• TFIDB EN
  • నేను
    U/ATelugu
    మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లరి నరేష్
    వినోద్
    అర్చన శాస్త్రి
    దివ్య
    అభిషేకఆది నారాయణ
    పరుచూరి బ్రదర్స్
    ఫాదర్ లూయిస్
    సి.వి.ఎల్.నరసింహారావుకాలేజీ లెక్చరర్
    శంకర్ మెల్కోటే
    కళాశాల ప్రిన్సిపాల్
    చలపతి రావు
    దివ్య తండ్రి
    బెనర్జీ
    సబ్-ఇన్‌స్పెక్టర్
    జెన్నీ
    ఆది తండ్రి
    రాజీవ్ కనకాల
    శీను
    చిత్రమ్ బాషఆది స్నేహితుడు
    సిబ్బంది
    ఇ. సతిబాబుదర్శకుడు
    ముళ్లపూడి బ్రహ్మానందంనిర్మాత
    విద్యాసాగర్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  కీర్తి సురేష్ దేనికి ఫేమస్? కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ వయస్సు ఎంత? 1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు   కీర్తి సురేష్ ముద్దు పేరు? కీర్తమ్మ కీర్తి సురేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది? చెన్నై Screengrab Instagram: keerthysureshofficial కీర్తి సురేష్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు కీర్తి సురేష్ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్ కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం? దోశ కీర్తి సురేష్ అభిమాన నటుడు? సూర్య, విజయ్  తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా? నేను శైలజ(2016) కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ కీర్తి సురేష్ ఏం చదివింది? ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్  Courtesy Instagram: Keerthy suresh కీర్తి సురేష్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు? సురేష్ కుమార్, మేనక కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా? తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది? మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/keerthysureshofficial/?hl=en కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్ సిమ్రాన్ కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది. https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
    ఏప్రిల్ 16 , 2024
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
    సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్‌ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్‌ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్‌ చేశారో ఓ సారీ చూద్దాం. ఒకే ఒక్కడు దర్శకుడు శంకర్‌, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్‌ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.  భరత్‌ అనే నేను పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్‌ బాబు.. భరత్‌ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్‌ రోల్‌లో సూపర్‌ స్టార్‌ చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్‌ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.  లీడర్‌ దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.  నేనే రాజు నేనే మంత్రి విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు. నోటా  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.  కథానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.  యాత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్‌ రోల్‌ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది. 
    ఏప్రిల్ 20 , 2023
    CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా
    CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్. మెుగిలయ్యకు అండగా బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న ఆయనకి కంటి చూపు మందగించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మెుగిలయ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు వేణు ఎల్దండికి ఫోన్‌ చేసి మెుగిలయ్య కంటి చూపు రావటానికి ఎంత ఖర్చైనా తానే భరిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని వేణు వారికి చెప్పినట్లు మెుగిలయ్య దంపతులు వెల్లడించారు. https://twitter.com/i/status/1647889777688190976 విలన్‌కు సాయం చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించిన విలన్ పొన్నాంబలమ్.  ఆయనకి కూడా కిడ్నీలు పాడైపోతే చిరుకి మెసేజ్‌ చేశాడు. ఏదైనా సాయం చేయాలని కోరాడు. ఐదు నిమిషాల్లో ఫోన్ చేసిన మెగాస్టార్‌… చెన్నైలోని అపోలోకి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 40 లక్షలు చెల్లించాడు. ఈ విషయాన్ని పొన్నాంబలమ్ స్వయంగా పంచుకున్నారు. https://twitter.com/i/status/1636009396437393409 కెమెరామెన్‌కు చేయూత అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి సూపర్‌ స్టార్లతో పనిచేసిన కెమెరామెన్‌ దేవరాజ్‌. చిరంజీవితో నాగు, పులిబెబ్బులి వంటి సినిమాలు తీశాడు. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వచ్చిన వార్తలు తెలుసుకున్న చిరు… దేవరాజ్‌ను ఇంటికి పిలిచి రూ. 5 లక్షలు ఇచ్చారు. అంతేకాదు, ఎప్పుడు అవసరం ఉన్నా అండగా ఉంటానని భరోసా కల్పించారు. దటీజ్ మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులను ఆదుకున్నాడు చిరంజీవి. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయించారు. కొంతమంది నటులకు అపోలో ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించినట్లు చాలామంది చెప్పారు. ఏళ్ల తరబడి ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతున్నాడంటే ఇదే కారణమని నటులు చిరంజీవిని కొనియాడుతున్నారు.
