• TFIDB EN
  • నింద
    UATelugu
    ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. దీంతో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బాధతో కన్నుమూస్తారు. ఈ కేసులో అసలైన నేరస్థుడిని పట్టుకునేందుకు జడ్డి కొడుకు బయలు దేరతాడు. ఆరుగురు అనుమానుతుల్ని కిడ్నాప్‌ చేసి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Sep 53 months ago
    నింద సినిమా సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    YouSay Review

    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?

    వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అన...read more

    How was the movie?

    తారాగణం
    వరుణ్ సందేశ్
    తనికెళ్ల భరణి
    శ్రేయా రాణి రెడ్డి
    భద్రం
    సిద్ధార్థ్ గొల్లపూడి
    చత్రపతి శేఖర్
    అన్నీ
    సూర్య
    అరుణ్ దలై
    మైమ్ మధు
    సిబ్బంది
    రాజేష్ జగన్నాధందర్శకుడు
    రాజేష్ జగన్నాధంనిర్మాత
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్‌ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్‌ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్‌ బాయ్‌ పాత్రలే చేసిన వరుణ్‌ సందేశ్‌.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్‌ ఉద్యోగిగా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్‌ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్‌ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్‌ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ వరణ్‌ సందేశ్‌ నటననేపథ్య సంగీతంసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    జూన్ 21 , 2024
    సమంత త్వరగా కోలుకో.. మేమున్నాం అంటున్న టాలీవుడ్
    సమంత త్వరగా కోలుకో.. మేమున్నాం అంటున్న టాలీవుడ్
    ]సమంత ఈ వ్యాధి బారిన పడడానికి చై, సామ్ బ్రేకప్పే కారణమని కొందరు అంటున్నారు. సమంత కుంగుబాటుకు గురైందని.. తద్వారా ఈ వ్యాధి అటాక్ చేసినట్లు చెబుతున్నారు. నాగచైతన్యని కొందరు నిందిస్తున్నారు.విడిపోవడమే కారణమా?
    ఫిబ్రవరి 11 , 2023
    <strong>A.R. Rehman: ఏ.ఆర్‌. రెహమాన్‌తో ఎఫైర్‌ ఉందంటూ రూమర్లు.. అసిస్టెంట్‌ రియాక్షన్‌ ఇదే!&nbsp;</strong>
    A.R. Rehman: ఏ.ఆర్‌. రెహమాన్‌తో ఎఫైర్‌ ఉందంటూ రూమర్లు.. అసిస్టెంట్‌ రియాక్షన్‌ ఇదే!&nbsp;
    ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ (A.R Rahman) దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెహమాన్‌ భార్య సైరా బాను (Saira Bhanu) తరపు లాయర్‌ ప్రకటించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ విడాకుల అనౌన్స్‌మెంట్‌ వచ్చిన కొద్దిసేపటికే అతడి టీమ్‌లోని మోహిని దే (Mohini Dey) అనే మహిళ తన భర్తకు విడాకులు ప్రకటించడం చర్చనీయాంశమైంది. రెహమాన్‌ ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు ఒక్కటయ్యేందుకే జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారని నెగిటివ్‌ కామెంట్స్ వచ్చాయి. అయితే వీటిపై తాజాగా మోహిని దే స్పందించింది. రెహమాన్‌తో తనకున్న రిలేషన్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. ‘నిందలు వేయడం కరెక్ట్‌ కాదు’ ఏ.ఆర్. రెహమాన్‌తో రిలేషన్‌పై వస్తోన్న నెగిటివ్‌ కామెంట్స్‌ను బేస్‌ ప్లేయర్‌ మోహిని దే తీవ్రంగా ఖండించింది. ఆయన తనకు తండ్రితో సమానమని స్పష్టం చేసింది. తనది ఏ.ఆర్‌. రెహమాన్‌ కుమార్తెలది ఒకటే వయసని గుర్తుచేసింది. ఆయన తనను ఎప్పుడూ కూతురు లాగానే చూశారని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆయన బృందంలో పని చేస్తున్నానని రెహమాన్‌ అంటే తనకెంతో గౌరవమని పేర్కొంది. మాపై ఇలాంటి రూమర్స్​ రావడం చాలా బాధకరమని చెప్పింది. సున్నితమైన విషయాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ ప్రచారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరింది. ఈ ఏడాదే తన తండ్రిని కోల్పోయానని అప్పటి నుంచి రెహమాన్ టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ తనను సొంత వ్యక్తిలా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. https://twitter.com/GemCinemas/status/1861288712652628193 ఆడియో రిలీజ్‌ చేసిన మాజీ భార్య ఏ.ఆర్‌. రెహమాన్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన భార్య సైరా బాను సైతం స్పందించింది. ఈ మేరకు ఆఢియోను విడుదల చేసింది. యూట్యూబర్లు, తమిళ మీడియా రెహమాన్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. రెహమాన్‌ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. ఇకనైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని హితవు పలికింది. మరోవైపు రెహమాన్‌ భార్య తరపు న్యాయవాది సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. రెండు జంటల డివోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరస్పర అంగీకారంతోనే సైరా - రెహమాన్‌ విడిపోయారని స్పష్టం చేశారు. వైవాహిక బంధంలో సైరా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని చెప్పుకొచ్చారు. వారు విడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పారు.&nbsp; https://twitter.com/sunnewstamil/status/1860585811940352492 సైరా బాను గురించి తెలుసా! రెహమాన్‌ మాజీ భార్య సైరా బాను (Saira Bhanu) గుజరాజ్‌లో జన్మించింది. ఆమె ప్రముఖ మలయాళ యాక్టర్‌ రషిన్‌ రెహమాన్‌ మరదలు. ఓ దర్గాలో తొలిసారి సైరాను చూసిన రెహమాన్ తల్లి ఆమెను ఇష్టపడింది. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లితో రెహమాన్‌ సైరా ఒక్కటయ్యారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. రెహమాన్‌ - సైరా జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు ఖతీజా వివాహాన్ని 2022లో ఘనంగా నిర్వహించారు.&nbsp; ఫుల్‌ రైజింగ్‌లో రెహమాన్‌! ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌. రెహమాన్‌ (A.R. Rehman) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ ఏడాది వచ్చిన అయాలన్‌, లాల్‌ సలామ్‌ చిత్రాలకు రెహమానే సంగీతం సమకూర్చాడు. ముఖ్యంగా రాయన్‌లోని పాటలు ప్రేక్షకులను బాగా అలరించారు. రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌కు సైతం రెహమాన్‌ వర్క్‌ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేరుగా ఓ తెలుగు ఫిల్మ్‌కు రెహమాన్‌ వర్క్ చేయబోతున్నారు. దీంతో మ్యూజిక్‌ ఏ స్థాయిలో ఉంటుందోనని సంగీత ప్రియులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
    నవంబర్ 26 , 2024
    <strong>Tirumala Laddu : సినీ హీరోలకు పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!</strong>
    Tirumala Laddu : సినీ హీరోలకు పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!
    తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో&nbsp; శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి&nbsp; చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్‌.. నటుడు ప్రకాష్‌ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు.&nbsp; ప్రకాష్‌ రాజ్‌కు వార్నింగ్‌! తిరుమల లడ్డుపై ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) చేసిన వివాదస్పద ట్వీట్‌పై పవన్‌ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ప్రకాష్‌ రాజ్‌కు సంబంధం ఏంటని నిలదీశారు. తిరుపతిలో మరోమారు అపవిత్రం జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఇస్లాంని నిందించానా? లేక క్రిస్టియానిటీని తప్పుబట్టానా? అంటూ పవన్‌ అన్నారు. హిందువుల దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? అంటూ ప్రకాష్‌ రాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.&nbsp; ఏం జరిగింతో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని పవన్‌ హెచ్చరించారు.&nbsp; https://twitter.com/i/status/1838470602098913294 ‘అపహాస్యం చేస్తే ఊరుకోను’ ప్రకాష్‌ రాజ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కూడా పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. ‘లడ్డు చాలా సెన్సిటివ్’ అంటూ జోకులు వేస్తున్నారని నటుడు కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. మరోమారు అలా అనొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండని సూచించారు.&nbsp; https://twitter.com/i/status/1838465598713372823 ‘నటుల కంటే సనాతన ధర్మమే గొప్పది’ టికెట్ల కోసం ఎన్నో ప్రయాశలు పడి సినిమా చూసే అభిమానులకు సైతం పవన్‌ చురకలు అంటించారు. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. వారు కూడా తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడాలని సూచించారు. సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడతారని, సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. హీరోల కంటే పైస్థాయిలో హిందూ ధర్మాన్ని చూడాలని, ఒక హీరోగా తానే ఈ విషయాన్ని చెబుతున్నానని సినీ లవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరన్న భావన సమాజంలో ఉందని పవన్‌ అన్నారు. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోవాలని అంతే కాని మమ్మల్ని ఏమి అనొద్దని, సెక్యులరిజం గురించి సూక్తులు చెప్పొద్దని పేర్కొన్నారు. పవన్‌కు సారి చెప్పిన కార్తీ సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. తిరుమల వివాదం గురించి మాట్లాడమని కార్తీని కోరగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్‌ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/CinemaniaIndia/status/1838484585325215936 వచ్చాక మీకు ఆన్సర్‌ ఇస్తా: ప్రకాష్‌ రాజ్‌ పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ట్వీట్‌ చేశారు. 'పవన్‌ కల్యాణ్‌ గారు ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/prakashraaj/status/1838505132025168154 అంతకుముందు ఏం జరిగిందంటే? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్‌ ఇటీవల శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ఎక్స్‌ వేదికగా స్పదించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) #జస్ట్‌ ఆస్కింగ్‌’ అని పోస్ట్‌ చేశారు. దీనిపై వెంటనే నటుడు మంచు విష్ణు స్పందించారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు. మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ హెచ్చరించారు. https://twitter.com/prakashraaj/status/1837104811419775430
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>Bangalore Rave Party Case: నటి హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేల్చిన పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!&nbsp;</strong>
    Bangalore Rave Party Case: నటి హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేల్చిన పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!&nbsp;
    కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటి హేమ (Actress Hema) పేరు వినిపించడమే ఇందుకు కారణం. నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా&nbsp; అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని చెప్పుకొచ్చారు. తను డ్రగ్స్ తీసుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు షాక్‌ బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై ఏకంగా 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఇందులో నటి హేమ పేరును సైతం చేర్చడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నటి హేమ (Actress Hema) పార్టీ‌లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్‌ను ఆమె సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఛార్జ్ షీట్‌కు జత చేశారు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా ఈ ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన మరో 9 మందిపై కూడా ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా చేర్చడం గమనార్హం. అయితే హేమతో పాటు హాజరైన మరో యాక్టర్‌కు మాత్రం డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సమసిపోయిందనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp; హేమను అరెస్టు చేస్తారా? బెంగళూరు పార్టీ కేసుకు గతంలో అరెస్టు అయిన హేమకు జూన్‌లో అక్కడి స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె దగ్గర డ్రగ్స్ లభించలేదని ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను హేమకు మంజూరు చేశారు. అయితే తాజాగా చార్జ్‌షీట్‌లో దాఖలైన నేపథ్యంలో ఆమె బెయిల్‌ రద్దయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు తిరిగి హేమను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; ‘నిరూపిస్తే దేనికైనా రెడీ’ బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్‌ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. తన నుంచి ఎలాంటి బ్లడ్‌ శాంపిల్స్‌ బెంగళూరు పోలీసులు తీసుకోలేదని ఆమె తెలిపారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. మరి బెంగళూరు రేవ్ పార్టీ కేసు మున్ముందు ఎలాంటి ములుపులు తిరుగుతోందనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    సెప్టెంబర్ 12 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జూన్‌ 21న&nbsp; ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.