• TFIDB EN
  • పైలం పిలగా
    UATelugu
    శివ దుబాయ్‌ వెళ్లి బాగా సెటిల్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సాయి తేజ కల్వకోటశివ
    పావని కరణందేవి
    మిర్చి కిరణ్గ్రామ సర్పంచ్
    జానకి డబ్బింగ్
    అమ్మమ్మ
    చిత్రం శీను
    మూర్తి
    బీహెచ్ఈఎల్ ప్రసాద్శివ తండ్రి
    జయ నాయుడుశివుని తల్లి
    సిబ్బంది
    ఆనంద్ గుర్రందర్శకుడు
    రామ కృష్ణ బొద్దులనిర్మాత
    ఎస్కే శ్రీనివాస్నిర్మాత
    యశ్వంత్ నాగ్సంగీతకారుడు
    ఆనంద్ గుర్రంకథ
    సందీప్ బద్దులసినిమాటోగ్రాఫర్
    రవితేజ కూర్మనాఎడిటర్ర్
    కథనాలు
    <strong>Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!</strong>
    Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
    ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్‌ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; మత్తు వదలరా 2 (Mathu vadalara 2) బ్లాక్‌ బస్టర్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’ ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్‌ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ గానుంది. సెప్టెంబర్‌ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'డెలీవరీ బాయ్‌ ఏజెంట్స్‌ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?' అన్నది స్టోరీ. గొర్రె పురాణం (Gorre Puranam) సుహాస్ న‌టించిన రీసెంట్‌ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబ‌ర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో క‌లిసి చూసేయ‌చ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్‌) ఉన్న సెల్‌లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. పైలం పిలగా (Pailam Pilaga) సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. సెప్టెంబర్ 20న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే 'శివ దుబాయ్‌ వెళ్లి బాగా సెటిల్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ. శబరి (Sabari) విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్‌ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్‌ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్లాట్‌ ఏంటంటే 'సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్‌ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్‌ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్‌ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ. లెవల్‌ క్రాస్‌ (Level Cross) అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; వెయ్‌ దరువేయ్‌ (Vey Dharuvey) ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన రీసెంట్‌ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ యాక్షన్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజై ఆకట్టుకోలేకపోయింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ వచ్చిన ఈ చిత్రం ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘శంకర్.. ఫేక్‌ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం ఫ్లై కన్సల్టెన్సీని సంప్రదిస్తాడు. అందులో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఇష్టపడతాడు. అయితే ఈ ఫేక్‌ సర్టిఫికేట్స్‌ మాఫియాకు శంకర్‌కు సంబంధం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే హీరో నగరానికి వచ్చాడా? ఏదైనా ప్లాన్ ఉందా?’ అన్నది కథ. కృష్ణం ప్రణయ సఖీ (Krishnam Pranaya Sakhi) కృష్ణ‌మ్ ప్రణ‌య స‌ఖి మూవీలో కన్నడ గోల్డెన్ స్టార్ గ‌ణేష్ హీరోగా న‌టించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాళ‌వికానాయ‌ర్‌తో పాటు శ‌ర‌ణ్య శెట్టి హీరోయిన్లుగా చేశారు. కన్నడలో సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ చిత్రం అక్టోబర్‌ 11 నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌ వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘కృష్ణ (గ‌ణేష్‌) ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్‌ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ. ది గోట్‌ (The Greatest Of All Time) గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్‌ ప్లాన్‌ చేసుకోండి. విజయ్‌ హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘ది గోట్‌’ (The Greatest Of All Time). వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ అక్టోబర్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ. 35 చిన్న కథ కాదు (35 Chinna katha kadu) ప్రముఖ నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ప్రసాద్‌ (విశ్వదేవ్‌), సరస్వతి (నివేదా థామస్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్‌. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ. భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌తరుణ్‌ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్‌ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘రాధ (రాజ్‌త‌రుణ్‌) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్‌ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్‌ బాక్స్‌ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
    అక్టోబర్ 10 , 2024
