UATelugu
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగార్జున
రంగాఆషికా రంగనాథ్
వరలక్ష్మిఅల్లరి నరేష్
అంజిమిర్నా
మాంగరాజ్ తరుణ్
భాస్కర్రుక్సార్ ధిల్లాన్
కుమారిజిషు సేన్‌గుప్తా
రవి వర్మలక్ష్మీపతి
సిబ్బంది
విజయ్ బిన్నిదర్శకుడు
శ్రీనివాస చిట్టూరినిర్మాత
ప్రసన్న కుమార్ బెజవాడరచయిత
ఎంఎం కీరవాణి
సంగీతకారుడుజోషి
కథదాశరధి శివేంద్రసినిమాటోగ్రాఫర్
ఛోటా కె. ప్రసాద్ఎడిటర్ర్
కథనాలు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024
Samantha: మహానటి సావిత్రి జీవితంతో సమంతకు పోలికలు.. సేమ్ సీన్ రిపీట్?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) 2017లో పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్ తర్వాత నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను రెండో వివాహం చేసుకునేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలతో పాటు ప్రస్తుత పరిణామాలను ముడివేస్తూ నటి సమంత పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ నటి సావిత్రి జీవితంతో సామ్ లైఫ్‌ను ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులలోని సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సావిత్రి జీవితంతో సామ్‌కు లింకేంటి?
2021లో నాగ చైతన్యతో డివోర్స్ సందర్భంగా అందరూ సమంతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా చైతూ రెండో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున నెటిజన్లు సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. దిగ్గజ నటిగా ఓ వెలుగు వెలిగిన మహా నటి సావిత్రి జీవితంతో సమంత లైఫ్‌ను కంపేర్ చేస్తున్నారు. సినిమా కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో సావిత్రి జీవితంలోకి అప్పటికే పెళ్లైన నటుడు జెమినీ గణేశన్ ప్రవేశించారు. ఆ సమయానికి సావిత్రితో పోలిస్తే జెమినీ గణేశన్ సినిమా జీవితం అంతంతమాత్రంగానే ఉంది. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న జెమినీ గణేశన్‌ను గెస్ట్ హౌస్‌లో మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి సావిత్రి తట్టుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లి మద్యానికి బానిసగా మారింది. ఆపై పలు అనారోగ్య సమస్యల బారిన పడి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది. అయితే సమంత విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. నాగ చైతన్యను మరొకరితో చూసి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ బాధలన్నీ తట్టుకోలేకనే చైతూకి సామ్ విడాకులు ఇచ్చిందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/vamccrishnaa/status/1822085950098505895/
‘అంతలా శోభితలో ఏముంది’
శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటి నుంచి సమంత ఫ్యాన్స్ నాగచైతన్యను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు శోభితాలో ఏముందని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌గా ఆమె ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే చైతూ మరొకరితో ప్రేయాయణం మెుదలుపెట్టారని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చై-సమంతలతో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో గుర్తించాలని సూచిస్తున్నారు. మరోవైపు సమంత ఫ్యాన్స్ సంధిస్తున్న ప్రశ్నలకు చైతు, శోభిత ఫ్యాన్స్ గట్టిగానే బదులు ఇస్తున్నారు. పెళ్లి పెటాకులు అయినంత మాత్రాన జీవితాలు అక్కడే ఆగిపోవాలా? అంటూ నిలదీస్తున్నారు.
సామ్ చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా!
సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
నాగచైతన్య రియాక్షన్ ఇదే!
శోభితతో నిశ్చితార్థంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న క్రమంలో తమ బంధం గురించి నాగ చైతన్య స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శోభిత పెట్టిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు, ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రీట్వీట్ చేస్తూ తన అభిప్రాయం కూడా ఇదే అంటూ రీపోస్టు చేశారు. 'నా తల్లి నీకేమవుతుంది? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని క్యాప్షన్‌గా పెట్టారు. ఈ పోస్టును అక్కినేని సమర్థిస్తుండగా సామ్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
ఆగస్టు 10 , 2024
Ashika Ranganath: ‘నా సామిరంగ’ భామ గురించి ఈ విషయాలు తెలుసా?
