రివ్యూస్
How was the movie?
తారాగణం
షారుఖ్ ఖాన్
దీపికా పదుకొనే
జాన్ అబ్రహం
డింపుల్ కపాడియా
అశుతోష్ రాణా
ప్రకాష్ బెలవాడి
ప్రేమ్ ఝాంగియాని
షాజీ చౌదరి
విరాఫ్ ఫిరోజ్ పటేల్
ఏక్తా కౌల్
దిగంత హజారికా
మనీష్ వాధ్వా
కీత్ సెక్వేరా
రాచెల్ ఆన్ ముల్లిన్స్
నిఖత్ ఖాన్ హెగ్డే
సల్మాన్ ఖాన్
సిబ్బంది
సిద్ధార్థ్ ఆనంద్
దర్శకుడుఆదిత్య చోప్రా
నిర్మాతసంచిత్ బల్హరఅంకిత్ బల్హార
సంగీతకారుడువిశాల్-శేఖర్
సంగీతకారుడుసిద్ధార్థ్ ఆనంద్
కథసచ్చిత్ పాలోస్సినిమాటోగ్రాఫర్
ఆరిఫ్ షేక్ఎడిటర్ర్
కథనాలు
వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
]ప్రస్తుతం డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో 2024లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
ఇందులో కూడా పఠాన్ తరహా యాక్షన్ ఉంటే
ఆ ఏడాది ఊపేస్తుంది.
ఫిబ్రవరి 13 , 2023
Fighter Movie Review: శత్రుదేశానికి చుక్కలు చూపించిన హృతిక్.. ‘ఫైటర్’ ఎలా ఉందంటే?
నటీనటులు: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీవ్ జైశ్వాల్ తదితరులు
రచన, దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్
సంగీతం: విశాల్ - శేఖర్
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా - అంకిత్
సినిమాటోగ్రఫీ: సచిత్ పాలోస్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
విడుదల: 25-01-2024
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫైటర్’ (Fighter). బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘వార్’ చిత్రం తర్వాత హృతిక్ - ఆనంద్ కాంబోలో మరోమారు ఈ చిత్రం వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా సిద్దార్థ్ ఆనంద్ రీసెంట్ చిత్రం ‘పఠాన్’ సూపర్ హిట్ కావడంతో (Fighter Movie Review In Telugu) అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇందులో హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే నటించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హృతిక్ చేసిన యాక్షన్ అడ్వెంచర్స్ ఆకట్టుకుందా? సిద్దార్థ్ ఆనంద్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
సంషేర్ పఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోషన్) భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. సాహసాలకి వెనుకాడని ఫైటర్ పైలట్. ఓ ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. రాకీ (అనిల్ కపూర్) నేతృత్వంలో మిన్ను (దీపికా పదుకొణె), తాజ్ (కరణ్ సింగ్ గ్రోవర్), బాష్ (అక్షయ్ ఒబెరాయ్) బృందం కూడా ఆ మిషన్ కోసం అతడితో పాటు రంగంలోకి దిగుతుంది. గగనతలంలో శత్రువులపై వాళ్ల పోరాటం ఎలా సాగింది? (Fighter Movie Review) పాటీని వెంటాడుతున్న గతం ఏమిటి? తనకు ఎదురైన సవాళ్లని దాటి పాటీ వీరోచిత ఫైటర్‌గా ఎలా నిలిచాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హృతిక్‌రోషన్ (Hrithik Roshan) ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూనే పోరాట ఘట్టాల్లో తన మార్క్ ఏంటో చూపించాడు. కళ్లతో భావాల్ని పలికిస్తూ చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలను రగిలించాడు. అటు హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే (Deepika Padukone) చక్కటి నటన కనబరిచింది. ద్వితియార్థంలో తన నటనతో భావోద్వేగాల్ని పండించింది. అనిల్ కపూర్ (Anil Kapoor) చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. రాకీ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
భారత వాయుసేన చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్, నేపథ్యం, విజువల్స్ పరంగా ‘ఫైటర్’ (Fighter Movie Review In Telugu) పర్వాలేదు కానీ కథ, కథనాల పరంగానే నిరుత్సాహ పరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రేక్షకుల్లో ఏమాత్రం కలిగించలేకపోయారు. అయితే శత్రుదేశమైన పాక్ ఉగ్రవాదులతో పన్నిన పన్నాగాలను వైమానిక దళం ఎలా ఎదుర్కొందో చూపించిన తీరు బాగుంది. హాలీవుడ్ చిత్రాల్ని తలదన్నే రీతిలో సన్నివేశాల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. వాటికి దేశభక్తిని జోడించడం కలిసొచ్చింది. కథ, కథనాన్ని పక్కన పెడితే డైరెక్టర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ మరోమారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సచిత్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా గగనతలంలో వచ్చే యాక్షన్ సీన్లను ఆయన అద్భుతంగా చూపించారు. ఇక సంచిత్-అంకిత్ నేపథ్య సంగీతం, విశాల్-శేఖర్ పాటలు చిత్రానికి ప్రధానబలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
