• TFIDB EN
  • నాన్నకు ప్రేమతో
    U/ATelugu2h 48m
    హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఎన్టీ రామారావు జూనియర్.
    అభిరామ్
    జగపతి బాబు
    కృష్ణ మూర్తి కౌటిల్య
    రాజేంద్ర ప్రసాద్
    రమేష్ చంద్ర ప్రసాద్ అలియాస్ సుబ్రహ్మణ్యం
    రకుల్ ప్రీత్ సింగ్
    దివ్యాంక దివ్య కృష్ణమూర్తి
    రాజీవ్ కనకాల
    అభిరామ్ అన్నయ్య
    శ్రీనివాస్ అవసరాల
    అభిరామ్ రెండో అన్నయ్య
    ఆశిష్ విద్యార్థి
    సత్పాల్ సింగ్ / కపిల్ సిన్హా
    మధు షా (మధుబాల)
    దివ్య తల్లి
    తాగుబోతు రమేష్
    అభిరామ్ అసిస్టెంట్
    నోయెల్ సీన్
    నోయెల్
    ఉప్పాడ పార్వతీశంఅభిరామ్ అసిస్టెంట్
    అమిత్ తివారీ
    కృష్ణ మూర్తి PA
    నవీన్ నేనిఅభిరామ్ అసిస్టెంట్
    వెన్నెల కిషోర్
    అభిరామ్‌కి పెయింటింగ్ అమ్మే వ్యక్తి
    సిబ్బంది
    సుకుమార్
    దర్శకుడు
    బివిఎస్ఎన్ ప్రసాద్
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్‌ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ తనయుడు అకిరా నందన్‌ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్‌ వీడియోను క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.  నాన్నకు ప్రేమతో.. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్‌ చేసిన వీడియోను పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ (Renu Desai) దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్‌ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.  View this post on Instagram A post shared by renu desai (@renuudesai) పవన్‌ పంచ్‌ డైలాగ్స్‌.. అకిరా ఎడిట్‌ చేసిన వీడియోలో పవన్‌ సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak) వరకు పవన్‌ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.  https://twitter.com/i/status/1798036906124657133 తండ్రితోనే అకిరా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్‌ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్‌ రెండో భార్య కుమారుడు అకిరా నందన్‌ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.  https://twitter.com/i/status/1797940145787908224 https://twitter.com/i/status/1798002911848673587 అకిరా ఎంతో టాలెంటెడ్‌! అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్‌ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్‌ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.  https://twitter.com/i/status/1747251367033577947
    జూన్ 06 , 2024
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.  ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.  మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.  పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.  ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.  మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.   https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
    తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. శ్రీకాంత్ ఓదెల (srikanth odela) ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్‌.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్‌ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్‌ దగ్గర శ్రీకాంత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  2. వేణు ఎల్దండి(Venu Yeldandi) బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్‌ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.  3. బుచ్చిబాబు సాన(buchi babu sana) డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్‌ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్‌ హిట్‌ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్‌ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్‌ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం. 4. సందీప్‌ వంగా(sandeep reddy vanga) అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్‌ చేసిన సందీప్‌ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్‌ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్‌ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్‌ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్‌ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. 5. అనిల్‌ రావిపూడి(anil ravipudi) డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్‌’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్‌ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.  6. సుజీత్‌ (sujeeth) డైరెక్టర్‌ సుజీత్‌ కూడా రన్‌ రాజా రన్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్‌ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో సుజీత్‌ ఓ సినిమా చేస్తున్నాడు. 7. తరుణ్‌ భాస్కర్‌(Tharun Bhascker) పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా తరుణ్‌ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్‌ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్‌ భాస్కర్‌ సైమా అవార్డ్స్‌-2016 సైమా అవార్డ్స్‌ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్‌ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్‌ సేన్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  8. స్వరూప్‌ RSJ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్‌ RSJ  టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్‌ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్‌ ఇంపాజిబుల్‌ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. 9. అజయ్ భూపతి(Ajay Bhupathi) అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్‌ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్‌ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.  10. కరుణ కుమార్‌(karuna kumar) డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్‌ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
    ఏప్రిల్ 12 , 2023
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్  డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.  శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.  పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.  రాజమౌళి ఆసిస్టెంట్  డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.  అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.  ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.  రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. 
    ఏప్రిల్ 06 , 2023
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. మరోమారు హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.  టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం రకుల్‌ షేర్ చేసిన నావెల్‌ షో పిక్స్‌.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.  టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.  ‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  https://twitter.com/i/status/1672013355924738048 అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్‌ G’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  ఈ ఏడాది ‘అయాలన్‌’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంతో రకూల్‌ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం రకుల్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.  అలాగే ప్రస్తుతం రకుల్‌ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్‌, దే దే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.  ఇక రకుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.  రకూల్‌ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను వరుసగా షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 08 , 2024
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.  బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.  టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)  స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.  సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు& టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.  ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.  టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.  మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్  (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద  ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది. 
