రివ్యూస్
How was the movie?
తారాగణం
రజనీకాంత్
భావజ్
ఖుష్బు సుందర్
మీనా
నయనతార
కీర్తి సురేష్
జగపతి బాబు
అభిమన్యు సింగ్
సూరి
బాలా
ప్రకాష్ రాజ్
J. లివింగ్స్టన్
పాండియరాజన్
సతీష్
సత్యన్
రెడిన్ కింగ్స్లీ
జార్జ్ మేరియన్
వేల రామమూర్తి
కులపుల్లి లీల
అర్జై
తవసి
కబాలి విశ్వంత్
రవి అవానా
అంజలి నాయర్
శ్రీరంజిని
సాయి సిద్దార్థ్
శ్రీజ రవి
నాడోడిగల్ గోపాల్
రజిత
పిరైసూదన్
హృషీకేశ్
అయ్యప్ప పి. శర్మ
ముక్తార్ ఖాన్
సిబ్బంది
శివ
దర్శకుడుకళానిధి మారన్
నిర్మాతడి. ఇమ్మాన్
సంగీతకారుడుకథనాలు
Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్ ఆ హీరో పాత్రలను ఓన్ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో హీరో వెంకటేష్ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.
రఘువరన్ బీటెక్
ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్ (ధనుష్) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.
తమ్ముడు
ఈ (Thammudu) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్ కోర్టులో బుద్ది చెప్తాడు.
అలా వైకుంఠపురంలో
ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.
అ ఆ
ఇందులో (A Aa) నితిన్ (Nithin) పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
జెర్సీ (Jersey)
క్రికెటర్ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.
నేనింతే
ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.
యోగి
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్ క్లాస్ యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది.
మార్చి 01 , 2024
HBD Rajinikanth: రజనీకాంత్ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్ స్టార్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నందమూరి తారకరామారావుతో..
టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్ రెంటో కథానాయకుడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా హీరోలుగా ‘ఖూన్ పసీనా’ పేరుతో రీమేక్ చేశారు.
శోభన్ బాబుతో..
నట భూషణ్ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్ బాబు, రజనీకాంత్ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్ మకాన్’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్ కుమార్, శశికపూర్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు.
సూపర్ కృష్ణతో..
ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్’ (1978), ‘రామ్ రాబర్ట్ రహీమ్’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.
https://twitter.com/atheisttindian/status/1212794102867083265
డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో..
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.
అక్కినేని నాగార్జునతో..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్ షూట్ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు.
జగపతి బాబుతో..
రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.
https://twitter.com/SolidLover123/status/1562791842898669568
డిసెంబర్ 12 , 2024
Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు.
దర్శకత్వం : సాయి కిషోర్ మచ్చా
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
నిర్మాత : ఎం.ఎస్ రామ్ కుమార్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.
కథేంటి
కార్తిక్ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్)ను చూసి కార్తిక్ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో కార్తిక్ పాత్రలో చేతన్ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో మరింత వర్క్ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, గిరిధర్ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాయికిషోర్ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్ అంతా హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్. హీరోయిన్ ఫాదర్ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ మెుత్తాన్ని వెన్నెల కిషోర్ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్, గొప్ప క్యాస్టింగ్ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్ రామస్వామి కెమెరా వర్క్ మెప్పించింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్ సినిమాను మరింత షార్ట్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీరెగ్యులర్ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 08 , 2024
HBD Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక 'ఈశ్వర్' ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్‌గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 23 , 2024
Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ
రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ఇఫ్ యూ డేర్ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్ తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే.. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
యక్షిణి
మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్ సిరీస్ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.
ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు, మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన కృష్ణ (రాహుల్ విజయ్)ని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ.
పరువు
నివేదా పేతురాజ్, నరేష్ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
జూన్ 15 , 2024
Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ యానిమేషన్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
‘ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.
అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్ గార్డ్’ కామిక్ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్ రూపంలో ఈ టెలివిజన్ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం.
టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్ కింగ్’ పేరుతో 1994లో కార్టూన్ యానిమేషన్ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.
ఆ తర్వాత 2016లో ‘ది లయన్ కింగ్’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో ‘ది లయన్ కింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది.