హృతిక్, దీపిక, అనిల్ కపూర్ నటనయాక్షన్ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందే సన్నివేశాలు
రేటింగ్: 3/5
జనవరి 25 , 2024
Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్ హ్యాట్రిక్ కొట్టినట్లేనా!
నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, దియా మిర్జా, సతీశ్ షా, అనిల్ గ్రోవర్ తదితరులు
దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరాణీ
సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్, మనుశ్ నందన్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్
విడుదల తేదీ: 21-12-2023
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ - షారుక్‌ఖాన్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ (పఠాన్, జవాన్)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశాల్ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి జవాన్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లండ్‌లోకి ప్రవేశించాలని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్ పాత్రలో షారుక్ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ, సాహసోపేతమైన డంకీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని భాగం చేశారు. మన్ను, బుగ్గు, బల్లిల కుటుంబ నేపథ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్రయాణంలో వలసదారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. హార్డీ, మన్ను ప్రేమకథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. పతాక సన్నివేశాల్లోనూ ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ‘లుట్ పుట్ గయా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ మరోసారి తనదైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం
రేటింగ్ : 3/5
డిసెంబర్ 21 , 2023
Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్’ ఆల్‌టైమ్ రికార్డ్.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్!
షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్ బాక్సాఫీస్ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్ కలెక్షన్స్. ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా జవాన్ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్ 7) రిలీజైన జవాన్ చిత్రం.. హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా షారుక్ ఖాన్ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్ లెక్కల విషయానికి వస్తే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్ గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన టాప్-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం.
1. ఆర్‌ఆర్‌ఆర్ (2022)
ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.
2. బాహుబలి 2 (2017)
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్ ఇండియన్ ఓపెనింగ్ గ్రాసర్ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.
3. కేజీఎఫ్ 2 (2022)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.
4. ఆదిపురుష్ (2023)
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్ మెుదటి రోజు కలెక్షన్స్ రూ.136.8 కోట్లుగా రికార్డ్ అయ్యాయి.
5. సాహో (2019)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ చేసింది.
6. రోబో 2.0 (2018)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు.
7. పఠాన్ (2023)
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్ కూడా హిట్ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
8. జైలర్ (2023)
రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.
9. కబాలి (2016)
2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్ సాధించింది. జైలర్ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్ డే హైయస్ట్ గ్రాసింగ్ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది.
10. పొన్నియన్ సెల్వన్ (2022)
మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 08 , 2023
మెుదటి త్రైమాసికంలో టాలివుడ్, బాలివుడ్,కొలివుడ్, శాండల్‌వుడ్ పైచేయి ఎవరిది?
కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి.
టాలివుడ్ పరంపర
గతేడాది ధమాకా వంటి సూపర్ హిట్‌తో ముగించిన టాలీవుడ్… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.
చిన్న హిట్లు
తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.
భావోద్వేగాల బలగం
మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది.
డిజాస్టర్లు
బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.
