రివ్యూస్
How was the movie?
తారాగణం
సాయి ధరమ్ తేజ్
శ్రీనురెజీనా కసాండ్రా
శైలజ (శైలు) / శిరీష (సిరి)జగపతి బాబు
మైసమ్మప్రకాష్ రాజ్
ప్రభాకర్సాయాజీ షిండే
గంగా ప్రసాద్చంద్ర మోహన్
రఘు బాబు
యాదిగిరిప్రభాకర్
మైసమ్మ అనుచరుడుఆహుతి ప్రసాద్
SPజయ ప్రకాష్ రెడ్డి
జేపీసూర్య
అనాథాశ్రమ నిర్వాహకుడువైజాగ్ ప్రసాద్
ఎమ్మెల్యేశంకర్ మెల్కోటే
ప్రిన్సిపాల్షఫీ
పృధ్వీ రాజ్
ఎమ్మెల్యేప్రభుపోలీస్ ఇన్స్పెక్టర్
ప్రభాస్ శ్రీను
ఢిల్లీవేణు గోపాల్మైసమ్మ హెంచ్మాన్
సత్యం రాజేష్
తాగుబోతు రమేష్
అంబటి శ్రీనివాస్
కిషోర్ దాస్ యాంకర్
దువ్వాసి మోహన్
సినిమావాడుగుండు సుదర్శన్
ప్రభాకర్ అసిస్టెంట్హేమ
సురేఖ వాణిసురేఖ
రజిత
చంద్రమోహన్ భార్యకాశీ విశ్వనాథ్
హేమ భర్తసత్య కృష్ణ
సత్యశైలజ ప్రియ
పార్వతిసురేష్జి. సురేష్
సుభాషిణి హాస్టల్ వార్డెన్
సిబ్బంది
ముద్ర సాయికుమార్దర్శకుడు
బన్నీ వాసు
నిర్మాతహర్షిత్నిర్మాత
అనూప్ రూబెన్స్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు?
ధరమ్
సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా?
పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
October 15, 1986
సాయి ధరమ్‌కు వివాహం అయిందా?
ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు?
లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్గా నటించింది.
సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా?
గ్యాంగ్ లీడర్
సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్, చిరంజీవి
సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా?
సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్?
నీలం రంగు
సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు?
విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్
సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం?
దుబాయ్, లండన్
సాయి ధరమ్ చదువు?
MBA
సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి?
పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు.
https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo
సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.
సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం?
రొయ్యల పలావు, పప్పు అన్నం
సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు
సాయి ధరమ్ తేజ్ అభిరుచులు?
ట్రావలింగ్, క్రికెట్ ఆడటం
సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్?
సమంత
మార్చి 21 , 2024
MEGA HEROS: టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
ఒకప్పుడు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్
చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్గా పవన్ తీసిన వకీల్ సాబ్ (Vakeel saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్లలో పవన్ బిజీగా ఉన్నాడు.
రామ్‌చరణ్
చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్ఆర్ఆర్ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా ఉండనుంది.
అల్లుఅర్జున్
చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్
చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరణ్ తేజ్
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వరణ్ తేజ్(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అల్లు శిరీష్
చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్ లేటెస్ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఏప్రిల్ 11 , 2023
Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.
బొమ్మరిల్లు
నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.
https://www.youtube.com/watch?v=GEBykGzUxk8
సుస్వాగతం
సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.
https://www.youtube.com/watch?v=iwdC7TGACSk
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.
https://www.youtube.com/watch?v=bCTJZbwI5_0
ఆకాశమంత
కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.
https://www.youtube.com/watch?v=nqGXCWmWDuU
నాన్నకు ప్రేమతో
ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో.
చందమామ
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.
https://www.youtube.com/watch?v=DSCPzIUd8GE
నువ్వే నువ్వే
కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
జూన్ 16 , 2023
Best Comedy Films in Telugu: ఆన్ లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్లైన్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్ కంటే ఇంకా బెటర్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
డైలాగ్
ఓ సీన్లో హీరోయిన్ లిల్లీ జోసేఫ్ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది
లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్
టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా?
లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్
టిల్లు : చర్చి ఫాదరా?
https://twitter.com/i/status/1774726359111307728
డైలాగ్
లిల్లీ ఫాదర్: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?
టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు
డైలాగ్
టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
https://twitter.com/i/status/1774992506087944622
డైలాగ్
ఓ సీన్లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
https://twitter.com/i/status/1773542640488784015
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
https://twitter.com/i/status/1773655054655856994
డైలాగ్
సినిమాలో వచ్చే కారు సీన్లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.
లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ
అలాగే ఓ సీన్లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
టిల్లు: పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం
https://twitter.com/i/status/1772913769770803358
డైలాగ్
లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
టిల్లు: నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని
https://twitter.com/i/status/1774319933129916896
డైలాగ్
లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్ సూపర్‌గా అనిపిస్తుంది.
టిల్లు: ఫ్రెండ్స్ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్ ఏ నల్లమల్ల ఫారెస్ట్.. విత్ నల్ల చీర.. ఫిల్మ్ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్ మాల్కాజ్ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్, హార్ట్ బ్రేక్, హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ జానర్లో వచ్చింది.
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8
డైలాగ్: బర్త్ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో..
టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్ జోకర్ అంటారు'
https://www.youtube.com/watch?v=sARNpvr4IoE
పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ...
టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు..
అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..!
టిల్లు: అచ్చా షాప్ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ..
పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు..
పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో..
టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని.
మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం
పిన్ని: నీకోసమేరా పిచ్చోడా..
టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను.
పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..
టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..
టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో..
టిల్లు: డాడీ... నీకు మార్కెట్లో 'బెబ్స్' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు.
వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు...
టిల్లు: ఉన్నడా భాయ్ ఫ్రెండ్..
లిల్లీ: నీకెందుకు..?
టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా...
లిల్లీ: లేదంటే..
టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..
లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..
టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..
మందు గురించి మాట్లాడే టైంలో..
టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా..
కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్లో
టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు..
లిల్లీ: స్మైలింగ్..
టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా..
లిల్లీ: లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా?
టిల్లు: నాదా...? నా హార్ట్ చాలా వీకూ..
** రొమాంటిక్ మ్యూజిక్…**
టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా..
లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్ ఏంటో తెలిసిననాడు మాట్లాడు.
టిల్లు: నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా..
లిల్లీ: Do You Know the best part Of Kiss
టిల్లు: Kiss
లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..
పబ్‌లో టిల్లుతో లిల్లీ
లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food
'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది.
లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్
షానన్: ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..!
క్లైమాక్స్‌లో లాస్ట్ డైలాగ్
లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్?
టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది.
https://twitter.com/i/status/1773940395300544591
ఏప్రిల్ 02 , 2024
Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం.
[toc]
Eesha Rebba
తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు.
Tatoo images
యుక్తిత రేజా
రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది.
నిహారిక కొణిదెల
మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.
https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh
గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది.
సంయుక్త మీనన్
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది.
అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs
తృప్తి డిమ్రి టాటూస్
న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు.
సమంత టాటూస్
సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది.
మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
శృతి హాసన్ టాటూస్
అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.
https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh
రాశి ఖన్నా టాటూస్
గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.
అనసూయ భరద్వాజ్ టాటూస్
అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం.
ఫరియా అబ్దుల్లా టాటూస్
పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం.
View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)
అనన్య నాగళ్ల టాటూ
గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.
View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
మమతా మోహన్ దాస్ టాటూ
ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది.
నేహా శర్మ టాటూస్
అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది.
శోభిత దూళిపాళ
శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.
షిర్లి షెటియా
అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది.
View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer)
రుహాని శర్మ
రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
అక్టోబర్ 22 , 2024
Item Songs Lyrics: ఈ ఐటెమ్ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం)
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.
‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
వలలు వెయ్యొద్దు వయసు మీద..
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి.
సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.
‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని..
చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ..
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ..
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’
‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా..
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా..
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.
https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk
పుడుతూనే ఉయ్యాల(నేనింతే)
పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.
‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే..
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే..
చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే..
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా..
నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’
‘‘టర్నే లేని దారులూ..
ట్విస్టే లేని గాథలూ..
రిస్కే లేని లైఫులూ..
బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.
https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc
తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్)
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి.
‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని..
చేతకాని వాడల్లే చూడొద్దే..
ధర్మరాజు అంతటివాడు ఆడాడే..
తీసిపారేయొద్దు జూదాన్ని..
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే..
స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే..
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే..
వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’
https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk
పక్కా లోకల్(జనతా గ్యారేజ్)
ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.
తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది..
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే…
‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో..
ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో..
ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో..
అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది.
ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA
మరికొన్ని..
తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.
https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
జూన్ 23 , 2023
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్ హీరో సిద్ధార్థ్, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
[toc]
వైభవంగా సిద్ధార్థ్ వివాహం
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్ - అదితి జంట చెక్ పెట్టింది.
https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477
ఓవైపు పెళ్లిళ్లు..