    ఏప్రిల్ 18 , 2023
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    అంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ - జనసేన - భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 'పవన్‌ అనే నేను'.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  బాహుబలి రేంజ్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్‌ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.  https://twitter.com/i/status/1800799485137944671 చిరు.. ఆనంద బాష్పాలు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది.  https://twitter.com/i/status/1800778127129595985 అపూర్వ కలయిక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్‌.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్‌ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్‌తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్‌ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్‌ వైరల్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1800806930975449376 అతిథుల కోలాహలం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్‌ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్‌చరణ్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్‌ హీరోలు నిఖిల్‌, నారా రోహిత్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.  https://twitter.com/i/status/1800778957174051224 23 మందితో నూతన మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.
    జూన్ 12 , 2024
    Samantha Viral Post: నాగచైతన్య లేదా విరాట్‌ కోహ్లీ.. అసలు సమంత పోస్టు ఎవరి కోసం!
    Samantha Viral Post: నాగచైతన్య లేదా విరాట్‌ కోహ్లీ.. అసలు సమంత పోస్టు ఎవరి కోసం!
    స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha).. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె సినిమాల నుంచి కొద్ది కాలం విరామం తీసుకుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ వారిని సామ్ అలరిస్తోంది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. సమంత పోస్టు వెనకున్న అర్థం ఏంటో తెలియక ఫ్యాన్స్‌ తలలు బాదేసుకుంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  పోస్టులో ఏముందంటే? స్టార్‌ హీరోయిన్ సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పెట్టిన లేటేస్ట్‌ పోస్టు.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను దానికోసమే ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ సమంత ఈ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఇది ఎవరి గెలుపును ఆకాంక్షిస్తూ పెట్టానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నాగచైతన్యను ఉద్దేశించి సమంత పెట్టిందంటూ అతడి ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది నిజమైతే చాలా బాగుంటుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అసలు కారణం ఇదే! ప్రస్తుతం దేశంలో ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఇవాళ (మే 22) సెకండ్‌ ప్లేఆఫ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు.. రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)తో తలపడనుంది. అయితే సామ్‌ ఆర్సీబీ గెలుపును ఆకాంక్షిస్తూ ఈ పోస్టును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కప్‌ కూడా గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని సమంత కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఆ జట్టును ఎంకరేజ్ చేసేందుకు సామ్ ఇలా పోస్టు పెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నేరుగా RCBని ట్యాగ్‌ చేస్తూ పోస్టు పెట్టి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదని అంటున్నారు. విరాట్‌కు వీరాభిమాని క్రికెట్‌ను అభిమానించే హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె పలు వేదికలపై తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అంతేకాదు క్రికెట్‌లో తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్‌ కావడం.. అతడికి ఈ మ్యాచ్‌ చావో రేవో కావడంతో సమంత ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు ఫ్యాన్స్‌ మాత్రం ఇప్పటికీ ఇది సమంత పర్సనల్‌ పోస్టు అని నమ్ముతున్నారు. దీంతో సమంత దీనిపై క్లారిటీ ఇస్తే తప్పా అర్థం తెలిసేలా లేదు.  సమంత సినిమాలు సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా గతేడాది విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’లో కనిపించింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక సామ్‌ నటించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్రస్తుతం సమంత నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
    మే 22 , 2024
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
    టాలీవుడ్ ఖ్యాతిని పాన్‌ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్‌ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్‌. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్‌ ఫాజిల్‌ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  ‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’ తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్‌ ‌అడిగిన ప్రశ్నలకు షాకింగ్‌ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్‌.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్‌ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.  ‘సుకుమార్‌ కోసమే ఒప్పుకున్నా’ ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్‌ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్‌.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్‌ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు. నా ఫేవరేట్‌ స్టార్స్‌ వారే: ఫహాద్‌ యాంకర్‌ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్‌ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్‌ కుమార్‌ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్‌ కపూర్‌ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్‌ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్‌ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. 