బాలీవుడ్ బాద్షా
వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.
రొమాంటిక్ హిట్
కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే, తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్ అయింది?
https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html
తమిళ్ సూపర్ స్టార్స్
కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం.
ఇంకా మెుదలుకాలేదు
కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.
ఆధిపత్యం ఎవరిది?
చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్ అనుకుంటే.. బాలీవుడ్ దే పైచేయి.
మార్చి 20 , 2023
Indian Films With Rs.100 cr opening: తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్స్ వీరే!
ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతున్నారు. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తారక్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై తొలిరోజు రూ.172 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో తమ చిత్రాలను నిలిపిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రభాస్ (Prabhas)
ప్రస్తుతం దేశంలో ఏ హీరోకు లేనంత క్రేజ్ ప్రభాస్‌కు ఉంది. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులన్నీ దాసోహం కావాల్సిందే. తొలి రోజు అత్యధికసార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్ టాప్‌లో ఉన్నారు. ప్రభాస్ ఐదు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ‘బాహుబలి 2’ (రూ. 214.5 కోట్లు), ‘సాహో’ (రూ.130 కోట్లు), ‘ఆదిపురుష్’ (రూ.140 కోట్లు), ‘సలార్’ (రూ.178.7 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.191.5 కోట్లు) చిత్రాలన్నీ తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.
విజయ్ (Vijay)
ప్రభాస్ తర్వాత విజయ్ అత్యధిక సార్లు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘ది గోట్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన 'లియో' (Leo) చిత్రం తొలి రోజు రూ.145 కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' (The G.O.A.T) ఫస్ట్ డే రూ. 126.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
జూ.ఎన్టీఆర్ (Jr NTR)
దేవర సినిమా సక్సెస్‌తో తారక్ ఈ జాబితాలో టాప్ 3లో నిలిచారు. ఆయన చేసిన రెండు చిత్రాలు తొలి రోజు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో చేసిన ‘RRR’ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.223 కోట్లను రాబట్టింది. తారక్ రీసెంట్ చిత్రం ‘దేవర’ (Devara) ఫస్ట్ డే రూ.172 కోట్లను వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల సక్సెస్‌తో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. ఆయన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ (Jawan) ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.129 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
యష్ (Yash)
కన్నడ నటుడు యష్ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం ద్వారా తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. ‘కేజీఎఫ్’ (KGF)కు ముందు వరకూ కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన యష్ ఆ సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రం తొలి రోజు రూ.164 కోట్లు కొల్లగొట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా రూపొందించిన ‘యానిమల్’ (Animal) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌బీర్ కెరీర్‌లో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1 రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.116 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.
రామ్‌చరణ్ (Ramcharan)
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సైతం హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా తొలి రోజు రూ.223 కోట్లను కొల్లగొట్టి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కూడా తొలి రోజు రూ.100 కోట్లు పైనే రాబడుతుందని చరణ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మక్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెప్టెంబర్ 30 , 2024
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
15 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927
ఏకైకా సౌత్ హీరోగా ప్రభాస్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్, పఠాన్ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.
త్వరలో టాప్-3లోకి ‘కల్కి’
తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, జవాన్ సినిమాలకు షాక్ తప్పేలా లేదు.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది.
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 13 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు ఇవే!
ఈ వారం భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రిస్మస్ వారాన్ని మరింత సందడిగా మార్చబోతున్నాయి. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీల మధ్య థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాలు/సిరీస్‌లు ఏవి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సలార్
సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ వారం విడుదల కానుంది. డిసెంబరు 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ ‘సలార్’ను నిర్మించింది.
