రివ్యూస్
How was the movie?
తారాగణం
శ్రీకాంత్
విజయ్ కృష్ణరవళి
కళ్యాణిదీప్తి భట్నాగర్
స్వప్నకైకాల సత్యనారాయణ
విజయ్ తండ్రిఎం. బాలయ్య
కల్యాణి & స్వప్న తండ్రితనికెళ్ల భరణి
విజయ్ బావబాబూ మోహన్
కళ్యాణి & స్వప్న అంకుల్బ్రహ్మానందం
NV కృష్ణ (విజయ్ అంకుల్)AVS
కళ్యాణి & స్వప్న అంకుల్శివాజీ రాజా
విజయ్ బావరాజా రవీందర్
ఇంజనీర్శ్రీ లక్ష్మి
కళ్యాణి & స్వప్న అత్తచిట్టి బాబు
పైడి తల్లిసుతి వేలు
జెన్నీ
అనంత్ బాబు
అనంత్గుండు హనుమంత రావు
పూజారివిశ్వేశ్వరరావు
రజిత
సిబ్బంది
కె. రాఘవేంద్రరావు
దర్శకుడుసి. అశ్వని దత్
నిర్మాతఅల్లు అరవింద్
నిర్మాతఎంఎం కీరవాణి
సంగీతకారుడుమార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Telugu Actress Debut In Bollywood 2024: బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ భామలు.. సక్సెస్ అయ్యేనా!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీంతో హీరోయిన్లు ఒకే ఇండస్ట్రీకే పరిమితం కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోయిన్లు బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో హిందీ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన కథానాయికలు తెలుగులో తమ ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఆ భామలకు మల్టిపుల్ ఆఫర్లు రావడం విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? వారు ఓకే చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సాయిపల్లవి (Sai Pallavi)
సౌత్ స్టార్ సాయిపల్లవి.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా మారింది. ఇప్పుడామె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అమిర్‌ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా చేస్తోన్న చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayanam)లోనూ భాగస్వామ్యమైంది. ఇందులో సీతగా సాయిపల్లవి కనిపించనుంది.
కీర్తి సురేశ్ (Keerthy Suresh)
దక్షిణాది స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) సైతం బాలీవుడ్‌లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఆమె ఇప్పటికే వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ‘బేబీ జాన్’ (Baby Jaan) సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్‌కు కీర్తి శ్రీకారం చుట్టింది. 'అక్క' (Akka Series)పేరుతో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఆ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు రాధికా ఆప్టే కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
శ్రీలీల (Sreeleela)
‘పెళ్లి సందడి’ (Pelli SandaD)తో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన శ్రీలీల వరుసగా చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఎక్కువ సినిమాలు ఫ్లాప్‌గా నిలవడంతో ఈ అమ్మడు ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కనున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదింకా చిత్రీకరణ ప్రారంభించుకోక ముందే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రం కోసమూ శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్‌ను సైతం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. రానా (Daggubati Rana) కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీనిధి కథానాయికగా చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి తెలుగులో ఈ అమ్మడు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇప్పుడా అమ్మడు ఎన్టీఆర్ ‘దేవర’ (Devara)తో తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్నీ దక్కించుకుంది. ఈసారి తను కథానాయకుడు రామ్‌చరణ్‌కు జోడీగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే జాన్వీ తెలుగులోనూ బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)తో తెలుగు తెరపై కాలుమోపేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా తెరపైకి రాకముందే భాగ్యశ్రీ మరో రెండు టాలీవుడ్ ప్రాజెక్ట్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ చేయనున్న కొత్త తెలుగు సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం దక్కించికున్నట్లు తెలుస్తోంది.
జూలై 10 , 2024
HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్ మూవీస్ తెలుసా?
దళపతి విజయ్‌కి తెలుగులోనూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంటుంది. దీనికి కారణం విజయ్ చేసిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను తమిళ్‌లో రీమేక్ చేయడమే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 9 తెలుగు సినిమాలను విజయ్ తమిళ్‌లో చేశాడు. విజయ్ బర్త్ డే(జూన్ 22) సందర్భంగా ఈ హీరో రీమేక్ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం.
