• TFIDB EN
  • నేను లోకల్
    UATelugu2h 23m
    బాబు అనే యువకుడు సంతోషంగా తన కుటుంబంతో గడుపుతుంటాడు. ఈక్రమంలో కీర్తి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ వీరి పెళ్లికి కీర్తి తండ్రి ఒప్పుకోడు. దీంతో బాబు తన అర్హత నిరూపించుకునేందుకు అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాని
    బాబు
    కీర్తి సురేష్
    కీర్తి
    నవీన్ చంద్రన్
    కీర్తి కాబోయే భర్త
    సచిన్ ఖేడేకర్
    కీర్తి తండ్రి మరియు బాబు కళాశాల పరీక్షా పర్యవేక్షకుడు
    తులసి
    కీర్తి తల్లి
    రావు రమేష్
    పెళ్లికూతురు తండ్రి
    పోసాని కృష్ణ మురళి
    బాబు తండ్రి
    ఈశ్వరి రావు
    బాబు అమ్మ
    రఘు బాబు
    సిద్ధార్థ్ తండ్రి
    వెన్నెల కిషోర్
    స్టోర్ సేల్స్‌మెన్
    ప్రభాస్ శ్రీను
    నిమ్మకాయల రఘు
    కృష్ణ భగవాన్
    కానిస్టేబుల్
    అనీష్ కురువిల్లా
    కాలేజీ ప్రిన్సిపాల్
    రజిత
    సిద్ధార్థ్ తల్లి
    రామ్ ప్రసాద్బాబు స్నేహితుడు
    వివా రాఘవబాబు స్నేహితుడు
    జబర్దస్త్ రాకెట్ రాఘవసేల్స్ మాన్
    కరాటే కళ్యాణి
    సిబ్బంది
    త్రినాధ రావు నక్కిన
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    శిరీష్నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    నిజార్ షఫీ
    సినిమాటోగ్రాఫర్
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    కథనాలు
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  కీర్తి సురేష్ దేనికి ఫేమస్? కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ వయస్సు ఎంత? 1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు   కీర్తి సురేష్ ముద్దు పేరు? కీర్తమ్మ కీర్తి సురేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది? చెన్నై Screengrab Instagram: keerthysureshofficial కీర్తి సురేష్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు కీర్తి సురేష్ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్ కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం? దోశ కీర్తి సురేష్ అభిమాన నటుడు? సూర్య, విజయ్  తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా? నేను శైలజ(2016) కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ కీర్తి సురేష్ ఏం చదివింది? ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్  Courtesy Instagram: Keerthy suresh కీర్తి సురేష్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు? సురేష్ కుమార్, మేనక కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా? తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది? మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/keerthysureshofficial/?hl=en కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్ సిమ్రాన్ కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది. https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
    ఏప్రిల్ 16 , 2024
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.  Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.  Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.  Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.  Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.  Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.  Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.  విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.  సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.  నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.  తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.  అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.  ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన  'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు. 