డంకీ
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా తాప్సీ నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు చేసే ప్రయాణం’ ఈ సినిమా అంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో బాక్సాఫీస్ ఘన విజయాలను నమోదు చేశాడు. ‘డంకీ’తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్
జాసన్ మోమోవా కథానాయకుడిగా జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామెన్’. 2018లో విడుదలై బాక్సాఫీస్ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్’ (Aquaman and the Lost Kingdom) ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
ఆదికేశవ
మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ చిత్రం డిసెంబర్ 22న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateThe Rope Curse 3Web SeriesEnglishNetflixDec 18MaestroMovieEnglishNetflixDec 20Top Gun: MaverickMovieEnglishNetflixDec 22Curry & CyanideDocumentaryEnglishNetflixDec 22Rebel MoonMovieEnglishNetflixDec 22Dry DayMovieHindiAmazon PrimeDec 22Sapta Saagaradaache Ello – Side BMovieTelugu/KannadaAmazon PrimeDec 22The SouvenirMovieEnglishJio CinemaDec 18Hey KameeniMovieHindiJio CinemaDec 22
డిసెంబర్ 18 , 2023
Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.
యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు.
ప్రస్తుతం ఆమె గ్లామర్‌పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
ఆమె బ్యాక్‌గ్రౌండ్, ఏజ్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.
మాన్సి టాక్సక్ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది.
సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో 'ఫెమినా మిస్‌ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్ ఇండియా గుజరాత్' కిరిటం సాధించింది.
ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది. ఈ చిత్రం యూట్యూ ఛానెల్ క్యూనెట్‌లో రిలీజైంది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్ మూవీలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ది కేరళ స్టోరీ, గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.
మాన్సి నటించిన సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్లు సాధించడం విశేషం.
https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005
ఇక మాన్సి టాక్సాక్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది
మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్‌లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది.
మాన్సి టాక్సాక్‌కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది.
మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే. దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది.
అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్‌కు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది.
యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్‌కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట.
మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్‌గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇప్పటివరకు బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రణ్‌బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
డిసెంబర్ 11 , 2023
TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి, ఇమ్రాన్ హష్మీ, సిమ్రాన్, రద్ధీ డోంగ్రా, అనీష్ కురువిల్లా, కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే.
డైరెక్టర్: ఆదిత్య చోప్రా
ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా
మ్యూజిక్: తనూజ్ టికు
ఎడిటర్: రామేశ్వర్ S. భగత్
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున)
సల్మాన్ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ
ఎలా ఉందంటే?
టైగర్ 3 సినిమా.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు. భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.
ఎవరెలా చేశారంటే
సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది.
బలాలు
సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్ ఖాన్ కెమియో రోల్
బలహీనతలు
స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం
చివరగా:
హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు.
రేటింగ్: 2.5/5
నవంబర్ 12 , 2023
Jawan Movie Review in Telugu : మ్యాజిక్‌లు.. లాజిక్‌లు పక్కన పెట్టి చూడండి… జవాన్ బొమ్మ అదిపొయింది!
తమిళ్ డైరెక్టర్ అట్లీ మాస్ యాక్షన్ సినిమాలను తీయడంలో ధిట్ట. ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేస్తాడు. దళపతి విజయ్‌తో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తీశాడు. సోషల్ మెసెజ్‌తో కూడిన కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తమిళ్‌లో బిగిల్, తేరి, మెర్సల్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో తీసిన జవాన్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీ ఇంతకు ఎలా ఉంది. అట్లీ- షారుక్ మ్యాజిక్ ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటంటే..
భారత్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని (షారుఖ్ ఖాన్) తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు షారుఖ్ ఖాన్ నేను ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని షారుఖ్ ఖాన్ కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు.
సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) అనే పోలీస్ ఆఫీసర్.. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పొరాటం చేస్తుంటాడు. కాళి (విజయ్ సేతుపతి) అక్రమంగా సంపాదించిన డబ్బును పేదలకు పంచి పెడుతుంటాడు రాబిన్ హుడ్ తరహాలో. అయితే 30 ఏళ్ల క్రితం దొరికిన వ్యక్తి... విక్రమ్ రాథోడ్ ఒక్కరేనా? లేక ఇద్దరా..? ప్రామిస్ చేసిన పిల్లవాడు మాట నిలబెట్టుకున్నాడా? అసలు ఆ బుడ్డోడికి షారుఖ్ ఖాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? కాళితో విక్రమ్ రాథోడ్‌కు ఉన్న గొడవ ఏంటి అనే అంశాలను తెరపై చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే?
