• TFIDB EN
  • మాస్టర్
    UATelugu2h 59m
    జేడీ (విజయ్) కాలేజ్‌లో ప్రొఫసర్‌గా పనిచేస్తుంటాడు. కాలేజీ యాజమాన్యానికి మాత్రం జేడీ ప్రవర్తన నచ్చదు. ఈ క్రమంలో జరిగిన స్టూడెంట్ ఎన్నికల్లో కాలేజీ యాజమాన్యం గొడవలు సృష్టించి అతడిని కళాశాల వదిలి వెళ్లేలా చేస్తుంది. ఆ తరువాత జేడీ జువైనల్ హోంకు టీచర్‌గా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన జేడీకీ అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విజయ్
    విజయ్ సేతుపతి
    మహేంద్రన్
    మాళవిక మోహనన్
    ఆండ్రియా జెరెమియా
    అర్జున్ దాస్
    మాస్టర్ అక్షయ్ కుమార్
    శంతను భాగ్యసరాజ్
    గౌరీ కిషన్
    నాసర్
    అళగం పెరుమాళ్
    సిబి భువన చంద్రన్
    కులపుల్లి లీల
    రమ్య సుబ్రమణియన్
    రాజేష్
    మహానది శంకర్
    ప్రవీణ్
    అరుణ్ అలెగ్జాండర్
    రాజా రాణి పాండియన్
    సాయి ధీనా
    రమేష్ తిలక్
    చేతన్
    మాథ్యూ వర్గీస్
    సుధ
    రవిశంకర్
    అజిత్ కోశి
    రాహుల్ కన్నన్
    సునీల్ రెడ్డి
    కల్యాణి నటరాజన్
    మోనా
    విశాలిని
    సురేఖ వాణి
    సౌందర్య బాల నందకుమార్
    లింటు రోనీ
    ధీనా
    లల్లూ
    ఉదయరాజ్
    పూవయ్యార్
    శ్రీమాన్
    సంజీవ్ వెంకట్
    శ్రీనాథ్
    ప్రేమ్ కుమార్
    నాగేంద్ర ప్రసాద్
    సంగీత వి
    మాస్టర్ శక్తి
    మాస్టర్ భావజ్
    బ్రిగిడా సాగా
    వాసంతి
    సిబ్బంది
    లోకేష్ కనగరాజ్
    దర్శకుడు
    S. జేవియర్ బ్రిట్టోనిర్మాత
    ఎస్ఎస్ లలిత్ కుమార్నిర్మాత
    జగదీష్ పళనిసామినిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    సత్యన్ సూర్యన్ ISC
    సినిమాటోగ్రాఫర్
    ఫిలోమిన్ రాజ్
    ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు రచన &amp; దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్‌ సంగీతం : సాయి చరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా ఎడిటర్‌ : కార్తిక్ ఉన్నవ నిర్మాతలు : రవితేజ, సుధీర్‌ కుమార్ కుర్రు విడుదల తేదీ : 23-02-2024 హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్‌ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్‌ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్‌ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్‌ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్‌ సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.&nbsp; టెక్నికల్‌గా ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్‌ చేసిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్‌ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ హర్ష నటనకామెడీ&nbsp;సంగీతం మైనస్‌ పాయింట్స్ పసలేని క్లైమాక్స్‌&nbsp;లాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,&nbsp; ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.&nbsp; పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.&nbsp; ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌&nbsp; తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.&nbsp; వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో&nbsp; ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.&nbsp; డాక్టర్లు ఏమన్నారు? &nbsp;రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని&nbsp; గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.&nbsp; అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా&nbsp; బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.&nbsp; బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 29 , 2024
    <strong>Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!</strong>
    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!
