• TFIDB EN
  • ముఫాసా: ది లయన్ కింగ్
    UTelugu
    ముఫాసా (సింహం) వరదల్లో కొట్టుకుపోయి టాకా (సింహం) ఉన్న రాజ్యానికి వస్తాడు. టాకా పెంచుకుందామని పట్టుబడటంతో అతడి ఫ్యామిలీ భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై దాడి జరగ్గా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొని తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. దీంతో తెల్ల సింహాల రాజు కిరోస్‌.. ముఫాసాను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిలేలే రాజ్యం వైపు ముఫాసా, టాకా ఎందుకు పయనమయ్యారు? కిరోస్‌ నుంచి ముఫాసాకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ. i
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?

    హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ...read more

    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    ముఫాసా(వాయిస్ ఓవర్)
    అలీ
    టిమోన్(వాయిస్ ఓవర్)
    సత్యదేవ్ కంచరణా
    టాకా
    బ్రహ్మానందం
    పుంబా
    సిబ్బంది
    బ్యారీ జెన్‌కిన్స్దర్శకుడు
    డిస్నీనిర్మాత
    హన్స్ జిమ్మెర్
    సంగీతకారుడు
    జేమ్స్ లాక్టన్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    <strong>Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్‌ యానిమేషన్‌ చిత్రం 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్‌ 20న రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్‌ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్‌ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్‌’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.&nbsp; అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్‌ గార్డ్‌’ కామిక్‌ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్‌ రూపంలో ఈ టెలివిజన్‌ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం. టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్‌’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్‌ కింగ్‌’ పేరుతో 1994లో కార్టూన్‌ యానిమేషన్‌ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.&nbsp; ఆ తర్వాత 2016లో ‘ది లయన్‌ కింగ్‌’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్‌ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసింది.&nbsp; 'ది లయన్‌ కింగ్‌' (2019) వరల్డ్‌ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.&nbsp; ఇప్పుడు ది లయన్‌ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్‌ కింగ్‌ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (2019), ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్‌ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్‌ స్టార్స్‌ వర్క్ చేశారు.&nbsp; అరోన్‌ పీరే (ముఫాసా), డొనాల్డ్‌ గ్లోవర్‌ (సింబా), బియాన్స్‌ (నాలా), బ్లూ ఇవి కార్టర్‌ (కియారా), జాన్‌ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్‌ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు. ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్‌ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ యానిమేషన్‌ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.&nbsp; ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.  2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ముఫాసా తెలుగు వెర్షన్‌ ఈసారి మరింత హైలేట్‌ కాబోతోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దీంతో మహేష్‌ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300 ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో స్టార్‌ కమెడియన్స్‌ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్‌ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.  https://twitter.com/thetalkenti/status/1866815051316785331 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్‌ పాత్రలకు వారు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.&nbsp; తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పారు. అర్జున్‌ దాస్‌ (ముఫాసా), అశోక్‌ సెల్వన్‌ (టాకా), నాజర్‌ (కిరోస్‌), వీటీవీ గణేష్‌ (యంగ్‌ రఫీకీ), సింగం పులి (టిమన్‌) డబ్బింగ్‌ చెప్పారు.  https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209 హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి.
    డిసెంబర్ 18 , 2024
    <strong>Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్‌.. టాప్‌ ఏదంటే?</strong>
    Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్‌.. టాప్‌ ఏదంటే?
    క్రిస్మస్‌ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ శుక్రవారం (డిసెంబర్‌ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్‌ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్‌ పరంగా ఏ సినిమా టాప్‌లో ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ‘ముఫాసా’ డే 1 కలెక్షన్స్‌.. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) లైవ్‌ యానిమేషన్‌ చిత్రంగా రూపొందింది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu) డబ్బింగ్‌ చెప్పాడు. మహేష్‌ వాయిస్‌ ఓవర్‌తో పంచ్‌లు, ప్రాసలు అదిరిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్స్‌ విషయాన్ని వస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్‌ (Mufasa: The Lion King Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇంగ్లీషు వెర్షన్‌లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.కోటి గ్రాస్‌ తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్‌ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. క్రిస్మస్‌ సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, తొలి వీకెండ్‌లో ‘ముఫాసా’ వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్‌ డాలర్లు (రూ.1529 కోట్లు) వసూలు చేస్తుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి.  ‘యూఐ’ కలెక్షన్స్ ఎంతంటే ఉపేంద్ర (Upendra) హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘యూఐ’ (UI) శుక్రవారం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కనెక్ట్‌ అయితే పక్కా ఎంటర్‌టైన్‌ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం రూ.Rs 6.75 కోట్ల గ్రాస్‌ (UI Movie Day 1 Collections) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే రూ.6 కోట్లు తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.70 లక్షలు, తమిళంలో రూ.4 లక్షలు, హిందీ రీజియన్‌లో రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిపాయి. యూత్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున అటెన్షన్‌ రావడంతో వీకెండ్‌లో ‘యూఐ’ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. ‘విడుదల 2’ కలెక్షన్స్‌.. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ రూపొందించిన ‘విడుదల 2’ (Vidudala 2) చిత్రం డిసెంబర్‌ 20న రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి నటన, వ్యవస్థల లోపాలను దర్శకుడు ఎత్తిచూపిన విధానం బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.9 కోట్ల గ్రాస్‌  (Vidudala 2 Movie Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.8 కోట్లు వసూలైనట్లు తెలిపాయి. తెలుగులో రూ.60 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.3.5 కోట్లు వచ్చి చేరాయని వివరించాయి. మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి కలెక్షన్స్‌ పెరగడం కష్టమేనని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి.  ‘బచ్చల మల్లి’ వసూళ్లు.. అల్లరి నరేష్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. అయితే అల్లరి నరేష్‌ మాస్ పర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.80 లక్షల (Bachchala Malli Day 1 Collections) వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా నెట్‌ కలెక్షన్స్‌ రూ.60 లక్షల వరకూ ఉండొచ్చని చెప్పాయి. యావరేజ్‌ టాక్ నేపథ్యంలో వీకెండ్స్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి. 
