• TFIDB EN
 • మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!
  UTelugu
  మనోహర్ (అభినవ్‌ గోమఠం) సాధారణ పెయింటర్. ఓ కారణం చేత ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. చేతిలో రూపాయి లేని మనోహర్‌ ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి ఎలా విజయం సాధించాడు? అన్నది కథ.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  ఇన్ ( Telugu )
  Watch
  రివ్యూస్
  YouSay Review

  Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?

  హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి...read more

  How was the movie?

  @jill5457181150

  3 months ago

  తారాగణం
  అభినవ గోమతం
  మను
  వైశాలి రాజ్
  ఉమా రవి
  అలీ రెజా
  రాహుల్
  నిజల్గల్ రవి
  జగ్గు మామా
  తరుణ్ భాస్కర్
  M.L.A వీరదాస్
  లావణ్య రెడ్డివిద్యా
  మొయిన్ మహ్మద్శివ
  సిబ్బంది
  తిరుపతి రావుదర్శకుడు
  భవానీ కాసులనిర్మాత
  సంజీవ్ టిరచయిత
  కథనాలు
  Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
  Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్‌ చేసిన అభినవ్‌.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
  నటీనటులు: అభినవ్‌ గోమటం, వైశాలి, రాజ్‌ మెుయిన్‌, అలీ రెజా దర్శకత్వం: తిరుపతి రావు సంగీతం: సంజీవ్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభూ నిర్మాత: ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్‌.వి, భవాని కాసుల విడుదల తేదీ: 23-02-2023 హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా అభినవ్‌ గోమటం మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ మనోహర్ (అభినవ్‌ గోమఠం) (Masthu Shades Unnai Ra Review In Telugu) ఓ సాధారణ పెయింటర్. లైఫ్‌లో సెటిల్ కాలేదన్న కారణంతో అతడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పీటలపై నుండి లేచిపోతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి (వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. చేతిలో రూపాయి లేని మనోహర్‌ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందిన అభినవ్‌ గోమఠం.. ఈ సినిమాలో కథానాయకుడిగానూ తన మార్క్ ఏంటో చూపించాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పలికించి సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు. ఆమెది నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర కాదు. ఇక బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు తిరుపతి రావు మంచి కథను ఎంచుకున్నారని చెప్పవచ్చు. స్టోరీపై బాగా హోమ్‌వర్క్‌ చేయడం ప్లస్ అయ్యింది. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథకు సంబంధం లేని సీన్లతో తొలి భాగాన్ని చాలా వరకూ నడిపించాడు. స్టోరీలోని మెయిన్‌ పాయింట్‌లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్‌ ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ నుంచి అసలు కథ మెుదలవుతుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలోని మెయిన్ సీక్వెన్స్‌లను దర్శకుడు చాలా బాగా మేనేజ్‌ చేశారు. మంచి ఫన్‌ కూడా జనరేట్ అయ్యింది. సెకండ్‌ పార్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో సినిమా కొంతమేర గట్టెక్కగల్గింది.  టెక్నికల్‌గా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Masthu Shades Unnai Ra Review In Telugu)... ఈ విభాగం పనితీరు చాలా పూర్‌గా ఉంది. సంజీవ్‌ థామస్‌.. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సిద్ధార్థ స్వయంభూ కెమెరా పనితనం కూడా నామ మాత్రంగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే మంచి ఔట్‌పుట్‌ వచ్చేది.  ప్లస్ పాయింట్స్‌ అభినవ్‌ నటనకామెడీద్వితియార్థం మైనస్‌ పాయింట్స్ తొలి భాగంఅవసరం లేని సీన్లుటెక్నికల్ విభాగం Telugu.yousay.tv Rating : 2.5/5
  ఫిబ్రవరి 23 , 2024
  This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
  This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
  ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు సుందరం మాస్టర్‌ హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్‌’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా! హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్‌ రాయ్‌ బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్‌ సరోజ్‌ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు.  కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్య గమనిక విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్‌ వేణు మురళీధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక.  రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది. సైరెన్‌ జయం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’ (Siren). ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆర్టికల్‌ 370 అందాల తార యామీ గౌతమ్‌ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (article 370). ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
  ఫిబ్రవరి 19 , 2024
  Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
  Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
  టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.  అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు   అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.  అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన  మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.  అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.  ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.  https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
  ఏప్రిల్ 26 , 2024
  Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
  Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
  టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం  సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.  సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)  షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.   అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా  ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.  సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’  (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా  ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.  ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
  మార్చి 14 , 2024
  The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది! 
