రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
శ్రీలీల
నితీష్ నిర్మల్
రితూ పీ సుద్
రాజేంద్ర ప్రసాద్
నవీన్ చంద్రన్
సిబ్బంది
భాను భోగవరపుదర్శకుడు
నాగ వంశినిర్మాత
తమన్ ఎస్
సంగీతకారుడునవీన్ నూలి
ఎడిటర్ర్కథనాలు
Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్- పూరి కాంబో మరోసారి హిట్ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటి?
మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా.
సినిమా ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది. పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే?
ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
రామ్ పొత్తినేని నటన
పూరి డైరెక్షన్
సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు
మైనస్ పాయింట్స్
లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్
కొన్ని పాటలు
తీర్పు: ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5
ఆగస్టు 16 , 2024
Pushpa 3: బన్నీ ఫ్యాన్స్‌ను దారుణంగా మోసం చేసిన సుకుమార్.. ఎలాగంటే?
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది. థియేటర్లలో మాస్ జాతరను సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకూ థియేటర్లలో పుష్పగాడి రూలే నడుస్తోంది. హీరో అల్లు అర్జున్ మరోమారు అవార్డు విన్నింగ్ నటనతో ఆకట్టుకున్నాడని ఆడియన్స్ అంటున్నారు. అటు సుకుమార్ సైతం తన మార్క్ మేకింగ్‌తో మెస్మరైజ్ చేశాడని పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ విషయంలో మాత్రం సుకుమార్ తమను మోసం చేశాడని ఆడియన్స్ ఫీలవుతున్నారు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ గ్లింప్స్ సీన్స్ మిస్సింగ్..
‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సుకుమార్ మెుట్ట మెుదటగా ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఒక గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అందులో పుష్ప మిస్సింగ్ అంటూ ప్రజలు అల్లర్లకు దిగుతారు. స్మగ్లింగ్ చేసిన డబ్బుతో పుష్ప చేసిన మేలును చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు మీడియా ఛానల్స్ సైతం పుష్ప ఎక్కడ? అంటూ వార్తలు ప్రసారం చేస్తాయి. ఈ క్రమంలో అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. ఈ గ్లింప్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’పై భారీగా అంచనా పెరగడానికి కారణమైంది. అయితే తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంలో గ్లింప్స్‌లోని ఒక్క సీన్ కూడా కనిపించలేదు. దీంతో సుకుమార్ తమను దారుణంగా మోసం చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2023 ఏడాదికి గాను బిగ్గెస్ట్ ప్రాంక్ వీడియో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/letscinema/status/1643488166421356547
https://twitter.com/SodiReddyUnOffl/status/1864529905733530018
నెక్ట్స్ పార్ట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా?
‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ వచ్చిన గ్లింప్స్‌లోని సన్నివేశాలు ‘పుష్ప 3’లో కనిపించే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఓ భారీ బాంబ్ బ్లాస్ట్‌ను చూపించారు. అది కూడా పుష్ప అటెండ్ అయిన పెళ్లిలో జరుగుతుంది. పుష్పను టార్గెట్ చేసి శత్రువులు ఈ బ్లాస్ట్ చేయిస్తారు. ఈ ఘటన తర్వాత పుష్ప కనిపించకుండా పోయే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంచనా వేస్తారు. అతడు బతికున్నాడో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురై ఇలా అల్లర్లకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పార్ట్ 2 క్లైమాక్స్‌లో పుష్పకి కొత్త శత్రువులు యాడ్ అవ్వడం, ఇంటర్నేషనల్ స్థాయిలో స్మగ్లింగ్‌కు తెరలేపడంతో ‘పుష్ప 3’ (Pushpa 3) మరింత ఆసక్తికరంగా ఉండొచ్చని తెలుస్తోంది.
పుష్ప 3 ఎప్పుడంటే?
‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం అందరి దృష్టి మూడో భాగంపై పడింది. ఈ మూవీ (Pushpa 3 Release Date) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా మెుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకుంటే పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అటు సుకుమార్ సైతం రామ్ చరణ్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నాడు. ఐదేళ్ల కాలాన్ని పుష్పకు అంకితం చేయడంతో సుకుమార్ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ‘RC 17’పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అటు బన్నీ, ఇటు సుకుమార్ తమ ప్రాజెక్ట్‌లను ఫినిష్ చేసుకున్న తర్వాతే ‘పుష్ప 3’ని పట్టాలెక్కించనున్నారు. దీనికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2028లో ఈ సినిమా (Pushpa 3) పట్టాలెక్కవచ్చని అంచనా వేస్తున్నాయి.
బన్నీపై NHRCకి ఫిర్యాదు!
మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్ (NHRC) వద్దకు చేరింది. ఈ విషయంపై ఓ న్యాయవాది NHRCకి ఫిర్యాదు చేశారు. పోలీసు యాక్ట్ కింద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఘటనకు కారకులైన నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రాసుకొచ్చారు. కాగా, ఈ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమీషన్ స్వీకరించింది. త్వరలోనే నోటీసులు పంపే ఛాన్స్ ఉంది.
https://twitter.com/tupaki_official/status/1864948492453523637
డిసెంబర్ 06 , 2024
Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్ రోల్స్ చేసిన ఏకైక హీరోగా ఘనత!
తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా.
1.Apoorva Sahodarulu (1986)
బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు.
2. Ramudu Bheemudu (1988)
రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు.
3. Brahmarshi Viswamitra (1991)
నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
4. Aditya 369 (1991)
ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు.
5. Maatho Pettukoku (1995)
ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు.
6. Sri Krishnarjuna Vijayam (1996)
సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు.
7. Peddannayya (1997)
బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు.
8. Sultan (1999)
శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు.
9. Chennakesava Reddy (2002)
మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు.
10. Allari Pidugu (2005)
జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు.
11. Okka Magadu (2005)
బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు.
12. Pandurangadu (2008)
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు.
13.Simha (2010)
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది.
14. Parama Veera Chakra (2011)
దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు.
15. Adhinayakudu (2012)
పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు.
16. Legend (2014)
బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు.
Balakrishna's Legend Movie First Look Posters
17. Akhanda (2021)
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది.
18. Veera Simha Reddy (2023)
గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
నవంబర్ 09 , 2023
Ustaad Bhagat Singh: ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్ గట్టి కౌంటర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్ ఇచ్చేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరో గ్లింప్స్ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’
భగత్ బ్లేజ్(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8
అధికార వైసీపీకి గట్టి కౌంటర్!
ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్’ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1770055005283688593
పొలిటికల్ హీట్ పెంచిన డైలాగ్స్!
మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
మార్చి 19 , 2024
Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్ తెప్పించిన డైలాగ్స్.. ఓ లుక్కేయండి!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ నటన, యాస, బాడీ లాంగ్జేవ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న జీవించేసిందంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీకి సుకుమార్ ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించిందని చెబుతున్నారు. డైలాగ్స్ (Pushpa 2 Dialogues) కూడా సినిమాలో బాగా పేలాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రారంభ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ ఉన్న హైలెట్ డైలాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ఎంట్రీ డైలాగ్
జపాన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ను చూపించారు దర్శకుడు సుకుమార్. పుష్ప నుంచి ఎర్ర చందనం తీసుకున్న జపాన్ డీలర్లు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఈ క్రమంలో కంటైనర్‌లో దుడ్డుతో పాటు వెళ్లిన పుష్ప వారికి చిక్కుతాడు. ఈ క్రమంలో వచ్చే ఎంట్రీ డైలాగ్ హైలేట్‌గా నిలుస్తుంది. జపాన్ భాషలో బన్నీ మాట్లాడటం విశేషం.
పుష్ప రాజ్: హలో! బాగుండారా? నా జపాన్ బ్రదర్స్. (జపాన్ భాషలో)
ఎప్పటి నుండో నా సరుకు యాడికెళ్తుందో సూడాలని అనుకునే వాడిని. ఇన్నాళ్లకు కుదిరుండాది. అంటూ బన్నీ తనను బంధించిన వారిపై విరుచుకుపడతాడు.
కమెడియన్ సత్య : యో.. ఏందప్ప నీకు జపాన్ భాష వచ్చా?
పుష్ప రాజ్ : నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్ భాష (30 రోజుల్లో జపాన్ నేర్చుకోవడం ఎలా అనే బుక్‌ను చూపిస్తూ) నేర్చుకున్నాలే అప్ప. ఎట్టా ఉండాది నా జపనీస్ భాష.
సత్య: అదిరి పోయింది.. అదిరిపోయింది. ఇంతకీ జపాన్ ఎందుకు వచ్చినావ్ అప్ప?
పుష్పరాజ్ : జపాన్‌కు దుడ్డు (ఎర్ర చందనం) వచ్చింది గానీ, డబ్బు రాలేదప్ప. ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చినా..
సత్య: పైసలు కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావా?
పుష్పరాజ్: నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైన ఉన్నా అయినా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు.
పుష్పరాజ్: ఐయామ్ యూనివర్స్ బాస్.. పుష్ప ఈజ్ ద బాస్ (జపాన్ భాషలో)
పోలీసు స్టేషన్ డైలాగ్స్
ఎర్ర చందనం తరలిస్తున్న పుష్ప రాజ్ మనుషులను ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పట్టుకొని జైల్లో వేస్తాడు. తన వారికోసం స్టేషన్‌కు వచ్చిన పుష్ప చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.
పుష్ప: పుష్ప: నా పిల్లకాయలను లోపల ఏశావా ఏంది? ఒక గంటలో మా శీను గాడి (జైల్లో ఉన్న వ్యక్తి) పెళ్లి ఉండాది. వాళ్లని తోలుకపోవడానికి వచ్చిన.
సీఐ: శీనుగాడి పేరున ఎఫ్‌ఐఆర్ రాశారు. మెుత్తం 230 మంది. ఒక్కరు తక్కువైనా లెక్క తేడా వస్తాది.
పుష్ప: అట్నా.. రేయ్ (తన పక్కన ఉన్న వారితో) మన వాళ్లలో శ్రీనివాస్ ఎవరు ఉన్నార్రా. (ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకు వస్తాడు)
సీఐ: అదెట్లా కుదిరిద్ది పుష్ప. ముందు మాదిరి లేదు పుష్ప. రూల్స్ అన్నీ మారిపోయాయ్.
