రేటింగ్ లేదు
UATelugu
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ 'NBK109'. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ పాటలు సమకూరుస్తున్నారు.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
How was the movie?
తారాగణం
నందమూరి బాలకృష్ణ
దుల్కర్ సల్మాన్
త్రిష కృష్ణన్
బాబీ డియోల్
ప్రకాష్ రాజ్
ఊర్వశి రౌటేలా
రోనిత్ రాయ్
చాందిని చౌదరి
పాయల్ రాజ్‌పుత్
పోసాని కృష్ణ మురళి
సిబ్బంది
కెఎస్ రవీంద్ర
దర్శకుడుసాయి సౌజన్యనిర్మాత
సూర్యదేవర నాగ వంశీనిర్మాత
కథనాలు
NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్!
టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ చిత్రం 'అఖండ 2' కాదా?
బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్ సంగీతం అందింబోతున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాతే షూట్!
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.
నాని డైరెక్టర్‌తో సినిమా!
ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
మార్చి 14 , 2024
Balakrishna: బాలయ్య క్రేజీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.. క్యూలో త్రివిక్రమ్, ప్రశాంత్ వర్మ, బోయపాటి!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ (Kajal Aggarwal).. కూతురిగా శ్రీలీల (Sreeleela) నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ (Director Bobby)తో బాలకృష్ణ ‘NBK109’ చిత్రాన్ని చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా మరో మూవీ కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నాని డైరెక్టర్‌తో సినిమా!
ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)కు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే మూవీ కన్ఫామ్ కానుంది.
హిట్ కాంబినేషన్ రిపీట్!
నటసింహాం బాలకృష్ణ.. తన ‘NBK109’ చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘NBK110’వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో బాలయ్య చేయబోతున్నట్లు న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గ స్క్రిప్ట్ వర్క్ కూడా చకా చకా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈలోపు బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేస్తారు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత వీరి కాంబోలో ‘NBK110’ వస్తుండటంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీని తర్వాత బాలయ్య - రాహుల్ సంకృత్యాన్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్‌తో బాలయ్య చిత్రం!
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ కూడా త్వరలోనే సెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసే అవకాశమున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్.. బన్నీతో ఓ సినిమా తీయాల్సి ఉంది. ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీ అయిపోవడం.. తాజాగా పార్ట్-3 ఉంటుందని హింట్ ఇవ్వడంతో త్రివిక్రమ్ తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేసేందుకు మెుగ్గు చూపుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సి ఉందని అంటున్నారు.
ఆ డైరెక్టర్లతోనూ చర్చలు!
నందమూరి బాలకృష్ణ.. బాబీ, బోయపాటి శ్రీనుతోనే కాకుండా మరికొందరు డైరెక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తనకు 'వీర సింహా రెడ్డి' వంటి హిట్ అందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తోనూ బాలకృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో కథకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాలకృష్ణ చకా చకా కొత్త సినిమాలను ఓకే చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకదానిని సెట్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్
టాలీవుడ్‌లోని సీనియర్ నటులతో (చిరంజీవి, నాగార్జున, వెంకటేష్) పోలిస్తే ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నది బాలయ్య మాత్రమే. బాలయ్య చివరి మూడు చిత్రాలు బ్లాక్ బాస్టర్లుగా నిలవడం విశేషం. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి క్రేజీ హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన సినిమానే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఇలా బాలయ్య వరుసగా మూడు హిట్లను అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.
బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతంటే?
సినిమా సినిమాకి తన రేంజ్‌ని (Nandamuri Balakrishna Remuneration) పెంచుకుంటూ పోతున్న బాలయ్య ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ని మరింతగా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అఖండ ముందు వరకు మోస్తరు పారితోషికాన్ని తీసుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ విజయాల తర్వాత దానిని ఒక్కసారిగా పెంచేశారట. తన అప్‌కమింగ్ సినిమాలు అన్నింటికి రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. రాబోయే చిత్రాలు సైతం స్టార్ డైరెక్టర్లతో ఉండటంతో బాలయ్య ఫ్యూచర్ మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. రామ్‌చరణ్ (Ramcharan), తారక్ (Jr NTR) తరహాలోనే బాలయ్య కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని నందమూరి అభిమానులు అంటున్నారు.