    డిసెంబర్ 21 , 2024
    <strong>SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!&nbsp;&nbsp;</strong>
    SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!&nbsp;&nbsp;
    మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. Image Credit: X ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారించారు. Image Credit: X రెండేళ్ల పాటు షూటింగ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్‌లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. https://twitter.com/AbhiM2608/status/1866455157590184410 ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా &nbsp;ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు. Image Credit: X ఎక్స్‌లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్ SSMB29&nbsp; సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్‌ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్‌కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Image Credit: X ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, "ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది" అని అన్నారు. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. Image Credit: X అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
    డిసెంబర్ 10 , 2024
    <strong>Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!</strong>
    Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్‌ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్‌ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సింహానికి మహేష్ డబ్బింగ్‌ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) డబ్బింగ్‌ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్‌ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1826142693149327810 డబ్బింగ్‌పై మహేష్‌ ఏమన్నారంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ యానిమేషన్‌ చిత్రంలో మెయిన్‌ లీడ్‌కు డబ్బింగ్‌ చెప్పడంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ను బిగ్‌ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హిందీలో డబ్బింగ్ ఎవరంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్‌ చేయడంపై షారుక్‌ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు.&nbsp; ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    <strong>Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?</strong>
    Mufasa: The Lion King Review: మహేష్‌ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
    నటులు: మహేష్‌ బాబు, సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు) దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ లక్ట్సాన్‌ ఎడిటింగ్‌: జోయ్‌ మెక్‌మిలన్‌ సంగీతం: డేవ్‌ మెట్జర్‌, నికోలక్‌ బ్రిటెల్‌, లిన్‌ మాన్యుల్‌ మిరాండ నిర్మాతలు: అడెలె రొమన్‌స్కీ, మార్క్‌ కారియాక్‌ నిర్మాణ సంస్థ: డిస్నీ విడుదల: డిసెంబర్‌ 20, 2024&nbsp; హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పాడు. అలాగే సత్యదేవ్‌, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్‌ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్‌ డబ్బింగ్‌ ఆకట్టుకుందా? యానిమేషన్‌ వర్స్క్‌ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. ‌దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్‌ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.  డబ్బింగ్‌ ఎలా ఉందంటే ముఫాసా: ది లయన్‌ కింగ్‌ (Mufasa: The Lion King Review) లైవ్‌ యానిమేషన్‌ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్‌ డబ్బింగ్‌ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్‌లో మహేష్‌ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్‌తో మెస్మరైజ్‌ చేశాడు. సెటైర్లు, పంచ్‌లు, గంభీరమైన డైలాగ్స్‌తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్‌ వాయిస్‌ బాగా సెట్‌ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్‌లో మంచి వేరియేషన్స్‌ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్‌తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్‌ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039 డైరెక్షన్ ఎలా ఉందంటే 2019లో వచ్చిన 'ది లయన్‌ కింగ్‌' చిత్రానికి ప్రీక్వెల్‌గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్‌ స్కార్‌ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్‌, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్‌లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. అయితే రొటీన్‌ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్‌గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్‌ ఆడియన్స్‌ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్‌ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ టాప్‌ నాచ్‌ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ మహేష్‌బాబు డబ్బింగ్‌గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    డిసెంబర్ 20 , 2024
    <strong>Mufasa: The Lion King Leak: ‘ముఫాసా’కు బిగ్‌షాక్‌.. ఆన్‌లైన్‌లో ఫుల్‌ HD మూవీ లీక్‌</strong>
    Mufasa: The Lion King Leak: ‘ముఫాసా’కు బిగ్‌షాక్‌.. ఆన్‌లైన్‌లో ఫుల్‌ HD మూవీ లీక్‌
