• TFIDB EN
  • మెంటల్ మదిలో
    UATelugu
    స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతను ఇరకాటంలో పడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీ విష్ణు
    అరవింద్ కృష్ణ
    నివేదా పేతురాజ్
    స్వేచ్చ
    అమృత శ్రీనివాసన్
    రేణుక
    కేశవ్ దీపక్మను
    కిరీటి దామరాజు
    సాకి
    శివాజీ రాజా
    అరవింద్ కృష్ణ తండ్రి
    మధుమణిఅరవింద్ కృష్ణ తల్లి
    రాజ్ మాదిరాజు
    స్వేచ్చ తండ్రి
    అనితా చౌదరిస్వేచ్చ తల్లి
    దినేష్ కౌషికఅరవింద్ స్నేహితుడు
    అప్పాజీ అంబరీష దర్భఆఫీసు సహోద్యోగి
    జాహన్వి దాస్సేటి
    సుజాత
    నారా రోహిత్
    బస్సు ప్రయాణీకుడు (అతి పాత్రలో కనిపించడం)
    సిబ్బంది
    వివేక్ ఆత్రేయ
    దర్శకుడు
    రాజ్ కందుకూరినిర్మాత
    ప్రశాంత్ ఆర్ విహారి
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోయిన్లలలో నివేత పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. పెళ్ళిరోజు, టిక్ టిక్ టిక్, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించింది. పాగల్, దాస్‌కా ధమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజు((Some Lesser Known Facts about Nivetha Pethuraj) గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నివేత పేతురాజ్ ఎప్పుడు పుట్టింది? 1991, నవంబర్  30న జన్మించింది నివేత పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా? మెంటల్ మదిలో(2017) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. నివేత పేతురాజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు  నివేత పేతురాజ్ ఎక్కడ పుట్టింది? మదురై నివేత పేతురాజ్ అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నివేత పేతురాజ్‌కు  ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్\ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నివేత పేతురాజ్ ఏం చదివింది? డిగ్రీ నివేత పేతురాజ్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నివేత పేతురాజ్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నివేత పేతురాజ్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా? 2018 మేలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నివేత పేతురాజ్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nivethapethuraj/?hl=en నివేత పేతురాజ్‌కు టాటూలు ఎక్కడ ఉన్నాయి? నివేత ఎద పై భాగంలో క్రిసెంట్ మూన్‌తో పాటు ఆమె నడుముకు వెనుక భాగంలో టాటూ ఉంది. నివేత పేతురాజ్ దగ్గర ఉన్న  ఖరీదైన కారు? డాడ్జ్ ఛాలేంజర్ స్పోర్ట్స్ కారు https://www.youtube.com/watch?v=S6luYDlMNiY
    అక్టోబర్ 22 , 2024
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?</strong>
    Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : నాని, ప్రియాంక అరుళ్ మోహన్‌, ఎస్‌.జే. సూర్య, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అభిరామి, అదితి బాలన్‌, మురళి శర్మ, అజయ్‌ తదితరులు డైరెక్టర్‌ : వివేక్ ఆత్రేయ సంగీతం : జేక్స్‌ బేజోయ్‌ ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్ నిర్మాతలు : డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి విడుదల తేదీ : 29-08-2024 నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram Movie Review). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటివరకూ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్‌ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈసారి ఊర మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన శైలికి భిన్నంగా పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సరిపోదా శనివారాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ఈ చిత్రంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నాని నటన మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. (Saripodhaa Sanivaram Movie Review) ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో హీరో నాని ఇరగదీశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో నాని నటన ఉంటుంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ నాని తనదైన మార్క్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక నానికి ప్రత్యర్థిగా ఎస్‌.జే. సూర్య అదరగొట్టాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో నాని సైతం తన నటనతో ఎస్‌.జే సూర్య డామినేట్‌ చేశారు. వీరిద్దరి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక లేడీ కానిస్టేబుల్‌ పాత్రలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ సెటిల్డ్‌గా నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ఆమె ఆకట్టుకుంది. నాని-ప్రియాంక మధ్య వచ్చే డిఫరెంట్‌ లవ్‌ ట్రాక్‌ ఆడియన్స్‌కు నచ్చుతుంది. సాయికుమార్‌, అజయ్‌, మురళీ శర్మలతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. రొటిన్‌ స్టోరీనే తీసుకున్నప్పటికీ తనదైన మేకింగ్‌తో వివేక్‌ మెస్మరైజ్‌ చేశాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకు పాత్రల పరిచయానికే దర్శకుడు తీసుకున్నాడు. హీరో నాని బాల్యం, శనివారం కాన్సెప్ట్‌, హీరోయిన్‌తో పరిచయం, అదిరిపోయే ఇంటర్వెల్‌ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో నాని, ఎస్‌.