• TFIDB EN
 • పలాస 1978
  ATelugu2h 24m
  భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వీరిద్దరు నిర్ణయించుకుంటారు.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  రక్షిత్ అట్లూరి
  మోహన్ రావు
  ప్రవిన్ యెండమూరితారకేష్
  జనార్ధన్పెద్ద దొర లింగ మూర్తి
  విజయ్ రామ్
  సెబాస్టియన్
  తిరువీర్
  రం
  లక్ష్మణ్ మీసాలదండాసి
  కంచరపాలెం రాజు
  సత్య నారాయణ
  జగదీష్ ప్రతాప్ బండారి
  ముత్యాలు
  మిర్చి మాధవిశ్రీ లక్ష్మి
  తన్మై బోల్ట్as Gajula Gowri
  షణ్ముక్గణపవసు
  షెరిన్ సంతోష్జగ్గమ్మ
  సిబ్బంది
  కరుణ కుమార్
  దర్శకుడు
  ధ్యాన్ అట్లూరినిర్మాత
  రఘు కుంచెసంగీతకారుడు
  కోటగిరి వెంకటేశ్వరరావు
  ఎడిటర్
  కథనాలు
  Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
  Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి! 
  ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.  కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.  మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.  మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.  కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.  మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
  మే 04 , 2024
  కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  'తొలి చూపులోనే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. కళ్యాణ్ రామ్ ముద్దు పేరు? కళ్యాణ్ బాబు కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత? 5 అడుగు 11 అంగుళాలు కళ్యాణ్ రామ్ తొలి సినిమా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా 'తొలిచూపులోనే'  కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు? జులై 5, 1978 కళ్యాణ్ రామ్ భార్య పేరు? స్వాతి కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఆగస్టు 10, 2006 కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్? సాయిపల్లవి, శ్రీదేవి కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో? Sr.NTR, రజనీకాంత్ కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా? అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి. కళ్యాణ్‌ రామ్‌కు ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లాక్ కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా? దానవీర సూరకర్ణ కళ్యాణ్ రామ్ తల్లి పేరు? లక్ష్మి హరికృష్ణ కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం? కేరళ, మనాలి కళ్యాణ్ రామ్ చదువు? MS(USA) కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు.  కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం? చేపల కూర కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?  దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్ అభిరుచులు? బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం కళ్యాణ్ రామ్ వ్యాపారాలు? NTR క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)? రూ.110కోట్లు https://www.youtube.com/watch?v=xmZT13t7xxI
  మార్చి 21 , 2024
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
  టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్  డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.  శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.  పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.  రాజమౌళి ఆసిస్టెంట్  డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.  అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.  ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.  రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. 
  ఏప్రిల్ 06 , 2023
  Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
  Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
  దృశ్యం సినిమాలో వెంకటేష్‌ చిన్న కూతురిగా క్యూట్‌గా మెప్పించిన నటి ఎస్తర్‌ అనిల్‌ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్‌ డోసును అమాంతం పెంచేసి సొదసుల విందు చేస్తోంది. తాజాగా లాంగ్‌ స్కర్ట్‌పై క్లీవేజ్‌ షోతో కైఫెక్కిస్తోంది.  టైట్‌ ఫీట్ జాకెట్‌ ధరించిన ఈ భామ ఎద అందాలను ఆరబోసింది. నాభి అందాల ఆలంబనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్తర్ అనిల్ పసందైన పరువాలను  చూసిన నెటజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. తద్వారా ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది. లెలేత పరువాలతో ఓలలాడిస్తున్న ఈ మలయాళి తెగింపుకు.. ఇన్‌స్టాలో 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఏ డ్రెస్ వేసినా తనలోని అందాల కోణాలను మాత్రం కసిగానే చూపిస్తోంది.. ఈ కొంటె అందం.  మెున్నటిదాకా చిన్నపిల్లలా కనిపించిన ఎస్తర్‌ అప్పుడే ఇంత పెద్దదయ్యిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.  క్యూట్ లుక్స్‌లో కనిపించిన ఎస్తర్‌.. ఇప్పుడు హాట్‌ బ్యూటీగా మారిందంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎస్తేర్ అనిల్  ఆగస్టు 27 (2001)  కేరళలోని వాయనాడ్‌లో జన్మించింది. మలయాళంలో పాపనాశం(దృశ్యం) 2016 సినిమాలో నటించినందుకు గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు సొంతం చేసుకుంది. 2010లో 'నల్లవన్‌' అనే మలయాళం సినిమాతో ఎస్తర్‌ సినీ రంగ ప్రవేశం చేసింది.  మలయాళంలో వచ్చిన పాపనాశం చిత్రం ఎస్తర్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.  తెలుగు, తమిళం రీమేక్‌గా వచ్చిన దృశ్యం 1, 2 సినిమాల్లోనూ ఎస్తర్‌నే తీసుకున్నారు.  తాజాగా తమిళ్‌లో రిలీజైన వింధ్య బాధితుల తీర్పు V3లోనూ నటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఈ హాట్ క్యూటీ ఎదురు చూస్తోంది. అందులో భాగంగానే హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది
  జూలై 10 , 2023
  Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
  Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
