రివ్యూస్
How was the movie?
తారాగణం
గోపీచంద్
మేజర్ సంజీవ్ / కృష్ణ ప్రసాద్రాశి ఖన్నా
రఘుపతి కూతురుషామ్
రఘుపతి కొడుకుఅభిమన్యు సింగ్
సంజీవ్ కుటుంబ హంతకుల్లో ఒకరునాగినీడు
సంజీవ్ కుటుంబ హంతకుల్లో ఒకరుబ్రహ్మాజీ
సంజీవ్ కుటుంబ హంతకుల్లో ఒకరుఆశిష్ విద్యార్థి
CBI అధికారిసాయాజీ షిండే
వీరభద్రంమిలింద్ గునాజీ
మేజర్ జనరల్ చంద్ర ప్రకాష్‌చంద్ర మోహన్
సంజీవ్ తండ్రిసుధ
సంజీవ్ తల్లిఅలీ
సావిత్రివెన్నెల కిషోర్
ఆకాష్అమిత్ తివారీ
కెప్టెన్ అమిత్ప్రభాకర్
కెప్టెన్ సత్యవీర్అర్జున్ దాస్
అజయ్సితార
రఘుపతి భార్యరఘు బాబు
వీరభద్రం బావమౌనిక
శృతి సోదరిశ్రవణ్శ్రీపతి కొడుకు
జెన్నీ
ప్రీస్ట్శ్రావణిశృతి అత్త
మేఘశ్రీ
శృతి సోదరిముక్తార్ ఖాన్కమీషనర్ శరత్ చంద్ర
తాగుబోతు రమేష్
అవంతిక వందనపు
అవంతికరఘు కారుమంచి
సాయికుమార్ పంపన
సాక్షి చౌదరి
ఐటెమ్ నంబర్సిబ్బంది
జ్యోతి కృష్ణ
దర్శకుడుఎస్. ఐశ్వర్యనిర్మాత
యువన్ శంకర్ రాజా
సంగీతకారుడుకథనాలు
Allu Arjun: అల్లు అర్జున్ వైద్య ఖర్చులు పెట్టలేదు.. ప్రభుత్వమే భరిస్తోంది: సీపీ
'పుష్ప 2' (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యజమానులతో సహా అల్లు అర్జున్ను సైతం పోలీసులు అరెస్టు (sandhya theatre stampede case) చేశారు. ఆ మర్నాడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఓ వీడియో రిలీజ్ చేసిన బన్నీ.. శ్రీతేజ్ వైద్య ఖర్చులు తాము భరిస్తారమని భరోసా కల్పించారు. ఈ క్రమంలో తాజాగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బన్నీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.
సీపీ ఏమన్నారంటే
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ (9) ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగినప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 17) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టీనాతో ఆస్పత్రిని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్‌కు డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక ఐపాక్సియా అనే బ్రెయిన్ డ్యామేజ్ స్జేజ్‌కి వెళ్లారు. రికవరీ కావడానికి టైమ్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ సపోర్ట్‌తో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ చికిత్స సుదీర్ఘంగా సాగే అవకాశముంది' అని చెప్పారు. అల్లు అర్జున్ టీమ్ చికిత్స ఖర్చు భరిస్తుందా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా 'ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తోంది’ అంటూ సీపీ సమాధానం ఇచ్చారు.
https://twitter.com/NtvTeluguEnt/status/1869019199290659067
https://twitter.com/revathitweets/status/1868989039027921387
బన్నీపై నెటిజన్ల విమర్శలు..
వైద్య ఖర్చులు తామే భరిస్తామని బన్నీ ప్రకటించి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు కారణమైనందున శ్రీతేజ్ వైద్య ఖర్చులు పెట్టుకోవాల్సిన బాధ్యత బన్నీకి ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు ఎందుకు భరించాలని నిలదీస్తున్నారు. ఆ డబ్బు ప్రజలదని, తప్పు మీరు చేసి ఆ భారం తమపై మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ వర్గాలు సైతం బన్నీ వీడియోను, సీపీ కామెంట్స్‌ను పక్క పక్కన పెట్టి వీడియోలను ట్రెండింగ్ చేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ను కావాలని బదనామ్ చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వైద్య ఖర్చులు భరిస్తానని బన్నీ చెప్పాడని ఆస్పత్రి బిల్స్ చూపిస్తే గాని తాము నమ్మమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AapannaHastham/status/1869034820879155677
బాధితుల వెర్షన్ ఏంటంటే
సీపీ ఆనంద్ చేసిన కామెంట్స్‌ను ఖండిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరో వీడియోను వైరల్ చేస్తున్నారు. మృతురాలు రేవతి భర్త, శ్రేతేజ్ తండ్రి భాస్కర్ ఓ మీడియాకు ఇచ్చిన బైట్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అందులో మూవీ టీమ్ తమను సంప్రదించినట్లు భాస్కర్ స్పష్టం చేశారు. 'మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ రవి సార్, బన్నీ వాసు సార్ వచ్చారు. ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తాము కేర్ తీసుకుంటామని హాస్పిటల్ ఇన్ఛార్జ్తో చెప్పారు. బాబు గురించి ఆందోళన వద్దని, తాము చూసుకుంటామని నాకు భరోసా ఇచ్చారు. మా తరపున బాబుకి సపోర్ట్ ఉంటుందని, శ్రీతేజ్ కోలుకోవాలని ప్రార్థించమని అన్నారు’ అని భాస్కర్ స్పష్టం చేశారు. అయితే ఈ బైట్ తొక్కిసలాట జరిగిన ఒక రోజు గ్యాప్‌తో (డిసెంబర్ 6) రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే బన్నీ టీమ్ రంగంలోకి దిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.
