• TFIDB EN
  • మారుతీ నగర్ సుబ్రమణ్యం
    UATelugu
    సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని సంకల్పించి మరో పని చేయకుండా సుబ్రమణ్యం ఖాళీగానే ఉంటాడు. భార్య సంపాదనపై జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. ఆ డబ్బు ఎవరిది? సుబ్రమణ్యంకు జాబ్‌ వచ్చిందా? లేదా? అతడి కొడుకు అంకిత్‌ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    రివ్యూస్
    YouSay Review

    Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?

    రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అ...read more

    How was the movie?

    తారాగణం
    రావు రమేష్
    ఇంద్రజ
    అంకిత్ కొయ్య
    రమ్య పసుపులేటి
    హర్ష వర్ధన్
    అన్నపూర్ణ
    సిబ్బంది
    లక్ష్మణ్ పనిదర్శకుడు
    బుజ్జి రాయుడు పెంట్యాలనిర్మాత
    మోహన్ కార్యనిర్మాత
    కథనాలు
    <strong>Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి సమర్పణ: తబితా సుకుమార్ సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య విడుదల తేదీ : 23-08-2024 రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్‌ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం 'ఆయ్'తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్‌ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. అయితే గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్‌ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్‌ టైమింగ్‌, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్‌ లవ్‌ ట్రాక్‌, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్‌ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రావు రమేష్‌ నటనకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్‌ అంకిత్‌ లవ్‌ ట్రాక్‌ఊహాకు అందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 23 , 2024
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్‌ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ‘నా మనసుకు నచ్చితే వస్తా’ రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్‌ భార్య తబిత ప్రెజెంట్‌ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్‌ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్‌, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్‌ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్‌ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/i/status/1826302303244091491 ‘నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి’ ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ. నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీని సెపరేట్‌ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చిరుకి సింపుల్‌ విషెస్‌..! నేడు (ఆగస్టు 22) మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్‌ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్‌ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1826438293350711467 బన్నీకి పవన్‌ చురకలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్‌ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్‌ వారే జరిగింది. 
    ఆగస్టు 22 , 2024
    <strong>The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?</strong>
    The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
    వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్‌ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను&nbsp; ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది. గ్లింప్స్‌ ఎలా ఉందంటే? &nbsp;కలర్‌ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన&nbsp; ప్రభాస్ లుక్ అదిరిపోయింది.&nbsp; డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్‌ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది. https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హరర్‌ జనర్‌లో.. కల్కి సక్సెస్‌ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్&nbsp; జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్‌ జనర్‌లో తెరకెక్కుతోంది. సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్ ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను,&nbsp; అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన&nbsp; గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్‌ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; ఆ హిందీ సాంగ్ రీమిక్స్ 'రాజా సాబ్‌' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్‌ హిందీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో.. మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    జూలై 29 , 2024
    <strong>Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?</strong>
    Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?
    న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, మ‌నీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైప‌ర్ ఆది, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కృష్ణ భ‌గ‌వాన్‌, వీటీవీ గ‌ణేష్‌, సింగీతం శ్రీనివాస్‌, లీలా శాంస‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు దర్శకత్వం: జె శివసాయి వర్ధన్ సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బానెల్లా నిర్మాత: N.V కిరణ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ: మారుతి విడుద‌ల తేదీ: 13-09-2024 రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రాజ్‌తరుణ్‌ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ‘భలే ఉన్నాడే!’ సినిమాపై రాజ్‌ తరుణ్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌తరుణ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి రాధ (రాజ్‌త‌రుణ్‌) వైజాగ్‌లో శారీ డ్రాపర్‌ (అమ్మాయిల‌కు చీర క‌ట్టే వృత్తి)గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గౌరి (అభిరామి) పెంపకంలో పెరుగుతూ ఆమెకు చేదోడుగా ఉంటాడు. గౌరి ప‌ని చేసే బ్యాంకులోనే కొత్త‌గా కృష్ణ (మ‌నీషా) ఉద్యోగంలో చేరుతుంది. ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంట‌ల‌కు ఫిదా అవుతుంది. రాధ‌ మొహం కూడా చూడ‌కుండానే అత‌నిపై మ‌న‌సు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణ‌ను చూడ‌కుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖ‌లు చ‌దువుతూ త‌న‌తో ప్రేమ‌లో ప‌డిపోతాడు. వీళ్లిద్ద‌రూ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి సిద్ధ‌మ‌వ్వ‌గా నిశ్చితార్థం స‌మయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విష‌యం చెబుతుంది. దీంతో రాధ పెళ్లికి ప‌నికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? రాధ అమ్మాయిల‌కు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే రాధ పాత్ర‌లో రాజ్‌త‌రుణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నటనకు బాగా స్కోప్‌ దొరికింది. అతడి లుక్స్‌, భావోద్వేగాలు మెప్పిస్తాయి. కృష్ణ పాత్ర‌లో మ‌నీషా అందంగా క‌నిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది. త‌ల్లిగా అభిరామి పాత్ర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సింగీతం శ్రీనివాస్ క‌నిపించేది నాలుగైదు స‌న్నివేశాలైనా బలమైన ప్రభావాన్ని చూపించారు. అమ్ము అభిరామి, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర ఉంటాయి. హైప‌ర్ ఆది, నెల్లూరు సుద‌ర్శ‌న్ పాత్ర‌లు అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచుతాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే రాముడిలా ఉండాలనుకునే అబ్బాయిని నేటి సమాజం, అమ్మాయిలు ఎలా చూస్తారన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్ర‌థమార్ధం మెుత్తం హీరో, హీరోయిన్‌ ల‌వ్‌ట్రాక్‌, తల్లీకొడుకుల అనుబంధంతో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వార‌ధిగా నడిచే ప్రేమ రాయబరాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిశ్చితార్థ సమయంలో వచ్చే మలుపుతో తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉన్నాడనే నేపథ్యంతో సెకండ్‌పార్ట్‌ను తీసుకెళ్లారు. ప్ర‌థమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చ‌ప్ప‌గా సాగినట్లు అనిపిస్తుంది. హీరోను పరీక్షించేందుకు కేరళ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చేసే హంగామా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. రాధ‌-కృష్ణ విడిపోయిన తీరులోనూ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్‌ కూడా బలహీనంగా ఉండటం మరో మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ చక్కటి పనితీరు కనబరిచారు. తన అద్భుత పనితీరుతో స్క్రీన్‌ను ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చేశారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాజ్‌ తరుణ్‌ నటనకథా నేపథ్యంప్రథమార్థం మైనస్‌ పాయింట్స్‌ కమర్షియల్‌ హంగులు లేకపోవడంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..&nbsp; మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    AI Gender Swapped: జంబలకిడి పంబ అంటే ఇదే..&nbsp; మన సెలబ్రిటీలను ఇలా చూసి ఉండరు..!
