• TFIDB EN
  • పరేషన్
    UATelugu2h 11m
    ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SonyLivఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!

    టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి...read more

    How was the movie?

    తారాగణం
    తిరువీర్
    ఇసాక్
    పావని కరణం
    శిరీష
    బన్నీ అభిరన్
    సాయి ప్రసన్న
    అర్జున్ కృష్ణ
    బుద్దెరా ఖాన్
    రవి
    రాజు బెడిగల
    సిబ్బంది
    రూపక్ రోనాల్డ్సన్దర్శకుడు
    సిద్ధార్థ్ రాళ్లపల్లినిర్మాత
    యశ్వంత్ నాగ్సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్‌’తో మసూద హీరో హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు : తిరువీర్‌, పావని, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్ దర్శకత్వం: రోనాల్డ్ రూపక్‌ సన్‌ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు నిర్మాత : సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్‌’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్‌ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ: ఐజాక్‌(తిరువీర్‌) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్‌ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్‌ గౌడ్‌) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్‌ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్‌ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్‌ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్‌ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఐజాక్‌ పాత్రలో తిరువీర్‌ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్‌ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్‌, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్‌ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్‌ గౌడ్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ చూపించాడు. కొడుకు ఫ్యూచర్‌ కోసం తాపత్రయపడే తండ్రిగా ‌అలరించాడు. హీరోయిన్‌ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రోనాల్డ్ రూపక్‌ సన్‌ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది.  ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను మాత్రం డైరెక్టర్‌ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్‌ ఫీలింగ్‌ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.  టెక్నికల్‌గా  సినిమాటోగ్రఫీ పరేషాన్‌ చిత్రానికి ప్లస్‌ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు సింక్‌ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్‌ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం రేటింగ్‌ : 2.5/5
    జూన్ 02 , 2023
    <strong>Ketika Sharma Hot: పైట పక్కకు పడేసి.. అన్నింటికి తెగించిన కేతిక శర్మ!</strong>
    Ketika Sharma Hot: పైట పక్కకు పడేసి.. అన్నింటికి తెగించిన కేతిక శర్మ!
    యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్‌ హాట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. తన పరువాల దాడితో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.&nbsp; తాజాగా లైట్‌ పింక్‌ కలర్‌ శారీలో ఫొటోలకు ఫొజులిచ్చిన ఈ అమ్మడు పైటను పక్కకు జరిపి కుర్రకారును రెచ్చగొట్టింది. భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్‌ మీటర్లు బద్దలయ్యేలా చేసింది. నాభి అందాలతో యువతను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.&nbsp; మత్తెక్కించే కళ్లతో మరింత కొంటెగా చూస్తూ అందరినీ ఫిదా చేసింది. హాట్‌ హాట్ ఫొజులతో కనుల విందు చేసింది.&nbsp; ఈ అమ్మడి ఎద గుత్తులను చూసి యూత్‌ పరేషాన్‌ అవుతున్నారు. ఇంత హాట్ ఏంటి మామా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. హుషారెక్కించే అందాలతో కుర్రాళ్లను కైపులో ముంచెత్తుతోంది. కేతిక శర్మ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె ఢిల్లీలో 1995 డిసెంబర్‌ 24న జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.&nbsp; చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారింది. ఆపై సోషల్‌ మీడియాలో డబ్‌స్మాష్‌ వీడియోస్‌ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; అలా స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కళ్లలో పడింది. పూరి కుమారుడు ఆకాష్‌ నటించిన ‘రొమాంటిక్‌’ (2021) చిత్రంతో కేతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్‌ కాకపోయినా ఈ అమ్మడు అందాలకు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.&nbsp; దీంతో నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య' సినిమాలో కేతికకి ఛాన్స్‌ దక్కింది. అయితే ఆ సినిమా కూడా ఈ నార్త్‌ బ్యూటీకి విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'రంగ రంగ వైభవంగా' చిత్రం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఫిల్మ్‌ కూడా కేతికను తీవ్రంగా నిరాశ పరిచింది. గతేడాది పవన్‌- సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. ఆ సినిమా విజయం సాధించడంతో ఇక తనకు తిరుగులేదని కేతిక భావించింది.&nbsp; అయితే ‘బ్రో’ సినిమా తర్వాత కేతికకు ఒక్క సినిమాలోనూ ఛాన్స్‌ లభించలేదు. ఏడాది కాలంగా మూవీ ఆఫర్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడం, వరుస ఫ్లాప్స్‌పై ఇటీవల కేతిక స్పందించింది. మనసు పెట్టి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుందని ఫలితం ఇవ్వాల్సింది ప్రజలేనని పేర్కొంది. అయితే సినిమా ఆఫర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ అమ్మడు గ్లామర్‌ డోస్‌ను మరింత పెంచుతోంది.&nbsp; సోషల్‌ మీడియాలో ఎప్పడికప్పుడు హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.&nbsp; ప్రస్తుతం కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 3.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలను క్షణాల్లో ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.&nbsp; ఊరు పల్లెటూరు ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు. https://www.youtube.com/watch?v=KpBksxKsrIU బతుకమ్మ సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్‌ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.&nbsp; https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I చమ్కీల అంగీలేసి దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY దండికడియాల్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY దిల్ కుష్ తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE సౌ శర(పరేషాన్) పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని&nbsp; చెబుతున్నాయి.&nbsp; https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