    ఏప్రిల్ 17 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.  రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.  https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.   https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.  https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.  https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.  https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.  https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.  https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.  https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.  ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు  సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.  హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.  దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు  గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.  ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    <strong>VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!</strong>
    VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; రెండు భాగాలుగా.. విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. 'VD 12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్‌ తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్‌ చేసిన చిత్రాలన్నీ సింగిల్‌ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్‌ కెరీర్‌లోనూ సీక్వెల్స్‌ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తున్నారు. ఆకట్టుకున్న ఫస్ట్ లుక్‌! 'VD12' చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో విజయ్‌ మాస్‌ లుక్‌లో కనిపించాడు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు' అని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్‌ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.&nbsp; డ్యుయల్‌ రోల్‌లో..! ‘VD 12’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్‌ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్‌ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూస్తే విజయ్‌ దేవరకొండ ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్‌ చూస్తే థియేటర్‌లో మాస్‌ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.&nbsp; విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.&nbsp;
    ఆగస్టు 05 , 2024
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘నా సినిమాకు వెళ్లండన్నా’ ‘బూట్‌కట్‌ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్‌ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.&nbsp; https://twitter.com/i/status/1753489890397098009 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే! బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్‌ సాబ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.&nbsp; తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్‌ (Sohel) డిమాండ్‌ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ సినిమాలకే కంటెంట్‌ ఉన్న ఆడియన్స్‌ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్‌ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్‌ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.&nbsp; నటుడు సోహెల్‌ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్‌ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.&nbsp; ఇండస్ట్రీలో సక్సెస్‌ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్‌ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్‌ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.&nbsp; సోహెల్‌ ఫ్రస్టేషన్‌కు కారణమిదే! బిగ్‌బాస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్‌ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్‌’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్‌ అల్లుడు’, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం 'బూట్‌కట్‌ బాలరాజు' సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్‌ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్‌ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు.&nbsp;
    ఫిబ్రవరి 03 , 2024
    <strong>Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!</strong>
    Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
    ‘దేవర’ (Devara: Part 1) రాకకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించింది. ప్రముఖ హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేయడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500లకు పైగా ప్రీమియర్స్‌తో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక వరల్డ్‌ వైడ్‌గా దేవర అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్స్‌ చూస్తుంటే తొలి రోజు ఈజీగానే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; తొలి రోజు రూ.125 కోట్లు పక్కా! తారక్‌ నటించిన ‘దేవర’ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లకొడుతూ భారీ హైప్‌ సంపాదించుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి సైతం ఇచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీసేల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర తొలి రోజున రూ.125 కోట్లకు పైగా గ్రాస్‌ పక్కాగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రూ.10-15 కోట్లు ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు దేవర రాబట్టొచ్చని సమాచారం. హిందీలో రూ.8-10 కోట్లు దేవర ఖాతాలో పడొచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెస్ట్‌ ఆఫ్ ఇండియా మెుత్తం కలిపి రూ.10-15 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం దేవర దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు ఈజీగానే రూ.30-35 కోట్లు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న తొలిరోజు దేవర ఖాతాలో రూ.125 కోట్లు + పడటం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని సమాచారం. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ’దేవర’పై అనిరుధ్‌ ఫస్ట్ రివ్యూ 'దేవర' చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్‌ 'దేవర'పై హైప్‌ వచ్చే కామెంట్స్‌ చేశారు. ‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. దేవర చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నా' అని అనిరుద్‌ అన్నారు.&nbsp; సైఫ్‌ భార్యగా తెలుగు నటి దేవరలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్యగా తెలుగు సీనియర్‌ నటి చైత్ర రాయ్‌ నటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దొరకడం తన అద్భుష్టమని చైత్ర అంటోంది. సెట్‌లో తొలిసారి తారక్‌, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది. కాగా, 'అష్టా చమ్మా' సీరియల్‌తో చైత్ర బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌లో నటిస్తోంది. దేవరతో మంచి గుర్తింపు లభిస్తే సినిమాల్లోనూ బిజీ కావచొచ్చని చైత్ర భావిస్తోంది.&nbsp; ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 24) పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్‌ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. దీనిపై పవన్‌ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్‌ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.&nbsp; పవన్‌ ఏఐ పోస్టు..? తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్‌ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్‌ జీపీటీ లేదా ఏఐ&nbsp; సాయంతో పదాల కూర్పును జనరేట్‌ చేయించి పవన్‌ ఈ ట్వీట్‌ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్‌ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; https://twitter.com/PawanKalyan/status/1838587619745087518 ‘ఏఐ’ వినియోగంలో తప్పుందా! కార్తీపై పవన్‌ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్‌ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్‌ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్‌ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, గ్రమిటికల్‌ తప్పులు లేకుండా ఏఐ&nbsp; సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్‌ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్‌ ఏఐ టూల్‌ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్‌ ఏఐ ట్వీట్‌ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; కార్తీ చేసిన తప్పేంటి? సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్‌ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్‌ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాంకర్‌ లడ్డు టాపిక్‌ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.&nbsp; https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470 పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్‌! కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్‌ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్‌ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్‌ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్‌’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!</strong>
    Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్‌? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి హిట్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) చేస్తోన్న చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం, సైఫ్ అలీఖాన్‌ లాంటి దిగ్గజ నటుడు విలన్‌ పాత్ర పోషిస్తుండటం సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది. చక చకా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో తారక్‌ డ్యుయల్‌ రోల్‌ పోషిస్తుండటంతో అసలు ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అని నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ‘దేవర’ స్టోరీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీని కుదిపేసిన యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ఘటన? దేవర స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘దేవర’ స్టోరీ అదేనా? 'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.&nbsp; టీడీపీని ఇరకాటంలో పడేస్తుందా? 1985లో 'కారంచేడు ఘటన' జరిగినప్పుడు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన దళితుల కోసం చాలా కొత్త చట్టాలను తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇది ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా ఉండిపోయింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అప్పటి రక్తం మరకలు టీడీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ‘దేవర’ సినిమాతో మరోమారు ఈ అంశం తెరపైకి వస్తే ఇది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఇరాకటంలో పడేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా తెలుగు దేశం పార్టీ, బాలకృష్ణతో ఎన్టీఆర్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాలో కారంచేడు ఘటనను చూపిస్తే ఈ దూరం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; సోషల్‌ మెసేజ్‌ తప్పనిసరి! తెలుగులో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో కొరటాల శివ (Koratala Siva) ఒకరు. ఆయన ఇప్పటివరకూ తీసిన ప్రతీ సినిమాలోనూ ఏదోక సందేశాన్ని ఇస్తూనే వచ్చారు. లేదంటే సామాజిక అంశాన్నైనా టచ్‌ చేస్తూ వచ్చారు. ‘మిర్చి’ చిత్రంలో ఫ్యాక్షన్‌ గొడవలను, ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ‘జనతా గ్యారేజ్‌’లో బలహీనులకు అండగా నిలబడటం, ‘భరత్‌ అనే నేను’ సినిమాలో రాజకీయాల్లో జవాబుదారి తనం, ‘ఆచార్య’ చిత్రంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని చూపించారు. అలాగే ‘దేవర’ కథలో కారంచేడు విషాద ఘటన తాలూకా సీన్లు ఉండే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; మూడో సాంగ్‌ వచ్చేస్తోంది.. దేవర సినిమా నుంచి సెప్టెంబర్ 4వ తేదీన మూడో పాట రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ పోస్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.