    జంబలకిడి పంబ సినిమా గుర్తుందా. ఇందులోని మగవారు, ఆడవారిగాను, ఆడవారు మగవారిగానూ మారుతుంటారు. కట్టుబొట్టుతో అచ్చం తమ అపొజిట్‌ జెండర్‌గా కనిపిస్తారు. అయితే కృత్రిమ మేధ(AI) కూడా సరిగ్గా ఇదే చేసింది. టాప్‌ సెలబ్రిటీల చిత్రాలను తీసుకొని వారి జెండర్‌ను మార్చేసింది. మరి మన సెలబ్రిటీలు తమ ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారు?. మగవారు ఆడవారిలాగా, ఆడవారు మగవారిగా మారితే వారి లుక్‌ ఎలా ఉంటుంది?. తెలియాలంటే ఈ కథనం చూసేయండి. 1. నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ప్రధాని మోదీ తనదైన వేషధారణతో ఎంతో హుందాగా కనిపిస్తారు. అటువంటి మోదీ ఒక మహిళ అయితే ఎలా ఉంటాడో AI చూపించింది.&nbsp; 2. విరాట్‌ కోహ్లీ అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లీ బయట చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడు. అటువంటి విరాట్‌ కోహ్లీ.. యువతిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్‌ వేయండి. https://twitter.com/mvdhav/status/1612298825368240128?s=20 3. ఎలాన్‌ మస్క్‌ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మస్క్‌ అమ్మాయి అయితే ఎలా ఉంటారో AI చేసి చూపించింది.&nbsp; 4. అజయ్‌ దేవ్‌గన్‌ బాలీవుడ్‌&nbsp; సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ అలరించాడు. యాక్షన్‌, ఫైట్‌ సీన్లలో తనదైన నటనతో ఆకట్టున్నాడు. అలాంటి దేవ్‌గన్‌ మహిళ అయితే ఎలా ఉంటాడో AI మీ ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612299501737496576?s=20 5. అలియాభట్‌ బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తన ‌అందం, అభినయం, నటనతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అటువంటి అలియా మగాడిగా మారితే ఇంకెంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో కదా.&nbsp; 6. మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ సృష్టికర్త మార్క్‌ జూకర్‌బర్గ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కూడా తన ఆపోజిట్‌ జెండర్‌లో ఎలా ఉంటారో AI చూపించింది.&nbsp; https://twitter.com/mvdhav/status/1612300171655917568?s=20 7. దీపికా పదుకొనే బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనే ఒకరు. గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఈ భామ ఒక పురుషుడైతే ఎలా ఉంటాడో మీరే చూడండి.&nbsp; 8. అక్షయ్‌ కుమార్‌ బాలీవుడ్‌ మోస్ట్‌ ఎనర్జిటిక్‌ హీరోగా అక్షయ్‌ కుమార్ గుర్తింపు పొందారు. మహిళల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అటువంటి అక్షయ్‌ను AI వద్దల్లేదు. ఈ హీరో అమ్మాయిగా పుడితే ఎలా ఉంటాడో కళ్లకు కట్టింది.&nbsp; https://twitter.com/mvdhav/status/1612300512698986498?s=20 9. ప్రభాస్‌ బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కెరీర్‌ మారిపోయింది. ఆ సినిమా ప్రభాస్‌కు పాన్‌ ఇండియా క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మరి ప్రభాస్‌ అమ్మాయిగా మారితే ఎలా ఉంటాడో ఒక లుక్కేయండి.&nbsp; 10. లియోనార్డో డికాప్రియో టైటానిక్‌&nbsp; సినిమా ద్వారా లియోనార్డో డికాప్రియా పేరు మారుమోగింది. ఆ తర్వాత కూడా పలు హిట్‌ చిత్రాలతో లియోనార్డో మంచి గుర్తింపు సంపాదించాడు. హాలీవుడ్‌ హీరోయిన్ల అందానికి ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మాయి లుక్‌లో లియోనార్డో ఉన్నాడు.&nbsp; https://twitter.com/mvdhav/status/1612301198668992513?s=20 11. లియోనెల్ మెస్సీ అర్జెంటినా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనాల్‌ మెస్సీ.. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు కూడా అమ్మాయి లుక్‌లో ఎలా ఉంటాడో AI మార్ఫింగ్‌ చేసి చూపించింది.&nbsp; 12. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు. మహిళగా రొనాల్డో లుక్‌ ఎలా ఉందో చూసేయండి.&nbsp; https://twitter.com/mvdhav/status/1612301499228655616?s=20 13. రాక్ హాలీవుడ్‌ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవాళ్లలో రాక్‌ తెలియని వారు ఉండరు. కండలు తిరిగిన దేహంతో ఎన్నో సూపర్‌ హిట్‌ యాక్షన్‌ సినిమాల్లో ఆయన నటించాడు. అటువంటి రాక్ మహిళగా మారితే ఎలా ఉంటాడు? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. 14. నోరా ఫతేహి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహి కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరి నోరా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి. https://twitter.com/mvdhav/status/1612301736508784641?s=20 15. షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుక్‌ ఖాన్‌.. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‌అటువంటి షారుక్‌ మహిళగా మారితే ఎలా ఉంటాడో చూడాలని ఉందా. అయితే చూసేయండి.&nbsp; 16. బాబా రాందేవ్‌ యోగా గురు బాబా రాందేవ్‌ అంటే దేశంలో తెలియని వారు ఉండరు. ఎంతో కఠినమైన ఆసనాలను సైతం చాలా తేలికగా ఆయన వేస్తుంటారు. అయితే బాబా రాందేవ్‌ ఫొటోను మహిళ చిత్రంగా మార్చడంలో AI విఫలమైంది. కేవలం ఆయన్ను యంగ్‌గా మాత్రమే మన ముందు ఉంచింది. https://twitter.com/mvdhav/status/1612302529223880705?s=20 17. ముకేష్‌ అంబానీ దేశంలోని అపర కుభేరుల్లో ముకేష్ ‌అంబానీ ఒకరు. రిలయన్స్‌ ఇండస్ట్రీ కింద అనేక వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. అటువంటి అంబానీ మహిళగా మారితే ఎలా ఉంటారో చూడండి.&nbsp; 18. మోనాలిసా ప్రపంచంలోని అత్యంత అందమైన చిత్ర పటాల్లో మోనాలిసాది తొలి స్థానంలో ఉంటుంది. అలాంటి మోనాలిసా అబ్బాయిగా మారితే ఎలా ఉంటుందో AI చేసి చూపించింది.&nbsp; https://twitter.com/mvdhav/status/1612302687500120064?s=20