  The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది! 
  నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్‌ పచౌరి, ప్రణవ్‌ మిశ్రా, విజయ్‌ కృష్ణ దర్శకత్వం: సుదీప్తోసేన్ సంగీతం: వీరేష్‌ శ్రీవాల్స నిర్మాణ సంస్థ: సన్‌షైన్‌ పిక్చర్స్‌ ‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్‌ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్‌ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్‌ ఉందా? ది కేరళ స్టోరీ హిట్‌ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.  కథేంటి: షాలిని ఉన్ని క్రిష్ణన్‌ (ఆదాశర్మ) నర్స్‌ అవ్వాలన్న కోరికతో నర్సింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్‌ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్‌ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్‌ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా  చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ  ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే: ‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్‌ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.  సాంకేతికంగా: దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్‌ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్‌ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, ‌అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్‌ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ ఆదాశర్మ నటనడైరక్షన్‌ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ హింసాత్మక సన్నివేశాలుబోల్డ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
  మే 05 , 2023
  KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
  KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
  ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.  అచ్చమైన తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య. హీరోయిన్ ఛాన్స్‌ గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు. ఫాలోయింగ్ ఎక్కువే సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్‌ ఉన్నారు. అటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్‌ చేస్తోంది. దశ మారుతుందా? వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్‌గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
  మార్చి 17 , 2023
  Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
  Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
  నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
  మే 23 , 2024
  Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!  
  Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!  
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్‌ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.  జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba) తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్‌ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్‌.  ఆదిత్య 369 (Aditya 369) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్‌ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.  నాని (Nani) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్‌ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్‌ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.  దశావతరం (Dasavatharam) ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.  దొంగల ముఠా (Dongala Mutha) రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.   ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్‌ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్‌ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ను అందించారు.  మిథునం (Mithunam) పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.  అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju) 2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.  అ! (Awe!) టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్‌ (Hanu Man) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.  మనం (Manam) అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.  ఒక్కడున్నాడు (Okkadunnadu) గోపిచంద్‌ హీరోగా  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.  గగనం (Gaganam) నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్‌ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. 
  మార్చి 20 , 2024
  Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
  Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
  ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో ప్రత్యర్థులుగా మారారు. ముఖ్యంగా బన్నీ.. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి మెగా ఫ్యాన్స్‌కు, జన సైనికులకు షాకిచ్చాడు. సీఎం జగన్‌ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. మరోవైపు అదే సమయంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌.. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించి బాబాయి గెలుపునకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుత ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీ రెండు విడిపోయిందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్‌ కోసం బన్నీ! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి  మద్దతు  తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లాడు. దీంతో బన్నీ వ్యవహార శైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇటీవల ట్విటర్‌లో పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ.. పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్‌ బరిలో ఉన్నారు.  