• TFIDB EN
  • నీ స్నేహం U 2002
    డ్రామా
    నీ స్నేహం
    UTelugu
    శ్రీను తన ఫ్రెండ్‌ మాధవ్‌ను కాపాడే క్రమంలో కాలును కోల్పోతాడు. కొద్ది రోజుల తర్వాత మాధవ్‌ అమృతను చూసి ప్రేమిస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా అమృత శ్రీనును ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఉదయ్ కిరణ్
    మాధవ్
    ఆర్తి అగర్వాల్
    అమృత
    జతిన్ గ్రేవాల్శీను
    కె. విశ్వనాథ్
    అమృత తాత
    గిరి బాబు
    మాధవ్ తండ్రి
    సుదీప పింకీ
    మాధవ్ సోదరి
    అలీ
    ఒక వంటవాడు
    అజయ్
    శివాజీ రాజా
    హేమ
    అమృత సోదరి
    సుధ
    మాధవ్ తల్లి
    లక్ష్మీపతి
    పరుచూరి బ్రదర్స్
    శీను తండ్రి
    సత్యం రాజేష్
    మాధవ్ స్నేహితుడు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    ఫుట్‌బాల్ కోచ్
    కౌశల్ మంద
    మాధవ్ స్నేహితుడు
    చిత్రం శీను
    మాధవ్ స్నేహితుడు
    సంగీత
    శీను తల్లి
    సిబ్బంది
    పరుచూరి మురళిదర్శకుడు
    ఎంఎస్ రాజునిర్మాత
    ఎంఎస్ రాజు
    రచయిత
    ఆర్పీ పట్నాయక్
    సంగీతకారుడు
    S. Gopal Reddyసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    <strong>Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?</strong>
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా కృష్ణ అండ్ హిస్ లీల&nbsp; కృష్ణ అనే యువకుడు తన మాజీ ప్రేయసి సత్యతో విడిపోయి.. మరో అమ్మాయి రాధతో ప్రేమలో పడుతాడు. కానీ సత్య మళ్లీ దగ్గర కావడంతో ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గుంటూరు టాకీస్ గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ లవర్ హీరో రాజ్‌ నర్సుగా పనిచేసే చందన (రిద్ది కుమార్‌)ను ప్రేమిస్తాడు. ఆస్పత్రిలో లక్ష్మీ అనే పాపను కాపాడే క్రమంలో చందనకు విలన్‌ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే హీరో ఆమెను ఎలా కాపాడాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ అనుభవించు రాజా రాజు (రాజ్‌తరుణ్‌) తాత సూచనతో జల్సారాయుడిగా మారతాడు. కోడిపందాలు, సరదాలతో కాలం వెల్లదీస్తుంటాడు. ఊరికి ప్రెసిడెంట్‌ కావడానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో రాజు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ. ఓటీటీ: ఆహా విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వెళ్లిపోమాకే చందు అనే యానిమేటర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతని లవ్‌ను తిరస్కరించింది. అయితే, అతను సోషల్ మీడియాలో మరొక అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ స్వీకరించినప్పుడు అతని కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ప్రైమ్ ఫలక్‌నామాదాస్ దాస్ తన స్నేహితుల బృందం.. ఫలక్‌నుమాలో మాంసం వ్యాపారంపై గుత్తాధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, వారు కొన్ని ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వారిని నేరాల మార్గంలో నడిపిస్తుంది. ఓటీటీ: ఆహా అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ నువ్వు నేను ఈ చిత్రంలో వచ్చే కాలేజీ కామెడీ ట్రాక్‌లో సునీల్ కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఉంటాయి. అంతేలెరా...అనే ఊతపదం చాలా ఫేమస్ అయింది. ఇక సినిమా కథ విషయానికొస్తే...ధనిక కుటుంబానికి చెందిన రవి(ఉదయ్ కిరణ్), పాలు అమ్మె వ్యక్తి కూతురు వసుంధరను ప్రేమిస్తాడు. వారి తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకిస్తారు. అయితే ఒక ఏడాది పాటు ఒకరినొకరు కలవకుండా ఉంటే పెళ్లి చేస్తామని హామీ ఇస్తారు. ఈ చిత్రం ఉదయ్ కిరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓటీటీ: యూట్యూబ్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 20 , 2024
    <strong>Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!</strong>
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    <strong>Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?</strong>
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం. &nbsp;127 హవర్స్ ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం. నిజ జీవితం ఆధారంగా.. 127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే... ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు.&nbsp; &nbsp;ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం&nbsp; జేమ్స్ ఫ్రాన్స్ కో&nbsp; సాహసాలంటే మహా&nbsp; ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి&nbsp; మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన&nbsp; బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో&nbsp; ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు.&nbsp; ఎలా బయటపడ్డాడంటే? లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.&nbsp; డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ&nbsp; మంజుమ్మేల్ బాయ్స్&nbsp; చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో "127 హవర్స్" సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
    మే 15 , 2024
    <strong>HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?</strong>
    HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
    నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్‌ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్‌ చేయగల సామర్థ్యం తారక్‌ సొంతం. అందుకే తారక్‌ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) ముందు వరకూ టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్‌ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story) అసలు పేరు&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ అసలు పేరు 'తారక్‌ రామ్‌' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్‌ పేరు మార్చారు.&nbsp; ఎనిమిదేళ్ల వయసులోనే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్‌ ఓ సినిమాలో నటించాడు. తారక్‌ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story) 100కి పైగా ప్రదర్శనలు తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఎప్పటికీ లోటే! కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్‌ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్‌ తెలిపాడు.&nbsp; ఫోర్బ్స్‌ జాబితా జాతీయ స్థాయిలో తారక్‌ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్‌.. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు. ఆ దేశంలో యమా క్రేజ్‌! టాలీవుడ్‌ హీరోల క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.&nbsp; ఎన్టీఆర్‌ మంచి గాయకుడు ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు.&nbsp; ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; హోస్ట్‌గానూ సూపర్‌ సక్సెస్‌ ప్రముఖ టెలివిజన్‌ షోలకు తారక్‌ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.&nbsp; తారక్ ఫేవరేట్‌ నెంబర్‌ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్‌. తన కారు నెంబర్‌ ప్లేట్‌ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్‌&nbsp; ఫేవరేట్‌ సాంగ్‌ &amp; సినిమా తారక్‌కు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్‌ ఆల్‌టైమ్ ఫేవరేట్‌ సాంగ్‌.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.&nbsp; రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్‌ అభిమానులు పాల్గొన్నారు.&nbsp; రీరిలీజ్‌ రికార్డు గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్‌ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్‌ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.&nbsp;
    మే 20 , 2024
    <strong>Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!&nbsp;</strong>
    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!&nbsp;
    ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్‌ బర్త్‌డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్‌.. తొలి సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్‌ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; దూసుకెళ్తున్న సాంగ్‌ దేవర సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఫియర్‌ సాంగ్‌' (Fear Song) పేరుతో సాంగ్‌ లిరికల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్‌ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=CKpbdCciELk&amp;list=PLTtJUIuknk91d-Sq1qbTeI0WM0R6EbuZS&amp;index=3 ‘అనిరుధ్‌ ఎలివేషన్స్‌ ఏంటి’ దేవర ఫస్ట్‌ సాంగ్‌ చూసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చినా.. మిగతా మ్యూజిక్‌ లవర్స్‌, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌ బర్త్‌డే సాంగ్‌లో అనిరుద్‌ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్‌ కంటే ఎక్కువగా అనిరుధ్‌ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్‌ సినిమా టైటిల్‌ ట్రాక్‌ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్‌ డామినేట్‌ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్‌ మధ్యలో లిరిక్స్‌ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. 'దేవర ముంగిట నువ్వెంత' అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్‌ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు.&nbsp; ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ‘దేవర’లోని ఫియర్‌ సాంగ్‌ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్‌తో కంపేర్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్‌ 'లియో' చిత్రంలోని 'బ్యాడ్‌ యాస్‌' పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్‌ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్‌ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్‌ బాక్స్‌లో పోస్టులు చేస్తున్నారు.&nbsp; ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.&nbsp;
    మే 20 , 2024
    <strong>Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన&nbsp; లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?&nbsp; ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.&nbsp;&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    <strong>Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?</strong>
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    టాలీవుడ్‌ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్‌’ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న డార్లింగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్‌ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.&nbsp; ‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్‌గా ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్‌ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్‌ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్‌ చేశారు. అలాగే కమల్‌ హాసన్‌ రోల్‌ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డార్లింగ్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; కమల్‌ అంటే చాలా ఇష్టం ప్రభాస్‌ ఫేవరేట్‌ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ముందు వరుసలో ఉంటారు. కమల్‌పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్‌ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్‌.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; నెలాఖరులో ఫస్ట్‌ సింగిల్‌! కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా మ్యూజికల్‌ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ కూడా విడుదల చేయనున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్‌ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.&nbsp;
