• TFIDB EN
  • నాని
    UATelugu2h 53m
    ఓ సైంటిస్ట్ ద్వారా 28 ఏళ్ల యువకుడిగా మారిన చిన్నారి నాని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఓనర్ కూతురితో ప్రేమలో పడతాడు. కానీ అతను తన తల్లి నుంచి దూరమవుతున్నాని భావించి తిరిగి చిన్న పిల్లాడిలా మారుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    నాని / విజయ్ అకా విజ్జు
    మాస్టర్ పార్త్ డేవ్పప్పు (పిల్లవాడు)
    అమీషా పటేల్
    ప్రియా
    దేవయాని
    ఇందిరాదేవి
    ఐశ్వర్య భాస్కరన్
    ప్రియ స్నేహితురాలు
    నాసర్
    ప్రియ తండ్రి
    రఘువరన్
    సైంటిస్ట్ (సైన్సు)
    బ్రహ్మానందం
    సత్యం
    అలీ
    సింహం
    రవిబాబు
    సత్యం కొడుకు
    సంజయ్ స్వరూప్నాని తండ్రి
    సునీల్
    విశ్వనాథ్ / X
    కోట శ్రీనివాసరావు
    డాక్టర్
    సుధాకర్
    ఆదాయపు పన్ను అధికారి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    పోలీసు అధికారి
    జూనియర్ రేలంగిపోలీసు అధికారి
    మాస్టర్ అశోక్ గల్లానాని స్నేహితుడు
    గల్లా జయదేవ్
    రమ్య కృష్ణన్
    ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ
    అంజలా జవేరి
    కిరణ్ రాథోడ్
    S. J. సూర్య
    గణిత ప్రొఫెసర్ (అతి అతిథి పాత్ర)
    సిబ్బంది
    S. J. సూర్య
    దర్శకుడు
    మంజుల ఘట్టమనేని
    నిర్మాత
    S. J. సూర్య
    రచయిత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    KV గుహన్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.  Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.  Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.  Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.  Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.  Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.  Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?</strong>
    Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : నాని, ప్రియాంక అరుళ్ మోహన్‌, ఎస్‌.జే. సూర్య, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అభిరామి, అదితి బాలన్‌, మురళి శర్మ, అజయ్‌ తదితరులు డైరెక్టర్‌ : వివేక్ ఆత్రేయ సంగీతం : జేక్స్‌ బేజోయ్‌ ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్ నిర్మాతలు : డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి విడుదల తేదీ : 29-08-2024 నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram Movie Review). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటివరకూ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్‌ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈసారి ఊర మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన శైలికి భిన్నంగా పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సరిపోదా శనివారాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ఈ చిత్రంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నాని నటన మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. (Saripodhaa Sanivaram Movie Review) ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో హీరో నాని ఇరగదీశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో నాని నటన ఉంటుంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ నాని తనదైన మార్క్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక నానికి ప్రత్యర్థిగా ఎస్‌.జే. సూర్య అదరగొట్టాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో నాని సైతం తన నటనతో ఎస్‌.జే సూర్య డామినేట్‌ చేశారు. వీరిద్దరి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక లేడీ కానిస్టేబుల్‌ పాత్రలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ సెటిల్డ్‌గా నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ఆమె ఆకట్టుకుంది. నాని-ప్రియాంక మధ్య వచ్చే డిఫరెంట్‌ లవ్‌ ట్రాక్‌ ఆడియన్స్‌కు నచ్చుతుంది. సాయికుమార్‌, అజయ్‌, మురళీ శర్మలతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. రొటిన్‌ స్టోరీనే తీసుకున్నప్పటికీ తనదైన మేకింగ్‌తో వివేక్‌ మెస్మరైజ్‌ చేశాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకు పాత్రల పరిచయానికే దర్శకుడు తీసుకున్నాడు. హీరో నాని బాల్యం, శనివారం కాన్సెప్ట్‌, హీరోయిన్‌తో పరిచయం, అదిరిపోయే ఇంటర్వెల్‌ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో నాని, ఎస్‌.జే సూర్య మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ సన్నివేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌తో నింపేశాడు. అయితే నిడివి ఎక్కువగా ఉండటం సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీతగా అనిపిస్తాయి. నాని పాత్ర పరిచయానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌లుగా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్‌ బేజోయ్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, ఎస్‌.జే. సూర్య నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ మైనస్ పాయింట్స్‌ సుదీర్ఘమైన నిడివిట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; ‘సరిపోదా శనివారం’పై పబ్లిక్‌ టాక్‌ సరిపోదా శనివారం చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్టులు పెట్టడం విశేషం. ముఖ్యంగా నాని, ఎస్‌.జే. