• TFIDB EN
  • పెళ్లి సందడి
    UTelugu2h 9m
    శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీకాంత్
    విజయ్ కృష్ణ
    రవళి
    కళ్యాణి
    దీప్తి భట్నాగర్
    స్వప్న
    కైకాల సత్యనారాయణ
    విజయ్ తండ్రి
    ఎం. బాలయ్య
    కల్యాణి & స్వప్న తండ్రి
    తనికెళ్ల భరణి
    విజయ్ బావ
    బాబూ మోహన్
    కళ్యాణి & స్వప్న అంకుల్
    బ్రహ్మానందం
    NV కృష్ణ (విజయ్ అంకుల్)
    AVS
    కళ్యాణి & స్వప్న అంకుల్
    శివాజీ రాజా
    విజయ్ బావ
    రాజా రవీందర్
    ఇంజనీర్
    శ్రీ లక్ష్మి
    కళ్యాణి & స్వప్న అత్త
    చిట్టి బాబు
    పైడి తల్లి
    సుతి వేలు
    జెన్నీ
    అనంత్ బాబు
    అనంత్
    గుండు హనుమంత రావు
    పూజారి
    విశ్వేశ్వరరావు
    రజిత
    సిబ్బంది
    కె. రాఘవేంద్రరావు
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    అల్లు అరవింద్
    నిర్మాత
    ఎంఎం కీరవాణి
    సంగీతకారుడు
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?
    HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?
    దళపతి విజయ్‌కి తెలుగులోనూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంటుంది. దీనికి కారణం విజయ్ చేసిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను తమిళ్‌లో రీమేక్ చేయడమే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 9 తెలుగు సినిమాలను విజయ్ తమిళ్‌లో చేశాడు. విజయ్ బర్త్ డే(జూన్ 22) సందర్భంగా ఈ హీరో రీమేక్ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం.  పోకిరి విజయ్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. మహేశ్ బాబు చేసిన పోకిరి(2006) తమిళ్‌లోనూ అదే టైటిల్‌తో 2007లో రిలీజైంది. డబ్ వెర్షన్‌లో విజయ్ సరసన అసిన్ నటించింది. రీమేక్‌కి ప్రభు దేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది.  అతనొక్కడే కళ్యాణ్‌రామ్ నటించిన ‘అతనొక్కడే’(2005) సినిమా తెలుగులో డీసెంట్ టాక్‌ని సంపాదించింది. ఈ స్టోరీ నచ్చడంతో విజయ్ రీమేక్ చేశాడు. 2006లో ‘ఆతి’గా పేరుతో రీమేక్‌ మూవీ రిలీజైంది. తమిళ వెర్షన్‌కి రమణ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.  ఒక్కడు మహేశ్ బాబు కెరీర్‌లో ఒక్కడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2003లో ఒక్కడు విడుదల కాగా 2004లో తమిళ్‌లో ‘గిల్లి’గా రీమేక్ అయింది. విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించాడు. నీతో ప్రకాశ్ కోవెలమూడి, మెహక్ చాహల్ తొలిసారిగా నటించిన చిత్రం ‘నీతో’(2002). తమిళ్‌లో ఇది ‘సాచియాన్’(2005)గా విడుదలైంది. విజయ్ సరసన బిపాషా బసు, జెనీలియా నటించారు. జోహన్ మహేంద్రన్ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.  నువ్వు నాకు నచ్చావ్ విక్టరీ వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను విజయ్ రీమేక్ చేశాడు. 2001లో నువ్వు నాకు నచ్చావ్ విడుదల కాగా 2003లో తమిళ్‌లో ‘వసీగర’గా వచ్చింది. ఇందులో విజయ్ సరసన స్నేహ నటించింది. తమిళ్‌లో కె.సెల్వభారతి డైరెక్ట్ చేశారు. చిరునవ్వుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన చిరునవ్వుతో(2000) సినిమాను జి.రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. తమిళ్‌లో యూత్(2002)గా వచ్చింది. విజయ్ సరసన సంధ్య నటించింది. విన్సెంట్ సెల్వ డైరెక్షన్ వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’(2000) సినిమాను విజయ్ ‘బద్రి’గా రీమేక్ చేశాడు. తెలుగులో తెరకెక్కించిన పి.ఎ.అరుణ్ ప్రసాద్ తమిళంలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2001లో బద్రి విడుదలై థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.  పవిత్ర బంధం వెంకటేశ్, సౌంధర్య నటించిన ‘పవిత్రబంధం’(1996) సినిమా తమిళంలో ప్రియమానవాలె(2000) గా రీమేక్ అయింది. రీమేక్ వెర్షన్‌లో విజయ్ సరసన సిమ్రాన్ నటించింది. కె.సెల్వ భారతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.  పెళ్లి సందడి రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్‌ హిట్ ‘పెళ్లిసందడి’(1996) తమిళంలో ‘నినైదెన్ వంధై’(1998)గా రిలీజైంది. విజయ్, రంభ, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సైతం కె.సెల్వభారతి డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
    జూన్ 22 , 2023
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. న‌వంబ‌ర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘ‌నంగా జ‌రిగిన సంగతి తెలిసిందే.  పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్‌ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.  వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు. వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.  వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్‌-పవన్‌ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్‌ మార్‌ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  https://twitter.com/vamsikaka/status/1719756960852263315 కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి.  కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
    నవంబర్ 03 , 2023
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.  అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్‌ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో  ప్రచారం జరుగుతోంది.  వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్‌ తేజ్‌ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది. 