    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించే తారక్‌ను కలిసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ఓ క్రేజీ బజ్‌ టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.&nbsp; ‘స్పిరిట్‌’లో విలన్‌గా తారక్‌? ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా కలిసిన నేపథ్యంలో ఈ రూమర్‌ బయటకొచ్చింది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp; ఎక్కడ కలిశారంటే? సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పిరిట్‌లో తారక్‌ నటిస్తాడా? లేదా? అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం వీరిద్దరు కలవడానికి ఓ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 9) వీరు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో కోసం ముంబయికి వెళ్లారు. రేపు (సెప్టెంబర్ 10) అక్కడే దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్ ఉన్న సందీప్‌ రెడ్డి వంగాను తారక్‌ కలిసినట్లు తెలుస్తోంది. వీరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటో ఆ విధంగా బయటకు వచ్చిందేనని సమాచారం.&nbsp; తారక్‌తో స్పెషల్‌ ఇంటర్యూ! దేవర ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్‌ రెడ్డి వంగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మధ్య క్రేజీ ఇంటర్యూ కూడా జరిగినట్లు బాలీవుడ్‌లో మీడియా కోడై కూస్తోంది. ‘దేవర’ సినిమాకు సంబంధించి తారక్‌ను సందీప్‌ రెడ్డి వంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై తారక్‌ అదిరిపోయే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మాస్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ఇద్దరి మధ్య ఇంటర్యూ ఎలా ఉంటుందోనని తారక్‌, సందీప్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ఇంటర్యూ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.&nbsp; ట్రైలర్‌ రన్‌టైమ్‌ ఫిక్స్‌! రేపు విడుదల కాబోయే దేవర ట్రైలర్ రన్‌టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌&nbsp; 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్‌ కూడా యాక్షన్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్‌ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!
    Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!
    మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్‌ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్‌ స్పాట్‌ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్‌ లుక్‌ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్‌ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు తారక్‌ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్‌ ఛేంజర్‌’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; వెంటాడుతున్న లీకుల బెడద! ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్‌ షూటింగ్‌ స్పాట్ నుంచి హీరోయిన్‌ కియారా ఫొటోలు లీక్‌ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్‌ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.&nbsp; https://twitter.com/i/status/1769462838765240477 https://twitter.com/i/status/1769381487143776301 దసరా, సంక్రాంతి పరిశీలన! గేమ్‌ ఛేంజర్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్‌. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్‌ ఛేంజర్‌'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్‌ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్‌ పనులు ప్లానింగ్‌ చేసుకొని డేట్‌ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.&nbsp; చిరు - చరణ్‌ - తారక్.. బిగ్‌ ఫైట్‌! అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్‌’ ఫిక్స్‌ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్‌ ఫైట్‌ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కలిసి నటించిన తారక్‌తో రామ్‌ చరణ్‌ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్! ఇక గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్‌'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్‌ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp;
    మార్చి 18 , 2024
    <strong>Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్‌.. దాని వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఉందా?</strong>
    Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్‌.. దాని వెనక మాస్టర్‌ ప్లాన్‌ ఉందా?
    యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్‌ సేన్‌ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్‌. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్‌, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; కుర్ర హీరోలతో క్లోజ్‌గా.. కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరారు. యువ విష్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్‌ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్‌ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్‌ సక్సెస్‌ మీట్‌కు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్‌ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్‌ ఫొటోలు దిగి హల్‌చల్‌ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్‌ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్‌, బాలయ్య అండగా నిలుస్తున్నారు.&nbsp; మాస్టర్‌ ప్లాన్ ఉందా? ఇండస్ట్రీలో విజయ్‌ దేవరకొండ, అడివి శేష్‌, నవీన్‌ పొలిశెట్టి, నిఖిల్‌, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్‌, సిద్ధులనే బాలకృష్ణ, తారక్‌ ఎంకరేజ్‌ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్‌-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్‌. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్‌ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్‌, సిద్ధులను ఎంకరేజ్‌ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్‌ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్‌ చేసేందుకు తారక్‌, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌కు పోటీగా..! విజయ్‌ దేవరకొండ సోదరులకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్‌ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్‌ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్‌ చాలా ఒత్తిడి ఫేస్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్‌ మద్దతుతో విష్వక్‌ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్‌, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విష్వక్‌, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్‌ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్‌' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్‌(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్‌ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.&nbsp; ప్రభాస్‌కు మాస్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు. https://twitter.com/SumanthOffl/status/1670414528235073537?s=20 RAPOకు డ్యాన్స్ శిక్షణ యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్... RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. https://twitter.com/RamUniversal1/status/1670429314993594368?s=20 మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని&nbsp; ఫుల్ సాంగ్‌లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు. https://twitter.com/avinashgoud00/status/1670430461372534785?s=20 1500 సినిమాలకు కొరియోగ్రఫీ రాకేశ్ మాస్టర్‌ ఒకానొక దశలో టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20 జనసేనకు ఓటు వేస్తా.. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్‌కే వేస్తానని పేర్కొన్నారు. https://twitter.com/Vamsitweetzz/status/1670428040638386181?s=20 శేఖర్‌కు లైఫ్‌ ఇచ్చాడు.. తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.&nbsp; https://www.facebook.com/watch/?v=188462650858056 శేఖర్‌ మాస్టర్‌తో చెడింది ఇక్కడే.. శేఖర్ మాస్టర్‌ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్‌కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్‌కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే... తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు. అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్‌ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్‌గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్‌ అయ్యాక రాకేష్ మాస్టర్‌కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..
