప్ట్‌తో కల్కి రావడంతో అక్కడి ఆడియన్స్‌ విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా కల్కి హిందీ వెర్షన్‌ వసూళ్లు నేటితో (జులై 10) రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటాయని ప్రముఖ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ కల్కి చిత్రం రూ.225 కోట్ల (GROSS) మైల్‌స్టోన్‌ను అందుకుంటుందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఓ స్పెషల్‌ పోస్టును పెట్టారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1810940499227742667
    జూలై 10 , 2024

    @2021 KTree