ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Prime
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
రిషి / రిషికేశ / మిరపకాయ్రిచా గంగోపాధ్యాయ
వినమ్రదీక్షా సేథ్
వైశాలిప్రకాష్ రాజ్
కిట్టుకోట శ్రీనివాసరావు
శంకర్ అన్ననాగేంద్ర బాబు
నారాయణ మూర్తిసునీల్
చారుకేశఅలీ
అల్ పాసినోసంజయ్ స్వరూప్ఏసీపీ శ్రీనివాస్
అజయ్
కిట్టు కొడుకుసుప్రీత్
శంకర్ అన్న కొడుకుచంద్ర మోహన్
వినమ్ర తండ్రిసుధ
వినమ్ర తల్లిబ్రహ్మాజీ
రామ్ గుప్తాధర్మవరపు సుబ్రహ్మణ్యం
అమ్మ సుబ్రహ్మణ్యంరావు రమేష్
కళాశాల ప్రిన్సిపాల్సురేఖ వాణిరావు రమేష్ భార్య
ప్రవీణ్
ఫిష్ వెంకటయ్య
ఫిష్ వెంకట్నర్సింగ్ యాదవ్
కరాటే కళ్యాణి
స్వాతి రెడ్డి
స్వాతి రెడ్డి అతిధి పాత్రలోసిబ్బంది
హరీష్ శంకర్
దర్శకుడురమేష్ పుప్పాలనిర్మాత
తమన్ ఎస్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.
నవంబర్ 06 , 2024
Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్ శంకర్ కాంబో మళ్లీ మ్యాజిక్ చేసిందా?
నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, శుభలేక సుధాకర్, కిషోర్ రాజు వశిష్ట, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం : హరీష్ శంకర్
సంగీతం : మిక్కీ. జె. మేయర్
సినిమాటోగ్రఫీ : అయనంక బోస్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అభిషేక్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్ బచ్చన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ సత్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో సత్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్ బచ్చన్ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్రథమార్ధాన్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్‌కు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మార్చారు డైరెక్టర్. అయితే ప్రథమార్ధంలో కనిపించిన హరీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేపథ్యంగానే ద్వితీయార్ధమంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మరోవైపు కనుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటనలవ్ ట్రాక్కామెడీ, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ద్వితియార్థంకొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 16 , 2024
Kavya Thapar VS Bhagyashri Borse: వీరిద్దరిలో టాలీవుడ్‌ను ఏలేది ఎవరంటే?
టాలీవుడ్‌కు హీరోయిన్స్ కొత్త కాదు. సినిమా సినిమాకు కొత్త భామలు పరిచయమవుతూనే ఉంటారు. అందం, అభినయంతో మెప్పించిన వారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగితే మరికొందరు మాత్రం సత్తా చాటలేక కనుమరుగవుతుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15 సందర్భంగా ఇద్దరు హీరోయిన్స్ తెలుగు తెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse), ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో కావ్యా థాపర్ (Kavya Thapar) తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. కావ్య థాపర్ ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాలు చేయగా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఇదే ఫస్ట్ ఫిల్మ్. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరి విజయవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
భాగ్యశ్రీ బోర్సే
అందానికి కేరాఫ్‌గా భాగ్యశ్రీ!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఒక్కో ఈవెంట్‌లో ఒక్కోరకమైన లుక్‌తో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఈవెంట్‌లో చీర కట్టులో ట్రెడిషనల్‌గా కనిపించి, మరో ఈవెంట్‌లో మోడ్రన్ డ్రెస్‌లో కళ్లు చెదిరే గ్లామరస్‌గా కనిపిస్తోంది. అటు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ కూడా ఈ బ్యూటీని హైలెట్ చేస్తోంది. ప్రతీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడిని పాల్గొనేలా చేస్తూ సినిమాపై యూత్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ హాట్ బ్యూటీ కూడా దొరికిందే ఛాన్స్ అని తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రమోషన్స్‌కు సరికొత్త అందాలు తీసుకొస్తోంది. ఇదే బెస్ట్ ఛాన్స్‌గా భావిస్తూ దూసుకెళ్తోంది.
హరీష్ శంకర్ మార్క్!
‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్, టీజర్, ప్రమోషన్ పోస్టర్స్ గమనిస్తే భాగ్యశ్రీ ఇందులో గ్రామరస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన ఈ అమ్మడు అదిరిపోయే ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. పైగా హీరోయిన్స్‌ను చూపించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్‌కు మంచి పేరుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’లో ఇద్దరు హీరోయిన్స్‌తో ఏ స్థాయిలో ఎంటర్‌టైన్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ నుంచి భారీ ఎత్తున అందాల ఆరబోత ఉండే అవకాశముంది. ఈ చిత్రం ద్వారా భాగ్యశ్రీకి సరైన స్టార్ట్ లభిస్తే ఇండస్ట్రీలో ఈ అమ్మడికి తిరుగుండదని చెప్పవచ్చు. పైగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం భాగ్యశ్రీకి కలిసిరానుంది.
చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్
ఒక్క మూవీ రిలీజ్ కానప్పటికీ భాగ్యశ్రీ బోర్సేతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్నారు. 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ దశలో ఉండగానే అదిరిపోయే ఆఫర్లు భాగ్యశ్రీ దక్కాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా రెండు బ్లాక్ బాస్టర్లు వస్తే టాలీవుడ్‌లో భాగ్యశ్రీ టాప్ హీరోయిన్‌గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
https://www.youtube.com/watch?v=CS7Wm46EXAA
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
కావ్య థాపర్
కావ్య థాపర్ హల్‌చల్!
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి బ్రేక్ రాలేదు. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సక్సెస్‌పై కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శనకు సైతం ఏమాత్రం వెనకాడలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్, లిరికల్ సాంగ్ వీడియోలు, ప్రమోషన్ పోస్టర్స్ చూస్తే కావ్య థాపర్ ఎంతో హాట్‌గా కనిపించింది. గ్లామరస్ లుక్, కళ్లు చెదిరే హాట్ స్టెప్పులతో యూత్‌ను కట్టిపడేసింది. అంతకాదు లిప్‌లాక్ సీన్‌లోనూ నటించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అన్ని అనుకున్నట్లు జరిగి డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ అయితే కావ్య థాపర్ స్టార్ హీరోయిన్‌గా మారడం పక్కా అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో..
గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వం' చిత్రంలో కావ్య థాపర్‌గా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకూ ఇటలీలో నిర్వహించారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘పుష్ప 2'లో ఓ స్పెషల్ సాంగ్‌లో కావ్య థాపర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యూత్‌లో ఈ భామ అందాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఐటెం సాంగ్‌ను కావ్య చేయిస్తే ఎలా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వచ్చే ఛాన్స్ ఉందట. వీటితో పాటు మరిన్ని అవకాశాలు కావ్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE
కావ్య థాపర్ నేపథ్యం ఇదే!
మహారాష్ట్రకు చెందిన కావ్య థాపర్ 2013లో ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘ఏక్ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది. ఆ తర్వాత క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది. ‘ఈగల్’, ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కాగా, సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీ బిజీగా ఉంటోంది.తన గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆగస్టు 13 , 2024
HBD Pawan Kalyan: పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇంత మంది స్టార్ హీరోలు అయ్యారా? లిస్ట్ పెద్దదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించి 25 ఏళ్లు దాటింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక్కడ అభిమానులు అనే కంటే భక్తులను సంపాదించుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ సెట్ చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన కేరీర్ ఆరంభంలో సినిమాల ఎంపికను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆయన్ను విమర్శించిన వారే తిరిగి పవన్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయిన వారు కొకోల్లలు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. ఈ సందర్భంగా ఆయన రిజెక్ట్ చేసిన హిట్ సినిమాల జాబితాను ఓసారి చూద్దాం. ఈ సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోలుగా ఉన్నారన్న మాటలో అతిశయోక్తి లేదు.
ఇడియట్
మెగా ఫ్యామిలీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెద్ద భక్తుడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు పూరి. అప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇడియట్ కథను తొలుత పూరి జగన్నాత్ పవన్ కళ్యాణ్‌కు వినిపించారట. కానీ పవన్ నో చెప్పడంతో ఆ స్టోరిని రవితేజ దగ్గరకు వెళ్లాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రవితేజ తన పర్ఫామెన్స్‌తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టాడు. 2002లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్‌తో రవితేజ తన సినీ ప్రస్థానానికి రాచమార్గం వేసుకున్నాడు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ సినిమా స్టోరీని కూడా మొదట పవన్ కళ్యాణ్‌కు వినిపించాడు పూరి జగన్నాథ్. అయితే ఎందుకనో పవన్ ఈ సినిమాకు సైతం నో చెప్పాడు. దీంతో మళ్లీ ఈ కథతో పూరి రవితేజతో కలిసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో రవితేజ స్టార్ హిరోగా మారిపోయాడు.
అతడు
అతడు సినిమా కథను తొలుత పవన్ కళ్యాణ్‌కు వినిపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కథకు పవన్ నో చెప్పటంతో మహేష్ దగ్గరకు వెళ్ళింది. 2005 లో విడుదల అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మహేష్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
పోకిరి
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. ఈ స్టోరీని పవన్ చేయాలనుకున్నా ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. దీంతో ఈ కథను పూరి.. మహేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్‌ని అడిగారు. కానీ పవన్ తిరస్కరించడంతో స్టోరీ మహేష్ దగ్గరకు వెళ్లింది. వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. 2013లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
వీటితో పాటు గోపిచంద్ నటించిన గోలిమార్ సినిమా, రవితేజ నటించిన మిరపకాయ్, రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాల కథలు తొలుత పవన్ కళ్యాణ్ తలుపు తట్టినవే అని ఇండస్ట్రీలో టాక్.
ఆగస్టు 31 , 2023
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్ వాంటెడ్ టాప్-10 చిత్రాలు!
సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
రాజాసాబ్ (The Raja Saab)
ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వచ్చే ఏడాది ‘రాజాసాబ్’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్ తెగ ఎదురుచూస్తున్నాడు.
ఓజీ (OG)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ (Game changer)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత చరణ్ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 (War 2)
టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్ నటిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD 12
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love story) మంచి హిట్ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మిరాయ్ (Mirai)
‘హనుమాన్’ (Hanuman) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరా (Kubera)
క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జీ 2 (G2)
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
NANI 33
‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024