పుష్ప : సీఐ గారికి రూల్స్ మారి పోయాయంట్రా. నేను చెప్పేదా రూల్ ఏంటో. చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఈడ జరిగేదంతా ఒకటే రూలు. అది పుష్పగాడి రూలు.
సీఎంతో మీటింగ్ అప్పుడు..
ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్ప బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి సూచిస్తుంది. దీంతో సీఎంతో ఫొటో దిగేందుకు శాలువ కప్పుతుండగా సీఎం హేళన చేస్తూ చెప్పే డైలాగ్ కథను మలుపు తిప్పుతాయి.
ఎంపీ సిద్ధప్ప: పుష్ఫ భార్య మంచి ఫొటో అడిగుండాది. ఫొటో బాగా తీయ్ (కెమెరామెన్‌తో)
సీఎం: ఏంటీ సిద్దప్పు నువ్వు..
ఎంపీ సిద్దప్ప: ఏ అన్నా..
సీఎం: ఈ స్మగ్లర్లు.. పార్టీకి ఫండ్ ఇచ్చినంత ఈజీగా మనం ఫొటోలు ఇవ్వలేం. చెప్పులు కాళ్లను మోస్తున్నాయని చేతులకు తొడుక్కుంటామా ఏందీ.
సీఎం: సిద్దప్ప.. పిల్లోడు కదా. పెళ్లాం మాట విని ఫొటోల కోసం వచ్చుంటాడు. పుష్ప.. పెళ్లాం మాట విని బాగుపడినోడు ఎవ్వడు లేడు. మదిలో పెట్టుకో.
సీఎంతో మీటింగ్ తర్వాత..
సీఎం చెప్పిన మాటలకు బాగా హార్ట్ అయిన పుష్ప బయటకు వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. సీఎంతో మాట్లాడిన కొద్దిసేపటికి ఎంపీ సిద్దప్ప (రావు రమేష్) బయటకు వస్తాడు. ఈ క్రమంలో పుష్ప - సిద్ధప్ప మధ్య వచ్చే సంభాషణ సినిమాకు కీలక మలుపు తిప్పుతుంది.
పుష్ప: ఏం.. సార్. పని అయ్యుండాదే?
ఎంపీ సిద్దప్ప: శాఖ ఏంటో తెలీదు గానీ.. మినిస్ట్రీ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం దుడ్డు (లంచం) ఎక్కువ తడపాలా!
పుష్ప : అది కాదు.. షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ట్రాన్స్‌ఫర్ అయ్యుండాదా అని అడుగుతున్నా?
ఎంపీ సిద్దప్ప: కుదరదు అన్నాడప్ప. పోలీసు వాళ్లతో సర్దుకుపోవాలి గానీ వచ్చిన ప్రతీ వాడితో కలియపెట్టుకొని ట్రాన్సఫర్ కోరితే కుదరదన్నాడప్పా. నువ్వు కూడా వద్దన్నావని విడిచేసినా.
పుష్ప: వాడు వద్దనడం వేరు.. నేను వద్దనడం వేరు. చాలా తేడా ఉండాది.
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప మాట మారుతుండాది? సీఎం గారిని ఆడు ఈడు అంటున్నావ్. ఫొటో ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్ కదా.
పుష్ప : అదేం లేదప్ప. సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. రేపు ఏ సీఎం అయినా అలాగే అంటాడు.
ఎంపీ సిద్దప్ప: నేను అయితే అలా ఎందుకు అంటా? శుభ్రంగా ఇస్తా
పుష్ప : ఏందీ.. ఫొటో ఇస్తావా?
ఎంపీ సిద్దప్ప: ఇస్తానప్పా.. ఎందుకు ఇవ్వను..
పుష్ప : అయితే మీరే సీఎం (సిద్దప్ప వెంటనే షాకవుతాడు)
ఎంపీ సిద్దప్ప: ఏందీ (షాక్‌లో)
పుష్ప : మీరే సీఎం అప్పా..
ఎంపీ సిద్దప్ప: నేను సీఎం ఆ.. (నవ్వుతూ) మతి ఉండే మాట్లాడుతున్నావా?
పుష్ప: ఏమప్పా.. పుష్ప లాంటోడ్ని పక్కన పెట్టుకొని పిల్లి పిత్రి పదవులు (మంత్రి) ఏంటి సామి. పెద్దగా ఆలోచించండి సారు. నా పక్కన పుష్ప లాంటోడు ఉంటే నేను అట్లనే ఆలోచిస్తా.
ఎంపీ సిద్దప్ప: ఆలోచించొచ్చు గానీ.. సీఎం అంటే చాలా అవుద్దీ అప్పా.
పుష్ప : ఎంత అవుతది?
ఎంపీ సిద్దప్ప: తక్కువలో తక్కువ రూ.100 కోట్లు.
పుష్ప : రూ.500 కోట్లు ఇస్తా.. సరిపోద్దా (థియేటర్లలో ఒకటే విజిల్స్)
ఎంపీ సిద్దప్ప: అంత డబ్బు ఎట్టా తెస్తావప్పా?
