UATelugu2h 32m
సూర్యనారాయణ (సత్యరాజ్) నిజాయతీ గల జడ్జి. ఓ కేసులో బాధితులకు న్యాయం చేయలేక వృత్తి నుంచి తప్పుకుంటాడు. ఆయన కొడుకు లక్కీ (గోపిచంద్) పక్కా కమర్షియల్ లాయర్. ఓ కేసు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ తలెత్తుతుంది. దీంతో బాధితుడి పక్షాన నిలబడి తండ్రి కొడుకుతో కోర్టులో పోరాటానికి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
గోపీచంద్
లాయర్ రాంచంద్ (లక్కీ)రాశి ఖన్నా
లాయర్ ఝాన్సీసత్యరాజ్
జస్టిస్ సూర్యనారాయణరావు రమేష్
వివేక్అజయ్ ఘోష్
PA దివాకర్చిత్ర శుక్లా
అమూల్యశుభలేఖ సుధాకర్
జస్టిస్ సుధాకర్ప్రవీణ్
జూనియర్ లాయర్కిరణ్ తలసిల
హర్ష చెముడు
బాలరాజురమణా రెడ్డి
సప్తగిరి
సాయి కృష్ణ
శ్రీకాంత్ అయ్యంగార్
అదితి గౌతమ్
సైరా బాను అకా అమూల్యవరలక్ష్మి శరత్‌కుమార్
సీనియర్ లాయర్ (అతి అతిధి పాత్ర)మారుతి
టైటిల్ సాంగ్‌లో అతిధి పాత్రదేవ్ గిల్
అయూబ్ ఖాన్సిబ్బంది
మారుతి
దర్శకుడుబన్నీ వాసు
నిర్మాతప్రమోద్ ఉప్పలపాటినిర్మాత
వి. వంశీ కృష్ణా రెడ్డినిర్మాత
జేక్స్ బిజోయ్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
2022లో మార్మోగిన దర్శకులు వీరే
]కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ రూపొందించే మారుతి పక్కా కమర్షియల్‌తో బోల్తా పడ్డాడు. కానీ ప్రభాస్‌తో సినిమాతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌ను మోత మోగించారుమారుతి
ఫిబ్రవరి 13 , 2023
Rashi Khanna: జాకెట్ విప్పి హద్దులు దాటిన రాశీ ఖన్నా.. చూసి తట్టుకోవడం కష్టమే!
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna) తన బోల్డ్ ఫొటోలను షేర్ చేసి సోషల్‌మీడియాను తన వైపు తిప్పుకుంది.
తాజా ఫొటోల్లో రాశీ తన హద్దులను చెరిపేసింది. జాకెట్ విప్పేసి మరి లోదుస్తుల్లో దర్శనం ఇచ్చింది. ఈ హాట్ ట్రీట్‌తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రాశీ ఖన్నా క్లీవేజ్ షోకు నెట్టింట భారీ స్పందన వస్తోంది. ఆమె లేటెస్ట్ పిక్స్‌కు పెద్ద ఎత్తున లైక్స్, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ పేరు #RaashiiKhanna హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.
గతంలో కంటే రాశీ మరింత హాట్‌గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.
సౌత్ నుంచి నార్త్ వరకూ వరుస సినిమాలతో సత్తా చాటిన రాశీ ఖన్నా.. ఇటీవల తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది.
కానీ, ఆ రెండూ డిజాస్టర్‌గా మిగలడంతో ఈ బ్యూటీ (#RaashiiKhanna)కి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఇటీవల పెద్ద సినిమా ప్రాజెక్టులు ఏవి ఆమె వద్దకు వెళ్లలేదు.
అటు తమిళంలో రీసెంట్‌గా 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్' చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే సినిమాలో మెరిసింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సరసన ఓ సినిమాలో రాశీ నటిస్తోంది. ఈ చిత్రానికి నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాశీతో పాటు శ్రీనిధి శెట్టి కూడా ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.
అలాగే హిందీలో ఈ చిన్నది 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'అరన్మనై 4', 'మేథావి' అనే చిత్రాలతో రాశీ బిజీ బిజీగా ఉంది.
