• TFIDB EN
  • పేక మేడలు
    UATelugu
    లక్ష్మణ్, వరలక్ష్మి దంపతులు. మూసీ ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్‌ ఇంజనీరింగ్‌ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. ప్లాట్స్‌ అమ్మి కోట్లు సంపాదిస్తానని గాల్లో మేడలు కడుతుంటాడు. ఈ క్రమంలో యూఎస్‌ నుంచి వచ్చిన శ్వేతకు డబ్బున్న వ్యక్తిగా లక్ష్మణ్‌ దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? లక్మణ్‌ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!

    హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్‌ ప్...read more

    How was the movie?

    తారాగణం
    వినోద్ కిషన్
    అనూష నూతుల
    అనూష కృష్ణ
    రేతిక శ్రీనివాస్
    ప్రదేప్ రాపర్టీ
    J. జగన్ యోగిరాజ్
    సిబ్బంది
    నీలగిరి మామిళ్లదర్శకుడు
    రాకేష్ వర్రే
    నిర్మాత
    కథనాలు
    <strong>Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!</strong>
    Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!
    నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు. దర్శకత్వం: నీలగిరి మామిళ్ల సంగీతం: స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె. ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ నిర్మాత: రాకేష్ వర్రే నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ విడుదల తేది: జులై 19, 2024 హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? కథేంటి లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు. మూసీ నది ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్‌ ఇంజనీరింగ్‌ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడుతుంటాడు. మరోవైపు భార్య వరలక్ష్మీ కుటుంబ భారం మెుత్తం తానే మోస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి రియల్‌ ఎస్టేట్‌ కోసం వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్‌)తో లక్ష్మణ్‌కు పరిచయమవుతుంది. శ్వేతను ట్రాప్‌ చేసేందుకు తాను డబ్బున్న వ్యక్తినని లక్ష్మణ్‌ కటింగ్ ఇస్తాడు. భార్య పేరు వాడుకొని బస్తీ మెుత్తం అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మీ ఏం చేసింది? లక్ష్మణ్‌కు శ్వేత భర్త ఎలా గుణపాఠం చెప్పాడు? పేక మేడలు లాంటి హీరో కలలు నిజమయ్యాయా? లేదా? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే తమిళ నటుడు వినోద్‌ కిషన్‌ తెలుగులో నేరుగా చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ఇదే. లక్ష్మణ్‌ పాత్రలో అతడు చక్కగా ఒదిగిపోయాడు. గాల్లో మేడలు కడుతూ కాలక్షేపం చేసే భర్త పాత్రలో అద్భుతన నటన కనబరిచాడు. మరోవైపు కుటుంబ భారం మోసే మిడిల్‌ క్లాస్‌ వైఫ్‌ పాత్రలో అనూష క్రిష్ణ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్ కూడా మంచి నటన కనబరిచింది. సినిమా మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే హైదరాబాద్‌ బస్తీలో ఉండే నిరుపేదల జీవితాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు నీలగిరి మామిళ్ల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటుందనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు. బస్తీల్లో ఉండే పరిస్థితులు అక్కడి పిల్లలను ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే దానికి ఫన్‌ టచ్‌ ఇచ్చారు డైరెక్టర్‌. అంతేకాదు మహిళ సాధికారతను సైతం చూపించే ప్రయత్నం చేశారు. జీవితంలో కష్టపడందే ఏది సాధ్యం కాదన్న సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. ఫస్టాఫ్‌ మెుత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, రొటిన్‌ స్టోరీ, కొన్ని సన్నివేశాలు గతంలోనే చూసిన భావనను కలిగించడం వంటివి మూవీకి మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయాలకు వస్తే సంగీతం బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా చాలా రిచ్‌గా నిర్మించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనకథనం, స్క్రీన్‌ప్లేసందేశం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    <strong>This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!</strong>
    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు డార్లింగ్‌ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామం రాఘవం కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; పేక మేడలు హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు.&nbsp; క్రైమ్‌ రీల్‌ సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon&nbsp;July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon&nbsp;July 19
    జూలై 15 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.&nbsp; ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.&nbsp; ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.&nbsp;&nbsp; &nbsp;‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’&nbsp; ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.&nbsp; https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.&nbsp; ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.&nbsp; https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.&nbsp; ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.&nbsp; &nbsp;తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ&nbsp; సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.&nbsp; https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    <strong>HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;</strong>
    HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;
    సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్‌ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్‌ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.&nbsp; View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది. యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.&nbsp; దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు. అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.&nbsp; రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్‌ చేసింది.&nbsp; ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట. ‘సైజ్‌ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్‌ మిస్టేక్‌ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.&nbsp; సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్‌ క్రష్‌ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్‌ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అని ఓ ఇంటర్వూలో రివీల్‌ చేసింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్‌ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్‌ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది. 'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.&nbsp; ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; వాస్తవానికి అరుంధతి ఆఫర్‌ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్‌ రిజెక్ట్‌ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్‌ ఎవరన్న విషయం మాత్రం రివీల్‌ చేయలేదు.&nbsp; అనుష్క ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌తో ఓ బుక్‌ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్‌ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్‌ వెయిల్‌ లాస్‌ పిల్‌' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్‌ చేసింది. 62 రకాల హెల్త్‌ టిప్స్‌, వెయిట్‌ లాస్‌ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.&nbsp; అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్‌ తాగుతూ కనిపించింది. సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్‌ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
    నవంబర్ 07 , 2024
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    నటీనటులు : దేవ్‌ గిల్‌, చిత్రా శుక్ల, తేజస్విని పండిట్‌, ప్రవీణ్‌ టార్దే, పోసాని కృష్ణ మురళి, షియాజీ షిండే, కాలకేయ ప్రభాకర్‌, తదితరులు డైరెక్టర్‌ : పేట త్రికోఠి రచన, మాటలు : ప్రసాద్‌ వర్మ సంగీతం : రవి బస్రూర్‌ ఎడిటర్‌ : తమ్మిరాజు,&nbsp; నిర్మాతలు : దేవ్‌ గిల్‌, మిహిర్‌ సుధీర్‌, అశ్వనీ కుమార్‌ మిశ్రా విడుదల తేదీ : 30-08-2024 మగధీరలో విలన్‌గా చేసి నటుడు దేవ్‌ గిల్‌ (Dev Gill) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka Movie Review). త్రికోటి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగ దేవ్‌ గిల్‌ సక్సెస్‌ అయ్యాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీలు పని కోసం వెళ్లి 25 ఏళ్లుగా కనిపించకుండా పోతారు. వారి ఆచూకి తెలియక, అసలు బతికున్నారో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు రోధిస్తుంటారు. ఈ క్రమంలోనే పూణే పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా విక్రమార్క (దేవ్‌ గిల్‌) ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వస్తాడు. ఆపై డ్రాగ్‌ మాఫియా వ్యక్తి బిలాల్‌ (పోసాని కృష్ణమురళి)తో చేతులు కలిపి అక్రమాలకు తెరలేపుతాడు. ప్రేయసి అర్చన (చిత్రా శుక్లా) ప్రభావంతో నిజాయతీ గల పోలీసు ఆఫీసర్‌గా మారతాడు. విక్రమార్కలో మార్పుకు కారణమైన ఘటన ఏంటి? కూలి కోసం వెళ్లి మిస్సైన వారు ఏమయ్యారు? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? లేదా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే దేవ్‌ గిల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో యాక్షన్‌ కోసం అతడు పెద్దగా కష్టపడినట్లు కనిపించలేదు. అయితే లవ్ సీన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో దేవ్‌ గిల్‌ పూర్తిగా తేలిపోయాడు. ముఖంలో హావభావాలు పలికించలేక బాగా తడబడ్డాడు. హీరోయిన్‌గా చిత్రా శుక్ల నటన బాగుంది. పాత్రకు తగ్గట్లు ఆమె ఒదిగిపోయారు. విలన్‌గా చేసిన ప్రవీణ్‌, ఏసీపీ భవానీగా నటించిన తేజస్విని పండిట్ ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే సెటిల్డ్‌ నటనతో మెప్పించారు. మిగతా పాత్రదారులు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు పేట త్రికోఠి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘టెంపర్‌’, ‘పటాస్‌’ చిత్రాలను గుర్తు చేస్తుంది. కథలో మాత్రం కొత్తదనం కనిపించదు. అటు కథనం కూడా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. కథకు తగ్గట్లు హీరో నుంచి నటన రాబట్టడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హీరో-హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దేవ్‌ గిల్‌ హీరోయిన్‌ వైపు ప్రేమగా చూసిన అది విలన్‌ రోల్‌ను గుర్తు చేస్తుంటుంది. అయితే ఫైట్స్‌లో మాత్రం దర్శకుడు త్రికోఠి తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. విలన్లతో తలపడే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి పనితీరు కనబరిచింది. రవి బస్రూర్‌ అందించిన సంగీతం పూర్తిగా తేలిపోయింది. నేపథ్య సంగీతం మాత్రమే అక్కడక్కడ కాస్త పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌నిర్మాణ విలువలు మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంహీరో నటనలాజిక్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 1.5/5&nbsp;&nbsp; .