నాగార్జున హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'నా సామిరంగ' (Naa Sami Ranga). ఇందులో కథానాయికగా 'ఆషికా రంగనాథ్' (Ashika Ranganath) చేస్తున్నారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, గ్లింప్స్‌ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆషికా రంగనాథ్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్‌లో ఇప్పటికే ఆషిక ఓ సినిమా చేసింది. 'అమిగోస్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఓ ఈవెంట్ కోసం ఆషిక హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆమె అమిగోస్ డైరెక్టర్ కంట పడ్డారట. దీంతో ఫోన్‌లోనే ఆయన ఆషికకు కథ వినిపించి హీరోయిన్‌గా ఫైనల్ చేశారట.
ఆషిక కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక తెలిపింది.
అయితే ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక ఓ ఇంటర్యూలో చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి 'క్రేజీబాయ్' అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు బాగా అర్థం అవుతుందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసేదట. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలను చాలా సార్లు చూసిందట.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.
డిసెంబర్ 09 , 2023
Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం.
నటీనటులు
నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్
కథ
ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు. కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు. ఎక్కడ ఎమోషన్స్ మిస్ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.
సినిమా ఎలా ఉందంటే?
నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది. దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి.
ఎవరెలా చేశారంటే?
నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్ అదిరిపోయింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు.
టెక్నికల్ విషయాలు…
సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్ చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.
బలాలు
నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్
బలహీనతలు
ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు
చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు.
రేటింగ్: 3/5
జనవరి 14 , 2024
Ashika Ranganath: చీరలో స్పైసీగా ఆషిక నడుము.. నా సామిరంగ..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఏప్రిల్ 22 , 2024
ఆషికా రంగనాథ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఆషికా రంగనాథ్.. తెలుగులో అమిగోస్ చిత్రం ద్వారా పరిచయమైంది. నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఆషికా రంగనాథ్‌కు బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఆషికా రంగనాథ్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Ashika Ranganath) ఓసారి చూద్దాం
ఆషికా రంగనాథ్ వయస్సు ఎంత?
1996, ఆగస్టు 5న జన్మించింది
ఆషికా రంగనాథ్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అమిగోస్(2023)
ఆషికా రంగనాథ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
Courtesy Twitter: Ashika Ranganath
ఆషికా రంగనాథ్ ఎక్కడ పుట్టింది?
హసన్, కర్ణాటక
ఆషికా రంగనాథ్ ఉండేది ఎక్కడ?
బెంగుళూరు
ఆషికా రంగనాథ్ ఏం చదివింది?
డిగ్రీ
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
మోడలింగ్, బెంగుళూరులో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన ఆహారం?
చికెన్ సూప్
View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన కలర్ ?
వైట్
ఆషికా రంగనాథ్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి నుచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఆషికా రంగనాథ్ తల్లిదండ్రుల పేరు?
సుధా, రంగనాథ్
ఆషికా రంగనాథ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఆషికా రంగనాథ్ మోడలింగ్ చేసేది
ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ashika_rangnath/?hl=en
ఆషికా రంగనాథ్ హీరో?
సుదీప్
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
ఆషికా రంగనాథ్‌కు డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.
https://www.youtube.com/watch?v=dnUayT-BsXU
ఏప్రిల్ 16 , 2024
This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పది రోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలాంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు చూద్దాం.
అథర్వ
కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్ వేదికగా జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man). డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించారు.
ఇండియన్ పోలీస్ ఫోర్స్
పోలీస్ కథలతో తరచూ ప్రేక్షకులను అలరించే బాలీవుడ్ దర్శకుల్లో రోహిత్ శెట్టి (Rohit Shetty) ఒకరు. తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్ పోలీస్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force). సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో ఈ సిరీస్ సిద్ధమైంది.