    మే 07 , 2024
    Anasuya Bharadwaj: ‘సెక్సీగా ఉంటాను.. ఏమైనా నేర్పిస్తాను’.. ఫీజులు ఎగిరే క్యాప్షన్‌!
    Anasuya Bharadwaj: ‘సెక్సీగా ఉంటాను.. ఏమైనా నేర్పిస్తాను’.. ఫీజులు ఎగిరే క్యాప్షన్‌!
    గ్లామరస్‌ నటి అనసూయ భరద్వాజ్.. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్ చేసింది. మత్తెక్కించే అందాలను నెటిజన్లను కవ్విచించింది.  ఎప్పుడు గ్లామర్‌ ఫొటోలు పెట్టేసి ఊరుకునే అను.. ఈసారి అదిరిపోయే క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్యాప్షన్‌ను తన హేటర్స్‌ కోసమే అనసూయ పెట్టినట్లు తెలుస్తోంది.  ఆ క్యాప్షన్ ఏంటంటే.. నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ పెట్టింది.  ప్రస్తుతం అనసూయ గ్రామరస్‌ ఫొటోలతో పాటు.. ఈ క్యాప్షన్‌ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అను వ్యాఖ్యలను ఫ్యాన్స్‌ సమర్థిస్తుంటే.. హేటర్స్‌ మాత్రం నిట్టూరుస్తున్నారు.  ఇక తాజా ఫొటోల విషయానికి వస్తే.. ఇందులో అనసూయ చాలా హాట్‌గా కనిపించింది. చిట్టి పొట్టి డ్రెస్‌లో ఎద, థైస్‌ అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.  లూజ్‌ హెయిర్‌తో మ్యాజింగ్‌ చమ్కీలు ధరించి అదరహో అనిపించింది. అంతేకాదు కురసైన డ్రెస్‌లో వివిధ రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.  జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.  2012 - 2022 మధ్య  బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.  యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.  రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.  సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. తన అత్యుత్తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే తమిళంలోనూ ఈ బ్యూటీ బిజీగా మరిపోనుంది. 
    ఏప్రిల్ 03 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.  https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. స్టార్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకొని నేటితో సంవత్సరం పూర్తవడమే ఇందుకు కారణం.  https://twitter.com/i/status/1755075870287696051 ప్రస్తుతం #KiaraAdvani, #SidKiara హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ జంటకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/narmadakrystle/status/1755107606824440246 గతేడాది ఈ రోజునే (07 ఫిబ్రవరి, 2024) ఈ బాలీవుడ్‌ స్టార్‌ జంట పెళ్లి జరిగింది. రాజస్థాన్‌ జైసల్మేరులోని ప్యాలెస్‌లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది.  https://twitter.com/i/status/1754935624178778242 నటి కియారా అద్వానీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. ఆమె తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతో నటించింది.  View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) 2018లో మహేష్‌తో చేసిన 'భరత్‌ అనే నేను' (Bharat Ane Nenu) సినిమా ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.   View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) మరుసటి ఏడాది రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ చరణ్‌తో పాటు కియారా కూడా మంచి నటనే కనబరిచి ప్రశంసలు అందుకుంది.  ఆ సినిమా ఫ్లాప్‌తో కియారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమై అక్కడ పలు హిట్‌ సినిమాల్లో నటించింది.  ఇక కియారా (Kiara Advani) చేసిన ప్రముఖ బాలీవుడ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తొలుత ‘ఫుగ్లీ’ (Fugly) చిత్రం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది.  తన రెండో చిత్రం ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni: The Untold Story) ద్వారా కియారా పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇందులో సాక్షి రావత్‌ పాత్రలో ఆమె జీవించింది.  ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories) సిరీస్‌లో మేఘా ఉపాధ్యాయ్‌ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచింది. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయి పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్‌లో శృంగారం హద్దులు దాటిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. https://twitter.com/i/status/1755140256859615281 ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’, ‘షేర్‌షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ (Kiara Advani)గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.  షేర్‌షా సినిమాలో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ కియారా జోడీగా నటించింది. అయితే సినిమాకు ముందు నుంచే వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020లోనే వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఆ వార్తలపై స్పందించకుండా సస్పెన్స్ మెయింటెన్‌ చేసిన ఈ జంట.. చివరికీ పెళ్లి బంధంతో ఒక్కటై ఆ వార్తలను నిజం చేసింది. ప్రస్తుతం కియారా (Kiara Advani).. చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అటు తారక్‌ - హృతిక్‌ రోషన్‌ కాంబోలో రానున్న వార్‌-2 సినిమాలోనూ కియారా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తూ కియారా బిజీ బిజీగా గడుపుతోంది.  ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూన్నే సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీ (Kiara Advani) చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 
