• TFIDB EN
  • పాగల్
    UATelugu2h 18m
    ప్రేమ్‌ (విశ్వక్‌ సేన్‌) కనిపించిన ప్రతీ అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. కొందరు రిజెక్ట్‌ చేస్తే మరికొందరు డబ్బు కోసం అతడ్ని వాడుకొని వదిలేస్తుంటారు. ఇలా పలుమార్లు లవ్‌లో ఫెయిలైన ప్రేమ్‌ ఫైనల్‌గా పొలిటిషియన్‌ రాజీ (మురళిశర్మ)ని ప్రేమిస్తాడు. పురుషుడైన రాజీని హీరో ఎందుకు ప్రేమించాడు? నివేతా పేతురాజ్‌ ప్రేమ్‌ లైఫ్‌లోకి ఎలా వచ్చింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    విశ్వక్ సేన్
    ప్రేమ్
    నివేదా పేతురాజ్
    తీరా
    భూమికా చావ్లా
    ప్రేమ్ తల్లి (అతి పాత్ర)
    మురళీ శర్మ
    ఎమ్మెల్యే రాజా రెడ్డి రాజి
    సిమ్రాన్ చౌదరి
    సోఫీ
    మేఘ లేఖరాధ
    రాహుల్ రామకృష్ణ
    రాహుల్ రామకృష్ణ$యువ నాయకుడు
    మహేష్ ఆచంటమహేష్
    ఇంద్రజ శంకర్బేబీ
    ఆటో రామ్ ప్రసాద్
    సిబ్బంది
    నరేష్ కుప్పిలిదర్శకుడు
    బెక్కం వేణుగోపాల్
    నిర్మాత
    దిల్ రాజు
    నిర్మాత
    లియోన్ జేమ్స్
    సంగీతకారుడు
    రాధన్
    సంగీతకారుడు
    గ్యారీ BH
    ఎడిటర్
    కథనాలు
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.  https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోయిన్లలలో నివేత పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. పెళ్ళిరోజు, టిక్ టిక్ టిక్, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించింది. పాగల్, దాస్‌కా ధమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజు((Some Lesser Known Facts about Nivetha Pethuraj) గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నివేత పేతురాజ్ ఎప్పుడు పుట్టింది? 1991, నవంబర్  30న జన్మించింది నివేత పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా? మెంటల్ మదిలో(2017) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. నివేత పేతురాజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు  నివేత పేతురాజ్ ఎక్కడ పుట్టింది? మదురై నివేత పేతురాజ్ అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నివేత పేతురాజ్‌కు  ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్\ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నివేత పేతురాజ్ ఏం చదివింది? డిగ్రీ నివేత పేతురాజ్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నివేత పేతురాజ్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నివేత పేతురాజ్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా? 2018 మేలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నివేత పేతురాజ్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nivethapethuraj/?hl=en నివేత పేతురాజ్‌కు టాటూలు ఎక్కడ ఉన్నాయి? నివేత ఎద పై భాగంలో క్రిసెంట్ మూన్‌తో పాటు ఆమె నడుముకు వెనుక భాగంలో టాటూ ఉంది. నివేత పేతురాజ్ దగ్గర ఉన్న  ఖరీదైన కారు? డాడ్జ్ ఛాలేంజర్ స్పోర్ట్స్ కారు https://www.youtube.com/watch?v=S6luYDlMNiY
    అక్టోబర్ 22 , 2024
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.  దాస్ కా ధమ్కీ టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.  రంగ మార్తాండ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది. ప్రకాశ్ రాజ్‌, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది. ఘోస్టీ  వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్‌ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.  గీత సాక్షిగా ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్‌ సాగే చిత్రమని అర్థమవుతుంది. ఓటీటీ సినిమాలు Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
    మార్చి 20 , 2023
    <strong>Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్‌ నుంచి తొలగింపు!</strong>
    Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్‌ నుంచి తొలగింపు!
    టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్‌ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసింది. ఆమె చేసిన ఒక్కడు, ఖుషీ, సింహాద్రి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అటువంటి భూమికకు హిందీలో ఘోర అవమానం జరిగింది. కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన ఈ విషయాన్ని భూమిక తాజాగా పంచుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ నుంచి ఆమెను అర్ధాంతరంగా తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఏడాది వెయిట్‌ చేసినా.. తప్పించారు! సుమంత్‌ హీరోగా రూపొందిన యువకుడు (2000) చిత్రంతో నటి భూమిక చావ్లా హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఖుషి, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి చిత్రాలతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. సింహాద్రి తర్వాత హిందీలో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ 'తేరే నామ్' కూడా సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ కాగా, మరొకటి 'జబ్‌ వీ మెట్‌'. షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా చేసిన&nbsp; 'జబ్‌ వీ మెట్‌' తొలుత తనను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు భూమిక తాజాగా వెల్లడించారు. ఆ మూవీ కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూసినట్లు చెప్పారు. డేట్స్ ఇష్యూ రాకుండా వేరే సినిమాలేవి ఒప్పుకోలేదని తెలిపారు. అయితే జబ్‌ వీ మెట్‌ సినిమాకు తొలుత బాబీ డియోల్‌ను హీరోగా అన్నుకున్నారని, ఆ తర్వాత అతడ్ని కాదని షాహీద్‌ కపూర్‌ను తెరపైకి తీసుకొచ్చారని భూమిక అన్నారు. ఆ తర్వాత తనను కూడా సైడ్‌ చేసి కరీనా కపూర్‌ను ఫైనల్‌ చేశారని వాపోయారు. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్‌ మరోలా ఉండేదని పేర్కొన్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1846077009803297009 ఆ మూవీస్‌ సక్సెస్‌ సంతోషాన్నిచ్చింది: భూమిక హిందీలో తెరకెక్కిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ విషయంలోనూ భూమిక చావ్లాకు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. సంజయ్‌ దత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోనూ తొలుత భూమికను హీరోయిన్‌గా అనుకున్నారు. అనివార్య కారణాలతో ఆమెను తప్పించి విద్యాబాలన్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమా హిందీలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే తెలుగులో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పేరుతో మెగాస్టార్‌ రీమేక్‌ చేసి ఘన విజయం అందుకున్నారు. అయితే ఆ రెండు ఆఫర్లు కోల్పోయినప్పటికీ తెలుగులో తాను చేసిన ఖుషీ, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు బాగా ఆడాయని భూమిక గుర్తు చేశారు. ఇటీవల రీరిలీజ్‌ కూడా అయ్యి మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందని కామెంట్ చేశారు.