'ది లయన్ కింగ్' (2019) వరల్డ్ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఇప్పుడు ది లయన్ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘ది లయన్ కింగ్’ (2019), ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ వర్క్ చేశారు.
అరోన్ పీరే (ముఫాసా), డొనాల్డ్ గ్లోవర్ (సింబా), బియాన్స్ (నాలా), బ్లూ ఇవి కార్టర్ (కియారా), జాన్ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు.
ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశాడు. ఈ యానిమేషన్ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.
2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ముఫాసా తెలుగు వెర్షన్ ఈసారి మరింత హైలేట్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దీంతో మహేష్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.
https://twitter.com/thetalkenti/status/1866815051316785331
2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్ పాత్రలకు వారు డబ్బింగ్ చెప్పడం విశేషం.
తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్ డబ్బింగ్ చెప్పారు. అర్జున్ దాస్ (ముఫాసా), అశోక్ సెల్వన్ (టాకా), నాజర్ (కిరోస్), వీటీవీ గణేష్ (యంగ్ రఫీకీ), సింగం పులి (టిమన్) డబ్బింగ్ చెప్పారు.
https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209
హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
డిసెంబర్ 18 , 2024
Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో లక్కీ భాస్కర్ మంచి జనాదారణ పొందింది. ఆ చిత్రంలోని డైలాగ్‌లు సగటు మధ్యతరగతి జీవి జీవన చిత్రాన్ని కళ్లకు కట్టాయి. ప్రస్తుతం ఈ సంభాషణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డైలాగ్స్ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చిత్రంలో వచ్చిన టాప్ డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం.
lucky Bhaskar Movie Dialogues
“ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”.
“ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా!”
“ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “.
“అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.“
“మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.”
లక్కీ భాస్కర్ కొడుకు చెప్పే డైలాగ్
“నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.“
“జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.“
“ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”.
“భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.”
“మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.“
నగల షాపులో చెప్పే డైలాగ్
“నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.“ lucky Bhaskar Movie Dialogues
“దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.“
“సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…!
”ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.”
“దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.”
డబ్బు ఇచ్చే కిక్కు డైలాగ్
“సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.”
“వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు“
“డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.“
“కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి”.(lucky Bhaskar Movie Dialogues)
“ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.”
“గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.“
దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం!
మాటల్లో ఇంత అహంకారం….అహంకారం కాదు.. ధైర్యం!
డిసెంబర్ 16 , 2024
Devaki Nandana Vasudeva Review: మ్యాటర్ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్ వర్మ? పాపం అశోక్ గల్లా!
నటీనటులు : అశోక్ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే తదితరులు
డైరెక్టర్ : అర్జున్ జంధ్యాల
కథ : ప్రశాంత్ వర్మ
డైలాగ్స్: బుర్ర సాయి మాధవ్
సినిమాటోగ్రాఫీ: ప్రసాద్ మురెళ్ల, రసూల్
ఎడిటింగ్: తిమ్మరాజు
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 22న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కథలో ప్రశాంత్ వర్మ మార్క్ కనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. ఒక రోజు కాశీకి వెళ్లిన కంసరాజుకు అఘోరా తారసపడి నీ మరణం నీ చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం చేతిలో ఉందని చెప్తాడు. దీంతో కడుపుతో ఉన్న చెల్లి (దేవయాని)పై కంసరాజు దాడి చేస్తాడు. ఆమె భర్త చనిపోవడంతో 21 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. అయితే కంసరాజు చెల్లికి ఆడపిల్ల సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన కంసరాజు మేనకోడలు సత్యను ఏం చేశాడు? కంసరాజుకు తెలియకుండా అతడి చెల్లెలు దాచిన సీక్రెట్ ఏంటి? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సత్య ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కృష్ణ పాత్ర కోసం అశోక్ గల్లా (Devaki Nandana Vasudeva Review) చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. గత చిత్రంతో పోలిస్తే నటన, బాడీ లాంగ్వెజ్‌పరంగా అశోక్ మెరుగయ్యాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా మానస వారణాసి అలరించింది. తెరపై వారి కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే భావోద్వేగాలు పలికించే విషయంలో మానస అక్కడక్కడ తడబడింది. విలన్‌గా దేవదత్తా నాగే ఆకట్టుకున్నాడు. అతడి చెల్లెలు పాత్రలో దేవయాని నటన బాగుంది. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ చక్కగా చేసింది. సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను తదితరులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