ఈ ఏడాది ప్రథమార్థంలో పఠాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్ మరో బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ నటన ఆయన ఫ్యాన్స్‌కు మంచి విందు భోజనం పంచుతుంది. షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్ మునుపెన్నడూ లేని విధంగా హైఓల్టేజీలో డైరెక్టర్ అట్లీ డిజైన్ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో షారుఖ్ లుక్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండింగ్ వరకు షారుఖ్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
విలన్‌గా కాళి పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. తనదైన నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కాళి పాత్రకు సూపర్బ్ మ్యెనరిజాన్ని విజయ్ జోడించాడు.
నయనతార షారుఖ్‌తో సమానంగా నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అయితే ఆమె పరిధి ఇంకొంచెం ఉంటే బాగుంటుందనిపించింది. ఆమె ప్రతి ప్రేమ్‌లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకుంది. దీపికా పదుకునే పాత్ర ఈ సినిమాకు ఎమోషనల్ కనెక్ట్. ప్రియమణి, సాన్య మల్హోత్ర, సంజీత భట్టాచార్య అందరూ తమ పరిధి మేరకు బాగా నటించారు.
ఎలా ఉందంటే?
డైరెక్టర్ అట్లీ మరోసారి తన స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలిసింది. ఫస్టాఫ్‌ను చాలా ఎంగేజింగ్ నడిపించి ఇంటర్వల్‌లో ట్విస్ట్ రివీల్ చేశాడు. యాక్షన్ సీన్స్, షారుఖ్ కామెడీ టైమింగ్ ఎక్కడా ప్రేక్షకునికి బోర్ కొట్టించదు. ఈ సినిమా ద్వారా సమాజంలోని అన్ని సమస్యలు స్పృశిస్తూ.. ఆర్మీలోని కొన్ని సమస్యలను బయటకు తెచ్చాడు అట్లీ.
సెకండాఫ్‌లో షారుఖ్ ఖాన్ జాతినుద్దేశించే ఇచ్చే స్పీట్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయాయి. బోర్డర్ సన్నివేశాలు, యుద్ధసన్నివేశాలను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు.
టెక్నికల్ పరంగా
జవాన్ సినిమా నిర్మాణ విలువల పరంగా సూపర్బ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో రెడ్ చిల్లీస్ ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ కోసం అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్స్ స్పిరో రజటోస్, యన్నిక్ బెన్, సనీల్ రోడ్రిగూస్ వంటి వారు పనిచేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే సౌండ్ థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పడి కష్టం సౌండ్స్‌లో రీసౌండ్ అయిందని చెప్పవచ్చు.
బలాలు:
షారుఖ్ నటన
ఇంటర్వల్ ట్విస్ట్
క్లైమాక్స్ సీన్స్
BGM
బలహీనతలు
సెకాండాఫ్‌లో ముందే ఊహించదగిన సీన్లు
చివరగా:
జవాన్ సినిమా గురించి విమర్శకుల మ్యాజిక్‌లు లాజిక్‌లు పక్కన పెడితే... ఈ చిత్రం అభిమానులకు రియల్ షారుఖ్‌ను పరిచయం చేస్తుంది.
రేటింగ్
4/5
సెప్టెంబర్ 07 , 2023
Fastest 500Cr Movies: జెట్ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
ఒకప్పుడు దేశంలో సూపర్ హిట్ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి-2
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.
2. ఆర్‌ఆర్‌ఆర్
బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే.
3. కేజీఎఫ్ 2
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
4. పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.
5. రోబో 2.0
రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.
6. సుల్తాన్
సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ చిత్రం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
7. దంగల్
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.
8. పీకే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.
9. టైగర్ జిందా హై
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.
10. సంజు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.
సెప్టెంబర్ 05 , 2023
Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్?
ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.
బాహుబలి 2
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించింది.
కేజీఎఫ్ 2
కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.
సాహో
బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రోబో 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
జూన్ 16 , 2023
Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!
సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ది కేరళ స్టోరీ
భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Image Credit: wikipedia/commons
ఫర్హానా
నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
Image Credit: wikipedia/commons
ది కాశ్మీర్ ఫైల్స్
2022లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్ మండిపడింది.
Image Credit: wikipedia/commons
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ - ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Image Credit: wikipedia/commons
అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టింది.
Image Credit: wikipedia/commons
పీకే
బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్ అనంతరం పీకే సూపర్ హిట్‌గా నిలిచింది.
Image Credit: wikipedia/commons
ద ఢిల్లీ ఫైల్స్
కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
మే 19 , 2023
Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్ ఒక్కడేనా.. దంగల్ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
దేశంలో ‘ఆదిపురుష్’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్ నిజంగానే దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆదిపురుష్ బడ్జెట్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్ బడ్జెట్ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్’ నిలిచింది.
పెట్టుబడికి ఢోకా లేదు
ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్ టీమ్ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
దంగల్ VS ఆదిపురుష్
దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేయాలంటే ఆదిపురుష్ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్.. చైనా, హాంకాంగ్, మలేషియా, UAE, బ్రిటన్, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్ కథ యూనివర్సల్ సబ్జెట్ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్ కలెక్షన్స్‌ను బీట్ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్ టాక్ తోడైతే ఆదిపురుష్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ జూన్ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, వంశీ, ప్రమోద్, ఓంరౌత్ నిర్మించారు.
మే 11 , 2023
PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం.
సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం.
RRR
ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.
KGF
రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.
పఠాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది.
బ్రహ్మాస్త్ర
అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.
బీస్ట్
దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.
OG
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.
LEO
లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
మే 02 , 2023
1000Cr క్లబ్: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !
సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం.
దంగల్
అమీర్ ఖాన్ లీడ్ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్. ఫొగాట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది.
బాహుబలి 2
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి.
కేజీఎఫ్ 2
“అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్ మైన్స్ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం.
RRR
భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.
పఠాన్
ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్ హిట్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది.
భజరంగీ భాయ్‌జాన్
సల్మాన్ ఖాన్ డిఫరెంట్ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.
ఏప్రిల్ 28 , 2023
Prashanth Neel : సలార్, కేజీఎఫ్ 2 కలయికతో KGF 3..!
థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు
కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్ నీల్ మరణించినట్లు ధ్రువీకరించలేదు. దీంతో కచ్చితంగా పార్ట్-3 ఉంటుందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగానే తాజాగా KGF మేకర్స్ పార్ట్-3పై ఆశలు కలిగించారు.
KGF-2 సినిమా రిలీజై నేటితో (ఏప్రిల్ 14) ఏడాది పూర్తైన సందర్బంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రతీ పాత్రను తిరిగి గుర్తు చేస్తూ ఆ వీడియో సాగింది. ‘మరపురాని క్యారెక్టర్లు, యాక్షన్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రపంచ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకున్నాం’ అంటూ మేకర్స్ క్యాప్షన్ పెట్టారు. అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది.. మరి నెరవేరిందా? అని మూడో పార్ట్‌పై హింట్ ఇచ్చారు. దీనిని మేకర్స్ చేసిన అధికారిక ప్రకటనగా భావించిన నెటిజన్లు #KGF3, #PrashanthNeel హ్యాష్‌ట్యాగ్‌లను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేజీఎఫ్2, సలార్ చిత్రాలను కలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
కేజీఎఫ్2, సలార్ చిత్రాల అనుసంధానంగా కేజీఎఫ్-3 రానుందని ఇప్పటినుంచే నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు తమ అంచనాలను ట్విటర్‌లో పెడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
https://twitter.com/hombalefilms/status/1646732589540028416
https://twitter.com/adheeraeditz/status/1646759564300173313
https://twitter.com/VickyOfficia1/status/1646758480051576832