&nbsp; 'దావుడి' అంటూ ఈ డ్యూయోట్‌ సాంగ్‌ సాగనున్నట్లు తెలిపింది. ‘ఇది కచ్చితంగా అదిరిపోతుంది. ప్రతీ బీట్‍ కూడా విజిల్ వేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న దావుడి’ అంటూ సోషల్ మీడియాలో దేవర టీమ్ రాసుకొచ్చింది. తాజా పోస్టర్‌లో తారక్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో ఉండగా వైట్‌ కలర్‌ డ్రెస్‌లో జాన్వీ మెస్మరైజ్‌ చేసింది. తారక్‌ అలా వెనక్కి వాలుతుండగా ఆయనను జాన్వీ రొమాంటిక్‍గా పట్టుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. https://twitter.com/DevaraMovie/status/1830601323152289828 తారక్‌ పెద్ద మనసు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా తారక్‌ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తాను కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కష్ట కాలంలో అండగా నిలిచిన ఈ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; https://twitter.com/tarak9999/status/1830825968820244827 https://twitter.com/VishwakSenActor/status/1830826016509759684 https://twitter.com/VishwakSenActor/status/1830830975905079307
    సెప్టెంబర్ 03 , 2024
    <strong>HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?</strong>
    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.&nbsp; తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరులో కసి పెంచిన ఘటన ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్‌ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్‌ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్‌ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు. చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి 1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్‌ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు. చిరు మెస్మైరైజింగ్‌ డ్యాన్స్‌కు కారణం ఇదే! కెరీర్‌ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట.&nbsp; సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్‌ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.&nbsp; రివ్యూవర్‌ నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి.. మెగాస్టార్‌ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్‌ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్‌ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.&nbsp; కుర్ర హీరోలకు అండగా.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డగా.. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. సేవా కార్యక్రమాల్లో ముందజ.. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
    ఆగస్టు 22 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ‘కుషిత కల్లపు’ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో లిప్‌కిస్‌ కైనా తాను సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేసిన ‘కుషిత కల్లపు’కు సంబంధించిన పూర్తి సమాచారం, ఆమె ఇష్టా ఇష్టాలు, అభిరుచులు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; కుషిత కల్లపు పుట్టిన తేది? 19 అక్టోబర్‌, 2002 శనివారం రోజున హైదరాబాద్‌లో కుషిత కల్లపు జన్మించింది.&nbsp; కుషిత కల్లపు వయసు ఎంత? 19 అక్టోబర్‌, 2002లో పుట్టినందను ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లు కుషిత కల్లపు తల్లిదండ్రులు ఎవరు? ఈ బ్యూటీ తన కుటుంబ సభ్యుల సమాచారంపై గోప్యత పాటిస్తోంది. తన తల్లిదండ్రుల నేపథ్యం, వృత్తి వంటి విషయాలను ఆమె ఎక్కడా పంచుకోలేదు.&nbsp; కుషిత కల్లపు మతం ఏది? ఆమె హిందువు కుషిత కల్లపుది ఏ రాశి? మిధున రాశి కుషిత కల్లపు ఎత్తు ఎంత? ఈ బ్యూటీ 5.5&nbsp; అడుగుల ఎత్తు కలిగి ఉంది.&nbsp; కుషిత కల్లపు బరువు ఎంత? ఈ భామ సుమారు 65 కిలోల బరువు ఉంది.&nbsp; కుషిత కల్లపు కళ్లు, జట్టు ఏ కలర్‌? నలుపు కుషిత కల్లపు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా? https://www.instagram.com/kushithakallapu/ కుషిత కల్లపునకు పెళ్లి అయ్యిందా? లేదు కుషిత కల్లపు తొలి సినిమా? ‘నీతోనే నేను’&nbsp; సినిమాతో కుషిత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత 'మనోహరం', 'చాంగురే బంగారు రాజా' సినిమాల్లో నటించింది.&nbsp; కుషిత కల్లపు తాజా చిత్రం ఏది? బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్జున్‌ కళ్యాణ్‌ హీరోగా లక్ష్మణ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బాబు నెం.1 బుల్‌షిట్‌ గాయ్‌'. ఇందులో కుషిత హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు కుషిత ఏం చేసింది? టాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు కుషిత పలు షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది.&nbsp; కుషిత కల్లపు చేసిన షార్ట్‌ఫిల్మ్స్‌? డేట్‌మింటన్‌ (Dateminton), 3G, ఫ్రెండ్స్‌ విత్‌ బెనిఫిట్స్‌ (Friends with Benefits), డేట్‌ వంటి లఘు చిత్రాల్లో కుషిత చేసింది.&nbsp; కుషిత కల్లపు ఫేవరేట్‌ హీరో? కుషిత కల్లపు తన ఫేవరేట్‌ హీరో ఎవరో ఏ వేదికపై వెల్లడించలేదు. అయితే పవన్‌తో లిప్‌కిస్‌కు రెడీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఆమె ఫేవరేట్‌ హీరో పవర్‌స్టార్‌ అయ్యి ఉండవచ్చు.&nbsp; కుషితను బాగా బాధ పెట్టిన ఘటన? మహేష్‌ బాబు రీసెంట్‌ చిత్రం 'గుంటూరు కారం' షూటింగ్‌లో కుషిత పాల్గొంది. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా చేసిందట. అయితే తన సీన్స్‌ ఎడిటింగ్‌లో పోవడంతో తాను చాలా బాధపడినట్లు కుషిత ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.&nbsp; కుషిత కల్లపు హాబీ? ట్రావెలింగ్‌ అంటే భామకు చాలా ఇష్టమట. ఖాళీ దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాల్లో వాలిపోతుందట.&nbsp; కుషిత కల్లపు ఫేవరేట్‌ ఫుడ్‌? ఛీజ్‌తో చేసిన వంటకాలంటే తనకు చాలా ఇష్టమైన ఇటీవల ఓ ఇంటర్యూలో కుషిత చెప్పుకొచ్చింది.&nbsp; కుషిత కల్లపు ముద్దు పేరు ఏంటి? కుటుంబ సభ్యులు ఈ బ్యూటీని ముద్దుగా ‘ఖుషి’ అని పిలుస్తారట. అలా పిలిపించుకోవడం కుషితకు చాలా ఇష్టమట.
    మార్చి 07 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024

    @2021 KTree