    ఫిబ్రవరి 07 , 2024
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘నా సినిమాకు వెళ్లండన్నా’ ‘బూట్‌కట్‌ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్‌ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.  https://twitter.com/i/status/1753489890397098009 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే! బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్‌ సాబ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్‌ (Sohel) డిమాండ్‌ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ సినిమాలకే కంటెంట్‌ ఉన్న ఆడియన్స్‌ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్‌ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్‌ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  నటుడు సోహెల్‌ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్‌ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.  ఇండస్ట్రీలో సక్సెస్‌ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్‌ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్‌ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.  సోహెల్‌ ఫ్రస్టేషన్‌కు కారణమిదే! బిగ్‌బాస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్‌ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్‌’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్‌ అల్లుడు’, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం 'బూట్‌కట్‌ బాలరాజు' సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్‌ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్‌ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు. 
    ఫిబ్రవరి 03 , 2024
    Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
    Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
    వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక (Niharika) స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై తొలిసారి పెదవి విప్పారు. దీనిపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా ఘాటుగా స్పందించడంతో వీరి విడాకుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నిహారిక ఏమన్నది? దానికి ఆమె మాజీ భర్త వేసిన కౌంటర్‌ ఏంటి? నిహారిక విడాకులపై నెటిజన్లు ఏమనుకుంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  https://twitter.com/celebstelugu/status/1294548027156254721 ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: నిహారిక తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిహారిక విడాకులపై తన మనసులోని భావాలను పంచుకుంది. 'పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అడుగులు వేశా. కానీ అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ఆన్‌లైన్‌ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడి ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి  నా ఫోకస్‌ మొత్తం సెల్ఫ్‌కేర్‌ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నా’ అని నిహారిక చెప్పారు. https://twitter.com/i/status/1751030907237016033 నాణానికి ఒక వైపే చూస్తే ఎలా: చైతన్య నిహారిక వ్యాఖ్యలపై (#NiharikaDivorce) ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) రియాక్ట్ అయ్యారు. హోస్ట్‌ పోస్టు చేసిన వీడియో కామెంట్‌ సెక్షన్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుంది. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా? అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా?’ అని ఘాటుగా బదులిచ్చారు.  నెటిజన్స్ ఏమంటున్నారంటే? నిహారిక - చైతన్య విడాకుల అంశంపై నెటిజన్లు (#NiharikaDivorce) తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నిహారికకు అండగా నిలుస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లాగే తమ సపోర్టు కూడా నిహారికకే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారికను బాధ్యురాలిగా చేస్తూ నెగిటివ్‌ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ‘పెళ్లిళ్లు ఆపై వెంటనే విడాకులు’ అనే శాపం ఉందని పోస్టులు చేస్తున్నారు. విడాకుల విషయంలో తప్పు ముమ్మాటికీ నిహారికదేనని ఏకపక్షంగా తీర్పు ఇచ్చేస్తున్నారు. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోటాపోటీగా కామెంట్లు పెడుతుండటంతో నిహారిక విడాకుల (#NiharikaDivorce) అంశం మరోమారు నెట్టింట ట్రెండ్ అవుతోంది. 