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    Akira Nandan: పవన్‌ కళ్యాణ్ కోసం అకిరా నందన్‌ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్‌!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్‌ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ తనయుడు అకిరా నందన్‌ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్‌ వీడియోను క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; నాన్నకు ప్రేమతో.. పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్‌ చేసిన వీడియోను పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్‌ (Renu Desai) దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్‌ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by renu desai (@renuudesai) పవన్‌ పంచ్‌ డైలాగ్స్‌.. అకిరా ఎడిట్‌ చేసిన వీడియోలో పవన్‌ సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak) వరకు పవన్‌ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పవన్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్‌ ట్రెండింగ్‌ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1798036906124657133 తండ్రితోనే అకిరా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్‌ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్‌ రెండో భార్య కుమారుడు అకిరా నందన్‌ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.&nbsp; https://twitter.com/i/status/1797940145787908224 https://twitter.com/i/status/1798002911848673587 అకిరా ఎంతో టాలెంటెడ్‌! అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్‌ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్‌ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947
    జూన్ 06 , 2024
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’పై దిమ్మతిరిగే బజ్‌.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఆమె భర్త!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’పై దిమ్మతిరిగే బజ్‌.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఆమె భర్త!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ‘స్పిరిట్‌’కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హీరోయిన్‌ ఎవరంటే? ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయినా కరీనా కపూర్‌ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్‌, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్‌ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్‌ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని డైలాగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్‌ 10న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.&nbsp; స్పిరిట్‌ బడ్జెట్ అన్ని కోట్లా? పాన్ ఇండియా రెబల్​​ స్టార్​​ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్​​ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా. అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్​ సినిమాల బడ్జెట్​ వందల కోట్ల​తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగా చిత్రానికి సంబంధించి ఓ వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో స్పిరిట్‌ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం మేకర్స్‌ రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో కలిసి డైరెక్టర్ సందీప్‌ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ రూ.700 కోట్ల బడ్జెట్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యే వచ్చిన కల్కి రూ.600 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌ సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రాబోతున్న మూడో ఫిల్మ్‌గా ‘స్పిరిట్‌’ నిలవనుంది.
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!</strong>
    Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సందీప్‌ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’ డేరింగ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్‌ ఒక్కరే ఫిక్స్‌ కాగా ఇతర నటీనటులను ఫైనల్‌ చేసే పనిలో సందీప్‌ ఉన్నారు. అయితే స్పిరిట్‌ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్‌ తాజాగా ఒక హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ‘కొందరు యానిమల్‌ నా బెస్ట్ వర్క్‌ అంటున్నారు. నా బెస్ట్ వర్క్‌ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్‌ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సందీప్‌ తీసిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలకంటే 'స్పిరిట్‌' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్‌ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops) విలన్‌గా కొరియన్‌ సూపర్‌ స్టార్? ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్​తో డాంగ్ సూ (Ma Dong-seok) వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కొరియాలో అతడు చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ వేదికగా భారతీయ భాషల్లో డబ్‌ కూడా అవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ప్రభాస్‌ విలన్‌గా డాంగ్ సూ గనుక నటిస్తే స్పిరిట్‌ ప్రాజెక్ట్ గ్లోబల్‌ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పారు. అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
    జూలై 17 , 2024
