రేటింగ్ లేదు
No Dateమీకు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ఉందా?
ఆసక్తి ఉంది
UATelugu
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత. అక్టోబర్ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.
ఇంగ్లీష్‌లో చదవండి
తారాగణం
విశ్వక్ సేన్
మీనాక్షి చౌదరి
శ్రద్ధా శ్రీనాథ్
సిబ్బంది
రవితేజ ముళ్లపూడిదర్శకుడు
రామ్ తాళ్లూరి
నిర్మాతకథనాలు
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్ ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.
‘ఓ పిల్ల’ సాంగ్ రిలీజ్
విష్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s
సాంగ్ ఎలా ఉందంటే?
రాఖీ (విష్వక్ సేన్), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్ అజీజ్ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్ ఎప్పటిలాగే తన క్లాసిక్ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
‘లైలా’గా విష్వక్
విష్వక్ మెకానిక్ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
https://twitter.com/HanuNews/status/1808353426721407104
పోలీసు ఆఫీసర్‌గా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్ చేశాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 18 , 2024
Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్.. దాని వెనక మాస్టర్ ప్లాన్ ఉందా?
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుర్ర హీరోలతో క్లోజ్‌గా..
కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చేరారు. యువ విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్ సక్సెస్ మీట్‌కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్ ఫొటోలు దిగి హల్‌చల్ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్, బాలయ్య అండగా నిలుస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్, సిద్ధులనే బాలకృష్ణ, తారక్ ఎంకరేజ్ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్, సిద్ధులను ఎంకరేజ్ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్ చేసేందుకు తారక్, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌కు పోటీగా..!
విజయ్ దేవరకొండ సోదరులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్ చాలా ఒత్తిడి ఫేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్ మద్దతుతో విష్వక్ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విష్వక్, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 25 , 2024
Vishwak Sen: పవన్ కల్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ సేన్ రొమాన్స్.. క్రేజీ కాంబో లోడింగ్!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ మాస్ కా దాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘VS14’లో హీరోయిన్ ఫిక్స్!
విష్వక్ సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహనన్ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు.
యాక్షన్ డ్రామా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
రెండోసారి ఖాకీ పాత్రలో..
విష్వక్ సేన్ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ : ది ఫస్ట్ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్ రోల్‌లో విష్వక్ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విష్వక్ బిజీ బిజీ..
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్ 24 , 2024
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్ వచ్చేసిందిగా!
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో విష్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ మాస్ కా దాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆ మూవీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
యాక్షన్ డ్రామా..
యంగ్ హీరో విష్వక్ సేన్ తాజాగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
రెండోసారి ఖాకీ పాత్రలో..
విష్వక్ సేన్ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ : ది ఫస్ట్ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్ రోల్‌లో విష్వక్ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విష్వక్ బిజీ బిజీ..
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది.
ఆగస్టు 06 , 2024
One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్!
కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గాయత్రి భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్
అల్లు శిరీష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్ తరణ్ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
తన్వీ ఆకాంక్ష - సీరత్ కపూర్
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్ కపూర్ గతంలో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది.
మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky). రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం జెర్సీ, సైంధవ్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.
తమన్నా - రాశి ఖన్నా
అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తమన్నా - కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
జూలై 31 , 2024
Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్‌లో విశ్వక్ ఈ పోస్టర్‌లో కనిపించాడు.
‘లైలా’గా విశ్వక్ సేన్..
ప్రస్తుతం విష్వక్ సేన్.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'లైలా' (Laila Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్‌గా ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్‌ను రిలీజ్ చేసారు. కెరీర్‌లో తొలిసారి ఓ లేడీ గెటప్‌లో విశ్వక్ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్ డెసిషన్‌కు సెల్యూట్ అంటూ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
https://twitter.com/pudiharicharan/status/1808373415163973920
రిలీజ్ ఎప్పుడంటే..!
తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న 'లైలా' చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్ చేసి.. షూటింగ్ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్ కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
https://twitter.com/AndhraBoxOffice/status/1808389179472060518
‘రెమో’ తరహాలో మేకోవర్!
విశ్వక్ సేన్ లేటెస్ట్ ‘లైలా’ పోస్టర్.. తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో' (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్.. అందమైన అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాడు. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్ సేన్ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్‌లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్‌లోని అతడి మేకోవర్ చూస్తే.. ఏదో ఒక సీన్ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్‌ను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
‘మెకానిక్ రాకీ’గా విశ్వక్..
ప్రస్తుతం విశ్వక్ సేన్.. 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ పాత్ర.. చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో రానున్న చిత్రంలో.. విశ్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్‌లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
జూలై 03 , 2024
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్!
టాలీవుడ్ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
[toc]
డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని
టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.
అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్ ఫిదా!
1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్ నగర్ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్ కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA
https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU
https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc
https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0
https://www.youtube.com/watch?v=y_p90nJNsB8
నాగేశ్వరరావు స్ఫూర్తితో..
టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్, తారక్, రామ్ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.
https://www.youtube.com/watch?v=pFTIlMls-98
బాలకృష్ణ ఆసక్తికర పోస్టు
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.
ఏఎన్నాఆర్ టాప్-10 చిత్రాల రీరిలీజ్
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూల్కెలాతో సహా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్ షోస్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
దేవదాస్ (1951)
అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.
Book Tickets
మిస్సమ్మ (1955)
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్లాట్ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ
Book Tickets
మాయాబజార్ (1957)
స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
Book Tickets
భార్య భర్తలు (1961)
ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
Book Tickets
గుండమ్మ కథ (1962)
అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ప్లాట్ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
Book Tickets
డాక్టర్ చక్రవర్తి (1964)
ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.