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850
మరోవైపు విడాకులు
ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్గా తమిళ స్టార్ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్మెంట్ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్ పెట్టి తన భార్య, సింగర్ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.
గతంలో విడాకులు తీసుకున్న పాపులర్ సెలబ్రిటీలు
నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.
పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.
సుమంత్ - కీర్తి రెడ్డి
నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావు
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్
అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు.
కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్
కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సైఫ్ అలీఖాన్ - అమృతా
సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
సంజయ్ దత్ - రిచా శర్మ
1987లో నటి రిచా శర్మతో సంజయ్ దత్ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్‌ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.
సెప్టెంబర్ 16 , 2024
Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్ కొట్టు!
టాలివుడ్ ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్ అవుతోంది. స్టార్ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ వెండితెరపై వెలుగులీనుతున్నాయి.
బలం చూపిన ‘బలగం’
వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు.
చిన్న సినిమాలతో మొదలై..
అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్ మూవీస్ చాలానే ఉన్నాయి.
ఫిదా
లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్గా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్ మొదలుకుని టైటిల్ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్ అనుకున్నారట.
ఈ నగరానికి ఏమైంది?
పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్ సేన్, అభినవ్ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి.
డీజే టిల్లు
2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్ అదిరిపోయాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.
మల్లేశం
ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు.
ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీకి కమ్‌బ్యాక్ మూవీ అయ్యింది. రామ్ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్ పిల్లగా హీరోయిన్ నభా నటేశ్ అమితంగా ఆకట్టుకుంది.
విరాట పర్వం
నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు అందుకుంది.
NBK108లోనూ..
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు.
ఆస్కార్ స్థాయికి
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్ ఇప్పుడు టాప్ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
ఏప్రిల్ 01 , 2023
Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి.
“ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!”
“ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“
“హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.”
“నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!”
“విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.”
“నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.”
“లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“మీరు మా అంటే సెల్లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్‌కి పంపించా..”
“మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”.
“దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.”
“రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.”
“మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
అక్టోబర్ 26 , 2024
Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్గ్రీన్ కామెడీ సీన్స్.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్-10 కామెడీ సీన్స్ మీకోసం..
1. ట్రైన్ సీన్ (వెంకీ)
హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్ సీన్ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
https://www.youtube.com/watch?v=pcpuYeqwloY
2. బ్రహ్మీ vs నాజర్ (బాద్షా)
బాద్షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు.
https://www.youtube.com/watch?v=dxRDHXsQ2YQ
3. MS నారాయణ డైలాగ్స్ (దూకుడు)
దూకుడు సినిమాలో ఎం.ఎస్ నారాయణ, మహేష్ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్ హిట్ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్ చెప్తున్న సమయంలో మహేష్ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=uR3mdOT8DWY
4. సునీల్ కాలేజ్ సీన్స్ (సొంతం)
శ్రీను వైట్ల తీసిన సూపర్ హిట్ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు.
https://www.youtube.com/watch?v=d5rZgi9JHXU
5. బ్రహ్మీ ఫన్ వరల్డ్ సీన్స్ ( నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ చేసిన సూపర్ హిట్ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.
https://www.youtube.com/watch?v=D87NXZXotWY
6. క్విజ్ సీన్ (ఆగడు)
ఆగడు సినిమాలో వచ్చే క్విజ్ సీన్ కూడా తెలుగు టాప్ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్ యాంకర్‌గా, వెన్నెల కిషోర్ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్గా నవ్వులు పూయించాడు.
https://www.youtube.com/watch?v=ufmXlnz9R4w
7. బ్రహ్మీ సీన్స్ (అతడు)
మహేష్ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు.
https://www.youtube.com/watch?v=UhmDHGt81l4
8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం)
సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.
https://www.youtube.com/watch?v=9sUIkrR2U9c
9. ఎస్కేప్ సీన్ (నమో వెంకటేశా)
‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది.
https://www.youtube.com/watch?v=Llwxco8Ek2o
10. బ్రహ్మీ రివేంజ్ (ఢీ)
మంచు విష్ణు కెరీర్లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్, జయ ప్రకాష్ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్ తీర్చుకునే సీన్ సినిమాకే హైలెట్. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్లోనే బెస్ట్ అని చెప్పాలి.
https://www.youtube.com/watch?v=m7B4qtmgHkk
మే 03 , 2023
Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024
Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం.
జూ.ఎన్టీఆర్
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’ పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్ రోల్లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు.
https://youtu.be/b02ieSLiyRI?feature=shared
పవన్ కళ్యాణ్
ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు.
https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU
నాగార్జున
మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు.