కెరీర్ ప్రారంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా (Rashi Khanna) తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.
జోరు, శివం, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి రాశి (#RaashiiKhanna) మెప్పించింది.
రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో కలిసి రుద్ర (Rudra Series) వెబ్‌సిరీస్ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ సిరీస్‌లోను రాశి మెరిసింది.
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా ఫ్యాన్స్‌కు షేర్ చేస్తోంది.
మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు నెట్టింట తరచూ హైలెట్ అవుతూనే వస్తోంది.
జనవరి 30 , 2024
5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్ చేశారో ఓ సారీ చూద్దాం.
ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.
భరత్ అనే నేను
పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్ బాబు.. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
లీడర్
దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
నేనే రాజు నేనే మంత్రి
విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు.
నోటా
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.
యాత్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.
ఏప్రిల్ 20 , 2023
Rashi Khanna: టైట్ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది
తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది.
జోరు, శివం, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో నటించి రాశి మెప్పించింది.
గతేడాది 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో రాశీ అలరించింది. తమిళంలోనూ తిరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరం పాటించిన రాశి గత కొంత కాలంగా ఆ హద్దులు చెరిపేసింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో కలిసి రుద్ర వెబ్‌సిరీస్ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను రాశి మెరిసింది.
ఇటీవల కాలంలో రాశి సినిమాల జోరు తగ్గింది. దీంతో తన అందాల ఆరబోత ద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని రాశి చూస్తోంది.
ఏప్రిల్ 03 , 2023
Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్ స్టార్ మూవీ.. ‘రామ్ నగర్ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, దర్శకత్వం : శ్రీనివాస్ మెహత్
సంగీతం : అశ్విన్ హేమంత్
సినిమాటోగ్రఫీ : అస్కర్ అలీ
ఎడిటిర్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: ప్రభాకర్, మలయజ ప్రభాకర్
విడుదల తేదీ: 04-10-2024
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ (Prabhakar) కుమారుడు చంద్రహాస్ (Chandrahas) యాటిట్యూడ్ స్టార్ (Attitude Star)గా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్ చిత్రం 'రామ్ నగర్ బన్నీ' గురించి కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్ అంటూ చంద్రహాస్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాటిట్యూడ్ స్టార్ హిట్ కొట్టాడా? హీరోగా ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీ (చంద్రహాస్)కి అమ్మాయిలు అంటే వీక్‌నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఏకంగా ముగ్గురితో (విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి)తో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు లవ్ ట్రాక్ నడిపిస్తాడు. అనుకోని పరిస్థితులు ఎదురై పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి సైతం మాటిస్తాడు. ఆమె కంపెనీలోనే ఉద్యోగానికి కూడా చేరతాడు. అయితే ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని బన్నీ గ్రహిస్తాడు. తను నిజంగా ప్రేమిస్తోందని శైలు (విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే శైలుకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు బన్నీ ఏం చేశాడు? శైలు ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నటుడు చంద్రహాస్ పలు వేదికలపై చూపించిన యాటిట్యూడే ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. నటుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ నటన పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా భయం, బెరుకు లేకుండా నటించాడు. డ్యాన్స్, పైట్స్‌లో అదరగొట్టాడు. రొమాంటిక్ సీన్స్‌లోనూ మెప్పించాడు. శైలుగా చేసిన విస్మయ శ్రీ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్ర దారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శ్రీనివాస్ మహత్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ‘రామ్ నగర్ బన్నీ’ని తెరకెక్కించారు. చంద్రహాస్ కోసమే ఈ కథను రాసినట్టుగా అనిపిస్తుంది. సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జోడించి ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా జులాయిగా తిరిగే సాధారణ కుర్రాడిగా చూపించి సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్‌ను కలగలిపి పక్కా కమర్షియల్ మూవీగా తీర్చిదిద్దారు. సాగదీత సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌లో చంద్రహాస్ తడబాటు కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికొస్తే మూడు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
చంద్రహాస్ నటనకమర్షియల్ హంగులుసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలుపేలవమైన ఎమోషనల్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 04 , 2024
Viswam Movie: గోపిచంద్ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హవా నడుస్తోంది. డార్లింగ్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ పేరు దేశంలో మారుమోగుతోంది. ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకూ ప్రభాస్ నామస్మరణలతో ఇండస్ట్రీలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. తన మిత్రుడు గోపిచంద్ కోసం ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్‌తో ఎలివేషన్స్!