TitleCategoryLanguagePlatformRelease DateDusty Slay: Workin' ManSeriesEnglishNetflixJan 16American NightmareDocumentaryEnglishNetflixJan 17Merry Men 3MovieEnglishNetflixJan 18Full CircleSeriesEnglish NetflixJan 19Love on the Spectrum 2SeriesEnglish NetflixJan 19The KitchenMovieEnglishNetflixJan 19Where the Crawdads SingMovieEnglishSonyLIVJan 19Death and Other DetailsSeriesEnglishHotstarJan 16A Shop for KillersSeriesEnglish/KoreanHotstarJan 17Coleen Rooney: The Real Wagatha StoryDocumentaryEnglishHotstarJan 16Snakes SOS: Goa's Wildest 4DocumentaryEnglish HotstarJan 16Blue BeetleMovie English Jio CinemaJan 18Chicago Fire 12SeriesEnglishJio CinemaJan 18Law & Order: Special Victims UnitSeriesEnglishJio CinemaJan 18Mayalo MovieTeluguAmazon primeJan 15Hazbin HotelSeriesEnglishAmazon primeJan 19LOL: Last One Laughing IrelandSeriesEnglishAmazon primeJan 19
జనవరి 17 , 2024
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
Tollywood Debut Actress in 2023: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్ వీరే!
ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం.
ఆషికా రంగనాథ్
కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.
ప్రియా భవాని శంకర్
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్ అప్‌కమింగ్ మూవీ 'అహం బ్రహ్మాస్మి' లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్ 'భారతీయుడు-2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
టీనా శిల్పరాజ్
'రైటర్ పద్మభూషణం' సినిమా ద్వారా టీనా శిల్పరాజ్ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది.
రెబా మోనికా జాన్
ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది.
గీతిక తివారి
రానా సోదరుడు అభిరామ్ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అహింస'. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ఐశ్వర్య మీనన్
నిఖిల్ హీరోగా చేసిన 'స్పై' (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ హీరోగా చేస్తున్నాడు.
యుక్తి తరేజా
కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సాక్షి వైద్య
యంగ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రగతి శ్రీవాస్తవ
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన చిత్రం 'పెద్ద కాపు'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది.
నుపుర్ సనన్
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది.
వైష్ణవి చైతన్య
బేబి చిత్రం ద్వారా 'వైష్ణవి చైతన్య' (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసింది.
డిసెంబర్ 15 , 2023
This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హను-మాన్
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
సైంధవ్
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్ యాక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు.
నా సామిరంగ
ఈ సంక్రాంతికి మరో స్టార్ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.
అయలాన్
సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్ ‘అయలాన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్
నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి.
కోట బొమ్మాళి P.S
శ్రీకాంత్ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’. వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil SonyLIVJan 12SivappuMovieTamil AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
జనవరి 08 , 2024
Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
యావత్ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
మీనాక్షి చౌదరి
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
శ్రీలీల
గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.
ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గతేడాది ‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.
రుక్సార్ థిల్లాన్
యంగ్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
మిర్నా మీనన్
తమిళ నటి మిర్నా మీనన్.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది.
అమృత అయ్యర్
కన్నడ నటి అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది.
శ్రద్ధ శ్రీనాథ్
స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది.
రుహానీ శర్మ
2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది.
అనుపమ పరమేశ్వరన్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది.
కావ్యా థాపర్
'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
జనవరి 02 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? వినాయక చవితికి బిగ్ సర్‌ప్రైజ్!
'ఆర్ఆర్‌ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. వినాయక చవితి రోజున చరణ్ సినిమాకు సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రిలీజ్ డేట్ లాక్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముందని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
టీజర్‌కు రంగం సిద్ధం
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో కంటెంట్ రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయాలని గేమ్ ఛేంజర్ టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఒకే నెలలో రెండు అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో ఈ టీజర్ విడుదల కావొచ్చని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.