    జూన్ 07 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అయితే ఈ వీక్‌ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్‌ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు అహింస ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ‘అహింస’ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అభిరామ్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. జూన్‌ 2న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలో రజత్‌ బేడి, గీతిక, సదా, రవికాలే, మనోజ్‌ టైగర్‌ తదితరులు నటించారు.&nbsp; ఐక్యూ సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ పేరుతో ఈ సినిమాను శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించాడు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ వంటి దిగ్గజ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా జూన్‌ 2వ తేదీనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రమని, మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది. నేను స్టూడెంట్‌ సార్‌! బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. జూన్‌ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. నేను స్టూడెంట్‌ సార్‌! సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు.&nbsp; పరేషాన్ తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు.&nbsp; జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమా కొత్త రకమైన కామెడీని పరిచయం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. చక్రవ్యూహం విలక్షణ నటుడు అజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా జూన్‌ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మర్డర్‌ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా ఈ సినిమాలో జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateSulaikha ManzilMovieMalayalamDisney+ HotstarMay 30VishwakMovieTeluguZee5June 2Asur season 2SeriesHindiJio CinemaJune 1Fake ProfileSeriesEnglishNetflixMay 31A Beautiful LifeMovieEnglishNetflixJune 1New AmsterdamSeriesEnglishNetflixJune 1Infinity StormMovieEnglishNetflixJune 1ScoopSeriesHindiNetflixJune 2ManifestSeriesEnglishNetflixJune 2
    మే 29 , 2023
    Manushi Chillar: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ భామ గురించి ఈ సీకెట్స్‌ తెలుసా?
    Manushi Chillar: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ భామ గురించి ఈ సీకెట్స్‌ తెలుసా?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మార్చి 02 , 2024
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    Operation Valentine OTT Date: ఆపరేషన్‌ వాలంటైన్‌ ఓటీటీ పార్ట్నర్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
    భారత వైమానిక దళం నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా చిత్రం&nbsp; 'ఆపరేషన్ వాలంటైన్' (Operation Valentine). గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. రిలీజ్‌ రోజునే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్‌ ఫిక్స్‌ కావడం విశేషం.&nbsp; నెల రోజుల్లో ఓటీటీలోకి! 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో డబ్బింగ్‌ పనులు కూడా పూర్తి కావచ్చన అంటున్నారు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. కెరీర్‌ బెస్ట్‌ నటన మరోవైపు ఆపరేషన్‌ వాలెంటైన్‌లో వరుణ్‌ తేజ్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 01 , 2024
    కల్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ స్టోరీ లైన్ ఇదే! సిక్రెట్ ఆపరేషన్‌లో ముగ్గురు…
    కల్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ స్టోరీ లైన్ ఇదే! సిక్రెట్ ఆపరేషన్‌లో ముగ్గురు…
    ]అమిగోస్‌ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది.విడుదల
    ఫిబ్రవరి 13 , 2023
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.&nbsp; ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp;
    మే 28 , 2024
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.&nbsp; మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.&nbsp; ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)&nbsp; సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే &nbsp;ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    యంగ్‌ హీరోయిన్‌ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా వెంకటేష్‌ ‘సైంధవ్‌’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్‌.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రుహానీ శర్మ ఎవరు? రుహానీ.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది. రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది? సోలన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది? 18 సెప్టెంబర్‌, 1994 రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు? సుభాష్‌ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది.&nbsp; రుహానీ శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ) రుహానీ శర్మ వయసు ఎంత?&nbsp; 30 సంవత్సరాలు (2024) రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు రుహానీ శర్మ ఏం చదువుకుంది? బీఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేసింది. రుహానీ శర్మ.. కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'కుడి టూ పటాకా' పంజాబి సాంగ్‌ యూట్యూబ్‌లో సూపర్‌ హిట్ అయ్యింది. రుహానీ శర్మ.. మెుదటి చిత్రం? 