ఫిబ్రవరి 20 , 2024
Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!
ఈ జనరేషన్ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్ (Allu Arjun), రామ్‌చరణ్ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్.. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
‘పుష్ప 2’ వాయిదా
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
రేసులో గేమ్ ఛేంజర్!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని దిల్‌రాజు ఫిక్స్ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్ బరిలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అల్లు vs మెగా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు ఆర్మీ సవాల్
ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్‌ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/madhavg_Indian/status/1801862004627366096
https://twitter.com/madhavg_Indian/status/1801824969023758738
https://twitter.com/DpAadhf/status/1785639853717082162
జూన్ 18 , 2024
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.
బాలయ్య vs రవితేజ
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్ త్వరగా షూట్ చేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.
గతంలో బాలయ్యదే పైచేయి
బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవర నుంచి గట్టిపోటీ తప్పదా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని కొరటాల టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 13 , 2024
NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ - బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్ ఉంది. గతంలో బాలయ్య - బోయపాటి చేసిన హ్యాట్రిక్ చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇవాళ (జూన్ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.
బాలయ్య కుమార్తె సమర్పణలో..
ఇవాళ (జూన్ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది 'NBK 110' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - బోయపాటి అప్‌కమింగ్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. 'లెజెండ్' చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. 'NBK110' చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం.
షూటింగ్ ఎప్పుడంటే?
బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్ ప్రకారం.. 'NBK110' చిత్రం ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీతో కలిసి 'NBK109' చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు.
బోయపాటికే సాటి..
ఇండస్ట్రీకి హ్యాట్రిక్ విజయాలను అందించిన బాలకృష్ణ - బోయపాటి జర్నీ.. 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్ కావడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 10 , 2024
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్ హిట్ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్లకు పైగా మార్కెట్!
దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.
రూ.700-1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్ ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ తారక్ (NTR31), ప్రభాస్ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
రూ. 500-700 కోట్ల మార్కెట్
ఈ మార్కెట్ రేంజ్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సరైన హిట్ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్ కూడా డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.
రూ.200-500 కోట్ల మార్కెట్
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్ రూ.200 పైనే ఉండనుంది.
సెప్టెంబర్ 28 , 2024
Pushpa 2 vs NBK 109: అల్లు అర్జున్‌తో బాలకృష్ణ ‘ఢీ’.. బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్ షురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). ప్రస్తుతం స్పీడ్‌గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అల్లు ఆర్మీ ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా డిసెంబర్ ఫస్ట్ వీక్ బరిలో ఇప్పటివరకూ ఏ సినిమా లేకపోడవంతో ఇక బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’కి తిరుగుండదని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే బన్నీ చిత్రానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపంలో గట్టి పోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో బాలయ్య - బన్నీ ఒకరికొకరు తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 వర్సెస్ NBK 109..!
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'NBK 109' వర్కింగ్ టైటిల్‌తో చాలా స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని సంక్రాతి కానుకగా బరిలోకి దింపాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం నెల రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న 'NBK 109'ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వర్సెస్ నందమూరి బాలయ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
అఖండ సెంటిమెంట్!
డిసెంబర్ మెుదటి వీక్‌లోనే బాలయ్య తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ సెంటిమెంట్ కూడా దోహదం చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda Movie) చిత్రం సరిగ్గా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2న విడుదలైంది. ఆ చిత్రం ఏ స్థాయి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘NBK 109’ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తే ఆ మూవీ సైతం సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నిలిచింది. జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రం, అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'శతమానం భవతి 2' మూవీస్ సైతం సంక్రాంతి పోటీలో ఉన్నాయి. దీంతో జనవరి నుంచి ‘NBK 109’ వెనక్కి తగ్గాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ.. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులను టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ తదితరులను వేడుకలకు ఆహ్వానించారు. అలాగే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌లను కూడా ఆహ్వానాలు అందాయి.
