• TFIDB EN
  • నెరు (2023)
    U/ATelugu2h 32m

    కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మోహన్ లాల్అడ్వా. విజయమోహన్
    ప్రియమణిఅడ్వా. పూర్ణిమ రాజశేఖర్
    సిద్ధిక్అడ్వా. రాజశేఖర్
    జగదీష్మహమ్మద్
    శాంతి మాయాదేవిఅహనా
    శంకర్ ఇందుచూడన్మైఖేల్ జోసెఫ్
    అబ్రహం జాకబ్క్రిస్టోఫర్ జోసెఫ్, మైఖేల్ తండ్రి
    సబిట్టా జార్జ్ఆన్సి జోసెఫ్, మైఖేల్ తల్లి
    మాథ్యూ వర్గీస్న్యాయమూర్తి
    నందుపబ్లిక్ ప్రాసిక్యూటర్
    దినేష్ ప్రభాకర్డ్రైవర్ రాబిన్
    ప్రశాంత్ నాయర్సీఐ మార్టిన్ జోసెఫ్
    విష్ణువుబషీర్
    జోమోన్సిరాజ్
    రెస్మి అనిల్సీమ
    కాలేష్ రామానంద్వినోద్
    రమాదేవిమహమ్మద్ మొదటి భార్య
    అఖిల్ రాయ్సోనీ
    శ్యామ్ జాకబ్షిజుమోన్
    పూజపురా రాధాకృష్ణన్విజయమోహన్ గుమస్తా
    ఆంటోనీ పెరుంబవూరుమహమ్మద్ పొరుగువాడు
    సిబ్బంది
    జీతూ జోసెఫ్దర్శకుడు
    విష్ణు శ్యామ్సంగీతకారుడు
    సతీష్ కురుప్సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    <strong>Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!</strong>
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    <strong>Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!</strong>
    Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!
    ప్రముఖ నటి చాందిని చౌదరి (Chandini Chowdary) అంటే ఈ జనరేషన్‌ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన చాందిని.. రీసెంట్‌గా ‘గామి’ (Gaami) చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఫ్యాన్స్‌ చాందినిపై తీవ్రంగా మండిపడుతున్నారు.&nbsp; ఏం జరిగిదంటే? చాందిని చౌదరి లేటెస్ట్‌ చిత్రం 'మ్యూజిక్‌ షాప్‌ మూర్తి' (Music Shop Murthy) విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌.. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తోంది కదా.. మీ ఫేవరేట్‌ టీమ్ ఏది? అని ప్రశ్నించారు. దీనికి చాందిని సమాధానం ఇస్తూ.. ‘నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు. సీసీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే చూశా. ఐపీఎల్‌ చూసిన తర్వాత ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను’ అని పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (SRH) టీమ్‌ ఉంది కదా అని రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘మాది ఆంధ్రా. మాకు ఆంధ్రా టీమ్‌ లేదు’ అని సరదాగా సమాధానం ఇచ్చింది.&nbsp; https://twitter.com/i/status/1784952345450987801 సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ ఫైర్‌! చాందిని చౌదరి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమెపై ఒక్కసారిగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తెలంగాణ క్యాపిటల్‌ హైదరాబాద్‌ను ఓన్‌ చేసుకోలేకపోతోందంటూ మండిపడుతున్నారు. నీ చిత్రాలు కేవలం ఆంధ్రవాళ్లు మాత్రమే చూస్తున్నారా? తెలంగాణ వాళ్లు చూడటం లేదా? అని నిలదీస్తున్నారు. ఇలా సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటే పెద్ద హీరోయిన్‌వి ఎలా అవుతావంటూ ప్రశ్నిస్తున్నారు.&nbsp; వివరణ ఇచ్చిన చాందిని&nbsp; నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటుండటంతో నటి చాందిని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు సైతం పెట్టింది. ‘నా ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది అని అడిగితే.. నేను మ్యాచ్‌లు చూశాకే చెబుతా అన్నాను. నాది ఆంధ్రా కాబట్టి ఆంధ్రాకి కూడా టీం ఉంటే బాగుండు అన్నాను. ట్రేండింగ్ కంటెంట్‌కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేయడం మాములే కదా. అయినా.. నేను నా రెండు రాష్ట్రాలను చూసి గర్విస్తా. ఎందుకంటే నేను ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని. హైదరాబాద్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అంటూ చాందిని రాసుకొచ్చింది.&nbsp; https://twitter.com/iChandiniC/status/1784913213701730485 రిలీజ్ ఎప్పుడంటే? చాంది చౌదరి లేటెస్ట్‌ చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy Release Date).. మే 31న విడుదల కానుంది. ఇందులో అజయ్‌ ఘోష్‌ లీడ్‌ రోల్‌లో నటించాడు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్లై హై బ్యానర్‌పై హర్ష గారపాటి నిర్మిస్తున్నారు. పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగమ్ కెమెరా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు.&nbsp;