2017లో తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.&nbsp; రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది? 2018లో వచ్చిన 'చి ల సౌ' (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యింది.&nbsp; రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి? ‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్‌: ఛాప్టర్‌ 1’, ‘సైంధవ్‌’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం? శ్రీరంగ నీతులు రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు? కడైసి బెంచ్‌ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం) రుహానీ శర్మ ఫేవరేట్‌ హీరో ఎవరు? టాలీవుడ్‌లో వెంకటేష్‌, బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది.&nbsp; రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్‌ ఏవి? బ్లాక్‌ (Black), గ్రే (Grey) రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం? ఫ్లోరిడా రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది? క్రికెట్‌ రుహానీ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌? https://www.instagram.com/ruhanisharma94/?hl=en https://www.youtube.com/watch?v=pTdgQNy8BxI
    ఏప్రిల్ 12 , 2024
    Operation Valentine Box Office Collections:&nbsp; ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    Operation Valentine Box Office Collections:&nbsp; ఫస్ట్ వీకెండ్ తీవ్రంగా నిరాశ పరిచిన వసూళ్లు.. కారణం ఇదే!
    మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో.. ఫైటర్‌ పైలెట్‌గా వరుణ్‌ తేజ్‌ మంచి నటన కనబరిచాడు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు తిరుగుండదని అంతా భావించారు. కానీ ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కలెక్షన్స్‌కు ఎంతో కీలకమైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం రూ.6 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.&nbsp; బ్రేక్ ఈవెన్‌ కష్టమే! భారత వైమానిక దళం (Operation Valentine Weekend Collections) ఆధారంగా వచ్చిన తొలి తెలుగు చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. దీంతో సహజంగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం విడుదలకు ముందు కూడా మంచి బిజినెస్‌ చేసింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం. తొలి షోకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ను బట్టి ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అంతా భావించారు. అయితే తొలి వీకెండ్‌ వసూళ్లను చూసి మూవీ టీమ్‌ అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. కనీసం బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.&nbsp; 50% దాటని ఆక్యుపెన్సీ! ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాన్ని వరుణ్ తేజ్‌ (Varun Tej)తో పాటు చిత్ర యూనిట్‌ చాలా బాగా ప్రమోట్‌ చేసింది. క్రమం తప్పకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్స్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఒకేసారి రిలీజ్‌ చేయడంతో బాలీవుడ్‌లోనూ మేకర్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహించారు. అయితే హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు. ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు (Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది హిందీలో దెబ్బతీసిన ‘ఫైటర్‌’! ఇటీవల హిందీలో హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందిన ‘ఫైటర్‌’ (Fighter) చిత్రం రిలీజైంది. ఈ చిత్రం కూడా భారత వైమానిక దళం కాన్సెప్ట్‌తోనే విడుదలైంది. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. పైగా ఈ రెండు చిత్రాల విడుదలకు పెద్దగా గ్యాప్ కూడా లేకపోవడంతో హిందీలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్’ పెద్దగా ఆదరణ లభించలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్‌కు తెలుగు, హిందీ భాషల్లో ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిరాశనే మిగిల్చింది. సినిమాను అవే దెబ్బతీశాయా? ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ సెట‌ప్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో యాక్టింగ్ బాగున్నా.. కథలో స్ట్రాంగ్ ఎమోష‌న్ క‌నిపించ‌దు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను స‌క్సెస్ చేయ‌డంలో వైమానిక ద‌ళం ప‌డిన క‌ష్టాన్ని పైపైన చెప్పిన‌ట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ల‌వ్‌స్టోరీ సైతం స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామ‌న్ ఆడియెన్స్‌కు చాలా వరకు అర్థం కాలేదు. గ్రాఫిక్స్ విష‌యంలో కూడా అక్క‌డ‌క్క‌డ కాంప్ర‌మైజ్ అయిన‌ట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; త్వరగానే ఓటీటీలోకి! ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కా (Matka)లో నటిస్తున్నాడు. సాక్నిక్‌ లెక్కల ప్రకారం ఇదిలా ఉంటే 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' కలెక్షన్స్‌ వివరాలను ప్రముఖ సినిమా వెబ్‌సైట్‌ 'సాక్నిక్‌' వెల్లడించింది. దాని ప్రకారం వరుణ్ తేజ్‌ సినిమా కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ - రూ.4.42 కోట్లు హిందీలో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్‌ -రూ. 1.29 కోట్లు దేశవ్యాప్తంగా మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ. 5.71 కోట్లు ఓవర్సీస్‌లో మూడు రోజుల నెట్‌ కలెక్షన్స్ - రూ.0.25కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ వాలెంటైన్స్ వసూళ్లు - రూ.6 కోట్లు
    మార్చి 04 , 2024