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. సోషల్‌ మీడియాలోని కొన్ని పోస్టుల ఆధారంగా పబ్లిక్‌ ఓపీనియన్‌ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిపోదా శనివారం చిత్రం సంతృప్తికరమైన యాక్షన్‌ డ్రామా అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్‌ బ్లాక్‌, ఇంటర్వెల్‌ బ్లాక్‌, క్లైమాక్స్‌ బ్లాక్‌, నాని - సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్‌ అయ్యాయని పోస్టు పెట్టాడు. https://twitter.com/venkyreviews/status/1828908558198644841 డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీ లేదని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ఎస్‌.జే. సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందేనని పేర్కొన్నాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయిందని, పోతారు మెుత్తం పోతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్‌ కాస్త బోర్‌గా అనిపించినా మాస్‌ ఆడియన్స్‌ను పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని ప్రశంసించాడు. https://twitter.com/_NaveenReddy_14/status/1828931798719414466 ఈ సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్‌ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీజీఎం ర్యాంప్‌ అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Abhi_pkcult/status/1828908519141323179 సరిపోదా శనివారానికి తనదైన శైలిలో రివ్యూ చెబుతూ ఓ నెటిజన్‌ 3/5 రేటింగ్‌ ఇచ్చాడు. పాత్రల పరిచయం, డిజైన్‌ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. తర్వాతి సీన్లను ముందుగానే ఊహించగలగడం, పెద్దగా మలుపులు లేకపోవడం కాస్త డ్రా బ్యాక్‌గా నిలిచిందని రాసుకొచ్చాడు. https://twitter.com/chitrambhalareI/status/1828918494358110555 సోషల్ మీడియా అంతా 'సరిపోదా శనివారం' పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Raktapatham/status/1828908737358438724 నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందని మరికొందరు అంటున్నారు. 30 నిమిషాల నిడివిని ట్రిమ్‌ చేయటం అవసరమని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. బోరింగ్‌ మసాలా సీన్స్‌, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి 2/5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు. https://twitter.com/Devara15629882/status/1828909154398023884
    ఆగస్టు 29 , 2024
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో&nbsp; ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే&nbsp; నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.&nbsp; సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!
    Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!
    నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల&nbsp; నిర్మాత: చెరుకూరి సుధాకర్ సంగీతం: సంతోష్ నారాయణ సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్&nbsp; భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ కథ: వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్), అతని స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?. వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేశాడు? వంటివి తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. ఎవరెలా చేశారంటే: శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రంలో నాని తన నటనతో అదరగొట్టాడనే చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు మెుత్తం నానినే కనిపిస్తాడు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నాని నటన ఉంటుంది. ముఖ్యంగా నాని భాష, యాస, తన రూపురేఖలతో ఊరమాస్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెల్స్‌లో తన మార్క్‌ చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు నాని పాత్రకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ మూవీ నాని కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నానితో పాటుగా కీర్తి సురేష్ పోటీపడి నటించారు. ఆమె నటన సినిమాకు బాగా ప్లస్‌ అయిందనే చెప్పాలి. అటు దీక్షిత్ శెట్టి సైతం నానితో సమానంగా ఎక్కడ తగ్గకుండా నటించారు. ఈ ముగ్గురి నటన సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ కూడా విలన్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. సముద్రఖని, సాయికుమార్ వారి పరిధిమేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. నానిలోని నటుడ్ని ఆయన పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో ఎలివేషన్లు బాగా చూపించాడు. కొన్ని సీన్స్‌లో డైరెక్టర్‌ గూస్ బంప్స్ తెప్పించారు. సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.&nbsp; ‘చంకీలా అంగీలు వేసి’ పాట చిత్రానికే వన్నెతెచ్చింది. మొదటి భాగం కాస్త సాగదీసినట్టు నాని నటనతో అదంతా కవర్ అయిపోతుంది. మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన&nbsp;కథఎమోషనల్ సన్నివేశాలుసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్: సూటిగా సాగే కథకథలో వేగం లోపించడం రేటింగ్‌: 4/5
    మార్చి 30 , 2023
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి? సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.&nbsp; కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌! రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; కథలు సైతం వెళ్లడం లేదా? ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.&nbsp; నెపోటిజం vs టాలెంట్‌! అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.&nbsp; తప్పు ప్రేక్షకుల్లో ఉంది! గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    Nani 33 Movie: నానితో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్ హీరోయిన్, ఎవరంటే?
    Nani 33 Movie: నానితో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్ హీరోయిన్, ఎవరంటే?
    బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒకరు. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ శ్రీ దేవి కూతురిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్‌ 'దేవర' చిత్రానికి ఓకే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్‌ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ లేటెస్ట్‌గా మరో క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్‌ స్టార్‌ నానితో జాన్వీ జతకట్టబోతున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; &nbsp;'Nani 33’ ప్రాజెక్ట్‌పై సంతకం! నేచురల్‌ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన 'దసరా' (Dasara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం ద్వారా నాని, శ్రీకాంత్‌ ఓదెల తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే శ్రీకాంత్‌ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశారు. అయితే వీరి కాంబోలోనే మరో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ రాబోతోంది. 'Nani 33' ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. 'Nani 33' ప్రాజెక్టుపై జాన్వీ సంతకం కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న నాని అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. వీరిద్దరి జోడీ కచ్చితంగా మెస్మరైజ్‌ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/klapboardpost/status/1813025207734706471 త్వరలోనే షూటింగ్‌! 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాని - శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో 'Nani 33' ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీకాంత్ భారీ ఎత్తున ప్లాన్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ ఫైనల్‌ కాగా ఇది నాని కూడా బాగా నచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో నటించేందుకు హీరో నాని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్ోతంది. ‘సరిపోదా శనివారం’ అయిపోగానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో జాన్వీ కపూర్‌! బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌కు లక్‌ ఓ రేంజ్‌లో ఉంది. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్‌ కానప్పటికీ స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ ఈ అమ్మడును వరిస్తోంది. తెలుగులో మెుట్ట మెుదటి చిత్రమే తారక్‌ (Jr NTR) పక్కన చేసే అవకాశం జాన్వీకి లభించింది. ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’ (Devara) నటిస్తుండగానే రామ్‌చరణ్‌ (Ram Charan) పక్కన ‘RC16’ ప్రాజెక్ట్‌కు ఎంపికై జాన్వీ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇప్పుడు నాని సినిమాలోనూ చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా జాన్వీ మారిపోయిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ భామకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నాయి.&nbsp; ఆగస్టు 29న విడుదల నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram) మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఆగస్టు 29న (Saripodhaa Sanivaaram Release Date) వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
    జూలై 16 , 2024
    Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
    Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
    నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు బజ్ పెరిగిపోతోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు హిట్ కావడంతో నాని హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. ఈసారి పక్క మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు మూవీ పోస్టర్స్, గ్లింప్స్‌ను బట్టి అర్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న సరిపోదా శనివారంలో నాని మాస్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నానికి వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ఇది రెండో సినిమా. గతంలో అంటే సుందరానికీ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి విజయం సాధించారు. మళ్లీ ఈ హిట్ కాంబో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ సరిపోదా శనివారం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'గరం గరం' పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా సాంగ్ ఉంది. ఆకట్టుకునే మాస్ లిరిక్స్‌ను సాహపాఠి భరద్వాజ్ పుత్రుడు అందించాడు. ఈ లిరిక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేసే విధంగా ఉంది. &nbsp; జేక్స్ బిజోయ్ మాస్ ట్యూనింగ్‌లో విశాల్ దద్వాని వాయిస్‌ సాంగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఊర మాస్ బీట్‌తో ప్రేక్షకులను అయితే అలరిస్తోందని చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్‌ను నాని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. మరో సాలిడ్ హిట్ పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=qlbnA4pWwsQ&amp;feature=youtu.be రూ. 100 కోట్లు పక్కా? నాని నటించిన దసరా చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ .. కలెక్షన్ల పరంగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. దీంతో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశాన్ని నాని ఎంచుకున్నాడు. ఈ సినిమాపై ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా కూడా దసరా చిత్రం మాదిరి రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ చర్చించుకుంటోంది. నటీనటలు వీళ్లే! ఇక నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గంతలో వీరి కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి ఫుల్ టైం మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అటు నానికి అపోజిట్ క్యారెక్టర్‌లో తమిళ్ స్టార్ డైరెక్టర్, నటుడు ఎస్‌ జే సూర్య నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే బజ్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో పెరిగిపోయింది. ప్రియాంక మోహన్‌తో పాటు అదితి బాలన్ , సాయికుమార్, శుభలేక సుధాకర్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. షూటింగ్ ఫినిష్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లో నాని మాస్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి మురళి జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా కార్తిక శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్&nbsp; వారు&nbsp; పాన్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 29న&nbsp; విడుదల చేయనున్నారు