    ఆగస్టు 30 , 2024
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    ప్రజా గాయకుడు గద్దర్‌ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్‌ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్‌. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్‌ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్‌ ఎందుకంత స్పెషల్‌. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; బండెనక బండి కట్టి గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్‌ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.&nbsp; https://www.youtube.com/watch?v=8T3F4IuYarM &nbsp;మల్లెతీగకు పందిరివోలె 1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్‌ స్వయంగా రాశారు. ఈ సాంగ్‌ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI పొడుస్తున్న పొద్దుమీద గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ కేటగిరీలో గద్దర్‌ నంది ‌అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. https://www.youtube.com/watch?v=vywBbz6QL7g నా రక్తంతో నడుపుతా ఓరేయ్‌ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్‌. నారాయణమూర్తి రక్తి కట్టించారు.&nbsp; https://www.youtube.com/watch?v=XhbiuSTugNc అమ్మ తెలంగాణా&nbsp; తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం. https://www.youtube.com/watch?v=pXgjUMosLWY మరిన్ని పాటలు పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
    ఆగస్టు 07 , 2023
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : అజ్మల్‌ అమీర్‌, మానస రాధాక్రిష్ణన్‌, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్‌ ప్రభూనే, కోటా జయరామ్‌, ఎలెనా టుతేజా తదితరులు దర్శకుడు : రామ్‌గోపాల్‌ వర్మ సంగీతం : బాలాజీ సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్‌ ఎడిటింగ్‌ : మనీష్‌ థాకూర్‌ నిర్మాత : దాసరి కిరణ్‌ కుమార్‌ టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్‌ (ధనుంజయ్‌ ప్రభునే), పవన్‌ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్‌ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే వైఎస్‌ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్‌ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్‌ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్‌ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్‌ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్‌ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్‌ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ పాత్రకు పాత్రకు మైలేజ్‌ ఇస్తూ.. చంద్రబాబు, పవన్‌ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్‌ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది. టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్‌ రాజేంద్రన్‌ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ అజ్మల్‌ అమీర్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంద్వితీయార్థంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 02 , 2024
    Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
    Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!
    సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ చేసిన అద్భుత నటనకు బాలీవుడ్‌ ఆడియన్స్‌ సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఎర్ర చందనం చుట్టూ తిరిగే ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. కూలి స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ నాయకుడిగా బన్నీ ఎదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌కు అదిరిపోయే రేంజ్‌లో బన్నీ వార్నింగ్‌ ఇవ్వడంతో తొలి పార్ట్‌ ముగుస్తుంది.&nbsp; పుష్ప తొలి పార్ట్‌ను చాలా ప్రశ్నలతోనే సుకుమార్‌ ముగించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే రెండో పార్ట్‌ చూడాల్సిందే అన్న ఆసక్తిని సగటు ప్రేక్షకుడి కలిగించాడు. దీంతో పుష్ప 2 కథను ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకున్నారు. కేజీఎఫ్‌-2 లాగా పుష్ప సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని జోస్యం చెప్పడం ప్రారంభించారు. వీటన్నింటికిి సుకుమార్‌ చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. పుష్ప 2కు సంబంధించిన 20 సెకన్ల వీడియోను విడుదల చేసి సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు.&nbsp; https://youtu.be/JG-u9rNLq50 ఆసక్తికరంగా గ్లింప్స్ చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌ను బట్టి… హీరో పుష్ప(అల్లుఅర్జున్‌) పై పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్ షెకావత్‌ రివేంజ్‌ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. పుష్పను అరెస్టు చేసి తిరుపతి జైలులో బంధించినట్లు కనిపిస్తోంది. పుష్ప జైలు నుంచి తప్పుకోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో పుష్ప మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. పోలీసులు డౌన్‌ డౌన్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తారు. అసలు పుష్ప ఎక్కడ?. అంటూ 20 సెకన్లలో ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా మరింత సమాచారం కావాలంటే ఏప్రిల్‌ 7th&nbsp; సా. 4.05 ఆగాల్సిందేనని వీడియోలో కనిపిస్తోంది.&nbsp;అయితే తాజాగా రిలీజైన వీడియో పుష్ప 2పై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.&nbsp; పుష్పకు ప్రజాదరణ తొలిపార్ట్‌లో పుష్ప ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనం దుంగలను తరలించి సిండికేట్‌ సభ్యులను ఆకర్షిస్తాడు. మెుదటి పార్ట్‌లో హీరోకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉండదు. అయితే సెకండ్‌ పార్ట్‌లో పుష్పకు ఫాలోయింగ్‌ ఉన్నట్లు తాజాగా రిలీజైన వీడియోలో చూపించారు. మరి ఒక్కసారిగా పుష్పకు ప్రజల మద్దతు ఎలా పెరిగిందన్న అంశం ఆసక్తిరేపుతోంది. ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బును పుష్ప ఏమైనా ప్రజా శ్రేయస్సుకు ఖర్చు చేసి ఉంటాడా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ప్రజలకు మేలు కలిగించే పనులు చేసి వారి మద్దతు చొరగొన్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కేశవ నమ్మక ద్రోహం? &nbsp; పోలీసుల కళ్లుగప్పి తిరిగే పుష్ప ఎలా అరెస్టయ్యాడనేది ఆసక్తికరం. పుష్పను పోలీసులకు తన ప్రాణ స్నేహితుడు కేశవే పట్టించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఊహిస్తున్నారు. ఇదే సినిమాలో ట్విస్ట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.&nbsp; శ్రీవల్లి క్యారెక్టర్‌ కూడా పుష్పకు దూరమయ్యే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.&nbsp; పుష్ప 2లో ప్రతికారం.. మెుదటి పార్ట్‌లో మంగళం శీను (సునీల్‌), దాక్షాయణి (అనసూయ), జాలిరెడ్డి (ధనుంజయ్‌) డీఎస్పీ గోవిందప్పను పుష్ప చాలా ఇబ్బందులకు గురిచేస్తాడు. పుష్ప కారణంగా జాలిరెడ్డి మంచానికి పరిమితం కాగా, మంగళం శీను తన బామ్మర్దిని కోల్పోతాడు. మరి సెకండ్‌ పార్ట్‌లో వారు కూడా షెకవాత్‌తో చేయి కలిపి పుష్పపై పగ తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రజాదరణ పొందిన పుష్పను షెకావత్‌ ఏ కేసులో అరెస్టు చేశాడో తెలియాల్సి ఉంది. మరి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప షెకావత్‌పై ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? శ్రీవల్లి కడవరకు ఉంటుందా?&nbsp; పుష్ప స్నేహితుడు కేశవ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నమ్మకద్రోహం చే &nbsp; తెలియాలంటే పుష్ప-2 చూడాల్సిందే.&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.&nbsp; https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.&nbsp; https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,&nbsp; డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.&nbsp; అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే.. ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.&nbsp; అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.&nbsp; ఎవరెలా చేశారంటే? నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.&nbsp; నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.&nbsp; అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. &nbsp;సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5
    మే 26 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    <strong>Game Changer Third Single: నానా హైరానా సాంగ్ లిరిక్స్ మీకోసం</strong>
    Game Changer Third Single: నానా హైరానా సాంగ్ లిరిక్స్ మీకోసం
    మెగా పవర్ స్టార్&nbsp; రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ మరో అదిరిపోయే ట్రీట్‌ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్‌గా అమేజింగ్‌ మెలోడీ సాంగ్‌ (Naanaa Hyraanaa)ను రిలీజ్‌ చేసింది. యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ మీకోసం. Naanaa Hyraanaa Song Lyrics Telugu నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా నానా హైరానా ప్రియమైనా హైరానా.. మొదలాయే నాలోనా.. లలనా నీ వలనా.. నానా హైరానా.. అరుదైన హైరానా.. నెమలీకల పులకింతై.. నా చెంపలు నిమిరేనా.. దానా దీనా ఈ వేళ.. నీలోనా.. నాలోనా.. కనివిననీ కలవరమే.. సుమ శరమా.. వందింతలయ్యే... నా అందం Naanaa Hyraanaa Song Lyrics&nbsp; నువ్వు నా పక్కన ఉంటే... వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే.. వెయ్యింతలాయే.. నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే.. మంచోనవుతున్నా.. మరికొంచెం.. నువ్వు నా పక్కన ఉంటే.. నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా ఎపుడు లేని... లేని వింతలు ఇపుడే చూస్తున్నా.. గగనాలన్నీ.. పూల గొడుగులు భువనాలన్నీ... పాల మడుగులు &nbsp;కదిలే రంగుల భంగిమలై.. కనువిందాయే పవనములు ఎవరు లేనే.. లేని దీవులు నీకు.. నాకేనా... రోమాలన్నీ.. నేడు మన ప్రేమకు జెండాలాయే.. ఏం మాయో.. మరి ఏమో నరనరమూ.. నైలు నదాయే.. తనువేలేనీ ప్రాణాలు.. తారాడే ప్రేమల్లో..