పోకిరి
విజయ్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. మహేశ్ బాబు చేసిన పోకిరి(2006) తమిళ్‌లోనూ అదే టైటిల్‌తో 2007లో రిలీజైంది. డబ్ వెర్షన్‌లో విజయ్ సరసన అసిన్ నటించింది. రీమేక్‌కి ప్రభు దేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది.
అతనొక్కడే
కళ్యాణ్‌రామ్ నటించిన ‘అతనొక్కడే’(2005) సినిమా తెలుగులో డీసెంట్ టాక్‌ని సంపాదించింది. ఈ స్టోరీ నచ్చడంతో విజయ్ రీమేక్ చేశాడు. 2006లో ‘ఆతి’గా పేరుతో రీమేక్ మూవీ రిలీజైంది. తమిళ వెర్షన్‌కి రమణ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
ఒక్కడు
మహేశ్ బాబు కెరీర్‌లో ఒక్కడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2003లో ఒక్కడు విడుదల కాగా 2004లో తమిళ్‌లో ‘గిల్లి’గా రీమేక్ అయింది. విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించాడు.
నీతో
ప్రకాశ్ కోవెలమూడి, మెహక్ చాహల్ తొలిసారిగా నటించిన చిత్రం ‘నీతో’(2002). తమిళ్‌లో ఇది ‘సాచియాన్’(2005)గా విడుదలైంది. విజయ్ సరసన బిపాషా బసు, జెనీలియా నటించారు. జోహన్ మహేంద్రన్ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
నువ్వు నాకు నచ్చావ్
విక్టరీ వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను విజయ్ రీమేక్ చేశాడు. 2001లో నువ్వు నాకు నచ్చావ్ విడుదల కాగా 2003లో తమిళ్‌లో ‘వసీగర’గా వచ్చింది. ఇందులో విజయ్ సరసన స్నేహ నటించింది. తమిళ్‌లో కె.సెల్వభారతి డైరెక్ట్ చేశారు.
చిరునవ్వుతో
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన చిరునవ్వుతో(2000) సినిమాను జి.రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. తమిళ్‌లో యూత్(2002)గా వచ్చింది. విజయ్ సరసన సంధ్య నటించింది. విన్సెంట్ సెల్వ డైరెక్షన్ వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
తమ్ముడు
పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’(2000) సినిమాను విజయ్ ‘బద్రి’గా రీమేక్ చేశాడు. తెలుగులో తెరకెక్కించిన పి.ఎ.అరుణ్ ప్రసాద్ తమిళంలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2001లో బద్రి విడుదలై థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.
పవిత్ర బంధం
వెంకటేశ్, సౌంధర్య నటించిన ‘పవిత్రబంధం’(1996) సినిమా తమిళంలో ప్రియమానవాలె(2000) గా రీమేక్ అయింది. రీమేక్ వెర్షన్‌లో విజయ్ సరసన సిమ్రాన్ నటించింది. కె.సెల్వ భారతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
పెళ్లి సందడి
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘పెళ్లిసందడి’(1996) తమిళంలో ‘నినైదెన్ వంధై’(1998)గా రిలీజైంది. విజయ్, రంభ, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సైతం కె.సెల్వభారతి డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
జూన్ 22 , 2023
Varun Tej Marriage: నెట్టింట వరుణ్-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు.
భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్-పవన్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://twitter.com/vamsikaka/status/1719756960852263315
కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
నవంబర్ 03 , 2023
Anant weds Radhika: ఒక్క లుక్‌తో టోటల్ సోషల్ మీడియా వరల్డ్‌ను షేక్ చేసిన మహేష్ బాబు.. ఎలా అంటే?
