• TFIDB EN
  • నేటి భారతం (1983)
    ATelugu

    విజయశాంతి- సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన నేటి భారతం చిత్రం 1983లో విడుదలైంది. ఈ సినిమాను టి. కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈతరం పిక్చర్స్ పతాకంపై పోకూరి వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాలో నాగభూషణం, రాజ్యలక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమా 1985లో హిందీలోకి హక్వీక్వత్, 1985లో తమిళంలోకి పుతియ తీర్పులోకి రిమేక్ చేయబడింది.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    సిబ్బంది
    టి. కృష్ణదర్శకుడు
    పి. వెంకటేశ్వరరావునిర్మాత
    కె. చక్రవర్తిసంగీతకారుడు
    కథనాలు
    <strong>రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?</strong>
    రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
    నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.&nbsp; డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్న ఎవరు? రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక మందన్న దేనికి ఫేమస్? రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రష్మిక మందన్న వయస్సు ఎంత? రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు&nbsp; రష్మిక మందన్న ముద్దు పేరు? నేషనల్ క్రష్ రష్మిక రష్మిక మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు&nbsp; రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది? విరాజ్ పేట, కర్ణాటక రష్మిక మందన్నకు వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు. రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు? బ్లాక్ రష్మిక మందన్న అభిరుచులు? ట్రావెలింగ్ రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం? చికెన్, చాక్లెట్ రష్మిక మందన్న అభిమాన నటుడు? అక్షయ్ కుమార్ రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి రష్మిక మందన్న తొలి సినిమా? కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు) రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు? గీతాగోవిందం, పుష్ప రష్మిక మందన్న ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత? రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు? సుమన్, మదన్ మందన్న రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది? రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది. రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. రష్మిక మందన్న సిస్టర్ పేరు? సిమ్రాన్ మందన్న రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా? లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rashmika_mandanna/?hl=en రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది. https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
    ఏప్రిల్ 16 , 2024
    <strong>తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్,&nbsp; తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ... ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తమన్నా భాటియా ఎవరు? తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమన్నా దేనికి ఫేమస్? తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. తమన్నా భాటియా వయస్సు ఎంత? డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 34 సంవత్సరాలు&nbsp; తమన్నా భాటియా ముద్దు పేరు? తమ్మి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది? ముంబై తమన్నా భాటియాకు వివాహం అయిందా? ఇంకా కాలేదు తమన్నా భాటియా అభిరుచులు? డ్యాన్సింగ్, కవితలు రాయడం తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం? హైదరాబాద్ బిర్యాని తమన్నా భాటియా అభిమాన నటుడు? మహేష్ బాబు, హృతిక్ రోషన్ తమన్నా భాటియా తొలి సినిమా? చాంద్ సా రోషన్ చెహరా తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ తమన్నా భాటియా ఏం చదివింది? BA చదివింది తమన్నా భాటియా పారితోషికం ఎంత? తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు? సంతోష్ భాటియా, రజని భాటియా తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా? తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/tamannaahspeaks/?hl=en తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? తమన్నా భాటియా లస్ట్‌ స్టోరీస్ 2 వెబ్‌ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది. తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సమంత, విజయ్ వర్మ తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు? తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది? తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది. https://www.youtube.com/watch?v=4pZvW7izZDw
    ఏప్రిల్ 16 , 2024
    Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
    Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
    ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. ట్రైలర్ యాంగిల్ ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు. https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc ట్రైలర్‌లో ఏముంది? &nbsp;ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు.&nbsp; లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి&nbsp; కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.&nbsp; శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను&nbsp; తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ట్రైలర్‌ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్‌ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.&nbsp; బలహీనతలు: ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.&nbsp; తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది. డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు. ఫైనల్‌గా భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
    మే 09 , 2023
    <strong>RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!</strong>
