• TFIDB EN
  • ఎన్టీఆర్ 31
    రేటింగ్ లేదు
    UATelugu
    జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోయే చిత్రం ఎన్టీఆర్ 31లో బాబీ డియోల్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తాత్కాలికంగా డ్రాగన్ అనే టైటిల్ పెట్టారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఎన్టీ రామారావు జూనియర్.
    సిబ్బంది
    ప్రశాంత్ నీల్
    దర్శకుడు
    నందమూరి కళ్యాణ్ రామ్
    నిర్మాత
    వై. రవిశంకర్నిర్మాత
    నవీన్ యెర్నేనినిర్మాత
    కథనాలు
    <strong>NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?</strong>
    NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?
    ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా గప్‌చుప్‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అందరినీ షాక్‌కి గురిచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వాటిని ట్రెండింగ్‌ చేస్తున్నారు.&nbsp; కుటుంబ సభ్యుల సమక్షంలో.. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. నేడు (ఆగస్టు 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.&nbsp; https://twitter.com/reddy_tarock/status/1821778632026751223 https://twitter.com/AllHailNTR/status/1821765706507284736 https://twitter.com/Sudha_NTR/status/1821785928798454169 విభిన్నమైన కథాంశంతో.. ప్రశాంత్‌ నీల్ సినిమా అనగానే భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే హీరోయిజం గుర్తుకువస్తాయి. కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల్లో యష్‌, ప్రభాస్‌లను చూపించినట్లుగానే తారక్‌ను కూడా చాలా పవర్‌ఫుల్‌గా ప్రశాంత్ నీల్‌ చూపిస్తారని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్‌ నీల్‌ ‘NTR 31’ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దీన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని పేర్కొన్నారు. దీంతో తారక్‌ను కేజీఎఫ్‌, సలార్‌కు మంచి సరికొత్తగా నీల్‌ మామా చూపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; డ్యూయల్‌ రోల్‌లో తారక్‌? తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్‌ చేసింది. ఆ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; భారీ బడ్టెట్‌.. తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp;
    ఆగస్టు 09 , 2024
    <strong>NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?</strong>
    NTR 31: జూ.ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్‌.. బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌?
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్‌ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రైతు పాత్రలో తారక్‌! &nbsp;తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp; ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి! తారక్‌ బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్‌ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్‌ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్‌ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్‌ నీల్‌కు డేట్స్‌ అడ్డస్ట్‌ చేయవచ్చని తారక్‌ అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రాజకీయాలపై క్లారిటీ దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్‌ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
    అక్టోబర్ 01 , 2024
    <strong>Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!</strong>
    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది.&nbsp;వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ‘జైలర్‌’ డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా చిత్రం! మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్‌, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్‌ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్‌ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్‌, జైలర్‌ హిట్స్‌తో నెల్సన్‌ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; 2026 వరకూ ఆగాల్సిందే! తారక్ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2' (War 2) పెండింగ్‌ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్‌ సైతం ‘జైలర్‌ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్‌ 2’ షూటింగ్‌ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్‌ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.&nbsp; మా స్ట్రెంత్‌ అతడే: తారక్‌ 'దేవర' బ్లాక్‌ బాస్టర్‌ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కల్యాణ్‌ రామ్‌ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు. బంగ్లాదేశ్‌ రైతుగా జూ.ఎన్టీఆర్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌ ఫిక్సయ్యిందా? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హృతిక్‌ రోషన్‌తో తలపడనున్న తారక్‌..!
    NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హృతిక్‌ రోషన్‌తో తలపడనున్న తారక్‌..!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా పాన్‌ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.&nbsp;&nbsp; అధికారిక ప్రకటన తరణ్‌ ఆదర్స్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ‘వార్‌-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్‌ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్‌’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్‌ ‘అయాన్‌ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్‌-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు.&nbsp; ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.&nbsp;&nbsp; ముందే తెలుసా? బ్రహ్మస్త్ర డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్‌ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్‌ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్‌-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.&nbsp; బిజీబిజీగా జూ.NTR ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తోంది. పాన్‌ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్‌-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్‌ పూర్తైన వెంటనే వార్‌-2 సినిమాపై ఎన్టీఆర్‌ ఫోకస్‌ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్‌ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే. అతి పెద్ద సంస్థ వార్‌-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్‌ ఫిల్మ్ స్పై యూనివర్స్‌ సంస్థకు భారీ బడ్జెట్‌ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్‌ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన పఠాన్‌ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కాంబోలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి చేసిన ‘వార్‌’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్‌ వర్సస్‌ పఠాన్‌’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్‌, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
    టాలివుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, బాలయ్య, మహేశ్‌ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన రామ్‌ చరణ్ ‘ఆరెంజ్‌’ కూడా ఇటీవల&nbsp; విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.&nbsp; దేశముదురు అల్లు అర్జున్‌ను మాస్‌ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్‌ స్టార్‌ మేనియాను క్యాష్‌ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.&nbsp;&nbsp; ఆది RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్‌ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వివి వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సింహాద్రి రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.&nbsp; మోసగాళ్లకు మోసగాడు భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్‌ ఫిల్మ్‌ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్‌ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా&nbsp; మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్‌ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్‌ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్‌ ఉండదు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం సోషల్‌ మీడియాలో నిత్యం తరుణ్‌ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్‌ భాస్కర్‌ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే&nbsp; రీ రిలీజ్‌ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. రజినీకాంత్‌ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని&nbsp; మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో&nbsp; ఫ్లాప్‌ అయినా టీవీలో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్‌ చేస్తున్నారు. మీరు ఏ సినిమా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 01 , 2023
    <strong>NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్‌.. నీల్‌ మామ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడుగా!</strong>
    NTR 31: 75 ఏళ్ల వృద్ధుడిలా తారక్‌.. నీల్‌ మామ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడుగా!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సక్సెస్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. బాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత ‘NTR 31’ ప్రాజెక్ట్‌లో నటించేందుకు తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; డ్యూయల్‌ రోల్‌లో తారక్‌? తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; నర రూప రాక్షసుడిగా..! 'NTR 31' చిత్రంలో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఓ పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అతడు నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. తారక్‌ పాత్రను డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్‌ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. డ్రాగన్‌ టైటిల్‌ ఫిక్స్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; రూ.300 కోట్ల ఖర్చుతో.. తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp; ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే? క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.&nbsp;
    జూలై 26 , 2024
    <strong>NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో </strong><strong>జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!</strong>
    NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!
    ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత 'NTR 31' సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; రాక్షసుడిగా తారక్‌! ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న 'NTR 31' చిత్రాన్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రం తారక్‌ కెరీర్‌లో 31వ సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. తారక్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. తారక్‌ పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్‌ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; భారీ బడ్జెట్‌ చిత్రం తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp; ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే? క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.&nbsp;