    నవంబర్ 01 , 2023
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.  వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.  ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది. ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్‌ వివాహ ఫొటోలను షేర్‌ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్‌ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్‌ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు. 
    సెప్టెంబర్ 25 , 2023
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    Varun Tej Reception: వైభవంగా వరుణ్‌-లావణ్య రిసెప్షన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు..! 
    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్‌ట్యాగ్‌తో రిసెప్షన్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్‌ కలర్‌ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. టాలీవుడ్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వరణ్‌-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు. యంగ్‌ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్‌ లుక్‌లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు యంగ్‌ హీరోలు సాయి ధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్‌లో హల్‌చల్‌ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ దంపతులు సైతం రిసెప్షన్‌కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు దంపతులు కూడా రిసెప్షన్‌ ఈవెంట్‌లో సందడి చేశారు.  యువ హీరో అల్లు శిరీష్‌ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్‌ అండ్‌ బ్లాక్‌ కోటులో వరుణ్‌, లావణ్య జంటతో ఫొటో దిగారు.  టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్‌ నంది కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.  బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, చిన్న కుమారుడు రిసెషన్షన్‌కు వెళ్లారు. యంగ్‌ హీరో కార్తికేయ, నటుడు నవదీప్‌ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.  టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్‌ కిషన్‌ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. సీనియర్‌ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు. 
    నవంబర్ 06 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 22 - 28వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు మేమ్‌ ఫేమస్‌ సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్ ఫేమస్‌’ (Mem Famous) చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ పతాకాలపై శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. సిరిరాశి, మణి, మౌర్య చౌదరి, కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  కథకు తగ్గట్లుగా 30మంది కొత్త నటీనటుల్ని ఎంపిక చేసి సినిమా తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  మళ్లీ పెళ్లి నరేష్‌, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli). ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 26న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగాలు, ఎమోషనల్‌ డ్రామాతో పాటు సంచలనాత్మక కథాంశం ఇమిడి ఉందని డైరెక్టర్‌ తెలిపారు. అలాగే సమకాలీన సామాజిక సమస్యలను కూడా ఈ చిత్రంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నరేష్‌, పవిత్రా లోకేష్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.  2018 కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన ‘2018’ చిత్రం కూడా ఈ వారం తెలుగులో రిలీజ్ కానుంది. మే 26న ప్రేక్షకులను పలకరించనుంది. జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.  మెన్‌ టూ నరేష్‌ అగస్త్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మెన్‌ టూ’. ఇందులో నరేష్‌కు జోడిగా రియా సుమన్ నటించింది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్‌ ఘంటశాల ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మెన్‌ టూ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాలతో పాటు ‘గ్రే’, ‘హీరో ఆఫ్‌ ఇండియా’, ‘జైత్ర’ వంటి చిన్న సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ఈ వారం ఓటీటీలోకి రానుంది. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ సూపర్‌ హిట్‌ ‘వీరమ్‌’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా తెలుగు హీరో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. భేదియా బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘భేదియా’ (bhediya) . తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనుంది.  ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్‌ కానుంది. ‘సిటడెల్‌’ ఆఖరి ఎపిసోడ్‌ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel). రిచర్డ్‌ మ్యాడన్‌, ప్రియాంక చోప్రా, జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్‌ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ మే 26న అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.  TitleCategoryLanguagePlatformRelease DateAmerican Born ChineseSeriesEnglishDisney+ HotstarMay 24City of DreamsSeriesEnglishDisney+ HotstarMay 26Victim/SuspectMovieEnglishNetflixMay 23Mothers dayMovieEnglishNetflixMay 25FUBARSeriesEnglishNetflixMay 25Blood & GoldMovieEnglishNetflixMay 26MissingMovieHindiAmazon PrimeMay 24Sirf Ek Bandaa Kaafi HaiMovieHindiZee5May 23Geetha SubramanyamSeriesTeluguahaMay 23Sathi gani rendu ekaraluSeriesTeluguahaMay 26