జే సూర్య మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ సన్నివేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌తో నింపేశాడు. అయితే నిడివి ఎక్కువగా ఉండటం సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీతగా అనిపిస్తాయి. నాని పాత్ర పరిచయానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌లుగా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్‌ బేజోయ్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, ఎస్‌.జే. సూర్య నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ మైనస్ పాయింట్స్‌ సుదీర్ఘమైన నిడివిట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; ‘సరిపోదా శనివారం’పై పబ్లిక్‌ టాక్‌ సరిపోదా శనివారం చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్టులు పెట్టడం విశేషం. ముఖ్యంగా నాని, ఎస్‌.జే. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. సోషల్‌ మీడియాలోని కొన్ని పోస్టుల ఆధారంగా పబ్లిక్‌ ఓపీనియన్‌ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిపోదా శనివారం చిత్రం సంతృప్తికరమైన యాక్షన్‌ డ్రామా అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్‌ బ్లాక్‌, ఇంటర్వెల్‌ బ్లాక్‌, క్లైమాక్స్‌ బ్లాక్‌, నాని - సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్‌ అయ్యాయని పోస్టు పెట్టాడు. https://twitter.com/venkyreviews/status/1828908558198644841 డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీ లేదని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ఎస్‌.జే. సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందేనని పేర్కొన్నాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయిందని, పోతారు మెుత్తం పోతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్‌ కాస్త బోర్‌గా అనిపించినా మాస్‌ ఆడియన్స్‌ను పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని ప్రశంసించాడు. https://twitter.com/_NaveenReddy_14/status/1828931798719414466 ఈ సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్‌ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీజీఎం ర్యాంప్‌ అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Abhi_pkcult/status/1828908519141323179 సరిపోదా శనివారానికి తనదైన శైలిలో రివ్యూ చెబుతూ ఓ నెటిజన్‌ 3/5 రేటింగ్‌ ఇచ్చాడు. పాత్రల పరిచయం, డిజైన్‌ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. తర్వాతి సీన్లను ముందుగానే ఊహించగలగడం, పెద్దగా మలుపులు లేకపోవడం కాస్త డ్రా బ్యాక్‌గా నిలిచిందని రాసుకొచ్చాడు. https://twitter.com/chitrambhalareI/status/1828918494358110555 సోషల్ మీడియా అంతా 'సరిపోదా శనివారం' పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Raktapatham/status/1828908737358438724 నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందని మరికొందరు అంటున్నారు. 30 నిమిషాల నిడివిని ట్రిమ్‌ చేయటం అవసరమని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. బోరింగ్‌ మసాలా సీన్స్‌, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి 2/5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు. https://twitter.com/Devara15629882/status/1828909154398023884
    ఆగస్టు 29 , 2024
    <strong>Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?</strong>
    Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
    సినిమాకు హీరో, హీరోయిన్‌ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్‌ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) టాలీవుడ్‌లో సెన్సిబుల్‌ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్‌ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్‌, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్‌, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్‌’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్‌ ఈజ్‌బ్యూటీఫుల్‌’లో షగున్‌ కౌర్‌ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్‌ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్‌ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్‌ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.&nbsp; హను రాఘవపూడి (Hanu Raghavapudi) శేఖర్‌ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్‌, సాయిపల్లవి, మృణాల్‌ ఠాకూర్‌ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్‌ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్‌ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్‌ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) యంగ్‌ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్‌ చేసిన ‘మెంటల్‌ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్‌ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్‌, నివేదా థామస్‌, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. శౌర్యువ్ (Shouryuv) దర్శకుడు శౌర్యువ్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్‌ ఠాకూర్‌ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్‌ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్‌ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్‌ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్‌ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ యూత్‌ఫుల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్‌ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్‌ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్‌ భాస్కర్‌. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్‌ బాస్కర్‌ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?</strong>
    Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
    నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram Weekend Collections). గురువారం (ఆగస్టు 29) విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ నాని సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు థియేటర్‌ అక్యుపెన్సీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నాని చిత్రం ఎంత వసూలు చేసింది? తొలి నాలుగు రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్‌ కొల్లగొట్టింది? ఇప్పుడు చూద్దాం.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.68.52  కోట్లు (GROSS) సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇదిలా ఉంటే ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘సరిపోదా శనివారం’ దేశంలో రూ.33.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇప్పటివరకూ రూ.29.65 వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. అటు కర్ణాటకలో రూ. 4.65 కోట్లు, తమిళనాడులో రూ.3.23 కోట్లు, కేరళలో రూ.27 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.1.45 కోట్లు రాబట్టినట్లు వివరించాయి.  రూ.100 కోట్ల మార్క్‌ దిశగా.. బాక్సాఫీస్‌ వద్ద సరిపోదా శనివారం దూకుడు చూస్తుంటే ఈజీగానే రూ.100 కోట్ల మార్క్ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వాయు గుండం ప్రభావం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్ష ప్రభావం తగ్గితే ‘సరిపోదా శనివారం’ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. తద్వారా అలవోకగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి. నాని కెరీర్‌లో ‘దసరా’ మాత్రమే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో రెండో చిత్రం లోడింగ్‌ అంటూ నాని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.  నెలలోపే ఓటీటీలోకి..! నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram OTT) నెల రోజుల లోపే ఓటీటీలోకి రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం అవుతుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హిందీ వెర్షన్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలోనూ హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్‌, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.&nbsp; సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!</strong>
    Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!
    నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 29 గ్రాండ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సినిమాలో తమను నిరాశకు గురిచేసిన అంశాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఓవరాల్‌గా పాజిటివ్ రివ్యూస్‌ సాధించిన నాని చిత్రం తొలి రోజు మంచి వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; తొలి కలెక్షన్స్‌ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం తొలి రోజు ఆశించిన స్థాయిలోనే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.20.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.8.8 కోట్లు మేర రాబట్టినట్లు స్పష్టం చేశాయి. ఓవర్సీస్‌లో రూ.7.6 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిపాయి. అటు కర్ణాటకలో రూ.1.4 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.2.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఈ వీకెండ్‌ సాలిడ్‌ వసూళ్లను సాధించే అవకాశముందని అంచనా వేశాయి. సినిమా హిట్‌ టాక్‌ అనంతరం టికెట్‌ బుకింగ్స్‌ గణనీయ సంఖ్యలో పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.&nbsp; ‘దసరా’ కంటే తక్కువే! నాని గత చిత్రం 'హాయ్‌ నాన్న' (Hi nanna) తొలి రోజున రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ చిత్రంతో పోలిస్తే ‘సరిపోదా శనివారం’ రెట్టింపు వసూళ్లను సాధించడం విశేషం. అయితే నాని అంతకుముందు చిత్రం ‘దసరా’ కంటే ఇది చాల తక్కువనే చెప్పవచ్చు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా తొలి రోజున రూ.38 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి నాని కెరీర్‌లో హైయస్ట్‌ ఓపెనింగ్‌గా నిలిచింది. దానితో పోలిస్తే 'సరిపోదా శనివారం' రూ.18 కోట్ల మేర వెనకబడింది. అయినప్పటికీ నాని కెరీర్‌లో సెకండ్‌ హయ్యేస్ట్ ఓపెనింగ్‌ చిత్రంగా ‘సరిపోదా శనివారం’ రికార్డు సృష్టించింది. సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/saripodhaa-sanivaaram-review-nani-ooramas-massacre-in-the-action-sequence-how-about-saripodhaa-sanivaaram.html
    ఆగస్టు 30 , 2024
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    అక్టోబర్ 22 , 2024
    <strong>HBD Ileana D'Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!</strong>
    HBD Ileana D'Cruz: ఇలియానా ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా? తెలిస్తే షాకే!