&nbsp; గర్ల్‌ఫ్రెండ్‌ కోసమే తప్పించారా? ‘జబ్‌ వి మెట్‌’ సినిమా నుంచి భూమికను తప్పించడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ మూవీ సమయంలో బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌తో షాహిద్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భూమికను తప్పించి తన ప్రియురాలుకు షాహిద్‌ కపూర్‌ ఛాన్స్ ఇప్పించారని విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత వారిద్దరు విడిపోవడం ఆపై సైఫ్ అలీఖాన్‌ను కరీనా ఇష్టపడటం జరిగింది. కొద్ది కాలం తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. అయితే షాహిద్‌ పక్కన భూమిక కన్నా కరీనా అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివరి క్షణంలో ఆమెను తప్పించినట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్‌ తర్వాత భూమిక హిందీలో పలు చిత్రాలు చేసినప్పటికీ అవి పెద్దగా కలిసిరాలేదు.&nbsp; 21 ఏళ్ల తర్వాత..&nbsp; ప్రస్తుతం భూమిక తెలుగులో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మెుదలు పెట్టింది. కీలకమైన సహాయక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. MCA (మిడిల్‌ క్లాస్ అబ్బాయి), సవ్యసాచి, రూలర్‌, పాగల్‌, సీటిమార్‌, సీతారామం, బటర్‌ఫ్లై వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యుఫోరియా చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కడు వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత గుణశేఖర్‌ నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 21 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. కొత్త జర్నీ మెుదలైందంటూ రాసుకొచ్చారు.&nbsp; View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)
    అక్టోబర్ 16 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్‌ హాట్‌ ఫొటో షూట్‌తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్‌ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది.&nbsp; సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా కృతి కర్బంద ఈ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. బటన్స్‌ లేని నైట్‌ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శించింది.&nbsp; ఈ భామ కొంటెగా చూస్తూ వయ్యారాలు ఒలకబోసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కృతి కర్భంద గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.&nbsp; దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Kriti Kharbanda).. 2009లో 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.&nbsp; ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teen Maar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.&nbsp; చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee Movie) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి. ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం. హిందీలో 2016-17 మధ్య వరుసగా 'రాజ్‌: రీబూట్‌' (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.&nbsp; 2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసి.. నార్త్‌లో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.&nbsp;&nbsp; ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.&nbsp; ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అలాగే మరో అన్‌ టైటిల్డ్‌ ప్రాజెక్ట్‌కు సైతం కృతి ఓకే చెప్పింది.&nbsp; ఇక కృతి కర్భందా వ్యక్తిగత విషయాలకు వస్తే..&nbsp; బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌ను ఈ భామ ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.&nbsp; కృతి - పులకిత్‌ గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరి డేటింగ్‌పై అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. వాటికి పెళ్లి బంధంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది.&nbsp; కృతి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.&nbsp;
    జూన్ 12 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.&nbsp; సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.&nbsp;
    మే 30 , 2024
    Kriti Kharbanda: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రామ్‌ చరణ్ అక్క... అబ్బాయి ఎవరంటే?
    Kriti Kharbanda: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రామ్‌ చరణ్ అక్క... అబ్బాయి ఎవరంటే?
    ‘బ్రూస్‌లీ’ సినిమాలో రామ్‌చరణ్‌ సోదరిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన కృతి కర్బందా (Kriti Kharbanda) ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అనూహ్యంగా ఓ బాలీవుడ్‌ నటుడుతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని వార్తల్లో నిలిచింది.&nbsp; మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది. తాజాగా ఈ భామ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కృతి కర్బందా పేరు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; https://twitter.com/Network10Update/status/1752266129991708697 బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో (Pulkit Samrat) ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వైరల్‌ అవుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.&nbsp; కృతి-పులకిత్‌ జంట (Pulkit Samrat and Kriti Kharbanda) నిశ్చితార్థం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ఈ జంట ఫొటోలను చూసిన నెటిజన్లు.. ఈ జోడీ (Kriti Kharbanda Engagement) బాగుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లిరోజు ఎప్పుడో చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, వచ్చే నెలలో వీరి పెళ్లి ఉండవచ్చని సమాచారం.&nbsp; అయితే కృతి - పులకిత్‌ రిలేషన్‌షిప్‌ గురించి నాలుగేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. వారు చాలా దగ్గరైనట్లు డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ రూమర్లకు నిశ్చితార్థంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది.&nbsp; దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Pulkit Samrat and Kriti Kharbanda).. 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.&nbsp; ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teenmar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.&nbsp; చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి. https://twitter.com/i/status/1052216173801168896 ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం. హిందీలో 2016-17 సంవత్సరాల్లో వరుసగా 'రాజ్‌: రీబూట్‌' (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.&nbsp; 2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసింది.&nbsp; ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా (Kriti Kharbanda Engagement) తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.&nbsp; ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అతడు ఆదిపురుష్‌ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించడం గమనార్హం.
    జనవరి 30 , 2024
    <strong>Telugu Romantic Songs Lyrics: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ రొమాంటిక్ సాంగ్స్ లిరిక్స్ ఇవే!</strong>
    Telugu Romantic Songs Lyrics: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ రొమాంటిక్ సాంగ్స్ లిరిక్స్ ఇవే!
