రివ్యూస్
How was the movie?
తారాగణం
రామ్ చరణ్
రామ్జెనీలియా డిసౌజా
జానుషాజన్ పదంసీ
రూబాప్రభు
జాను తండ్రిప్రకాష్ రాజ్
అభిషేక్ వర్మబ్రహ్మానందం
కుక్కపిల్లశ్రీనివాస్ అవసరాల
పుష్కరాలుమంజుల ఘట్టమనేని
రామ్ సోదరిపవిత్ర లోకేష్
జాను తల్లివెన్నెల కిషోర్
రామ్ స్నేహితుడుసంచితా శెట్టి
జాను స్నేహితుడుకల్పికా గణేష్
జాను స్నేహితుడుసమీర్
జాను మామయ్యఫణికాంత్ రాంపల్లిమహేష్
సిద్ధు జొన్నలగడ్డ
సంతోష్ఇంద్రనీల్ వర్మరాజేష్
నైరా బెనర్జీ
రామ్ మాజీ ప్రియురాలు (అతిథి పాత్ర)పూజా ఉమాశంకర్
రామ్ చిన్ననాటి ఉపాధ్యాయుడు (అతిథి పాత్ర)నాగేంద్ర బాబు
రామ్ పొరుగుసిబ్బంది
భాస్కర్
దర్శకుడునాగేంద్ర బాబు
నిర్మాతహారిస్ జయరాజ్
సంగీతకారుడుమార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ర్కథనాలు
Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా
బాలీవుడ్ బ్యూటీ నికితా దత్తా.. తన అంద చందాలతో మతి పోగొడుతోంది.
ఆరెంజ్ కలర్ బికినీలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి కుర్రకారును ఫిదా చేసింది.
ముఖ్యంగా బీచ్‌లో ఈ అమ్మడి సొగసులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
మరో పోస్టులో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. రెడ్ కలర్ బ్రాలో ఎద అందాలు ఆరబోసింది.
నికితా దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. కెరీర్ ప్రారంభంలో ఆమె మోడల్‌గా పని చేసింది.
‘ఫెమినా మిస్ ఇండియా-2012’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ చిత్రం 'లేఖర్ హమ్ దివానా' (2014) సినిమాతో నికితా తెరంగేట్రం చేసింది.
2015లో డ్రీమ్ గార్ల్ అనే సిరీయల్ ద్వారా బుల్లితెరలోనూ ఈ అమ్మడు అడుగుపెట్టింది.
2018లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'తో నికితా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత కబీర్ సింగ్ (2019)లో జియా పాత్రలో అందంగా కనిపించి మెప్పించింది.
మస్కా, ది బిగ్ బుల్, డైబ్బుక్, రాకెట్ గ్యాంగ్, దంగే చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది.
‘ఆఫత్’, ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ సిరీస్‌లలో నికితా దత్తా కీలక పాత్ర పోషించింది.
నికితా ప్రస్తుతం ‘జ్యూయల్ తీఫ్’, ‘ఘరాట్ గణపతి’, ‘గుల్ గుల్ బకావాలి’ చిత్రాల్లో నటిస్తోంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఏప్రిల్ 26 , 2024
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
Hansika Motwani: బాత్ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!
అందాల భామ హన్సికా మోత్వానీ గత కొంతకాలంగా తన బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. అయితే తాజాగా తన రూట్ మార్చిన ఈ అమ్మడు చీరలో తళుక్కుమని మెరిసి ఆశ్చర్య పరిచింది.
View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika)
లైట్ ఆరెంజ్ కలర్‌లో శారీ కనిపించిన హన్సికా ట్రెడిషనల్ లుక్‌లోనూ తాను మెప్పించగలనని నిరూపించుకుంది.
గత కొన్ని రోజులుగా హన్సికను బోల్డ్ లుక్స్‌లో చూస్తు వచ్చిన ఫ్యాన్స్ ఇవాళ చీరలో చూసి ఆశ్యర్యపోతున్నారు. చీరలో అద్భుతంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
శారీ ఫొటోలకు ముందు బాత్ టబ్‌లో ఉన్న ఫొటోలను హన్సిక పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని మైమరిచిపోతున్నారు.
సముద్రంలో బోటుపై ప్రయాణిస్తూ హన్సికా పెట్టిన బోల్డ్ ఫొటోలు అప్పట్లో చాలా బాగా వైరల్ మారాయి. నీలి సంద్రంపై హన్సికా తెల్లటి అందాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
2007లో దేశముదురు సినిమా ద్వారా హన్సికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వైశాలి పాత్రలో ఈ అమ్మడు చాలా గొప్పగా నటించింది.