    మే 05 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    <strong>Prabhas New Movie: ప్రభాస్‌ నెక్స్ట్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. ‘స్పిరిట్‌’ ప్లేస్‌లో మరో చిత్రం!</strong>
    Prabhas New Movie: ప్రభాస్‌ నెక్స్ట్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. ‘స్పిరిట్‌’ ప్లేస్‌లో మరో చిత్రం!
    ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్‌ మరో స్థాయికి వెళ్లింది. దీంతో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రభాస్‌ ఇప్పటికే డైరెక్టర్‌ మారుతీతో ‘రాజా సాబ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి’ సీక్వెల్‌లోనూ ప్రభాస్‌ నటించాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్‌ తర్వాతి చిత్రం కోసం స్టార్‌ డైరెక్టర్లు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యూలో ఉన్నారు. వీరిద్దరిలో ముందుగా సందీప్‌ రెడ్డి సినిమాను ప్రభాస్‌ సెట్స్‌పైకి తీసుకెళ్తారని అంతా భావించారు. అయితే వీటిని కాదని ప్రభాస్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ డైరెక్టర్‌కే ప్రిఫరెన్స్‌! 'కల్కి 2898 ఏడీ' తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తారని ఫ్యాన్స్‌ సహా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా సందీప్‌ ప్లేస్‌లోకి డైరెక్టర్‌ హను రాఘవపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ గతంలోనే ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో అక్టోబర్‌లో షూటింగ్‌ మెుదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; జవాన్‌గా ప్రభాస్‌! ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రానున్న ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశముంది. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ‘రాజా సాబ్‌’ టీమ్ బిగ్‌ ప్లాన్‌! ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో 'రాజా సాబ్‌' (Raja Saab) తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇందులో ఒకప్పటి సూపర్ హిట్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. అయితే అది తెలుగు పాట కాదని సమాచారం. 1980లో హిందీలో వచ్చిన ఓ సూపర్‌ హిట్‌ పాటను రీమిక్స్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు టాక్‌. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’ డేరింగ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్‌ ఒక్కరే ఫిక్స్‌ కాగా ఇతర నటీనటులను ఫైనల్‌ చేసే పనిలో సందీప్‌ ఉన్నారు. అయితే స్పిరిట్‌ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్‌ తాజాగా ఒక హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ‘కొందరు యానిమల్‌ నా బెస్ట్ వర్క్‌ అంటున్నారు. నా బెస్ట్ వర్క్‌ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్‌ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సందీప్‌ తీసిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలకంటే 'స్పిరిట్‌' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్‌ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పారు. అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
    జూలై 18 , 2024
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.&nbsp; ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.&nbsp; భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.&nbsp; గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.&nbsp; వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.&nbsp; అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.&nbsp;
    జనవరి 17 , 2024
    Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
    Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్‌ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్‌, కామెడీ, రొమాంటిక్‌ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్‌ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లుఅర్జున్‌ ఒక లోపంతో కనిపిస్తాడు. ‌అతడి కుడి భుజం సహజంగా కంటే మరీ పైకి ఉంటుంది. సినిమా అంతా బన్నీ అలాగే ఉంటాడు. భుజాన్ని అలాగే పైకి పెట్టి షూటింగ్‌లో పాల్గొనటం ఎంతో కష్టంగా అనిపించిందని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చాడు.&nbsp;&nbsp; రంగస్థలం రామ్‌చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి పెదాల కదలికలను బట్టి మాటలను ఆర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ చెవిటి తనమే చెర్రీకి సమస్యగా మారుతుంది. తనను ఎవరూ చంపారో అన్న చెప్పినప్పటికీ అది బుచ్చిబాబు చెవికి ఎక్కదు. చివరకు విలన్‌ ప్రకాష్‌రాజ్‌ అని తెలుసుకొని చంపేయడంతో కథ సుఖాంతమవుతుంది. రాజా ది గ్రేట్‌ మాస్‌ మహారాజా రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమా టాలీవుడ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. బ్లైండ్‌గా ఉంటూ రవితేజ చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని నిలదొక్కుకునేలా చేసింది.