బాలయ్య.. అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం 109 సినిమాల్లో ఆయన నటించారు. అయితే బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌తో బాలయ్య నటించారు. ఇక ఆయన నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. సోషల్, పౌరాణిక, జానపద, బయోపిక్స్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ డ్రామాలు, యాక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో బాలకృష్ణ సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా బాలయ్య సొంతం. 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు.
ఆగస్టు 29 , 2024
Daku Maharaj Story: ‘డాకు మహారాజ్’ స్టోరీ ఇదేనా? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్!
టాలీవుడ్ మాస్ చిత్రాలకు కేరాఫ్ అనగానే ముందు గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). గత కొంతకాలంగా వరుస మాస్ ఎంటర్‌టైనర్స్ తీస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిట్‌ను ‘డాకూ మహారాజ్’గా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అంతేకాదు అదిరిపోయే టీజర్‌తో నందమూరి అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయితే టైటిల్, టీజర్‌తోనే దర్శకుడు బాబీ సినిమా కథను చెప్పకనే చెప్పాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
టీజర్‌లో ఏముంది?
నటుడు బాలకృష్ణ - దర్శకుడు బాబీ (Bobby) కాంబోలో రాబోతున్న 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ను సైతం రిలీజ్ చేశారు. 'ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్‌తో మెుదలైంది. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్, విజువల్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ టీజర్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్ సీక్వెన్స్‌తో దర్శకుడు నింపేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోమారు బాలయ్య మాస్ తాండవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=teN0JZ67KZU
డాకు మాన్సింగ్ ప్రేరణతో..
బాలయ్య పోషిస్తున్న డాకు మహారాజ్ రోల్‌ను ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎవరీ డాకు మహారాజ్? అని సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అసలు పేరు డాకు మాన్సింగ్. పంజాబ్, ఛంబల్ ప్రాంతాల్లో బందిపోటు దొంగగా ఒకప్పుడు చలామణీ అయ్యాడు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన చిన్నతనంలో డాకు మాన్సింగ్ పేరు బాగా వినేవారట. ఆయన చేసే దోపిడీలు, తప్పించుకునే తీరు విని చిన్నప్పుడు ఎంతో భయపడినట్లు అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అయితే డాకు మాన్సింగ్ దోచుకున్న సొమ్మును సొంతానికి వాడుకునేవారు కాదట. పేదోళ్లకు ఆ ధనం మెుత్తాన్ని పంచేవారని చంబల్ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.
https://twitter.com/SitharaEnts/status/1857285926067823074
స్టోరీ ఇదేనా!
ఒకప్పటి ఫేమస్ బందిపోటు డాకు మాన్సింగ్ (Daku Maharaj Story) పాత్రను ప్రేరణగా తీసుకొని దర్శకుడు బాబీ బాలయ్య చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో బందిపోటైన బాలయ్య ప్రజలకు అండగా నిలుస్తాడని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను పీడించి, వారి కష్టాన్ని దోచుకున్న వారిని ఇందులో బాలయ్య టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. వారి నుంచి ఎంతో చాకచక్యంగా దోచుకున్న ధనాన్ని తిరిగి ప్రజలకే పంచుతాడని అంచనా వేయవచ్చు. అయితే మూడు భిన్న కాలాల్ని ప్రతిబింబించేలా కథ ఉంటుందని కూడా అంటున్నారు. దీన్నిబట్టి కథలో డాకు మహారాజ్ ఒక భాగం అవుతాడా? లేదా అతడి చుట్టూనే సినిమా తిరగనుందా? అన్నది తెలియాల్సి ఉంది.
https://twitter.com/SitharaEnts/status/1857296349605273899
మూడు కోణాల్లో బాలయ్య..
'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న 'డాకు మహారాజ్'. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన బాబీదేవోల్ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్ర నటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కథ సాగే కాలానికి తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్ కూడా మరో లెవల్లో ఉంటాయని అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!
మెగా తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులోకి ‘తండేల్’!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
చరణ్ వర్సెస్ చైతూ
టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బాలయ్య నుంచి గట్టిపోటీ!