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) - రాధిక మర్చంట్ (Radhika Merchant) పెళ్లి వేడుక శుక్రవారం (జులై 12) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అందరిలో కెల్లా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తన క్రేజీ లుక్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు భార్య నమ్రత (Namrata), కూతురు సితార (Sitara)తో సహా మహేష్ హాజరయ్యారు. బ్లాక్ కలర్ ట్రెడిషనల్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చాడు. షార్ట్ బియర్డ్ లాంగ్ హెయిర్‌తో మరింత హ్యాండ్సమ్‌గా కనిపించారు. దీంతో సోషల్ మీడియా అంతటా మహేష్ లుక్స్ గురించే చర్చ సాగుతోంది.
దేశంలోని మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ కచ్చితంగా 'టాప్ 3' ఉంటారు. అటువంటి మహేష్ లుక్ గురించి ఈసారి పెద్ద ఎత్తున వైరల్ కావడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం అతడు రాజమౌళితో 'SSMB29' చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాకు అనుగుణంగా తన లుక్‌ను మేకోవర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అంబానీ ఈవెంట్‌లో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిజాం నవాబులాగా మహేష్ ఉన్నాడంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/LetsXOtt/status/1811793014991519935
https://twitter.com/i/status/1812036624928375243
https://twitter.com/Trollex_4005/status/1811777471492374595
మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయన రాగానే అక్కడి వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. చరణ్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లిలో పాల్గొన్నారు.
https://twitter.com/i/status/1812033846461739211
అనంత్ - రాధికా వివాహా వేడుకలో రజనీకాంత్ సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేసి అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ ఈవెంట్‌లో తలైవా ఇలా డ్యాన్స్ చేయడం తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/_aaradhiya_/status/1811938001292820575
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా పెళ్లి వేడుకలో సందడి చేశారు. వైట్ కలర్ షేర్వాణీ ధరించి ట్రెడిషనల్ లుక్‍లో వివాహానికి హాజరయ్యారు.
https://twitter.com/i/status/1811763752066331054
టాలీవుడ్ హల్క్‌గా పేరున్న హీరో దగ్గుబాటి రానా కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ దంపతులను ఆశీర్వదించారు.
https://twitter.com/i/status/1811781418399244292
యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్లాక్ కలర్ ఔట్‍ఫిట్‍లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. లాంగ్ హెయిర్‌లో స్టైలిష్ లుక్‍తో కనిపించారు. అయితే అఖిల్ లుక్ మహేష్‌బాబుకు దగ్గరగా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
https://twitter.com/i/status/1811800462758412631
సౌత్ ఇండియన్ స్టార్ సూర్య దంపతులు కూడా అంబానీ ఇంట వేడకకు హాజరయ్యారు. సూర్య పంచకట్టులో సంప్రదాయ బద్దంగా కనిపించారు. భార్య జ్యోతిక సైతం చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించారు.
https://twitter.com/i/status/1811964282092843205
జూలై 13 , 2024
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.
వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్ చద్దా వివాహం జరగడం గమనార్హం.
ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది.
ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు.
తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్ వివాహ ఫొటోలను షేర్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు.
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు.
సెప్టెంబర్ 25 , 2023
Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..!
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్‌ట్యాగ్‌తో రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వరణ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు.
యంగ్ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్ లుక్‌లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు
యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్‌లో హల్‌చల్ చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు సైతం రిసెప్షన్‌కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దంపతులు కూడా రిసెప్షన్ ఈవెంట్‌లో సందడి చేశారు.
యువ హీరో అల్లు శిరీష్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్ అండ్ బ్లాక్ కోటులో వరుణ్, లావణ్య జంటతో ఫొటో దిగారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.
బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిన్న కుమారుడు రిసెషన్షన్‌కు వెళ్లారు.
యంగ్ హీరో కార్తికేయ, నటుడు నవదీప్ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.
టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్ కిషన్ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు.