    మే 22 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: కస్టడీ నాగ చైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఛత్రపతి (హిందీ) ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్‌.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.   భువన విజయమ్‌  సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో  యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్‌ పృథ్వీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.  ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌ ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. కళ్యాణమస్తు శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం... పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. మ్యూజిక్‌ స్కూల్‌  శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ (Music School) చిత్రం మే 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్‌ నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. దహాద్‌ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్‌’ (Dahaad) వెబ్‌సిరీస్‌ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…  TitleCategoryLanguagePlatformRelease DateThe Muppets Mayhemseries EnglishDisney+ HotstarMay 10Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12AirMovieenglishAmazon PrimeMay 12Justice LeagueSeriesEnglishNetflixMay 08Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09Black Knight SeriesEnglishNetflixMay 12Faithfully Yours MovieEnglishNetflixMay 17Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18SeriesHindiZee5May 12Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12Vikram vedaMovieHindiJio CinemaMay 12
    మే 08 , 2023
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.  దాస్ కా ధమ్కీ టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. యాక్షన్, కామెడీ తరహాలో సినిమా రూపుదిద్దుకుంది.  రంగ మార్తాండ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ మార్తాండ, రంగస్థల కళాకారుల జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీ చిత్రం నట సామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా వస్తుంది. ప్రకాశ్ రాజ్‌, బ్రహ్మానందం, రమ్య కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఉగాదికి విడుదలవుతుంది. ఘోస్టీ  వివాహం తర్వాత భర్త, కుమారుడికి సమయాన్ని కేటాయించిన కాజల్ అగర్వాల్‌ అభిమానుల కోసం మళ్లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ఘోస్టీ తెలుగులో కోస్టీ పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ర్ర్ కామెడీ తరహాలో తెరకెక్కిన చిత్రం ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.  గీత సాక్షిగా ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 22న రిలీజ్ అవుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా గీత సాక్షిగా చిత్రాన్ని ఆంటోని మట్టపల్లి తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్రాన్ని తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే సస్పెన్స్ జోనరల్‌ సాగే చిత్రమని అర్థమవుతుంది. ఓటీటీ సినిమాలు Title CategoryLanguagePlatformRelease DatePanchatantram Movie Telugu ETV WinMarch 22Vinaro bhagyamu vishnu kathaMovie Telugu Aha March 22American apokalipseMovieEnglishNetflixMarch 22Jhony Movie EnglishNetflixMarch 23
    మార్చి 20 , 2023
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్‌ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్‌, శర్వానంద్‌ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్‌ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  మనమే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్‌ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్‌ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ నటుడు శర్వానంద్‌.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  సత్యభామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్‌ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్‌ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్‌ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాజ‌ల్‌ నటనపై ప్రశంసలు కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
    జూన్ 08 , 2024
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.  సత్యభామ ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.  రక్షణ స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.  లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  వెపన్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
    జూన్ 03 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ  ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.  లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌  దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ  ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే  పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.  ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.   మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్  ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 
    అక్టోబర్ 31 , 2023
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.  మూవీ ప్లాట్‌ ఏంటంటే..  కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.  మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..  గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.  కథ ఏంటంటే..  ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.  ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.  కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే..  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌. 