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం స్కంద (Skanda movie) ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. చంద్రముఖి 2 (chandramukhi 2) రాఘవ లారెన్స్‌, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2.&nbsp; ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్‌ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు.&nbsp; ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. పెదకాపు-1 (Peddha Kapu 1) ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1) TitleCategoryLanguagePlatformRelease DateLittle Baby Bum: Music Time&nbsp;SeriesEnglishNetflixSept 25The Devil's Plan&nbsp;SeriesKoreanNetflixSept 26Forgotten LoveMoviePolishNetflixSept 27OverhaulMoviePortugueseNetflixSept 27Sweet Flow 2&nbsp;MovieFrenchNetflixSept 27The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27Ice Cold: Murder, Coffee and Jessica Wangso&nbsp;MovieEnglishNetflixSept 28Love is in the AirMovieEnglishNetflixSept 28Fair Play&nbsp;MovieEnglishNetflixSept 29Choona&nbsp;SeriesHindiNetflixSept 29Nowhere&nbsp;MovieSpanishNetflixSept 29Reptile&nbsp;MovieEnglishNetflixSept 29Khushi&nbsp;MovieTeluguNetflixOct 01Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28Kumari SrimatiSeriesTelugu&nbsp;Amazon PrimeSept 28Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29El-PopSeriesSpanishHotstarSept 27The Worst of EvilSeriesEnglishHotstarSept 27King of KotaMovieTelugu Dubbed&nbsp;HotstarSept 28Launchpad Season 2SeriesEnglishHotstarSept 29Tum Se Na Ho Payega&nbsp;MovieHindiHotstarSept 29Papam Pasivadu&nbsp;SeriesTeluguAhaSept 29Dirty HariMovieTamilAhaSept 29Charlie ChopraSeriesHindiSony LivSept 27Bye!&nbsp;MovieTamilSony LivSept 29Agent&nbsp;MovieTeluguSony LivSept 29Angshuman MBA&nbsp;MovieBengaliZee5Sept 29Blue BeetleMovieEnglishBook My ShowSept 29
    సెప్టెంబర్ 25 , 2023
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్‌ చేశావ్‌ సందీప్‌ మామా!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్‌ చేశావ్‌ సందీప్‌ మామా!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ గత చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పిరిట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ బయటకొచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించే ఛాన్స్‌ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మెగాస్టార్‌తో సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు చిరు సానుకూలంగా స్పందిస్తే స్పిరిట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు. మరోవైపు మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి సైతం స్పిరిట్‌లో మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర కూడా ఎంతో కీలకం కానుందని అంటున్నారు. వీటిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్‌, చైనీస్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp;&nbsp; షూటింగ్‌ స్టార్ట్‌ ఎప్పుడంటే? ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అవి తుది దశకు చేరుకోవడంతో నవంబర్‌ నుంచి షూటింగ్‌ మెుదలు పెట్టాలని సందీప్‌ రెడ్డి వంగా తొలుత భావించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ‘రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్‌ కూడా జరుపుకుంటున్నాయి. ప్రభాస్ ఆయా చిత్రాలకు డేట్స్‌ కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఫస్ట్‌ వీక్‌లో స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సందీప్‌ రెడ్డి వంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికీ రాజా సాబ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వడంతో పాటు ఫౌజీ 50% పైగా షూటింగ్‌ ఫినిష్‌ చేసుకుంటుంది. దీంతో ప్రభాస్‌ షూటింగ్స్‌ పరంగా కాస్త ఫ్రీ అవుతాడని సందీప్‌ భావిస్తున్నారట. అంతేకాదు ప్రభాస్‌ ఫోకస్‌ మెుత్తం స్పిరిట్‌ పైనే ఉండేలా సందీప్‌ వంగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా జనవరి ఫస్ట్‌ వీక్‌లో స్పిరిట్‌ పూజ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. సంక్రాంతి తర్వాత నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని లేటెస్ట్‌గా అప్‌డేట్‌ అందుతోంది.&nbsp; బడ్టెట్‌ తెలిస్తే షాకే! ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.&nbsp; ప్రభాస్‌కు రికార్డు రెమ్యూనరేషన్‌! ‘స్పిరిట్‌’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఎందుకంటే ప్రభాస్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్‌ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. ఇదే నిజమైతే రూ.300 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రభాస్‌ నిలవనున్నాడు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan), కరీనా కపుర్‌ (Kareena Kapoor) ఇందులో స్పెషల్‌ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. &nbsp;
    అక్టోబర్ 09 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!
    September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!
    ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం. స్కంద యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రామ్ మాస్‌ లుక్ హైప్ క్రియేట్ చేసింది.&nbsp; శ్రీలీల హీరోయిన్‍గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న మరొక సినిమా చంద్రముఖి 2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2005లో వచ్చిన బ్లాక్‌బాస్టర్ మూవీ చంద్రముఖికి ఇది సీక్వెల్‍. చంద్రముఖి 2 చిత్రాన్ని డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించగా.. MM కీరవాణి సంగీతం అందించారు. మార్క్ ఆంటోనీ తమిళ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పాన్‌ఇండియా రేంజ్‌లో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.&nbsp; ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కింది. మరోవైపు ఈ వారం ఓటీటీల్లో పెద్దసంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఏకంగా 25 సినిమాలు- వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. రామబాణం, భోళాశంకర్, అనీతి, బార్బీ, మాయపేటిక ఇంట్రెస్టింగ్ బజ్‌ను కలిగిస్తున్నాయి. మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు- వెబ్‌సిరీస్‌లను లిస్ట్‌వైజ్‌గా చూద్దాం. TitleCategoryLanguagePlatformRelease DateJourney of Love 18+&nbsp;MovieMalayalam&nbsp;Sony LivSeptember 15Dil Se&nbsp;MovieTeluguEtv winSeptember 16Wife Like&nbsp;&nbsp;movieEnglishNetflixSeptember 11Wrestlers&nbsp;seriesFrenchNetflixSeptember 13ErengardMovieDanishNetflixSeptember 14RambanamMovieTeluguNetflixSeptember 14Bhola Shankar)&nbsp;MovieteluguNetflixSeptember 15Love at First SightMovieEnglishNetflixSeptember 15Miss EducationSeriesEnglishNetflixSeptember 15Surviving Summer: Season 2&nbsp;SeriesEnglishNetflixSeptember 15Kelsey September 12&nbsp;&nbsp;&nbsp;MovieEnglish&nbsp;PrimeSeptember 12&nbsp; The Kidnapping Day&nbsp;SeriesKorean&nbsp;PrimeSeptember 13Bombay Mary&nbsp;SeriesHindi&nbsp;primeSeptember 14A Million Miles Away&nbsp;MovieEnglish&nbsp;PrimeSeptember 15&nbsp;Wilderness&nbsp;SeriesEnglishPrimeSeptember 15&nbsp;Aneethi&nbsp;movieTelugu Dubbed Movie&nbsp;PrimeSeptember 15Mayapethika&nbsp;Movie&nbsp;TeluguPrimeSeptember 15Animals Up Close with Bertie Gregory&nbsp;SeriesEnglishHotstarSeptember 13&nbsp;Elemental&nbsp;MovieEnglishHotstarSeptember 13&nbsp;Han River Police&nbsp;SeriesEnglish&nbsp;&nbsp;HotstarSeptember 13&nbsp;Welcome to the Wrexham Season 2(Documentary)&nbsp;English&nbsp;HotstarSeptember 13KaalaSeriesHindiHotstarSeptember 15Lang Place&nbsp;Movie&nbsp;EnglishHotstarSeptember 15&nbsp;The Other Black Girl&nbsp;movieenglishHotstarSeptember 15&nbsp; Barbie&nbsp;MovieEnglish&nbsp;Book My ShowSeptember 12&nbsp; A Honeymoon to RemembermovieenglishBook My ShowSeptember 15Pappachan Olivilan&nbsp;MovieMalayalamSaina playSeptember 14
    సెప్టెంబర్ 11 , 2023
    <strong>Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్‌.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’!&nbsp;</strong>
    Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్‌.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’!&nbsp;
    జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా రిలీజై 18 రోజులు అయినప్పటికీ దేవర జోరు ఏమాత్రం తగ్గలేదు. రిలీజైన అన్ని ఏరియాల్లో ఎప్పుడో బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం, ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తొలిరోజు ‘దేవర’పై కాస్త నెగిటివ్‌ టాక్స్‌ వచ్చినా కలెక్షన్స్‌పై ఏమాత్రం ప్రభావం కనిపించలేదు. వసూళ్ల పరంగా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాదు గ్లోబల్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్‌కు సైతం సాధ్యం కానీ ఘనతను తారక్‌ అందుకున్నాడు.&nbsp; తెలుగులో కొత్త చరిత్ర! తారక్‌ (Jr NTR), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన ‘దేవర’ చిత్రం వసూళ్ల పరంగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రిలీజైన 18 రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో రోజూ రూ.కోటీకి పైగా వసూళ్లు సాధించింది. పోస్టు కోవిడ్‌ తర్వాత రిలీజైన తెలుగు చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా దేవర రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ ఘనత రాజమౌళి తెరకెక్కించిన&nbsp; ‘RRR’ పేరిట ఉండేది. ఆ చిత్రం వరుసగా 17 రోజులు తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ దెబ్బకు ఆ రికార్డు గల్లంతైంది. అటు కరోనా తర్వాత వచ్చిన ప్రభాస్‌ చిత్రాలు (రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌, కల్కి 2898 ఏడీ) సైతం ఈ ఫీట్‌ను సాధించలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తారక్‌ స్టామినా ఏంటో అర్థమవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. https://twitter.com/AndhraBoxOffice/status/1846039904913863146 దేవర కలెక్షన్స్‌ ఎంతంటే? ‘దేవర’ చిత్రం తొలి 16 రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.509 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ఇటీవల మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. గత రెండ్రోజుల కలెక్షన్స్‌ జత చేస్తే రూ.520 కోట్లు టచ్‌ చేసే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ. 