    తెలుగు సంగీత ప్రపంచంలో రొమాంటిక్ పాటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రేమలోని నాజూకు భావోద్వేగాలు, మధురమైన భావనల్ని పాటల ద్వారా వ్యక్తపరచడంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామి. రొమాంటిక్ పాటలు మన హృదయాలను తాకటమే కాదు, మన అనుభూతులను ప్రతిఫలింపజేస్తాయి. ప్రేమలోని ఆహ్లాదం, వేదన, అభిలాష వంటి భావాలను సంగీత రూపంలో అందించే ఈ పాటలు ప్రతి తరం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ కథనంలో, తెలుగులో గత ఐదేళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన రొమాంటిక్ పాటల లిరిక్స్&nbsp; గురించి తెలుసుకుందాం. [toc] అమరన్- హే రంగులే హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మనవైపు రారాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చెలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే (రంగులే) హే రంగులే (రంగులే) నీ రాకతో లోకమే రంగులై పొంగేనే హే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం https://www.youtube.com/watch?v=qaf4cDPsW68 లక్కీ భాస్కర్- కోపాలు చాలండి శ్రీమతి గారు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు పలుకే నీది.. ఓ వెన్నె పూస అలకే ఆపే మనసా మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు గారాబం మెచ్చిందే శ్రీమతి గారు https://www.youtube.com/watch?v=hfoMxubi4xk జనక అయితే గనుక- నేనేది అన్న సాంగ్ నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్న కాసేపు అయినా రాజాలా పోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే.. నువ్వు ఎదురుగా నిలబడితే.. గొడవలు జరగావులే.. ఒడుదుడుకులు కలగవులే.. అర క్షణమైనా.. అసలెప్పుడైనా.. కోపం నీలోనా ఎప్పుడైనా చూశానా పుణ్యమేదో చేసి ఉంటానే.. నేడు నేను నిన్ను పొందానే.. ఎన్ని జన్మలైనా అంటానే.. నా ఫేవరెట్టు నా పెళ్లామే నాడు బ్రహ్మ కోరి రాశాడే.. నీకు నాకు ముడి వేసాడే.. ఎన్ని జన్మలైనా అంటానే.. నా ఫేవరెట్టు నా పెళ్లామే ఓ.. ఆ.. హే ఉదయం నే లేచే ఉన్న వేచుంటనే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగానే హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్న కదా మాఫీ మన గదులిది ఇరుకులు కానీ మన మనసులు కావే.. ఎగరడమే తెలియదు గానీ ఏ గొలుసులు లేవే.. నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరి గమ పద నిస పాటా.. గుండా కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఆ.. ఓ.. పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామే నాడు బ్రహ్మ కోరి రాశాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామే ఓ.. ఆ https://www.youtube.com/watch?v=rILOCH3TQC8 మెకానిక్ రాకీలోని- గుల్లెడు గులాబీలు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే నీకు గులామైతిలే గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే నడుమూ గీరుతూ ఒడ్డాణమై ఉంటడే గదుమా కిందా పూసే గందమైతడే పైటను జారకుండా పిన్నిసైతనంటడే రైకను ఊరడించే హుక్కులుంటడే ఒడిలో చేరి వాడు వదలను పో అంటాడే అగడు వట్టినట్టు అదుముకుంటాడే బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే వాడు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే నీకు గులామైతిలే కో కో కో కోతి బావ ఇంకా పెండ్లి చేసుకోవా బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ మాయక్క నీకు దొండపండయా ఓ మేనబావలు నక్క తోక తొక్కినావయా ఆ సన్నా సన్నా మీసమొచ్చి యాడదన్నా గాలేదే సూపు మీద సున్నామెయ్య సూడనివన్ని సూత్తాడే పాపమంటే పాలన్నీ తాగేసే పిల్లోలే నా యంట పడుతుంటే సూదిపట్టే సందిట్టే సాలు సోరవడుతడే ఏ ఊకో మంటే ఊకోడమ్మా ఉడుం పోరడే జిడ్డు లెక్క అంటుకోని జిద్దు జేస్తడే అరె ఏలువతో గింతె సారు కన్నెలు కాలు జారుతారే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద సబ్బు లెక్క జారిన్నే రాయికండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే జారుకొప్పు విప్పేసి రింగుల కురులను దుప్పటి చేసిన్నే వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే హే బాసింగాలు కట్టుకుంటే భరోసైతడే పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే ఆని గాన్ని సోకితే సాలు మబ్బుల తేలిపోతనులే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో మందు గిల్లాసైతిరో గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో మందుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో రసగుల్లానైతిరో నీకు గులామైతిరో https://www.youtube.com/watch?v=epxr0cDxTns పుష్ప 2లోని వీడు మొరటోడు వీడు మొరటోడూ.. అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడూ వీడు మొండోడూ అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడూ.. ఓ.. మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి.. మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి చరణం 1: హో.. ఎర్రబడ్డ కళ్ళలోన.. కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న.. చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న.. రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న.. ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి.. సంటోడే నా సామి చరణం 2: హో.. గొప్ప గొప్ప ఇనాములనే.. ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని.. ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే.. చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో.. ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా.. బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే.. ఏ పిల్లైనా మహారాణీ https://www.youtube.com/watch?v=xletLqzYUGc సీతారామమ్-&nbsp; ఓ సీతా.. ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హై రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కంచెనే చూపుమా మెరుపులో ఉరుములా దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా.. హై రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమీ బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుల లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడూ లేదో ఏతో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కామమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హై రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. https://www.youtube.com/watch?v=hYFzyK9ExuM సీతారామమ్- ఇంతందం దారి మళ్లిందా.. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే https://www.youtube.com/watch?v=dOKQeqGNJwY బేబీ సినిమాలోని- ఏం మాయే ఇది ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరిది ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ నిజములా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమ కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్లయిన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏ మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దేవరలోని- చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపూ రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాశా రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరీ వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడి ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ రా ఈ బంగరు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టిందిఆ సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు https://www.youtube.com/watch?v=GWNrPJyRTcA ఫ్యామిలీ స్టార్- మధురము కదా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా ఉసురేమో నాదైనా నడిపేదే నీవుగా కసురైన విసురైన విసుగైన రాదుగా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమె హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాల్లో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సవ్వడి విని టక్కుమని తిరిగాలే నువ్వని మెరుపులా నువ్వొస్తున్నావని ఉరుకులో జారె ప్రాణమే నీపేరే పలికినదో ఏ మగువైన తగువేనా నా గాలే తాకినదో చిరుగాలైన చంపెయ్ నా హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా వెన్నెలను నిన్ను వదలమని వైరం ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీపైనా మధురము కదా ప్రతొక నడకా నీతో కలిసి ఇలా తరగని కధా మనదే కనుకా మనసు మురిసెనిలా పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘంమల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగ కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగ పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువుగానం తియ్యగ పండే రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం https://www.youtube.com/watch?v=_0q4L93rg8w ఓం భీం బుష్ -ఓ చోటే ఉన్నాను ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే https://www.youtube.com/watch?v=E7ww8Xowydc హనుమాన్- పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్లా మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే పిల్ల పల్లేరు కాయ సూపుల్ల సిక్కి అల్లాడినానే సేపల్లా పసిడి పచ్చాని అరసేతుల్లా దారపోస్తా ప్రాణాలు తానే అడగాల సీతాకోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా హే మల్లి అందాల సెండుమళ్ళీ గంధాలు మీద జల్లి నను ముంచి వేసెనే తనపై మనసు జారి వచ్ఛా ఏరి కొరి మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే పిల్ల అల్లాడిపోయి నీ వల్లా ఉడికి జరమొచ్చినట్టు నిలువెళ్ళ బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియ్యే మూడు పూటల్లా ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా హే తెల్ల తెల్లాని కోటు పిల్ల దాచేసి జేబులల్ల నను మోసుకెల్లవే పట్నం సందమామ సిన్న నాటి ప్రేమ పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్లా మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే https://www.youtube.com/watch?v=CS7hBHVGWs0 యానిమల్- ఎవరెవరో.. ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటె ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాలకన్న సొగసెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవసమేదో మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే https://www.youtube.com/watch?v=1FLNSjd0_fQ రూల్స్ రంజన్- సమ్మోహనుడా సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా ఝుమ్మను తుమ్మెద నువ్వైతే తేనెల సుమమే అవుతా సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా శీతాకాలం నువ్వే అయితే చుట్టే ఉష్ణాన్నౌతా మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నౌతా నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా నదిలా కదిలిన ఎదలయలే పొంగి ప్రేమ అలలై ఎదురౌతా కడలై మెత్త మెత్తని హృదయాన్ని మీసంతో తడమాల ఇపుడే తొడిమే తుంచి సుఖమే పంచి ఒకటైపోవాలా నదిలా కదిలిన ఎదలయలే పొంగి ప్రేమ అలలై ఎదురౌతా కడలై మెత్త మెత్తని హృదయాన్ని మీసంతో తడమాల ఇపుడే తొడిమే తుంచి సుఖమే పంచి ఒకటైపోవాలా సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా https://www.youtube.com/watch?v=8b2BRoqYbaw&amp;pp=ygUGI3JuamFu విరుపాక్ష- నచ్చావులే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే ఏ నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా నా అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI విరుపాక్ష- కలల్లోనే కలల్లోనే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళ లోపట ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరకేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కూ దాన్నింకా కథుంది కళ్ళ లోపట నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే తపస్సులా తపస్సులా నిన్నే స్మరించనా స్మరించనా హ్మ్ పొగడ్తలా పొగడ్తలా ఉన్న వినేందుకు ఓ విధంగా బాగుందే వయసులో వయసులో అంతే క్షమించినా క్షమించినా చిలిపిగా మనసులో రహస్యమే ఉన్నా భరించనా భరించనా కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే ఎవరికీ తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజామా మరి మహిమా ఏమో అటు ఇటు తెలియని పాదం ఉరేసేదేందుకు పాపం అవసరమా కుడి ఎడమో ఏమో కలల్లో నే ఉలిక్కిపడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే https://www.youtube.com/watch?v=o9zUdK37R0I హాయ్ నాన్న- సమయమా నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మ గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా హో తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దుర పలికే ఏరా కునుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయా చిత్రం అయినదే సరె సరె తొరపడకో తదుపరి కథ ఎటుకో ఓ ఓ ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సమయమా https://www.youtube.com/watch?v=Zz1M1iVEkwM మేజర్- హృదయామా..! &nbsp;నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే హే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా ఆ ఆ ఆఆ ఆ మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారా నీ ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసె చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా హృదయమా హృదయమా.. https://www.youtube.com/watch?v=W1sTXEDRCx4 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి- హా అల్లంతా.. హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో ఆ అనగనగా మనవి విను ముసిముసి ముక్తసరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే పలుకు సిరితో కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో హో ఆ తలపు దాకా వచ్చాలే తగని సిగ్గు చాల్లే తగిన ఖాళీ పూరిస్తాలే హా చనువు కొంచం పెంచాలే మొదటికన్నా మేలే కుదిరినంతా కులాసాలే హా నిను కననీ నిను కననీ కదలికకు తెలవారదే హో నిదురవనీ ప్రతి కలలో నీ ఊసే తారాడుతోందే కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే తమరి మాయేగా ఇదంతా ఓ ఓ పయనమెల్లా పండిందో మరపురానే రాదే మధురమాయే సంగతంతా ఆ ఆ ఎద గదిలో ఓ ఓ ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే ఇరువురిలో చలనమిలా ప్రేమన్న పేరందుకున్నదే హా కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే ఆ ఆ పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హో చెలిమి కల చెరిసగమే చిటికెన వేలి చివరంచులో సఖిలదళ విడివడని ముడిపడవే ప్రియతమ ముడితో https://www.youtube.com/watch?v=d-vX_t1nSlA ఓరి దేవుడా- గుండెల్లోనా గుండెల్లోనా ఏ ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మ నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నా కన్నీ బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కధనే కలిపి కాస్తానే మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో తలచినా చాలే చిటికెలో నీకే ఎదురౌతానే కనులతో అడిగి చూడే