  తమిళ్ హీరోయిన్  ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది.  సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది  వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది. తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది 1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది. తమిళ్‌లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది ప్రియా భవాని శంకర్ జయంరవికి జంటగా నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్‌ సరసన నటించిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా ఎస్‌ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
  జూన్ 19 , 2023
  ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్‌ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
  ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్‌ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ నటించిన సూపర్ హిట్‌ మూవీ డుంకీ చిత్రంలోని లుట్‌ ఫుట్ గయా పాటను మంచి రిదమ్‌తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్‌ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్‌ ఖాన్‌కు చేరింది. అయాన్ టాలెంట్‌పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.  అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్‌ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్‌ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.  అయితే ఈ మధ్య అల్లు అర్జున్‌తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్‌ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ  డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్‌లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్‌లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్‌కు  గొప్ప భవిష్యత్‌ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20  ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20 టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్‌ అవతార్‌లో షారుక్‌ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్‌ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్‌గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్‌పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.  https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20 తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
  ఫిబ్రవరి 26 , 2024
  Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
  Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
  హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్‌ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి. ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటోంది. అఖండ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. తనను తాను నిరూపించుకోవడం కోసం సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ కొంటెది పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ తృప్తిపడుతోంది. ప్రగ్యా పర్సనల్ విషయానికొస్తే.. 1991 జనవరి 12న జన్మించింది. తెలుగులో 2015లో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది.   హిందీలోనూ టిటూ MBA సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో కంచె తర్వాత నక్షత్రం (2017),  మంచు విష్ణుతో చేసిన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు విజయం సాధించలేకపోయాయి.   చాలా రోజుల తర్వాత అఖండతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. బ్లాక్‌ బాస్టర్ హిట్లు సాధించినా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
  ఆగస్టు 20 , 2023
  Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
  Ugadi Special Movie Posters: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
  ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   సరిపోదా శనివారం నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్‌ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్‌ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.  RT 75 ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ మౌళి ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది.  https://twitter.com/i/status/1777920829575078381 అరణ్మనై 4  రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్‌ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కమిటీ కుర్రోళ్లు నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్‌ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్‌ హీరో సాయి దుర్గా తేజ్‌ అనౌన్స్‌ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. https://twitter.com/i/status/1777941376782786758 ధూం ధాం చైతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్‌ తెరకెక్కిస్తున్నారు.  ఏ మాస్టర్‌ పీస్‌  సుకు పూర్వజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్‌ పీస్‌' (A Master Peace). అరవింద్‌ కృష్ణ, జ్యోతి పుర్వాజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్‌ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవకి నందన వాసుదేవ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్‌ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది. భలే ఉన్నాడే! యువ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.  ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్‌ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  కృష్ణమ్మ  సత్యదేవ్‌ (Satya Dev) లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్‌ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్‌ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. 
  ఏప్రిల్ 10 , 2024
  New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
  New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
  శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.   కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.  కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.  https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.  గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి  ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా  మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.  సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. 