&nbsp; అనగనగా సమయములో... తొలి కథగా.. Naanaa Hyraanaa Song Lyrics&nbsp; వందింతలయ్యే... నా అందం నువ్వు నా పక్కన ఉంటే... వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే.. వెయ్యింతలాయే.. నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే.. మంచోనవుతున్నా.. మరికొంచెం.. నువ్వు నా పక్కన ఉంటే.. నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా... థిల్లానా దిన్నా https://www.youtube.com/watch?v=EqDlrimnMCE
    నవంబర్ 29 , 2024
    <strong>Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి సమర్పణ: తబితా సుకుమార్ సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య విడుదల తేదీ : 23-08-2024 రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్‌ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం 'ఆయ్'తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్‌ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. అయితే గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్‌ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్‌ టైమింగ్‌, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్‌ లవ్‌ ట్రాక్‌, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్‌ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రావు రమేష్‌ నటనకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్‌ అంకిత్‌ లవ్‌ ట్రాక్‌ఊహాకు అందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 23 , 2024
    <strong>HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?</strong>
    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.&nbsp; తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరులో కసి పెంచిన ఘటన ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్‌ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్‌ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్‌ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు. చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి 1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్‌ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు. చిరు మెస్మైరైజింగ్‌ డ్యాన్స్‌కు కారణం ఇదే! కెరీర్‌ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట.&nbsp; సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్‌ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.&nbsp; రివ్యూవర్‌ నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి.. మెగాస్టార్‌ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్‌ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్‌ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.&nbsp; కుర్ర హీరోలకు అండగా.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డగా.. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. సేవా కార్యక్రమాల్లో ముందజ.. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
    ఆగస్టు 22 , 2024
    Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
    Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
    దృశ్యం సినిమాలో వెంకటేష్‌ చిన్న కూతురిగా క్యూట్‌గా మెప్పించిన నటి ఎస్తర్‌ అనిల్‌ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రచ్చరచ్చ చేస్తోంది. గ్లామర్‌ డోసును అమాంతం పెంచేసి సొదసుల విందు చేస్తోంది. తాజాగా లాంగ్‌ స్కర్ట్‌పై క్లీవేజ్‌ షోతో కైఫెక్కిస్తోంది.&nbsp; టైట్‌ ఫీట్ జాకెట్‌ ధరించిన ఈ భామ ఎద అందాలను ఆరబోసింది. నాభి అందాల ఆలంబనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్తర్ అనిల్ పసందైన పరువాలను&nbsp; చూసిన నెటజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.&nbsp; సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. తద్వారా ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది. లెలేత పరువాలతో ఓలలాడిస్తున్న ఈ మలయాళి తెగింపుకు.. ఇన్‌స్టాలో 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఏ డ్రెస్ వేసినా తనలోని అందాల కోణాలను మాత్రం కసిగానే చూపిస్తోంది.. ఈ కొంటె అందం. &nbsp;మెున్నటిదాకా చిన్నపిల్లలా కనిపించిన ఎస్తర్‌ అప్పుడే ఇంత పెద్దదయ్యిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.