https://twitter.com/PavanBaipalli/status/1869074646165016770
డిసెంబర్ 18 , 2024
Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్.!
బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
https://twitter.com/i/status/1747997141644251346
టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
https://twitter.com/i/status/1746394374546559063
తాజాగా అవంతిక నటించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుదలై మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మడు చాలా బోల్డ్‌గా కనిపించడంతో పాటు ఓ పాటలో శృతిమించి అందాల ప్రదర్శన చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
https://twitter.com/i/status/1746552711666094366
మనం చూస్తున్నది అప్పుడు తెలుగు సినిమాలలో చూసిన అవంతికనేనా.. ఇంతలో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది.
https://twitter.com/i/status/1746391190511952308
అవంతిక.. ఇండో-అమెరికన్ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంది.
2014లో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ (నార్త్ అమెరికన్ ఎడిషన్)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.
మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది.
ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం అవంతిక తన ఫోకస్ మెుత్తం హాలీవుడ్ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది.
హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్’ అనే హాలీవుడ్ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్, క్రౌన్ విషెష్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి.
ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) తల్లిదండ్రులు ఉన్నవాళ్లైనప్పటికీ తను ఓ రెస్టారెంట్‌లో పని చేస్తూ మరో వైపు సినిమాలలో నటిస్తూ చాలామంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
జనవరి 19 , 2024
Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్, గుండె, డయాలసిస్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.
కుటుంబ నేపథ్యం
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.
సినిమా నేపథ్యం
చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.
చంద్రమోహన్ మెచ్చిన చిత్రాలు
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.
లక్కీ హీరోగా గుర్తింపు
ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్ అయినా నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్-సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. అటు చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్.
సంపాదనలో శూన్యమే!
చంద్రమోహన్ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లపైనే. శంషాబాద్ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.
చెయ్యి చాలా మంచిదట!
చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
నవంబర్ 11 , 2023
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత పురస్కారం?... భాజపా పెద్ద స్కెచ్?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని మరో అత్యున్నత పౌర పురస్కారం వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పద్మవిభూషణ్ (Padma Vibhushan 2024) అవార్డుకు చిరంజీవి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో భారత రత్న(bharat ratna) తర్వాత పద్మవిభూషణ్‌ను రెండో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. అయితే చిరంజీవికి అవార్డు గురించి గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26) అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో ఇప్పటికే చిరంజీవి పేరు చేరిపోయినట్లు ప్రముఖంగా వినిపిస్తోంది.
పురస్కారానికి కారణమిదే!
సినీ రంగానికి చిరు చేసిన సేవలతో పాటు కొవిడ్ కాలంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి మోదీ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను చిరంజీవి ఆదుకున్నారు. నిత్యావసరాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. సామాన్య పౌరుల కోసం అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించి పలువురికి ప్రాణం పోశారు. వీటన్నింటిని గమనించిన కేంద్రం.. మెగాస్టార్‌కు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం (మెుదటిది భారతరత్న) ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా!
కాగా, ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరు ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మానవత్వం, గొప్ప మనసుకు కేంద్రం ఇస్తున్న కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
పొలిటికల్ వ్యూహాం ఉందా?
చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ మెుదలైంది. కేంద్రంలోని భాజపా కొన్ని ప్రయోజనాలను ఆశించే చిరుకు పద్మవిభూషణ్( Chiranjeevi Padma Vibhushan) ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చిరుకు పద్మవిభూషణ్ ప్రకటించి పొలిటికల్‌గా మరింత మైలేజ్ పెంచుకోవాలన్నది భాజపా వ్యూహామని అంటున్నారు. ఏపీలో చిరు సోదరుడు పవన్ ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. చిరుకి జాతీయ పురస్కారం ఇచ్చి తెలంగాణలోని మెగా ఫ్యాన్స్‌ను ఆకర్షించాలని భాజపా భావిస్తుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిరు బిజీ బిజీ..
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు. వారు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలిసింది.
జనవరి 19 , 2024