222.60 కోట్లు (GROSS) ఖాతాలోకి వచ్చి చేరినట్లు పేర్కొన్నాయి. కర్ణాటకలో రూ.17.70&nbsp; కోట్లు, తమిళనాడు రూ. 4.13 కోట్లు, కేరళ రూ. 97 లక్షలు, హిందీ + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ. 33.55 కోట్లు వసూలైనట్లు వివరించాయి. ఈ వసూళ్ల పరంపర ఇలాగే కొనసాగితే ఈజీగానే రూ.550 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి లాంగ్‌ రన్‌లో ఈ ఫీట్‌ సాధిస్తుందో లేదో చూడాలి. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్సయ్యిందా? దేవర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా రిలీజై 18 రోజులు గడిచిపోయిన నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అన్న ఎదురుచూపులు అందరిలోనూ మెుదలయ్యాయి. లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'దేవర'ను దీపావళి కానుకగా ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి సాధ్యం కాకపోతే నవంబర్‌ రెండో వారంలోనైనా కచ్చితంగా స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశముంది. అటు దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు దక్కించుకుంది. మూవీ రిలీజ్‌ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంది.&nbsp; ‘NTR 31’ లోడింగ్‌! ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 15 , 2024
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    జూన్ 29 , 2024
    <strong>Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!</strong>
    Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!
    బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్‌ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్‌ పరంగా కల్కి సరికొత్త రికార్డ్‌ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్‌ పరంగా టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; యూఎస్‌లో రికార్డు వసూళ్లు 'కల్కి 2898 ఏడీ' చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్స్‌ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈజీ గానే 'ఆర్‌ఆర్‌ఆర్‌', ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్‌ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్‌ టాక్‌ వచ్చినా ఓవర్సీస్‌ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 26 , 2024
    <strong>Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు</strong>
    Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; జనవరి&nbsp; ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.&nbsp; ఫిబ్రవరి ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్‌' (Bheemla Nayak) కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్‌ చేసింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు.&nbsp; ఏప్రిల్‌&nbsp; 2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్‌ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్‌ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.&nbsp; మే మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేసింది. జూన్‌ ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జులై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్‌ పాన్‌ ఇండియా స్థాయికి తెలిసింది. ఆగస్టు ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్‌ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా చేసింది.  సెప్టెంబర్ గత నెల సెప్టెంబర్‌ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపించారు.&nbsp; అక్టోబర్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.&nbsp; నవంబర్‌&nbsp; టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్‌ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;</strong>
    Spirit Movie: ‘స్పిరిట్‌’ కోసం గట్టిగానే ప్లాన్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌!&nbsp;
    ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ ‘యానిమల్‌’తో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా స్పిరిట్‌ నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; భారీ బడ్జెట్‌తో.. ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్‌ పరంగా ప్రభాస్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా 'స్పిరిట్‌' నిలవనుంది.&nbsp; రెమ్యూనరేషన్లకే రూ.600 కోట్లు! ‘స్పిరిట్‌’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఎందుకంటే ప్రభాస్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్‌ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. అదే విధంగా బాలీవుడ్‌ స్టార్స్‌ అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan), కరీనా కపుర్‌ (Kareena Kapoor) ఇందులో స్పెషల్‌ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మేకింగ్‌ కోసం రూ.300 కోట్లు, గ్రాఫిక్స్‌ కోసం రూ.120-150 కోట్లు, ప్రమోషన్స్‌కు మరో రూ.50-80 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. మమ్ముట్టీ స్పెషల్‌ రోల్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ఓ స్టార్‌ హీరో నటించబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్‌, చైనీస్‌ స్టార్స్‌ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp;&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని సమాచారం. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’ సిరీస్‌లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్‌’లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.