    జూన్ 06 , 2024
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.  యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.  https://twitter.com/i/status/1772544977396220385 బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్‌ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) స్టార్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.  హాట్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.  View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.  యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.  యంగ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.  View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) నటి మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.  నటి రాయ్‌ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.  ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.  హోలీని బాగా సెలబ్రేట్‌ చేసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శివాలిక ఒబెరాయ్‌ ఉంది.  యంగ్‌ హీరోయిన్‌ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.  మెగా డాటర్స్‌ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  బాలీవుడ్‌ భామ అవనీత్‌ కౌర్‌.. హోలీ రోజున సోషల్‌ మీడియాలో తళుక్కుమంది.  ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్‌.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.  పాపులర్‌ హీరోయిన్‌ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్‌ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.  హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.  View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
    మార్చి 26 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.  https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.  https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.  https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.  https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.  https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    ఈ వారం(March 3) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు
    ఈ వారం(March 3) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు
    ఫిబ్రవరి నెలలో సినిమా రిలీజ్‌లు ముగిశాయి. ఈ వారం(మార్చి 3)లో పెద్ద సినిమాల సందడేమీ లేదు. పరీక్షల సమయం కావడంతో బిగ్ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయట్లేదు. ఈ శుక్రవారం 5 చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కాననున్నాయి. అవేంటో చూద్దాం.  బలగం కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా వ్యవహరించిన చిత్రమే ‘బలగం’. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హన్షిత్ నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. మార్చి 3న సినిమా విడుదల కానుంది.  ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సొహైల్, మృణాళిని రవి జంటగా నటించారు. మీనా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. 44 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ని పూర్తిచేయడం విశేషం. ఈ సినిమాను మార్చి 3న విడుదల చేయనున్నారు.  సాచి బిందు అనే యువతి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే మహిళా సాధికారతను ప్రోత్సహించే సినిమాగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. వివేక్ పోతగోని డైరెక్షన్ వహించి, నడిపల్లి ఉపేన్‌తో కలిసి నిర్మించారు. మార్చి 3న ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  రిచిగాడి పెళ్లి బాల్యంలో ఆడుకున్న ఆటల్ని మనల్ని మరచిపోలేం. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘రిచిగాడి పెళ్లి’. కేఎస్ ఫిల్మ్‌వర్క్స్ నిర్మాణంలో వస్తోందీ చిత్రం. కేఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించారు. సత్య, చందన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా మార్చి 3న విడుదల కానుంది. మానవ సంబంధాల్ని ఆవిష్కరించే కథతో తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.  గ్రంథాలయం విన్ను మద్దిపాటి ప్రధాన పాత్రధారిగా చేసిన చిత్రం ‘గ్రంథాలయం’. యాక్షన్ త్రిల్లర్ జానర్‌గా తెరకెక్కింది. వైష్ణవి శ్రీ.ఎస్ నిర్మాతగా వ్యవహరించారు. జంపన సాయి శివన్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.  OTT విడుదలలు Title CategoryLanguagePlatformRelease DateWalteir VeerayyaMovieTeluguNetflixFebruary 27HeatWaveMovieEnglishNetflixMarch 1The Mandalorian S3Web SeriesEnglishDisney HotstarMarch 1Sex/Life S2Web SeriesEnglishNetflixMarch 2ThalaikoothalMovieTamilNetflixMarch 3AloneMovieMalayalam/TeluguDisney HotstarMarch 3Daisy Jones & The SixWeb SeriesEnglishAmazon PrimeMarch 3Taj: Divided by BloodWeb SeriesEnglishZee5March 3Gulmohar MovieHindiDisney HotstarMarch 3
    ఫిబ్రవరి 27 , 2023
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్‌ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. క‌థ వాస్తు (చైత‌న్య‌రావు), వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) తాత మనవళ్లు. లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్‌ వేస్తారు. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్‌ కార్పొరేట‌ర్ కావాల‌ని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tharun bhascker) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవ‌స‌రం పడటంతో నాయుడు, జీవన్‌ కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎలా సాగిందంటే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి వచ్చిన షార్ప్ షూట‌ర్స్‌ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి.  బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది.  ఎవరెలా చేశారంటే? ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ ఈ సినిమాలో న‌టుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీ టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హీరో చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్, గెటప్‌ శీను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా సినిమాలో న‌వ్విస్తాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌, సంగీతం, మాట‌ల‌ు, పాత్ర‌ల హావ‌భావాల‌తో ఆయన న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ ఆయన స‌న్నివేశాల్ని న‌డిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా ప్రేక్ష‌కుల్ని మాత్రం కడుపుబ్బా  నవ్వించడంలో తరుణ్ భాస్కర్‌ మరోమారు విజయం సాధించాడు.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ న‌టులు హాస్య సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్‌ ఊహకందే కథనంరొటిన్‌ స్టోరీ రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
    ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.  సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది. 