    జూన్ 22 , 2024
    <strong>Jr NTR: ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!</strong>
    Jr NTR: ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!
    బాక్సాఫీస్‌కు వణుకుపుట్టించే అతికొద్ది మంది హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అప్పటివరకూ ఉన్న రికార్డ్స్‌ అన్ని సైడ్‌ అవ్వాల్సిందే. ఎన్టీఆర్‌ బిగ్‌ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అటువంటి తారక్‌ నుంచి రెండున్నరేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) తర్వాత ప్రేక్షకులను పలకరించలేదు. దీంతో ఎన్టీఆర్‌ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు తారక్‌ సైతం సెప్టెంబర్‌ 27న ‘దేవర’తో రాబోతున్నాడు. అంతేకాదు నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ పెట్టేందుకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేయబోతున్నాడు. అభిమానుల దాహార్తిని తీర్చేందుకు వచ్చే రెండేళ్లలో ఏకంగా నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాలను రిలీజ్‌ చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌ లైనప్‌లోని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.&nbsp; ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌! 2018 నుంచి 2024 ఆగస్టు మధ్య ఎన్టీఆర్‌ నుంచి కేవలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మాత్రమే వచ్చింది. అయితే ఆ మూవీ భారీ సక్సెస్‌ గ్యాప్‌ను మర్చిపోయేలా చేసింది. లేటెస్ట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో తారక్‌ రాబోతున్నాడు. ఇక మీదట తారక్‌ నుంచి వరుసగా చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 పాన్‌ ఇండియా చిత్రాలతో తారక్‌ బిగ్‌ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తొలుత దేవరతో సందడి చేయనున్న తారక్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్రం 'వార్‌ 2'తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. అందులో స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నాడు. అలాగే 'దేవర 2' సీక్వెల్‌ కూడా తారక్‌ లైనప్‌లో ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో 'NTR 31' ప్రారంభమైంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అలాగే దీంతో పాటు 'హాయ్‌ నాన్న' డైరెక్టర్‌ శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్‌ మూవీ ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తుంది. ఇదీ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్‌ అయ్యేలా ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది.&nbsp; ‘NTR 31’ స్టోరీ ఇదేనా! ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ శుక్రవారం (ఆగస్టు 9) పూజా కార్యక్రమంతో మెుదలైంది. NTR31 కొత్త పోస్టర్‌ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని ప్రచారం జరుగుతోంది. 1969 నాటి ఓపియం మాఫియాకి రిలేటేడ్‌గా రానున్నట్లు సమాచారం. ఈ మాఫియాలో ఎన్టీఆర్‌ను డ్రగ్ లార్డ్‌గా చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్‌కి అది అడ్డాగా మారింది. దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం అక్కడి లోకల్స్‌ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరిగేవట. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయని అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్‌ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; తారక్‌ ద్విపాత్రాభినయం! తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్‌ చేసింది. ఆ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; ఆ టైటిల్‌ ఖరారు! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp;
    ఆగస్టు 10 , 2024
    <strong>Devara Story Prediction: కొరటాల శివ సూపర్‌ హిట్‌ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్‌ స్టోరీ ఇదేనా?</strong>
    Devara Story Prediction: కొరటాల శివ సూపర్‌ హిట్‌ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్‌ స్టోరీ ఇదేనా?
    తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ కూడా నేడు రిలీజ్‌ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  కొరటాల ఫార్ములా ఇదే? కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్‌’ (Janatha Garage), ‘భరత్‌ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్‌ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్‌ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం 'ఆచార్య' కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్‌ - పాదగట్టం - చిరును లింకప్‌ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.  దేవర స్టోరీ ఇదేనా? కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్‌ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్‌ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్‌ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్‌ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్‌) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్‌ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్‌ మాత్రం కన్విన్సింగ్‌ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  చరిత్ర సృష్టించిన ‘దేవర’ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా తాజాగా అది 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్‌ ద్వారా అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లతో తారక్‌.. 'దేవర' తర్వాత తారక్‌ లైనప్‌లో బాలీవుడ్‌ చిత్రం 'వార్‌ 2'తో పాటు 'NTR 31' కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, 'NTR 31' ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్‌ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్‌ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.&nbsp; ట్రైలర్ లోడింగ్‌..&nbsp; యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్‌  2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్‌ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్‌ కూడా యాక్షన్‌ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్‌ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. 
