• TFIDB EN
  • పరాక్రమం
    UATelugu
    లోవరాజుకు నాటకాలంటే ఇష్టం. తండ్రి రాసిన పరాక్రమం అనే నాటకాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో వేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నగరానికి వస్తాడు. మరి నాటకం వేశాడా? లోవరాజు లవ్‌ స్టోరీ ఏంటి? తన తండ్రి సత్తిబాబు రాసిన పరాక్రమం కథేంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Sep 133 months ago
    పరాక్రమం చిత్రం ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    బండి సరోజ్ కుమార్
    శృతి సమన్వి
    నిఖిల్ గోపు
    నాగ లక్ష్మి యెల్లాగుల
    మోహన్ సేనాపతి
    సిబ్బంది
    బండి సరోజ్ కుమార్దర్శకుడు
    బండి సరోజ్ కుమార్నిర్మాత
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
    Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
    తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్‌ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో  సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు. ఈ ప్రమోషనల్‌ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్‌ యూసుఫ్‌ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని  ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్‌, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు. నిషాద్‌ యూసుఫ్‌ తెలుగు, తమిళ్‌ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.  నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు  తెలిపారు. మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.   రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు. 
    అక్టోబర్ 30 , 2024
    <strong>Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!</strong>
    Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
    సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్‌ ఇండిలిజెన్స్‌)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.&nbsp; రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.&nbsp; ధూమ్‌ 4 విలన్‌గా సూర్య! హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్‌ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్‌ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్.
    అక్టోబర్ 14 , 2024
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; తండేల్‌ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్‌' (Thandel). ఈ సినిమా టైటిల్‌ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్‌ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్‌' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; డంకీ (DUNKI) బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్‌ 21న విడుదల కానుంది.&nbsp; తంగలాన్‌ చియాన్‌ విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.&nbsp; కంగువ స్టార్‌ హీరో సూర్య అప్‌కమింగ్‌ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.&nbsp; మట్కా వరణ్‌తేజ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.&nbsp; జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్‌ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.&nbsp; అయలాన్‌ శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్‌ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 25 , 2023
    <strong>ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?</strong>
    ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?
    నటీనటులు: టొవినో థామస్‌, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి, బసిల్‌ జోసెఫ్‌, జగదీష్‌, కబీర్‌ దుహాన్‌సింగ్‌ తదితరులు దర్శకత్వం: జితిన్‌ లాల్‌ రచన: సుజిత్‌ నంబియార్‌ సంగీతం : థిబు నినన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌ మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్‌ రోల్‌లో నటించిన ‘మిన్నల్‌ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'ఎ.ఆర్‌.ఎమ్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టొవినో థామస్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. మల‌యాళంలో ‘అజ‌యంతే రండ‌మ్ మోష‌న‌మ్’ (ఎ.ఆర్‌.ఎమ్‌) పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగులో ‘అజ‌య‌న్ చేసిన రెండో దొంగ‌త‌నం’ అని అర్థం. కాగా, పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన 'ఏఆర్ఎం' మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? టొవినో థామస్‌ ఖాతాలో మరో విజయం నమోదైనట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అజ‌య్ (టొవినో థామ‌స్‌) ఊళ్లో చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ త‌ల్లి (రోహిణి)తో క‌లిసి జీవిస్తుంటాడు. తాత మ‌ణియ‌న్ (టొవినో థామ‌స్‌) ఒక‌ప్పుడు పేరు మోసిన దొంగ కావడంతో ఊళ్లో ఎక్క‌డ దొంగ‌త‌నం జ‌రిగినా అజ‌య్‌ని అనుమానిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం (విగ్రహం) బంగారం కంటే ఎంతో విలువైంది. దాన్ని కాజేయాల‌నే ల‌క్ష్యంతో సుదేవ్‌వ‌ర్మ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఆ ఊళ్లో అడుగుపెడతాడు. దీపాన్ని కొట్టేసి ఆ నింద అజ‌య్‌పై ప‌డేలా ప్లాన్‌ చేస్తాడు. అయితే ఎన్నో త‌ర‌త‌రాలుగా ఆ దీపాన్ని అజ‌య్ కుటుంబం రక్షిస్తూ వస్తుంది. మ‌రి ఈసారి అజ‌య్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్ర‌హం వెనకున్న చ‌రిత్ర ఏంటి? ఆ చ‌రిత్ర‌లో మహావీరుడు కుంజికేలు (టొవినో థామ‌స్‌) పాత్ర? ల‌క్ష్మి (కృతిశెట్టి)తో అజ‌య్ లవ్‌ ట్రాక్‌? గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే టొవినో థామ‌స్ మూడు పాత్ర‌లపై గ‌ట్టి ప్ర‌భావం చూపించారు. వీరుడైన కుంజికేలుగా అతడు ప్ర‌ద‌ర్శించిన యుద్ధ విద్య‌లు, చేసిన పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. తాత మ‌ణియ‌న్ పాత్రలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఆ రెండు పాత్ర‌ల్లో టొవినో ఎంత వీరోచితంగా నటించాడో అజ‌య్ పాత్ర‌లో అంతే సాత్వికంగా చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రతీ పాత్రలో వైవిధ్యం చూపించి నటనలో తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. అటు ల‌క్ష్మి పాత్ర‌లో కృతిశెట్టి చక్కటి నటన కనబరించింది. 90ల నాటి అమ్మాయిగా అభినయం ప్రదర్శించింది. సుర‌భి ల‌క్ష్మి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపిస్తారు. రోహిణి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ పాత్ర‌లూ క‌థ‌లో కీల‌కం.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు జితిన్‌లాల్‌కు ఇదే తొలి చిత్ర‌మైనా మూడు త‌రాల‌తో ముడిప‌డిన ఈ క‌థ‌ని స్ప‌ష్టంగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. మ‌హావీరుడు కేలు క‌థ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం నుంచి ఆయన సినిమాను ప‌రుగులు పెట్టించారు. అతడి ప‌రాక్ర‌మం, రాజ్యాన్ని కాపాడినందుకు మ‌హారాజుని అడిగిన వరం, ఆ త‌ర్వాత అత‌నికి తెలిసిన నిజం త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. కేలు పాత్ర‌కు దీటుగా త‌ర్వాత త‌రానికి చెందిన మ‌ణియ‌న్ పాత్రని ఆవిష్క‌రించారు దర్శకుడు. ఈ సినిమాకి మ‌ణియ‌న్ పాత్రే హైలైట్‌. దీపం ఎక్క‌డుందో మ‌ణియ‌న్ క‌నుక్కుని, దాన్ని కాజేసే స‌న్నివేశాలు బాగుంటాయి. మ‌ణియ‌న్‌, అజ‌య‌న్‌ పాత్ర‌ల్ని ఒకే చోటకి తీసుకొచ్చిన‌ప్పుడు రేకెత్తే సంఘ‌ర్ష‌ణ హృదయాల్ని హ‌త్తుకుంటుంది. అయితే ఇతర పాత్రలు ప్రభావవంతంగా లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్‌, ఊహకందే కథనం, బలహీనమైన క్లైమాక్స్‌ ఈ చిత్రానికి మైనస్‌లుగా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. థిబు నేప‌థ్య సంగీతం, పాట‌లు చిత్రానికి కొత్త హంగుని చేకూర్చాయి. జోమోన్ టి.జాన్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టొవినో థామస్‌ నటనకథా నేపథ్యంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఊహకందే కథనంబలహీనమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 12 , 2024

    @2021 KTree