ఏదో సంతోషం నింపేస్తానే ఏ ఏ ఏ గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే గుండెల్లోనా గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా గుండెల్లోనా గుండెల్లోనా కొమ్మ నీరే గీసుకున్నా ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 సర్కారువారి పాట- కళావతి సాంగ్ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతీ కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ https://www.youtube.com/watch?v=SfDA33y38GE జాతిరత్నాలు- చిట్టి నీ నవ్వంటే సాంగ్ చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావే చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే తీన్ మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే మిర్చిబజ్జి లాంటి లైఫుల నువ్వు ఆనియన్ ఏసావే అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే మస్తు మస్తు బిర్యానీలో నింబూ చెక్కై హల్చల్ చేశావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే https://www.youtube.com/watch?v=CDk2a39uJUc అఖండ- అడిగా అడిగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా చిన్న నవ్వే రువ్వి మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో వీడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా వెళ్లలేని నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా కనని వినని సుప్రభాతల సావసమా సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమ అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో ఇన్ని నాళ్ళు లేనే లేదే నాలో నాకింత సంతోషమే మల్లి జన్మే ఉంటె కావాలంట నీ చెంత ఏకాంతమే కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా https://www.youtube.com/watch?v=K8lsQ1Aw6dM బొమ్మ బ్లాక్ బాస్టర్- బావా ఆఆ బావా ఆఆ ఆ ఆఆ ఆ ఓ ఓఓఓ ఓఓఓ ఓయ్ బావా నా ఖర్సుకు లేవని కొత్త చెఱువు పనికెళ్తే ఏఏ ఏ నా ఖర్సుకు లేవని కొత్త చెఱువు పనికెళ్తే నా సోకు సూసినాడు నా రూపు సూసినాడు ఒంగోని సూసినాడు తొంగోని సూసినాడు మీసాలు దువ్వినాడు ఆ గల గల గల గల గల పారే సెలయేరంటా గోరింకలతో గారం చేస్తూ రాగాలేంటే సిలకా సిలకా ఆ హా హా సుర సుర సురకత్తెల లాగ కత్తెరలేసి టక్కులు చేసి టెక్కులు పోయే టక్కరి మూకుందెనకా ఉందెనకా సిలకా సిలకా సిలకా సిలకా అటు సూడే నడికుడి రైలంటి సోదరా వినగడి ఫోజంటే నీదిరా నడికుడి రైలంటి సోదరా ఆఆ ఆ నడకన నీ సాటే లేరురా ఆఆ ఆ బ్రోవ భారమా ఆ ఆ ఆఆ బ్రోవ భారమా రఘురామా బ్రోవ భారమా రఘురామా భువనమెల్ల నీ వై నన్నొక్కని బ్రోవ భారమా రఘురామా ఆ ఆ ఎగాదిగా నూబాటున తదేకంగా ఓ చోటున మెదడుకి మేతెట్టలే ఏ ఏ ఏ రమారమి నే చూసిన కధే కధ నే రాసిన సోకులు సేబట్టలే ఏ ఏ ఏఏ కలిపితే ఆరు మూడు మూడు కలపను అంటే అది పోరు జోరుగ పోరు హొరాహొరని కధకుడి నగవరి సూపెడదాం నడికుడి రైలంటి సోదరా వినగడి ఫోజంటే నీదిరా నడకన నీ సాటే లేరురా ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఓ క్షణం నవ్వునే విసురు-అలా చూశానో లేదో అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే నా మనసే మాటే వినదే నీ వెనుకే ఊరికే ఊరికే నీ మదిని జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే పడదే ఓ క్షణం నవ్వునే విసురు ఓ క్షణం చూపుతో కాసురు ఓ క్షణం మైకమై ముసురు ఓ క్షణం తీయవే ఉసురు చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయి నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మోయాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంతసేపంట నీ మౌన భాష కరుణించవె కాస్త త్వరగా నువ్వు లేని నను నేను ఎం చేసుకుంటా వదిలెయ్యకే నన్ను విడిగా ఊఊఊ ఊఊ ఊ ఓ క్షణం ప్రేమగా పిలుపు ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు ఓ క్షణం తోడుగా నడువు అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలి నాలోకం నాదే ఎప్పుడు ఈ మైకం కమ్మే వరకు ఏ కలనీ కనెలేదెపుడు ఈ కలలే పొంగేవరకు కలలే అరెరెయ్ మనస్సుకే మనస్సుకే ముందే రాసి పెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే https://www.youtube.com/watch?v=aoo9QkKRNgI రొమాంటిక్- హే బాబు వాట్ డూ యూ ఇన్ లౌడొంకో క్లారిటీ నహి హే హమ్ లాడికియోంకో క్యా చాహియే మాలూం నహి హే హే బాబు వాట్ డూ యు వాంట్ హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్ రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్ కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ నీ చూపులే నా వీపుని ఆలా టచ్ చేస్తూ గుచేస్తున్నాయే నీ ఊపిరి నా గుండెల్లో దాడే పెంచేస్తూ తగ్గిస్తున్నదే ఏంటసలు మ్యాటరు ఓయ్ ఓయ్ ఓయ్ దాటుతాంది మీటరు ఓయ్ ఓయ్ ఓయ్ ఏంటసలు మ్యాటరు దాటుతాంది మీటరు ఎం ఎరగనట్టు తెలియనట్టు మండిస్తావే హీటరు కళ్ళు కాళ్ళు కలిసుపేస్తున్నావ్ చూపుల్తోటె నువ్ లేస్తున్నావ్ కిదర్ సె తు అయ్యారే లావుండా వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ లాక్కోలేక పీక్కోలేక తెగ చస్తుందే ప్రాణం నిన్ను చూసి ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా ఆలా మింగేసేలా చూస్తసావు రాకాసి చాలు చాలు తగ్గారో ఓయ్ ఓయ్ ఓయ్ దింపామకు ముగ్గులో ఓయ్ ఓయ్ ఓయ్ చాలు చాలు తగ్గారో దింపామకు ముగ్గులో ఎం తెలవానట్టు తోసినవే అందం అనే అగ్గిలో ఎక్కడో ఎక్కడో చెయ్యిస్తున్నావ్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నావ్ రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్ రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్ కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్ శ్రీకారం- వచ్చానంటివో వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ్హా కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా అరెరెరెరే నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా హో ఓ ఓ హో ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ అరరే అరరే అరె అరె అరె అరె తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓఓ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా) దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా అరెరెరెరే సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా కారమైన ముది కారామైన ముది కారమైన మూతి ఇరుపులు భలేగున్నయే బాలా నీ అలక తీరనూ ఏమి భరణము ఇవ్వగలను భామ ఎన్నెలైన ఏమంత నచ్చదూ ఊ ఊఊ ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా ఎన్నేలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా నువ్వు పక్కనుంటే నువ్వు పక్కానుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేర రావా ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన https://www.youtube.com/watch?v=YOgx7hmoTfw శ్రీకారం- హే అబ్బాయి నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్నా ఏదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా హే పో పో పొమ్మన్నా పడిగాపె కాస్తున్నా గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా సారి అన్నా క్షమిస్తానా నీ వింటా వస్తా ఏమైనా హే అబ్బాయి హే హే అబ్బాయి ఇంకా పోజులు చాలోయి కాస్త ఇటైపు చూడోయి హే అబ్బాయి హే హే అబ్బాయి సిగ్గెంటోయి అబ్బాయి నీకో ముద్దోటిచ్చి పోగెట్టేయనా హే అబ్బాయి హే హే అబ్బాయి నేను చూస్తున్న పరువే తీసేస్తున్న పోనీ పాపం అమ్మాయి అంటూ వదిలేస్తున్న నీదే తప్పున్నా ఇన్నాళ్లు తగ్గున్నా పడనే నేను వదిలేయ్ నన్ను ఆపేయ్ అంటున్నా నువ్వేమన్నా వస్తానన్నా నే ఉంటానా బుద్దిగా ఆగమ్మా హే అమ్మాయి హే హే అమ్మాయి ఆపేసేయ్ గోలంటూ ఇంక ఎలాగా చెప్పాలి