    గ్లామరస్ డాల్ ఇలియానా నేడు 38 వ వంసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 38వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి&nbsp; ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది.&nbsp; ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; &nbsp;'బాద్షాహో', 'రుస్తోమ్' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ (HBD IlleanIleana D'Cruz) ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.&nbsp; &nbsp;2018లో మెకాఫీ 'మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ' సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె,&nbsp; ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది 10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది. &nbsp;ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి. https://twitter.com/tejdeharam/status/1852220221001732234 డేటింగ్ హిస్టరీ ఇలియానా సినీ కెరీర్ హిట్‌ అయినంతగా... పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు.&nbsp; తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. వీళ్లిద్దరు చాలా ఏళ్లు సహజీవనం చేశారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు 2019లో విడిపోయారు. ఆండ్రూ నీబోన్‌తు విడిపోయిన తర్వాత.. ఇలియానా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖెల్‌తో జతకట్టింది. వీరిద్దరు 2023 వరకు సహజీవనం చేశారు.&nbsp; సెబాస్టియన్‌తోనూ పొసగక ఇలియానా అతనికి ఈ గోవా సుందరి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత వెంటనే 2023 జులైలో మైకెల్ డోలాన్‌తో తన రిలేషన్‌ షిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది.&nbsp; తామిద్దరం డేట్ నైట్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాలో(HBD IlleanIleana D'Cruz) హార్ట్‌ ఎమోజీతో తమ రిలేషనన్ షిప్‌ను కన్ఫామ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి (మే 13.2023) ద్వారా ఈ ఇద్దరు ఏకం అయ్యారు. అయితే ఇలియానా పెళ్లికి ముందే తన ప్రెగ్నెన్సీని ఏప్రిల్ కన్ఫామ్ చేసింది. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 2023 ఆగస్టు 1న ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.&nbsp; మరోవైపు 'ఫాటా పోస్టర్ నిక్లా' హీరో సినిమా చిత్రీకరణ సమయంలో.. హీరో షాహిద్ కపూర్‌తో ఎఫైర్‌ కొనసాగించినట్లు గాసిప్స్ ఉన్నాయి. వివాదాలు సెక్స్‌పై ఇలియానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. "sex is a major relaxation to my body. it keeps me Young and I dont mind to talk about that in Public" ("సెక్స్ నా శరీరానికి ముఖ్యమైన విశ్రాంతి. ఇది నా యవ్వనాన్ని కాపాడుతుంది, ఈ&nbsp; విషయాన్ని ప్రజల ముందు మాట్లాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.") ఇలియానాకు హైదరాబాదీ బిర్యాని అంటే చాలా ఇష్టం, చైనీస్, ఇటాలియన్ ఫుడ్ వెరైటీస్‌ను కూడా ఇష్టంగా తింటుంది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలిఖాన్‌లు తన అభిమాన నటులు అని పలు సందర్భాల్లో చెప్పింది. ఇలియానా దక్షిణాదిలో కోటీ రూపాయలు రెమ్యునరేషన్‌గా పొందిన తొలి హీరోయిన్‌గా పేరు గడించింది. ఆమె కెరీక్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేసింది. ఇలియానాకు మద్యం అలవాటు ఉంది. పార్టీ సమయాల్లో రెగ్యులర్‌గా మద్యం సేవిస్తూ ఉంటుంది. ఇలియానాకు హిందీ భాష పూర్తిగా రాదు, గోవాలో పుట్టి పెరగడంతో ఆ భాషపై అంతగా పట్టు సాధించలేదు. క్రమంగా బర్పీ చిత్రం నుంచి హిందీపై పట్టు సాధించింది. ఇలియానాకు మింట్ చాక్లెట్స్ అంటే తెగ ఇష్టం. వాటికి తాను అడిక్టెడ్. ఎప్పుడూ నములుతూనే ఉంటుంది.