దేశముదురు చిత్రం హిట్ కావడంతో హన్సికకు అవకాశాలు క్యూ కట్టాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కల్యాణం, కందిరీగా, ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇటీవల హన్సికాకు పెళ్లి కాగా సినిమాలకు గుడ్‌బై చెబుతుందేమోనని అంతా భావించారు. అయితే ఆ అంచనాలను తలకిందు చేస్తూ వరుస షూటింగ్‌లతో హన్సికా బిజీ బిజీగా గడుపుతున్నారు.
సోషల్ మీడియాలోనూ హన్సికా చురుగ్గా ఉంటోంది. మత్తెక్కించే ఫోజులతో ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది.
ఏప్రిల్ 06 , 2023
రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
టాలివుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలయ్య, మహేశ్ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ కూడా ఇటీవల విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
దేశముదురు
అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ మేనియాను క్యాష్ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఆది
RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్ ఎన్టీఆర్ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్ నేపథ్యంలో వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
సింహాద్రి
రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.
మోసగాళ్లకు మోసగాడు
భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఈ నగరానికి ఏమైంది
తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్ ఉండదు. ఫ్రెష్ కాన్సెప్ట్, మ్యూజిక్, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో నిత్యం తరుణ్ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే రీ రిలీజ్ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రజినీకాంత్ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్ కెరీర్ ముగిసిపోయిందని మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో ఫ్లాప్ అయినా టీవీలో సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.
మీరు ఏ సినిమా మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
ఏప్రిల్ 01 , 2023
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్‌మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
HBD Ram Charan: ‘రామ్‌చరణ్’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ (Ram Charan).. టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్ (Allu Sirish) డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.
ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్ కోచింగ్ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం.
రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.
చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్’ ఇచ్చారు చిరు.
చరణ్ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్ స్టూడెంట్. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.
రామ్‌చరణ్ తన బాల్యం నుంచి టీనేజ్ వరకూ తరచూ స్కూల్స్ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.
నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.
సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్ బైక్ రైడింగ్ చేస్తానంటే చిరు ఎంకరేజ్ చేసేవారు కాదట.
రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.
రామ్‌చరణ్ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.
అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.
తన సినిమాలు చూశాక మెగాస్టార్ చిరంజీవి చేసే కామెంట్స్ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్ తెలిపాడు. డ్యాన్స్ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.
ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్‌చరణ్.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 27 , 2024
SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్లోబల్ స్థాయి
అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి.
మహేష్‌కు లాభమా నష్టమా?
ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు? ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది.
ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
మహేష్ బాబు కూడా అదే పరిస్థితా?
దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వరల్డ్ వైడ్ బజ్
మరోవైపు మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
ఫిబ్రవరి 14 , 2024
SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.
‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీం సభ్యుల ప్రచారం..
సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.
కెమెరా..
సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.
సరికొత్తగా ప్రభాస్..
సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సెన్సేషనల్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.
https://twitter.com/Attitudist/status/1671201399584227328
మ్యూజిక్
కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ
https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
జూన్ 21 , 2023
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ ఆసిస్టెంట్ డైరెక్టర్లు:
శ్రీకాంత్ ఓదెల(srikanth odela)
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు. శ్రీకాంత్ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్ చెప్పారంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అర్థమవుతోంది.
https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html
https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20
బుచ్చిబాబు(Buchi Babu Sana)
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తారని స్వయంగా చరణ్ చెప్పే స్థాయికి ఎదిగాడు.
పల్నాటి సూర్యప్రతాప్(Palnati surya pratap)
సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంటగా ‘18 పేజెస్’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.
రాజమౌళి ఆసిస్టెంట్ డైరెక్టర్లు: (Rajamouli assistant directors)
G.R కృష్ణ( GR KRISHNA )
టాలీవుడ్ డైరెక్టర్ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు.
కరుణ కుమార్ ( KARUNA KUMAR)
మరో టాలీవుడ్ డైరెక్టర్ కరుణ కుమార్ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.
అశ్విన్ గంగరాజు (ASHWIN GANGA RAJU)
డైరెక్టర్ అశ్విన్ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..!
రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది.
రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఏప్రిల్ 06 , 2023
Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
[toc]
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్‌చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
అక్టోబర్ 22 , 2024
HBD Chiranjeevi: మెగాస్టార్ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు
విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
రోల్స్ రాయిస్ ఫాంటమ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్
చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.