&nbsp; క్యూట్ లుక్స్‌లో కనిపించిన ఎస్తర్‌.. ఇప్పుడు హాట్‌ బ్యూటీగా మారిందంటూ కమెంట్లు చేస్తున్నారు. ఎస్తేర్ అనిల్&nbsp; ఆగస్టు 27 (2001)&nbsp; కేరళలోని వాయనాడ్‌లో జన్మించింది. మలయాళంలో పాపనాశం(దృశ్యం) 2016 సినిమాలో నటించినందుకు గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు సొంతం చేసుకుంది. 2010లో 'నల్లవన్‌' అనే మలయాళం సినిమాతో ఎస్తర్‌ సినీ రంగ ప్రవేశం చేసింది. &nbsp;మలయాళంలో వచ్చిన పాపనాశం చిత్రం ఎస్తర్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; తెలుగు, తమిళం రీమేక్‌గా వచ్చిన దృశ్యం 1, 2 సినిమాల్లోనూ ఎస్తర్‌నే తీసుకున్నారు.&nbsp; తాజాగా తమిళ్‌లో రిలీజైన వింధ్య బాధితుల తీర్పు V3లోనూ నటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఈ హాట్ క్యూటీ ఎదురు చూస్తోంది. అందులో భాగంగానే హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది
    జూలై 10 , 2023
    Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
    Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
    టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా&nbsp; మోహన్‌బాబు ఇంటి గేట్లు మూసేశారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేట్లు తోసుకుంటూ వెళ్లిన మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు.&nbsp; మంచు మోహన్ బాబు కుటుంబ విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. జల్‌పల్లిలోని నివాసం నుంచి తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను బయటకు పంపించాలనే నిర్ణయాన్ని మోహన్ బాబు తీసుకున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న సమస్యలు ఈ పరిణామానికి దారితీశాయి. మనోజ్ తన ఇంట్లో ఇక ఉండటానికి వీలులేదని మోహన్ బాబు స్పష్టంగా ప్రకటించారు. https://twitter.com/klapboardpost/status/1866498406912598450 ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ తన సామాన్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడు పెద్ద వాహనాలను ఏర్పాటు చేసి, తన వ్యక్తిగత వస్తువుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఘర్షణలు తీవ్రతకు చేరుకున్న కారణంగా, ఈ పరిణామం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. పోలీసుల బందోబస్తు ఇంటిలో అనవసర గొడవలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు జల్‌పల్లి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో మనోజ్ తన సామగ్రిని ఇంటి బయటకు తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇటీవల, భద్రత కల్పించాల్సిందిగా డీజీ ఇంటెలిజెన్స్‌కు మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో, బౌన్సర్ల వివాదం కూడా మరింత చర్చనీయాంశమైంది. విష్ణు బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించడంతో, మనోజ్ తన భద్రత కోసం పోలీసులపై ఆధారపడ్డారు. మీడియాపై మోహన్‌బాబు దాడి మోహన్‌ బాబు ఇంటి వద్ద జరుగుతున్న పరిణామాలను కవర్‌ చేసేందుకు వెెళ్లిన మీడియాపై మోహన్‌ బాబు అతని అనుచరులు దాడి చేశారు. జర్నలిస్టుల చేతిలోని మైక్‌లు ధ్వంసం చేసి దుర్బాషలాడారు. మోహన్ బాబు తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్? శనివారం రాత్రి మంచు మనోజ్, మోహన్‌ బాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆ ఇంట్లో పనిచేసే పని మనిమనిషి తెలిపారు. ఈక్రమంలో అడ్డు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తిపై మనోజ్ దాడి చేశాడని ఆమె తెలిపారు. తన స్టాఫ్‌ను ఏం అనొద్దని మోహన్ బాబు అన్నారని కానీ మనోజ్ పట్టించుకోలేదని తెలిపారు. ఈక్రమంలో మాట మాట పెరిగి మనోజ్... మోహన్ బాబుపై చేయి చేసుకున్నారని పని మనిషి తెలిపింది. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్‌బాబుతో పాటు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని ఆమె తెలిపారు. అప్పటి నుంచే ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/NtvTeluguLive/status/1866399846258917662 విభేదాలు ఎటువైపు? ఇప్పటివరకు ఐక్యంగా కనిపించిన మంచు కుటుంబం, ఇప్పుడు విభజన దిశగా సాగుతోందని భావిస్తున్నారు. కుటుంబ ఘర్షణల కారణంగా వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ పరిణామం మంచు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను మరింత వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్‌లో ఈ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో వేచిచూడాల్సి ఉంది.
    డిసెంబర్ 10 , 2024
    <strong>Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?</strong>
    Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?