హే అమ్మాయి హే హే అమ్మాయి ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే కట్ చేసేయనా తెగ ప్రేమే ఉన్నా నీపైన చీపైన తోలి చూపుల్లోనే మనుసు నీదే తెలుసుకున్నా ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా ఒక నిన్నే నిన్నే తగిన జోడని ఊహిస్తున్నా నేడని రేపని ఎంత కాలమే అయినా ఏది చూడక ఒక్క మాట పై నేనున్నా అయినా నీకిది అర్థమైనను కాకున్నా అసలే నిన్ను వదిలే పోను నీతో పాటే నేనుంటా హే అబ్బాయి హే హే అబ్బాయి ఇంకా పోజులు చాలోయి కాస్త ఇటైపు చూడోయి హే అబ్బాయి హే హే అబ్బాయి సిగ్గెంటోయి అబ్బాయి నీకో ముద్దోటిచ్చి పోగెట్టేయనా https://www.youtube.com/watch?v=bGSerzhd3QA SR కళ్యాణమండపం- హే చుక్కల చున్నీకే.. తొతో రుత్తో తొతో తొతో రుత్తో తొతో తొతో రుత్తో తొతో తొతో తొతో తొతో హే చుక్కల చున్నీకే నా గుండెను కట్టావే ఆ నీలాకాశంలో అరె గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వెళ్ళే దారంతా అరె గళ్ళు గళ్ళు మోగించావే వెచ్చా వెచ్చా ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేశావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను డప్పే కొట్టి చెప్పాలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాటాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధూ నదై పొంగావే ఉండిపో ఉండిపో ఎప్పుడూ నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారే వాళ్లకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్నా కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకోలేదు ఇంతలా నీ జుంకాలాగా మనసేనాడు ఊగలేదు హే దాయి దాయి అంటూ ఉంటే చందమామై వచ్చావే ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా https://www.youtube.com/watch?v=CXgMtDQMwwU SR కళ్యాణమండపం- చూశాలే కళ్లారా ఈ నెల తడబడే వరాల వరవడే ప్రియంగా మొదటి సారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గాథలు ఒదిలి పారి పోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా ఎపుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపే నా అలజడినాపె నా ప్రతిధిక నీకే పోను పోను దారే మారేనా నా శత్రువే నడుమే చంపద తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జాతకుదిరాకే నా కదలిక మారే నా వదువికా నివ్వే ఆ నక్షత్రాల దారే నా పైన హే తాళాలు తీశాయి కలలే కౌగిళ్ళలో చేరళిలే తాలేమో వేచివుంది చూడే నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టాంగా ఈ నాడే తీరాన్నే వెతికే కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా ఎపుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చినది ప్రాణమే నీ జాతకుదిరాకే నా కదలిక మారె నా వదువికా నీవే ఆ నక్షత్రాల దారే నా పైన https://www.youtube.com/watch?v=8-fFgb7UYjI కలర్ ఫొటో- తరగతి గది దాటి తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే ఏ పనీపాటా లేని ఈ చల్ల గాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా ఊరూ పేరూ లేని ఊహ లోకానా తారాతీరం ధాటి సాగిందా ప్రేమా తరగతి గది ధాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే నేడే రానే గీత దాటే విధే మారే తానే తోటమాలి ధరే చేరే వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది ధాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే https://www.youtube.com/watch?v=2bQ8090xrTA ఆకాశం నీ హద్దురా- కాటుక కనులే లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చేరా వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా నా కొంగు చివర దాచుకున్నా చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా మొడుబారి పోయి ఉన్నా అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా నా మనసే నీ వెనకే తిరిగినదీ నీ మనసే నాకిమ్మని అడిగినదీ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ గోపురానా వాలి ఉన్నా పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటనీ బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా నీ సూదిలాంటి చూపుతో ధారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టారా కుట్టి కుట్టి పోరాఆ ఆ కందిరీగ లాగా చుట్టు చుట్టుకోరా ఆ ఆ కొండచిలువ లాగా కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా గోరు తగలకుండ నడుము గిచ్చినావురా అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి మూడు పూట్ల ఆరగించరయ్య నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లిగా చీరకున్నా మడతలే చక్కబెట్టారా నీ పిచ్చి పట్టుకుందిరా వదిలిపెట్టనందిరా నిన్ను గుచ్చుకుంటా ఆ ఆ నల్లపూసలాగా అంటిపెట్టుకుంటా ఆ ఆ వెన్నుపూసలాగా లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ https://www.youtube.com/watch?v=gX3jQkbBMdg ఆకాశం నీ హద్దురా- పిల్ల పులి కవ్వం చిలికినట్టే గుండెల్ని కెలికేస్తివే యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నా నోరే ఊరేట్టు పిల్ల పులి పిల్ల పులి పోరాగాడే నీకు బలి ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని నరికేసావే నా రాతిరి నిద్దరనీ బంగాళాఖాతంలో పడ్డావే బంతి రెక్క ఎంతెంతా తూఫాను రేపావే తస్సచక్క నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే అల్లాడించావే ఏ ఏ ఏ పిల్లా నచ్చావే ఏ ఏఏ హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే ఏ ఏఏ ఏ చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా నన్నట్టా పెట్టేసుకో పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె తడవాలి నా కలా నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెలా పిల్లా భూమికొక్క పిల్లా ఎల్లా నిన్ను ఒదిలేదెల్లా హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే మామూలు మాటైనా కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తానట్టు కేరింతలైతినే హో నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి నా కంట పడతాదో లేదో లే ఓ వెయ్యి జనమాలు ఆలస్యం అయితేనేం నీ కోసం చూస్తానే సొట్ట బుగ్గ పిట్టా నీకు తాళి కట్టా ఇట్టా ముందుగానే పుట్టా హోయ్ నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగొట్టి నీ పదనిస పాడిస్తివే ఎర వేశావే సంకుతాతిరి సోకుల సంపదని నరికేసావే నా రాతిరి నిద్దరనీ బంగాళాఖాతంలో పడ్డావే బంతి రెక్క ఎంతెంత తూఫాను రేపావే తస్సచక్కా https://www.youtube.com/watch?v=alKOrMQEGys చిత్ర లహరి- ప్రేమ వెన్నెల రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల వానల వీనుల వాన వీణ వాణిల గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగామల్ని తియ్యగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులు ఒక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయెనేమో నీ రెండు కల్లలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసి రాసినడిలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ నడవకే నువ్వలా కాలాలలో కోమల ఆహ్హాయా నడవకే నువ్వలా కాలాలలో కోమల పాదమే కందితే మనసు విల విలా విడువకే నువ్వలా పలుకులే గల గల పెదవులు అదిరితే గుండె గిల గిలా అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంతా పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E జెర్సీ- అదేంటోగాని ఉన్నపాటుగా అదేంటో గాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఆఆఆఆ ఎరుపుగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నం నంటుకున్న తారవ నువ్వా నాకున్న చిన్ని లోకమంతా నెఈఈ.. పిలుపుగా తేరి పారా చూడ సాగే