Book Tickets
సుడిగుండాలు (1968)
ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.
Book Tickets
ప్రేమ్ నగర్ (1971)
ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.
Book Tickets
ప్రేమాభిషేకం (1982)
నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.
Book Tickets
మనం (2014)
అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ.
Book Tickets
సెప్టెంబర్ 20 , 2024
Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.
1. సంఘర్షణ
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది.
2. స్వయం కృషి
చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
3. దేవాంతకుడు
వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు.
4. మహానగరంలో మాయగాడు
చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు.
5. ఛాలెంజ్
చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది.
6. చిరంజీవి
చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది.
7. కొండవీటి రాజా
చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. 'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.
8. ధైర్యవంతుడు
చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు.
9. చాణక్య శపథం
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది.
10. పసివాడి ప్రాణం
చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. మంచి దొంగ
రాఘవేంద్ర రావు డైరెక్షన్ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది.
12. యముడికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.
13. యుద్ధ భూమి
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు.
14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
15. కొండవీటి దొంగ
చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది.
17. గ్యాంగ్ లీడర్
చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది.
18. మెకానిక్ అల్లుడు
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు.
19. రుద్ర నేత్ర
కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు.
నవంబర్ 07 , 2023
తెలుగింటి అందం చాందిని చౌదరి (Chandini Chowdary) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
పదహారనాళ్ల తెలుగు అందం చాందిని చౌదరి. నటనపై మక్కువతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మధురం సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ కుందనపు బొమ్మ.. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. మరి ఈ తెలుగు అందం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
చాందిని చౌదరి పదహా
చాందిని చౌదరి ఎవరు?
చాందిని చౌదరి తెలుగు హీరోయిన్. కలర్ ఫొటో చిత్రంతో ఫేమస్ అయింది.
చాందిని చౌదరి ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
చాందిని చౌదరి ఎక్కడ పుట్టింది?
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
చాందిని చౌదరి పుట్టిన తేదీ ఎప్పుడు?
1993, అక్టోబర్ 23, వయస్సు(33)
చాందిని చౌదరికి వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
చాందిని చౌదరికి ఇష్టమైన రంగు?
లైట్ పింక్
చాందిని చౌదరికి అభిరుచులు?
స్విమ్మింగ్, ట్రావెలింగ్
చాందిని చౌదరికి ఇష్టమైన ఆహారం?
తనకు పులిహోర అంటే ఇష్టమని తెలిపింది
చాందిని చౌదరి అభిమాన నటుడు?
పవన్ కళ్యాణ్
చాందిని చౌదరి తొలి సినిమా?
మధురం(2014)
చాందిని చౌదరికి గుర్తింపు తెచ్చిన సినిమాలు?
కలర్ ఫొటో, సమ్మతమే, సూపర్ ఓవర్, గామి
చాందిని చౌదరి ఏం చదివింది?
మెకానికల్ ఇంజనీరింగ్
చాందిని చౌదరి ఎన్ని సినిమాల్లో నటించింది?
2024 వరకు 15 సినిమాల్లో నటించింది
చాందిని చౌదరి పారితోషికం ఎంత?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.30 లక్షల వరకు తీసుకుంటోంది.
చాందిని చౌదరి ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
అవార్డులు ఏమి రాలేదు కానీ, తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకుంది
చాందిని చౌదరికి మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
చాందిని చౌదరి అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.
చాందిని చౌదరి పెంపుడు కుక్క పేరు?
చాందిని చౌదరికి పెంపుడు జంతువులంటే ఇష్టం, ఆమె పెట్ డాగ్ పేరు లడ్డూ
చాందిని చౌదరి ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/chandini.chowdary/?hl=en
చాందిని చౌదరి సిగరేట్ తాగుతుందా?
తెలియదు
చాందిని చౌదరి మద్యం తాగుతుందా?
తెలియదు
మార్చి 05 , 2024
Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్ బాబు.. హిట్ కొట్టాడా?
నటీనటులు : సుధీర్ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్, సునీల్, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు
దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
నిర్మాత : సుమంత్ జి. నాయుడు
విడుదల తేదీ: 14- 05-2024
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్ తెలివితేటలతో గన్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్ నటనతో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్ పాత్రతో సునీల్ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ ముందుకు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సుధీర్‌బాబు నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 14 , 2024
Item Songs Lyrics: ఈ ఐటెమ్ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం)
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.
‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
వలలు వెయ్యొద్దు వయసు మీద..
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి.
సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.
‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని..
చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ..
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ..
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’
‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా..
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా..
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.
https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk
పుడుతూనే ఉయ్యాల(నేనింతే)
పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.
‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే..
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే..
చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే..
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా..
నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’
‘‘టర్నే లేని దారులూ..
ట్విస్టే లేని గాథలూ..
రిస్కే లేని లైఫులూ..
బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.
https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc
తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్)
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి.
‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని..
చేతకాని వాడల్లే చూడొద్దే..
ధర్మరాజు అంతటివాడు ఆడాడే..
తీసిపారేయొద్దు జూదాన్ని..
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే..
స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే..
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే..
వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’
https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk
పక్కా లోకల్(జనతా గ్యారేజ్)
ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.
తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది..
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే…
‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో..
ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో..
ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో..
అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది.
ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA
మరికొన్ని..
తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.
https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
జూన్ 23 , 2023