    మే 22 , 2024
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.  https://twitter.com/i/status/1755616891970949447 రకుల్‌-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.  బీటౌన్‌ నిర్మాత  జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్‌ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.  https://twitter.com/i/status/1757012094317396389 ఇక రకుల్‌-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్‌ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.  అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్‌ చేసుకున్నారని టాక్‌.  కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రకుల్‌ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా  ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.  2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా రకుల్‌ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://twitter.com/i/status/1662932748166889473 ‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్‌ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్‌ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్‌ హిట్ కావడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టింది.  అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.  ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్‌ G’ (Doctor G), ‘థ్యాంక్‌ గాడ్‌’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్‌' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రకుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్‌ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.  అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్‌' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్‌ కపూర్‌ హీరోగా చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ రకుల్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 
    ఫిబ్రవరి 12 , 2024
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్‌ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.  బొమ్మరిల్లు నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.  https://www.youtube.com/watch?v=GEBykGzUxk8 సుస్వాగతం సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.  https://www.youtube.com/watch?v=iwdC7TGACSk ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.  https://www.youtube.com/watch?v=bCTJZbwI5_0 ఆకాశమంత కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్‌లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.  https://www.youtube.com/watch?v=nqGXCWmWDuU నాన్నకు ప్రేమతో ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో. చందమామ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.  https://www.youtube.com/watch?v=DSCPzIUd8GE నువ్వే నువ్వే కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
    జూన్ 16 , 2023
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.  https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.  గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.  https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.  వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.  లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
    మే 08 , 2023
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
    ఫిబ్రవరి 13 , 2024
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    టాలీవుడ్ ఖ్యాతిని పాన్‌ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్‌ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్‌. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్‌ ఫాజిల్‌ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  ‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’ తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్‌ ‌అడిగిన ప్రశ్నలకు షాకింగ్‌ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్‌.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్‌ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.  ‘సుకుమార్‌ కోసమే ఒప్పుకున్నా’ ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్‌ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్‌.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్‌ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు. నా ఫేవరేట్‌ స్టార్స్‌ వారే: ఫహాద్‌ యాంకర్‌ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్‌ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్‌ కుమార్‌ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్‌ కపూర్‌ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్‌ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్‌ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. 
    మే 07 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే  చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.  భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.  తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.  ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.  అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.  అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.  సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.  ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.   పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.  సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.  హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.  గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
    పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రేణూ దేశాయ్‌ (Renu Desai) కొడుకు అకిరా నందన్‌ (Akira Nandan) గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా యానిమల్‌ (Animal) సినిమాలోని ఓ పాటకు పియానో వాయించిన వీడియో మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1747251367033577947 పవన్ కొడుకు పియానో వాయించిన ఈ వీడియోను ఉపాసన (Upasana) షేర్‌ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదు.. కానీ, అకీరా జస్ట్ సూపర్’ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా యానిమల్‌(Animal)లోని 'నాన్న నువ్వు నా ప్రాణం అనినా...' అనే పాటకు అకిరా పియానా వాయించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తండ్రి ప్రేమకోసం తపన పడే కొడుకుకి సంబంధించిన పాటను అకిరా ఎంచుకోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రిని అకిరా ఎంతగా మిస్‌ అవుతున్నాడో అకిరా ఈ ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అకిరా నందన్‌ (Akira Nandan)కు సంబంధించిన లేటెస్ట్‌ పిక్స్‌ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అతడి లుక్‌ వింటేజ్‌ పవన్‌ను (Pawan Kalyan) గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఇదిలా ఉంటే అకీరా నందన్‌కు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అకిరా లేటెస్ట్‌ ఫొటోలను చూసిన ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తర్వాత మెగా లెగసీకి అసలైన వారసుడు అకీరానే అవుతాడని అంటున్నారు.  రామ్ చరణ్ ఎరా (Era) అయ్యాక మెగా లెగసీ బాధ్యత అంతా అకిరా నందన్ మీదే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అకిరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అతడి కటౌట్‌కు రికార్డులన్నీ పరారవుతాయని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.  అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది.
    జనవరి 23 , 2024
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.  మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు  మృణాల్ ఠాకూర్  ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్  ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
    ఏప్రిల్ 08 , 2024
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ను హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.  షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్‌ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.    https://twitter.com/InformedAlerts/status/1760553942201852102 మౌనిక సంచలన ఆరోపణలు! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్‌ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.  షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.  https://twitter.com/i/status/1760553061007937805 బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.  అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో  అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
    ఫిబ్రవరి 22 , 2024
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.  View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం.   ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.  తండ్రి ఎవరు?  ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా  ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.  పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి. 
    ఏప్రిల్ 18 , 2023
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.  ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.  మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.  షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.  బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.  అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో  అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.  షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్‌, రోహిణి, సచిన్‌ ఖేడేకర్‌, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ  సంగీతం: హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రఫీ: మురళి. G నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై హైప్‌ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.  కథ: ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే? విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్‌, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్‌, సామ్‌ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్‌ ఖేడేకర్‌, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. వెన్నెల కిషోర్‌, అలీ, రాహుల్‌ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్‌ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్‌ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్‌ బాగుంది.  టెక్నికల్‌గా  ఖుషి సినిమాకు టెక్నికల్‌ అంశాలు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్‌ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్‌ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్‌ అందాలను ఆయన తన కెమెరా  పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు.   ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    సెప్టెంబర్ 01 , 2023
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.  Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.  అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.  విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.  జ్యోతిక- సూర్య  సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).  అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.  నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.  షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024

    @2021 KTree