    జూన్ 15 , 2024
    Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
    Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని.. తన కృషి, పట్టుదలతో స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఇవాళ నాని పుట్టిన రోజు (#HappyBirthdayNani) కావండంతో ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నాని అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ (#SaripodhaaSanivaaram) విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ సినిమా హ్యాష్‌ట్యాగ్‌తోనూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియోను షేక్‌ చేస్తున్న నాని వీడియోలపై ఓ లుక్కేద్దాం.&nbsp; ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ నచ్చిన హీరో నాని. పలు వేదికలపై మహేష్‌, రాజమౌళి, అల్లు అర్జున్‌, రవితేజ, డైరెక్టర్‌ సుకుమార్‌ వంటి ప్రముఖులు నానిపై చేసిన ప్రశంసల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1761065464669864301 నాని సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో ముఖ్య అతిథి పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. నేచురల్ స్టార్‌ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నానికి భగవంతుడు గొప్ప విజయాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా పవన్‌ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1761097491502772606 టాలీవుడ్‌ సంచలనాల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్యూలో హీరో నానిని కొనియాడాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అందరితో కలిసి స్టీల్‌ ప్లేట్‌ను తుడుచుకొని తిన్న నాని.. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగాడో అంటూ సందీప్‌ ప్రశంచించాడు. .&nbsp; https://twitter.com/i/status/1761098448496115970 ‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి.. నానితో ‘కృష్ణగాడి ప్రేమకథ’ చిత్రం తీశారు. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నానిపై ప్రశంసలు కురిపించారు. నాని ఒక్క క్షణం కూడా పాత్ర నుంచి బయటకు రాడని.. ఆ క్యారెక్టర్‌లోనే కూర్చుండిపోతాడని పేర్కొంటాడు.&nbsp; https://twitter.com/i/status/1761214343755256110 నాని హీరోగా చేసిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని ఓ ఆడియో ఫంక్షన్‌లో ‌అల్లుఅర్జున్ పేర్కొంటాడు. నాని నటన చాలా బాగుందంటూ ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియోను సైతం నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1480588099688153089 నాని బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో మరో ఆసక్తిర వీడియో వైరల్ అవుతోంది. తోటి స్టార్స్ అయిన ప్రభాస్, తారక్‌ ఇతర హీరోల గురించి నాని చేసిన హెల్తీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఏమన్నాడో కింద వీడియోలో మీరే చూడండి.&nbsp; https://twitter.com/i/status/1761060076645711983 ఈ జనరేషన్‌ యువతలో ప్రేరణ కలిగిస్తూ నాని చేసిన ఓ వీడియో సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ కలలను నేరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బలంగా నిలబడాలని నాని ఈ వీడియో సూచించాడు.&nbsp; https://twitter.com/i/status/1761106534715797807 మరోవైపు నాని స్ఫూర్తిదాయక వీడియోలు సైతం #HappyBirthdayNani హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌ ప్రారంభంలో తాను పడ్డ ఇబ్బందులను నాని స్వయంగా పలు వేదికలపై చెప్పుకొస్తాడు. వాటన్నింటిని జోడిస్తూ ఫ్యాన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1761124945327747406 ఒక అమీతాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి ఆ తర్వాత నాని.. అంటూ సాగే వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సౌత్‌ ఇండియాలో నాని ఓ అద్భుతమైన నటుడు అంటూ రవితేజ ఈ వీడియో ప్రశంసిస్తాడు. https://twitter.com/i/status/1761229505295745273 నాని కెరీర్‌లో ఇప్పటివరకూ జరిగిన మెమోరబుల్‌ మూమెంట్స్‌, హైలెట్‌ మూవీ సీన్లను ఒక చోట చేర్చి చేసిన మరో వీడియో కూడా ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/i/status/1761018169005584453 ఇక నాని బర్త్‌డే సందర్భంగా.. తన అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ఆసక్తికర పోస్టు విడుదలైంది. చుట్టూ మంటలు.. ముఖాన ముసుగుతో నాని చాలా అగ్రెసివ్‌గా పోస్టర్‌లో కనిపించాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 14 లేదా ఆగస్టు 28 తేదీల్లో రిలీజయ్యే అవకాశముందని సినీ వర్గాల టాక్. https://twitter.com/TheAakashavaani/status/1761255871374614584?s=20
    ఫిబ్రవరి 24 , 2024
    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..&nbsp; నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?
    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..&nbsp; నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?