    మే 01 , 2024
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) యుగం నడుస్తోంది. మెున్నటి వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలుగా ఉన్న థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించేశాయి. బడా హీరోల చిత్రాలు మినహా.. అత్యధిక శాతం చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney + Hotstar), సోనీలివ్‌ (SonyLIV), ఈటీవీ విన్‌ (ETV Win), వూట్‌ (Voot), ఆహా (Aha) వంటి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు - సిరీస్‌లు విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.&nbsp; ఓటీటీ ఏర్పాటుకు కారణం ఇదే! మలయాళం నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కంటెంట్‌ ఉన్న కథలను మాలీవుడ్‌ నిర్మిస్తుందన్న పేరు ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. కొందరైతే సబ్‌టైటిల్స్‌ పెట్టుకొని మరి మాలీవుడ్‌ సినిమాలను వీక్షిస్తున్నారు. ఇది గమనించిన కేరళ ప్రభుత్వం.. డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో కొత్త ఓటీటీ యాప్‌ను మూవీ లవర్స్‌ ముందుకు తీసుకొస్తోంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. 60 మంది ఉద్యోగులతో.. కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) రేపు స్వయంగా ‘సీస్పేస్‌’ (CSpace) యాప్‌ను లాంచ్‌ చేస్తారు. ఉదయం 9.30 గంటలకు.. కైరళి థియేటర్‌లో జరగనున్న లాంచ్‌ ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సజీ చెరియన్ (Saji Cherian) కూడా హాజరవుతారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు ‘సీస్పెస్’ ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - KSFDC (Kerala State Film Development Corporation) చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న KSFDCనే ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మంది సిబ్బందిని సెలక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; ప్రత్యేక పానెల్‌ ఏర్పాటు! ఈ ‘సీస్పేస్‌’ ఓటీటీలో ఎటువంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను సైతం KSFDC సంస్థ ఏర్పాటు చేసింది. బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఈ ప్యానెల్‌ ఏర్పాటైంది. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ ప్యానెల్‌ చేతుల్లోనే ఉండనుంది. సీస్పేస్ లాంచ్ సందర్భంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’ ఎలా పనిచేస్తుంది? ‘సీస్పేస్‌’ యాప్‌ను మాస, త్రైమాసిక, వార్షిక చెల్లింపుల విధానంలో కాకుండా ‘పే పర్‌ వ్యూ‘ (Pay Per View) స్కీమ్‌తో రన్‌ చేయనున్నారు. ఇందులో సినిమా చూడాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును చిత్ర నిర్మాతలకు సీస్పేస్‌ ప్యానెల్ అందజేస్తుంది. ఒకవేళ తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ వస్తే సగం ధరకే వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’తో ఎవరికి లాభం! కేరళలో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు సీస్పేస్‌ చెక్‌ పెట్టనుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఈ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. అలాగే థియేటర్లు దొరక్క సమస్యలు ఎదుర్కొనే నూతన దర్శకులు తమ చిత్రాలను సీస్పేస్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చని సూచించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అటు ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు&nbsp; స్పష్టం చేశారు.