&nbsp;&nbsp; సూర్య vs సూర్య యంగ్‌ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్‌ జన్యుపరమైన లోపంతో బాధపడుతుంటాడు. అతడి శరీరంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటంతో పగటివేళ బయటకు వెళ్తే 15 నిమిషాల్లో చనిపోతాడని వైద్యులు చెబుతారు. దీంతో రాత్రివేళ మాత్రమే హీరో బయటకు వస్తుంటాడు. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.&nbsp; భలే భలే మగాడివోయ్ హీరో నాని, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాని మతిమరుపుతో బాధపడుతుంటాడు. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతూ నవ్వులు పూయించాడు. అయితే అతడికున్న ఆ సమస్య కొన్ని చిక్కులను సైతం తెచ్చిపెడుతుంది. హీరోయిన్‌తో తన ప్రేమకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.&nbsp; సవ్యసాచి నాగచైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలకు పూర్తి భిన్నం. ఇందులో హీరో ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌’ అనే లోపంతో బాధపడుతుంటాడు. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడమే ఈ సమస్యకు కారణం. ఇందులో నాగచైతన్య మెదడు, ఎడమ చేయి కవల సోదరుడి ఆధీనంలో ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కొత్త ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించనప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; నా పేరు సూర్య&nbsp; అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య‘. ఇందులో బన్నీ సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బన్నీకి విపరీతమైన కోపం ఉంటుంది. దాంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. ఇందులో అల్లుఅర్జున్‌ అగ్రెసివ్‌ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp;
    మే 31 , 2023
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.&nbsp; Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.&nbsp; Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.&nbsp; Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.&nbsp; Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.&nbsp; Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.&nbsp; Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    2022లో మార్మోగిన దర్శకులు వీరే
    2022లో మార్మోగిన దర్శకులు వీరే
    ]కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ రూపొందించే మారుతి పక్కా కమర్షియల్‌తో బోల్తా పడ్డాడు. కానీ ప్రభాస్‌తో సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ను మోత మోగించారుమారుతి
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    <strong>Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!</strong>
    Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!
    టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్‌ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ పేరు మరోమారు మార్మోగుతోంది. రూ. 2 కోట్లు విరాళం&nbsp; కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్‌ టీమ్‌ ప్రకటించింది. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్‌ రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. అండగా సెలబ్రిటీలు! ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్‌ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్‌ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్‌ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్‌ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్‌ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్‌ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1821114197213626764 డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు.&nbsp; లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్‌ సభ్యులు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్‌ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఆగస్టు 07 , 2024
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.&nbsp; డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఏప్రిల్ 23 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో&nbsp; పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987&nbsp; పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.&nbsp; పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.&nbsp; పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.&nbsp; పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ (Save The Tigers S1 &amp; S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.&nbsp; పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    Nidhi Agarwal: నిధి అగర్వాల్ డ్రీమ్.. ఒక కలగానే మిగిలి పోనుందా? ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏంటో..!