    మే 17 , 2024
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    Double iSmart Heroine: అధికారికంగా చెప్పకపోయినా ఆ బ్యూటీ ఎవరో టీజర్‌లో తెలిసిపోయింది
    రామ్ పొత్తినేని(RAPO) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ రానే వచ్చింది. నేడు&nbsp; (మే 15) సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్&nbsp; ఆసాంతం పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. టీజర్‌లో రామ్ లుక్స్, స్ట్రైల్, స్వాగ్ వెటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. పూరి జగన్నాథ్.. రామ్‌పై(Ram Pothineni) సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేసినట్లు టీజర్‌ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్‌లో అలీ భిన్నమైన గెటప్‌లో కనిపించాడు. మరోసారి పూరి- అలీ కామెడీ మ్యాజిక్ అవిష్కృతం కానుంది.&nbsp; Double ismart Dialogues ఇక ఈ చిత్రంలో మేయిన్ విలన్‌గా నటిస్తున్న సంజయ్ దత్‌ను కూడా టీజర్‌లో క్రూరంగా చూపించారు. ఇక టీజర్‌లో రామ్‌ పొత్తినేని చెప్పే లాస్ట్ డైలాగ్ ఊర మాస్‌గా ఉంటుంది. “నాకు తెల్వకుండా నాపైనా సినిమా ప్లాన్ చేస్తే..నా గుడ్డులో మండుతది” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇలాంటి మాస్‌ డైలాగ్‌లు డబుల్ ఇస్మార్ట్‌లో అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాదిరి గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా BGM సూపర్బ్‌గా ఉంది. మరి సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/TheAakashavaani/status/1790604878475301304 సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌(Double ismart Teaser) ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలోనూ సినిమా టీజర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. https://twitter.com/warriorkrishnaa/status/1790606705455497645 యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ అంటూ క్రిష్ణ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. చివర్లో సూపర్బ్‌ అంటూ చెప్పుకొచ్చాడు. డబుల్ ఇస్మార్ట్ టీజర్ బాగుందంటూ శ్రీహర్ష అనే మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రామ్ ఎనర్జీ ఎప్పటిలాగే అదిరిపోయిందని, బీజీఎం, సాంగ్ ర్యాపో అంచనాలు అందుకుందని చెప్పుకొచ్చాడు.&nbsp; https://twitter.com/NameisSrii/status/1790603578266321121 డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ రివీల్ ఇక ఈ సినిమా హీరోయిన్‌ గురించి ఎక్కడా ఇంతవరకు అధికారికంగా(Double ismart heroine) ప్రకటించనప్పటికీ.. సినిమా టీజర్‌లో హీరోయిన్ ఎవరో రివీల్ అయింది. టీజర్‌లో వచ్చే ''ఇస్మార్ట్ ఇంకర్‌కా స్టైల్ క్యా మాలూమ్..కిర్రాక్ పోరొస్తే సైట్ మార్..కతర్నాక్ బీట్ వస్తే.. స్టెపా మార్" అంటూ చెప్పే డైలాగ్‌లో కావ్యా థాపర్(Kavya Thapar) కనిపిస్తుంది. ఏక్‌ మినీ కథ, ఈగల్ సినిమాలో నటించిన కావ్యా థాపర్‌.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్‌ పొత్తినేనితో రొమాన్స్ చేయనుంది. ఈ గ్లామర్ డాల్ టీజర్‌లో కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ.. స్మైలింగ్ లుక్‌, ఆకట్టుకునే అందంలో కనిపించింది. ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే మరోసారి అందాల విందు తప్పదని అర్ధమవుతోంది.&nbsp; పూరి జగన్నాథ్ సినిమా అంటేనే హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ క్యారెక్టర్లను పూరి డిజైన్ చేస్తుంటాడు. గతంలో వచ్చిన నభా నటేష్,ఆసిన్, అనుష్క,&nbsp; నిధి అగర్వాల్,&nbsp; హన్సిక, అదా శర్మ పూరి సినిమాల్లో హీరోయిన్లుగా నటించి కుర్రకారుకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.&nbsp; తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ ద్వారా కావ్యథాపర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి&nbsp; ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమాలో కావ్యా థాపర్‌(Kavya Thapar)తో రామ్ పొత్తినేనికి మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 'ఏక్ మినీ కథ' చిత్రంతో గుర్తింపు పొందిన&nbsp; కావ్యా థాపర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. క్యూట్‌గా కనిపిస్తూనే&nbsp; హాట్ ట్రీట్ ఇవ్వగలదని ఇప్పటికే ఈగల్ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఈక్రమంలోనే కావ్య థాపర్‌ను డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. నార్త్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.&nbsp; తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథా, రవితేజతో కలిసి ఈగల్ చిత్రంలో నటించింది అటు సాండిల్ వుడ్‌లో బిచ్చగాడు 2లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది మే 19న ఈ సినిమా విడుదలైంది.  అప్పట్లో ఈమె ప్రమోషన్లలో పాల్గొన్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది. హాటో ఫొటో షూట్‌లతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.