మ్యాచోస్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ (Prabhas) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమా భాగస్వామ్యం అవ్వడం నిజమేనని తెలుస్తోంది. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా ప్రభాస్ ఈ మూవీలో పాలుపంచుకుంటాడని టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ ఇంట్రడక్షన్ సీన్‌కు ప్రభాస్ తన వాయిస్‌తో ఎలివేషన్ ఇస్తాడని అంటున్నారు. ప్రభాస్ ఇప్పటివరకూ ఓ సినిమాలో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. స్నేహితుడైన గోపిచంద్ కోసమే ప్రభాస్ ఇందుకు ఓకే చెప్పినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్, గోపిచంద్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేనా!
హీరో గోపిచంద్ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన గత చిత్రాలు ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు భీమా, రామబాణం, పక్కా కమర్షియల్, ఆరడుగుల బుల్లెట్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో గోపిచంద్‌కు సక్సెస్ తప్పనిసరిగా మారింది. అటు దర్శకుడు శ్రీను వైట్ల సైతం ఒకప్పటిలా బ్లాక్‌బాస్టర్స్ ఇవ్వలేకపోతున్నాడు. 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకూ శ్రీను వైట్లకు రాలేదు. దీంతో అతడు కూడా 'విశ్వం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌ను సినిమాలో భాగం చేయడం ద్వారా 'విశ్వం'పై హైప్ తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను సంప్రదించి అతడి ద్వారా హీరోకు ఎలివేషన్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో? లేదో? చూడాలి.
ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్
ప్రభాస్ గోపిచంద్ ఎంత మంచి మిత్రులో ఇండస్ట్రీ మెుత్తం తెలుసు. ‘వర్షం’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు తొలిసారి కలిసి నటించారు. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపిచంద్ విలన్‌గా అలరించారు. అప్పటి నుంచి వీరి స్నేహం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆహా వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్ షోలో వీరిద్దరు పాల్గొని హోస్ట్ బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరిద్దరిని తొలిసారి ఒక షోలో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు. ప్రభాస్, గోపిచంద్ మంచి ఫ్రెండ్స్ అని తెలుసుగానీ, మరి ఈ స్థాయి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఈ ఎపిసోడ్ తర్వాతనే తెలిసిందని చాలా మంది నెటిజన్లు పోస్టులు సైతం పెట్టారు.
https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA
‘విశ్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
గోపిచంద్, శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న 'విశ్వం' చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్ (Kavya Thapar) నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో రంజాన్ కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
https://www.youtube.com/watch?v=1LoKTtrxjmM
జూలై 16 , 2024
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y
https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
ఏప్రిల్ 28 , 2023
AKHIL AGENT REVIEW: ఏజెంట్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్ అయ్యిందా ?
అఖిల్ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు
సంగీతం: హిపాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
కథేంటి?
రిక్కీ ( అఖిల్ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్ ప్రారంభించిన మాఫియా డాన్ ది గాడ్ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ.
ఎలా ఉంది?
సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్ ఫామ్ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.
తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.
సెకాండాఫ్ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్ కొడతాయి. హైవోల్డేజ్ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్ లెవల్.
ఎవరెలా చేశారు
సినిమాకు పెద్ద అసెట్ అఖిల్ అక్కినేని. తన రోల్ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్ ఏజెెంట్‌గా అతడి లుక్ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్ డ్రామాలు సెట్ కాలేదు.
సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సాంకేతిక పనితీరు
ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్ స్టోరీ ఇది.
ఏజెంట్ చిత్రానికి మరో మెనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్ తమీజా ఒక్క చాట్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఎడిటింగ్ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
బలాలు
అఖిల్
యాక్షన్ సీన్స్
బలహీనతలు
కథ
కథనం
సంగీతం
రేటింగ్ : 2.5/5
ఏప్రిల్ 28 , 2023
100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలివే!!