    నేచురల్ స్టార్‌ నాని దసరా ప్రమోషన్లతో చాలా బిజీగా గడుపుతున్నాడు. మార్చి 30న సినిమా విడుదలవుతుండటం.. కొద్దిరోజుల సమయమే ఉండటంతో చిత్రబృందం వేగం పెంచింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నందునా.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.&nbsp; https://twitter.com/NameisNani/status/1638035548236566528 రంగులతో షురూ దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు యూనిట్. హోలీ సందర్భంగా ముంబయిలో ప్రచారం షురూ చేశాడు నాని. అక్కడ యూత్‌ నుంచి నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఫుల్ హుషారుగా ప్రమోట్ చేశాడు నేచురల్ స్టార్‌.&nbsp; https://twitter.com/NameisNani/status/1633324647830650880 కొచ్చిలో విషెస్ కొచ్చిలో ప్రమోషన్ చేస్తుండగా ఆర్‌ఆర్‌ఆర్‌కి అవార్డు వచ్చింది. ఆ కార్యక్రమంలోనే అందరి సమక్షంలో ప్రత్యేకమైన వీడియోతో నాని విషెస్ చెప్పాడు. ట్విటర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేశాడు నాని.&nbsp; https://twitter.com/NameisNani/status/1635265590066827264 VD గురించి తమిళ్ ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండతో ఉన్న స్నేహం గురించి చెప్పాడు ఈ యంగ్ హీరో. “ అతడిని చూస్తే గర్వంగా ఉంది. మేము తరచూ మాట్లాడుకుంటాం. సినిమాల గురించి చర్చిస్తాం. తన సినిమా ఫెయిల్ అయినా నేను మెసేజ్ పెడతాను. అంతా మన మంచికే జరిగిందని చెబుతుంటాను. విజయ్ ఇంకా చాలా సాధిస్తాడు” అన్నాడు నాని. https://twitter.com/i/status/1634446694854311936 జెర్సీతో దసరా ప్రమోషన్ విశాఖపట్టణం వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో వన్డేలోనూ ప్రమోషన్ చేశాడు నాని. తన క్యారెక్టర్‌ను సూచించేలా ధరణి అనే జెర్సీ వేసుకొని వెళ్లాడు. అంతేకాదు, తనకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరో చెప్పడంతో పాటు తన సినిమాల్లో ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్‌ అవుతుందని కూడా వెల్లడించాడు.&nbsp; https://twitter.com/i/status/1637709729240875014 ఆటో ధరణి రగడ్‌ లుక్‌తో మాస్‌ రోల్‌లో నటించిన స్టార్ హీరో ప్రమోషన్లను కూడా తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ముంబయిలో ఆటోలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ హీరో తన సహజత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1637808713955196929 https://twitter.com/apekshasandesh_/status/1638040424815247360?s=20 సీక్రెట్ సాంగ్ దసరా సినిమాలోని ఓ పాటను విడుదల చేయట్లేదని నాని చెప్పాడు. ఆ పాట చిత్రానికి ప్రాణం పోస్తుందని.. తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. సంతోష్ నారాయణ్‌ సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.&nbsp; https://twitter.com/i/status/1635985478070464515 నలుపు రంగులో ఇప్పటి వరకు జరిగిన చాలా దసరా ప్రమోషన్లలో ఎక్కువగా నలుపు రంగు దుస్తులు ధరించి నాని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా కథను సింగరేణిలో జరుగుతుంది. అది ప్రతిబింబించేందుకు ఇలా చేస్తున్నాడని టాక్.  https://twitter.com/shreyasgroup/status/1638022757215789056?s=20 https://twitter.com/i/status/1638033798905602049 హీరోయిన్‌ కీర్తి సురేశ్ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో రీల్స్‌ చేయటంతో పాటు ప్రచార కార్యక్రమాలకు హాజరవుతుంది. Keerthy Suresh (@keerthysureshofficial) • Instagram photos and videos
    మార్చి 21 , 2023
    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
    #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
    దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో&nbsp; అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి. దసరా రన్‌టైమ్‌ #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636016970473828353 ఫుల్‌ బిందాస్ సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636015575284748288 స్ట్రాంగ్ రిప్లై రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్‌ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్‌ ఖాన్, ఆర్నాల్డ్‌ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్‌ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636005865101877255 ఫన్నీ సమాధానం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్‌ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.&nbsp; https://twitter.com/NameisNani/status/1636006778805837824 ఎవరైనా ఒక్కటే నేచురల్ స్టార్‌ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్‌ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. https://twitter.com/NameisNani/status/1636004611210502150 ఒరిజినల్ పీస్‌ సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్‌” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.&nbsp;
    మార్చి 16 , 2023
    Dasara Movie Story: నాని మాస్ ‌అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!
    Dasara Movie Story: నాని మాస్ ‌అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!
    ]విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న దసరా చిత్రంపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని కెరీర్ గ్రాఫ్‌తో పాటు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కేరీర్‌ను కూడా ఈ చిత్రం ఫలితం శాసించనుంది.