    జూన్ 19 , 2023
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో 'దివ్య శ్రీపాద' ఒకరు. రీసెంట్‌గా 'సుందరం మాస్టర్‌' (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు 'డియర్‌ కామ్రేడ్‌', 'కలర్ ఫొటో', 'మిస్ ఇండియా', 'జాతి రత్నాలు' వంటి హిట్&nbsp; చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం దివ్య శ్రీపాద అసలు పేరు? దివ్య దృష్టి దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది? 1996, సెప్టెంబర్ 5న జన్మించింది దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది? దివ్య శ్రీపాద హైదరాబాద్‌లో జన్మించింది. దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా? డియర్ కామ్రెడ్ (2019)&nbsp; దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్‌సిరీస్ హెడ్స్ అండ్ టేల్స్(2021) దివ్య శ్రీపాద ఎత్తు ఎంత? 5 అడుగుల 6గుళాలు&nbsp; దివ్య శ్రీపాద అభిరుచులు? కూకింగ్ దివ్య శ్రీపాద&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్?&nbsp; వైట్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ దివ్య శ్రీపాద ఏం చదివింది? MBA దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది. దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. https://www.youtube.com/watch?v=P1fCyBtJyC0 దివ్య శ్రీపాద ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/divyasripada/
    ఏప్రిల్ 29 , 2024
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం &nbsp;సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.&nbsp; సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
    మార్చి 21 , 2024
    <strong>Kanguva: రాజమౌళిని అనుసరించి దెబ్బతిన్న 'కంగువా'.. ఆ సినిమాలు కూడా ఇంతే!</strong>
    Kanguva: రాజమౌళిని అనుసరించి దెబ్బతిన్న 'కంగువా'.. ఆ సినిమాలు కూడా ఇంతే!
    దేశం గర్వంచతగ్గ డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి అగ్రస్థానంలో ఉంటాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఆయన తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకొని సినిమాలు తీయడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు. అందుకే ఇప్పటివరకు జక్కన్న నుంచి వచ్చిన 12 చిత్రాలు దేనికదే ఎంతో ప్రత్యేకతను సాధించాయి. ఆడియన్స్‌ దృష్టిలో ఎవర్‌గ్రీన్‌ సినిమాలుగా నిలిచాయి. అయితే రాజమౌళి తరహాలో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రాజమౌళి చిత్రాలను పోలిన కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. రీసెంట్‌గా కంగువా సైతం రాజమౌళి చిత్రాల ప్యాట్రన్‌లోనే వచ్చి ఆడియన్స్‌ను నిరాశపరిచింది. అందుకు కారణాలు ఏంటి? కంగువా తరహాలో జక్కన్నను అనుసరించి దెబ్బతిన్న చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘బాహుబలి’తో పోల్చి తప్పు చేశారా? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ చిత్రం నవంబర్‌ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాజమౌళిని ఆహ్వానించడం, టాలీవుడ్‌కు బాహుబలి ఎలాగో కోలివుడ్‌కు 'కంగువా' అంటూ ప్రచారాలు హోరెత్తించడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కంగువా రిలీజ్ తర్వాత పరిస్థితులు తలకిందులైనట్లు తెలుస్తోంది. బాహుబలితో పోల్చే విధంగా సినిమాలో స్టఫ్‌ లేదని చూసినవారు చెబుతున్నారు. కథ చెప్పడంలో దర్శకుడు శివ పూర్తి తడబడ్డాడని అంటున్నారు. భావోద్వేగాలను రగిలించడంలో రాజమౌళి దిట్ట. కానీ కంగువాకు వచ్చే సరికి ఎమోషన్స్‌ ఏమాత్రం పండలేదని అంటున్నారు. సినిమాలోని పాత్రలతో ఆడియన్స్ ప్రయాణం చేయలేకపోయామని చెబుతున్నారు. ఒక్క సూర్య నటన కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు.&nbsp; ఆ చిత్రాలు కూడా అంతే! ‘కంగువా’ తరహాలో గతంలో పలు చిత్రాలు జక్కన్నను అనుసరించి అపజయాన్ని మూటగట్టుకున్నాయి. జూ.