    నవంబర్ 01 , 2024
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు&nbsp; దర్శకత్వం : డా. హరిత గోగినేని సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి&nbsp; విడుదల తేదీ: డిసెంబర్‌ 14, 2024 ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్‌ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్‌ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్‌ సంపత్‌ (అరవింద్‌ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్‌ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్‌ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review) ఎవరెలా చేశారంటే నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్‌ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్‌ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్‌ కథతో పాటే ట్రావెల్‌ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్‌, సీనియర్‌ నటి పవిత్ర లోకేష్‌ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; https://twitter.com/IndianClicks/status/1867486641822347748 డైరెక్షన్ ఎలా ఉందంటే ‘ఫియర్‌’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఫార్మెట్‌ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్‌ వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్‌ వర్క్‌ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ వేదిక నటనఫియర్‌ ఎలిమెంట్స్‌ట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ కథనంలో తడబాటుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    డిసెంబర్ 13 , 2024
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌, చిత్ర శుక్లా, రూపా&nbsp; లక్ష్మీ, అనీష్‌ కురువిల్ల, దేవి ప్రసాద్‌ తదితరులు.. దర్శకత్వం : రమాకాంత్‌ రెడ్డి సంగీతం : అజయ్‌ అరసద సినిమాటోగ్రాఫర్‌ : చరణ్‌ మాధవనేని నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ విడుదల తేదీ: 29-03-2024 విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విజయ్-సాగర్‌ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్‌ భయపడుతుంటే సాగర్‌ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్‌ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్‌ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్‌ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే? విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్‌ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్‌ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి&nbsp; క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్‌. ఓవరాల్‌గా రమాకాంత్‌ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్‌ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. చాలా సీన్లు లైవ్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్‌ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తోంది.&nbsp; ప్లస్ పాయింట్స్ కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 29 , 2024
    <strong>Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!</strong>
    Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
    అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; పెళ్లి పనులు షురూ టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) రెండేళ్లుగా ప్రేమాయణం! నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది.&nbsp; ‘పెళ్లి గురించి కలలు కనలేదు’ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో 'లవ్‌, సితారా' అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;</strong>
    PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;
    ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్‌ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా&nbsp; PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు.&nbsp; ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761 పోస్టర్‌లో ఇవి గమనించారా? ‘మ‌హా కాళీ’ పోస్టర్‌ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. కాళికాదేవి శక్తితో.. మహాకాళి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్‌ పాత్ర ఏ హీరోయిన్‌ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్‌ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్‌ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
    అక్టోబర్ 10 , 2024
    SSMB 29: మహేష్‌ - రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!
    SSMB 29: మహేష్‌ - రాజమౌళి సినిమాపై రెండు అప్‌డేట్స్‌.. ఒకటి గుడ్‌.. రెండోది బ్యాడ్‌!
    ప్రముఖ హీరో మహేష్‌ బాబు (Mahesh Babu), అగ్రదర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక్క ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఆయన హీరోగా మహేష్‌ను ఒక్కరినే ఫైనల్‌ చేసినట్లు చెప్పారు. మిగతా నటీనటుల కోసం కసరత్తు జరుగుతోందని చెప్పి ఊరుకున్నారు. అయితే తాజాగా SSMB29 ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. అది చూసిన ఫ్యాన్స్‌కు నిరాశ చెందుతున్నారు.&nbsp; మరింత ఆలస్యం! మహేష్‌ రాజమౌళి కాంబోలో సినిమా రానున్న విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దీనిపై ఇంతవరకూ మేకర్స్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించలేదు. అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన ఏప్రిల్ 9న ఉగాది కానుకగా ఉంటుందని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌లో కాకుండా మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ చేయాలని దర్శకుడు రాజమౌళి &amp; టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్స్‌ కోసం ఆగాల్సిందేనని అంటున్నారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. ఇలా ఎన్ని రోజులు వెయిట్‌ చేయిస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.&nbsp; ఆ భామకు ఛాన్స్‌ దక్కిందా? 'SSMB 29' సినిమాలో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌కు జోడీగా అలియా భట్‌ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్‌ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్‌ చేసే అవకాశముందని కామెంట్లు వినిపిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, హాలీవుడ్‌ నటి చెల్సియా ఇస్లాన్‌ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. SSMB 29.. టైటిల్‌ ఇదేనా? దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్‌ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్‌ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.&nbsp;
    మార్చి 26 , 2024
    <strong>Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్‌ చేసిన పవన్‌.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!</strong>
    Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్‌ చేసిన పవన్‌.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!