హనుమాన్ (Hanuman) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) అందించిన కథలో పెద్దగా స్టఫ్ లేదు. స్టోరీకి మైథాలజీని ముడిపెట్టినప్పటికీ అది ఎక్కడా సింక్ అయినట్లు అనిపించదు. పురాణాల నేపథ్యం లాజిక్ లెస్‌గా అనిపిస్తుంది. దర్శకుడు అర్జున్ జంధ్యాల కథనంలోనైనా మ్యాజిక్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. స్క్రీన్‌ప్లేను ఇంట్రస్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. ఓ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కించిన సీన్స్ స్వాగతించేలా లేవు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా పేలవంగా అనిపిస్తుంది. కృష్ణ, కంసరాజు మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సైతం బలంగా చూపించలేకపోయారు. కృష్ణ పాత్రను ఎలివేట్ చేసేందుకు తీసిన కొన్ని సీన్స్ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మెుత్తానికి దర్శకుడు చాలా చోట్లనే ప్రేక్షకులకు బోర్ కలిగించాడు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయాలకు వస్తే భీమ్స్ సిసిలియో సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను అతడి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్ తమ్మిరాజు పనితనం ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
అశోక్ గల్లా నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
మెరుపులు లేని కథనంలవ్‌ట్రాక్‌మిస్‌ఫైర్ అయిన మైథాలజీ టచ్
Telugu.yousay.tv Rating : 2/5
నవంబర్ 22 , 2024
HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్!
దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది.
ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.
ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.
రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది.
నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట.
ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది.
నాని 'గ్యాంగ్ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట.
పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.
చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది.
ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.
హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.
సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.
తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది.
పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.
View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial)
చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది.
ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది.
తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది.
తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో 'ఓజీ'లో నటిస్తోంది.
అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన 'డాక్టర్', 'డాన్'.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
నవంబర్ 20 , 2024
Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్ తేజ్.. ఎలాగంటే?
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్‌కు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోమారు అల్లు వర్సెస్ మెగా వివాదం తెరపైకి వచ్చింది. సమసిపోతుందనుకుంటున్న ఈ సోషల్ మీడియా వార్‌కు అతడి వ్యాఖ్యలు అగ్గిరాజేసేలా చేసింది.
వరుణ్ ఏమన్నారంటే..
మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కడ వేదికపై మాట్లాడిన వరుణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మట్కా గురించి రిజల్ట్‌పై టెన్షన్ పడుతున్న క్రమంలో తన అన్న రామ్‌చరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లు వరుణ్ తెలిపాడు. చరణ్ 10 మాటలు చెప్పాల్సిన పనిలేదని, పక్కన కూర్చొని భుజంపై చేయి వేస్తే అదే రూ.100 కోట్లకు సమానమని అన్నాడు. 'ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/TheAakashavaani/status/1855645538848317783
బన్నీకి ఇండైరెక్ట్ పంచ్..!
వరుణ్ తేజ్ తన తాజా కామెంట్స్ ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ గురించి బన్నీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే తనకంటూ స్టార్‌డమ్ వచ్చాక బన్నీ వారి గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదన్న విమర్స మెగా ఫ్యాన్స్‌లో ఉంది. ఏపీ ఎన్నికల సమయంలో ఇది తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం మారుతీనగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బన్నీ ‘తనకు నచ్చితేనే వస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్‌ను సెపరేట్ చేస్తూ అల్లు ఆర్మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐ లవ్ యూ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
సోషల్ మీడియాలో బిగ్ వార్!
