• TFIDB EN
  • OMG (ఓ మాంచి ఘోస్ట్)
    UATelugu
    చైతన్య అతని స్నేహితులకు డబ్బు అవసరం పడుతుంది. దీంతో ఎమ్మెల్యే కూతురు కీర్తిని కిడ్నాప్‌ చేస్తారు. ఓ బంగ్లాలో బందిస్తారు. అయితే అందులో ఓ దెయ్యం ఉంటుంది. దానికి కిడ్నాపర్లు అంటే అసలు పడదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బంగ్లా నుంచి వారు బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెన్నెల కిషోర్
    నందితా శ్వేత
    షకలక శంకర్
    నవీన్ నేని
    నాగినీడు
    సిబ్బంది
    శంకర్ మార్తాండ్దర్శకుడు
    అబినికా ఇనాబతునినిర్మాత
    కథనాలు
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు జైలర్‌ రజనీకాంత్ కాంత్‌ లేటెస్ట్‌ మూవీ జైలర్‌ ఈ వారమే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న (గురువారం) ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో తమన్నా కథానాయికగా చేసింది. మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. జైలర్‌లో రజనీకాంత్‌ స్టైల్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. భోళాశంకర్‌  వాల్తేరు వీరయ్యగా ఈ ఏడాది వినోదాలు పంచిన మెగాస్టార్‌ చిరంజీవి.. ‘భోళా శంకర్‌’గా మరోమారు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ తమన్నానే హీరోయిన్‌గా చేసింది. కీర్తి సురేష్‌ చిరు చెల్లెలిగా నటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు.  ఓ మై గాడ్‌ అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉస్తాద్‌ శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. బలగం ఫేమ్‌ కావ్యా కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌గా చేసింది. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న (శనివారం) ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. జోసెఫ్‌ డిసౌజా అనే పైలట్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ నటించారు.  గదర్‌ 2 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌ హీరోగా చేసిన ‘గదర్‌ 2’ చిత్రం కూడా ఈ వారమే రిలీజ్‌ కానుంది. ఆగస్టు 11 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సన్నీ దేవోల్‌.. తారా సింగ్‌ పాత్రలో నటించారు. సకీనాగా అమీషా పటేల్‌ నటించింది. ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహించారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్‌ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్‌ శర్మ, కమల్‌ ముకుట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! హిడింబ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా చేసిన రీసెంట్‌ చిత్రం హిడింబ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వేదికగా ఆగస్టు 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత నటించింది. TitleCategoryLanguagePlatformRelease DateGabby's DollhouseWeb SeriesEnglishNetflixAugust 7ZombieverseWeb SeriesEnglishNetflixAugust 8Heart of StoneMovieHindiNetflixAugust 11In another world with my smartphoneMovieEnglishNetflixAugust 11Pending TrainMovieEnglishNetflixAugust 11The kashmir files unreportedDocument SeriesHindiZee 5August 11Abar ProloySeriesBengaliZee 5August 11The Jengaburu CurseSeriesHindiSonyLIVAugust 9Por ThozhilSeriesTelugu/TamilSonyLIVAugust 11Made in HeavenSeriesEnglishAmazon primeAugust 10
    ఆగస్టు 07 , 2023
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.  హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.  జూన్‌ 21న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.  బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి  పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.  3. తమ్ముడు  1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.  4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.  5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.  6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో  అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.  9. వకీల్‌సాబ్‌  వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి  లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. 
    జూలై 31 , 2023
    Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
    Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్‌ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
    నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు రచన, దర్శకత్వం: అమిత్ రాయ్ విడుదల తేదీ: ఆగస్టు 11 2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటంటే? కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్‌లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20 ఎలా ఉంది?  ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎవరెలా చేశారు? ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది. https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20   టెక్నికల్‌గా సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం. పాజిటివ్ పాయింట్స్ నటీనటులు కథ కామెడీ  రచన నెగెటివ్ పాయింట్స్ కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్ కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 3.25/5 https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
    ఆగస్టు 11 , 2023
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
    బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.  బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ తుఫాన్‌! డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్‌ మూవీ ‘యానిమల్‌’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్‌ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. అదరగొట్టిన ‘12th ఫెయిల్‌’ ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్‌’ (12th Fail) చిత్రం కూడా యానిమల్‌ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్‌ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్‌ యాక్టర్స్‌గా భార్య భర్తలు ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగంలో విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌) రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.  69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌ ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌) ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌  ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌) ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2) ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
    జనవరి 29 , 2024

    @2021 KTree