    యావత్‌ సినీ లోకం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King చిత్రం ఇవాళే (డిసెంబర్‌ 20) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. భారత్‌లో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా అందు బాటులోకి వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’కు విశేష స్పందన వస్తోంది. హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ‘ముఫాసా’పై కాసుల వర్షం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంగా ఈ మూవీకి బిగ్‌ షాక్‌ తగిలింది. సినిమా విడుదలై 24 గంటలు గడవకముందే ఈ మూవీ పైరసీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.  పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షం హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రం పైరసీ బారిన పడింది. ప్రముఖ పైరసీ సైట్స్‌ అయిన మూవీరూల్జ్ (Movierulz), తమిళ్‌ రాకర్స్‌ (Tamilrockers), ఫిల్మీజిల్లా (Filmyzilla), మూవీస్‌దా (Moviesda), టెలిగ్రామ్‌ ఛానెల్స్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. HD, FHD క్వాలిటీతో ఈ మూవీ వీక్షించండంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలా జరగడంతో మూవీ టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్స్ ప్రస్తుతం ముఫాసా పైరసీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలిగ్రామ్‌ ఛానల్స్‌లోనూ ఈ సినిమా డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. 'Mufasa: The Lion King Movie Download', 'Mufasa: The Lion King Movie HD Download', 'Mufasa: The Lion King Tamilrockers', 'Mufasa: The Lion King Filmyzilla', 'Mufasa: The Lion King Telegram Links', and 'Mufasa: The Lion King Movie Free HD Download' వంటి కీవార్డ్స్‌ నెట్టింట తెగ ట్రెండింగ్‌ అవుతున్నాయి.  పైరసీలో ఆ మజా ఉండదు.. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King Piracy) లైవ్‌ యానిమేషన్‌ చిత్రంగా రూపొందింది. విజువల్‌ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందని ఫిల్మ్‌ వర్గాలు సూచిస్తున్నాయి. థియేటర్లలో మాత్రమే ఆ వీఎఫ్‌ఎక్స్‌ను అనుభూతి చెందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా 3Dలో ముఫాసా చూస్తే పక్కాగా మరో ప్రపంచంలోకి వెళ్లి వస్తారని పేర్కొంటున్నారు. పైరసీ సినిమా చూస్తే ‘ముఫాసా’ను ఎంజాయ్‌ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. పైరసీ ప్రింట్‌ వీక్షిస్తే అదొక సాధారణ ఫిల్మ్‌గానే కనిపిస్తుందని అంటున్నారు.  పైరసీలో చూస్తే చిక్కుల్లో పడ్డట్లే! పైరసీ సైట్స్‌లో సినిమాలు చూసేవారికి సైబర్‌ ముప్పు (Mufasa: The Lion King Piracy) అధికంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఇల్లిగల్‌ సైట్స్‌.. మాల్‌వేర్‌, స్పైవేర్‌, ర్యాన్సమ్‌వేర్‌ వంటి సైబర్‌ నేరస్తులకు కేంద్రాలుగా మారాయని తెలియజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సినిమా చూడొచ్చని ఆయా సైట్స్‌లోకి వెళ్తే మీ వ్యక్తిగత సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మీ బ్యాంక్‌ ఖాతా సమాచారం, పాస్‌వర్డ్స్‌ వారి చేతుల్లోకి వెళ్లి ఆర్థికంగా తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.&nbsp;
    డిసెంబర్ 20 , 2024
    <strong>Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!</strong>
    Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!
    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్‌ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉంది? అందులో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ వాయిసే హైలేట్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక క‌థ చెప్పే స‌మ‌యం వ‌చ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల క‌థ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. పుట్టుక‌తోనే అన్న‌ద‌మ్ములు కాక‌పోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువ‌బ‌డిన టాకాల క‌థ ఇది అంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మ‌ధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడ‌ప్పుడు ఈ చ‌ల్ల‌ని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాప‌కాల్ని గుర్తుచేస్తున్న‌ట్లు అనిపిస్తుంది’ అంటూ మ‌హేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ‘మ‌నం ఒక్క‌టిగా పోరాడాలి, నేను ఉండ‌గా నీకు ఏం కాదు టాకా, భ‌య‌ప‌డ‌కు’ అంటూ మ‌హేష్ బాబు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివ‌ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు మహేష్‌. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.&nbsp; మ‌హేష్ వాయిస్ కోస‌మైనా సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129 ‘ఇది నాకెంతో ప్రత్యేకం’ ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్‌ చెప్పడంపై మహేష్‌ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తెలుగులో మహేష్‌.. హిందీలో షారుక్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్‌ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp; 'SSMB29'తో బిజీ బిజీ దర్శక ధీరుడు రాజ‌మౌళితో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఇందులో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకోసం లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 26 , 2024

    @2021 KTree