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.
హీరో -సినిమాలు
హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్4ఎన్టీఆర్ 4చిరంజీవి 3రామ్ చరణ్ 3పవన్ కల్యాణ్3బాలకృష్ణ 2
మహేశ్ బాబు
100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు
ప్రభాస్
ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్ నుంచే రావాలి.
సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్151 కోట్లు
చిరంజీవి
ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్ క్రేజ్‌కు నిదర్శనం
సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు
అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ సినిమా కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.
సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు
రామ్ చరణ్
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.
సినిమాకలెక్షన్RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు
జూ. ఎన్టీఆర్
RRRతో రామ్ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్. తనకున్న వాక్ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.
సినిమాకలెక్షన్RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్126 కోట్లు
పవన్ కల్యాణ్
టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.
సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్ 161 కోట్లువకీల్ సాబ్138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు
బాలకృష్ణ
అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.
సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు
మరికొన్ని సినిమాలు
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి.
సినిమాహీరో కలెక్షన్F2 వెంకటేశ్-వరుణ్ తేజ్143 కోట్లుగీత గోవిందంవిజయ్ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు
పాత రోజుల్లో సినిమా హిట్ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్ జుబ్లీ, 100 డేస్ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్ అయిపోయింది. హిట్ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html
https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
ఏప్రిల్ 26 , 2023
Family Star First Review: మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్.. ‘ఫ్యామిలీ స్టార్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు
రచన & దర్శకత్వం : పరుశురామ్ పెట్ల
సంగీతం : గోపి సుందర్
ఛాయా గ్రహణం : కె.యు మోహనన్
ఎడిటింగ్ : మార్తండ్ కె. వెంకటేష్
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2024
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star Review In Telugu). నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్‌తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను అందించిందా? వంటి అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) మధ్య తరగతి యువకుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్‌లోనే పనిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో ఊహించని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికందుతుంది. ఆ పుస్తకం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇంతకీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ తన కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
నటుడు విజయ్ దేవరకొండ (Family Star Review In Telugu) ఎప్పటిలాగానే తన మార్క్ యాటిట్యూడ్‌తో ఈ మూవీలోనూ అదరగొట్టాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో జీవించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో తన మార్క్ చూపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నా... తనదైన స్టైల్‌లో మెప్పించాడు. విజయ్- మృణాల్ మధ్య వచ్చే సీన్లు.. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. తన నటనతో పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ - మృణాల్ మధ్య కెమెస్ట్రీ వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక వాసుకి, రోహిణి అభినయ, అజయ్ ఘోష్, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ పరుశురామ్.. ఫ్యామిలీ స్టార్ ద్వారా మరోమారు తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్ ఫ్యామిలి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలతో నింపేసిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ అంశాలు మేళవించి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా విజయ్- మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే ఇగో తాలుకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు పరుశురామ్. అయితే ఇదే ఫ్లోను సెకండాఫ్‌లో ఇంకాస్త కొనసాగిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్‌లో విజయ్- మృణాల్ మధ్య వచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రొటిన్ కథను ఎంచుకోవడం, డైలాగ్స్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Family Star Review In Telugu).. విజయ్-పరుశురామ్ కాంబోలో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ మూవీకి మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇంట్రోసాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా, నందా నందన సాంగ్స్ ఫీల్ గుడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్ అద్భుత పనితీరు కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దిల్‌రాజు ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్ - మృణాల్ కెమెస్ట్రీఎమోషనల్ సీన్స్‌కామెడీ
మైనస్ పాయింట్స్
రొటిన్ కథసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vijay-devarkonda.html
ఏప్రిల్ 08 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది!
తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్‌తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్‌తో కూడిన కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్‌లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటంటే..
భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్ ఖాన్ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు.
సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు ఆ బుడ్డోడికి షారుఖ్ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్ రాథోడ్‌కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే?
ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్‌కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో షారుఖ్ లుక్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
విలన్‌గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.