పుష్ప: దుడ్డు (డబ్బు) గురించి పుష్పకు వదిలేసి.. ఢిల్లీ వెళ్లి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు)ను కలవండి.
జగపతి బాబుతో ఫస్ట్ ఫోన్‌కాల్..
కేంద్ర మంత్రి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు) సింగ్‌తో పుష్ప ఫోన్‌లో మాట్లాడే సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సీఎం సీటు గురించి ఎంపీ సిద్దప్ప అతడితో మాట్లాడుతున్న క్రమంలోనే ప్రతాప్ సింగ్ సోదరుడ్ని పుష్ప కలిసి రూ.5 కోట్లు ఇస్తాడు. దీంతో తన అన్నకు ఫోన్ చేసి ఆ డబ్బు గురించి చెప్తాడు. అప్పుడు పుష్ప-ప్రతాప్ సింగ్ సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
పుష్ప: హలో.. నమస్తే! నా పేరు పుష్ప. మార్కెట్‌లో అందరూ ఎర్ర చందనం పుష్ప అంటుంటార్లే.
ప్రతాప్‌సింగ్: తెలుసప్పా.. కొండారెడ్డి పావలా వాటానే కదా నువ్వు. వింటూనే ఉన్నా.
పుష్ప: నువ్వు పావల వాటా గాడితో మాట్లాడుతున్నావ్ అనుకుంటే.. నేను క్వారీలో లారీ ఆపే గుమస్తా గాడితో మాట్లాడుతున్నాని ఫీలవ్వాల్సి వస్తది. చరిత్రలు ఎందుకులే అన్నా తవ్వుకోవడం.
ప్రతాప్‌సింగ్: ఏందీ ఆ రూ.5 కోట్ల కథ.
పుష్ప: అది నీకు కాదులే అన్న. నీతోడ బుట్టినోడికి. ఫోన్ కలిపిచ్చినందుకు. ఎన్ని దినాలు పాత సోఫాలో కూర్చొని ఉంటావ్. నీకో కొత్త కూర్చి పంపిస్తాలే. దాంట్లో కూర్చో.
పుష్ప: సోఫా అంటే మామూలు సోఫా కాదన్న అది. చానా కాస్ట్లీ సోఫా. రూ.25 కోట్ల రూపాయల సోఫా అది.
ప్రతాప్ సింగ్: ఏ టెండర్ కోసమో చెప్పు. క్వారీనా? మైనింగా?. స్టేట్‌లో ఏ పక్క కావాలో చెప్పు.
పుష్ప: హా హా హా.. మెుత్తం స్టేటే కావాలా. సిద్దప్ప స్టేట్‌కి సీఎం కావాలా.
ప్రతాప్ సింగ్: నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా?
పుష్ప: సరిపోద్ది అన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి. ఒకసారి ఇచ్చినాక కాదనడానికి లే. కళ్లకద్దుకొని తీసుకోవాల్సిందే. సిద్దప్ప సీఎం అయ్యేది ఖాయం. కాదంటే నాకాడా చాలా సోఫాలు ఉన్నాయిలే.
ప్రతాప్ సింగ్‌తో మీటింగ్ తర్వాత
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప ఇది ఫోన్ కనిపినోడికి రూ.5 కోట్లు, మాట్లాడినోడికి రూ.25 కోట్లా. ఇట్టా సింటికేట్ డబ్బంతా పొప్పులు, బెల్లాల మాదిరి పంచుకుంటూ పోతే ఎవరు సమాధానం చెప్పేది.
పుష్ప: నీకు ఇచ్చే లెక్క మారదు సారు.. సిండికేట్‌కు వచ్చే లెక్క మారుద్ది.
ఎంపీ సిద్దప్ప: టన్నుకు అదే రూ.కోటిన్నర లెక్క.. ఎట్లా మారుద్ది.
పుష్ప: మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకు రూ.50 లక్షలు.. మురుగన్‌కు అమ్మితే టన్ను రూ.కోటిన్నర. అదే మురుగన్ అమ్మేటోడికి మనం పోగలిగితే..
ఎంపీ సిద్దప్ప: ఆశ్చర్యం, ఆనందం కలసిన ముఖంతో
పుష్ప: పుష్పగాడి చూపు దేశం దాటేసుండాది. ఏందీ.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్‌నేషనల్..
ఇంటర్నేషనల్ స్మగ్లర్‌తో డీల్..
స్మగ్లర్: పుష్ప రెండక్షరాలు.. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బడా.. బూమ్
పుష్ప: సౌండ్ నచ్చుండాదా నీకు.. ఇప్పుడు దందా మాట్లాడదాం చెప్పబ్బా.
స్మగ్లర్: మాల్ ఎంత (హిందీలో)
పుష్ప: 2000 టన్నులు (ఎర్ర చందనం)
స్మగ్లర్: హా హా హా.. టన్నుకు ఎంత?
పుష్ప : రూ. రెండున్నర కోట్లు
స్మగ్లర్: జోక్ చేస్తున్నావా? పుష్ప
పుష్ప: దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది.