    ఫిబ్రవరి 24 , 2023
    <strong>Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?</strong>
    Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్‌’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్‌’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) మూవీ షూటింగ్‌ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. కారణం ఏంటంటే? శివకార్తికేయన్‌ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్‌’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్‌ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్‌ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్‌ షూట్‌ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’ రాత్రి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy) షూటింగ్‌ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్‌ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్‌ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.&nbsp; దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్‌ సింగరాయ్‌' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్‌ రోల్స్‌ చేశాడు. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ రిలీజ్‌ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్‌'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తొలి పార్ట్‌ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Nani - Sekhar Kammula: నాని- శేఖర్‌ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?</strong>
    Nani - Sekhar Kammula: నాని- శేఖర్‌ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
    టాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. మరోవైపు నేచురల్‌ స్టార్‌ నానికి సైతం లవర్‌ బాయ్‌గా మంచి ఇమేజ్‌ ఉంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని సైతం అందుకొని మంచి ఊపులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి కూడా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; సూపర్‌ కాంబో లోడింగ్‌ టాలీవుడ్‌లో మ‌రో ఇంట్ర‌స్టింగ్ కాంబినేష‌న్‌కి రంగం సిద్ధం అవుతోంది. నాని-శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ సినిమా రానున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటు టాలీవుడ్‌ వర్గాలు సైతం నాని, శేఖ‌ర్ క‌మ్ముల క‌లిసి ఓ సినిమా చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయని అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ కూడా రెడీ అయ్యిందని త్వరలోనే నానికి కథ వినిపించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రం సరికొత్త లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు సమాచారం. కాబట్టి సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుటుందని శేఖర్‌ కమ్ముల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.&nbsp; సహజ శైలికి భిన్నంగా.. శేఖర్‌ కమ్ముల ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు మరో సినిమా గురించి అస్సలు ఆలోచించరు. ఆయన పూర్తి ఫోకస్‌ మెుత్తం ప్రస్తుత మూవీ పైనే ఉంటుంది. అయితే ఈ పంథాకు ఆయన స్వస్థి పలికినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన కథలు సైతం ఆయన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తద్వారా సినిమా పూర్తయిన వెంటనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలుపెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. దాని వల్ల సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్‌ తగ్గుతుందని ఈ క్లాసిక్‌ డైరెక్టర్ అంచనావేస్తున్నారట. ఈ క్రమంలోనే నాని చిత్రానికి సంబంధించిన స్టోరీని ఆయన సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ హీరో ధనుష్‌, తెలుగు దిగ్గజ నటుడు నాగార్జున కాంబోలో కలిసి 'కుబేర' (Kubera) అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.&nbsp; ఇదే తొలిసారి నాని - శేఖర్‌ కమ్ముల కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా తెరకెక్కలేదు. నానితో వర్క్‌ చేయాలని ఉందని పలు సందర్భాల్లో శేఖర్‌ కమ్ముల వ్యాఖ్యానించడం విశేషం. అయితే సాయిపల్లవితో మాత్రం రెండు చిత్రాలకు శేఖర్ కమ్ముల పనిచేశారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాతోనే సాయిపల్లవి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్యతో తెరకెక్కించిన ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోనూ ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ రెండు సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు నటిగా సాయిపల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మరోవైపు సాయి పల్లవి, నాని కూడా ఇప్పటికే రెండు చిత్రాలకు వర్క్‌ చేశారు. ‘MCA’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి), ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాల్లో వారిద్దరు జంటగా నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వీరి కాంబోలో హ్యాట్రిక్‌ విజయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.&nbsp; ఇప్పట్లో కష్టమేనా! ‘సరిపోదా శనివారం’ చిత్రం తర్వాత ప్రస్తుతం నాని 'హిట్‌ 3' (Hit 3)కోసం రెడీ అవుతున్నాడు. శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ రిలీజై ఆకట్టుకుంది. అలాగే సుజిత్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా, దసరా డైరెక్టర్‌తో మరో మూవీని నాని ప్లాన్‌ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ అరుదైన కాంబో సెట్‌ కావాడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా ‘కుబేర’ చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండటం గమనార్హం.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్‌ ఫైట్‌కి రెడీ!</strong>
    Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్‌ ఫైట్‌కి రెడీ!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో నాని (Nani), దగ్గుబాటి రానా (Daggubati Rana) ముందు వరుసలో ఉంటారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. జానర్‌తో సంబంధం లేకుండా వీరు తమ మార్క్‌ నటనతో మెప్పిస్తుంటారు. అటు బయట కూడా నాని-రానా మంచి ఫ్రెండ్స్‌గా గుర్తింపు పొందారు. ఇటువంటి కథానాయకులు ప్రత్యర్థులుగా మారితే? సినిమాలో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటే? ఊహిస్తేనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదా. అయితే ఇది ఊహా మాత్రమే కాదు.. త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ క్రైమ్‌ థ్రిల్లర్ మూవీలో వీరిద్దరు హీరో విలన్లుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘హిట్‌ 3’ మూవీలో.. టాలీవుడ్‌లో 'హిట్' (Hit) సినిమా సిరీస్‌లకు మంచి క్రేజ్‌ ఉంది. శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వచ్చిన 'హిట్‌' (Hit: The First Case), ‘హిట్‌ 2’ (Hit 2 : The Second Case) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇందులో హీరోలుగా చేసిన విశ్వక్‌ సేన్‌, అడవి శేష్‌లకు కెరీర్‌ పరంగా మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇక హిట్‌ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న పార్ట్‌ 3 చిత్రంలో నాని హీరోగా చేయనున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లోనే డైరెక్టర్‌ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘హిట్‌ 3’ (Hit 3: Third Case) ఎప్పుడు మెుదలవుతుందా అని మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ‘హిట్‌ 3’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇందులో నానికి ప్రత్యర్థిగా దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాక్‌ ఆఫ్‌ టాలీవుడ్‌గా మారిపోయింది.