    మార్చి 06 , 2024
    <strong>Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్</strong>
    Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్
    భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr. NTR) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్‌ సహా గ్లోబల్‌ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టింది. హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ జేమ్స్ కామెరాన్ (James Cameron) సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తనకు బాగా నచ్చినట్లు ప్రకటించారు. అటువంటి RRR చిత్రంపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ (Adil Hussain) నోరు పారేసుకున్నారు. దక్షిణాది చిత్రంపై తన అక్కసు వెళ్లగక్కాడు.&nbsp; RRR గొప్ప చిత్రం కాదు’ బాలీవుడ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సేన్‌.. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అస్సామీ నటుడికి యాంకర్‌ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ప్రాంతీయ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో అలరిస్తున్నాయని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాగా త్వరలో అసోం చిత్రాలను కూడా అంతర్జాతీయ వేదికలపై చూడవచ్చా? అని అడిగారు. ఇందుకు ఆదిల్‌ హుస్సేన్‌ సమాధానమిస్తూ.. ‘అస్సామి సినిమా ఇప్పటికే ఆ స్థాయికి (గ్లోబల్‌) చేరుకుంది. నేను RRR గొప్ప చిత్రంగా పరిగణించను. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందిన చిత్రాలు సాధారణంగా మంచి సినిమాలుగా పరిగణింపబడతాయి. అంతమాత్రాన అవి తప్పనిసరిగా గొప్ప చిత్రాలు కావాల్సిన పని లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా అంతే. అది వినోదాత్మక చిత్రం మాత్రమే. నా దృష్టిలో అది గొప్ప చిత్రం కాదు. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే విలేజ్‌ రాక్‌స్టార్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని అన్నారు.&nbsp; View this post on Instagram A post shared by GPlus (@guwahatiplus) నెట్టింట తీవ్ర దుమారం RRRపై ఆదిల్‌ హుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు ఆదిల్‌ చేశారంటూ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. సౌత్‌ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో రాణిస్తుండటం చూసి తట్టుకోలేకనే ఇలా మాట్లాడారని మండిపడ్డారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' భారత చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు మరికొందరు నెటిజన్లు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మంచి ఎంటర్‌టైనింగ్‌ చిత్రమేనని.. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప సినిమా అయితే కాదని పేర్కొంటున్నారు. సందీప్ రెడ్డి వంగా మూవీపైనా విమర్శలు! యానిమల్‌ (Animal) ఫేమ్‌ అర్జున్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గత చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ పైనా ఆదిల్‌ హుస్సేన్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఎందుకు నటించానా? అని ఫీలైన చిత్రం ఒక్కటే. అదే ‘కబీర్‌ సింగ్‌’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్‌ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకే ఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో యాక్ట్‌ చేసి వచ్చేశా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా? అని ఇబ్బందికరంగా ఫీలయ్యా. స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె చూసి ఉంటే నన్ను తిట్టేది’ అని అన్నారు. సందీప్‌ వంగా స్ట్రాంగ్ కౌంటర్‌ ఆదిల్‌ హుస్సేన్‌ చేసి వ్యాఖ్యలపై డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్‌ చేస్తా’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.&nbsp;
    ఏప్రిల్ 24 , 2024
    <strong>OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!</strong>
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.&nbsp;
    మార్చి 25 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    Tollywood Controversies 2023: ఈ ఏడాది టాలీవుడ్‌ను కుదిపేసిన వివాదాల గురించి తెలుసా?
    ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా పలు వివాదాలు టాలీవుడ్‌ను షేక్‌ చేశాయి. తారలు, సినీ ప్రముఖుల మధ్య తలెత్తిన ఈ వివాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాటాల తూటాలను పేల్చేలా చేశాయి. ఇంతకీ ఆ కాంట్రవర్సీస్‌ ఏంటి? అందుకు కారణమైన నటీనటులు ఎవరు? తదితర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో 'వీరసింహారెడ్డి' చిత్ర ప్రమోషన్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారారు. ఇది అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నాగచైతన్య, అఖిల్‌ సైతం ఈ అంశంపై ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై జూ.ఎన్టీఆర్‌ స్పందించకపోవడం పైనా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఐ డోంట్‌ కేర్‌’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం అయ్యాయి. సమంత vs చిట్టిబాబు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha) మయోసిటిస్‌ (Myositis) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే 'శాకుంతలం' సినిమా విడుదల సందర్భంగా దీనిపై నిర్మాత చిట్టిబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు వచ్చిన వ్యాధి సాధారణమైనదేదని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఆమె సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించింది. కొందరికి చెవుల్లో జుట్టు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్‌ అని చిట్టిబాబును ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చింది.&nbsp; విష్ణు vs మనోజ్‌ మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఈ ఏడాది తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకు విష్ణు తన మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. అయితే రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ అని విష్ణు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలు నమ్మలేదు. కారణం విష్ణు ఇప్పటివరకూ ఎలాంటి రియాలిటీ షో చేయకపోవడమే. https://twitter.com/TeluguBitlu/status/1639265933175713800 పవన్‌ vs అంబటి పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో' (Bro). ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ ఓ పాత్ర పోషించాడు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైంది. ఆ పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి మరి పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఆ పాత్ర ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని చిత్ర నిర్మాత, నటుడు పృథ్వీ స్పష్టం చేశారు.&nbsp;&nbsp; విజయ్‌ దేవరకొండ vs అనసూయ అనసూయ భరద్వాజ్- విజయ్ దేవరకొండల వివాదం కూడా ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ‘ఖుషి’ చిత్ర పోస్టర్‌పై 'ది విజయ్ దేవరకొండ' అని రాయడాన్ని ఆమె పరోక్షంగా ఎగతాళి చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. విజయ్‌ని ఉద్దేశపూర్వకంగానే తాను టార్గెట్ చేశానని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాపై దుష్ప్రచారం చేయించాడని ఆమె ఆరోపించింది. విజయ్ ప్రమేయం లేకుండా ఇది జరగదని చెప్పింది. అందుకే తాను విజయ్‌పై విమర్శలు చేసినట్లు వివరించింది.&nbsp; దిల్‌రాజు vs సి.కళ్యాణ్‌ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు దిల్ రాజు - సి.కళ్యాణ్ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ వాళ్ళను దిల్ రాజు ఎదగనీయడం లేదని సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు దిల్ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సి కళ్యాణ్ వీడియో బైట్ సైతం విడుదల చేశారు. ఇది అప్పట్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ విజయం సాధించింది.&nbsp; బలగం స్టోరీ వివాదం ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశారు. వేణు తన స్టోరీని కాపీ చేశాడని ఆరోపించారు. అయితే వేణు ఈ కామెంట్స్ ఖండించారు. తన సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని సమాధానం ఇచ్చారు. కోర్టులో తేల్చుకోమని సవాలు సైతం విసిరారు.&nbsp; పుష్ప నటుడు అరెస్టు పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ ఫ్రెండ్‌గా నటించి పాపులర్‌ అయిన జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో అతడ్ని డిసెంబర్‌ 6న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను తన దారికి తెచ్చుకోవడం కోసం ఫొటోలతో బెదిరించినట్లు పోలీసుల వద్ద జగదీష్ అంగీకరించాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు.&nbsp;
    డిసెంబర్ 18 , 2023
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!