    జనవరి 27 , 2024
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో వచ్చే వారం పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో చిన్న చితకా సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 20కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం థియేటర్లలలో విడుదలకు సిద్ధమైన సినిమాలు గాఢ్ తమిళ్‌లో హిట్ సాధించిన ఇరైవన్ మూవీ తెలుగులో గాఢ్ పేరుతో అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం ట్విస్ట్‌లతో కూడిన ఈ చిత్రం తమిళ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను సుధన్ సుందరం, జి. జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఐ.అహ్మద్ డైరెక్ట్ చేశారు. మధనపూడి గ్రామం అనే నేను ఓ ఊరి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. శివ కంఠమనేని హీరోగా క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.  రతినిర్వేదం మలయాళంలో సూపర్ హిట్‌ అయి తెలుగులోనూ ఒకప్పుడు హిట్ కొట్టిన చిత్రం రతి నిర్వేదం. ఈ చిత్రం అక్టోబర్ 13న రీరిలీజ్ కానుంది. శ్వేతమీనన్, శ్రీజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సగిలేటి కథ రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం సగిలేటి కథ. ఈ చిత్రాన్ని రాజశేఖర్ సుద్మూన్ డైరెక్ట్ చేశారు. రవితేజ మహాదాస్యం, విషిక కోట ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. రాయలసీమ సంస్కృతులు పండుగలు సినిమాలో ప్రధానాంశంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. రాక్షస కావ్యం మైథాలజీని ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ రూపొందించిన చిత్రం రాక్షస కర్తవ్యం. ఈ చిత్రంలో అభయ్ నవీన్, కుశాలిని లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 9- 13) TitleCategoryLanguagePlatformRelease DateMargauxMovieEnglishNetflixOctober  09Big WopWebseriesGermanNetflixOctober 11KasargoldMovieMalayalamNetflixOctober 13Awareness MovieSpanish Amazon PrimeOctober 11  In My Mother's     SkinMovieTagalog Amazon PrimeOctober 12Everybody Loves Diamonds SeriesItalian Amazon PrimeOctober 13The BurialmovieEnglish Amazon PrimeOctober 13Mathagam Part 2SeriesTelugu DubbedHot StarOctober 12GoosebumpsSeriesEnglishHot StarOctober 13Sultan of DelhiSeriesHindiHot StarOctober 13MattikathaMovieTelugu ahaOctober 13  Prema VimanaMovie Telugu Zee 5October 13Star vs Food Survival SeriesHindiDiscovery PlusOctober 09Mr. NagabhushanamSeriesTeluguEtv-WinOctober 13Mission Impossible - Dead Reckoning Part 1MovieEnglishBook My ShowOctober 11Talk To MeMovieEnglishBook My ShowOctober 15The Queen MaryMovieEnglishBook My ShowOctober 15
    అక్టోబర్ 09 , 2023
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.  మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.  https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.  https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s నాగార్జున భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.  https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s రామ్‌చరణ్ తేజ్ రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.  అఖిల్, వరుణ్ తేజ్ రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.  https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
    ఆగస్టు 08 , 2023