    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన రెండు స్థానాల్లో పవన్‌ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకోగా అతను కూడా కొద్ది నెలలకే అధికార వైకాపా ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో పవన్‌ను టార్గెట్‌ చేస్తూ వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం పవన్‌ దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున పవన్‌పై టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పవన్‌ను ట్రోల్‌ చేస్తూ ఏకంగా సినిమా కూాడా తీశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-భాజపా) అధికారంలోకి వచ్చింది. పవన్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పవన్‌ను ఎంతగానో విమర్శించిన ఆర్జీవీ, పోసానిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.&nbsp; ఆర్జీవీపై వరుస కేసులు సినీ డైరెక్టర్​ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఇవాళ (నవంబర్‌ 11) ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ (Nara Lokesh), బ్రాహ్మణి (Nara Brahmani), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్​ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్​ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్జీవీపై గుంటూరు జిల్లా తాళ్లురు పోలీసు స్టేషన్‌లోనూ కేసు పెట్టారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్​లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్​ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; త్వరలో పోసాని అరెస్టు! పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. వైసీపీ స్థాపన తరువాత జగన్‌ పంచకు చేరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. జగన్‌ సీఎం అయ్యాక వైసీపీ నేతల కంటే మరింత ఘాటుగా పవన్‌, చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్‌పై పలు ప్రెస్‌మీట్లలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పవనో మెంటల్‌ కేసని, పైసల కోసమే మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టిందని గతంలో పోసాని మండిపడ్డారు. మట్టిగొట్టుకుపోతావ్‌ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గతంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమోచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను తిరగదోడుతుండటంతో ఓ క్షణమైన పోసాని అరెస్టు కావొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం! సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వైసీపీ మద్దతుదారులనేదీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ తల్లిని సైతం ఆమె దూషించిన సందర్భాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వారిపై ఏపీ పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో శ్రీరెడ్డిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియోను సైతం రిలీజ్‌ చేసింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనిత పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై తన మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టనని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.&nbsp; ప్రకాష్‌ రాజ్‌పై చర్యలుంటాయా? ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్‌ ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్‌ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ప్రకాష్‌ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సందించారు. జస్ట్ ఆస్కింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో పవన్‌ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. పవన్‌ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయంలో దూరి మరి విమర్శలు చేయడంపై జనసేన కార్యకర్తలు, పవన్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌పైనా చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత కేసులనే ఏపీ పోలీసులు తిరగదోడుతున్నారు. పైగా ప్రకాష్‌ రాజ్‌పై ఏ స్టేషన్‌లోనూ కేసు నమోదు కానందున ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 11 , 2024
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్  హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.  ‘హనుమాన్‌’గా&nbsp; తొలుత యష్ ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్‌ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.&nbsp; దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా? రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్‌ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
    అక్టోబర్ 30 , 2024
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; ‘హనుమాన్‌’గా కాంతార నటుడు! ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్‌ ప్రకారం కాంతారా ఫేమ్‌ రిషబ్‌శెట్టితో ప్రశాంత్‌ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్‌ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్‌ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp; దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.&nbsp; స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా? ‘జై హనుమాన్‌’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్‌ పాత్రకు పలానా స్టార్‌ హీరోను ఫైనల్‌ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌, రానా దగ్గుబాటి, కేజీఎఫ్‌ ఫేమ్‌ యష్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్‌ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్‌’పై ప్రేక్షకుల్లో హైప్‌ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్‌ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్‌’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్‌ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ‘కాంతార’తో పాన్‌ ఇండియా క్రేజ్‌ రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.&nbsp; ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp;
    మే 28 , 2024
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్‌ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే.&nbsp; అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.&nbsp; ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.&nbsp; సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.&nbsp; తమిళ స్టార్‌ హీరో కార్తిక్‌.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్‌ - వెంకటేష్‌ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.&nbsp; గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.&nbsp; https://twitter.com/yousaytv/status/1717459822881509489 వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.&nbsp; వెంకటేష్‌.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3)&nbsp; అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.&nbsp; ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.&nbsp;
    మార్చి 16 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024

    @2021 KTree