    Sreelakshmi Satheesh: సంచలనాలు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఈ మధ్య ఓ యువతిపై మనసు పారేసుకున్నారు. ఆమెనే శ్రీ లక్ష్మీ సతీష్. రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మీ సతీష్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది. శ్రీలక్ష్మీ అందానికి దాసోహం అయ్యానని RGV చెప్పడంతో తెలుగు రాష్ట్రాలో ఈ కేరళ అందం హాట్‌ ఆఫ్ ది టాక్‌గా మారింది. రామ్‌గోపాల్ వర్మ ఆమెను గుర్తించక ముందు జస్ట్ ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు 30 వేలు మించలేదు. ఎప్పుడైతే శ్రీలక్ష్మీ అందాన్ని ఆర్జీవీ గుర్తించాడే ఆమె ఫాలోవర్ల సంఖ్య జెట్ వేగంతో దూసుకెళ్లింది. తాజాగా రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మి సతీష్‌తో 'చీర' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈసినిమా చేసేందుకు ఒప్పుకుంది. శ్రీలక్ష్మీతో ఆర్జీవీ ఫోన్‌లో మాట్లాడటం.. ఆమె గురించి వరుస ఫోస్ట్‌లు పెట్టడంతో నెటిజన్లను పెద్ద పని కలిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తీరికలేకుండా తనకు నోటిఫికేషన్లు వస్తున్నట్లు శ్రీలక్ష్మీ సతీష్ తెలిపింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎలాగు క్రేజ్ వస్తోంది కదా అని … ఈ అందాల తెగింపు వరుస హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. నేరుగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. చాలా మంది ఆమె అందాల షేపులు, సౌందర్యం, ఒంపుసొంపుల గురించి ప్రశ్నలు సంధించారు. వాటి రహస్యం ఏమిటని బహిరంగంగానే అడిగారు. మీ కళ్లు సూదుల్లా మా గుండెల్ని గుచ్చుతున్నాయి అని ఓ నెటిజన్ అనగా… నీవు మానవ కన్యవు కావు, పైనుంచి దిగివచ్చిన దేవకన్యవు అంటూ తెగ పొగిడేశారు. నీ ఎద షేపులు, నడుమందాలు బాగున్నాయి.. ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్ అని అడిగితే… శ్రీలక్ష్మీ సతీష్ తెగ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది. అందరిలాగే నార్మల్ వాకింగ్, టైమ్‌ టూ టైమ్ డైట్‌ తీసుకుంటాను. అదే నా సౌందర్య రహస్యం అని చెప్పుకొచ్చింది. RGVపై ఒక్కమాటలో చెప్పండి అంటే… ఆయనపై కొండంత ప్రేమ దాగుందని ఆన్సర్ ఇచ్చింది… ఈ కొంటె కోనంగి.
    అక్టోబర్ 31 , 2023
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.&nbsp; ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.&nbsp; మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.&nbsp; పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.&nbsp; ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.&nbsp; మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
    తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.&nbsp;&nbsp; https://twitter.com/tarak9999/status/1691728962731589669?s=20 దేవరలో ‘భైరా’గా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా&nbsp; సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.&nbsp; ఆదిపురుష్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.&nbsp; హిందీ చిత్రాలు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.&nbsp; 2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.&nbsp; ఫ్యూచర్ విలన్ ప్రస్తుతం టాలీవుడ్‌ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 16 , 2023
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    తమిళ్ హీరోయిన్&nbsp; ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది.&nbsp; సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది&nbsp; వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది. తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది 1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది. తమిళ్‌లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది ప్రియా భవాని శంకర్ జయంరవికి జంటగా నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్‌ సరసన నటించిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా ఎస్‌ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
    జూన్ 19 , 2023
    This Week Releases: ఈ వారం(June 9) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!
    This Week Releases: ఈ వారం(June 9) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!