ఎన్టీఆర్‌ - మేహర్ రమేష్‌ కాంబోలో వచ్చిన 'శక్తి' (2011) కూడా ‘మగధీర’ తరహాలో మెప్పించాలని వచ్చి బోల్తా పడింది. ‘మగధీర’ లాగే ‘శక్తి’ కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలీయా భట్‌ నటించిన 'బ్రహ్మాస్త్ర' భారీ బడ్టెట్‌తో వచ్చి మెప్పించలేకపోయింది. జక్కన్న తరహాలో మంచి విజువల్‌ వండర్‌గా ఈ మూవీ ఉంటుందని అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. సాలిడ్‌ కంటెంట్‌ లేకపోవడంతో ప్రేక్షకులు ఆదరించలేదు. అలాగే కోలివుడ్‌లో వచ్చిన 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రం కూడా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. తొలి భాగం బాగున్నా సెకండాఫ్‌ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. RRR తరహాలో బ్రిటిష్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షంషేరా’ సైతం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తమిళంలో వచ్చిన ‘పులి’, మలయాళంలో వచ్చిన ‘మరక్కర్‌’ జక్కన్న మూవీ తరహాలో పెద్ద బజ్‌ క్రియేట్‌ చేసినప్పటికీ సక్సెస్‌ మాత్రం కాలేకపోయాయి.&nbsp; జక్కన్న సక్సెస్ మంత్ర ఇదే! రాజమౌళి సినిమా అనగానే చాలా మంది గొప్ప తారాగణం, భారీ బడ్జెట్‌, అద్భుతమైన గ్రాఫిక్స్‌, ఎవర్‌గ్రీన్‌ స్టోరీ అని అనుకుంటారు. అవన్నీ ఉండబట్టే రాజమౌళి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారని భావిస్తుంటారు. కానీ రాజమౌళి సక్సెస్‌ వాటిలో లేదు. అవి సక్సెస్‌కు దోహదం చేసే కీలక అంశాలు మాత్రమే. జక్కన్న సక్సెస్‌ ఫార్మూలా మరోటి ఉంది. అదే ఎమోషనల్‌ డ్రామా. చాలా సినిమాల్లో మిస్‌ అయ్యేది, జక్కన్న మాత్రమే క్యారీ చేసేది ఇదే. తన సినిమాల్లో ఎమోషన్స్‌కు రాజమౌళి పెద్ద పీట వేస్తారు. సినిమా సక్సెస్‌కు అది ఎంతో కీలకమని నమ్ముతారు. ప్రేక్షకుడు, తన సినిమాలోని పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ను రాజమౌళి క్రియేట్ చేస్తుంటారు. తద్వారా ఆడియన్స్‌ను తన మూవీ లీనం చేస్తారు. అందుకే జక్కన్న సినిమా చూసి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. తిరిగి మళ్లీ మళ్లీ చూసేలా ప్రోత్సహిస్తాయి. అసలు జక్కన్న ఏం తీశాడురా అన్న భావనను ఆడియన్స్‌లో కలుగుచేస్తాయి. అందుకే చాలా మంది దర్శకులు దీనిని అందిపుచ్చుకోలేక విఫలమవుతున్నారు.&nbsp; జక్కన్న బిజీ బిజీ.. RRR తర్వాత రాజమౌళి (S.S. Rajamouli), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)ల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా SSMB 29 ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండటంతో మంచి లోకేషన్స్‌ కోసం సౌతాఫ్రికాలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌‌ (Naomi Scott)ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసే వారణాసి సెట్‌లో ఫినిష్‌ చేసి ఆ తర్వాత సెకండ్‌ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;</strong>
    Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;
    ‘RRR’ తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్‌ రిలీజ్‌ తేదీని చిత్ర బృందం లాక్‌ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్‌ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; టీజర్‌ ఎప్పుడంటే? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ జరగనున్నట్లు వెల్లడించారు. లక్నోలోనే ఎందుకు? గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్‌ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ గేమ్‌ ఛేంజర్‌ గురించి చర్చ జరిగేలా ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్‌ చేస్తారో లేదో చూడాలి.&nbsp; ఇదే తొలి చిత్రం! తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ ఇప్పటివరకూ ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్‌’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్‌’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్‌ అయిన చిత్రాలు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్‌ తెలుగు ఫిల్మ్‌. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్‌ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి. ఆ ఫైట్‌ సినిమాకే హైలెట్‌! ఇటీవల టీజర్‌ సూన్ అంటూ గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో చరణ్‌ ఓ టేబుల్‌ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్‌ ఛేంజర్’ ఇంట్రడక్షన్‌ సీన్‌ అని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ మాబ్‌ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్‌ హెలికాఫ్టర్‌ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్‌ వస్తుందని చెబుతున్నారు. రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>SSMB29: తప్పును సరిదిద్దుకునే పనిలో రాజమౌళి.. మహేష్‌ మూవీతో ఆ విమర్శలకు చెక్‌!</strong>