నవంబర్ 06 , 2023
Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 22 - 28వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు
మేమ్ ఫేమస్
సుమంత్ ప్రభాస్ హీరోగా అతడి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్ ఫేమస్’ (Mem Famous) చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. సిరిరాశి, మణి, మౌర్య చౌదరి, కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథకు తగ్గట్లుగా 30మంది కొత్త నటీనటుల్ని ఎంపిక చేసి సినిమా తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మళ్లీ పెళ్లి
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli). ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 26న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగాలు, ఎమోషనల్ డ్రామాతో పాటు సంచలనాత్మక కథాంశం ఇమిడి ఉందని డైరెక్టర్ తెలిపారు. అలాగే సమకాలీన సామాజిక సమస్యలను కూడా ఈ చిత్రంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నరేష్, పవిత్రా లోకేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
2018
కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన ‘2018’ చిత్రం కూడా ఈ వారం తెలుగులో రిలీజ్ కానుంది. మే 26న ప్రేక్షకులను పలకరించనుంది. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
మెన్ టూ
నరేష్ అగస్త్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మెన్ టూ’. ఇందులో నరేష్‌కు జోడిగా రియా సుమన్ నటించింది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మెన్ టూ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాలతో పాటు ‘గ్రే’, ‘హీరో ఆఫ్ ఇండియా’, ‘జైత్ర’ వంటి చిన్న సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్ సిరీస్‌లు
కిసీ కా భాయ్ కిసీ కి జాన్
సల్మాన్‌ఖాన్ హీరోగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ఈ వారం ఓటీటీలోకి రానుంది. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు.
భేదియా
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘భేదియా’ (bhediya) . తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్ కానుంది.
‘సిటడెల్’ ఆఖరి ఎపిసోడ్
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel). రిచర్డ్ మ్యాడన్, ప్రియాంక చోప్రా, జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్ మే 26న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateAmerican Born ChineseSeriesEnglishDisney+ HotstarMay 24City of DreamsSeriesEnglishDisney+ HotstarMay 26Victim/SuspectMovieEnglishNetflixMay 23Mothers dayMovieEnglishNetflixMay 25FUBARSeriesEnglishNetflixMay 25Blood & GoldMovieEnglishNetflixMay 26MissingMovieHindiAmazon PrimeMay 24Sirf Ek Bandaa Kaafi HaiMovieHindiZee5May 23Geetha SubramanyamSeriesTeluguahaMay 23Sathi gani rendu ekaraluSeriesTeluguahaMay 26
మే 22 , 2023
Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
కస్టడీ
నాగ చైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఛత్రపతి (హిందీ)
ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్. భాగ్యశ్రీ, శరద్ కేల్కర్, శివం పాటిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.
భువన విజయమ్
సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో యలమంద చరణ్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్ పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, ధనరాజ్ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్
‘ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్ కోదాటి, దృషికా చందర్ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.
కళ్యాణమస్తు
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్ తెలిపింది.
మ్యూజిక్ స్కూల్
శ్రియ శరణ్, శర్మాన్ జోషి, షాన్ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్ స్కూల్ (Music School) చిత్రం మే 12న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్
న్యూసెన్స్
నవదీప్ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్ ‘న్యూసెన్స్’. శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
దహాద్
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్’ (Dahaad) వెబ్‌సిరీస్ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
TitleCategoryLanguagePlatformRelease DateThe Muppets Mayhemseries EnglishDisney+ HotstarMay 10Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12AirMovieenglishAmazon PrimeMay 12Justice LeagueSeriesEnglishNetflixMay 08Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09Black Knight SeriesEnglishNetflixMay 12Faithfully Yours MovieEnglishNetflixMay 17Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18SeriesHindiZee5May 12Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12Vikram vedaMovieHindiJio CinemaMay 12
మే 08 , 2023
ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్ సేన్, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.
దాస్ కా ధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్ సేన్, నివేదా పెతురాజ్ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.
రంగ మార్తాండ
కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది.
ఘోస్టీ
వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.
గీత సాక్షిగా
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్ సాగే చిత్రమని అర్థమవుతుంది.