&nbsp; సైకో కిల్లర్‌గా రానా? ‘హిట్‌’, ‘హిట్‌ 2’ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు.. వరుస హత్యలు, సైకో కిల్లర్‌, పోలీసు ఇన్‌వెస్టిగేషన్‌ నేపథ్యంలోనే వచ్చాయి. కాబట్టి ‘హిట్‌ 3’ కూడా ఆ తరహా కథాంశంతోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని.. పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇక నానిని ఢీకొట్టే స్థాయిలోనే రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానాకు తన పాత్రను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ‘హిట్‌ 3’లో రానా క్రూరమైన సైకో కిల్లర్‌గా కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అతడి పాత్ర ఎంతగానో భయపెడుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టైటిల్‌ ఛేంజ్‌..! నేచురల్‌ స్టార్‌ నాని నటించిన గత రెండు చిత్రాలు 'దసరా' (Dasara), 'హాయ్‌ నాన్న'&nbsp; (Hi Nanna) మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం నాని హ్యాట్రిక్‌ హిట్స్‌పై ఫోకస్‌ పెట్టాడు. ఆయన నటించిన 'సరిపోదా శనివారం' త్వరలోనే విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్‌ హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో ఈ హీరో - హీరోయిన్‌ - డైరెక్టర్‌ కాంబోలోనే 'గ్యాంగ్‌ లీడర్‌' (Gang Leader) అనే సినిమా రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నాని, ప్రియాంక జంటకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ మూవీని 'సాటర్‌ డే' (Saturday) టైటిల్‌తో రిలీజ్‌ చేయబోతున్నారు. ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; క్రేజీ కాంబో లాక్‌..! టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో లాకైనట్లు తెలుస్తోంది. నేచరల్‌ స్టార్‌ నాని, స్టార్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే నానిని కలిసిన శేఖర్‌ కమ్ముల.. మూవీకి సంబంధించిన లైన్‌ను చెప్పారట. అది నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా ఏషియన్‌ సునీల్‌ నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాని, శేఖర్‌ కమ్ముల కాంబోలో గతంలో సినిమా రాలేదు.. ఇదే ఫస్ట్‌ టైమ్‌. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల.. 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్‌, నాగార్జున హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాని ప్రాజెక్ట్‌పై శేఖర్‌ కమ్ముల ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.&nbsp;
    జూలై 03 , 2024
    <strong>Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?</strong>
    Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?
    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; రన్‌ టైమ్‌ భయాలు! నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా 'సరిపోదా శనివారం' రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ టీమ్‌ యు/ఏ సర్టిఫికేట్‌ జారి చేసింది. అలాగే రన్‌ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్‌ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్‌ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; విలన్‌దే పైచేయి..! 'సరిపోదా శనివారం' చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్‌. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్‌ అండ్‌ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్‌ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్‌.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్‌ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్‌.జే. సూర్య యాక్టింగ్‌ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు.&nbsp; కథని ముందే రివీల్‌ చేస్తున్నాడు! ‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్‌.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్‌ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో నిడివి గురించి సైతం సెన్సార్‌ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్‌ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్‌.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్‌’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’ ‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్‌ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్‌లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్‌ పడుతున్న సమయంలో జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ వింటే ఆ టెన్షన్‌ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్‌ అంతగా పని పెట్టాడు.&nbsp; నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్‌ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;</strong>
    Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్‌ చేసేస్తున్నారు. షూటింగ్‌లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్‌ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్‌ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్‌-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.&nbsp; ‘ఆ ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు’ సినిమాలు పోస్టు పోన్‌ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్‌ ఆలస్యం, షూటింగ్‌లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్‌ చేస్తుండటంపై నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్‌ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్‌? నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్‌ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్‌ చేయాలని షూటింగ్‌ ప్రారంభంలోనే మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్‌ చేసుకోవడంతో సరిపోదా టీమ్‌ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్‌ 6 మారుస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్‌ చేసింది. ఆ వెంటనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌’, ‘ఆయ్‌’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్‌ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్‌ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్‌ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని సినిమాకు రన్‌ టైమ్‌ ఫిక్స్‌! నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A స‌ర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంట‌ల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఎస్‌.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp;
    ఆగస్టు 24 , 2024
    <strong>The Paradise: మెున్న ప్రభాస్‌.. నేడు నాని.. మోహన్‌ బాబుని తట్టుకోగలడా?</strong>
    The Paradise: మెున్న ప్రభాస్‌.. నేడు నాని.. మోహన్‌ బాబుని తట్టుకోగలడా?