&nbsp; బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్‌ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్‌-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు. గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం.&nbsp; ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.&nbsp;&nbsp; అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు.&nbsp; https://twitter.com/PrasadAGVR/status/1540383278166814720?s=20 ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌&nbsp; కూడా ఆసక్తికరంగా ఉంది.&nbsp; మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్‌ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
    మార్చి 29 , 2023
    <strong>Max Movie Review: కిచ్చా సుదీప్‌ మాస్‌ తాండవం.. ‘మ్యాక్స్‌’ ఎలా ఉందంటే?</strong>
    Max Movie Review: కిచ్చా సుదీప్‌ మాస్‌ తాండవం.. ‘మ్యాక్స్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు : కిచ్చా సుదీప్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంయుక్త హోర్నాడ్‌, సుక్రుతా వాగ్లే, అనిరుధ్‌ భట్‌ తదితరులు దర్శకత్వం : విజయ్‌ కార్తికేయ సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్‌ ఎడిటింగ్‌ : ఎస్‌. ఆర్‌. గణేష్‌ బాబు నిర్మాతలు : కలైపులి ఎస్‌. థను, సుదీప్‌ విడుదల తేదీ :&nbsp; డిసెంబర్‌ 27, 2024 కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’ (Max). ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రలు చేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఇందులో సుదీప్‌ పవర్‌ఫుల్‌ పోలీసు పాత్ర చేశాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Max Movie Review) కథేంటి మాక్స్‌ (సుదీప్‌ కిచ్చా) ఓ కేసు విషయంలో సస్పెండ్‌ అయ్యి (Max Movie Review In Telugu)తిరిగి డ్యూటీలో చేరేందుకు బయలు దేరతాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో ఇద్దరు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. అయితే వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషన్‌లో ఉన్న నిందితులిద్దరు అనూహ్యంగా మరణిస్తారు. వారిద్దరు ఎలా చనిపోయారు? కుమారులు చనిపోయారన్న వార్త మంత్రులకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను విడిపించేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని (సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌ ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే సీఐ మ్యాక్స్‌ (Max Movie Review) పాత్రలో కన్నడ నటుడు సుదీప్‌ జీవించేశాడు. యాక్షన్‌, మాస్‌ కలగలసిన ఈ పాత్రలో దుమ్మురేపాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపిస్తూ అలరించాడు. ఇక నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో వరలక్ష్మీ చక్కగా ఒదిగిపోయింది. కథలో ఆమెకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. ఆమెకు ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. విలన్‌ గనిగా సునీల్‌ రొటీన్‌ పాత్రలో కనిపించాడు. ప్రతినాయకుడిగా తనదైన శైలిలో ప్రభావం చూపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌ తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు విజయ్‌ కార్తికేయ.. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తీసిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ ఛాయలతో సినిమాను రూపొందించారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ ఇందులో చాలానే ఉన్నాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియన్స్‌కి అవి కూడా ఉంటాయి. మంత్రుల కొడుకులను హీరో అరెస్టు చేయడం, దీంతో పోలీసు స్టేషన్‌ చుట్టూ రౌడీలు తిరుగుతుండటం, వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడటం వంటి సీన్స్‌తో ఫస్టాప్‌ యావరేజ్‌గా సాగింది. సెకండాఫ్‌ నుంచి కథను పరుగులు పెట్టించాడు డైరెక్టర్‌. టైమ్‌ కౌంట్‌ చేస్తూ వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి. క్లైమాక్స్ కూడా మెప్పించేలా దర్శకుడు రూపొందించాడు. ఇతర చిత్రాలతో పోలికలను పక్కన పెడితే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘మ్యాక్స్‌’ నచ్చుతుంది.&nbsp; సాంకేతికంగా..&nbsp; టెక్నికల్‌ విషయాలకు వస్తే (Max Movie Review).. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అజనీష్‌ లోకనాథ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తనదైన BGMతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే నేపథ్య సంగీతం నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సుదీప్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్‌ ఫస్టాఫ్‌చూసినట్టు ఉండే సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    డిసెంబర్ 27 , 2024
    <strong>Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!</strong>
    Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో 'పుష్ప 2'ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో త్వరలో అల్లు అర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేస్తారా? అన్న అనుమానం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో మెుదలైంది.