https://twitter.com/i/status/1789232102518444087 బన్నీకి ఘన స్వాగతం భార్య సతీమణితో కలిసి నంద్యాల వచ్చిన బన్నీకి వైకాపా అభ్యర్థి శిల్పా రవి దంపతులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బన్నీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నంద్యాల రోడ్లపైకి చేరుకున్నారు. అతడి రేంజ్‌ రోవర్‌ కారును చుట్టుముట్టారు. వేలాది అభిమానుల మధ్య శిల్ప ఇంటికి చేరిన బన్నీ.. బాల్కనీ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అవి చూసిన జనసైనికులు బన్నీ చర్యపై మండిపడుతున్నారు. బన్నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/i/status/1789223801865359728 చంద్రబాబు రియాక్షన్‌ నంద్యాలలో బన్నీ పర్యటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పందించాడు. స్నేహితుడని భావించి అల్లు అర్జున్‌ వైకాపా అభ్యర్థి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పట్టుకొని వైకాపా చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ వెంట ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/SumanthOffl/status/1789218767366652109 పిఠాపురంలో రామ్‌చరణ్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో గత కొన్ని రోజులుగా తారల సందడి నెలకొండి. పవన్‌కు మద్దతు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్‌ కోసం తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్లాడు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన రామ్‌చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. కేరంతలు, ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన చరణ్‌.. పట్టణంలో పర్యటిస్తున్నారు. కాగా, నేటితో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.  https://twitter.com/i/status/1789234120356499943
  మే 11 , 2024
  Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
  Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
  గత శుక్రవారం (జూన్‌ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్‌ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్‌లో వాటి కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.  ‘మనమే’ 3 డేస్‌ కలెక్షన్స్‌ శర్వానంద్‌ లేటెస్ట్ మూవీ 'మనమే'కు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్‌లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్‌ (Gross) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్‌ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి. కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  వీకెండ్‌లో నిరాశ పరిచిన ‘సత్యభామ’ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సత్యభామ'. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 7) విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్‌ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్‌ (Gross) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి. కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 
  జూన్ 10 , 2024
  నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  నిధి అగర్వాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. యూత్‌ మంతి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మరి నిధి అగర్వాల్‌కు(Some Lesser Known Facts about Nidhhi Agerwal)  ఇంకా ఏమేమి ఇష్టమో ఈ కథనంలో చూద్దాం. నిధి అగర్వాల్ ముద్దు పేరు? నిధి నిధి అగర్వాల్ ఎప్పుడు పుట్టింది? 1993, ఆగస్టు 17న జన్మించింది నిధి అగర్వాల్ తొలి సినిమా? మున్నా మైఖెల్(2017) నిధి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా? మిస్టర్ మజ్ను(2018) నిధి అగర్వాల్  ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు  నిధి అగర్వాల్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిధి అగర్వాల్  ఏం చదివింది? BBA, క్రిష్ట్ యూనివర్సిటీ ( బెంగుళూరు) నిధి అగర్వాల్  అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నిధి అగర్వాల్‌కు అఫైర్స్ ఉన్నాయా? బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నయి. నిధి అగర్వాల్‌కు  ఇష్టమైన కలర్ ? వైట్, బ్లాక్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నిధి అగర్వాల్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నిధి అగర్వాల్  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nidhhiagerwal/?hl=en నిధి అగర్వాల్‌కు గుడి ఎక్కడ కట్టారు? చెన్నైలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆమెకు గుడి కట్టారు.
  ఏప్రిల్ 06 , 2024
  Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
  Jr NTR: ‘ప్రియమైన చంద్రబాబు మామయ్య’ అంటూ వివాదాలకు చెక్‌ పెట్టిన తారక్‌..! 
  టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు.. తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీతో సత్సంబంధాలు లేవని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్‌కు పోటీగా మారతాడన్న ఉద్దేశ్యంతో తారక్‌ను టీడీపీ దూరంగా పెడుతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ వైఖరితో అతడి మనసు నొచ్చుకుందని అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని అప్పటి అధికార వైకాపా వినియోగించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు తారక్‌కు మద్దతు ఇస్తూనే టీడీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. అయితే వీటన్నింటికి తారక్‌ ఒక్క ట్విట్‌తో పటాపంచలు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తనదైన శైలిలో అభినందనలు చెప్పారు.  ‘మామయ్యకు శుభాకాంక్షలు’ ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని అందుకున్న చంద్రబాబు (Chandra Babu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)లకు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్‌ కల్యాణ్‌ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/tarak9999/status/1798287485879140762 https://twitter.com/tarak9999/status/1798287613130150054 కల్యాణ్‌రామ్‌ స్పెషల్‌ విషెస్‌ తారక్‌తో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ కూడా టీడీపీకి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశాడు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్‌, శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.  https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290427482877958 https://twitter.com/NANDAMURIKALYAN/status/1798290491995541547 కలిసిపోయినట్లేనా? గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఇద్దరూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషి అవుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. తామంతా ఒక్కటే అన్న భావాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తారక్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ను టీడీపీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇకపై టీడీపీకి అన్ని మంచి రోజులేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నాగార్జున, రామ్‌చరణ్‌ ఏమన్నారంటే? తారక్‌, కల్యాణ్‌ రామ్‌తో పాటు స్టార్‌ హీరోలు నాగార్జున, రామ్‌చరణ్‌లు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున అన్నారు. అటు చరణ్‌.. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ అభినందనలు తెలియజేశాడు. 
