• TFIDB EN
  • పెళ్ళాం ఊరెళితే
    UTelugu
    ఓ వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లడంతో వేశ్యను తెచ్చుకుని ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఇరకాటంలో పడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌SunNext
    Watch
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీకాంత్
    వివేక్
    వేణు తొట్టెంపూడి
    సుబ్బు
    సంగీత క్రిష్
    సంధ్య
    రక్షిత
    రాజీ
    సునీల్
    సాంబ
    జ్యోతితిలోత్తమ
    బ్రహ్మానందం
    గుండు హనుమంత రావు
    సుమన్ సెట్టి
    ఎంఎస్ నారాయణ
    ఎంఎస్ నారాయణ
    సిబ్బంది
    ఎస్వీ కృష్ణా రెడ్డి
    దర్శకుడు
    అల్లు అరవింద్
    నిర్మాత
    వైజయంతీ మూవీస్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    శక్తి చిదంబరం
    కథ
    కథనాలు
    <strong>HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్‌ లుక్‌లోనే ఫ్లాట్‌ అయ్యిందట!</strong>
    HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్‌ లుక్‌లోనే ఫ్లాట్‌ అయ్యిందట!
    టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి ‌అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.&nbsp; నిర్మాతల ఫ్యామిలీ చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్‌ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్‌. బాలన్‌ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్‌ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్‌ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది.&nbsp; మలయాళం పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘సర్కస్ సత్తిపండు’.&nbsp; ఆ చిత్రాలతో గుర్తింపు 1997లోనే సర్కస్‌ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత 'ఆశల సందడి' (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.&nbsp; సింగర్‌తో లవ్‌ మ్యారేజ్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్‌ సింగర్‌ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్‌ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్‌ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్‌ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్‌ ప్లాన్‌ చేయగా క్రిష్‌ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్‌, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=OLf1U7c867M సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జోరు! తెలుగులో పలు హిట్‌ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన 'కారా మజాకా' తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్‌ నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్‌ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్‌ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్‌ సాంగ్‌), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.&nbsp; బుల్లితెర హోస్ట్‌గానూ.. నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్‌ డ్యాన్స్‌ షోస్‌ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్‌, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్‌ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన&nbsp; లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?&nbsp; ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.&nbsp;&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; బట్టల సత్తి (Battala Satti) టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్‌ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా చేసిన 'లేడీస్‌ ట్రైలర్‌' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.&nbsp; శుభలేఖ సుధాకర్‌ (Subhalekha Sudhakar) విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్‌ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్‌ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు. రామిరెడ్డి (Spot Nana Rami Reddy) కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్‌ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్‌ హీరోగా చేసిన ‌’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్‌ పెడతా’ అనే డైలాగ్‌ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్‌ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; సుత్తి వీరభద్రరావు&nbsp; (Sutti Veerabhadra Rao) సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్‌ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1674734022793244672 సుత్తివేలు (Suthivelu) అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.&nbsp; షావుకారు జానకి (Shavukaru janaki) షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.&nbsp; సాక్షి రంగారావు (Sakshi Ranga rao) ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన&nbsp; 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు&nbsp; 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.&nbsp; అల్లరి నరేష్‌ (Allari Naresh) ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్‌.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్‌’గా నరేష్‌ గుర్తింపు పొందాడు.&nbsp; వందేమాతరం శ్రీనివాస్‌ (Vandemataram Srinivas) టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్‌’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.&nbsp; సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri) టాలీవుడ్‌ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు. మహర్షి రాఘవ (Maharshi Raghava) వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.&nbsp; దిల్‌ రాజు (Dil Raju) ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్‌ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్‌' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్‌ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.&nbsp; వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) నటుడు వెన్నెల కిషోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్‌.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.&nbsp; సత్యం రాజేష్‌ (Satyam Rajesh) నటుడు సత్యం రాజేష్‌ అసలు పేరు.. రాజేష్‌ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్‌.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్‌ పాత్రల్లో కనిపించి సాలిడ్‌ విజయాలను అందుకున్నాడు. చిత్రం శ్రీను (Chithram Srinu) చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu bhaskar) డైరెక్టర్ భాస్కర్‌.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్‌’ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆహుతి ప్రసాద్‌ (Ahuti Prasad) నటుడు ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం&nbsp; ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్‌ బారిన పడి&nbsp; జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.&nbsp;&nbsp; జేడీ చక్రవర్తి (JD Chakravarthy) హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు&nbsp; నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.&nbsp; బొమ్మాళి రవి శంకర్‌ (Bommali Ravi Shankar) తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్‌ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్‌ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి'&nbsp; చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవిశంకర్‌.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్‌ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్‌ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.&nbsp; https://twitter.com/ramanuja2797/status/1393914318530351116 దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్‌ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్‌ తన పేరులో కలుపుకున్నాడు. బాహుబలి ప్రభాకర్‌ (Bahubali Prabhakar) ‘రైట్‌ రైట్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్‌.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.&nbsp; ప్రభాస్‌ శ్రీను (Prabhas Srinu) పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్‌ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి గాను ప్రభాస్‌ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.&nbsp;
    మార్చి 07 , 2024

    @2021 KTree