&nbsp; కేసుకు కారణాలు ఇవే! సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్‌ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. https://twitter.com/jsuryareddy/status/1864416102232805676 https://twitter.com/media5zone/status/1864748218325557304 సెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి? అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118(1)r/w3(5) BNS సెక్షన్స్‌ లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు. https://twitter.com/CNBCTV18News/status/1864572311036473766 బన్నీ అరెస్టు తప్పదా? చిక్కడపల్లి పోలీసులు అల్లుఅర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేసే అవకాశం లేకపోలేదని నేర విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్‌ రాక నేపథ్యంలోనే సంధ్యా థియేటర్‌ వద్ద భారీ రద్దీ ఏర్పడింది. అయితే తన రాకకు సంబంధించి బన్నీ ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఈ కేసు నుంచి అతడు బయటపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్‌ వెళ్లినట్లైతే అతడికి చిక్కులు తప్పవని చెబుతున్నారు. బన్నీ ముందస్తు సమాచారం ఇచ్చాడా? లేదా? అన్నదానిపై పోలీసులు కూడా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం మాత్రమే తమకు ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వలేదని డీసీపీ ప్రకటించారు. థియేటర్ నిర్వాహకులకు బన్నీ చెప్పి ఉండి, వారు మాత్రం నిర్లక్ష్యం వహించి ఉంటే మాత్రం బన్నీ సేఫయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బన్నీకి లేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. మెుత్తం మీద ఈ కేసుపై చిక్కడపల్లి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నందున అరెస్టులకు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. రూ.25 లక్షల సాయం ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్‌ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. https://twitter.com/alluarjun/status/1865063351451292062
    డిసెంబర్ 07 , 2024
    <strong>The Paradise: మెున్న ప్రభాస్‌.. నేడు నాని.. మోహన్‌ బాబుని తట్టుకోగలడా?</strong>
    The Paradise: మెున్న ప్రభాస్‌.. నేడు నాని.. మోహన్‌ బాబుని తట్టుకోగలడా?
    'దసరా' (Dasara)తో నటుడు నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తనకుంటూ ప్రత్యేక గురింపు సంపాదించాడు. సుకుమార్‌ అసిస్టెంట్‌గా 'రంగస్థలం' (Rangasthalam)కు వర్క్‌ చేసిన శ్రీకాంత్ తొలి చిత్రంతోనే స్టార్‌ డైరెక్టర్ స్టేటస్‌ సంపాదించాడు. ఇప్పుడు తన రెండో చిత్రం కూడా నానితోనే చేయబోతున్నాడు. ఈ మూవీకి 'ది ప్యారడైజ్‌' (The Paradise) అనే టైటిల్‌ కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఓ దిగ్గజ నటుడు ఈ మూవీలో భాగం కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విలన్‌గా మోహన్‌బాబు! నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రానున్న 'ది ప్యారడైజ్‌' (The Paradise) చిత్రం సికింద్రాబాద్‌ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడైతే ఆ పాత్రకు బాగా న్యాయం చేస్తాడని దర్శకుడు శ్రీకాంత్ భావించినట్లు సమాచారం. పలు పేర్లను పరిశీలించిన పిదప డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌ బాబు (Manchu Mohan Babu) పేరును ఫైనల్‌ చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మోహన్‌బాబును సంప్రదించి విలన్‌ రోల్‌ గురించి దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల వివరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ పాత్ర మోహన్‌ బాబుకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ సైతం ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీంతో నేచురల్‌ స్టార్ నాని - డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు వైరం స్క్రీన్‌పై ఏ స్థాయిలో పడుతుందో చూడాలని సినీ లవర్స్‌ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.&nbsp; డైలాగ్‌ కింగ్‌ను ఢీ కొట్టగలడా? డైలాగ్‌ కింగ్ మోహన్‌ బాబు (Mohan Babu)కి విలక్షణ నటుడిగా పేరుంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా టాలీవుడ్‌పై ఆయన చెరగని ముద్ర వేశారు. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్కువ విలన్‌ పాత్రల్లోనే మోహన్‌ బాబు కనిపించారు. అత్యంత కఠినమైన డైలాగ్‌ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పగల సామర్థ్యం మోహన్‌బాబుకు ఉంది. అటువంటి మోహన్‌ బాబును నేచురల్‌ స్టార్‌ నాని ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదు. గతంలో ప్రభాస్‌ చేసిన 'బుజ్జిగాడు' సినిమాలోనూ మోహన్‌ బాబు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేశారు. మోహన్‌ బాబు ముందు ప్రభాస్‌ కొన్ని సీన్స్‌లో తేలిపోయాడన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు నాని-మోహన్‌ బాబు కాంబో (The Paradise)ను కూడా అదే విధంగా ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంది. కెరీర్‌లోనే తొలిసారి దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్‌ చేసుకోనుండటంతో నానికి ‘ది ప్యారడైజ్‌’ చిత్రం అగ్నిపరీక్ష కానుందని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నారు.&nbsp; టైటిల్‌ లీక్‌పై అసహనం నటుడు నాని - శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో రూపొందనున్న'ది ప్యారడైజ్‌' (The Paradise) మూవీ టైటిల్‌ మేకర్స్ అనౌన్స్‌ చేయకముందే లీకయ్యింది. దీంతో వర్కింగ్‌ టైటిల్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించిన శ్రీకాంత్‌ ఓదెల చివరికీ టైటిల్‌ను అనౌన్స్‌ చేయక తప్పలేదు. ఈ లీక్ వ్యవహారంపై కొన్ని రోజుల కింద దర్శకుడు శ్రీకాంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తనకు తెలుసని అన్నారు. శ్రీకాంత్‌ టీమ్‌లోని వారే లీక్‌ చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఏ సినిమాకైనా లీకల బెడద ఉంటే వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్‌, రచయితలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. కష్టపడి పనిచేసే డిపార్ట్‌మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోవాలని సూచించారు. తన సినిమా టైటిల్‌ను లీక్‌ చేసిన వారు ఎవరో తెలుసని, తన టీమ్‌లోవారు మాత్రం కాదని స్పష్టం చేశారు.&nbsp;
    నవంబర్ 27 , 2024
    <strong>Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!</strong>
    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం. డే 1 కలెక్షన్స్ ఎంతంటే? రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఎప్పటికీ తలైవా ఒక్కరే..&nbsp; ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334 ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?</strong>
    Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?
    నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు దర్శకుడు : టీజీ జ్ఞానవేల్‌ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ : ఎస్‌. ఆర్‌. ఖదీర్‌ నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత: సుభాస్కరన్‌ అల్లిరాజా విడుదల తేదీ:&nbsp; అక్టోబర్‌ 10, 2024 సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సాధించిందా? ‘జైలర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీకి మరో సాలిడ్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజమ్స్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్‌ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్‌ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్‌ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్‌ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. ఎడిటిర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్‌ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రజనీకాంత్‌ నటనసోషల్‌ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 10 , 2024
    <strong>Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2: బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతున్న ‘మత్తు వదలరా 2’.. త్రీ డేస్‌ కలెక్షన్స్ ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. ముఖ్యంగా కమెడియన్‌ సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో తొలి రోజు సాలిడ్‌ వసూళ్లు సాధించి ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వసూళ్ల జాతర 'మత్తు వదలరా 2' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజుల్లో (శుక్ర, శని) రూ.11 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా సాలిడ్‌ వసూళ్లనే రాబట్టింది. ఫస్ట్‌ త్రీ డేస్‌లో ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ.16.2 కోట్లు కొల్లగొట్టినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 'పదహారేళ్ల వయసు.. పదహారు కోట్ల గ్రాసూ’ అంటూ ఈ పోస్టర్‌కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అటు ఓవర్సీస్‌లో 600K డాలర్లకు పైగా రాబట్టినట్లు మేకర్స్‌ మరో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. రానున్న రోజుల్లో ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్‌ మరింత పెరగడం ఖాయమని, ఈ వీకెండ్‌ నాటికిి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1835560518255255726 https://twitter.com/MythriOfficial/status/1835533814803894507 తొలి రోజు ఎంతంటే కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేశాయి.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1834823161281757529 వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-day-1-collections-mathu-vadalara-2-has-a-great-opening-what-are-the-collections.html
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?</strong>
    Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తు వదలరా 2’ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌.. వసూళ్లు ఎంతంటే?
    శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. సత్య కామెడీ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాలిడ్‌ ఓపెనింగ్స్‌ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా కమెడీ సత్య కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి&nbsp; ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. తొలి రోజున ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో రూ.2.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో రూ.2.5 కోట్లు తన ఖాతాలో వేసుకుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వీకెండ్‌లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్‌ కాకపోవడంతో 'మత్తు వదలరా 2' ఈజీగానే రూ.15 కోట్ల గ్రాస్ అందుకుంటుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.&nbsp; వారందరికీ బూస్టప్! ‘మత్తు వదలరా’ (పార్ట్‌ 1)తో హీరోగా పరిచయం అయిన కీరవాణి తనయుడు శ్రీసింహ తర్వాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల ‘మత్తు వదలరా 2’తో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. కమెడియన్‌ సత్య కూడా ఈ సినిమా ద్వారా తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమెకి కూడా ‘మత్తు వదలరా 2’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది. మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో ‘హ్యాపీ బర్త్ డే’ చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల ‘మత్తు వదలరా 2’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా ‘మత్తు వదలరా 2’ టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. కథేంటి డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు పోవడంతో బాబు మోహన్ (శ్రీసింహా), యేసు (సత్య) హైఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదిస్తూ నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ యువతి కిడ్నాప్ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన ఈ కేసును ఛేదించి ఆ మెుత్తాన్ని సొంతం చేసుకోవాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌కు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్ చేశారనే రుజువుతో కూడిన వీడియో కూడా బయటికొస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; https://telugu.yousay.tv/mathu-vadalara-2-movie-review-comedian-satyas-one-man-show-how-is-mathu-vadalara-2.html
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?</strong>
    ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?