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.&nbsp; Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.&nbsp; శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.&nbsp; Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.&nbsp; అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.&nbsp; అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.&nbsp; శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.&nbsp; సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.&nbsp; ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
    పాక్‌ నటి ‘సనా జావేద్‌’ (Sana Javed)ను పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.&nbsp; భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్‌ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.&nbsp; ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ‘సనా జావేద్‌’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; ఈ క్రమంలోనే 2012లో పాక్‌ సీరియల్‌ 'మేరా పెహ్లా ప్యార్‌'తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్‌-ఈ-జాత్‌ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది. 2016లో ప్రముఖ సీరియల్‌ యాక్టర్‌ జాహిద్‌ అహ్మద్‌తో 'జరా యాద్‌ కర్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్‌ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్‌ హీరో ధనిష్‌ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్‌ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. అదే ఏడాది 'రంగ్‌రేజా' చిత్రంలో లీడ్‌ రోల్‌లో కనిపించి నటిగా పాక్‌ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.&nbsp; 2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'జీతో పాకిస్తాన్‌ లీగ్‌' అనే రియాలిటీ షోలో డ్రాగన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్‌ సింగర్‌ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.&nbsp; అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్‌ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్‌.. ఆ తర్వాత పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌కు దగ్గరైంది. గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్‌ బహిరంగంగా విషెస్‌ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.&nbsp; అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్‌, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు. ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్‌ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్‌ నటించింది. ‘సుకూన్‌’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.&nbsp; ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న 'మెహమ్మద్‌ ఏక్‌ సాజా' అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది.&nbsp;
    జనవరి 20 , 2024
    Chandrika Ravi: సిల్క్‌ స్మితగా చంద్రికా రవి.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Chandrika Ravi: సిల్క్‌ స్మితగా చంద్రికా రవి.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    అలనాటి నటి సిల్క్‌ స్మిత (Silk Smitha) జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నటి చంద్రికా రవి (Chandrika Ravi) ఈ చిత్రంలో సిల్క్‌ స్మితగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో ఆమె అచ్చం స్మితాాలానే కనిపించి అందర్ని ఆశ్చర్యపరించింది. ఇంతకి చంద్రికా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.&nbsp; చంద్రిక భారత సంతతి వ్యక్తి. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి కుటుంబంలో ఆమె జన్మించారు.&nbsp; చిన్నప్పటి నుంచే చంద్రికాకు నటనపై ఆసక్తి. అందుకే మూడేళ్ల వయసులోనే డ్యాన్సింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇక 16 ఏళ్లకే నటిగా, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించారు.&nbsp; కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరాలన్న ఉద్దేశంతో కుటుంబానికి దూరంగా లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లారు చంద్రికా. అక్కడ ఆమె పలు టీవీ షోస్‌లో నటించారు.&nbsp; 2018లో తమిళంలో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కత్తు' చిత్రం ద్వారా ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దయ్యం పాత్ర పోషించి చంద్రికా అందరి దృష్టిని ఆకర్షించింది 2019లో వచ్చిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో చంద్రికా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు'కు ఇది రీమేక్. 'వీర సింహారెడ్డి' సినిమాలో ఓ పాటలోనూ చంద్రికా తళుక్కుమంది. 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ పాట తర్వాత ఆమెకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది.&nbsp; తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని చంద్రికా ఓ ఇంటర్యూలో తెలిపింది. ఇక్కడే స్థిరపడాలని ఉందని చెప్పుకొచ్చింది.&nbsp; కెరీర్‌ కోసం కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం తనకు ఎంతో బాధగా ఉంటున్నట్లు చంద్రికా చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న సిల్క్‌ స్మిత బయోపిక్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని ఈ భామ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం తాను ఎంతగానో శ్రమిస్తున్నట్లు చెప్పింది.&nbsp; సిల్క్‌ స్మిత బయోపిక్‌ కోసం చంద్రికా చాలా రిసెర్చ్‌ చేసిందట. స్మిత నటించిన చిత్రాలు చూడటం, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలను తెలుకోవడం వంటివి చేసిందట. ఈ భామ సోషల్‌ మీడియాలోనూ ఎంతో చురుగ్గా వ్యవహిరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.&nbsp; చంద్రిక గ్లామర్‌ షోకు ఫిదా అయిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అనుసరిస్తున్నారు. ఆమె ఇన్‌స్టా ఖాతాను 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.&nbsp;
    డిసెంబర్ 05 , 2023
    S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్‌ మస్క్‌ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్‌ డైరెక్టర్‌గా రికార్డు!