స్మగ్లర్: సరే 2000 టన్నుల మాల్ రూ.5000 కోట్లు
పుష్ప: కాదు.. రూ.4,900 కోట్లు
స్మగ్లర్: రూ.100 కోట్లు ఎందుకు తగ్గించావ్ పుష్ప? మాల్ సరిపడ లేదా?
పుష్ప: మిగతా రూ.100 కోట్లకి నవ్వుతూ.. (హెలికాఫ్టర్ తీసుకొని వెళ్లిపోతాడు)
సిండికేట్ మీటింగ్ సమయంలో..
సిండికేట్ సభ్యులు: షెకావత్ మన కోసం కాచుకొని ఉన్నాడు. ఈ సమయంలో అంత సరుకు పంపించడం కరెక్టెనా?
పుష్ప: కరెక్టో కాదో పుష్ప ఆలోచించడప్ప.. ఒరు నిర్ణయం తీసుకుంటాడు. అది కరెక్ట్ అవుతుంది అంతే.
పుష్ప - రష్మిక సంభాషణ
ఓ సీన్‌లో శ్రీవల్లి (రష్మిక) కాలుకి దెబ్బ తగలుతుంది. పుష్ప స్వయంగా ఆమె కాలు పట్టుకొని మందు రాస్తుంటాడు. అప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్ క్యూట్‌గా అనిపిస్తాయి.
శ్రీవల్లి: కాలు వదిలేయ్ సామి..
పుష్ప: ఏమి..
శ్రీవల్లి: అసలే మీరు పుష్పరాజ్. పెళ్లా కాలు పట్టుకుంటాడని నాకు మాట రానీకు.
పుష్ప: ఏయ్.. పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్ తగ్గేదేలే (అంటు శ్రీవల్లి కాలితో తన గడ్డని నిమురుతాడు)
పుష్ప - షెకావత్
ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో జరిగిన దానికి పుష్ప సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు పుష్ప- షెకవాత్ మధ్య వచ్చే సంభాషణ వారి మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచుతుంది.
ఎంపీ సిద్దప్ప: పుష్ప చెప్పేయప్పా
పుష్ప: సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి.
పుష్ప: సరే.. సారీ
షెకావత్ : బ్రహ్మాజీతో పుష్ప సారీ చెప్పింది విన్నావా?
బ్రహ్మాజీ: సారీ చెప్పింది కాదు సార్.. చెప్పాడు అనాలి.
షెకావత్: పుష్ప ఫైర్ అయ్యుంటే చెప్పాడు అనేవాడ్ని.. సారి చెప్పి ఫ్లవర్ అయ్యాడుగా అందుకే చెప్పింది.
‘పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’
జాతర సందర్భంలో వచ్చే డైలాగ్స్
అజయ్: వీరందర్నీ కొట్టినావని చెప్పి నిన్ను మాలో కలుపుకోవాలా? నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే.
శ్రీవల్లి: యో పెద్ద మనిషి నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది.
పుష్ప అమ్మ: శ్రీవల్లి.. పెద్ద చిన్న చూసి మాట్లాడు.
శ్రీవల్లి: నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమోగానీ, ఎవడైనా నా మెుగుడ్ని అంటే నేను ఊరుకుండేదే లేదు.
కిడ్నాపర్లకు పుష్పరాజ్ మాస్ వార్నింగ్
సినిమా చివర దశకు చేరుకునే క్రమంలో అజయ్ కూతుర్ని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఓ న్యూస్ ఛానెల్ వేదికగా కిడ్నాపర్లకు పుష్పరాజ్ ఇచ్చే వార్నింగ్ హైలెట్ అనిపిస్తుంది.
పుష్పరాజ్: నా పేరు పుష్ప.. పుష్ప రాజ్. మీరు నాకు పరిచయం అక్కర్లేదు పాయింట్‌కు వస్తున్నా.
పుష్పరాజ్: బిడ్డను ఎత్తుకు పోతార్రా మీరు.. అంత దమ్ముండాదా? కొడ**రా. ఇప్పుడు చెబుతున్నా చెవులు పెద్దవి చేసుకొని వినండి.
పుష్పరాజ్: మీకు ఈ క్షణం నుంచి గంట టైమ్ ఇస్తాండా. ఆ బిడ్డను యాడ నుంచి ఎత్తుకెళ్లారో ఆడనే దింపాలా. అట్ట పోయి ఇట్ట వచ్చినట్లుండాలా.
పుష్పరాజ్: అట్ట కాదని ఆ బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా..
మెగా ఫ్యామిలీకి కౌంటర్లుగా అనిపించే డైలాగ్స్
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్ చర్చనీయాంశమవుతున్నాయి. చిరు ఫ్యామిలీకి కౌంటర్‌గా వాటిని మూవీలో పెట్టారన్ని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.
‘మీ బాస్‌కే నేను బాస్’
'ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు'
‘నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు’
'ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు'
'పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా'
‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా?
'ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’
డిసెంబర్ 05 , 2024
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్‌లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024
Eagle Movie Review: ‘ఈగల్’లో రవితేజ మాస్ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు : రవితేజ, కావ్య థాపర్, అనుపమా పరమేశ్వరన్, మధు, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, నితిన్ మెహతా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: దావ్‌జాంద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్, కమిల్ ప్లాకి, కర్మ చావ్లా
నిర్మాతలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
విడుదల తేది: 09-02-2024
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా (Eagle Movie Review) కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? అనుపమ, కావ్య తమ అందాలతో ప్రేక్షకులను అలరించారా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తలకోన అడవిలోని ఓ గిరిజన తండాలో జీవించే సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. అనుకోకుండా ఓ రోజు అతడు మిస్ అవుతాడు. ఓ విషయాన్ని అన్వేషిస్తూ ఆ తండాకు వచ్చిన క్రైమ్ ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్టు నళిని రావు (అనుపమా పరమేశ్వరన్) దృష్టి అతడిపై పడుతుంది. అతడి అదృశ్యంపై ఓ ఆర్టికల్ రాయగా వెంటనే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? ఎక్కడికి వెళ్లాడు? అతని గురించి పేపర్లో చూసి సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సహదేవ్ భార్య రచన (కావ్య)కి ఏమైంది? అక్రమ ఆయుధాలతో హీరోకు ఉన్న సంబంధం ఏంటి? ఈ లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
మాస్ మహారాజ్ రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్ వర్మ పాత్రలో నటించాడు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినప్పటికీ స్టైలిష్ లుక్‌తో కళ్లతోనే తన హావభావాలను పలకించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి పాత్రే దక్కింది. నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ సినిమా మెుత్తం ఆమెనే కనిపిస్తుంది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ తమ కామెడీ ట్రాక్‌తో నవ్వించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. గన్ కల్చర్‌ను ప్రధానాంశంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించారు. రవితేజకు కేజీఎఫ్ స్థాయిలో ఎలివేషన్స్ ఇచ్చిన తీరు బాగుంది. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్‌లో చూపించి ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్. అయితే రవితేజ మార్క్ కామెడీని ఆశించే వారికి ఈ సినిమా నిరాశనే మిగిలిస్తుంది. సినిమా మెుత్తం మాస్ మాహారాజ్ సిరియస్ లుక్‌లోనే కనిపిస్తాడు. మరోవైపు సినిమాను చాప్టర్లుగా విడగొట్టి చూపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపించినా ఓవరాల్‌గా సినిమా మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలాగే ఉంటుంది.
టెక్నికల్‌గా..
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు కూడా ‘ఆడు మచ్చ’, ‘గల్లంతు’ వంటివి వినడానికే కాదు విజువల్‌గా కూడా బాగున్నాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటనహీరో ఎలివేషన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ సాగదీతలాజిక్‌కు అందని సీన్లు
రేటింగ్: 3/5
ఫిబ్రవరి 09 , 2024
Pushpa 2: ‘పుష్ప 2’ టీజర్‌లో ఉండేది ఇదేనా? ఆ రోజున ఫ్యాన్స్‌కు మాస్ జాతరే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన ఫోకస్ అంతా ‘పుష్ప 2’ (Pushpa 2) పైనే పెట్టాడు. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో దానికి సీక్వెల్‌గా వస్తోన్న సెకండ్ పార్ట్‌పై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే న్యూస్ వెల్లడించారు.
ఆ రోజున గ్రాండ్ ట్రీట్!
తాజాగా పుష్ప 2 (Pushpa 2: The Rule) సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌తో ఇచ్చారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఇది జాతర సీక్వెన్స్‌కి సంబందించిన బన్నీ గెటప్ పోస్టర్. కేవలం కాలు మాత్రమే కనిపించేలా పోస్టర్‌ను డిజైన్ చేసి విడుదల చేసారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘పుష్ప 2’ టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీజర్‌లో ఉండేది అదేనా?
తాజా పోస్టర్‌ను బట్టి ఈ టీజర్‌లో జాతరకు సంబంధించిన సన్నివేశాలు ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బన్నీ జాతర లుక్ ఫ్యాన్స్‌లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. దీంతో సీన్‌కు సంబంధించిన కట్‌నే టీజర్‌లో ఇస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఏది ఏమైనా దీనిపై ఏప్రిల్ 8న స్పష్టత రానుంది. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. దుబాయిలో ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచాడు.
ఏప్రిల్ 02 , 2024
#AskNani: ఫ్యాన్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
దసరా చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.
దసరా రన్‌టైమ్
#Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్ టైమ్ రివీల్ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636016970473828353
ఫుల్ బిందాస్
సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.
https://twitter.com/NameisNani/status/1636015575284748288
స్ట్రాంగ్ రిప్లై
రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636005865101877255
ఫన్నీ సమాధానం
నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.
https://twitter.com/NameisNani/status/1636006778805837824
ఎవరైనా ఒక్కటే
నేచురల్ స్టార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1636004611210502150
ఒరిజినల్ పీస్
సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.
మార్చి 16 , 2023
Vishwak Sen: పవన్ కల్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ సేన్ రొమాన్స్.. క్రేజీ కాంబో లోడింగ్!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ మాస్ కా దాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘VS14’లో హీరోయిన్ ఫిక్స్!
విష్వక్ సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహనన్ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు.
యాక్షన్ డ్రామా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
రెండోసారి ఖాకీ పాత్రలో..