వరుణ్ తేజ్ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ మరోమారు సోషల్ మీడియా వేదికగా దాడి చేసుకుంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని వరుణ్ తేజ్ చెప్పకనే చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ‘కుక్కకాటుకు చెప్ప దెబ్బ’ అన్న సామెతను కూడా ప్రయోగిస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ సైతం వరుణ్ తేజ్, మెగా ఫ్యాన్స్‌కు దీటుగా బదులిస్తున్నారు. బన్నీలా సక్సెస్ అయ్యి వరుణ్ ఈ మాట చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. తన సినిమా రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ను కాకా పట్టడం కోసమే వరుణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వరుణ్ లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట మరోమారు అల్లు vs మెగా ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోసిందనే చెప్పాలి.
https://twitter.com/Mr_Thanniru/status/1855677559385506053
https://twitter.com/Mahendr00185818/status/1855658081923002548
https://twitter.com/KurnoolGabbar/status/1855648961681600850
https://twitter.com/Nishvk18/status/1855647703893786929
https://twitter.com/Pawala444/status/1855647070990082127
https://twitter.com/allumanu45/status/1855654467125096827
https://twitter.com/goudsaab410/status/1855646150281338887
‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్!
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్మీతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటానికి ఓ బలమైన కారణం ఉంది. ‘పుష్ప 2’పై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో బన్నీని ఓ ఆట ఆడుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాను బాయ్‌కాట్ చేయడం ద్వారా కలెక్షన్స్ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారట. #Pushpa2boycott అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం వారు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎవరు అడ్డుకోలేరని అల్లు అర్మీ అంటోంది. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యాన్ వార్ మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
నవంబర్ 11 , 2024
Bagheera Trailer Review: ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?
ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి.
బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లో..
‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ కథతో హోంబలే ఫిల్మ్స్ ‘బగీరా’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ 'ఉగ్రమ్' హీరో శ్రీ మురళి ఇందులో లీడ్ రోల్ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్ చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే యాక్షన్‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=O38mUkgL-w8
కేజీఎఫ్ తరహా డైలాగ్స్!
ప్రశాంత్ నీల్ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. 'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్ రాజ్ ట్రైలర్‌లో కనిపించాడు.
తల్లి సెంటిమెంట్!
కేజీఎఫ్ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘NTR 31’తో బిజీ బిజీ
సలార్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ బంగ్లాదేశ్ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ వర్మ 'NTR 31' ప్రాజెక్ట్‌ను సింగిల్ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'సలార్ 2' ప్రశాంత్ నీల్ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 21 , 2024
Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024
Devara Story Prediction: కొరటాల శివ సూపర్ హిట్ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్ స్టోరీ ఇదేనా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా నేడు రిలీజ్ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొరటాల ఫార్ములా ఇదే?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage), ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం 'ఆచార్య' కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్ - పాదగట్టం - చిరును లింకప్ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.
దేవర స్టోరీ ఇదేనా?
కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్ మాత్రం కన్విన్సింగ్ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
చరిత్ర సృష్టించిన ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా అది 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో తారక్..
'దేవర' తర్వాత తారక్ లైనప్‌లో బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో పాటు 'NTR 31' కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, 'NTR 31' ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ లోడింగ్..
యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Coolie Movie: రజనీ కాంత్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!
భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
క్రేజీ కాంబో లోడింగ్..!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్ ఖాన్ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
29 ఏళ్ల క్రితమే..
రజనీకాంత్, అమీర్ ఖాన్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్ హై ఆటంక్’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్ ఖాన్, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విలన్‌గా కన్నడ స్టార్!
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
171వ చిత్రంగా కూలీ
తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్’ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి.
రజనీ వ్యాఖ్యలపై దుమారం
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఆగస్టు 27 , 2024
Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024
Mahesh Babu Voice To Mufasa: మహేష్ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్ సింహాం ‘ముఫాసా’..!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహానికి మహేష్ డబ్బింగ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/taran_adarsh/status/1826142693149327810
డబ్బింగ్‌పై మహేష్ ఏమన్నారంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ యానిమేషన్ చిత్రంలో మెయిన్ లీడ్‌కు డబ్బింగ్ చెప్పడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను బిగ్ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
హిందీలో డబ్బింగ్ ఎవరంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారుక్ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
ఆగస్టు 21 , 2024
Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ ఫస్ట్ ఫిల్మ్ ఆకట్టుకుందా!