    జూ. ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్‌ చిత్రం 'దేవర' (Devara: Part 1). సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది. తొలుత మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు ప్రదర్శించింది. తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తయ్యాయి. దేవర 10 డేస్‌ కలెక్షన్స్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా ఆ ఫిగర్స్‌ చూసి అందరూ షాకవుతున్నారు. దేవరోడి ఊచకోత ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; [toc] రూ.500 కోట్లకు చేరువలో.. దేవరలో తారక్‌ జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించాడు. ఇక దేవర కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమాా 10 రోజుల్లో రూ.466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని వరల్డ్‌ వైడ్‌గా తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. బ్లాక్‌ బాస్టర్‌ కలెక్షన్స్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోందని పేర్కొన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.193.55 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కర్ణాటకలో రూ.16.40 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కేరళలో రూ.92 లక్షలు, హిందీతో పాటు రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రూ.29.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఇదే ఊపు కొనసాగితే ఈ వీకెండ్‌లోనే రూ.500 కోట్ల మార్క్‌ను దేవర అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ఫస్ట్‌డే, వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జంటగా నటించిన దేవర చిత్రం తొలి రోజు ఏకంగా రూ.రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.రూ.83.71 కోట్లు రాబట్టి 'RRR' తర్వాత ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇక తొలి వీకెండ్‌ పూర్తయ్యే సరికి దేవరోడు కలెక్షన్ల మార్క్‌ రూ.300 కోట్లు అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే ఆ తర్వాత నుంచి వసూళ్లు క్రమేణా తగ్గుతూ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం లాభాల్లోకి తీసుకొచ్చింది. గత వారం పెద్ద చిత్రాలు రిలీజ్ కాకపోవడంతో ‘దేవర’కు ఈ వీకెండ్‌ వరకూ వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. తేలికగానే రూ.500 కోట్ల మార్క్‌ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ఆదివారం నుంచి లాభాల్లోకి.. తెలుగు రాష్ట్రాల్లో దేవర శనివారం (సెప్టెంబర్‌ 5) సెకండ్ షోస్ ముగిసే నాటికి దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఆదివారం నుంచి వస్తున్న కలెక్షన్స్‌ అన్నీ లాభాలే. దసరా సెలవులు కూడా కలిసి రావడం మరే పెద్ద సినిమాలు లేకపోవడం దేవరకు బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అటు ఓవర్సీస్‌లోనూ దేవర కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. తెలుగుతో పాటు కేరళ, కర్ణాటక, హిందీ, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో చాలా చోట్ల దేవర లాభాల్లోకి వచ్చేసిందని ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దీంతో దేవర టీమ్‌తో పాటు తారక్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన తెలుగు చిత్రాలు అయితే టాలీవుడ్‌ నుంచి వచ్చిన పలు చిత్రాలు ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు సాధించాయి? ఓవరాల్‌ కలెక్షన్స్ ఎంత? ఆయా చిత్రాల డైరెక్టర్లు ఎవరు? ఏ స్టార్‌ హీరో అందులో నటించాడు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఓవరాల్‌గా రూ.1200 కోట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.&nbsp; యానిమల్‌ (Animal) బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆరు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 917.82 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవరాల్‌గా రూ.700 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp; RRR రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' పలు రికార్డులను కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.570 కోట్లను కొల్లగొట్టి ప్రశంసలు అందుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. బాహుబలి (Bahubali) ప్రభాస్‌ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌ సత్తా ఏంటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.600-650 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టి దేశంలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.&nbsp;
    అక్టోబర్ 07 , 2024
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    Om Bheem Bush Weekend Collections: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌.. ‘ఓం భీమ్‌ బుష్‌’కు ఇకపై అన్నీ లాభాలే!
    హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush). ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (Sri Harsha konuganti) దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలిరోజే గణనీయమైన వసూళ్లతో శ్రీవిష్ణు కెరీర్‌లోనే అత్యధిక డే1 కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెుదటి రోజు రూ. 4.60 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం రూ. 5.84 కోట్లు, ఆదివారం రూ. 6.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయితే సోమవారం నుంచి ఏ సినిమాకు అయినా సరే కలెక్షన్లు కాస్త తగ్గుతాయి. కానీ.. 'ఓం భీమ్ బుష్' విషయంలో మేజర్ డ్రాప్ కనిపించే అవకాశాలు తక్కువేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో పాటు ఈ సినిమాకు పోటీగా శుక్రవారం వరకూ ఏ సినిమా లేనందున వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. అమెరికాలోనూ వసూళ్ల ప్రభంజనమే! ఇండియాతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా&nbsp; 'ఓం భీమ్ బుష్'కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకూ 3.15 లక్షల డాలర్లను వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్‌లోపూ ఓవర్సీస్‌లో 5 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్‌ బుష్’ అందుకునే అవకాశం ఉంది.&nbsp; https://twitter.com/TeamVamsiShekar/status/1772133237508481183 నెట్‌ కలెక్షన్స్ ఎంతంటే? ట్రెడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘ఓం భీమ్‌ బుష్‌’ గత మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా 10.60 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక దేశవాప్తంగా ఈ సినిమా రూ.6.6 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది.&nbsp; తొలి రోజు రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.&nbsp; ఇకపై అన్నీ లాభాలే..! యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 6.6 కోట్లుగా ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గత మూడు రోజుల్లోనే రూ.10.60 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి మూడో రోజునే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇకపై ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే అని చెప్పవచ్చు.&nbsp; నెల రోజుల్లోనే ఓటీటీలోకి..! ‘ఓం భీం బుష్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.&nbsp;
    మార్చి 25 , 2024
    <strong>Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్‌ అనిల్‌ లేలేత అందాలు.. ఓవర్‌ డోస్‌ తట్టుకోగలరా!</strong>
    Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్‌ అనిల్‌ లేలేత అందాలు.. ఓవర్‌ డోస్‌ తట్టుకోగలరా!
    యంగ్‌ బ్యూటీ ఎస్తర్‌ అనిల్‌ (Esther Anil) మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.&nbsp; తాజాగా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్‌.. హాట్‌ అందాలను ఆరబోసింది. యద అందాలు చూపిస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంది.&nbsp; ఎస్తర్ తేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్‌ తలదన్నే గ్లామర్‌ ఆమె సొంతం అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; దృశ్యం (Drushyam) సినిమాలో వెంక‌టేష్ (Venkatesh) చిన్న కూతురిలా న‌టించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌ల‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.&nbsp; బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఎస్తర్‌ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందుకే తన అందాల తెగింపుతో నెటిజన్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.&nbsp; 2001 ఆగస్టు 27న జన్మించిన ఎస్తర్‌, బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో నల్లావన్‌ (Nallavan) సినిమా ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టింది.&nbsp; ఆ తర్వాత ఓరు నాల్‌ వారుమ్‌ (Oru Naal Varum), కాక్‌టైల్‌ (Cocktail), డాక్టర్‌ లవ్‌ (Doctor Love), ది మెట్రో (The Metro) చిత్రాల్లో బాలనటిగా చేసింది.&nbsp; వయోలిన్‌ (Violin), మల్లు సింగ్‌ (Mallu Singh) సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి అందరి దృష్టిని ఎస్తర్‌ ఆకర్షించింది.&nbsp; అయితే 2013లో మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో ఎస్తర్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.&nbsp; అందులో మోహన్‌లాల్‌ (Mohanlal) చిన్నకూతురిలా నటించింది. ఈ సినిమానే తెలుగులో వెంకటేష్‌తో రీమేక్‌ చేయగా తిరిగే అదే పాత్రను ఎస్తర్ పోషించింది.&nbsp; ‘దృశ్యం’ తర్వాత ఎస్తర్‌కు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘దృశ్యం 2’ తెలుగు, మలయాళ వెర్షన్‌లోనూ ఎస్తర్‌ నటించింది.&nbsp; గతేడాది జనవరిలో రిలీజైన 'వింధ్య విక్టిమ్‌ వర్‌డిక్ట్‌' సినిమాలోనూ ఎస్తర్‌ ముఖ్యపాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; ప్రస్తుతం తమిళంలో ‘మిణ్మినీ’ చిత్రంలో ఎస్తర్‌ నటిస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఎస్తర్ ఆశలన్నీ ఈ సినిమాపై ఉన్నాయి.&nbsp; ఇక ఎస్తర్‌ అవార్డుల విషయానికి వస్తే దృశ్యం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌ను దక్కించుకుంది. అలాగే ‘పాపనాశనం’ మూవీకి సంబంధించి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.&nbsp; ప్రస్తుతం హీరోయిన్‌గా రాణించాలని చూస్తోన్న ఎస్తర్ సోషల్ మీడియాలో వరుసగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.&nbsp; దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫ్యాన్స్‌ తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఆ ఖాతాను 1.4M మిలయన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 27 , 2024

    @2021 KTree