    అక్టోబర్ 08 , 2024
    <strong>Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;
    2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్‌, కమిటీ కుర్రోళ్లు, ఆయ్‌ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్‌ - కలెక్షన్స్‌ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్‌ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu) నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.&nbsp; ఆయ్‌ (Aay) నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ కూడా కలుపుకుంటే ‘ఆయ్‌’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్స్‌ నటించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటివారు స్పెషల్‌ క్యామియోలతో అలరించారు.&nbsp; టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్‌ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.&nbsp; హనుమాన్‌ (Hanuman) తేజసజ్జ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్‌ క్రేజ్‌తో ప్రశాంత్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ ఫోకస్‌ పెట్టనున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‌’ సిరీస్‌ మెప్పించిందా?</strong>
    Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‌’ సిరీస్‌ మెప్పించిందా?
    నటీనటులు: వైభవ్‌ రెడ్డి, రితికా సింగ్‌, చరణ్‌, ఆకాంక్ష సింగ్‌, నయన్‌ సారిక, రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను తదితరులు రచన, దర్శకత్వం : మానస శర్మ సినిమాటోగ్రఫీ : ధనుష్‌ భాస్కర్‌ సంగీతం : పి.కె. దండి నిర్మాత : నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ: పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఓటీటీ వేదిక: సోనీలివ్‌ విడుదల తేదీ : సెప్టెంబర్‌ 12, 2024 మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్‌సిరీస్‌ 'బెంచ్‌ లైఫ్‌'పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందడం, ఐటీ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్‌ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్‌ రెడ్డి, చరణ్‌ పెరి, రితికా సింగ్‌, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్‌లో సెప్టెంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్‌ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్‌ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్‌ బెంచ్‌ అడుగుతారు. బెంచ్‌ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్‌ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్‌) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్‌ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే బాలు పాత్రకు నటుడు వైభవ్‌ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో ఫన్‌ జనరేట్‌ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్‌ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్‌ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో హైలెట్‌ అంటే చరణ్‌ పెరి, నయన్‌ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్‌ చేయలేక డైరెక్టర్‌ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్‌ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్‌ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ &amp; నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్‌ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్‌ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ అయ్యేలా సిరీస్‌ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్‌ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్‌ వర్క్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రధాన తారాగణం నటనడైరెక్షన్‌ స్కిల్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా బోల్డ్‌ డైలాగ్స్‌ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ కావడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 12 , 2024
    <strong>Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!</strong>
    Kalki 2: స్టార్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌కు కొత్త చిక్కులు.. ‘కల్కి 2’ ఇప్పట్లో లేనట్లే!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్‌ క్యాస్ట్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను అందుకుంటూ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ‘కల్కి 2’ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఇప్పటి నుంచే ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘కల్కి 2’ షూట్‌ ఇప్పట్లో మెుదలయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే కారణమని ప్రచారం జరుగుతోంది.&nbsp; షూటింగ్స్‌కు బ్రేక్‌! 