https://twitter.com/SagarPrabhas141/status/1646738776880992256
‘బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది డే’ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. KGF-3 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/MoviesPlexus/status/1646782407029444608
https://twitter.com/iamaniketL/status/1646781955395182593
https://twitter.com/Movies_Bar/status/1646781802378592257
1978-81 మధ్య రాకీ భాయ్ ఎక్కడ ఉన్నాడని సదరు వీడియోలో మేకర్స్ ఓ ప్రశ్నను వదిలారు. అయితే దానికి సమాధానం పార్ట్-3 వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్-3 కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/saloon_kada/status/1646776349733060608
https://twitter.com/imARajput66/status/1646781794988228608
థియేటర్‌లో అద్భుత అనుభూతిని పంచిన సినిమాల్లో కేజీఎఫ్ ఒకటని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. హీరో ఇంట్రో, క్లైమాక్స్ కోసమే మూడు సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-3 కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
https://twitter.com/Thalapathy_Bk/status/1646758004715581441
కేజీఎఫ్ 3 అంచనాలకు అందని రీతిలో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఊహాకు మించి సినిమా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/YUVA__YASHCULT/status/1646787256202698752
షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ పఠాన్ రికార్డులను KGF3 బద్దలు కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఒకసారి సినిమా రిలైజ్ అయితే పటాన్ రికార్డ్స్ ఎక్స్‌పైరేనని ట్వీట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 14 , 2023
NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. హృతిక్ రోషన్‌తో తలపడనున్న తారక్..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.
అధికారిక ప్రకటన
తరణ్ ఆదర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.
ముందే తెలుసా?
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్ కపూర్, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.
బిజీబిజీగా జూ.NTR
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్ పూర్తైన వెంటనే వార్-2 సినిమాపై ఎన్టీఆర్ ఫోకస్ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
అతి పెద్ద సంస్థ
వార్-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సంస్థకు భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పఠాన్ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘వార్’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్ వర్సస్ పఠాన్’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 05 , 2023
Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచనలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని సైతం ‘పుష్ప 2’ అందుకుంది. తద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
అత్యంత వేగంగా..
‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేవలం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేరక్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంత వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదేనని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం ఇంత తక్కువ సమయంలో రూ.1000 కోట్లు రాబట్టలేదని పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా పుష్ప 2 సాగుతోంది. అయితే భారతీయ సినీ చరిత్రలో ‘పుష్ప 2’తో పాటు మరో 7 చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
https://twitter.com/PushpaMovie/status/1866731687578833350
దంగల్ (Dangal)
అమీర్ ఖాన్ (Amir Khan) లీడ్ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘దంగల్’. ఫొగాట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్ తేవాలనుకునే తండ్రి తన కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో దంగల్ రూపొందింది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా వరల్డ్‌వైడ్‌గా రూ. 2000 కోట్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది.
బాహుబలి 2 (Bahubali 2)
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’ (Bahubali). ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు రాబట్టింది.
RRR
రామ్‌చరణ్ (Ramcharan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. ఇందులో రామ్ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. రూ. 550 కోట్లతో ఈ తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 1,390 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
కేజీఎఫ్ 2 (KGF 2)
కన్నడ నటుడు యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ (KGF: Chapter 1) చిత్రం ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ దానికి మించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.100 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.1250 కోట్లు కొల్లగొట్టింది.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్ నటించారు. దీనికి సీక్వెల్ కూడా రూపొందనుంది.
జవాన్ (Jawan)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ చిత్రం గతేడాది విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,148 కోట్లు రాబట్టింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేసింది. విజయ్ సేతుపతి విలన్‌గా అలరించాడు.
పఠాన్ (Pathan)
గతేడాది షారుక్ నటించిన మరో చిత్రం కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో నిలిచింది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1,050 కోట్లు వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేసింది. షారుక్ ఖాన్ గెస్ట్ రోల్‌లో అలరించాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు.
డిసెంబర్ 11 , 2024