    సెప్టెంబర్ 10 , 2024
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్‌ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్‌ చేసిన టాప్‌ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్‌ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్‌ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; టాప్‌-20లో బాలీవుడ్‌ తారలు సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేయబడ్డ టాప్‌ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్‌ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్‌ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్‌- 20లో చోటు దక్కించుకున్నారు.&nbsp; దీపిక పదుకొనే (Deepika Padukone)షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)అలియా భట్‌ (Alia Bhatt)ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irrfan Khan)అమీర్‌ ఖాన్‌ (Aamir Khan)సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)&nbsp;అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కత్రినా కైఫ్‌ (Katrina Kaif)అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)సమంత రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu)కరీనా కపూర్‌ (Kareena Kapoor)త్రిప్తి దిమ్రి (Tripti Dimri)తమన్న భాటియా (Tamannaah Bhatia)రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)నయనతార (Nayanthara)రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh)అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) తెలుగులో టాప్‌ ఎవరంటే? ఐఎండీబీ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్‌ తర్వాత తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ (31), అల్లు అర్జున్‌ (47), జూనియర్ ఎన్టీఆర్‌ (67), మహేశ్‌ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్‌-100లో నిలిచారు.&nbsp; టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా? ఐఎండీబీ రిలీజ్‌ చేసిన తాజా జాబితాలో టాప్‌-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ (సలార్‌), అల్లు అర్జున్‌ (పుష్ప), రామ్‌చరణ్‌ - తారక్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్‌ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్‌ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్‌ స్టార్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్‌-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు.&nbsp;
    జూన్ 05 , 2024
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    Balayya vs Jr.NTR: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిపారేయ్.. బాలకృష్ణ ఆగ్రహం.. వీడియో వైరల్
    ఎన్టీఆర్(Sr. NTR) వర్ధంతి వేళ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat)లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ అంశంలోకి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కలుగచేసుకోవడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.&nbsp; https://twitter.com/i/status/1747792524042006727 ‘తీయించేయ్‌.. ఇప్పుడే’ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో తన తాతకు నివాళులర్పించారు. ఆ తర్వాత కాసేపటికి నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికెళ్లారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత.. అక్కడ జూ. ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాలయ్య చూపు పడింది. ఆ ప్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ ఆదేశించారు. ఇప్పుడే తీసేయాలి అంటూ కోపంగా బాలయ్య అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/i/status/1747862444142375247 తారక్‌ ఫ్యాన్స్‌ మండిపాటు ఈ ఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తన అల్లుడు నారా లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తారక్‌ రాజకీయాల్లోకి వస్తే లోకేష్‌ భవితవ్యం ప్రశ్నార్థకం అవతుందని పేర్కొంటున్నారు. తారక్‌కు ఉన్న క్రేజ్‌, మాట్లాడే తత్వం, నాయకత్వ లక్షణాలు లోకేష్‌ను పొలిటికల్‌గా ఇరకాటంలో పడేస్తాయని, అందుకే బాలయ్య తారక్‌ను దూరం పెడుతున్నారని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. &nbsp; కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అల్లుడు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారు. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. https://twitter.com/i/status/1747872349519765593 రంగంలోకి వైసీపీ వర్గాలు! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో అధికార వైసీపీ.. ఈ ప్లెక్సీల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌.. తారక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతూ ఎన్టీఆర్‌ అభిమానులను మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోంది. బాలయ్య అన్న మాటలను తమ సోషల్‌ మీడియా వేదికల్లో విపరీతంగా సర్క్యూలేట్‌ చేస్తూ టీడీపీకి చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. మెుత్తంగా తారక్‌ ప్లెక్సీల తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయ రంగును పులుముకోవడం గమనార్హం. https://twitter.com/i/status/1747887445574848809 గతంలోనూ ఇలాగే.. అయితే గతంలోనూ నందమూరి కుటుంబానికి, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తారక్‌ ఒక్క ప్రకటన చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ అంశంపై బాలయ్యను ప్రశ్నించగా ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ అప్పట్లోనే ఆయన బదులిచ్చారు. ఆ అసహనంతోనే ఇప్పుడు ప్లెక్సీలు తీయించమని ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లోనూ తారక్‌ ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్‌ స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేసే కార్యక్రమంలో నందమూరి కుటుంబం మెుత్తం పాల్గొన్నప్పటికీ&nbsp; హరికృష్ణ కుటుంబం దూరంగా ఉంది. తారక్‌ మౌనానికి కారణం అదేనా? 2009 ఎలక్షన్స్‌ ముందు వరకూ తారక్‌ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
    జనవరి 18 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    War 2: బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. ఏడుస్తున్న తారక్ ఫ్యాన్స్‌.. దీనికి అసలు కారణం ఇదేనా?
    టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్‌ తారలు సైతం ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్‌ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్‌ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ స్క్రీన్‌ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; తారక్‌.. తనని తాను తగ్గించుకుంటున్నాడా? ఎన్టీఆర్ - హృతిక్‌ రోషన్‌ కలిసి చేయనున్న వార్‌ - 2 చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్‌ నెగిటివ్‌ రోల్‌లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్‌ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్‌చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్‌ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్‌ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల సినిమాలో హృతిక్‌ పాత్రే హైలైట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.&nbsp; రెమ్యూనరేషన్‌ తక్కువే! ఇక రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే&nbsp; RRR చిత్రానికే ఎన్‌టీఆర్‌ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్‌ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్‌-2 చిత్రంలో ఎన్టీఆర్‌ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్‌ను అభిమాన హీరోను నెగిటివ్‌ రోల్‌లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్‌ రెమ్యూనరేషన్‌ ఎక్కువనే చెప్పాలి.&nbsp; లాభాల్లో షేర్.. ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్‌ నేరుగా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా వార్‌-2 సినిమా లాభాల్లో షేర్‌ తీసుకునేలా డీల్‌ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్‌ 2 సినిమా కోసం తారక్‌ కంటే ముందు ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండను సంప్రదించారని ‌గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్‌ చేయడం వల్లే తారక్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను&nbsp; యాష్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్‌ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్‌ పెట్టినట్లైంది. ఇకపోతే వార్‌ 2 సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; శరవేగంగా NTR 30 షూటింగ్‌ ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్‌లో తారక్‌ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం ‌అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    మే 10 , 2023
    Nani 33 Movie: నానితో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్ హీరోయిన్, ఎవరంటే?
    Nani 33 Movie: నానితో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్ హీరోయిన్, ఎవరంటే?
    బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒకరు. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ శ్రీ దేవి కూతురిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్‌ 'దేవర' చిత్రానికి ఓకే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్‌ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ లేటెస్ట్‌గా మరో క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్‌ స్టార్‌ నానితో జాన్వీ జతకట్టబోతున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; &nbsp;'Nani 33’ ప్రాజెక్ట్‌పై సంతకం! నేచురల్‌ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన 'దసరా' (Dasara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం ద్వారా నాని, శ్రీకాంత్‌ ఓదెల తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే శ్రీకాంత్‌ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశారు. అయితే వీరి కాంబోలోనే మరో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ రాబోతోంది. 'Nani 33' ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. 'Nani 33' ప్రాజెక్టుపై జాన్వీ సంతకం కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న నాని అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. వీరిద్దరి జోడీ కచ్చితంగా మెస్మరైజ్‌ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/klapboardpost/status/1813025207734706471 త్వరలోనే షూటింగ్‌! 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాని - శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో 'Nani 33' ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీకాంత్ భారీ ఎత్తున ప్లాన్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ ఫైనల్‌ కాగా ఇది నాని కూడా బాగా నచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో నటించేందుకు హీరో నాని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్ోతంది. ‘సరిపోదా శనివారం’ అయిపోగానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో జాన్వీ కపూర్‌! బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌కు లక్‌ ఓ రేంజ్‌లో ఉంది. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్‌ కానప్పటికీ స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ ఈ అమ్మడును వరిస్తోంది. తెలుగులో మెుట్ట మెుదటి చిత్రమే తారక్‌ (Jr NTR) పక్కన చేసే అవకాశం జాన్వీకి లభించింది. ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’ (Devara) నటిస్తుండగానే రామ్‌చరణ్‌ (Ram Charan) పక్కన ‘RC16’ ప్రాజెక్ట్‌కు ఎంపికై జాన్వీ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇప్పుడు నాని సినిమాలోనూ చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా జాన్వీ మారిపోయిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ భామకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నాయి.&nbsp; ఆగస్టు 29న విడుదల నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram) మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఆగస్టు 29న (Saripodhaa Sanivaaram Release Date) వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
    జూలై 16 , 2024
    <strong>Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!</strong>
    Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్‌ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ భయం అక్కర్లేదు! దేవర చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో సాంగ్‌ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్‌ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా మూవీ మిడిల్‌లో సాధ్యం కాకపోతే ఎండ్‌ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1832446641393246291 దుమ్మురేపిన తారక్‌ ‘దేవర’ నుంచి సెప్టెంబర్‌ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్‌ ‘బీస్ట్‌’ సినిమాలోని ‘అరబిక్‌ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్‌ హైట్‌పైనా కొందరు కామెంట్స్‌ చేశారు. వాటన్నిటినీ తారక్‌ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్‌ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1835018489784123480 జాతీయస్థాయిలో ట్రెండింగ్‌ దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్​లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్​. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్​లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. https://twitter.com/DevaraMovie/status/1835682846092226856 'పుష్ప 2'ను దాటేసిన 'దేవర' విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!</strong>
    Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 4) థర్డ్‌ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'దావూదీ' (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్‌ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’ ‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్‌’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్‌ బుధవారం (సెప్టెంబర్‌ 4) సాయంత్రం 'దావూదీ' పేరుతో ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తారక్‌ తన ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.&nbsp; యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌.. ‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్‌, జాన్వీ కపూర్‌ బ్యూటీఫుల్‌ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్‌ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్‌ పెంచుకుంటూ 50 మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతోంది.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1831578339078787537 మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌ దావూదీ సాంగ్‌లో తారక్‌ డ్యాన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్‌ ఎనర్జిటిక్‌ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్‌ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్‌ జోష్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్‌ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్‌ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. దావూదీ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్‌ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్‌ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Thyview/status/1831302488340725836 https://twitter.com/krrishnolan/status/1831335770289820070 వెంటాడుతున్న ట్రోల్స్‌ దేవర థర్డ్‌ సింగిల్‌ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని 'అరబిక్‌ కుత్తు'ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్‌, తారక్‌ వేసిన స్టెప్స్‌ కూడా సేమ్‌ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్‌ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్‌ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్‌ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్‌ హైహీల్స్‌ లాంటి షూస్‌ను&nbsp; వేసుకోవాడాన్ని కొందరు హైలేట్‌ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.&nbsp; https://twitter.com/iam_venkatsai_/status/1831547990722671066 https://twitter.com/Sunnykesh/status/1831302199160299619 సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర' ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారోనని తారక్‌ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా,&nbsp; 'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌ం, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.
    సెప్టెంబర్ 05 , 2024
    జూ.ఎన్టీఆర్‌ కోసమే వార్‌ 2 క్యారెక్టర్‌ డిజైన్‌…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!
    జూ.ఎన్టీఆర్‌ కోసమే వార్‌ 2 క్యారెక్టర్‌ డిజైన్‌…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!
    వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్‌ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్‌ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.&nbsp; వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్‌ కంటే ముందు ప్రభాస్, విజయ్‌ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు రిజెక్ట్‌ చేసిన తర్వాతే వార్‌-2 ఎన్టీఆర్‌ వద్దకు చేరినట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. వారు కాదనుకున్న కథ మా అన్న దగ్గరకు వచ్చిందా అని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వార్‌-2 నిర్మాత ఇచ్చి క్లారిటీతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లోకి వెళ్లిపోయారు. తమ హీరో వార్‌-2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అందులో ఎన్టీఆర్‌ నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్‌ హిందీ మూవీలో చేయనుండటం, అది కూడా దిగ్గజ నటుడు హృతిక్‌తో తెరను పంచుకోనుండటం ఎన్టీఆర్‌కు కలిసిరానుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రిలీజైన ‘వార్’ చిత్రం సూపర్‌ హిట్‌గాా నిలిచింది. తొలి పార్ట్‌లో హృతిక్‌తో పాటు బాలీవుడ్ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ నటించాడు. డ్యాన్స్‌, ఫైట్లతో అదరగొట్టాడు. మరీ వార్‌-2లో ఎన్టీఆర్‌ ఎలా చేస్తాడన్న అంశం ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.&nbsp; ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంపై పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తారక్‌, హృతిక్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే ఓ రెంజ్‌లో ఉంటుందని ఇప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్‌, ఎన్టీఆర్‌ నటన చూస్తే థియేటర్లలో ఎవరూ కుదురుగా కూర్చోలేరని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్‌ కూడా చెరిగిపోతాయని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. వార్‌-2లో ఎన్టీఆర్‌ పారితోషికానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ రూ.100 కోట్లు తీసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రూ.100 కోట్లు తీసుకుంటున్న టాప్‌ 5 సౌత్‌ స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్‌ నిలవనున్నాడు. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా కొరటాల శివతో చేస్తున్న NTR 30 సినిమా కోసం తారక్‌ రూ. 60 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5, 2024లో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.&nbsp; ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.&nbsp; మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.&nbsp; పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.&nbsp; ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.&nbsp; మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023

    @2021 KTree