'కల్కి 2' చిత్రం వచ్చే ఏడాది జూన్‌ - జులై కల్లా రిలీజ్‌ అవుతుందని నిర్మాత అశ్వని దత్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2' రీమైనింగ్‌ షూటింగ్‌కు దీపిక పదుకొనే వల్ల బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్‌. సెప్టెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును వదులుకున్నారట. అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్‌ షోకు సైతం దీపిక నో చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి 'కల్కి 2' షూటింగ్‌కు కూడా ఆమె దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.&nbsp; దీపికనే కీలకం! ‘కల్కి 2’ చిత్రానికి దీపికా పదుకొనే పాత్రే కీలకం. ఆమె చుట్టూనే సెకండ్‌ పార్ట్ తిరగనుంది. సంక్రాంతి తర్వాత నుంచి ‘కల్కి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్‌ భావిస్తున్నారు. అటు హీరో ప్రభాస్‌ కూడా ‘కల్కి 2’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీపికా షూటింగ్‌ హాజరుకాకపోతే ఎలా అని కల్కి టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కల్కి కోసం ప్రభాస్‌ సిద్ధం చేసుకున్న డేట్స్‌ కూడా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామం ప్రభాస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది కాకుండా 2026లో రిలీజయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నాయి.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    <strong>KGF 3: ‘కేజీఎఫ్‌ 3’లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ డీల్‌!&nbsp;</strong>
    KGF 3: ‘కేజీఎఫ్‌ 3’లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌.. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రేజీ డీల్‌!&nbsp;
    కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్‌’ (KGF), ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కేజీఎఫ్‌ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ నటుడు యష్‌ (Yash), డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో స్టార్‌ సెలబ్రిటీలుగా మారిపోయారు. యష్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ పనితనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వీరి కాంబోలో ‘కేజీఎఫ్ 3’ ఉంటుందని గతంలోనే మేకర్స్‌ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ‘కేజీఎఫ్‌ 3’లో కోలివుడ్‌ సూపర్ స్టార్‌ అజిత్‌ కుమార్‌ నటించబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మెుదలయ్యాయి.&nbsp; ‘కేజీఎఫ్‌ 3’లో అజిత్‌! తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'విదా ముయార్చి' (Vidaamuyarchi) మూవీ షూట్‌ను పూర్తి చేసుకున్న అజిత్‌ మరో స్టార్‌ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్‌ ఎవరో కాదు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌. లేటెస్ట్ బజ్‌ ప్రకారం అజిత్‌తో కలిసి ప్రశాంత్‌ నీల్‌ రెండు చిత్రాలు తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి విభిన్నమైన కథాంశం కలిగిన స్టాండలోన్‌ మూవీ కాగా, మరొకటి కేజీఎఫ్‌ యూనివర్స్‌కు లింకప్‌ చేసే కథ అని ప్రచారం జరుగుతోంది. దీంతో 'కేజీఎఫ్‌ 3' చిత్రంలో యష్‌తో పాటు అజిత్‌ కూడా కనిపించబోతున్నట్లు టాక్‌ మెుదలైంది. దీంతో కేజీఎఫ్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. 'కేజీఎఫ్‌ 3' అన్ని రికార్డ్స్‌ను బ్రేక్‌ చేయడం ఖాయమని ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/nitishyadav1801/status/1816002560731287619 టైమ్ పట్టనుందా? అజిత్‌, ప్రశాంత్‌ నీల్‌ చేతిలో ఇప్పటికే ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘విదా ముయార్చి’ తర్వాత అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మంచనుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఇప్పటికే 'సలార్‌ 2' ప్రాజెక్ట్ ఉంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'NTR 31' అనే సినిమాను సైతం అనౌన్స్‌ చేశారు. ఆ రెండు చిత్రాల తర్వాత&nbsp; అజిత్‌తో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అటు కేజీఎఫ్‌ హీరో యష్‌ సైతం ‘టాక్సిక్‌’ (Toxic) అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెుదలైంది. ‘కేజీఎఫ్‌ 3’కి కీలకమైన ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం లేదు. కలెక్షన్ల సునామీ యష్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం 2018 డిసెంబర్‌ 21 విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్‌ నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదల అనంతరం వాటిని అందుకుంటూ వసూళ్లు సునామీ సృష్టించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆపై దీనికి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్‌ 2' అంతకుమించి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1,225–1,250 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో 'కేజీఎఫ్‌ 3'పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    జూలై 24 , 2024
    <strong>SSMB29 Cast: రాజమౌళి బిగ్‌ ప్లాన్‌.. నెగిటివ్‌ రోల్‌లో మహేష్‌.. ఆ రోజున అధికారిక ప్రకటన!</strong>
    SSMB29 Cast: రాజమౌళి బిగ్‌ ప్లాన్‌.. నెగిటివ్‌ రోల్‌లో మహేష్‌.. ఆ రోజున అధికారిక ప్రకటన!