    S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్‌ మస్క్‌ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్‌ డైరెక్టర్‌గా రికార్డు!
    భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్‌ దేశం అలెర్ట్‌ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం ‌అయిపోతాయి. రాజమౌళి రీసెంట్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకొని యావత్‌ దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంతటి కీర్తిని గడించిన రాజమౌళి తాజాగా మరో ‌అందలం ఎక్కారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించారు. https://twitter.com/DVVMovies/status/1646532105067966466 2023 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ ఘనత సాదించిన తొలి ఇండియన్‌ డైెరెక్టర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో జక్కన్నతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌, రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయ నిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్ చోటు సంపాదించారు. అలాగే ప్రఖ్యాత గాయని బియాన్స్‌, సిరియా స్విమ్మర్స్‌ సారా మర్దిని, యుస్రా మర్దిని, సూపర్‌ మోడల్‌ బెల్లా హడిడ్‌ చోటు దక్కించుకున్నారు. ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జక్కన్న స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు.&nbsp; View this post on Instagram A post shared by Bella ? (@bellahadid) టైమ్‌ మేగజీన్‌లో S.S. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్‌ నటి అలీయా భట్‌ ప్రొఫైల్‌ రాసింది. సినిమాపై రాజమౌళికి ఉన్న విజన్‌పై ప్రశంసలు కురిపించింది. ‘ఆడియన్స్‌ గురించి రాజమౌళికి బాగా తెలుసు. సినిమాను ఎలా తీస్తే హిట్‌ కొడుతుందో ఆయనకు కొట్టిన పిండి. కథల ఎంపికలో రాజమౌళికి ఎంతో నైపుణ్యం ఉంది. భారత్‌లోని జనాభా విభిన్న సంస్కృతులు, అభిరుచులను కలిగి ఉంటారు. వారందరినీ రాజమౌళి తన సినిమాల ద్వారా ఏకం చేశారు’ అని అలియా భట్ రాసుకొచ్చింది. అటు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ గురించి నటి దీపికా పదుకొనే కూడా ప్రొఫైల్‌ రాసింది. ప్రపంచ ప్రసిద్ధ నటుల్లో షారుక్‌ ఒకరిని పేర్కొంది. షారుక్‌.. గొప్ప మనసు, దాతృత్వం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.&nbsp; https://twitter.com/TIME/status/1646737043290980354 రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్‌బాబుతో తీయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి రోజుకో&nbsp; సంచలన విషయం వెలుగుచూస్తోంది. మహేష్‌ సినిమాను రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని రాజమౌళి ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌ రూ.1000 కోట్లు అని ఒకసారి షూటింగ్ స్టార్ట్‌ అయితే అది రూ.1500 కోట్లకు కూడా చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా మూడు పార్ట్స్‌ రిలీజ్‌ చేయడానికి రాజమౌళి కనీసం 8 ఏళ్లు తీసుకుంటాడని కూడా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ‌అయింది. అయితే ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; https://twitter.com/Harmindarboxoff/status/1643961285615427586
    ఏప్రిల్ 14 , 2023
    Poonam Pandey Dies: సంచలనాలకు కేరాఫ్‌ ‘పూనం పాండే’ ఇకలేరు.. ఆమె ఎంత ఫేమస్సో తెలుసా?
    Poonam Pandey Dies: సంచలనాలకు కేరాఫ్‌ ‘పూనం పాండే’ ఇకలేరు.. ఆమె ఎంత ఫేమస్సో తెలుసా?