    GLOBAL STAR NTR: హాలీవుడ్ డైరెక్టర్‌తో NTR సినిమా… అసలు విషయం చెప్పిన జేమ్స్ గన్ 
    GLOBAL STAR NTR: హాలీవుడ్ డైరెక్టర్‌తో NTR సినిమా… అసలు విషయం చెప్పిన జేమ్స్ గన్ 
    యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రేంజ్‌ మారిపోయింది. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ హీరో. తారక్‌తో సినిమాలు తీసేందుకు ఇప్పటికే చాలామంది క్యూ కడుతుండగా… ఈ లిస్ట్‌లో హాలీవుడ్ దర్శకుడు చేరారు. గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ సినిమాల దర్శకుడు జేమ్స్‌ గన్‌ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటనకి ఫిదా అయినట్లు తెలిపాడు ఈ హాలీవుడ్‌ డైరెక్టర్‌. దీంతో తారక్‌ గ్లోబల్ స్టార్ అయ్యాడంటూ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. హాలీవుడ్‌కు తారక్‌ హాలీవుడ్ చిత్రాల దర్శకుడు జేమ్స్‌ గన్‌ను ఇటీవల ఇంటర్వ్యూల్లో ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏ భారతీయ నటుడితో చేయాలని ఉంది ఆయన్ని ప్రశ్నించగా… “ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో బోనులో నుంచి పులులతో పాటు వచ్చే యాక్టర్‌తో పని చేయాలని ఉంది” అన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని ప్రశంసించారు. కొన్ని నెలల క్రితం RRR చిత్రం చూడాలని ఓ నెటిజన్ సూచించగా… “ నేను చూశాను. అదరగొట్టేశారు” అనే సమాధానం ఇచ్చారు జేమ్స్‌ గన్‌. సూపర్‌ హీరోస్‌ సినిమాలో తారక్‌కు సంబంధించిన రోల్‌ గురించి కూడా గన్‌ మాట్లాడారు. అతడికి గార్డియన్స్‌ ఆఫ్ గెలాక్సీ చిత్రంలో ఏదైనా పాత్ర ఉందో చూడాలి అన్నారు. ఒకవేళ జేమ్స్‌ గన్‌(James Gunn)కు ఏదైనా రోల్‌ ఉందని అనిపిస్తే కచ్చితంగా అవకాశం ఇస్తాడు. నిజంగా జరిగితే.. హాలీవుడ్‌లో సూపర్‌ హీరోస్‌ సినిమాలో యంగ్‌ టైగర్‌ను చూడొచ్చు. Courtesy Twitter: ??? ??? ???????? లిస్ట్‌ పెరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్‌ దర్శకుల లిస్ట్‌ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో వార్‌ 2లో నటిస్తున్న యంగ్‌ టైగర్‌… అక్కడ మరిన్ని సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది. తమిళ్ దర్శకుడు వెట్రీమారన్‌ కూడా తారక్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. తెలుగులోనూ బడా డైరెక్టర్లు తారక్‌ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌కు చేరడంతో స్టార్‌డమ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్‌పైనా ప్రశంసలు బాలీవుడ్‌పై కూడా ప్రశంసలు కురిపించాడు దర్శకుడు జేమ్స్‌ గన్‌. గార్డియన్స్‌ ఆఫ్ గెలాక్సీ(Guardians of the Galaxy)లో మ్యూజికల్‌ ఎలిమెంట్‌కు బాలీవుడ్‌ స్ఫూర్తి అని తెలిపారు. బాలీవుడ్‌ చిత్రాల్లో కళ, ఎంటర్‌టైన్‌మెంట్‌ తనని ఆకర్షిస్తుందని వెల్లడించారు. సినిమాకి హద్దులు లేవని… ప్రతి ఇండస్ట్రీ అన్నింట్లో భాగమేనని చెప్పారు జేమ్స్‌. Courtesy Twitter:NTR ఎవరీ దర్శకుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన సినిమా గార్డియన్స్‌ ఆఫ్ గెలాక్సీ. ఇందులో ఇప్పటికే రెండు పార్ట్‌లు విడుదల కాగా.. మరొకటి విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్‌ ప్రాట్‌, విన్‌ డీజిల్‌, బటిస్టా వంటి ఎంతోమంది స్టార్‌ నటులు నటించారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వీటికి దర్శకత్వం వహించింది జేమ్స్‌ గన్‌. 
    ఏప్రిల్ 26 , 2023
    100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా  రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలివే!!
    100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా  రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలివే!!