దూరమే ఏది ఏది చేరే చోటనే సాగే క్షణములాగేనే వెనకే మానని చూసేనె చెలిమి చేయమంటూ కోరేనే ఒఒఒఒఒ వేగమడిగి చూసేనే అలుపు మనకి లేదనే వెలుగులైన వెలిసిపోయెనే ఓ మా జోడు కాగా వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా ఆఆఆ చందమామ మబ్బులో దాగిపోదా ఎహ్ వేళా పాలా మీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా అఅఅఅఅఅ సిగ్గులోనా అర్థమే మారిపోదా ఏరి కోరి చెర సాగే కౌగిలి ఏది ఏది చేరే చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే కనులలోనే నవ్వుపూసేనే ఒఒఒఒఒ లోకమిచట ఆగేనా ముగ్గురో ప్రపంచమాయెనే మెరుపు మురుపు తోనే కలిసేనే ఊఊ అదేంటో గాని ఉన్నపాటుగా కాలమెటుల మారేనా దొరికే వరకు ఆగదే ఒకరు ఒకరు గానే విడిచెనే అదేంటో గాని ఉన్నపాటుగా దూరమెటుల దూరేనే మనకే తెలిసే లోపలే సమయమే మారి పోయెనే https://www.youtube.com/watch?v=U7uYYwHOcmA డియర్ కామ్రెడ్- కడలల్లే వేచే కనులే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే ఒడిచేరి ఒకటైపోయే ఒడిచేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరా ప్రాయమిలా చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా నీ ధ్యాస మారినా అడిగింది మొహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే https://www.youtube.com/watch?v=2ySr4lR0XFg డియర్ కామ్రెడ్- నీ నీలి కన్నులోని ఆకాశమే నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగున్నం పంచుకున్న చిన్ని చిన్ని సంతోశాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోనే చేరగా నా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాళీ అందులోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెలో ముంచేసింది కన్నె నీకోసమే నానానానా కళ్ళే వాకిల్లె తీసి చూసే ముంగిల్లె రోజు ఇలా నేనేనేనే వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే ఎవరు చూడని ఈ అలజడిలో కుదురు మరచిన న ఎద సడిలో ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాతిరి వొడిలో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాళీ అందులోని సంగీతమే సోకి https://www.youtube.com/watch?v=JgZBAnKIvms మల్లేశం- నాకు నువ్వని నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలూగే ఉయ్యాలా నువ్వు నేనని ఇక యేరు కామని మన జంట పేరు ప్రేమే అయ్యేలా సూడసక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా రామసక్కగా అలా అలా ఆడిపాడగా ఎన్నెన్ని ఆశలో ఎన్నెన్ని ఊహలో మెలేసుకున్న కొంగు ముళ్లలో ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రంగులో కలేసుకున్న కొంటె కళ్ళలో తనాన నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా నానా నానా గునుగు పువ్వులా తంగేడు నవ్వులా మన రెండు గుండెలూగే ఉయ్యాలా గోరు వంకకి సింగారి సిలకలా మన జంట పేరు ప్రేమే అయ్యేలా ఎన్ని పొద్దులో ఎన్నెన్ని ముద్దులో ముడేసుకున్న పసుపు తాడుతో ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రవ్వలో కలేసుకున్న ఈడు జోడులో నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలూగే ఉయ్యాలా నువ్వు నేనని ఇక యేరు కామని మన జంట పేరు ప్రేమే అయ్యేలా నన నానాననా నన నానాననా నన నానాననా నన నానాననా https://www.youtube.com/watch?v=1HwHifEFltk గద్దలకొండ గణేష్- గగన వీధిలో గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల దీవిని వీడుతూ దిగిన వేళలో కలలొలికిన సరసుల అడుగేసినారు అతిథుల్లా అది చూసి మురిసే జగమెల్ల అలలాగా లేచి పడుతున్నారీవేలా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల రమ్మని పిలిచాక కమ్మనిదిచ్చాక కిమ్మని ఆనదింకా నమ్మని మానసింకా కొసరిన కౌగిలింతక వయసుకు ఇంత వేడుక ముగిసిన ఆసకాంత గోల చేయకా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే నాననాననా ననన నాననాననా ననన నాననాననా ననన నా నడిచిన దారంతా మన అడుగుల రాత చదవదా జగమంతా అది తెలిపే గాథ కలిపినా చేయిచేయినీ చెలిమిని చేయనీ అని తెలిపిన ఆ పదాల వెంట సాగనీ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల https://www.youtube.com/watch?v=QsiIN4tKPdo ఇస్మార్ట్ ఇంకర్- ఉండిపో ఉండిపో ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకు తున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా సరి కొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే ముని వేళ్ళతో బిడియాలు పారిపోవా ఎటు వైపుకో ఆహా సన్నగా సన్నగా సన్నా జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కటుక్కల్లనే తిప్పగా నేనో రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరే చనువౌతా నువ్ గాని పొలమారు తుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా అడగాలి గని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథా https://www.youtube.com/watch?v=Y-N_Z028dN0 RX 100- మబ్బులోన వాన విల్లులా మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న ప్రేయసివే దూరమైనా ఉర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకల్ల రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నా శశివే సరసకు చెలి చెలి రా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా నున్నగా నువ్వే ఎద సదివె అన్నగా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా కళ్లారా నిన్నే తలచి తలచిలా నున్నగా నువ్వే ఎద సదివె మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా చిన్నదానా ఓసి అండాలమైన మాయగా మనసు జారీ పడిపోయెనే తపనతో నీవెంటే తిరిగేనా నీ పేరే పలికేనా నీలాగే కూలికెన్ నిన్ను చేరగా ఎన్నాళ్లయినా అవి ఎన్నేళ్లు ఐన వందేళ్లు అయినా వేచి ఉంటాను నిను చూడగా గంటలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇదో ఎడతెగని హుంగామ ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా అయ్యో రామ ఓసి వయ్యారి భామ నీవొక మరపురాని మ్రిదు భావమే కిల కిల నీ నవ్వు తళుకులే నీ కాళ్ళ మెరుపులు కవ్విస్తూ కనపడే గుండెలోతులో ఏం చేస్తున్న నేను ఏచోట ఉన్న చూస్తూనే ఉన్న కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించినా రక్త మందారాలతో కాలాన్నే మనం తిరిగి వెన్నకకే తొద్దామా మల్లి మన కథనే రాద్దామా ఏళ్ళ విడిచి బతకనే పిల్ల రా నువ్వే కనబడవా https://www.youtube.com/watch?v=5MtKkdEiJzk తెలుగులో ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం YouSay తెలుగు వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడం మరచిపోకండి.
    నవంబర్ 22 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్&nbsp; 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.&nbsp; శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్&nbsp; అభిరుచులు? &nbsp;మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్&nbsp; బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు? &nbsp;తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.&nbsp; ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ&nbsp; ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా&nbsp; టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌ &nbsp;నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం&nbsp;ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.&nbsp; తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.&nbsp; యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.&nbsp; ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్‌ పోస్టు!