ఓటీటీ సినిమాలు
Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
మార్చి 20 , 2023
New Ott Releases This Week: దసరా స్పెషల్.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
వేట్టయాన్ (Vettaiyan)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విశ్వం (Viswam)
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి.
జనక అయితే గనక (Janaka Ithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.
జిగ్రా (Jigra)
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా రూపొందించిన బాలీవుడ్ చిత్రం ‘జిగ్రా’. అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
మార్టిన్ (Martin)
కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
లెవెల్ క్రాస్
అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
అక్టోబర్ 07 , 2024
This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్ చిత్రాలు లోడింగ్!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
దేవర (Devara)
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సత్యం సుందరం (Sathyam Sundaram)
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు.
హిట్లర్ (Hitler)
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్'. దర్శకుడు ధన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు..
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)
‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది.
ముంజ్యా (Munjya)
బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26
సెప్టెంబర్ 23 , 2024
Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్ విన్నర్ ఏది?
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్, శర్వానంద్ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
మనమే
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్
నటుడు శర్వానంద్.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్ విక్రమ్ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది.
కథేంటి
విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్ కొడుకు ఖుషీ (మాస్టర్ విక్రమ్ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
సత్యభామ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాజల్ నటనపై ప్రశంసలు
కమర్షియల్ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్ అగర్వాల్.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.
కథేంటి
ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్ (నవీన్ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.
https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html
https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
జూన్ 08 , 2024
This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్ మూవీస్ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
మనమే
స్టార్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.
సత్యభామ
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.
రక్షణ
స్టార్ నటి పాయల్ రాజ్‌పుత్ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
లవ్ మౌళి
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వెపన్
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్’ చిత్రానికి గుహన్ సెన్నియ్యప్పన్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
జూన్ 03 , 2024
This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
టెనెంట్
హాస్య నటుడు సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్' (Tenant). ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ.
శశివదనే
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగనుంది.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.
లవ్ మౌళి
అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు.
మార్కెట్ మహాలక్ష్మీ
కేరింత ఫేమ్ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది.
శరపంజరం
నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
మారణాయుధం
సీనియర్ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మారణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది.
లవ్ యూ శంకర్
దర్శకుడు రాజీవ్ ఎస్.రియా.. ‘మై ఫ్రెండ్ గణేశా’ యానిమేషన్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్ యూ శంకర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, తనీషా జంటగా నటించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సైరెన్
జయం రవి (Jayam Ravi) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రలు పోషించారు.
మై డియర్ దొంగ
ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు.. అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చిక్కుకుపోతే ఏం జరిగింది? దొంగకు, యువతికి మధ్య ఏర్పడిన స్నేహం ఎలాంటి మలుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది.
కాటేరా
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
ఏప్రిల్ 15 , 2024
Varunlav: కాక్‌టైల్ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్ టైల్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.
తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.
ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు.
అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది.
ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు.
నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు.
ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
అక్టోబర్ 31 , 2023
Tollywood Couples: నారా రోహిత్ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
రీల్ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహా, మహేశ్ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్ హీరో నారా రోహిత్ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
నారా రోహిత్ - సిరి లేళ్ల
ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.
నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్ చేసుకొని స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్’, ‘ఎఫ్3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్ హీరోగా చేసిన ‘వారియర్’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.
వరుణ్ సందేశ్ - వితిక షేరు
యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్’తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
అక్టోబర్ 17 , 2024
Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ తాజా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.
మూవీ ప్లాట్ ఏంటంటే..
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
మూవీ కథ ఏంటంటే..
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
గం గం గణేశా
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
స్టోరీ ఏంటంటే..
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది కథ.
లవ్ మీ
యంగ్ హీరో ఆశిష్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం 'లవ్ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది.
కథ ఏంటంటే..
‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్ సాధించింది.
కథ ఏంటంటే..
‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్.. సిటాడెల్ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ.
కృష్ణమ్మ
సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.3.50 కాగా, షేర్ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.
కథ ఏంటంటే..
‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు? అన్నది కథ.
ఆ ఒక్కటి అడక్కు
అల్లరి నరేష్ రీసెంట్ రీసెంట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది.
