• TFIDB EN
  • మెహబూబా
    UATelugu
    ఇండియాలో ఉన్న హీరో, పాక్‌లో ఉన్న హీరోయిన్‌ను ఒకటే కల వెంటాడుతుంటుంది. దీనికి కారణం ఏంటి? వారికి గత జన్మలో ఉన్న సంబంధం ఏంటి? చివరికీ వారు ఎలా కలిశారు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఆకాష్ పూరి
    రోషన్/కబీర్
    నేహా శెట్టి
    ఆఫ్రీన్/మధిర
    మురళీ శర్మ
    అఫ్రీన్ తండ్రి
    అశ్విని కల్సేకర్
    ఆఫ్రీన్ తల్లి
    సాయాజీ షిండే
    రోషన్ తండ్రి
    ప్రమోదినిరోషన్ తల్లి
    సుఖ్‌పాల్ సింగ్నాదిర్ తండ్రి
    సునీతా సింగ్నాదిర్ తల్లి
    శ్రీధర్ అర్రైలు ప్రయాణికుడు
    ప్రధానోపాధ్యాయుడు ఉదయ్ కుమార్ భగవతులas the principal
    ప్రమోద్ చౌదరి పాకిస్తాన్ SI
    మహ్మద్ షోయబ్ ఖాన్ భారత ఆర్మీ మేజర్
    దివ్య గౌడ లెక్చరర్
    మాస్టర్ యతీష్యువ రోషన్
    అమిషి గుసేన్ యువ ఆఫ్రీన్
    అమిత్ ఆనంద్ రౌత్ డిస్కో జాకీ
    వంగపండు సత్యఒక ప్యూన్
    శ్రీకాంత్ అయ్యంగార్
    పోలీసు అధికారి
    కళ్యాణ్ వసంత్ డాక్టర్
    గోపిందర్ వాత్సయాయెన్ పాకిస్తాన్ మేజర్
    సిబ్బంది
    పూరి జగన్నాధ్
    దర్శకుడు
    ఛార్మీ కౌర్
    నిర్మాత
    పూరి జగన్నాధ్నిర్మాత
    సందీప్ చౌతాసంగీతకారుడు
    కథనాలు
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు   నేహా శెట్టి ముద్దు పేరు?  నేహా  నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు   నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక  నేహా శెట్టి  అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి  ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి  తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి  ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి  ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి  ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే  నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి  ఏం చదివింది? డిగ్రీ  నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.  నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.  వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.  డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.  ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.  రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.  నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.  View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.  View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.  నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.  డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.  టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:  నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.  https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.  రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.  రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_  నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో  యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.  https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.  https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.   https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.  https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.  https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.  https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.  https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.  https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    <strong>Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?</strong>
    Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?
    నటీనటులు : భాను ప్రకాష్‌, సృజన్‌, మణి ఏగుర్ల, మోహన్‌ భగత్‌, రవీందర్‌ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ, తదితరులు రచన, దర్శకత్వం : అనంత్‌ వర్ధన్‌ సంగీతం :&nbsp; సంజీత్‌ ఎర్రమిల్లి సినిమాటోగ్రఫీ : ముత్యాల సునీల్‌ ఎడిటర్‌: వెంకట్‌ రెడ్డి నిర్మాత : వినోద్ అనంతోజు ఓటీటీ : ఈటీవీ విన్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఇటీవల వరుసగా ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘సోపతులు’ అనే ఫిల్మ్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల స్నేహ బంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రధానంగా ఇద్దరు బాలలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ స్నేహితుల మధ్య అనుబంధం ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి చింటు (మాస్టర్‌ భానుప్రకాశ్‌), గుడ్డు (సృజన్‌) బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అనుకోకుండా వచ్చిన కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల పని లేకపోవడంతో గుడ్డూ కుటుంబం మహబూబాబాద్‌ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డూ సైతం ఎలాగైనా మిత్రుడిని చూడాలని అనేక ప్రయాసలు పడుతుంటాడు. మరి వారిద్దరు కలిశారా? ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే చింటు అన్నయ్య కల నెరవేరిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇందులో పాత్రలు తక్కువే అయినా తెరపైన కనిపించిన ప్రతీ ఒక్కరి నటన సంతృప్తి ఇస్తుంది. చింటుగా మాస్టర్‌ భాను ప్రకాశ్‌ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. గుడ్డూగా సృజన్ సైతం మెప్పించాడు. వారిద్దరు ఎంతో సహజంగా నటించారు. కథ మెుత్తం వారిద్దరి చుట్టే తిరిగింది. అటు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ మోహన్‌ భగత్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. చింటు అన్నయ్యగా మణి ఏగుర్ల, అనూష రమేశ్‌, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే కొవిడ్‌/లాక్‌డౌన్‌ను కథా వస్తువుగా తీసుకొని ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనంత్‌ వర్ధన్‌. కొవిడ్‌ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి ఇబ్బిందులు పడ్డాయో కళ్లకు కట్టాడు. చింటు, గుడ్డు, వారి ఫ్యామిలీ నేపథ్యంతో కథను నెమ్మదిగా ప్రారంభించిన డైరెక్టర్‌ కథలో ముందుకెళ్లెకొద్ది ఆసక్తి రగిలించాడు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ లేక గుడ్డూ పడే ఇబ్బందులు హృదయాన్ని హత్తుకుంటాయి. చింటూ అన్నయ్య పాత్రను నేటి యువతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తి ఇస్తుంది. అయితే కమర్షియల్‌ హంగులు లేకపోవడం, మలుపు కొరవడటం, ఊహకందేలా కథనం సాగడం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని పాత్రల ముగింపు అంసపూర్ణంగా ఉండటం వంటివి మైనస్‌గా చెప్పవచ్చు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ బాలల నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంఊహాకందేలా కథనం సాగటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.&nbsp; యువ నటుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న రిలీజ్‌ కానుంది.&nbsp; ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.&nbsp; నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్‌ 6, 1999లో జన్మించింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. మిస్‌ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; 2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.&nbsp; పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా చేశాడు.&nbsp; ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.&nbsp; యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో చెరగని ముద్ర వేసింది.&nbsp; ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్‌ రంజన్‌' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.&nbsp; ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.&nbsp; యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.&nbsp; ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 13 , 2024
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్‌, ప్రణీత్‌ రెడ్డి కల్లెం, ఫిష్‌ వెంకట్‌, రాజ్‌ తిరణ్‌దాస్‌, శ్రీరామ్‌ రెడ్డి తదితరులు.. దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌ సంగీతం: రామ్‌ మిర్యాల, శ్రీచరణ్‌ పరకాల, ఎస్‌.ఎస్‌ థమన్‌, సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు ఎడిటింగ్‌ : నవీన్ నూలి నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ విడుదల తేదీ : 29-03-2024 సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్‌ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్‌, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. డైరెక్షన్‌ ఉందంటే డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్‌’ను కూడా ఫన్‌ &amp; ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. అయితే కామెడీ, డైలాగ్స్‌ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్‌ విషయంలో మల్లిక్‌ రామ్‌ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్‌, కామెడీ పరంగా చూస్తే మల్లిక్‌ రామ్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ సిద్ధు జొన్నలగడ్డ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్ రొటీన్ స్టోరీఆకట్టుకోని ట్విస్టులు Telugu.yousay.tv Rating : 3.5/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 29 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    <strong>Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్‌, షణ్ముఖ్‌, మహబూబ్‌ బాషా, శ్రీతేజ్‌, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు దర్శకత్వం : ముఖేష్‌ ప్రజాపతి సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్‌. కుమార్‌ సంగీతం : సిద్ధార్థ్‌ సదాశివుని ఎడిటింగ్‌ : రవితేజ గిరిజల నిర్మాత : ప్రశాంత్‌ మలిశెట్టి ఓటీటీ వేదిక : జీ 5 విడుదల తేదీ : 19-07-2024 ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ 'బహిష్కరణ'. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో&nbsp; అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్‌ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్‌) ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్‌) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్‌ స్టోరీ. ‘ ఎవరెలా చేశారంటే వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్‌, మ్యానరిజమ్స్‌తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్‌ చూపించింది. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్‌ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్‌గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్‌ సెటిల్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు. తన డైలాగ్స్‌, లుక్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్‌ చేసి పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే పిరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు ముఖేష్‌ ప్రజాపతి ఈ సిరీస్‌ను రూపొందించారు. త‌న ప్రియుడికి జ‌రిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఏ విధంగా అణిచివేయ‌బ‌డ్డార‌న్న‌ది రా అండ్ ర‌స్టిక్‌గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్‌, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్‌ చేశారు. డ్రామా, ఎమోష‌న్స్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్ర‌జెంటేష‌న్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మ‌లుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్త‌గా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాల‌ను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్‌ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ ప్రసన్న ఎస్‌. కుమార్‌ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్‌ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్‌ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఓ రెంజ్‌లో ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అంజలి నటనపిరియాడికల్‌ రివేంజ్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ట్విస్టులు లేకపోవడంకొన్ని బోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు దర్శకత్వం : వియస్ ముఖేష్ సంగీతం: జో ఎన్మవ్&nbsp;&nbsp; నేపథ్య సంగీతం: సృజన శశాంక సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి నిర్మాత: అఖిలేష్ కలారు విడుదల తేది: ఏప్రిల్‌ 19, 2024 ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం నటింటిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్‌ ముఖేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్‌ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్‌ శంకర్‌ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్‌ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్‌ ఏం చేశాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అటు మార్కెట్‌ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్‌ పాత్రలో ముక్కు అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్‌ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్‌ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్‌ శంకర్‌, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్‌ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ హీరో, హీరోయిన్‌ నటనసందేశండైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5
    ఏప్రిల్ 19 , 2024
    <strong>Sana Makbul : బిగ్‌బాస్‌ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్</strong>
    Sana Makbul : బిగ్‌బాస్‌ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్
    హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌3 విజేతగా టాలీవుడ్ నటి సనా మక్బుల్‌ (Sana Makbul) నిలిచింది. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట మార్మోగుతోంది. సనా మక్బుల్‌ గురించి తెలుసుకునేందుకు బిగ్‌ బాగ్‌ ఆడియన్స్‌ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ భామను ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు సైతం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.&nbsp; ముంబయిలో పుట్టి పెరిగిన సనా మక్బుల్‌ తెలుగు ఫిల్మ్‌తోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు సనా టెలివిజన్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించింది. 'ఇషాన్ : సప్నో కో అవాజ్‌ దే', 'కితనీ మెహబ్బత్‌ హై 2', 'ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ దూన్‌?', 'అర్జున్‌' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించింది.&nbsp; ఆ ఫేమ్‌తోనే దిక్కులు ‘చూడకు రామయ్య’ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌ చిత్రంలో సంహిత పాత్రలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.&nbsp; ఆ తర్వాత 'రంగూన్‌' (2017) అనే తమిళ ఫిల్మ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక అదే ఏడాది 'కాదల్‌ కండీషన్స్ అప్లే' అనే మూవీలోనూ సనా మక్బూల్‌ నటించింది.&nbsp; 2017లో 'మామ ఓ చందమామ' అనే తెలుగు ఫిల్మ్‌లో సనా మక్బూల్‌ నటించింది. ఇందులో బుజ్జమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.&nbsp; తెలుగులో చేసిన రెండు చిత్రాలు కమర్షియల్‌గా హిట్‌ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌పై సనా ఫోకస్‌ పెట్టింది.&nbsp; హిందీలో గేమ్స్‌, వినోదానికి సంబంధించిన పలు రియాలిటీ షోలలో పాల్గొని అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.&nbsp; ఈ క్రమంలోనే ఇటీవల 'బిగ్‌ బాస్‌ ఓటీటీ 3' రియాలిటీ షోలో పాల్గొని తన ప్రవర్తనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది. తాజాగా టైటిల్‌ సైతం గెలుచుకొని విజేతగా నిలిచింది.&nbsp; సనా మక్బూల్‌ పలు మ్యూజిక్‌ వీడియోలలో నటించింది. ‘ఖేలేగి క్యా?’, ‘సైకో’, ‘గల్లాన్‌’, 'ఎక్‌ తూ హి తో హై' ఆల్బమ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.&nbsp; బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు వరకూ తన హాట్‌ ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తించింది.&nbsp; ఈ అమ్మడి అందచందాలను చూసి నెటిజన్లు మైమరిపోయారు. ఇంతటి అందాల తారకు హీరోయిన్‌గా ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.&nbsp; ఇన్‌స్టాగ్రామ్‌లో సనా మక్బూల్‌కు పెద్ద ఎత్తునే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఖాతాను 2.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 03 , 2024