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: రామ్ భీమన
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాత: డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్
యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచిత్ రామ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్ - అమ్ము మధ్య వచ్చే లవ్ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్ మెుత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్ రాజ్ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్ భీమన పూర్తిగా విఫలమయ్యాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్‌తరుణ్ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్ కెమెస్ట్రీ
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
జూలై 27 , 2024
Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్ షేడ్స్ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఫహాద్‌కు నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే!
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.
ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి?
ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ADHD వ్యాధి ఎలా వస్తుంది?
ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.
కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్
ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్ ఫాజిల్ సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఫహాద్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ఫహాద్.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.
మే 28 , 2024
Furiosa A Mad Max Saga Movie Review: ఎడారిలో అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ‘ఫ్యూరియోసా’ ఎలా ఉందంటే?
నటీనటులు : అన్య టేలర్, క్రిస్ హెమ్స్‌వర్త్, టామ్ బుర్కె, అలైలా బ్రౌనీ, జాన్ హౌవర్డ్, ల్యాచీ హుల్మే, అంగుస్ శాంప్సన్ తదితరులు
డైరెక్టర్ : జార్జ్ మిల్లర్
సంగీతం : జుంకీ ఎక్స్‌ఎల్
సినిమాటోగ్రాఫర్ : సైమన్ డుగ్గాన్
ఎడిటర్ : మార్గరేట్ సిక్సెల్
నిర్మాత: డౌగ్ మిచెల్
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga Review In Telugu). 2015లో వచ్చిన ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’.. యాక్షన్ సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన మూవీ కావడంతో భారత్ సహా వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. తొలి భాగంలో ఆమె సిటాడెల్ రాజు దగ్గర నుంచి తప్పించుకోవడం చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ఆమె బాల్యం? సిడాడెల్ రాజు వద్దకు ఎలా వచ్చింది? అందుకు కారణం ఎవరు? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది చూపించారు. ‘థోర్’, ‘ఎక్స్‌ట్రాక్షన్’ లాంటి చిత్రాలతో భారత ఆడియన్స్‌కు దగ్గరైన క్రిస్ హెమ్స్‌వర్త్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
భూమి సారం కోల్పోయి ఎడారిగా మారే కాలంలో కథ జరుగుతుంటుంది. తల్లి మేరి (చార్లీ ఫ్రేజర్)తో ఉన్న ఫ్యూరియోసా (అన్య టేలర్)ను ఓ బైకర్ యంగ్ ఎత్తుకుపోతుంది. వెతుక్కుంటూ వచ్చిన మేరీని ఆ ముఠా లీడర్ డెమంటస్ (క్రిస్ హెమ్స్‌వర్త్).. ఫ్యూరియోసా కళ్ల ముందే దారుణంగా హత్య చేస్తాడు. ఆపై ఆమెను సంధిలో భాగంగా సిటాడెల్ రాజుకు ఇచ్చేస్తాడు. రాజు నుంచి తప్పించుకున్న ఫ్యూరియోసా మగ వేషం ధరించి ఓ కారణం చేత సిటాడెల్ సైన్యాధికారికి కుడి భుజంగా మారుతుంది. ఫ్యూరియోసా కథ చివరికి ఏమైంది? తన తల్లిని చంపిన డెమెంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎడారిలోనూ పండగల విత్తనం ఆమె చేతికి ఎలా వచ్చింది? దాంతో ఆమె ఏం చేసింది? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
చిన్నప్పటి ఫ్యూరియోసాగా (Furiosa: A Mad Max Saga Review In Telugu) అలైలా బ్రౌనీ, పెద్దయ్యాక ఫ్యూరియోసాగా అన్యా టేలర్ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అన్యా టేలర్ ఇరగదీసింది. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇక ప్రతినాయకుడు డెమెంటస్ పాత్రలో క్రిస్ హెమ్స్‌వర్త్ జీవించాడు. ఇప్పటివరకూ హీరోగానే పరియం ఉన్న అతడు విలన్‌గానూ తన మార్క్ ఏంటో చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ జార్జ్ మిల్లర్ మంచి థ్రియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో తెరకెక్కించాడు డైరెక్టర్. పెద్దగా ల్యాగ్ లేకుండా సినిమా మెుదలైన 10 నిమిషాలకే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. ఫ్యూరియోసాను డెమెంటస్ గ్యాంగ్ ఎత్తుకుపోవడం, ఆమె తల్లిని చంపడం, ఫ్యూరియోసా ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరడం ఇలా కథ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. హీరోగా అందరికీ పరిచయమైన క్రిస్ హెమ్స్‌వర్త్‌ను