    ఆర్‌ఎక్స్‌ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన నటి 'పాయల్‌ రాజ్‌పుత్‌' (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ అమ్మడికి ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఇటీవల ‘RX100’ డైరెక్టర్‌తో చేసిన 'మంగళవారం' సినిమాతో పాయల్‌ తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. ఇందులో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె చేసిన ఓ పోస్టు.. అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అసలు ఏ జరిగిందంటే! 2020లో 'రక్షణ' అనే చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ విడుదల కాలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయనున్నట్లు లేటెస్ట్‌గా మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పారితోషికం ఇంతరవకూ తనకు చెల్లించలేదని పైగా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మేకర్స్‌ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పాయల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‘చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ ‘రక్షణ’ మేకర్స్‌ వేధింపులపై నటి పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. దీని ప్రకారం.. ‘చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్‌ కావడంతో దానిని ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) పాయల్‌ బిజీ బిజీ 'మంగళవారం' మూవీ సక్సెస్‌తో పాయల్‌ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. తమిళంలో 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌' చిత్రాల్లో పాయల్‌ నటిస్తోంది. తెలుగులో 'కిరాతక' సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కాగా, విడుదల సిద్ధంగా ఉన్న ‘రక్షణ’ మూవీలో పాయల్‌ పోలీసు అధికారిణిగా కనిపించనుంది.&nbsp;
    మే 20 , 2024
    Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!
    Mangalavaaram Teaser: బోల్డ్ సీన్లలో పాయల్ రాజ్‌పుత్ అరుపులు... ఈసారి గట్టిగానే ఉంటదంట!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    జూలై 04 , 2023
    Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?
    Vijayapriya Nithyananda: ఐరాసలో నిత్యానంద తరఫున పాల్గొన్న ఈమె ఎవరో తెలుసా?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 02 , 2023
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:&nbsp; ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో&nbsp; హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.&nbsp; ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.&nbsp; సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.&nbsp; సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.&nbsp; జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.&nbsp; మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.&nbsp; ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌&nbsp; సిద్ధపడుతున్నట్లు&nbsp; తెలుస్తోంది.&nbsp; RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.&nbsp; మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.&nbsp; అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు.&nbsp;
    ఏప్రిల్ 25 , 2023
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.&nbsp; సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.&nbsp;
    మార్చి 12 , 2024
    <strong>Ashika Ranganath:&nbsp; పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా&nbsp; లెలేత పరువాలు</strong>
    Ashika Ranganath:&nbsp; పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా&nbsp; లెలేత పరువాలు
    కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్‌’ దీపావళి వేళ ఓ యాడ్‌ ఫొటో షూట్‌లో పాల్గొంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ చాలా హాట్‌ లుక్‌లో కనిపించి చెమటలు పట్టించింది. తన లేలేత అందాలను ఆరబోసింది. మెరూన్ కలర్ డ్రెస్, గొల్డ్ కలర్ ఎంబ్రాయిడీలో తళక్కున మెరిసింది. తన ఎద, నడుము ఒంపులను చూపించి కుర్రకారు మతి పొగొట్టింది.&nbsp; View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోతున్న ఆషికాను చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఆమె క్లీవేజ్‌ షోకు విజిల్స్ వేస్తున్నారు. మెరూన్ కలర్, గొల్డ్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఈ అమ్మడి అందం మరింత పెరిగింది. Godess Of Beauty అంటూ కామెంట్ బాక్స్‌లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.&nbsp;&nbsp; ఇటీవల తన సిస్టర్ వెడ్డింగ్‌ ఫంక్షన్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ బ్లాక్‌ శారీలో అదరగొట్టింది. మ్యాచింగ్‌ స్లీవ్‌ లెస్‌ చెక్కీల బ్లాక్‌ బ్లౌజ్‌వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.&nbsp; నల్లటి శారీలో వెన్నెల లాంటి అందాలను కురిపిస్తున్న ఆషికాను చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆషికా తన గ్లామర్‌తో చెమటలు పట్టిస్తోందని పోస్టులు పెట్టారు. సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగ (Naa Saami Ranga) చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఈ కుర్ర హీరోయిన్‌కు అవకాశాలు మాత్రం రాలేదు. ‘నా సామిరంగ’ కంటే ముందే టాలీవుడ్‌లో ఆషిక (Ashika Ranganath) ఓ సినిమా చేసింది. 'అమిగోస్‌' (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్‌ సరసన ఆమె నటించింది.&nbsp; ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌తో చేసిన ఎన్నో రాత్రులు వస్తాయి గాని సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో తన అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపివేసింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన దృష్టి తమిళ్‌పై పెట్టింది. తమిళ్‌లో ఈ ముద్దుగుమ్మ హీరో సిద్ధార్థ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆయనతో కలిసి MISS YOU అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆషిక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక ఓ ఇంటర్యూలో తెలిపింది.&nbsp; ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక (Ashika Ranganath) చెప్పింది. తనకు క్లీన్‌ అండ్‌ క్లియర్ ఫ్రెష్‌ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి 'క్రేజీబాయ్‌' (Crazy Boy) అనే కన్నడ సినిమాలో డైరెక్టర్‌ అవకాశమిచ్చినట్లు తెలిపింది.&nbsp; ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్‌, బెల్లీ, వెస్టర్న్‌ డ్యాన్స్‌ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.&nbsp; ఈ బ్యూటీ ఫేవరేట్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌. పరిశ్రమలోనికి రాగానే పునీత్‌ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.&nbsp; తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక (Ashika Ranganath) ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు తనకు బాగా అర్థం అవుతుందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసినట్లు ఆషిక చెప్పింది. ‘బొమ్మరిల్లు’ (Bommarillu), ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) చిత్రాలను చాలా సార్లు చూసినట్లు చెప్పింది.&nbsp; ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్‌ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.&nbsp; ఈ బ్యూటీ (#AshikaRanganath) ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్‌ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట. రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్‌ అంటే చిన్నప్పటి నుంచి క్రష్‌ అని ఆషిక చెబుతోంది.&nbsp;
    నవంబర్ 02 , 2024
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌ నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌ విడుదల తేదీ: 03-05-2024 సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.  కథేంటి రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్‌) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్‌) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్‌ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్‌ ఓకే అనిపించింది. వారి మ‌ధ్య వచ్చే  స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే డిజార్డర్‌ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్‌ వైకే ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు క‌థ‌ని న‌డిపించిన విధాన‌ం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్‌ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్ సుహాస్‌ నటనమలుపులుసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్ ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5 
    మే 03 , 2024
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది.&nbsp;సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్‌ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.&nbsp; మూడో మీటింగ్‌లోనే అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్‌ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.&nbsp;&nbsp; ఎవరీ పాయల్‌ 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. కశ్యపై కేసు గతంలోనే అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.&nbsp; తెలుగులోకి ఎంట్రీ అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్‌ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్‌ సినిమాలో చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.&nbsp; రాజకీయ నాయకురాలు ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్‌. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు.&nbsp; ‌అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది. సినిమాలు ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్‌ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.&nbsp;
    మార్చి 19 , 2023

    @2021 KTree