క్రిస్మస్‌కే ఎందుకు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నాసామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
సెప్టెంబర్ 04 , 2024
HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ఆయన వేసిన ఈ డేరింగ్ స్టెప్స్ ఏ హీరో వేయలేదు భయ్యా!
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్, క్లాస్, ఆధ్యాత్మికం, లవ్ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
'శివ'తో సెన్సేషన్
సాధారణంగా కెరీర్ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్ వర్మకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్ స్టెప్ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా ‘శివ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగ్ కెరీర్‌తో పాటు టాలీవుడ్ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్ - రామ్‌గోపాల్ వర్మ చెక్ పెట్టారు.
వైవిధ్యతకు ప్రాధాన్యం
శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్ నేచురల్ హెయిస్ట్ ఫిల్మ్, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్’లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.
‘అన్నమయ్య’
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రావడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు..
‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.
కొత్తవారికి ఛాన్స్..
కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్ వర్మ (శివ), వైవీఎస్ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్ (మాస్), విజయ్ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్.
తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్
తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
https://twitter.com/thokkaloteja/status/1828863171152757038
బిగ్ బాస్ హోస్ట్‌గా..
సాధారణంగా స్టార్‌డమ్ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, తారక్ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.
https://twitter.com/i/status/1829013612117230039
ఫిట్‌నెస్ మంత్ర
నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్ ఫిజిక్ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
ఆగస్టు 29 , 2024
Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోలు ఫ్లాప్స్ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్, మైథాలజీ, ఫ్యూచరిక్ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్ (దేవర), రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్), అల్లు అర్జున్ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!
యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్ సింగ్ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేసిన లేటెస్ట్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్’, ‘రెడ్’ సినిమాలు హిట్స్ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
మార్కెట్ కోల్పోయే దిశగా సీనియర్లు
ఇక సీనియర్ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్, కమల్ హాసన్ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్’, ‘విక్రమ్’ సినిమాలతో సాలిడ్ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభాస్, నాని సూపర్బ్!
గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ‘రాజాసాబ్’, సలార్ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.
రీరిలీజ్‌లతో ఫ్యాన్స్ సంతృప్తి!
గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు లాంగ్ గ్యాప్ వస్తుండటంతో రీరిలీజ్ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్ రూపంలో తమ ఫేవరేట్ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది?
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అటు హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్స్‌తో మాస్ డైరెక్టర్‌గా హరీష్ శంకర్ ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్ శంకర్ టేకింగ్ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.
ఆగస్టు 17 , 2024
This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భ్రమయుగం
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజధాని ఫైల్స్
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఊరు పేరు భైరవకోన
సందీప్‌కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
సైరెన్
జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘సైరెన్’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
నాసామి రంగ
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ది కేరళ స్టోరీ
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.
TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
ఫిబ్రవరి 12 , 2024
Eagle Movie: ‘ఈగల్’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
‘ఈగల్’ క్లైమాక్స్.. నెవర్ బిఫోర్!
తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన 'ఈగల్' నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈగల్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.
టికెట్ రేట్లు సాధారణమే..
గత కొంతకాలంగా స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్’ (Eagle) చిత్రం మాత్రం టికెట్ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
‘ఈగల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ఇక ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్‌గా రూ.21 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్లకు జరిగినట్లు చెబుతున్నారు. ఓవర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు కలిపి మరో రూ.2 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్ రిలీజ్ అవుతోంది.
తగ్గిన రవితేజ మార్కెట్!
రవితేజ రీసెంట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో పోలిస్తే ‘ఈగల్’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్ నాగేశ్వరరావు థియేట్రికల్ హక్కులు గతంలో రూ.37 కోట్లకు అమ్ముడుపోయాయి. రవితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగల్’ మాత్రం రూ.16 కోట్లు తక్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే మాత్రం రవితేజ టాప్-5 చిత్రాల్లో ఒకటిగా ఈగల్ నిలిచింది. రావణాసుర, ఖిలాడి సినిమాల థియేట్రికల్ హక్కులు రూ.22 కోట్ల వరకు అమ్ముడుపోగా.. వాటి తర్వాత నాలుగో స్థానంలో ఈగల్ నిలిచింది.