సునీల్
విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు..
https://youtu.be/VhyejE23l4M?feature=shared
రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
బాలకృష్ణ
పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు.
https://youtu.be/wcJhLH_T6N0?feature=shared
శోభన్ బాబు:
వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు. బాపు డైరెక్షన్లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు.
https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared
కాంతరావు
ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్
తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.
https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
సెప్టెంబర్ 06 , 2023
#90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి?
నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్మెంట్ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు.
ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈటీవి విన్ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్సిరీస్లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని ఓసారి విశ్లేషిద్దాం.
చంద్రశేఖర్(శివాజీ): ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.
https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20
రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది.
https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20
ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు. సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20
ప్రశాంత్ &దివ్య:
పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది.
https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20
https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
జనవరి 16 , 2024
ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ డుంకీ చిత్రంలోని లుట్ ఫుట్ గయా పాటను మంచి రిదమ్‌తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్ ఖాన్‌కు చేరింది. అయాన్ టాలెంట్‌పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.
అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్‌ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్‌ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.
అయితే ఈ మధ్య అల్లు అర్జున్‌తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్‌ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్‌లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20
ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది.
https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్ అవతార్‌లో షారుక్ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్‌గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్‌పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.
https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20
తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
ఫిబ్రవరి 26 , 2024
HBD Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక 'ఈశ్వర్' ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 23 , 2024
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?
నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్.
దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం.
కథ
గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ & ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ.
https://twitter.com/RyanSohel/status/1691410954377220096?s=20
ఎలా ఉందంటే?
పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
ఎవరెలా చేశారు?
నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు.
టెక్నికల్‌గా
దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే.
https://twitter.com/RyanSohel/status/1691722567441412475?s=20
ప్లస్ పాయింట్స్
సొహైల్ నటన
సెకండాఫ్, క్లైమాక్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
ఇరికించిన కామెడీ సీన్లు
ఫస్టాఫ్
కాస్ట్యూమ్స్
ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.
రేటింగ్: 2/5
https://www.youtube.com/watch?v=MDUVa03xbIs
ఆగస్టు 18 , 2023
Vishwak Sen: ‘ఓ పిల్లో’ అంటూ వెంటపడ్డ విష్వక్ సేన్.. ‘మెకానిక్ రాకీ’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్!
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) వివిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విష్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్వక్ ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజై ఆకట్టుకుంటోంది.
‘ఓ పిల్ల’ సాంగ్ రిలీజ్
విష్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓపిల్లో..’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణచైతన్య ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. ఆ యూత్‌ఫుల్ పాటను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=3HkSttt1iJg&t=3s
సాంగ్ ఎలా ఉందంటే?
రాఖీ (విష్వక్ సేన్), ప్రియ (మీనాక్షి చౌదరి) ప్రేమను పరిచయం చేసేలా 'ఓ పిల్లా' సాంగ్ సాగింది. 'బీటెక్‌లోనే మిస్సయ్యనే నిన్నే కొంచంలో' అంటూ కథానాయకుడు విష్వక్ తన ప్రేమపై ఉన్న భావాలను ఇందులో వ్యక్తం చేశాడు. నకాష్ అజీజ్ ఈ పాటను యూత్‌ఫుల్‌గా, ఎంతో మనోహరంగా పాడారు. ఈ సాంగ్‌లో విష్వక్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. విజువల్స్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ కూడా మెప్పిస్తోంది. విష్వక్ ఎప్పటిలాగే తన క్లాసిక్ స్టెప్పులతో ఈ పాటలో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.
‘లైలా’గా విష్వక్
విష్వక్ మెకానిక్ రాకీతో పాటు లైలా అనే మరో ప్రాజెక్ట్‌లోనూ వర్క్ చేస్తున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు. దీంతో సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన విష్వక్ మెుదటిసారి అమ్మాయిగా నటిస్తుండటంతో ఈ సినిమా చూసేందుకు విష్వక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
https://twitter.com/HanuNews/status/1808353426721407104
పోలీసు ఆఫీసర్‌గా..
యంగ్ హీరో విష్వక్ సేన్ ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను సైతం అనౌన్స్ చేశాడు. 'VS13' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. శ్రీధర్ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇందులో విష్వక్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948
హ్యాట్రిక్ హిట్స్
ప్రస్తుతం విష్వక్ హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్ పాత్రలో విష్వక్ మాస్ జాతర చేశాడు. అలాగే విద్యాధర్ కాగిత డైరెక్షన్లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్ పాత్రలో విష్వక్ నటన మెప్పించింది. హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేసింది.
సెప్టెంబర్ 18 , 2024