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.&nbsp; 2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.&nbsp; https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.&nbsp; 4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.&nbsp; 5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.&nbsp; 6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.&nbsp; 7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.&nbsp; 8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.&nbsp; 9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.&nbsp; 10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు.&nbsp;
    మే 09 , 2023
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    <strong>Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    Latest OTT releases Telugu: ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకనుంది. తెలుగులో చాలా చిత్రాలు ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చి మంచి వ్యూస్‌ సాధిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సైతం మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; హరోం హర (Harom Hara) సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'హరోం హర' చిత్రం జూన్‌ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఆహా వేదికగా జూలై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు జులై 18 నుంచి ఈటీవీ విన్‌లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు.. అక్కడ అరాచకం సృష్టిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ప్రాంతానికి దేవుడిగా ఎలా మారాడు?' అన్నది కథ. ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా?’ అన్నది కథ మ్యూజిక్‌ షాప్‌ మూర్తి (Music Shop Murthy) అజయ్‌ ఘోష్‌ (Ajay ghosh) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మ్యూజిక్‌ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌ చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది. ప్లాట్ ఏంటంటే.. 'మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. డీజేలో శిక్షణ పొందిన అంజన (చాందిని చౌదరి).. ఓ కారణం చేత మూర్తిని కలుస్తుంది. అతడి ఆసక్తిని గమనించి డీజే నేర్పిస్తుంది. అలా సిటీకి వచ్చిన మూర్తి.. డీజేగా సక్సెస్‌ అయ్యాడా? ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి?’ అన్నది కథ. బూమర్ అంకుల్‌ (Boomer Uncle) తమిళ స్టార్ కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో చేసిన చిత్రం 'బూమర్ అంకుల్‌'. ఇందులో ఓవియా, రోబో శంకర్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్వదీస్‌ ఎమ్‌.ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 20 నుంచి ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్లాట్‌ ఏంటంటే.. 'నేసమ్‌ (యోగిబాబు), విదేశీ యువతి అమీ (ఓవియా)ని పెళ్లి చేసుకుంటాడు. ఓ కారణం చేత భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు. ఓ షరతుపై అందుకు అమీ అంగీకరిస్తుంది. ఆ కండిషన్‌ ఏంటి? విడాకులు ఎందుకు కోరుకున్నాడు?’ అన్నది స్టోరీ. హాట్‌స్పాట్‌ (Hotspot) గౌరీ జీ. కిషన్, ఆదిత్య భాస్కర్, సాండీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'హాట్‌స్పాట్‌'. మార్చి 29న తమిళంలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా జులై 17న ఆహా (Aha) వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆంథాలజీ నేపథ్యంలో నాలుగు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందింది. ప్లాట్‌ ఏంటంటే 'నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.&nbsp; నాగేంద్రన్స్‌ హనీమూన్‌ (Nagendran's Honeymoons) నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హనీమూన్’. దీనికి ‘1 జీవితం 5 గురు భార్యలు’ అనేది ఉపశీర్షిక. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా ఈ సిరీస్‌ రూపొందింది. జులై 19 నుంచి హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్‌కు రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి మంచి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు.&nbsp; బహిష్కరణ (Bahishkarana) ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ 'బహిష్కరణ'. ఇది జీ 5 వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో&nbsp; అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు.&nbsp; https://twitter.com/i/status/1802226071795896339 త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ (Tribhuvan Mishra CA Topper) ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ 'త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్'. జులై 18 నుంచి నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు అమిత్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్‌ సిరీస్‌ క్రియేటర్ల నుంచి రావడంతో ఈ సిరీస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాట్ ఏంటంటే 'చార్టెడ్‌ అకెంటెంట్‌ త్రిభువన్‌ (మానవ్‌ కౌల్‌) ఓ మహిళా క్లైంట్‌తో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఈ రిలేషన్‌ అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న త్రిభువన్‌ను చంపాలని ఓ గ్యాంగ్‌స్టర్‌ నిర్ణయించుకుంటాడు. అతడి బారి నుంచి త్రిభువన్‌ తప్పించుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ. https://twitter.com/cinema_abhi/status/1813833849652101242
    జూలై 18 , 2024

    @2021 KTree