    SSMB29: తప్పును సరిదిద్దుకునే పనిలో రాజమౌళి.. మహేష్‌ మూవీతో ఆ విమర్శలకు చెక్‌!
    ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా హిట్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్‌ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకధీరుడు చాలా బిజీగా ఉన్నారు. అయితే గత చిత్రాలకు భిన్నంగా ‘SSMB29’ కోసం రాజమౌళి వర్క్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ జక్కన్న తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; రాజమౌళి మాస్టర్ ప్లాన్! మహేష్‌ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్‌ షూట్‌ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్‌ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు, షూటింగ్‌ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్‌ చేయవచ్చని మాస్టర్‌ ప్లాన్‌ వేశారట. దీంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ఆ విమర్శలకు చెక్‌ దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్‌ చేసే వీలు పడుతుందని అంటున్నారు. 'SSMB 29' చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్‌ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి తరహాలో.. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి పిరియాడికల్‌ డ్రామాలను అందించిన రాజమౌళి, మహేష్‌ కోసం కూడా అటువంటి కథనే రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. 225 ఏళ్ల క్రితం నాటి స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాకు తగ్గట్లుగా నటీనటులని వందల ఏళ్ల నాటి గిరిజన తెగ లుక్స్ తెచ్చేలా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని నిర్మాత కె.ఎల్‌. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను బుక్‌ చేసినట్లు చెబుతున్నారు.&nbsp; కథకు ప్రేరణ అతడే! మహేష్‌ - రాజమౌళి చిత్రం ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
    సెప్టెంబర్ 21 , 2024
    <strong>Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?</strong>
    Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?
    నటీనటులు : భాను ప్రకాష్‌, సృజన్‌, మణి ఏగుర్ల, మోహన్‌ భగత్‌, రవీందర్‌ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ, తదితరులు రచన, దర్శకత్వం : అనంత్‌ వర్ధన్‌ సంగీతం :&nbsp; సంజీత్‌ ఎర్రమిల్లి సినిమాటోగ్రఫీ : ముత్యాల సునీల్‌ ఎడిటర్‌: వెంకట్‌ రెడ్డి నిర్మాత : వినోద్ అనంతోజు ఓటీటీ : ఈటీవీ విన్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఇటీవల వరుసగా ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘సోపతులు’ అనే ఫిల్మ్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల స్నేహ బంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రధానంగా ఇద్దరు బాలలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ స్నేహితుల మధ్య అనుబంధం ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి చింటు (మాస్టర్‌ భానుప్రకాశ్‌), గుడ్డు (సృజన్‌) బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అనుకోకుండా వచ్చిన కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల పని లేకపోవడంతో గుడ్డూ కుటుంబం మహబూబాబాద్‌ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డూ సైతం ఎలాగైనా మిత్రుడిని చూడాలని అనేక ప్రయాసలు పడుతుంటాడు. మరి వారిద్దరు కలిశారా? ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే చింటు అన్నయ్య కల నెరవేరిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇందులో పాత్రలు తక్కువే అయినా తెరపైన కనిపించిన ప్రతీ ఒక్కరి నటన సంతృప్తి ఇస్తుంది. చింటుగా మాస్టర్‌ భాను ప్రకాశ్‌ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. గుడ్డూగా సృజన్ సైతం మెప్పించాడు. వారిద్దరు ఎంతో సహజంగా నటించారు. కథ మెుత్తం వారిద్దరి చుట్టే తిరిగింది. అటు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. చింటు అన్నయ్యగా మణి ఏగుర్ల, అనూష రమేశ్‌, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే కొవిడ్‌/లాక్‌డౌన్‌ను కథా వస్తువుగా తీసుకొని ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనంత్‌ వర్ధన్‌. కొవిడ్‌ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి ఇబ్బిందులు పడ్డాయో కళ్లకు కట్టాడు. చింటు, గుడ్డు, వారి ఫ్యామిలీ నేపథ్యంతో కథను నెమ్మదిగా ప్రారంభించిన డైరెక్టర్‌ కథలో ముందుకెళ్లెకొద్ది ఆసక్తి రగిలించాడు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ లేక గుడ్డూ పడే ఇబ్బందులు హృదయాన్ని హత్తుకుంటాయి. చింటూ అన్నయ్య పాత్రను నేటి యువతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తి ఇస్తుంది. అయితే కమర్షియల్‌ హంగులు లేకపోవడం, మలుపు కొరవడటం, ఊహకందేలా కథనం సాగడం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని పాత్రల ముగింపు అంసపూర్ణంగా ఉండటం వంటివి మైనస్‌గా చెప్పవచ్చు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ బాలల నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంఊహాకందేలా కథనం సాగటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    <strong>Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్</strong>
    Avneet Kaur: కసి అందాలు చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న అవ్నీత్ కౌర్
    బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ అవనీత్‌ కౌర్‌ తన లేలేత పరువాలతో సోషల్‌ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.&nbsp; ప్రస్తుతం జర్మనీలో పర్యటనలో ఉన్న ఈ అమ్మడు అక్కడి సముద్రపు పడవలో అందాల ప్రదర్శన చేసింది.&nbsp; ఎద పొంగులు, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్లకు అదిరిపోయే హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; అవనీత్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పంబాబ్‌లోని జలంధర్‌లో జన్మించింది. 8 ఏళ్లకే 'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌' షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఓ వైపు డ్యాన్స్‌ షోలలో పాల్గొంటూనే పంజాబీ, హిందీ టీవీ సీరియల్స్‌లో అవనీత్‌ నటించింది. 'మేరీ మా' 'సావిత్రి ఏక్‌ ప్రేమ్‌ కహానీ', 'హమారీ సిస్టర్‌ దీదీ' వంటి సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా 'అల్లాఉద్దీన్‌' సీరియల్‌లో హీరోయిన్ యాస్మిన్‌ పాత్రతో అవనీత్‌ పాపులర్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌ అవకాశాలు ఆమెను వరించాయి.&nbsp; 2014లో వచ్చిన 'మర్దానీ' (Mardaani) చిత్రంతో తొలిసారి అవనీత్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో మంచి నటన కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.&nbsp; ఆ తర్వాత వరుసగా దోస్త్‌, బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. అయితే అవేమి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు.&nbsp; దీంతో ఓటీటీలోనూ అవనీత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 'బాబర్‌ కా తాబర్‌', 'బందిశ్‌ బండిట్స్‌' వంటి వెబ్‌సిరీస్‌లలోనూ కనిపించింది.&nbsp; గతేడాది టీకూ వేడ్స్‌ శేరూ, ఈ ఏడాది 'లవ్‌ కి అరేంజ్‌ మ్యారేజ్‌' చిత్రాల్లో అవనీత్‌ నటించింది. ఈ రెండు కూడా అవనీత్‌కు కోరుకున్న పాపులారిటీని అందించలేకపోయాయి.&nbsp; ప్రస్తుతం 'లవ్‌ ఇన్‌ వియాత్నం' అనే ఫిల్మ్‌లో అవనీత్‌ నటిస్తోంది. ఈ సినిమా ద్వారానైనా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ఈ భామ ఆశిస్తోంది.&nbsp; సినిమాల్లో జయపజయాలు ఎలా ఉన్న అవనీత్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్‌ ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటమే ఇందుకు కారణం. అవనీత్‌ కౌర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పోస్టు వచ్చిందంటే అది నెట్టింట ట్రెండింగ్‌ కావాల్సిందే. తన జిగేలు మనే అందాలతో ఈ అమ్మడు కవ్విస్తుంటుంది. దీంతో నెట్టింట అవనీత్‌ కౌర్‌ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 32.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూలై 27 , 2024
    <strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!</strong>
    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీపై నెటిజన్లు ఫైర్‌.. మరీ ఇలా చేశారేంటీ!
    దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli)పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్‌ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో రాజమౌళిపై హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రసంశల వర్షం కురిపించారు. అయితే ఈ డాక్యుమెంటరీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలా ఎందుకు చేశారంటూ తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపతున్నారు. వారి కోపానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకీపారేస్తున్న నెటిజన్లు! దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఆగస్టు 2 నుంచి దీనిని ప్రసారం చేయనుంది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తొలుత ఇంగ్లీష్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలో తెలుగు వెర్షన్‌నూ తీసుకొచ్చారు. ఇంగ్లీషు వెర్షన్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు తెలుగు ట్రైలర్‌ చూసి మాత్రం షాక్‌కి గురవుతున్నారు. ఆంగ్ల ట్రైలర్‌లో ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ తమ సొంత వాయిస్‌తో రాజమౌళితో తమకున్న వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు. తెలుగుకు (SS Rajamouli Documentary) వచ్చేసరికి రాజమౌళి సహా ఆ ముగ్గురు స్టార్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల చేత డబ్బింగ్‌ చెప్పించారు. తెలుగు సెలబ్రిటీలైన రాజమౌళి, ప్రభాస్‌, చరణ్‌, తారక్‌లకు వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా పూర్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది తమనెంతో నిరాశకు గురిచేస్తోందని పోస్టులు పెడుతున్నారు. డబ్బింగ్‌ వల్ల డాక్యుమెంటరీని ఓన్‌ చేసుకోలేకపోతున్నట్లు ఫైర్ అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికైనా తెలుగు డబ్బింగ్‌ విషయంలో పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=OTHKWEZilL4 డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా? రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ప్రభాస్‌, తారక్‌, రామ్‌చరణ్‌ తమ ఓన్‌ వాయిస్‌తో అభిప్రాయాలు తెలిపి తెలుగులో మాత్రం చెప్పకపోవడంపై వారిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు డైరెక్టర్‌కు సంబంధించి తొలిసారి ఓ డాక్యుమెంటరీ రూపొందుతుంటే ఇలా చేయడం సమంజసం కాదని అంటున్నారు. డబ్బింగ్‌ చెప్పే సమయం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తెలుగులో ఆ స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. అది దర్శకధీరుడికి ఇచ్చే నిజమైన గౌరవమని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు స్టార్‌ హీరోలకు మద్దతు తెలియజేస్తున్నారు. డాక్యుమెంటరీ మేకర్స్ హీరోల అభిప్రాయాలను కేవలం ఇంగ్లీషులోనే కలెక్ట్‌ చేసి ఉండొచ్చని అంటున్నారు. తెలుగులోనూ కోరి ఉంటే అప్పుడే తెలియజేసి ఉండేవారని మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌పై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.&nbsp; రాజమౌళి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే? ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)&nbsp; రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో పనిచేసిన ప్రముఖుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ మేకర్స్‌ అడిగి తెలుసుకున్నారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..&nbsp; ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్‌ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌ ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్‌ ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌ https://twitter.com/NetflixIndia/status/1815243072801763362 సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగలడం చూశా: చరణ్‌ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని “పని రాక్షసుడని” పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
    జూలై 23 , 2024
    <strong>SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సంచలన నిజాలు.. జక్కన ఇంత ఇబ్బంది పెట్టాడా?</strong>
    SS Rajamouli: రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సంచలన నిజాలు.. జక్కన ఇంత ఇబ్బంది పెట్టాడా?
    భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్స్‌లో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటారు. ‘బాహుబలి’ (Baahubali), ‘బాహుబలి 2’ (Baahubali 2), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని దేశం వైపు చూసేలా చేశారు. సినిమాలకు సంబంధించిన పలు అంతర్జాతీయ అవార్డులను భారత్‌కు అందించారు. అటువంటి రాజమౌళిపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యూమెంటరీ (Rajamouli Documentary) రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రస్తుతం అది యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.&nbsp; రాజమౌళిపై ప్రశంసల వర్షం దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) డాక్యుమెంటరీ రూపొందించింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో రానున్న ఈ డాక్యుమెంటరీలో (Netflix Documentary)&nbsp; ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, రమా రాజమౌళి, కరణ్‌జోహార్‌, జేమ్స్‌ కామెరూన్‌, రమా రాజమౌళి వంటి ప్రముఖులు దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. వారు ఏమన్నారంటే..&nbsp; ఇప్పటివరకు ఎవరూ చూపని స్టోరీలను ప్రపంచానికి తెలియజేయడం కోసమే రాజమౌళి పుట్టారు - ఎన్టీఆర్‌ ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌ ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను - రామ్‌చరణ్‌ ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌ https://twitter.com/NetflixIndia/status/1815243072801763362 ‘ఎలాంటి దయ, జాలి ఉండవు’ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సెలబ్రిటీలకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆయనతో పని చేయడం ఎంత తలనొప్పో చెప్పాలంటూ ప్రశ్నించారు. అప్పుడు సెలబ్రిటీలు రాజమౌళితో తాము ఫేస్‌ చేసిన ఇబ్బందులను తెలియజేశారు. సెట్స్‌లో ఎన్నో మైక్స్‌ పగిలిపోవడం తాను చూశానంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా ఉంటే చాలు అని కోరుకునేవాడినని తెలిపారు. అటు జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ 'ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్‌ పర్సన్‌' అని చెప్పుకొచ్చారు. భార్య రమా రాజమౌళి కూడా ఈ ట్రైలర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని పిలుస్తుంటారు' అని ఆమె చెప్పుకొచ్చారు.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. ‘SSMB29’తో బిజీ బిజీ! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్‌ అయినట్లు ఫిల్మ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.&nbsp;
    జూలై 22 , 2024
    <strong>SS Rajamouli: </strong><strong>రాజమౌళిపై స్పెషల్‌ డాక్యుమెంటరీ.. ఎలివేషన్స్‌ ఇవ్వనున్న ఆ స్టార్‌ హీరోలు!&nbsp;</strong>
    SS Rajamouli: రాజమౌళిపై స్పెషల్‌ డాక్యుమెంటరీ.. ఎలివేషన్స్‌ ఇవ్వనున్న ఆ స్టార్‌ హీరోలు!&nbsp;
    భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటాడు. ఆయన తీసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు.. సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఆస్కార్‌తో పాటు పలు గ్లోబల్‌ స్థాయి పురస్కారాలను అందుకుంది. ‘RRR’ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఆస్కార్‌ కమిటీ నుంచి సైతం రాజమౌళికి ఆహ్వానం అందింది. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో.. దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (MODERN MASTERS) పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో మోడ్రన్‌ మాస్టర్స్‌ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నట్లు తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) స్టార్‌ సెలబ్రిటీల కామెంట్స్‌! 'మోడ్రన్‌ మాస్టర్స్‌' డాక్యుమెంట్‌లో రాజమౌళి గొప్పతనం గురించి పలువురు స్టార్‌ సెలబ్రిటీలు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్స్‌ జేమ్స్‌ కామెరాన్‌, జో రోసో రాజమౌళి దర్శకత్వ నైపుణ్యం గురించి చెబుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్‌, రానా, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో పాటు ప్రముఖ టాలీవుడ్‌, బాలీవుడ్‌ హీరోలు తమ ఒపినీయన్స్‌ షేర్‌ చేసుకుంటారని సమాచారం. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్‌ను స్టార్టింగ్‌ నుంచి చూపిస్తారా? లేదా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాత్రమే ప్రస్తావిస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఆగస్టు 2న స్పష్టత రానుంది.&nbsp; ఆస్కార్‌ కమిటీకి రాజమౌళి! దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. ‘SSMB29’తో బిజీ బిజీ..! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్‌ అయినట్లు ఫిల్మ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.&nbsp;
    జూలై 06 , 2024
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే&nbsp; తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp; https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024

    @2021 KTree