    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం. హీరో -సినిమాలు హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్‌4ఎన్టీఆర్‌ 4చిరంజీవి 3రామ్‌ చరణ్‌ 3పవన్‌ కల్యాణ్3బాలకృష్ణ 2 మహేశ్‌ బాబు 100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి. సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్‌ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు ప్రభాస్‌  ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్‌ నుంచే రావాలి. సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్‌151 కోట్లు చిరంజీవి  ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్‌ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్‌ క్రేజ్‌కు నిదర్శనం సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు అల్లు అర్జున్ పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ ఆ సినిమా కంటే  ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది. సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్‌369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు రామ్‌ చరణ్‌ RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్‌, అంతకు ముందే  తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు. సినిమాకలెక్షన్‌RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు జూ. ఎన్టీఆర్‌ RRRతో రామ్‌ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్‌. తనకున్న వాక్‌ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్‌ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్‌ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు. సినిమాకలెక్షన్‌RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్‌126 కోట్లు పవన్ కల్యాణ్ టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్‌ ప్రస్తుత సినిమా లైనప్‌ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది. సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్‌ 161 కోట్లువకీల్‌ సాబ్‌138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు బాలకృష్ణ అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు. సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు మరికొన్ని సినిమాలు వెంకటేశ్‌, వరుణ్ తేజ్‌ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి.  రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి. సినిమాహీరో కలెక్షన్‌F2 వెంకటేశ్‌-వరుణ్‌ తేజ్‌143 కోట్లుగీత గోవిందంవిజయ్‌ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు పాత రోజుల్లో సినిమా హిట్‌ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్‌ జుబ్లీ, 100 డేస్‌ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్‌ అయిపోయింది. హిట్‌ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
    ఏప్రిల్ 26 , 2023
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని  మోటివేట్ చేసే అంశం? అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్‌ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్‌ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి.  https://twitter.com/anusuyakhasba/status/1646470630639034368 ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర? అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా.. https://twitter.com/anusuyakhasba/status/1646469527897800706 ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్‌ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు? అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా తాపత్రయం.  https://twitter.com/anusuyakhasba/status/1646463701757878274 ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా? అను: హనుమంతుడు నా ఫేవరెట్‌. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు. https://twitter.com/anusuyakhasba/status/1646461240250896389 https://telugu.yousay.tv/trolls-on-anasuya-they-dont-understand.html ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు. అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్‌ చేయడం కరెంట్ కాదు.  https://twitter.com/anusuyakhasba/status/1646458862214733824 ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్‌, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు  భయం వేయలేదా? అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్‌ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది.  https://twitter.com/anusuyakhasba/status/1646456898613579776 ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా? అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం. https://twitter.com/anusuyakhasba/status/1646455609506816001 ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పిండి? అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. https://twitter.com/anusuyakhasba/status/1646455293927374851 ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్‌/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా? అను: అది నిజం కాదు.  https://twitter.com/anusuyakhasba/status/1646438774950477826 ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు? అను: నథింగ్‌.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు. https://twitter.com/anusuyakhasba/status/1646437957228965889 https://telugu.yousay.tv/anasuyas-romance-with-sunflowers.html
    ఏప్రిల్ 14 , 2023
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్‌ 10) కల్కి ట్రైలర్‌ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.  ప్రభాస్‌.. కల్కినే కాదట! 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్‌) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్‌ చూసిన తర్వాత అసలు ప్రభాస్‌ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్‌ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఏం ట్విస్ట్ ప్లాన్‌ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.  https://www.youtube.com/watch?v=y1-w1kUGuz8 ప్రభాస్‌ ప్రాధాన్యత తగ్గిందా! కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్‌ కంటే బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్‌ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్‌ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. 'రికార్డ్స్‌ చెక్‌ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్‌ ఓడిపోలేదు' అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్స్‌ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్‌ 27న ప్రభాస్‌ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.  దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్‌ కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్‌ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్‌ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్‌ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్‌ అశ్విన్‌ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్‌ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్‌ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్​కు వాడేస్తున్నారు. https://twitter.com/i/status/1800179235677778142 వీటిపైనా నెట్టింట చర్చ..! ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్​ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ - ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్​ లుక్, రోల్​ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి. 
    జూన్ 11 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.  ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.  మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. 
    మే 28 , 2024

    @2021 KTree