రేంజ్ రోవర్ వోగ్
ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.
2. విలాసవంతమైన ఇల్లు
హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన & విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు.
3. ప్రైవేటు జెట్
చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
4. రియల్ ఎస్టేట్
మెగాస్టార్ చిరంజీవి రియల్ ఎస్టేట్ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
5. అంజనా ప్రొడక్షన్స్
1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్’ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్ నుంచే వచ్చాయి.
6. కేరళ బ్లాస్టర్స్
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్ టెండూల్కర్ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ సైతం ఈ ఫుట్‌బాల్ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.
7. చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్
1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను మెగాస్టార్ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్ & ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
8. చిరంజీవి నెట్‌వర్త్
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.
ఆగస్టు 22 , 2023
Masthu Shades Unnai Ra Review: హీరోగానూ మేజిక్ చేసిన అభినవ్.. ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: అభినవ్ గోమటం, వైశాలి, రాజ్ మెుయిన్, అలీ రెజా
దర్శకత్వం: తిరుపతి రావు
సంగీతం: సంజీవ్ థామస్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభూ
నిర్మాత: ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల
విడుదల తేదీ: 23-02-2023
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnay Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా అభినవ్ గోమటం మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
మనోహర్ (అభినవ్ గోమఠం) (Masthu Shades Unnai Ra Review In Telugu) ఓ సాధారణ పెయింటర్. లైఫ్‌లో సెటిల్ కాలేదన్న కారణంతో అతడ్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పీటలపై నుండి లేచిపోతుంది. దీంతో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి (వైశాలి రాజ్) పరిచయం అవుతుంది. చేతిలో రూపాయి లేని మనోహర్ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) నుండి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందిన అభినవ్ గోమఠం.. ఈ సినిమాలో కథానాయకుడిగానూ తన మార్క్ ఏంటో చూపించాడు. న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పలికించి సంపూర్ణ నటుడిగా నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు. ఆమెది నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాదు. ఇక బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు తిరుపతి రావు మంచి కథను ఎంచుకున్నారని చెప్పవచ్చు. స్టోరీపై బాగా హోమ్‌వర్క్ చేయడం ప్లస్ అయ్యింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథకు సంబంధం లేని సీన్లతో తొలి భాగాన్ని చాలా వరకూ నడిపించాడు. స్టోరీలోని మెయిన్ పాయింట్‌లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్. సెకండాఫ్ నుంచి అసలు కథ మెుదలవుతుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలోని మెయిన్ సీక్వెన్స్‌లను దర్శకుడు చాలా బాగా మేనేజ్ చేశారు. మంచి ఫన్ కూడా జనరేట్ అయ్యింది. సెకండ్ పార్ట్ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో సినిమా కొంతమేర గట్టెక్కగల్గింది.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Masthu Shades Unnai Ra Review In Telugu)... ఈ విభాగం పనితీరు చాలా పూర్‌గా ఉంది. సంజీవ్ థామస్.. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సిద్ధార్థ స్వయంభూ కెమెరా పనితనం కూడా నామ మాత్రంగానే అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే మంచి ఔట్‌పుట్ వచ్చేది.
ప్లస్ పాయింట్స్
అభినవ్ నటనకామెడీద్వితియార్థం
మైనస్ పాయింట్స్
తొలి భాగంఅవసరం లేని సీన్లుటెక్నికల్ విభాగం
Telugu.yousay.tv Rating : 2.5/5
ఫిబ్రవరి 23 , 2024
Nayanthara: భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్!
తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.
ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్ కపుల్ అని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్ శివన్ తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.
ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది. 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్ జంట తల్లిదండ్రులయ్యారు. ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్.శివన్, ఉలగ్ దైవాగ్ ఎన్. శివన్ అని పేర్లు పెట్టారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.
నయనతార ప్రస్తుతం టెస్ట్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తన్ని ఒరువన్ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది.
ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి.
తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది.
ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ.
ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ వచ్చాడు. అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 18 , 2024
Deepika Padukone: రణ్‌వీర్ - దీపికా విడాకులు తీసుకోబోతున్నారా?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. నటుడు రణ్‌వీర్.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడంతో సంచలనంగా మారింది. త్వరలో వీరిద్దరు వీడిపోతున్నారా? అన్న ఊహాగానాలకు ఇది తెరలేపింది.