నయనతార షారుఖ్‌తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు.
ఎలా ఉందంటే?
డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్‌ను చాలా ఎంగేజింగ్ నడిపించి ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు. ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.
సెకండాఫ్‌లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.
టెక్నికల్ పరంగా
జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్‌లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు.
బలాలు:
షారుఖ్ నటన
ఇంటర్వల్ ట్విస్ట్
క్లైమాక్స్ సీన్స్
BGM
బలహీనతలు
సెకాండాఫ్‌లో ముందే ఊహించదగిన సీన్లు
చివరగా:
జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్‌లు లాజిక్‌లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్‌ను పరిచయం చేస్తుంది.
రేటింగ్
4/5
సెప్టెంబర్ 07 , 2023
Gorre Puranam Review: రెండు మతాలకు ఒక గొర్రె టార్గెట్ అయితే.. సుహాస్ కొత్త చిత్రం మెప్పించిందా?
నటీనటులు : సుహాస్, విషికా కోట, పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు
డైరెక్టర్ : బాబీ వర్మ
సంగీతం : పవన్. సీహెచ్
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్ : వంశీ కృష్ణ రావి
నిర్మాత : ప్రశాంత్ మాండవ
విడుదల తేదీ : 21-09-2024
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళతాడు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లిపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. అది తప్పించుకోవడంతో గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరి కొంతమంది పడతారు. ఈ క్రమంలో ఆ గొర్రె ఒక గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం కాస్త మీడియా దృష్టికి వెళ్తుంది. దీంతో మతకలహాలు రేకెత్తిస్తోంది అంటూ గొర్రెను పోలీసులు అరెస్టు చేస్తారు. రవి సెల్‌లోనే దాన్ని ఉంచుతారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్‌కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో సుహాస్ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. ఉన్నంతలో అతడు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన సహజసిద్ధమైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాలో నటీనటుల కంటే గొర్రె ఎక్కువసేపు కనిపిస్తుంది. దానికి ఎంతో ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చి నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ నవ్వులు పూయించాడు. కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఓ గొర్రెకు డబ్బింగ్ చెప్పాడు. మిగతా పాత్రల్లో కనిపించిన కమెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ల పాత్రల నిడివి తక్కువే అయినా కథపై ప్రభావం చూపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బాబీ వర్మ ఒక గొర్రెను ప్రధాన పాత్రధారిగా తీసుకొని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? లాంటి విషయాలను వ్యాగ్యంగా చెబుతూనే కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఈ క్రమంలో ప్రజలు, రాజకీయ నేతలు, మీడియాపై గట్టిగానే సెటైర్లు వేశారు. ఒక పక్కన నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సుహాస్ పాత్రను తీర్చిదిద్దానం విధానం కూడా బాగుంది. అయితే అతడు ఎందుకు హత్య చేశాడు? మరో ముగ్గుర్ని ఎందుకు చంపాలని అనుకున్నాడు? అన్నది కనెక్టింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
సుహాస్ నటనకథ, కథనండైలాగ్స్
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంవర్కౌట్ కాని ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 21 , 2024
Amyra Dastur: ఎద పొంగులతో పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న అమైరా దస్తూర్!
బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ (Amyra Dastur) తన అందచందాలతో దడ పుట్టిస్తోంది. ఎద పొంగులను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.
తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ భామ.. గోధుమ రంగు డిజైనర్ జాకెట్‌లో హోయలు పోయింది. చున్నీని చేతికి చుట్టి మరి అందాల ప్రదర్శన చేసింది.
మ్యాచింగ్ హారం, చమ్కీలు ధరించి నెటిజన్ల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అమైరా దస్తూర్‌ను ఇలా చూస్తుంటే పాలరాతి శిల్పమే గుర్తుకు వస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అమైరా దస్తూర్ (Amyra Dastur) వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 07 మే, 1993లో జన్మించింది. ముంబయిలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
కెరీర్‌లో ప్రారంభంలో మోడల్‌గా పనిచేసినా ఈ భామ.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
2013లో మనీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన 'ఇసాక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేత్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో ధనుష్ పక్కన ‘అనేగన్’ మూవీలో నటించింది.