విష్వక్ సేన్ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ : ది ఫస్ట్ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్ రోల్‌లో విష్వక్ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విష్వక్ బిజీ బిజీ..
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 24 , 2024
VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్ వచ్చేసిందిగా!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ మాస్ కా దాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆ మూవీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
యాక్షన్ డ్రామా..
యంగ్ హీరో విష్వక్ సేన్ తాజాగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
రెండోసారి ఖాకీ పాత్రలో..
విష్వక్ సేన్ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ : ది ఫస్ట్ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్ రోల్‌లో విష్వక్ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విష్వక్ బిజీ బిజీ..
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
ఆగస్టు 06 , 2024
Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!
అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేసింది. రవితేజ, రామ్, బాలకృష్ణ, నితీన్, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ‘భగవంత్ కేసరి’ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేశారు. మహేష్ ‘గుంటూరు కారం’ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్‌తో ఈ అమ్మడు మరోమారు బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది.
నాగచైతన్యకు జోడీగా..
నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు (Karthik Dandu) ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. 'NC24' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, SVC క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా ఎంపికైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తొలుత ఈ పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)ని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. లుక్స్ టెస్ట్ కూడా ఆదివారం (డిసెంబర్ 15) జరిగిందని, మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. దీంతో తెరపై చైతూ-శ్రీలీల జోడీ తెరపై ఎలాంటి మాయ చేస్తుందోనని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు.
https://twitter.com/klapboardpost/status/1868499773554409475
కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ..
‘అమరన్’తో సాలిడ్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 'SK25' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నటుడు జయం రవి, అధర్వ కీలక పాత్రల పోషించనున్నారు. రూ.150 కోట్ల బడ్టెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. తమిళంలో శ్రీలీలకు ఇదే మెుట్ట మెుదటి ఫిల్మ్. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రానికి 'పురనానూరు' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇది రానున్నట్లు సమాచారం.
https://twitter.com/MovieTamil4/status/1868647066563686816
చేతి నిండా ప్రాజెక్ట్స్..
నితీన్ లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robin Hood)లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్. రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న 'మాస్ జాతర' (Mass Jathara) చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా చేస్తోంది. 'ధమాకా' (Dhamaka) తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అఖిల్ అక్కినేని (Akkineni Akhil) అప్‌కమింగ్ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా రానున్న 'కోహినూర్' (Kohinur) చిత్రంలోనూ శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని శ్రీలీల దూకుడు ప్రదర్శిస్తోంది.
https://twitter.com/GulteOfficial/status/1868525815597850925
డిసెంబర్ 16 , 2024
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్ ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.
‘ఓ పిల్ల’ సాంగ్ రిలీజ్
విష్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s
సాంగ్ ఎలా ఉందంటే?
రాఖీ (విష్వక్ సేన్), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్ అజీజ్ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్ ఎప్పటిలాగే తన క్లాసిక్ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
‘లైలా’గా విష్వక్
విష్వక్ మెకానిక్ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
https://twitter.com/HanuNews/status/1808353426721407104
పోలీసు ఆఫీసర్‌గా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్ చేశాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 18 , 2024
Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్!
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్‌కు 28 రోజుల సమయం ఉండగానే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ప్రీ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో రిలీజ్‌కు ముందే ‘దేవర’ రికార్డుల వేట మెుదలైందంటూ తారక్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ జోరు!
తారక్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 27 ఎప్పుడు వస్తుందా అని తారక్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ తారక్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ కూడా ‘దేవర’పై మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ‘దేవర’ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. డల్లాస్‌లోని XD స్క్రీన్స్‌లో తొలుత ఈ టికెట్స్ అందుబాటులోకి తీసుకొని రాగా నిమిషాల వ్యవధిలోనే అవి సేల్ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటివరకూ 19 ప్రాంతాల్లో 52 షోల కోసం టికెట్స్ విక్రయించారు. దాని ద్వారా ఇప్పటికే 75,727 డాలర్లు దేవర ఖాతాలోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర ప్రీ బుకింగ్ కలెక్షన్స్ 100K డాలర్ల దిశగా పయనిస్తున్నట్లు అక్కడి ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
https://twitter.com/PrathyangiraUS/status/1829778068090863715
ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్ ఎడిటింగ్ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్ 15న టాప్ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్‌పై దేవర టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మూడో పాటకు రంగం సిద్ధం!
దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్ పెంచేశారు. ఇక దేవర థర్డ్ సాంగ్ మాస్ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కానునట్లు తెలుస్తోంది.
తారక్ డబుల్ షేడ్ చూశారా..
దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/DevaraMovie/status/1828291026936832064
ప్రమోషన్స్‌పై ఫోకస్!
దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
ఆగస్టు 31 , 2024
Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్? ఆ రోజున టాప్ లేచిపోవాల్సిందే!
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' (Devara). 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్ ఎడిటింగ్ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్ 15న టాప్ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్‌పై దేవర టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మూడో పాటకు రంగం సిద్ధం!
దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్ పెంచేశారు. ఇక దేవర థర్డ్ సాంగ్ మాస్ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కానునట్లు తెలుస్తోంది.
తారక్ డబుల్ షేడ్ చూశారా..
దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/DevaraMovie/status/1828291026936832064
ప్రమోషన్స్‌పై ఫోకస్!
దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
ఆగస్టు 28 , 2024
VD12: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే న్యూస్.. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రెండు భాగాలుగా..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. 'VD 12' అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం. గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్ చేసిన చిత్రాలన్నీ సింగిల్ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ కెరీర్‌లోనూ సీక్వెల్స్ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.
ఆకట్టుకున్న ఫస్ట్ లుక్!
'VD12' చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మాస్ లుక్‌లో కనిపించాడు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు' అని ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.
డ్యుయల్ రోల్‌లో..!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.
ఆగస్టు 05 , 2024
VD12 Leaked Pic: ‘VD12’ సెట్ నుంచి విజయ్ దేవరకొండ ఫొటో లీక్.. నెట్టింట రచ్చ రచ్చ!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు యూత్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. అయితే గత కాలంగా ఇండస్ట్రీలో విజయ్‌కు కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్దగా దారుణంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
విజయ్ పిక్ వైరల్!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' చిత్రం రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో షూటింగ్ సెట్ నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో బైక్‌పై వెనక కూర్చుని మాస్ లుక్‌లో కనిపించాడు. తలపై లైట్ హెయిర్, ముఖాన గడ్డంతో మెస్మరైజ్ చేసేలా అతడి లుక్ ఉంది. ఇది చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో సంతోషంతో ఊగిపోతున్నారు. మరో బ్లాక్‌బాస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
https://twitter.com/king_ntr9999/status/1815611065381896259
థియేటర్లు బద్దలే!
‘VD 12’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ మాస్‌లుక్‌కు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు తోడైతే ధియేటర్లు బద్దలు కావాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘VD 12’లో విజయ్ లుక్ చూస్తుంటే ‘యువ’ సినిమాలో మాధవన్ గుర్తుకు వస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో ఆమె ప్లేస్‌లో భాగ్యశ్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
https://twitter.com/Rebelstarpr/status/1815667163178656207
డ్యుయల్ రోల్‌లో రౌడీ బాయ్!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా లీకైన ఫొటోను చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా లీకైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
క్యూట్ లవ్‌స్టోరీ!
విజయ్ దేవరకొండ ‘VD 12’తో పాటు మరో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి దిల్‌రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి (Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇటీవల టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
జూలై 23 , 2024
Tollywood Debut Actress in 2023: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్ వీరే!
ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం.
ఆషికా రంగనాథ్
కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.
ప్రియా భవాని శంకర్
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్ అప్‌కమింగ్ మూవీ 'అహం బ్రహ్మాస్మి' లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్ 'భారతీయుడు-2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
టీనా శిల్పరాజ్
'రైటర్ పద్మభూషణం' సినిమా ద్వారా టీనా శిల్పరాజ్ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది.
రెబా మోనికా జాన్
ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది.
గీతిక తివారి
రానా సోదరుడు అభిరామ్ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అహింస'. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ఐశ్వర్య మీనన్
నిఖిల్ హీరోగా చేసిన 'స్పై' (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ హీరోగా చేస్తున్నాడు.
యుక్తి తరేజా
కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సాక్షి వైద్య
యంగ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రగతి శ్రీవాస్తవ
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన చిత్రం 'పెద్ద కాపు'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది.
నుపుర్ సనన్
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది.
వైష్ణవి చైతన్య
బేబి చిత్రం ద్వారా 'వైష్ణవి చైతన్య' (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసింది.
డిసెంబర్ 15 , 2023
Pushpa 2 Review: అల్లు అర్జున్ మాస్ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల: 05-12-2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించి మరింత హైప్ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో గ్లామర్ డోస్ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్ సుకుమార్ పుష్ప రాజ్ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్, మైండ్ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్ ఇంట్రో, పుష్ప - షెకావత్ టామ్ అండ్ జెర్రీ ఫైట్, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్ వేశారు సుకుమార్.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ నటనయాక్షన్ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం
మైనస్ పాయింట్స్
తేలిపోయిన విలనిజంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3.5/5
డిసెంబర్ 05 , 2024
Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది!
తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్‌తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్‌తో కూడిన కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్‌లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటంటే..
భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్ ఖాన్ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు.
సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు ఆ బుడ్డోడికి షారుఖ్ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్ రాథోడ్‌కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే?
ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్‌కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో షారుఖ్ లుక్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
విలన్‌గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.
నయనతార షారుఖ్‌తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు.
ఎలా ఉందంటే?
డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్‌ను చాలా ఎంగేజింగ్ నడిపించి ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు. ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.
సెకండాఫ్‌లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.
టెక్నికల్ పరంగా
జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్‌లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు.
బలాలు:
షారుఖ్ నటన
ఇంటర్వల్ ట్విస్ట్
క్లైమాక్స్ సీన్స్
BGM
బలహీనతలు
సెకాండాఫ్‌లో ముందే ఊహించదగిన సీన్లు
చివరగా:
జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్‌లు లాజిక్‌లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్‌ను పరిచయం చేస్తుంది.
రేటింగ్
4/5
సెప్టెంబర్ 07 , 2023