    ఇండియన్‌ ఫిల్మ్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేష్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) సినిమా ఒకటి. గ్లోబల్‌ స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద ఎత్తున అప్‌డేట్స్‌ చక్కర్లు కొట్టాయి. తాజాగా ‘SSMB29’కు సంబంధించిన మరిన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ ద్విపాత్రాభినయం లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘SSMB29’ చిత్రంలో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు. మహేష్‌ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్‌ రోల్‌ చేయలేదు. అయితే తొలిసారి రాజమౌళి అతడ్ని డ్యూయల్‌ రోల్‌లో చూపించబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఇందులోని ఓ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. ఇదే నిజమైతే ‘SSMB29’పై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని చెప్పవచ్చు. మహేష్‌ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఫుల్‌ మీల్స్‌లా మారనుంది.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1810544815492432380 అధికారిక ప్రకటన ఆ రోజే! 'SSMB29' సంబంధించి హీరో మహేష్‌బాబు మినహా ఏ ఇతర నటీనటులను దర్శకుడు రాజమౌళి ప్రకటించలేదు. కనీసం ఇప్పటివరకూ సినిమా లాంచింగ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు మాత్రం చురుగ్గా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆగస్టు 9 మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'SSMB29' సినిమాపై అధికారిక ప్రకటన ఉండొచ్చని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావడంతో పుట్టిన రోజు కానుకగా అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారని స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. దీంతో మహేష్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ వస్తుందా? ఏదైనా ప్రీవిజువల్‌ టీజర్‌ ఉంటుందా? అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మూవీ టీమ్‌లోకి నాజర్‌! తాజాగా మరో ఆసక్తికర వార్త కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబుతో పాటు పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్‌ షాప్‌లో నాజర్‌ పాల్గొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో మహేష్‌ బాబుకు ఆయన విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు కూడా నాజర్‌ ఇదే తరహా సేవలు అందించారు. ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా సంభాషణలు ఎలా పలకాలో ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు నేర్పించారు. స్వతహాగా థియేటర్‌ ఆర్టిస్టు అయిన నాజర్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన బాహుబలిలోనూ బిజ్జలదేవగా తన ఎవర్‌గ్రీన్‌ నటనతో నాజర్‌ ఆకట్టుకున్నారు.&nbsp; https://twitter.com/Fukkard/status/1810503350913585650 విలన్‌గా మలయాళ స్టార్‌! ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మహేష్‌ బాబును ఢీకొట్టే ప్రతినాయకుడి కోసం ఆయన చేస్తున్న కసరత్తు దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 'SSMB29'లో విలన్‌గా మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండొచ్చని అంటున్నారు. కాగా, ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందిన ‘సలార్‌’లోనూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా చేశారు. తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సలార్‌ ప్రమోషన్స్‌ సందర్భంగా చేసిన ఇంటర్యూలో పృథ్వీరాజ్‌ నటనపై రాజమౌళి ప్రసంశలు కురిపించిన వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది.&nbsp; మహేష్‌ లేటెస్ట్‌ లుక్‌ వైరల్‌! ఇటీవల మహేష్‌ బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహేష్‌ బయటకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో మహేష్‌ పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్‌ పెట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్‌ మహేష్‌ లుక్‌కు ఫిదా అవుతున్నారు. ఇది కచ్చితంగా ‘SSMB29’లో మహేష్‌ లుక్‌ అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి చిత్రం కోసం మహేష్‌బాబు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1809857211088212096
    జూలై 09 , 2024
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    మే 22 , 2024
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్‌ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్‌ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్‌ చేయగా.. సీక్వెల్‌లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ను లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ! ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్‌ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; సమంత, తమన్నా లేనట్లే! ‘టిల్లు స్క్వేల్‌’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్‌ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్‌ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.&nbsp; పూజాకు మంచి ఛాన్స్! ఒకప్పుడు బ్లాక్‌ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త&nbsp; బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్‌’లో ఆఫర్‌ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్‌ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్‌ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్‌ సంపాదించే అవకాశం ఉంది.&nbsp; టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా&nbsp; మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
    మే 03 , 2024

    @2021 KTree