ఈవిల్ వెర్షన్‌లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నాడు. అయితే యాక్షన్ సీన్లు మరీ లెంతీగా ఉండటం, ఎడారిలో వచ్చే క్లైమాక్స్ ఛేజ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Furiosa: A Mad Max Saga Review In Telugu).. ప్రతీ విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సైమన్ డుగ్గాన్ పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫ్యూచరిక్ విజువల్ వండర్‌గా ఆయన మూవీని తీర్చిదిద్దాడు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. గ్రాఫిక్స్ టీమ్ పనితీరు కూడా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అన్య టేలర్, క్రిస్ హెమ్స్‌వర్త్ నటనయాక్షన్ సీక్వెన్స్‌సాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 3/5
మే 24 , 2024
‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్, సెంటీమెంట్ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సలార్ (Salaar)
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్ మెప్పిస్తాయి.
https://twitter.com/i/status/1760698195787870606
ఆర్‌ఆర్‌ఆర్
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్ బంగ్లాలోకి తారక్ జంతువులతో ప్రవేశించే సీన్ హైలేట్ అని చెప్పవచ్చు. అటు తారక్ - రామ్‌చరణ్ ఫైటింగ్ కూడా మెప్పిస్తుంది.
https://twitter.com/i/status/1758341886304284738
బాహుబలి 2 (Bahubali 2)
బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అదరహో అనిపిస్తాయి.
https://www.youtube.com/watch?v=TloNJQKZiFg
జెర్సీ (Jersey)
నేచురల్ స్టార్ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్ వెళ్తుండగా నాని అరిచే సీన్.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw
రేసుగుర్రం (Race Gurram)
అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్ పాండే పాత్రతో సర్‌ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్
https://www.youtube.com/watch?v=jxBLgrppzpc
వేదం (Vedam)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్ డబ్బులు కొట్టేసే సీన్ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్ హృదయాలకు హత్తుకుంటుంది.
https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk
పోకిరి (Pokiri)
మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.
https://www.youtube.com/watch?v=PvkITH66FEc
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్ ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్ చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వెేయిస్తుంది. ప్రభాస్ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc
జనతా గ్యారేజ్ (Janatha Garage)
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’లో తారక్ పవర్ ప్యాక్డ్ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్ సీన్ మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు.
https://www.youtube.com/watch?v=FmAak259Its
టెంపర్ (Temper)
తారక్-పూరి కాంబోలో వచ్చిన టెంపర్ చిత్రంలో.. కోర్టు సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.
https://twitter.com/i/status/1668264361469591558
https://twitter.com/i/status/1668264361469591558
విక్రమార్కుడు (Vikramarkudu)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్ రాథోడ్ అనే పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://www.youtube.com/watch?v=aorA5S083W4
మగధీర (Magadheera)
రామ్‌చరణ్ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్ షేర్‌ఖాన్ పంపిన వందమంది సైనికులను చంపే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ సినిమాను మలుపు తిప్పుతుంది.
https://www.youtube.com/watch?v=9NJya1B8mvI
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్ తరపు మనుషులకు ప్రభాస్ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ
ఆడవారి మాటలకు అర్థాలే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.
https://www.youtube.com/watch?v=L26KInZYQcI
ఇంద్ర (Indra)
మెగాస్టార్ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్ గతాన్ని రివీల్ చేసే ఇంటర్వెల్ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు.
https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I
సింహాద్రి (Simhadri)
రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్ ప్రతీకారం తీర్చుకునే సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సూపర్‌గా అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo
తులసి (Thulasi)
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.
https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
ఫిబ్రవరి 24 , 2024