    'దసరా' (Dasara)తో నటుడు నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తనకుంటూ ప్రత్యేక గురింపు సంపాదించాడు. సుకుమార్‌ అసిస్టెంట్‌గా 'రంగస్థలం' (Rangasthalam)కు వర్క్‌ చేసిన శ్రీకాంత్ తొలి చిత్రంతోనే స్టార్‌ డైరెక్టర్ స్టేటస్‌ సంపాదించాడు. ఇప్పుడు తన రెండో చిత్రం కూడా నానితోనే చేయబోతున్నాడు. ఈ మూవీకి 'ది ప్యారడైజ్‌' (The Paradise) అనే టైటిల్‌ కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఓ దిగ్గజ నటుడు ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విలన్‌గా మోహన్‌బాబు! నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రానున్న 'ది ప్యారడైజ్‌' (The Paradise) చిత్రం సికింద్రాబాద్‌ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడైతే ఆ పాత్రకు బాగా న్యాయం చేస్తాడని దర్శకుడు శ్రీకాంత్ భావించినట్లు సమాచారం. పలు పేర్లను పరిశీలించిన పిదప డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌ బాబు (Manchu Mohan Babu) పేరును ఫైనల్‌ చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మోహన్‌బాబును సంప్రదించి విలన్‌ రోల్‌ గురించి దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల వివరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పాత్ర మోహన్‌ బాబుకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ సైతం ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీంతో నేచురల్‌ స్టార్ నాని - డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు వైరం స్క్రీన్‌పై ఏ స్థాయిలో పడుతుందో చూడాలని సినీ లవర్స్‌ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.&nbsp; డైలాగ్‌ కింగ్‌ను ఢీ కొట్టగలడా? డైలాగ్‌ కింగ్ మోహన్‌ బాబు (Mohan Babu)కి విలక్షణ నటుడిగా పేరుంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా టాలీవుడ్‌పై ఆయన చెరగని ముద్ర వేశారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువ విలన్‌ పాత్రల్లోనే మోహన్‌ బాబు కనిపించారు. అత్యంత కఠినమైన డైలాగ్‌ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పగల సామర్థ్యం మోహన్‌బాబుకు ఉంది. అటువంటి మోహన్‌ బాబును నేచురల్‌ స్టార్‌ నాని ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదు. గతంలో ప్రభాస్‌ చేసిన 'బుజ్జిగాడు' సినిమాలోనూ మోహన్‌ బాబు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేశారు. మోహన్‌ బాబు ముందు ప్రభాస్‌ కొన్ని సీన్స్‌లో తేలిపోయాడన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నాని-మోహన్‌ బాబు కాంబో (The Paradise)ను కూడా అదే విధంగా ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంది. కెరీర్‌లోనే తొలిసారి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్‌ చేసుకోనుండటంతో నానికి ‘ది ప్యారడైజ్‌’ చిత్రం అగ్నిపరీక్ష కానుందని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నారు.&nbsp; టైటిల్‌ లీక్‌పై అసహనం నటుడు నాని - శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో రూపొందనున్న'ది ప్యారడైజ్‌' (The Paradise) మూవీ టైటిల్‌ మేకర్స్ అనౌన్స్‌ చేయకముందే లీకయ్యింది. దీంతో వర్కింగ్‌ టైటిల్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించిన శ్రీకాంత్‌ ఓదెల చివరికీ టైటిల్‌ను అనౌన్స్‌ చేయక తప్పలేదు. ఈ లీక్ వ్యవహారంపై కొన్ని రోజుల కింద దర్శకుడు శ్రీకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. శ్రీకాంత్‌ టీమ్‌లోని వారే లీక్‌ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఏ సినిమాకైనా లీకల బెడద ఉంటే వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్‌, రచయితలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. కష్టపడి పనిచేసే డిపార్ట్‌మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోవాలని సూచించారు. తన సినిమా టైటిల్‌ను లీక్‌ చేసిన వారు ఎవరో తెలుసని, తన టీమ్‌లోవారు మాత్రం కాదని స్పష్టం చేశారు.&nbsp;
    నవంబర్ 27 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.&nbsp; ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    <strong>Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!</strong>
    Yellamma: యంగ్‌ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్‌ లాక్‌.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్‌!
    కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్‌ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్‌ లీడర్‌గా మారి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్‌ వేణు అనౌన్స్‌ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్‌ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. వేణు డైరెక్షన్‌లో నితిన్‌! బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌ రాజు బ్యానర్‌లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్‌, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్‌ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ మూవీకి 'యల్లమ్మ' (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని, తేజ సజ్జా రిజెక్ట్! వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే 'యల్లమ్మ' స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్‌ హాఫ్‌ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్‌ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్‌ కాలేదు. ఫైనల్‌గా నితీన్‌ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ ఎప్పుడంటే? ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.&nbsp; https://twitter.com/i/status/1844354638587498984 ‘బలగం’కు అవార్డుల పంట హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్‌ రెడ్డి, మురళిధర్‌ గౌడ్‌, కోటా జయరామ్‌, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్‌ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.&nbsp;
    అక్టోబర్ 15 , 2024

    @2021 KTree