    గత రెండు వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారం విడుదలవుతున్న సినిమాలపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం(June 9) ప్రధానంగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో ఒక్కో చిత్రం ఒక్కో జోనర్‌లో వస్తోంది. సినిమాలతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అవేంటో చూద్దాం.&nbsp; టక్కర్ చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ నటించిన చిత్రం టక్కర్. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేసింది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ‘ఆశే లోకాన్ని నడిపిస్తుంది. మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఆశను నెరవేర్చుకోవాలంటే ధనమే ఇంధనం. డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరిదీ ఒకటే అయినప్పుడు..’ అంటూ మొదలు పెట్టాడు. మిగతా కథేంటో జూన్ 9న థియేటర్లలో చూడాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. విమానం నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఇందులో దివ్యాంగుడైన తండ్రి పాత్రను పోషించాడు. మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విమానం ఎక్కాలన్న కొడుకు కలను దివ్యాంగుడైన తండ్రి ఎలా నెరవేర్చాడన్న ఇతివృత్తంతో&nbsp; సినిమా తెరకెక్కింది. యానాల శివప్రసాద్ డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించారు. జూన్ 9న సినిమా విడుదల కానుంది.&nbsp; అన్‌స్టాపబుల్ వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించిన ఎంటర్‌టైనర్ ‘అన్‌స్టాపబుల్’. రెండు గంటల పాటు నాన్‌స్టాప్ వినోదం అందించేందుకు సినిమా రెడీగా ఉందని చిత్రబృందం వెల్లడించింది. డైమండ్ రత్నబాబు తెరకెక్కించాడు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుంది.&nbsp; పోయే ఏనుగు పోయే టాలీవుడ్‌లో ఏనుగు ప్రధాన పాత్ర పోషించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అడవి రాముడు, అడవి రాజా వంటివి ఘన విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఇదే కథతో ‘పోయే ఏనుగు పోయే’ సినిమా తెరకెక్కింది. కేఎస్ నాయక్ డైరెక్ట్ చేశాడు. పవనమ్మాల్ కేశవన్ నిర్మాత. జూన్ 9న సినిమా విడుదల కానుంది.&nbsp; ఓటీటీ విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateThe IdleWeb SeriesEnglishZee5June 5Barracuda QueensWeb SeriesEnglishNetflixJune 52018MovieMalayalam/TeluguSonyLivJune 7Avatar: The Way Of WaterMovieEnglishDisney+ HotstarJune 7OrnaldSeriesEnglishNetflixJune 7St ExSeriesEnglishDisney+ HotstarJune 7Never have I EverSeriesEnglishNetflixJune 8Tour D FranceSeriesEnglishNetflixJune 8UP 65SeriesHindiJioCinemaJune 8My FaultSeriesEnglishAmazon PrimeJune 8MenTooMovieTeluguAhaJune 9BloodhoundsSeriesKoreanNetflixJune 9Blood DaddyMovieHindiJioCinemaJune 9Empire Of LightMovieEnglishDisney+ HotstarJune 9Flamin H0tMovieEnglishDisney+ HotstarJune 10
    జూన్ 06 , 2023
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    దేశంలో ‘ఆదిపురుష్‌’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్‌ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్‌ నిజంగానే దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆదిపురుష్‌ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్‌ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్‌ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్‌ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్‌ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్‌ బడ్జెట్‌ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్‌’ నిలిచింది.&nbsp; పెట్టుబడికి ఢోకా లేదు ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్‌ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారానే బడ్జెట్‌ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్‌ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్‌ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్‌ కలెక్షన్స్‌ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్‌ టీమ్‌ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.&nbsp; దంగల్‌ VS ఆదిపురుష్‌ దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్‌ చేయాలంటే ఆదిపురుష్‌ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్‌.. చైనా, హాంకాంగ్‌, మలేషియా, UAE, బ్రిటన్‌, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్‌ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్‌ కథ యూనివర్సల్‌ సబ్జెట్‌ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్‌ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్‌ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్‌ టాక్‌ తోడైతే ఆదిపురుష్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే? ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్‌ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్‌’ జూన్‌ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, వంశీ, ప్రమోద్‌, ఓంరౌత్‌ నిర్మించారు.&nbsp;