    నటీనటులు: టొవినో థామస్‌, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి, బసిల్‌ జోసెఫ్‌, జగదీష్‌, కబీర్‌ దుహాన్‌సింగ్‌ తదితరులు దర్శకత్వం: జితిన్‌ లాల్‌ రచన: సుజిత్‌ నంబియార్‌ సంగీతం : థిబు నినన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌ మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్‌ రోల్‌లో నటించిన ‘మిన్నల్‌ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'ఎ.ఆర్‌.ఎమ్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టొవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. మల‌యాళంలో ‘అజ‌యంతే రండ‌మ్ మోష‌న‌మ్’ (ఎ.ఆర్‌.ఎమ్‌) పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగులో ‘అజ‌య‌న్ చేసిన రెండో దొంగ‌త‌నం’ అని అర్థం. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన 'ఏఆర్ఎం' మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? టొవినో థామస్‌ ఖాతాలో మరో విజయం నమోదైనట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అజ‌య్ (టొవినో థామ‌స్‌) ఊళ్లో చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ త‌ల్లి (రోహిణి)తో క‌లిసి జీవిస్తుంటాడు. తాత మ‌ణియ‌న్ (టొవినో థామ‌స్‌) ఒక‌ప్పుడు పేరు మోసిన దొంగ కావడంతో ఊళ్లో ఎక్క‌డ దొంగ‌త‌నం జ‌రిగినా అజ‌య్‌ని అనుమానిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం (విగ్రహం) బంగారం కంటే ఎంతో విలువైంది. దాన్ని కాజేయాల‌నే ల‌క్ష్యంతో సుదేవ్‌వ‌ర్మ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఆ ఊళ్లో అడుగుపెడతాడు. దీపాన్ని కొట్టేసి ఆ నింద అజ‌య్‌పై ప‌డేలా ప్లాన్‌ చేస్తాడు. అయితే ఎన్నో త‌ర‌త‌రాలుగా ఆ దీపాన్ని అజ‌య్ కుటుంబం రక్షిస్తూ వస్తుంది. మ‌రి ఈసారి అజ‌య్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్ర‌హం వెనకున్న చ‌రిత్ర ఏంటి? ఆ చ‌రిత్ర‌లో మహావీరుడు కుంజికేలు (టొవినో థామ‌స్‌) పాత్ర? ల‌క్ష్మి (కృతిశెట్టి)తో అజ‌య్ లవ్‌ ట్రాక్‌? గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే టొవినో థామ‌స్ మూడు పాత్ర‌లపై గ‌ట్టి ప్ర‌భావం చూపించారు. వీరుడైన కుంజికేలుగా అతడు ప్ర‌ద‌ర్శించిన యుద్ధ విద్య‌లు, చేసిన పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. తాత మ‌ణియ‌న్ పాత్రలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఆ రెండు పాత్ర‌ల్లో టొవినో ఎంత వీరోచితంగా నటించాడో అజ‌య్ పాత్ర‌లో అంతే సాత్వికంగా చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రతీ పాత్రలో వైవిధ్యం చూపించి నటనలో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. అటు ల‌క్ష్మి పాత్ర‌లో కృతిశెట్టి చక్కటి నటన కనబరించింది. 90ల నాటి అమ్మాయిగా అభినయం ప్రదర్శించింది. సుర‌భి ల‌క్ష్మి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపిస్తారు. రోహిణి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ పాత్ర‌లూ క‌థ‌లో కీల‌కం.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్ర‌మైనా మూడు త‌రాల‌తో ముడిప‌డిన ఈ క‌థ‌ని స్ప‌ష్టంగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. మ‌హావీరుడు కేలు క‌థ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం నుంచి ఆయన సినిమాను ప‌రుగులు పెట్టించారు. అతడి ప‌రాక్ర‌మం, రాజ్యాన్ని కాపాడినందుకు మ‌హారాజుని అడిగిన వరం, ఆ త‌ర్వాత అత‌నికి తెలిసిన నిజం త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. కేలు పాత్ర‌కు దీటుగా త‌ర్వాత త‌రానికి చెందిన మ‌ణియ‌న్ పాత్రని ఆవిష్క‌రించారు దర్శకుడు. ఈ సినిమాకి మ‌ణియ‌న్ పాత్రే హైలైట్‌. దీపం ఎక్క‌డుందో మ‌ణియ‌న్ క‌నుక్కుని, దాన్ని కాజేసే స‌న్నివేశాలు బాగుంటాయి. మ‌ణియ‌న్‌, అజ‌య‌న్‌ పాత్ర‌ల్ని ఒకే చోటకి తీసుకొచ్చిన‌ప్పుడు రేకెత్తే సంఘ‌ర్ష‌ణ హృదయాల్ని హ‌త్తుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రభావవంతంగా లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్‌, ఊహకందే కథనం, బలహీనమైన క్లైమాక్స్‌ ఈ చిత్రానికి మైనస్‌లుగా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. థిబు నేప‌థ్య సంగీతం, పాట‌లు చిత్రానికి కొత్త హంగుని చేకూర్చాయి. జోమోన్ టి.జాన్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టొవినో థామస్‌ నటనకథా నేపథ్యంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంబలహీనమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 12 , 2024
    <strong>Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్‌ ట్విస్ట్‌.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!</strong>
    Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్‌ ట్విస్ట్‌.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
    తమిళ స్టార్‌ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్‌ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్‌ మీడియాలో స్పెషల్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; ‘నా అనుమతి తీసుకోలేదు’ సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్‌ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) 'అన్యాయంగా నాపై నిందలు' జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్‌, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు. ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం.&nbsp; ఈ విషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు. https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611 తారా స్థాయికి గొడవలు! 2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్‌ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్‌ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు 1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్‌ ఫిల్మ్‌. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌ పోషించి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>Divorces in Akkineni Family: అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంది విడాకులు తీసుకున్నారా?</strong>
    Divorces in Akkineni Family: అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంది విడాకులు తీసుకున్నారా?
    టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), ప్రముఖ నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని నాగార్జున తన కుమారుడికి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే స్టార్‌ హీరోయిన్‌ సమంతను గతంలో నాగచైతన్య వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. నాగ చైతన్య తాజా ఎంగేంజ్‌మెంట్‌ నేపథ్యంలో ఈ డివోర్స్‌ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అక్కినేని కుటుంబాలకు వివాహాలు అసలు కలిసి రావడం లేదన్న చర్చ కూడా నెట్టింట వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలోని దాదాపు నాలుగు జంటలు విడాకుల తీసుకున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అక్కినేని ఫ్యామిలీ అక్కినేని నాగచైతన్య - సమంత విడాకుల వ్యవహారానికి ముందే ఆ ఫ్యామిలోలో నాలుగు జంటలు విడాకులు తీసుకున్నాయి. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరావు. అన్నపూర్ణమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో ఒకరైనా అక్కినేని నాగార్జున హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్‌ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. కూతురు సత్యవతి పిల్లలైన సుమంత్‌, సుప్రియ ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే. మరో కూతురు నాగసుశీల కుమారుడు సుశాంత్‌ కూడా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు.&nbsp; https://twitter.com/iam_strganesh/status/1821881385251991843 నాగార్జున విడాకులు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. సుమంత్‌ విడాకులు నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. సుప్రియా జీవితంలో విషాదం సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పరిచయమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సుప్రియ హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది. ఈ క్రమంలోనే ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజులు సాఫీగా సాగలేదు. కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు.&nbsp; అఖిల్‌ నిశ్చితార్థం రద్దు అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్‌-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.&nbsp; నాగ చైతన్య - సమంత డివోర్స్ 2017లో నాగ చైత‌న్య‌, స‌మంత గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. 2010లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారింది. ఏడేళ్ల లవ్‌ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అటువంటిది అనూహ్యంగా 2021లో ఈ జంట విడాకుల‌ు తీసుకొని ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సినీ లోకాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ స‌మ‌యంలో అంద‌రూ స‌మంత‌నే పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. పెళ్లి త‌ర్వాత స‌మంత బోల్డ్ రోల్స్ చేయడమే విడాకుల‌కు కార‌ణ‌మైంద‌ని కొంద‌రు నిందించారు. 
    ఆగస్టు 10 , 2024
    <strong>Bharateeyudu 2 Day 1 Collections: ‘భారతీయుడు 2’కి ఊహించని షాక్‌.. భారీగా పడిపోయిన కలెక్షన్స్‌!</strong>
    Bharateeyudu 2 Day 1 Collections: ‘భారతీయుడు 2’కి ఊహించని షాక్‌.. భారీగా పడిపోయిన కలెక్షన్స్‌!
    కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వచ్చిన 'భారతీయుడు' చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిత్రం శుక్రవారం (జులై 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందులేక తొలి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది.  'భారతీయుడు 2' తమను తీవ్రంగా నిరాశ పరిచిందని కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయుడు తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? మిశ్రమ స్పందన ఈ సినిమా వసూళ్లపై చూపిన ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం. డే1 కలెక్షన్స్ ఎంతంటే? ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్‌ రివ్యూస్‌ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించాయి. ఒక్క త‌మిళ వెర్షన్‌లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు క‌లెక్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఈ మూవీ పూర్తిగా విఫ‌ల‌మైందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయని విశ్లేషించాయి. అటు తెలుగు ఆడియన్స్‌ సైతం ఈ మూవీపై పెద్దగా ఆసక్తి కనబరచలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.  కలెక్షన్స్‌లో భారీ కోత! కమల్‌ హాసన్‌ గత చిత్రం 'విక్రమ్‌' (Vikram)తో పోలిస్తే 'భారతీయుడు 2' డే 1 కలెక్షన్స్‌ భారీగా పడిపోయాయి. విక్రమ్‌ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కమల్‌ హాసన్‌ విలన్‌గా చేసిన 'కల్కి 2898 ఏడీ' తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్‌ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్‌ శంకర్‌ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన 'భారతీయుడు 2' (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.  అందుకే వసూళ్లు తగ్గాయా? ‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్‌ డేటెడ్‌ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్‌లో సేనాపతి (కమల్‌ హాసన్‌) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  కథేంటి చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ. https://telugu.yousay.tv/bharateeyudu-2-review-bharateeyudu-2-is-a-major-disappointment-in-those-aspects-how-is-the-movie.html
    జూలై 13 , 2024
    <strong>Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!</strong>
    Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!
    నటీనటులు : కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవాని, వివేక్‌ డైరెక్టర్‌ : శంకర్ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌ : రవి వర్మన్‌ ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాత : అల్లిరాజా సుభస్కరన్‌ విడుదల తేదీ: 12-07-2024 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండితనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? భారతీయుడిగా మరోమారు కమల్‌ ఆకట్టుకున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ. ఎవరెలా చేశారంటే 'భారతీయుడు 2'లో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం చూపించాడు. సేనాపతి పాత్రలో మరోమారు తన మార్క్‌ నటన కనబరిచారు. తన నటనతో సినిమా మెుత్తాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. నటుడు సిద్ధార్థ్‌ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె. సూర్య వంటి నటులు కూడా తమ నటనతో సినిమాకు ఎస్సెట్‌గా మారారు. అయితే వారి పాత్రలు బలహీనంగా ఉండటం మూవీకి మైనస్‌గా మారింది. ఇతర నటీనటులు ప్రదర్శన పర్వాలేదు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ శంకర్‌ భారతీయుడు కథనే మళ్లీ రిపీట్‌ చేసినట్లు అనిపించింది. ఔట్‌ డేటెడ్‌ కథను నేటి తరానికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. భారతీయుడు ఎలా చంపుతాడో అనేది ఈ తరానికి చూపించడానికే సీక్వెల్‌ తీసినట్లు ఉంది. డైరెక్షన్‌లో శంకర్ మార్క్‌ కనిపించదు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. కమల్‌ హాసన్‌ ఇంట్రడక్షన్‌ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. కొన్ని సన్నివేశాలను బాగానే తెరకెక్కించినా మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకుల ముందు తేలిపోయాయి. అయితే కమల్ హాసన్‌ ఛేజింగ్ సీక్వెన్స్‌, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్‌ మెప్పిస్తాయి. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చుంది. కానీ, భారతీయుడులో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం, పాటలు ఆ స్థాయిలో వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. ఓవరాల్‌గా ఈ సీక్వెల్‌ సేనాపతి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంలో పూర్తిగా వెనకబడ్డాడని చెప్పవచ్చు. సాంకేతిక అంశాలు టెక్నికల్‌ విషయాలకు వస్తే.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొన్ని సీన్స్‌ను BGM మరి డామినేట్‌ చేసినట్లు అనిపించింది. సినిమాటోగ్రాఫర్‌ పనితనం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కమల్‌ హాసన్‌ నటనసందేశంయాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఔట్‌డేటెడ్‌ స్టోరీస్క్రీన్‌ప్లేభావోద్వేగాలు పండకపోవడంసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5   నెటిజన్లు ఏమంటున్నారంటే? (Public Talk) ఎక్స్‌ (ట్విటర్‌)లో సైతం 'భారతీయుడు 2' మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది మాత్రమే కామెంట్‌ చేస్తుంటే చాలా మంది ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెగిటివ్‌ టాక్ 'భారతీయుడు 2' చిత్రాన్ని చుట్టేసింది. కొందరు ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించాడా? అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; భారతీయుడు 2 సినిమా డిజాస్టర్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. బోరింగ్‌, ఔట్‌ డేటెడ్‌ స్టోరీ, సాగదీశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548 'భారతీయుడు 2' స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ది బోరింగా అనిపించిందని మరో నెటిజన్ అన్నాడు. ఫస్టాఫ్‌లో గ్రిప్పింగ్‌గా, ఎగ్జైట్‌మెంట్‌ సీక్వెన్స్‌ ఏమి లేవని అన్నాడు.&nbsp; https://twitter.com/newMovieBuff007/status/1811561032780820788 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్‌ బాగోలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ వర్కౌట్‌ కాలేదు. ఇండియన్‌ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్‌ చేశారు. https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548 'ఇండియన్‌ 2' బిలో యావరేజ్‌ చిత్రమని విజయ్‌ అనే నెటిజన్‌ పోస్టు పెట్టాడు. క్లైమాక్స్‌లో ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్‌ ప్లే చేశారని అది కాస్త ఆసక్తిగా అనిపించిందని చెప్పాడు. 'ఇండియన్‌ 3' ఆశలు రేపుతోందని చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/vijay827482/status/1811579025699066091 మరో నెటిజన్‌ 'భారతీయుడు 2' సినిమాపై ప్రశంసలు కురిపించాడు. శంకర్‌ డైరెక్షన్‌ మరో లెవల్‌లో ఉందంటూ పోస్టు పెట్టాడు.. కమల్‌ హాసన్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయంటూ మూవీకి 4 స్టార్‌ రేటింగ్ ఇచ్చాడు. https://twitter.com/FMovie82325/status/1811559067925524625
    జూలై 12 , 2024
    <strong>Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;</strong>
    Samantha: సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సామ్!&nbsp;
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో సమంత (Samantha Ruth Prabhu) ఒకరు. అనారోగ్యం రిత్యా కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. తన గ్లామర్‌ పోస్టులతో తరచూ వారికి హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజర్‌ వాడకంపై ఆమె పెట్టిన పోస్టు.. వివాదానికి దారి తీసింది. దీనిపై వైద్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ డాక్టర్‌ ఏకంగా సమంతను జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమైంది. దీనికి సమంత కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్‌ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఇంతకీ నెట్టింట రచ్చరేపుతున్న ఈ వివాదానికి గల కారణాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; సమంత హెల్త్‌టిప్‌ ఇదే! ప్రముఖ నటి సమంత.. మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. తాను తీసుకుంటున్న వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నెబులైజేషన్‌ గురించి ఆమె పోస్టు పెట్టారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. ‘హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ట్ వాటర్ రెండూ కలిపి నెబులైజర్ చేయండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి’ అంటూ సమంత తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని తనకు సూచించిన మిత్ర బసు చిల్లర్ అనే వైద్యురాలిని కూడా పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టు నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; సమంతను జైల్లో పెట్టాలి: డాక్టర్‌ సమంత పెట్టిన పోస్టు వైరల్‌ కావడంతో.. ఇది చూసిన పలువురు డాక్టర్స్ మండిపడ్డారు. సమంతపై సోషల్‌ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తప్పు అని సూచించారు. ముఖ్యంగా డాక్టర్ అబీ ఫిలిప్స్ అనే డాక్టర్‌ ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించారు.&nbsp;‘TheLiverDoc’ పేరుతో ఉన్న తన ఎక్స్‌ ఖాతాలో సమంతపై విరుచుకుపడ్డారు. సమంత చెప్పినట్లు చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమంతకు హెల్త్‌ గురించి, సైన్స్‌ గురించి తెలియదని నిరక్షరాస్యురాలంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకు ఆమెను జైలులో పెట్టాలని లేదా జరిమానా విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/theliverdr/status/1808804909783159003 సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌ తనను జైల్లో పెట్టాలంటూ డాక్టర్‌ ఇచ్చిన వార్నింగ్‌పై నటి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఒక ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. 5 ఏళ్లుగా డీఆర్డీవోకు సేవలందించిన, ఎండీ అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సను సూచించారు. ఒక పెద్దమనిషి నా పోస్టును, నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని సామ్‌ రాసుకొచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
    జూలై 05 , 2024

    @2021 KTree