  జూన్ 05 , 2024
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! 
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! 
  ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.  అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా  బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.  బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.  https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.  కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
  మే 29 , 2024
  Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
  Allu Arjun Viral Photo: భార్యతో రోడ్డు పక్కన దాబాలో కనిపించిన అల్లు అర్జున్‌.. ఫొటో వైరల్‌!
  టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో బన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరింది. ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినా బన్నీ మాత్రం చాలా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడుతుంటాడు. సామాన్యుడిగా జీవించేందుకు ఏమాత్రం సంకోచించడు. వివాదంలో చిక్కుకుంటానని తెలిసినా స్నేహం కోసం ఇటీవల వైకాపా నాయకుడి ఇంటికి వెళ్లి మరి బన్నీ మద్దతు ప్రకటించాడు. ఇటువంటి సందర్భాలు బన్నీ లైఫ్‌లో చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  బన్నీ.. సింప్లిసిటీ..! ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌, అతని భార్య ఓ సాధారణ హోటల్‌లో టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీనిని అక్కడ ఉన్న ఓ వ్యక్తి రహాస్యంగా ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌.. తమ హీరో సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. లైఫ్‌లో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలన్న జీవిత పాఠాన్ని బన్నీ పాటిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో చేస్తున్నారు.  .@alluarjun anna & sneha garu🤨😯❤️❤️Spotted at road side dhaba SIMPLICITY LEVEL. Man 🫡 pic.twitter.com/KoI7NOLfmF— Trend_AlluArjun_FC™ (@Trend_AA_FC) May 21, 2024 ఎక్కడ జరిగిందంటే? ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల జిల్లాలో పర్యటించాడు. అక్కడ వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డికి మద్దతు తెలిపాడు. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్‌కు అభివాదం చేసి.. కొద్ది సేపటికే బన్నీ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరాడు. ఈ సందర్భంగా దారిలో ఓ దాబా వద్ద బన్నీ ఆగినట్లు తెలుస్తోంది. అక్కడ తన భార్యతో కలిసి భోజనం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పుడు తీసిన ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలాగే..! గతంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ సందర్భంలోనూ బన్నీ రోడ్డు పక్కన టిఫిన్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రంపచోడవరంలో తెల్లవారు జామున షూటింగ్‌కు వెళ్తూ బన్నీ మార్గం మధ్యలో ఓ కాకా హోటల్‌ దగ్గర కారు ఆపాడు. ఎంచక్కా పాకలోకి వెళ్లి టిఫిన్‌ చేశాడు. బయటకొచ్చి తన అసిస్టెంట్‌ను డబ్బులు అడిగి హోటల్‌ యజమాని చేతికి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మళ్లీ ఓసారి చూసేయండి. Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021 ‘పుష్ప 2’తో బిజీ బిజీ.. ప్రస్తుతం బన్నీ.. ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. 