    మే 15 , 2024
    <strong>Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?</strong>
    Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రూ.100 కోట్లు కొల్లగొడుతాడా? గతం ఏం చెబుతుంది?
    ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double iSmart). ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్, రామ్ కెరీర్‌కు కీలకం కానుంది. ఎందుకంటే పూరి తీసిన ‘లైగర్’(Liger) ఘోర పరాజయం చవిచూడటం.. రామ్ నటించి రెడ్, స్కంద చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో..వీరి కలయిక మళ్లీ అనివార్యమైంది. గతంలో&nbsp; వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మనిషి మెడదులో వేరే వ్యక్తి ఆలోచనలకు సంబంధించిన చిప్ పెడితే ఎలా ప్రవర్తిస్తాడు అనే వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించింది.&nbsp; రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. మే 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది.&nbsp; రూ.100 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలో రూ.66 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాకు వస్తున్న సీక్వెల్‌ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? కనీసం దరిదాపుల్లోకైనా వస్తుందా అనే అంశాలపై చర్చ జరుగుతుంది. టాలీవుడ్‌లో టైర్ 2 హీరోగా రామ్ పొత్తినేని ఉన్నప్పటికీ టైర్ 1 హీరో స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ యాక్టింగ్, డాన్సింగ్‌తో ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గడు. ఇప్పటికే ఈ విషయం అతని సినిమాల ద్వారా నిరూపితమైంది. రామ్ పొత్తినేని- పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తుండటం, ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్ అవడం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి అనుకూలంశాలు. ఇవన్నీ ప్రేక్షకులను మొదటి రెండు రోజులు సినిమా థియేటర్లకు రప్పించేలా చేశాయి.&nbsp;&nbsp; ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో బరిలో దిగిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఓవరాల్‌గా రూ.80 కోట్లు కలెక్ట్ చేసి రామ్ పొత్తినేని సత్తా చాటాడు. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా పూరి.. డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా విడుదలే చేసిన టీజర్ ప్రోమో ఆకట్టుకుంది. రామ్ గెటప్‌, స్వాగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మే 15న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టిజర్ టాక్ ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపనుంది. డబుల్ ఇస్మార్ట్‌ చిత్రానికి రూ.100కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పూరి- రామ్ హిటో కాంబో కావడంతో.. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు చేజిక్కించుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి.&nbsp; ఇప్పటికే చిత్రబృందానికి మంచి నంబర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. కథ ఇదేనా? ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్‌ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్‌ - థ్రిల్లర్‌ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; పట్టుదలతో పూరి డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్టర్‌ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గత‌ మూవీ ‘లైగర్‌’ (Liger Movie) బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్‌ కూడా ఇందుకు కారణమయ్యాయి దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; పాన్‌ ఇండియా రేంజ్‌లో.. ఆ కారణంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)లో రిలీజ్‌ చేసిన పూరి.. సెకండ్‌ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హీరో రామ్‌కూ కీలకం! ఇక హీరో రామ్‌ కూడా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్‌ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్‌ చేసిన ‘వారియర్‌’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.&nbsp;
    మే 14 , 2024

    @2021 KTree