ఈగల్‌లో రవితేజ పాత్ర అదే!
ఈగల్ సినిమాలో రవితేజ రైతు సమస్యలపై పోరాడే షూటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రైలర్, టీజర్ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ రిలీజ్ కావడంతో ఈగల్ వాయిదాపడింది. అటు రవితేజ తన తర్వాతి చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.
ఫిబ్రవరి 08 , 2024
Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్రలో గ్లామర్ డోస్ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. భోళా శంకర్ (Bhola Shankar)
చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్ చేస్తోంది. అయితే కీర్తి సురేష్ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది. రీమేక్ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్’ వస్తోంది.
2. లియో (Leo)
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడు అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్ లేటెస్ట్ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
3. ఛత్రపతి (Chatrapathi)
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్ వినిపించింది. గ్లామర్ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్ కానుంది.
4. వారసుడు (Varasudu)
విజయ్ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.
5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru)
మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
6. డియర్ కామ్రేడ్ (Dear Comrade)
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఆఫర్ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్ ఉండటంతో నో చెప్పింది.
7. చెలియా (Cheliya)
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.
మే 09 , 2023
ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
గతవారం బాక్సాఫీస్ వద్ద ‘దాస్ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్ సేన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ‘దాస్ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్ మ్యాన్ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది.
దసరా- మార్చి 30
నాని- కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
OTT విడుదలలు
శ్రీదేవి శోభన్ బాబు
సంతోశ్ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీదేవీ శోభన్ బాబు. గత నెలలో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది.
ఓటీటీ: డిస్పీ+హాట్‌స్టార్
తేదీ : మార్చి 30
అమిగోస్
కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినంతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో జనాలకు బాగానేే వినోదాన్ని పంచింది. కల్యాణ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే ఓటీటీలో సందడి చేయబోతోంది.
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
తేదీ: ఏప్రిల్ 01
అసలు
రవిబాబు దర్శకత్వంలో ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘అసలు’. ఈటీవీ విన్ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా కథ ఓ అమ్మాయి జర్నీ, అందులోని సవాళ్ల చుట్టూ జరిగే థ్రిల్లర్‌గా ఉంటనుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
తేదీ: ఏప్రిల్ 05
అన్ని ఓటీటీ విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateGODARIDocumentaryTeluguAhaMarch 31SattiGaani RendekaraluMovieTeluguAhaApril 01My Little Pony- Tell Your TaleWeb seriesenglishNetflixMarch 27Emergency NYCWeb seriesenglishNetflixMarch 29UnseenmovieenglishNetflixMarch 29Almost Pyaar with DJ MohbatMovieHindiNetflixMarch 31Murder Mistery 2MovieEnglishNetflixMarch 31Company of HeroesMovieEnglishNetflixApril 01Jar Head 3 - The SiegeMovieEnglishNetflixApril 01ShehzadaMovieHindiNetflixApril 01Spirit UntamedMovieEnglishNetflixApril 01WarSailerSeriesEnglishNetflixApril 02Avatar 2MovieenglishDisney+HotstarMarch 28GaslightMovieHindiDisney+HotstarMarch 31All That BreathesMovieHindiDisney+HotstarMarch 31AgilanMovieTamilZee5March 31AyothiMovieTamilZee5March 31United Kache MovieHindiZee5March 31Tetris MovieEnglishApple TvMarch 31MummiesMovieEnglishBookMyShowMarch 27BhageeraMovieTamilMobiMarch 31Indian SummersMovieHindiMX PlayerMarch 27
మార్చి 27 , 2023
Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/yoursanjali/status/1796260781551682021
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/GoneWorse/status/1796158320778117123
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044
నేషనల్ వైడ్‌గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్‌గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.
మే 31 , 2024
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్‌లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024