  మార్చి 09 , 2024
  This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
  This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
  ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.  భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
  మార్చి 04 , 2024
  This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
  This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్‌ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
  ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు భ్రమయుగం మలయాళం సూపర్ స్టార్‌ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా  రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని ఫైల్స్‌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.  ఊరు పేరు భైరవకోన సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సైరెన్‌ జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్‌ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రం ‘సైరెన్‌’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నాసామి రంగ ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  ది కేరళ స్టోరీ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
  ఫిబ్రవరి 12 , 2024
  Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
  Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
  కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా మరికొన్ని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్‌ వాటెండ్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  గుంటూరు కారం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.  హనుమాన్ ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్‌. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్‌ విడుదల కానుంది.  భారతీయుడు 2 అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు.  పుష్ప 2 సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్‌-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గేమ్‌ ఛేంజర్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  కల్కి 2898 ఏడీ సలార్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్‌ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. స్పిరిట్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్‌ 'స్పిరిట్‌' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్‌ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్‌ స్టార్‌ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెలియజేశారు. 
  డిసెంబర్ 30 , 2023
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.  అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.  విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
  డిసెంబర్ 11 , 2023
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. డిసెంబర్‌ 11 - 17 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు పిండం శ్రీరామ్‌ లేటెస్ట్‌ హారర్‌ మూవీ ‘పిండం’ (Pindam) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సాయికిరణ్‌ దైదా తెరకెక్కించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ‘మరణం అనేది నిజంగానే అంతమా? కోరికలు తీరని ఆత్మలు మనకు నిజంగానే హాని చేయగలవా?’ అంటూ ఇటీవల విడుదల చేసిన ప్రచారం చిత్రం భయపెడుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. కలశ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కలశ’ (Kalasa) ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. కొండా రాంబాబు తెరకెక్కించిన చిత్రాన్ని రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జోరుగా హుషారుగా విరాజ్‌ అశ్విన్‌ హీరోగా అను ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’ (joruga husharuga). నిరీష్‌ తిరువిధుల నిర్మాతగా వ్యవహరించారు. పూజిత పొన్నాడ కథానాయిక. ‘బేబీ’తో ఆకట్టుకున్న విరాజ్‌ హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెంచేశాయి. యువతను మెప్పించేలా ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. డిసెంబరు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తికమక తాండ కవలలైన హరికృష్ణ, రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రం ‘తికమక తాండ’(tikamaka tanda). యాని, రేఖ నిరోషా కథానాయికలు. వెంకట్‌ దర్శకత్వం వహించారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చే క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘చే’. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం చెప్పుకోతగ్గ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ కావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపై పడింది. సరిగ్గా దీన్ని వినియోగించుకుంటున్న ఓటీటీ సంస్థలు ఈ వారం ఏకంగా 32 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో వీక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉండటం విశేషం. ఈవారం రిలీజ్‌ కాబోతున్న వాటిలో ముఖ్యమైనవి ఏవో ఇప్పుడు చూద్దాం.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTiger 3MovieTelugu/HindiAmazon PrimeDec 12Deaths GameSeriesEnglishAmazon PrimeDec 15Reacher Season 2SeriesEnglishAmazon PrimeDec 15FalimyMovieMalayalamDisney+HotstarDec 15The Freelancer Season 2SeriesHindiDisney+HotstarDec 15Japan MovieTeluguNetflixDec 11Single Inferno Season 3SeriesEnglish/KoreanNetflixDec 12The Crone Season - 6MovieEnglishNetflixDec 14Sesham Mike-il FathimaMovieMalayalamNetflixDec 15YellowMovieEnglishNetflixDec 15UstaadTv ShowTeluguEtv WinDec 15The BlackeningMovieEnglishJio CinemaDec 15Koose Munisamy VeerappanSeriesTelugu/TamilZee 5Dec 14
  డిసెంబర్ 11 , 2023
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచిసెప్టెంబర్‌ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు జవాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు జైలర్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘జైలర్‌’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు.   TitleCategoryLanguagePlatformRelease DateShane GillisMovieEnglishNetflixSep 05Scout’s HonorMovieEnglishNetflixSep 05kung fu panda 3SeriesEnglishNetflixSep 07top boy season 2SeriesEnglishNetflixSep 07One shotSeriesEnglishAmazon primeSep 07Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06i'm groot season 2SeriesEnglishDisney + HotstarSep 06LoveMovieTamilAhaSep 08Love on the roadMovieEnglishBook My ShowSep 08 .
  సెప్టెంబర్ 04 , 2023

  @2021 KTree