    వివాదాస్పద నటి, ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే (Poonam Pandey) కన్నుమూశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.&nbsp; గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.&nbsp; 32 ఏళ్లకే ఆమె చనిపోవడంతో కుటుంబసభ్యులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సినీ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పూనమ్ పాండే తన నటన కంటే.. వివాదాస్పద ప్రకటనలతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. తన స్టైల్, బోల్డ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకునేవారు.&nbsp; 2011 వరల్డ్ కప్ (2011 World Cup) ఫైనల్‌కు ముందు పాండే (Poonam Pandey Dies) చేసిన ఒక వీడియో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.&nbsp; భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తాను బట్టలు విప్పుతానని పూనం పాండే చేసిన ప్రకటన యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ బోల్డ్‌ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం (Poonam Pandey Dies) సృష్టించాయి. ఆమె ధైర్యానికి, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇవి అద్దం పడతాయని ఆ సందర్భంలో కొందరు కామెంట్లు కూడా చేశారు.&nbsp; పూనం పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ‘గ్లాడ్రాగ్స్‌ మన్‌హంట్‌ &amp; మెగా మోడల్‌ కంటెస్టెంట్‌’ పోటీల్లో ఆమె టాప్‌-9లో నిలిచారు.&nbsp; 2013లో ‘నషా’ అనే బోల్డ్‌ చిత్రం ద్వారా పూనం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో 'లవ్‌ ఇజ్‌ పాయిజన్‌' అనే కన్నడ చిత్రంలోనూ ఆమె నటించింది..&nbsp; తెలుగులోనూ పూనం పాండే (Poonam Pandey Dies) ఓ సినిమా చేసింది. 2015లో 'మాలిని &amp; కో' అనే చిత్రంలో ఆమె నటించింది.&nbsp; ఆ తర్వాత 'ఆ గయా హీరో' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన పూనం పాండే.. చివరిగా బాలీవుడ్‌లో 'ద జర్నీ ఆఫ్‌ కర్మా' (2018) చిత్రంలో ఆమె నటించింది.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగాన రనౌత్‌ (Kangana Ranaut) హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొనడం గమనార్హం.&nbsp; 2020 కొవిడ్‌ సమయంలో పూనం పాండే తన బాయ్‌ ఫ్రెండ్‌ శ్యామ్‌ను పెళ్లి చేసుకుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది.&nbsp; అయితే 11 రోజులకే భర్తపై ముంబాయి పోలీసులు కంప్లైంట్‌ ఇచ్చి ఈ భామ వార్తల్లో నిలిచింది. భర్త తనను మానసికంగా వేధిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
    ఫిబ్రవరి 02 , 2024
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు. ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈటీవి విన్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ  వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని  ఓసారి విశ్లేషిద్దాం. చంద్రశేఖర్(శివాజీ):&nbsp; ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్‌. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.&nbsp; ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.&nbsp; https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20 రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది. https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20 ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు.&nbsp; సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి.&nbsp; ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20 ప్రశాంత్ &amp;దివ్య: పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది. https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20 https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
    జనవరి 16 , 2024
    Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
    Niharika Divorce: నిహారిక విడాకులపై నెట్టింట ఆసక్తికర చర్చ.. ఇద్దరిలో తప్పెవరిదంటే?
    వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక (Niharika) స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై తొలిసారి పెదవి విప్పారు. దీనిపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా ఘాటుగా స్పందించడంతో వీరి విడాకుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నిహారిక ఏమన్నది? దానికి ఆమె మాజీ భర్త వేసిన కౌంటర్‌ ఏంటి? నిహారిక విడాకులపై నెటిజన్లు ఏమనుకుంటున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; https://twitter.com/celebstelugu/status/1294548027156254721 ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: నిహారిక తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిహారిక విడాకులపై తన మనసులోని భావాలను పంచుకుంది. 'పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అడుగులు వేశా. కానీ అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ఆన్‌లైన్‌ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడి ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతానికి&nbsp; నా ఫోకస్‌ మొత్తం సెల్ఫ్‌కేర్‌ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నా’ అని నిహారిక చెప్పారు. https://twitter.com/i/status/1751030907237016033 నాణానికి ఒక వైపే చూస్తే ఎలా: చైతన్య నిహారిక వ్యాఖ్యలపై (#NiharikaDivorce) ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda) రియాక్ట్ అయ్యారు. హోస్ట్‌ పోస్టు చేసిన వీడియో కామెంట్‌ సెక్షన్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికీ ఉంటుంది. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్‌ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా? అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా?’ అని ఘాటుగా బదులిచ్చారు.&nbsp; నెటిజన్స్ ఏమంటున్నారంటే? నిహారిక - చైతన్య విడాకుల అంశంపై నెటిజన్లు (#NiharikaDivorce) తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నిహారికకు అండగా నిలుస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లాగే తమ సపోర్టు కూడా నిహారికకే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారికను బాధ్యురాలిగా చేస్తూ నెగిటివ్‌ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ‘పెళ్లిళ్లు ఆపై వెంటనే విడాకులు’ అనే శాపం ఉందని పోస్టులు చేస్తున్నారు. విడాకుల విషయంలో తప్పు ముమ్మాటికీ నిహారికదేనని ఏకపక్షంగా తీర్పు ఇచ్చేస్తున్నారు. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోటాపోటీగా కామెంట్లు పెడుతుండటంతో నిహారిక విడాకుల (#NiharikaDivorce) అంశం మరోమారు నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp;
    జనవరి 27 , 2024
    అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
    అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
    డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.&nbsp; ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.&nbsp; ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్‌షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్‌, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్‌షిప్ ఎందుకు లేదు? ఓటీటీలకు సెన్సార్‌షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్‌సిరీస్‌ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్‌షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది.&nbsp; సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా? రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.&nbsp; ఎందుకు వద్దంటున్నారు? ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.&nbsp; మంచి కన్నా చెడు ఎక్కువ..! ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌షిప్‌ ఉండాలనేది వారి వాదన. ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా.. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి. టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా).. క్లాస్ ఆఫ్ 2020&nbsp; విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉంటుంది.&nbsp; ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.&nbsp; మేడ్ ఇన్ హెవెన్ నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది.&nbsp; గందీబాత్ అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.&nbsp;&nbsp; మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్ &nbsp;మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.&nbsp; వర్జిన్ భాస్కర్ రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.&nbsp; ఆశ్రమ్ ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది. రాత్రి కీ యాత్రి 2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.&nbsp; మీర్జాపూర్ అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.&nbsp; రానానాయుడు&nbsp; ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది.&nbsp;వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.
    ఏప్రిల్ 08 , 2023
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    Payal Ghosh: మహమ్మద్‌ షమీకి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఓపెన్‌ ఆఫర్‌.. కానీ ఓ షరతు!
    టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Mohammed Shami)ని తాను పెళ్లిచేసుకుంటానని బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) చేసిన పోస్ట్‌ నెట్టింట్‌ వైరల్‌ అవుతోంది. షమీని తాను పెళ్లి చేసుకోవాలంటే ఓ షరతును కూడా పాయల్‌ ట్విటర్‌ వేదికగా విధించింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపరుచుకుంటే పెళ్లికి సై అంటూ వ్యాఖ్యానించింది.&nbsp; ఆ పోస్టు నెట్టింట ట్రెండ్‌ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రేమకు భాషతో పనేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.&nbsp; పాయల్‌ పెళ్లి ప్రపోజల్‌పై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలంటూ మరికొందరు నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.&nbsp; బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్‌ ఘోష్‌ తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆమె పలు టాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియన్స్‌కు దగ్గరైంది.&nbsp; తెలుగులో మంచు మనోజ్‌(Manchu Manoj) నటించిన ‘ప్రయాణం’ (Prayanam) సినిమాతో పాయల్‌&nbsp; వెండితెరకు పరిచయమైంది. అందులో హీరోయిన్‌గా చేసి అందర్ని మెప్పించింది.&nbsp; ఆ తర్వాత తారక్‌ (Jr.NTR) ‘ఊసరవెల్లి’ (Oosaravelli) సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. రామ్‌దాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.&nbsp; బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ గతంలో పాయల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్‌తో జరిగిన మూడో మీటింగ్‌లోనే అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.&nbsp; 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయల్‌ ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం షమీ వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు.&nbsp; వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ&nbsp; క్రమంలోనే పాయల్‌ ఘోష్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    నవంబర్ 10 , 2023
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా&nbsp; సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక&nbsp; (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు దర్శకుడు: అభిషేక్‌ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్ ఎడిటర్: తమ్మిరాజు నిర్మాత: అభిషేక్‌ నామా విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023 నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా అభిషేక్‌ నామా రూపొందించిన చిత్రం&nbsp; ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయికగా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో తొలిసారి గూఢచారిగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే బోస్ ఇండియాలో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ హత్య ఎందుకు జరిగింది? ఏజెంట్‌ డెవిల్‌ గతం ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రిటిష్‌ ఏజెంట్‌గా తన లుక్స్‌లో, యాక్షన్‌లో ఫ్రెష్ నెస్ చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఫైటింగ్‌ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. అటు మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపించడంతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న 1945 నాటి కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. కథ రాసుకున్న తీరు, దీనికి క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను యాడ్‌ చేసి ఒక్కో పాయింట్‌ను రివీల్‌ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నట్లు అనిపించినా సస్పెన్స్‌గా మాత్రం అనిపించదు. ద్వితీయార్థాన్ని కాస్త ఎమోషనల్‌గా నడుపుదామని డైరెక్టర్‌ యత్నించినప్పటికీ అది పెద్దగా వర్కౌట్‌ అయినట్లు కనిపించదు. కొన్ని సీన్లు లాజిక్స్‌కు దూరంగా ఉంటాయి. అయితే&nbsp; ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను డైరెక్టర్‌ చాలా బాగా తెరకెక్కించారు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ అంశాలకు వస్తే.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని చోట్ల కథకు స్పీడు బ్రేకుల్లా అడ్డుపడినట్లు అనిపిస్తాయి. అయితే హర్షవర్ధన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌ అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. సినిమా సెటప్‌, ఆర్ట్‌ వర్క్‌, కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కళ్యాణ్‌రామ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్‌ టీమ్‌ పనితనం మైనస్‌ పాయింట్స్‌ పాటలుస్క్రీన్‌ ప్లే రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 29 , 2023
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు LGM భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాణం నుంచి వస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’ (LGM). లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ అన్నది ఉపశీర్షిక. హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాని రమేష్‌ తమిళమణి తెరకెక్కించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించారు. నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి ఈ మూవీ తెలియజేస్తుందని మేకర్స్‌ తెలిపారు.&nbsp; రాజుగారి కోడిపులావ్ ‘రాజుగారి కోడిపులావ్‌’ (Rajugari kodipulao) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో&nbsp;శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రలు పోషించారు. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఒక వైవిధ్యమైన కథతో సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది.&nbsp; విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ప్రచార చిత్రాలను చూస్తే, దీన్నొక యాక్షన్‌ మూవీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మిస్టేక్‌ అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది. మెగ్‌ 2 హాలీవుడ్‌ మూవీ 'మెగ్‌ 2' (Meg 2) కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. 1999 నాటి ‘ది ట్రెంచ్‌’ అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్‌ జాసన్ స్టాథమ్ హీరోగా నటించాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4) మెగ్‌ 2 థియేటర్స్‌లోకి రానుంది.&nbsp; మరికొన్ని చిత్రాలు అభివ‌న్‌మేడిశెట్టి, స్నేహా సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ‘దిల్ సే’ కూడా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే డ‌బ్బింగ్ సినిమాలు బ్ల‌డ్ అంట్ చాకోలెట్‌, కిచ్చా సుదీప్(Kiccha Sudeep) నటించిన హెబ్బూలి కూడా ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు రంగబలి నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆగస్టు 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జులై 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సీరియస్‌గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇందులో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడి హైలెట్ అని చెప్పొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateChoonaWeb SeriesHindiNetflixAugust 3The Hunt for VeerappanDocumentary SeriesTamil / EnglishNetflixAugust 4Guardians of the Galaxy Vol. 3MovieEnglishDisney+HotsterAugust 2DayaaWeb SeriesTeluguDisney+HotsterAugust 5PareshanMovieTeluguSonyLIVAugust 4DhoomamMovieTelugu / KannadaAmazon PrimeAugust 4
    జూలై 31 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    <strong>HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!</strong>
    HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!