    మే 11 , 2023
    Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
    Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఎగిరి గంతేసిన రాజమౌళి
    అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్‌కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.&nbsp; అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్‌బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు. https://twitter.com/fizzie_girl/status/1635114184982814721?s=20 https://twitter.com/HoneyRoseOffl_/status/1635120372013203456?s=20 ఎగిరి గంతేశారు.. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.&nbsp; https://twitter.com/AndhraBoxOffice/status/1635114810651328513?s=20 ‘నాటు నాటు’తోనే మొదలు.. ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్‌తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్‌గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్‌ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది. https://twitter.com/THR/status/1635094319139893248?s=20 గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో.. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్‌గా కనిపించింది.&nbsp; ‘నాటు నాటు’కు ప్రాణం..&nbsp; ‘నాటు నాటు’ సాంగ్‌ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్‌ని ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
    మార్చి 13 , 2023
    <strong>EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;</strong>
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    మే 04 , 2024
    <strong>సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5’.7” (175 cms) సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. &nbsp;హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా? &nbsp;ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?&nbsp; అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ నిక్‌ నేమ్‌ ఏంటి? స్టార్‌ బాయ్‌ సిద్ధూ సిద్ధు జొన్నలగడ్డకు తోబుట్టువులు ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు. ‌అతని పేరు చైతన్య జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా పనిచేసిన చిత్రాలు? సిద్ధు మంచి నటుడే కాకుండా రైటర్‌, సింగర్, లిరికిస్ట్‌, ఎడిటర్‌ కూడా. 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింత గాధ వినుమా', ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా పాడిన పాటలు ఏవి? గుంటూరు టాకీస్‌ ‘టైటిల్‌ ట్రాక్‌’, నరుడా ఢోనరుడా సినిమాలో 'కాసు పైసా', 'పెళ్లి బీటు' పాటలను సిద్ధు పాడాడు. అలాగే మా వింత గాధ వినుమాలో ‘షయార్‌-ఈ-ఇష్క్‌’, డీజే టిల్లులో 'నువ్వలా' సాంగ్స్ పాడి అలరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ రాసిన పాటలు ఏవి? జాణ (మా వింత గాధ వినుమ), ఓ మై లిల్లీ (టిల్లు స్క్వేర్‌) సిద్దు జొన్నలగడ్డ ఇప్పటివరకూ చేసిన ఏకైక వెబ్‌సిరీస్‌? 2018లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్స్‌' సిరీస్‌లో సిద్ధు నటించాడు. అది అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత సిద్ధు ఏ వెబ్‌సిరీస్‌లో చేయకపోవడం గమనార్హం. సిద్ధు జొన్నలగడ్డకు గర్ల్‌ ఫ్రెండ్ ఉందా? గతంలో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపాడు. అయితే అది మధ్యలోనే బ్రేకప్‌ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం సిద్దూ ఎవరితోనూ రిలేషన్‌లో లేడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫేవరేట్‌ బాలీవుడ్‌ హీరో ఎవరు? రణ్‌బీర్‌ కపూర్‌ సిద్ధు జొన్నలగడ్డ హెయిల్ కలర్‌ ఏంటి? నలుపు సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్‌ హెయిర్‌ స్టైల్‌ ఏది? డీజే టిల్లు కోసం అతడు యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. దీన్ని తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని అంటున్నారు. టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఏవి? 'జాక్‌', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్‌'.. సిద్ధు జొన్నలగడ్డ చేసిన టిల్లు పాత్ర ఎలా పుట్టింది? టిల్లు పాత్ర కల్పితం. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, చిలకలగూడ, వారాసిగూడ, సికింద్రాబాద్‌ ఏరియాల్లో ఉన్నప్పుడు తన అనుభవాలు, ఎదురైన వ్యక్తుల నుంచి ఈ డీజే టిల్లు పాత్ర పుట్టిందని సిద్ధు ఓ ఇంటర్యూలో తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ ఏవి? సిద్ధు కెరీర్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు టాకీస్‌లోని ‘నీ సొంతం’ సాంగ్‌. ఇందులో యాంకర్‌ రష్మీతో కలిసి సిద్ధు చేసే రొమాన్స్‌ అప్పట్లో కుర్రకారును ఫిదా చేశాయి. అలాగే టిల్లు స్క్వేర్‌లోనూ సిద్ధూ జొన్నలగొడ్డ రెచ్చిపోయాడు. ‘ఓ మై లిల్లీ’ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి లిప్‌ కిస్‌ సీన్లలో నటించాడు. ఆ రెండు సాంగ్స్‌పై ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?app=desktop&amp;v=mw9Jn_BsPZE&amp;vl=hi https://www.youtube.com/watch?v=QiKd8Iegu5g సిద్దు జొన్నలగడ్డ బెస్ట్‌ డైలాగ్స్‌ డీజే టిల్లులో రాధిక హత్య చేసిన వ్యక్తిని.. టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) పాతిపెట్టే క్రమంలో వచ్చే డైలాగ్స్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; రాధిక: హేయ్‌.. అక్కడ రాయి ఉంది చూస్కో టిల్లు: ఐ హావ్‌ వన్‌ సజిషన్‌ ఫర్‌ యూ.. పోయి కారులో ఏసీ ఆన్‌ చేసుకొని రిలాక్స్‌గా స్విగ్గీ ఓపెన్ చేసి ఓ ఫ్రెష్‌ వాటర్‌ మిలాన్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసుకొని రిలాక్స్‌గా నువ్వు.  “మనం చేసేదే లంగా పని పైగా కాంట్రిబ్యూషన్‌ లేదు నీది. పైగా ఉప్పర్‌ సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెబుతున్నావ్‌” “ ప్లీజ్‌ నువ్వేళ్లి రిలాక్స్‌ గా. నాకు అలవాటే ఈ శవాలు పాతిపెట్టుడు. నేను రోజూ చేసే పనే ఇది. ఫినిష్‌ చేసుకొని వస్తా.&nbsp; కొద్దిసేపటి తర్వాత.. టిల్లు : ఏం చేస్తాడు ఇతను (చనిపోయిన వ్యక్తి).. సాఫ్ట్‌వేరా? రాధిక: ఫొటోగ్రఫీ.. టూ మూవీస్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు టిల్లు: చాలా అన్‌ఫార్చ్యూనెట్లీ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువే. హీ నెవర్‌ సీ సక్సెస్‌ బీకాజ్‌ ఆఫ్‌ యూ https://youtu.be/11iKluNP0rs?si=YoSXNG65ACZWI-zt టిల్లు స్క్వేర్‌లో సిద్దు జొన్నలగడ్డ చెప్పిన టాప్‌ డైలాగ్స్‌ ఏవి? ఈ సినిమాలో టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. డైలాగ్‌ టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో...... లిల్లీ (అనుపమా పరమేశ్వరన్‌) మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.&nbsp; టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి&nbsp; https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ&nbsp; టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.&nbsp; నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 టాలీవుడ్‌ సెలబ్రిటీలతో సిద్దు జొన్నలగడ్డ దిగిన ఫొటోలు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్‌ స్టైలిష్‌ ఫొటోలు సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ  కారు కలెక్షన్స్‌సిద్ధు ప్రస్తుతం రేంజ్‌ రోవర్‌ కారు వినియోగిస్తున్నాడు. ఈ కారులోనే తన సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు.  https://www.youtube.com/watch?v=8CM-HSifLsY https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    ఏప్రిల్ 27 , 2024
    <strong>EXCLUSIVE: </strong><strong>విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!</strong>
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం యంగ్‌ సెన్సేషన్‌ మమితా బైజును హీరోయిన్‌గా లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ! ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్‌ భావించిందట. ఈ ఆఫర్‌ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్‌తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.&nbsp; ఆ హీరోయిన్ల సరసన చోటు! మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌, నివేదా థామస్‌, మాళవిక మోహనన్‌ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్‌ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్‌ ఆడియన్స్‌.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్‌ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) మమితాపై ఆసక్తికి కారణమదేనా? 'VD 12' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇటీవల వచ్చిన&nbsp; ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడం.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్‌ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 20 , 2024
    <strong>This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    <strong>Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?</strong>
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం : &nbsp;వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024

    @2021 KTree