ఆ చిత్రం తెలుగులో ‘అనేకుడు’ పేరుతో డబ్బింగ్ అయ్యింది. కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాలేదు. కానీ, అమైరా (Amyra Dastur) నటనకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
ఆ తర్వాత హిందీలో మిస్టర్ ఎక్స్ (Mr. X) ఈ బ్యూటీ.. ఆపై జాకీచాన్‌తో 'కుంగ్ ఫూ యోగా' అనే హాలీవుడ్ చిత్రంలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
2018లో ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటించి మరోమారు వెండి తెరపై మెరిసింది. ‘మనసుకు నచ్చింది’, ‘రాజు గాడు’ చిత్రాల ద్వారా మరోమారు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు దక్కలేదు. దీంతో అమైరా తన ఫోకస్ మెుత్తం బాలీవుడ్‌పై పెట్టింది.
అక్కడ వరుస సినిమాలతో (Amyra Dastur) బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. వరుస సినిమాలతో వారికి మరింత దగ్గరైంది.
అమైరా వరుసగా ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘ప్రస్థానం’, ‘మేడ్ ఇన్ చైనా’, ‘కోయీ జానే నా’, ‘జోగి’ వంటి చిత్రాల్లో తళుక్కుమంది.
గతేడాది ప్రభుదేవ సరసన బఘీరా చిత్రంలో ఆమె నటించింది. పంజాబీలో 'ఎనీ హౌ మిట్టి పావ్' ప్రస్తుతం ఆమె నటిస్తోంది.
ఈ భామ పలు బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లలోనూ మెరిసింది. 2018లో 'ది ట్రిప్ 2' సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత 'తాండవ్' సిరీస్‌లో అడా మిర్ పాత్ర, బొంబాయ్ మేరి జాన్ సిరీస్‌లో పారి పటేల్ పాత్రలో కనిపించి ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ అమైరా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉల్లాసపరుస్తోంది.
ఫిబ్రవరి 02 , 2024
Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
డైరెక్టర్: బోయపాటి శ్రీను
సంగీతం: ఎస్‌ఎస్ తమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది. అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు. మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్
బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్ నుంచి కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.
బలం
బోయపాటి మార్క్ డైరెక్షన్
రామ్ మాస్ యాక్టింగ్
శ్రీలీల అందం
థమన్ BGM
బలహీతనలు
అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు
చివరగా:
మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్ 4/5
సెప్టెంబర్ 28 , 2023
Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్.. మరి సినిమా హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు.
డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20
ఎలా ఉంది?
కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.
https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20
ఎవరెలా చేశారు?
జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.
టెక్నికల్‌గా..
గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్ బాగున్నాయి.
https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20
పాజిటివ్ పాయింట్స్
రజినీ ఎలివేషన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
డార్క్ కామెడీ
నెగెటివ్ పాయింట్స్
బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 2.75/5
ఆగస్టు 11 , 2023
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : సుధీర్ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్ సుందరం, శశాంక్, సాయి చంద్, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు
దర్శకత్వం : అభిలాష్ కంకర
సంగీతం : జై కృష్ణ
సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి
ఎడిటింగ్ : అనిల్ కుమార్. పి
నిర్మాత : సునీల బలుసు
విడుదల తేదీ: 11-10-2024
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రకాష్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్ బాబు)ని స్టాక్ బ్రోకర్ శ్రీనివాస్ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్ సుధీర్ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్ మిస్ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్ కంకర ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్ మెుత్తం సుధీర్ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్లో న్యారేషన్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్ రిలీజ్ చేసిన దేవర టీమ్ మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్‌నూ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తారక్ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూయల్ అంటే ఫసక్కేనా!
‘దేవర’ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్’ కేవలం రెండు కోట్ల మార్జిన్ (రూ.28 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. అయితే తారక్ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.
‘దేవర’ హిట్ కష్టమేనా!
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్ చెక్ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్!
తారక్ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడే ప్రమాదం ఉంది.
దేవర ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.
https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
సెప్టెంబర్ 11 , 2024
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024