    నేషనల్‌ క్రష్‌ రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కన్నడలో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ (Kirik Party)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కఠినమైన పాత్రలను కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన జీవితంలో సాధించిన ఘనతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. అలాగే ఆమె లేటెస్ట్‌ చిత్రాలు ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుండి విడుదలైన రష్మిక పోస్టర్లపైనా ఓ లుక్కేద్దాం.&nbsp; ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం ఈ ఏడాది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది. దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది. తొలి ఇండియన్‌గా గుర్తింపు తెలుగు, తమిళ, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన ‘ఒనిట్సుకా టైగర్‌ ఫ్యాషన్‌’ సంస్థకు ‘బ్రాండ్‌ అడ్వకేట్‌’గా ఎంపికైంది. ఆ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్‌ భారతీయురాలు తానేనని రష్మిక స్వయంగా వెల్లడించింది.&nbsp; ఏకైక నటి రష్మికనే రష్మిక తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘సెప్టిమిస్ అవార్డ్స్’ నామినేషన్స్‌లో రష్మిక నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో మన దేశం నుంచి రష్మిక మందన్న నిలవడం విశేషం. తొలి సెలబ్రెటీగా రికార్డు ఇటీవల టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్‌ అనిమే’ (Crunchyroll Anime)&nbsp; అవార్డులకు నేషనర్‌ క్రష్‌ రష్మిక హాజరైంది. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీగా రష్మిక రికార్డు సృష్టించింది. దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు. https://twitter.com/i/status/1763610574485647680 సోషల్‌మీడియాలోనూ రికార్డు యంగ్‌ బ్యూటీ రష్మిక మందన్న ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెకు గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్‌ దక్కించుకుంది. ఆతర్వాత సమంత 33 మిలియన్లు, పూజా హెగ్డె 26.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. శ్రీవల్లి.. మెస్మరైజ్‌ లుక్‌ అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న చిత్రం 'పుష్ప 2' (Pushpa 2). ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. కాగా, ఇవాళ రష్మిక బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ అదిరిపోయే పోస్టర్‌ను లాంచ్ చేసింది. శ్రీవల్లి పాత్రకు సంబంధించిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చీరలో దట్టంగా వేసిన నగలతో చాలా అందంగా కనిపించింది.&nbsp; కాలేజీ స్టూడెంట్‌గా అదుర్స్‌! రష్మిక నటిస్తున్న మరో లేటెస్ట్‌ మూవీ 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' (The Girlfriend). నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫస్ట్‌ పోస్టర్‌ కూడా ఇవాలే విడుదలై నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో రష్మిక పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లను దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ తన ఎక్స్ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో రష్మిక చాలా క్లాస్‌ లుక్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/23_rahulr/status/1776105100903432572
    ఏప్రిల్ 05 , 2024
    <strong>OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!</strong>
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.&nbsp;
    మార్చి 25 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.&nbsp; ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024

    @2021 KTree