తాజాగా రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను (Ranveer Singh Removes Wedding Pictures) పరిశీలించిన కొందరు ఫ్యాన్స్.. అందులో పెళ్లి ఫొటోలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ మేటర్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
చిత్ర పరిశ్రమలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధమవుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ వర్గాలు, జాతీయా మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ, రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఫొటోలు (Ranveer and Deepika's divorce Rumours) మాత్రమే మిస్ అయ్యాయి. దీపికతో మాములుగా దిగిన ఫొటోలు అంతే ఉన్నాయి. దీంతో రణ్‌వీర్ కావాలనే ఈ ఫొటోలను డిలీట్ చేసి తమ మధ్య ఉన్న మనస్పర్థలను బహిర్గతం చేశారని రూమర్లు మెుదలయ్యాయి.
అయితే బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. రణ్‌వీర్ ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆర్చీవ్ చేశారట. ఆ కారణంగా తన అకౌంట్‌లో 2023కి ముందు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయ్యి కనబడటం లేదట.
ప్రస్తుతం ఈ జంట తమ తమ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక దీపిక ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. వీరి జోడీని తెరపై చూసేందుకు ఇరువురు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
2013లో రిలీజైన రామ్‌లీలా సినిమాలో దీపికా - రణ్‌వీర్ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించారు.
దాదాపు ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018లో దీపికా - రణ్‌వీర్ సింగ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది హాజరయ్యారు.
అయితే రణ్‌వీర్ - దీపికా (Deepika & Ranveer's Relationship) విడాకులపై రూమర్లు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు వీరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా చేసిన వ్యాఖ్యలు రణ్‌వీర్‌కు కోపం తెప్పించాయి. ఇక వారు విడిపోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ, అది తప్పను ఈ జంట నిరూపించింది.
మే 08 , 2024
This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ రాయ్
బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్ సరోజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య గమనిక
విరాన్ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్ వేణు మురళీధర్ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సైరెన్’ (Siren). ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.
ఆర్టికల్ 370
అందాల తార యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్టికల్ 370’ (article 370). ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
ఫిబ్రవరి 19 , 2024
జూ.ఎన్టీఆర్ కోసమే వార్ 2 క్యారెక్టర్ డిజైన్…RRR రికార్డులు బద్దలు కావాల్సిందే!
వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.
వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు రిజెక్ట్ చేసిన తర్వాతే వార్-2 ఎన్టీఆర్ వద్దకు చేరినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. వారు కాదనుకున్న కథ మా అన్న దగ్గరకు వచ్చిందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వార్-2 నిర్మాత ఇచ్చి క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. తమ హీరో వార్-2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ మూవీలో చేయనుండటం, అది కూడా దిగ్గజ నటుడు హృతిక్‌తో తెరను పంచుకోనుండటం ఎన్టీఆర్‌కు కలిసిరానుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రిలీజైన ‘వార్’ చిత్రం సూపర్ హిట్‌గాా నిలిచింది. తొలి పార్ట్‌లో హృతిక్‌తో పాటు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. డ్యాన్స్, ఫైట్లతో అదరగొట్టాడు. మరీ వార్-2లో ఎన్టీఆర్ ఎలా చేస్తాడన్న అంశం ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తారక్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే ఓ రెంజ్‌లో ఉంటుందని ఇప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్, ఎన్టీఆర్ నటన చూస్తే థియేటర్లలో ఎవరూ కుదురుగా కూర్చోలేరని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్స్ కూడా చెరిగిపోతాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
వార్-2లో ఎన్టీఆర్ పారితోషికానికి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రూ.100 కోట్లు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రూ.100 కోట్లు తీసుకుంటున్న టాప్ 5 సౌత్ స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ నిలవనున్నాడు. కాగా, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా కొరటాల శివతో చేస్తున్న NTR 30 సినిమా కోసం తారక్ రూ. 60 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5, 2024లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఏప్రిల్ 11 , 2023
Failure Hero’s: స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్ హీరోలు తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్‌లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, మహేశ్ బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లు టాలీవుడ్‌లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం.
అక్కినేని అఖిల్:
అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ కొట్టిన అఖిల్.. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఏజెంట్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది.
అల్లు శిరీష్:
చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్ మరింత డల్ అయ్యింది.
అల్లరి నరేష్:
దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నరేష్.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్.
సుశాంత్:
అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సుశాంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్ చిత్రాల్లో నటించారు.
ఆది పినిశెట్టి:
దిగ్గజ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తున్నాడు.
ఆది:
నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నాడు.
రాజా గౌతం:
హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
అరుణ్ దాసరి:
టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్ హీరో కెరీర్ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఏప్రిల్ 03 , 2023