కథ ఏంటంటే..
‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ.
ప్రసన్న వదనం
సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి.
కథ ఏంటంటే..
రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్‌నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్.
జూన్ 06 , 2024
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఏమైందో ఏమో గాని కొని ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. దేని గురించి పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దీంతో అనసూయ పేరు పెద్దగా చర్చకు రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదాస్పద పోస్టుతో మరోమారు అనసూయ చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండను మళ్లీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
అనసూయ పోస్టు ఏంటంటే?
'పుష్ప 2' చిత్రంలో నటి అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఆమె చేసిన దాక్షయణి రోల్ సెకండ్ పార్ట్‌లోనూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ అనసూయ పాల్గొంది. గ్లామర్ లుక్స్‌లో కనిపించి సందడి చేసింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగాని ఎక్స్‌లో ఓ సెన్సేషన్ పోస్టు అనసూయ పెట్టింది. 'దూరపు కొండలు నునుపు' అంటూ అందులో రాసుకొచ్చింది. అయితే దీనికి ఎవరి పేరును ట్యాగ్ చేయలేదు. దీంతో ఆమె ఏ ఉద్దేశ్యంతో చేసింది? ఎవరి కోసం చేసింది? అన్న విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
https://twitter.com/anusuyakhasba/status/1863783255813849226
రౌడీ బాయ్ గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నటి అనసూయ (Anasuya Bharadwaj)కు ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి ఇది కొనసాగుతూ వస్తోంది. విజయ్‌ను విమర్శిస్తూ ఆమె బహిరంగంగానే పలుమార్లు మాట్లాడింది. అయితే తాజాగా పెట్టిన పోస్టు కూడా విజయ్‌ను ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'దూరపు కొండలు నునుపు' అన్న మాటల్లో కొండ అని ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడింది. ఆమె స్పీచ్ ఇచ్చిన విధానం, మాట తీరు అచ్చం విజయ్ దేవరకొండ స్టైల్‌లో ఉన్నాయన్న కామెంట్స్ వినిపించాయి. పైగా వారిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న రూమర్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనసూయ ఇలా పోస్టు పెట్టి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
రష్మిక కంటే శ్రీలీలకే ప్రాధాన్యత!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఉన్న నెగిటివిటీని హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పై కూడా అనసూయ (Anasuya) చూపించిందన్న వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప 2’తో ఇది మరోమారు నిరూపితమైందని నెటిజన్లు అంటున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2)లో హీరోయిన్‌గా చేసిన రష్మికతో కంటే స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శ్రీలీలతోనే ఆమె ఎక్కువ చనువుగా ఉందని గుర్తు చేస్తున్నారు. శ్రీలీలను ఆటపటిస్తున్న వీడియోలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ వీడియోలో శ్రీలీల, అనసూయ నవ్వుతూ జోక్స్ వేసుకోవడం గమనించవచ్చు.
https://twitter.com/ActressSouth/status/1863784223536271766
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’, ‘ఉల్ఫ్’ చిత్రాల్లో అనసూయ నటిస్తోంది.
డిసెంబర్ 03 , 2024
HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్ లుక్‌లోనే ఫ్లాట్ అయ్యిందట!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
నిర్మాతల ఫ్యామిలీ
చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్. బాలన్ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది. మలయాళం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘సర్కస్ సత్తిపండు’.
ఆ చిత్రాలతో గుర్తింపు
1997లోనే సర్కస్ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 'ఆశల సందడి' (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.
సింగర్‌తో లవ్ మ్యారేజ్
కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్ సింగర్ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్ ప్లాన్ చేయగా క్రిష్ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.
https://www.youtube.com/watch?v=OLf1U7c867M
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు!
తెలుగులో పలు హిట్ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన 'కారా మజాకా' తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్ సాంగ్), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.
బుల్లితెర హోస్ట్‌గానూ..
నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్ డ్యాన్స్ షోస్ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.
అక్టోబర్ 21 , 2024