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి&nbsp; ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు. భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana) శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చారీ 111 (Chaari 111) స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateAmbajipeta Marriage Band&nbsp;MovieTeluguAhaMarch 01Indigo&nbsp;MovieIndonesian CinemaNetflix&nbsp;Feb 27American Conspiracy: The Octopus MurdersSeries&nbsp;EnglishNetflix&nbsp;Feb 28Code 8 Part 2MovieEnglishNetflix&nbsp;Feb 28The Mire Season 3Series&nbsp;PolishNetflix&nbsp;Feb 28A Round of ApplauseSeriesTurkishNetflix&nbsp;Feb 29Man SooangMovieThaiNetflix&nbsp;Feb 29The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix&nbsp;Feb 29Furies&nbsp;SeriesFrenchNetflix&nbsp;Feb 29Mamla Legal HighSeriesHindiNetflix&nbsp;March 01My Name is Loh KiwonMovieKoreanNetflix&nbsp;March 01Shake, Rattle &amp; Roll: ExtremeMovieTagalogNetflix&nbsp;March 01Somebody Feed Phil Season 7&nbsp;SeriesEnglishNetflix&nbsp;March 01Space ManMovieEnglishNetflix&nbsp;March 01The Pig The Snake and the PigeonMovieMandarinNetflix&nbsp;March 01The Netflix SlamMovieEnglishNetflix&nbsp;March 03Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01Wedding Impossible&nbsp;SeriesKoreanAmazon PrimeFeb 26Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27Blue StarMovieTamilAmazon PrimeFeb 29Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29Iwaju&nbsp;SeriesEnglishDisney+hotstarFeb 28&nbsp; ShogunSeriesEnglishDisney+hotstarFeb 28Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01Sunflower Season 2SeriesHindiZee 5March 01Five Nights at Freddy's&nbsp;MovieEnglishJio CinemaFeb 27
    ఫిబ్రవరి 26 , 2024
    <strong>Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్</strong>
    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్
    తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.&nbsp; ‘రజనీ కంటే షూటింగ్‌ ముఖ్యం కాదు’ రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్‌ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్‌ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్‌ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్‌ పోర్షన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్‌ కనగరాజ్‌ మండిపడ్డారు. అక్టోబర్‌ 15 తర్వాత రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.&nbsp; రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే? రజనీకాంత్‌ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; కూలీలో స్టార్ క్యాస్ట్‌! రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp; సైమన్‌ యాక్షన్‌ సీన్‌ లీక్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ పోషిస్తున్న సైమన్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ గతంలో రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌&nbsp; చేశారు..&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582 లోకేష్‌పై పవన్‌ ప్రశంసలు కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్‌ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్‌ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్‌ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్‌’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్‌ వంటి స్టార్‌ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/i/status/1841446808888758277 https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
    అక్టోబర్ 05 , 2024
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్‌ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్‌, కామెడీ, అడ్వెంచర్‌ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్‌ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్‌ సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; వివాహభోజనంబు ‘మాయాబజార్‌’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్‌ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.&nbsp; https://www.youtube.com/watch?v=dZejdBmYC3k ‘సుందరి నీవంటి’ సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్‌ చేస్తారు. కానీ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్‌ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్‌ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్‌ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=ScasolQHzxs 'నిలువరా వాలు కనులవాడా' జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్‌ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్‌ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.&nbsp; https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA 'చెప్పమ్మా.. చెప్పమ్మా..' ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్‌.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్‌ కనిపిస్తూ డిస్టర్బ్‌ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్‌ అవుతుందో ఈ సాంగ్‌ కళ్లకు కడుతుంది.&nbsp; https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI 'బుగ్గే బంగారమా..' ‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక ‌అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు. https://www.youtube.com/watch?v=WABcMeOf0oM ‘అసలేం గుర్తుకు రాదు’ ‘అంతపురం’లోని ఈ సాంగ్‌.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.&nbsp; https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss ‘ఇంకి పింకి పాంకీ’ సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్‌ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి. https://www.youtube.com/watch?v=FusD0RVkKAk ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మాస్‌ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్‌ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్‌ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=u_wB6byrl5k ‘ఐతే’ ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్‌ కళ్లకు కడుతుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4 ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్‌ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.&nbsp; https://www.youtube.com/watch?v=2a34XyiZO14 ‘చెలియా చెలియా’ ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి&nbsp; పక్కన ఉంటే&nbsp; ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