    టాలీవుడ్‌లో టాప్ హీరోల సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. నాయికగా కెరీర్‌లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలంటే ఒకట్రెండు పెద్ద సినిమాల్లో నటించాల్సిందే. అప్పుడే రీచ్ పెరిగి హీరోయిన్లకు ఆదరణ మొదలవుతుంది. బడా ప్రాజెక్టులో నటిస్తున్నారంటే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ చూపు కూడా హీరోయిన్‌పై పడుతుంది. అలా అవకాశాలు మెరుగవుతాయి. అచ్చం ఇలాగే హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఫీలయ్యింది. కానీ, బర్త్ డే(Nidhi Agarwal BirthDay) రోజున ఈ అమ్మడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిందట. కారణం ఏంటో చూద్దాం.&nbsp; అదృష్టమేనా.. టాప్ హీరోతో బడా సినిమాలో ఛాన్స్ రావడం ఒక రకంగా అదృష్టమే. చాలా మంది ఎగిరి గంతేస్తారు. నిధి అగర్వాల్ కూడా దాదాపు ఇలాంటి ఫీలింగ్‌‌నే ఎక్స్‌ప్రెస్ చేసింది. ప్రస్తుతం నిధి చేతిలో అరకొర సినిమాలు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ బ్యూటీ. చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా గొప్ప విషయమని ఇటీవల నిధి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. కల నిజమైందంటూ చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఇదే కల కలగానే మిగిలి పోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం.. ‘హరిహర వీరమల్లు’ భవితవ్యమే.&nbsp; https://twitter.com/AgerwalNidhhi/status/1680791420440023040?s=20 రెండేళ్లకు పైగా.. సాధారణంగా పెద్ద సినిమా చిత్రీకరణకు కాస్త సమయం పడుతుంది. ప్రారంభం నుంచి రిలీజ్ వరకు కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. కానీ, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వచ్చిన పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ 2021లో వచ్చింది. భారీ తారాగణంతో బిగ్ బడ్జెట్ చిత్రంగా దీనిని తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో మళ్లయోధుడి పాత్ర పోషిస్తున్నారు. నిధితో పాటు సోనాల్ చౌహాన్, బాబీ డియోల్ ఇందులో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెరుగుతున్న ఆందోళన.. ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ పది కాలాల పాటు సాగాలంటే కచ్చితంగా చిత్రాలు విజయం సాధించాలి. అప్పుడే అవకాశాల ద్వారాలు మూసుకు పోకుండా ఉంటాయి. గ్లామర్ డోజ్ ఏ మాత్రం తగ్గకూడదు. వీటన్నిటితో పాటు సమయ పాలన తప్పనిసరి. ఎక్కడ చిన్న లోపం జరిగినా సినిమా అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే రిలీజైన సినిమాలు హిట్ కావాలి. నిధి అగర్వాల్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా మిగతా ప్రాజెక్టులు పెద్దగా ఆదరణను పొందలేక పోయాయి. కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ అవకాశంతో ఇక సెట్ అయిపోయినట్లేనని భావించింది. కానీ, చిత్ర షూటింగ్ వాయిదా పడుతున్న కొద్దీ నిధిలో ఆందోళన పెరిగిపోతోందని టాక్. అసలు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు నిధిని భయపెట్టిస్తున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్. దీంతో ఈ సినిమానైనా త్వరగా వస్తుందేమో అన్న ఆశ అమ్మడిలో నెలకొంది.&nbsp; వెయిట్ చేయాల్సిందే హరిహర వీరమల్లు, ప్రభాస్-మారుతిల సినిమాలు ఈ ఏడాది రిలీజయ్యే అవకాశాలు లేవు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలంటే నిధి మరో ఏడాది కాలం ఆగాల్సిందే. ఆ లోపు తనని మరచిపోకుండా ఉండటానికి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. నిధి మల్టీ టాలెంటెడ్. ఈ అమ్మడు డ్యాన్సర్ కూడా. జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేస్తుంది.&nbsp;&nbsp;
    ఆగస్టు 17 , 2023
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; 1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రోల్స్ రాయిస్ ఫాంటమ్&nbsp; ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్&nbsp; చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్&nbsp; ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. 2. విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన &amp; విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. 3. ప్రైవేటు జెట్‌ చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 4. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.&nbsp; 5. అంజనా ప్రొడక్షన్స్‌ 1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి.&nbsp; 6. కేరళ బ్లాస్టర్స్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.&nbsp; 7. చిరంజీవి బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్‌ 1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.&nbsp; 8. చిరంజీవి నెట్‌వర్త్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. &nbsp;
    ఆగస్టు 22 , 2023

    @2021 KTree