గేమ్ ఛేంజర్, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 15 , 2024
Mahesh - Balakrishna Multi Starrer: క్లాస్-మాస్ కాంబినేషన్‌లో క్రేజీ మల్టీస్టారర్? స్టోరీ కూడా రెడీ అట!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna), మహేష్‌బాబు (Mahesh Babu) ఒకరు. క్లాసీ లుక్స్‌తో మహేష్ ఫ్యాన్స్‌ను అలరిస్తే, బాలకృష్ణ తనదైన మాస్ డైలాగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తారు. అటువంటి ఈ ఇరువురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ అంటే ఆ ఊహే ఎంతో బాగుంది కదూ!. అయితే టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వ్యాఖ్యలను బట్టి ఈ మల్టీస్టారర్ త్వరలోనే సాధ్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓ షోలో తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
థమన్ ఏమన్నారంటే?
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మూడవ సీజన్‌కు సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరిస్తుండగా సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో సెమీఫైనల్లో భాగంగా యాంకర్ శ్రీరామచంద్ర తమన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 'బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమొస్తే ఇద్దరిలో ఎవరి చిత్రానికి పని చేస్తారు?' అని అడిగారు. దీనిపై తమన్ ఇచ్చిన సమాధానం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది. బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి మల్టీసారర్ సినిమా చేస్తారని ఆ సినిమా కథ కూడా తాను విన్నానని చెప్పుకొచ్చాడు. దీనికి యాంకర్ శ్రీరామచంద్రతో పాటు ప్రేక్షకులంతా ఈలలు వేస్తూ గోల చేశారు.
https://twitter.com/CINE_EXPLORERS/status/1832658977953607782
రచ్చ చేస్తున్న ఫ్యాన్స్!
క్లాస్, మాస్ కాంబోలో మల్టీస్టారర్ రానున్నట్లు తమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్, బాలయ్య కాంబోలో సినిమా వస్తే రికార్డులు చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో సూపర్ కృష్ణ (Super Star Krishna), ఎన్టీఆర్ (N T Rama Rao) కలిసి నటించిన విషయాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్నారు. తిరిగి వారి కుమారులు కూడా కలిసి నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్ ఈ వ్యాక్యలు సరదాగా చేశారా? లేదా నిజంగానే అందులో వాస్తవముందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ గురించి ప్రేక్షకుల ఊహలే తప్ప సినిమా కథ, దర్శకత్వం లాంటి వాటి గురించి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇదే నిజమైతే స్పీకర్లే కాదు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఇరు హీరోల అభిమానులు చెబుతున్నారు.
ఒకవేళ ఉన్నా.. ఇప్పట్లో లేనట్టే!
‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ తన తర్వాతి చిత్రాన్ని దర్శకుధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం ఇంకో మూడేళ్లు మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ తన లుక్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే జుట్టు, గడ్డం భారీగా పెంచేశారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందనుంది.
బాలయ్య బిజీ బిజీ
బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లితో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (NBK 109) చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి థమనే సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్ (Bobby Deol), ఉర్వశి రౌతేలా (Urvashi Rautela) కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బాలయ్య బిజీ బిజీగా ఉన్నారు.
సెప్టెంబర్ 09 , 2024
Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్ కొట్టు!
టాలివుడ్ ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్ అవుతోంది. స్టార్ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ వెండితెరపై వెలుగులీనుతున్నాయి.
బలం చూపిన ‘బలగం’
వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు.
చిన్న సినిమాలతో మొదలై..
అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్ మూవీస్ చాలానే ఉన్నాయి.
ఫిదా
లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్ మొదలుకుని టైటిల్ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్ అనుకున్నారట.
ఈ నగరానికి ఏమైంది?
పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్ సేన్, అభినవ్ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి.
డీజే టిల్లు
2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్ అదిరిపోయాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.
మల్లేశం
ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీకి కమ్‌బ్యాక్ మూవీ అయ్యింది. రామ్ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్ పిల్లగా హీరోయిన్ నభా నటేశ్ అమితంగా ఆకట్టుకుంది.
విరాట పర్వం
నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది.
NBK108లోనూ..
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు.
ఆస్కార్ స్థాయికి
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్ ఇప్పుడు టాప్ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
ఏప్రిల్ 01 , 2023