  మే 21 , 2024
  OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 
  OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 
  ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి కంటెంట్‌ను మిస్‌ అయినట్లే. ఇంతకీ ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? తదితర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.  సినిమా ఏదంటే? బాలీవుడ్‌లో వచ్చిన 'మస్త్‌ మెయిన్‌ రెహ్‌నే కా’ (Mast Mein Rehne Ka) మూవీ.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వీక్షకులను ఆకట్టుకుంది. విజయ్ మౌర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మంచి వ్యూస్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, అభిషేక్‌ చౌహాన్‌, నీనా గుప్తా, మౌనికా పన్వార్‌, ఫైజల్‌ మాలిక్‌ ముఖ్య పాత్రల్లో చేశారు. IMDBలో ఈ సినిమా.. 7.1 రేటింగ్‌ కలిగి ఉంది. ఎందుకు చూడాలంటే? ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగిపోతోంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కష్టపడుతూనే ఉన్నారు. జీవితం అంటే ఇంతేనా? ఇంకేం లేదా? అని నిత్యం ఆలోచించే వారికి ఈ సినిమా చక్కటి సమాధానంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తుంది. చిన్న విషయాలకే బాధపడిపోయి.. ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియక తికమక పడేవారికి పరిష్కారాన్ని చూపుతుంది.   కథేంటి ముంబయికి చెందిన వీ.ఎస్‌ కామత్‌ (జాకీ ష్రాఫ్‌).. రిటైర్మెంట్‌ జీవితాన్ని కష్టంగా గడుపుతుంటాడు. అతడి భార్య 12 ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంటాడు. నిరాశ, నిస్పృహలతో సాగిపోతున్న అతడికి భర్తపోయి ఒంటరిగా జీవిస్తున్న నీనా గుప్తా పరిచయం అవుతుంది. వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. వారిద్దరు తమ వృద్ధాప్య జీవితాన్ని ఎంత సంతోషంగా గడిపారు? ఎలాంటి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు? వారు తమ జీవితాలను కొత్తగా ఏ కోణంలో చూడటం ప్రారంభించారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. Telugu.yousay.tv Rating : 3/5 
  ఏప్రిల్ 20 , 2024
  Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
  Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే! 
  సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్‌ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్‌ దశలోనే ఉన్న టాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్‌ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్‌ అయిన టాలీవుడ్‌ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ క్రిష్‌ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్‌ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్‌.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్‌ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్‌ స్వయంగా పోస్టర్‌ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్‌ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్‌ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టీజర్‌ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఫ్యామిలీ స్టార్‌ (Family Star) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.  ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది.  తమ్ముడు (Thammudu) స్టార్‌ హీరో నితిన్‌ (Nithiin) అప్‌కమింగ్‌ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.  ఘాతీ (GHAATI) స్టార్‌ హీరోయిన్‌ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్‌ మూవీ 'ఘాతీ' కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. కాంతారా 2 (Kantara 2) రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్‌ దక్కించుకోవడం విశేషం.  కంగువా (Kanguva) 2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.
  ఏప్రిల్ 03 , 2024
  సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
   తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ కిషన్ మద్దు పేరు? సండీ సందీప్ కిషన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సందీప్ కిషన్ తొలి సినిమా? ప్రస్థానం సినిమాలో నెగిటివ్‌ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు? చెన్నై సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 7 సందీప్ కిషన్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. సందీప్ కిషన్‌కు లవర్ ఉందా? సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్? బ్లూ, వైట్ సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు? RK దుర్గా, P.R.P నాయుడు సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా సందీప్ కిషన్ ఏం చదివాడు? డిగ్రీ సందీప్ కిషన్ అభిరుచులు? ట్రావలింగ్, పార్టింగ్ సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.  సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని సందీప్ కిషన్ వ్యాపారాలు? సందీప్‌ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది. సందీప్ కిషన్‌ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
  మార్చి 21 , 2024
  అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్‌ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో  స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న  అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అఖిల్ అక్కినేని ఎవరు? అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు అఖిల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు  అఖిల్ ఎక్కడ పుట్టారు? కాలిఫోర్నియా, అమెరికా అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1994 ఏప్రిల్ 08 అఖిల్ వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు అఖిల్‌కి ఇష్టమైన రంగు? బ్లాక్ అఖిల్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం అఖిల్‌కు ఇష్టమైన ఆహారం? ఫిష్ ఫ్రై అఖిల్  అభిమాన నటుడు? నాగార్జున, పవన్ కళ్యాణ్ అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ ఏం చదివాడు? BBA  అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 8 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=-Qq6ff-0uQM అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.
  మార్చి 21 , 2024

  @2021 KTree