    మార్చి 02 , 2024
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.&nbsp; మార్టిన్ లూథర్&nbsp; కింగ్&nbsp; పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల&nbsp; ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న&nbsp; దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.&nbsp; బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ &amp; శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.&nbsp; గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.&nbsp; చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు&nbsp; కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.&nbsp; మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.&nbsp; డెడ్‌ లైన్&nbsp; ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.&nbsp; కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
    ఫిబ్రవరి 22 , 2023
    <strong>KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!</strong>
    KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!
    నటీనటులు: రాకింగ్‌ రాకేష్‌, అనన్య కృష్ణన్‌, లోహిత్‌, మైమ్‌ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, జోర్దార్‌ సుజాత తదితరులు దర్శకత్వం: అంజి గరుడవేగ&nbsp; సంగీతం: చరణ్‌ అర్జున్‌ ఎడిటర్‌: చింతాల మధు నిర్మాత: రాకింగ్‌ రాకేష్‌ నిర్మాణ సంస్థ: గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కేశవ చంద్ర రమావత్‌’&nbsp; (Kesava Chandra Ramavat Movie) . షార్ట్‌ కట్‌లో ‘కేసీఆర్‌’ (కేసీఆర్‌)'. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్‌ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్‌ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్‌ హీరోయిన్‌గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్‌, రచ్చరవి, లోహిత్‌ కుమార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్‌ రాకేష్‌ మెప్పించాడా? కేసీఆర్‌ అభిమానిగా హిట్‌ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review) కథేంటి వరంగల్‌ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్‌ అలియాస్‌ కేసీఆర్‌ (రాకింగ్‌ రాకేష్‌) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్‌) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్‌) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్‌ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్‌ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్‌ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేష్‌ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్‌ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్‌ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్‌ నటుడు లోహిత్‌, మామ పాత్రలో మైమ్‌ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్‌, జోర్దార్‌ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్‌ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్‌ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ ఏవిధంగా డెవలప్‌ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్‌ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్‌ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. ‌అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్‌ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్‌, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్‌ కంపోజ్‌ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాకింగ్‌ రాకేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ పొలిటిషియన్‌ను హైలేట్ చేయడంకొన్ని సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌, జెన్నీఫర్‌, సునీల్‌, సత్య, సత్యరాజ్‌, సురేష్‌ చంద్ర మీనన్‌ తదితరులు దర్శకత్వం : ఈశ్వర్‌ కార్తిక్‌ సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌ ఎడిటింగ్‌: అనిల్ క్రిష్‌ నిర్మాతలు: ఎస్‌.ఎన్‌. రెడ్డి, బాల సుందరం, దినేష్‌ సుందరం విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review). ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్‌ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్‌ అదరగొట్టాడు. సత్యదేవ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్‌. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్‌ఫుల్‌ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్‌ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్‌ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్‌ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్‌ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ రిలేటెడ్‌ కంటెంట్‌ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్‌ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో బ్యాంక్‌ ఎంప్లాయిగా ఈశ్వర్‌ కార్తిక్‌ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్‌ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్‌తో తప్పించుకోవడం కూడా లాజిక్‌కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్‌ - డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్‌ వార్‌, సత్య కామెడీ, సునీల్‌ నటన, డైలాగ్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. బ్యాంక్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్‌ చేసి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేసత్యదేవ్‌, ధనంజయ్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ లాజిక్‌కు అందని సన్నివేశాలుఇరికించినట్లు వచ్చే పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 22 , 2024

    @2021 KTree