    డిసెంబర్ 19 , 2023
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్‌ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్ సాంగ్స్‌ మీకోసం.. 1. ఈ గాలిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అగ్ని పర్వతం’ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ గాలిలో’ పాట అప్పట్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. కృష్ణ ఫొటోలతో ఈ పాట సాగుతుంది. ఓ సీన్‌లో హీరోయిన్‌ విజయశాంతి కృష్ణ ఫొటోపై పడుకొని అతని కోసం కళ్లతో వెతుకుతూ పాడుతుంటుంది. ఆమె తన తలను పైకి ఎత్తి కిందకి చూసే సరికి ఫొటో ప్లేస్‌లో కృష్ణ కనిపిస్తారు. రాఘవేంద్రరావు సృజనాత్మకత ఏ పాటిదో ఈ ఒక్క సీన్‌ తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=MceWRlMzHYo 2. అబ్బని తియ్యని దెబ్బ చిరంజీవి - శ్రీదేవి జంటగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్‌ రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులోని ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్‌. చిరంజీవి, శ్రీదేవి వేసే రొమాంటిక్ స్టెప్పులను చూసి ఈ జనరేషన్‌ వారు కూడా ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ పాటలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=zloL0fdu5aM 3. మా పెరటి జామ చెట్టు పెళ్లిసందడి సినిమాలోని ‘మా పెరటి జామ చెట్టు’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్‌ రవళిని దర్శకేంద్రుడు ఎంతో అందంగా చూపించారు. రవళి బొడ్డుపై జామ పండు పడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఆడియన్స్‌ ఫ్లాట్ కావాల్సిందే.  https://www.youtube.com/watch?v=e92ff-s1yRk 4. రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా అల్లరి ప్రియుడు సినిమాలోని ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ సాంగ్‌ రాఘువేంద్రరావు సినిమాల్లోని టాప్‌-5 సూపర్‌ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా కచ్చితంగా ఉంటుంది. ఈ పాటలో రమ్యకృష్ణ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. దర్శకేంద్రుడు ఆమెను పాలరాతి శిల్పంలా చూపించారు. పాట మెుత్తాన్ని పూలతో నింపేశారు.  https://www.youtube.com/watch?v=S1X_-z7JTcE 5. సై సై సయ్యారే ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘సై సై సయ్యారే’ పాటను కూడా రాఘవేంద్రరావు చాలా రొమాంటిక్‌గా తీశారు. కుండలు, గొడుగులను సెట్‌ ప్రొపార్టీలుగా ఉపయోగించుకొని పాటను తెరకెక్కించారు.  ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  https://www.youtube.com/watch?v=lRc1LOiYthY 6.  భీమవరం బుల్లోడా ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా’ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట మెుత్తం స్టీల్‌ బిందెలే కనిపిస్తాయి. నాగార్జున, ఆమని డ్యాన్స్ అలరిస్తుంది.  https://www.youtube.com/watch?v=kQD5NHAxtXk 7. మీనా మీనా ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాలోని ‘మీనా మీనా’ పాట రాఘవేంద్రరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. శిల్పా శెట్టి నడుముపై వెంకటేష్‌ ముత్యాలు వేసే సీన్‌ దర్శకేంద్రుడి మార్క్‌ను చూపిస్తుంది.  https://www.youtube.com/watch?v=X-37Hz673RE 8. అస్మదీయ  అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలోనూ దర్శకేంద్రుడు తన మార్క్‌ను విడిచిపెట్టలేదు. మోహన్‌ బాబు, రోజాల మధ్య వచ్చే ‘అస్మదీయ’ పాటలో మళ్లీ పండ్లకు పని చెప్పారు. ద్రాక్ష పండ్ల నడుమ రోజా నడుమును చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  https://www.youtube.com/watch?v=4YRwSezPqmE 9. చాలు చాలు శ్రీరామదాసు సినిమాలోని ‘చాలు చాలు’ పాట కూడా రాఘవేంద్రరావు రొమాంటిక్ పాటలలో ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటలో నాగార్జున, స్నేహా మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది.  https://www.youtube.com/watch?v=xj5yoitVQTQ 10. గందర్వ లోకాల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాలోనూ ఆయన మార్క్‌ కనిపించింది. హీరోయిన్‌ శ్రీలీలను గందర్వ లోకాల పాటలో ఎంతో ‌అద్భుతంగా చూపించారు. పైనుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీలీల కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=0d3ktyClW8Q
    మే 23 , 2023
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం!
    టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.  ముఖ్యంగా ఏమోషనల్‌ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్‌ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.  శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్‌, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్‌ కేసరి ద్వారా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.  ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.  కిస్‌ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'భరాతే' అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.  ఇక 2021లో వచ్చిన 'పెళ్లి సందD' చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్‌ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్‌ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.  ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    అక్టోబర్ 19 , 2023

    @2021 KTree