• TFIDB EN
  • పిండం
    ATelugu
    తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ, లోక్ నాథ్‌కు తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన కేసు గురించి చెబుతుంది. "ఆంటోనీ తన కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? ఆ విషయాన్ని కనిపెట్టాలని లోక్‌నాథ్‌కు అన్నమ్మ సూచిస్తుంది. మరి లోక్‌నాథ్‌ ఏం చేశాడన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీకాంత్ శ్రీరామ్
    కుషీ రవి
    ఈశ్వరి రావు
    శ్రీనివాస్ అవసరాల
    రవివర్మ
    మాణిక్ రెడ్డి
    చైత్ర పాప
    బేబీ లీషా
    విజయలక్ష్మి
    శ్రీలత
    సిబ్బంది
    సాయికిరణ్ దైదాదర్శకుడు
    యశ్వంత్ దగ్గుమాటినిర్మాత
    కృష్ణ సౌరభ్ సూరంపల్లిసంగీతకారుడు
    కవి సిద్ధార్థకథ
    టోబి ఒస్బోర్న్కథ
    సతీష్ మనోహరన్సినిమాటోగ్రాఫర్
    శిరీష్ ప్రసాద్ఎడిటర్ర్
    కథనాలు
    Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
    Pindam Movie Review: హారర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు దర్శకుడు : సాయికిరణ్ దైదా సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్ ఎడిటర్: శిరీష్ ప్రసాద్ నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023 ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో హార‌ర్ జానర్‌ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జాన‌ర్‌ని స్పృశిస్తూ ద‌ర్శ‌కనిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియ‌స్ట్ ఫిలిం ఎవ‌ర్’ అనే ఉప‌శీర్షిక‌తో సినిమా రూపుదిద్దుకుంది. ప్ర‌చార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే శ్రీరామ్‌, ఖుషి ర‌వి మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన జంట‌గా ఇమిడిపోయారు. హార‌ర్ సీన్లలో శ్రీరామ్ న‌ట‌న ఆకట్టుకుంటుంది. ఖుషి ర‌వి గ‌ర్భ‌వ‌తిగా, ఇద్ద‌రు బిడ్డల త‌ల్లిగా పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించింది. తాంత్రిక శ‌క్తులున్న మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు న‌ట‌న మెప్పిస్తుంది. ఇద్ద‌రు చిన్నారుల్లో తారగా న‌టించిన అమ్మాయి సైగల‌తో మాట్లాడుతూ ప్రేక్షకులను క‌ట్టిప‌డేస్తుంది. అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు పాత్రల ప్రాధాన్యం మేర‌కు న‌టించారు  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు సాయికిరణ్ దైదా క‌థ‌నంపైన‌, క‌థ‌లోని భావోద్వేగాల‌పైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వ‌చ్చాక ఆత్మ‌లు క‌నిపించ‌డం, అంద‌రూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తించే స‌న్నివేశాల్ని భ‌యం క‌లిగించేలా తీయ‌డంలో ఆయన స‌ఫ‌ల‌మ‌య్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ స‌న్నివేశాల్లో క‌లిగినంత భ‌యం ఆ త‌ర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ సెకండ్‌ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. క‌డుపులో పిండానికీ, బ‌య‌టి ఆత్మ‌కీ ముడిపెట్ట‌డంలో పెద్దగా లాజిక్ క‌నిపించ‌దు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని కనబరిచాయి. శబ్దాల‌తోనే భ‌య‌పెట్టడంలో సంగీత ద‌ర్శ‌కుడు కృష్ణ సౌరభ్ సక్సెస్‌ అయ్యాడు. విష్ణు నాయ‌ర్ క‌ళా ప్ర‌తిభ తెర‌పై క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్టే స‌న్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంప‌రంగా లోపాలేమీ లేవు. ప్లస్ పాయింట్స్‌ హారర్‌ సన్నివేశాలునటీనటులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 15 , 2023
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. డిసెంబర్‌ 11 - 17 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు పిండం శ్రీరామ్‌ లేటెస్ట్‌ హారర్‌ మూవీ ‘పిండం’ (Pindam) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సాయికిరణ్‌ దైదా తెరకెక్కించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ‘మరణం అనేది నిజంగానే అంతమా? కోరికలు తీరని ఆత్మలు మనకు నిజంగానే హాని చేయగలవా?’ అంటూ ఇటీవల విడుదల చేసిన ప్రచారం చిత్రం భయపెడుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. కలశ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కలశ’ (Kalasa) ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. కొండా రాంబాబు తెరకెక్కించిన చిత్రాన్ని రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జోరుగా హుషారుగా విరాజ్‌ అశ్విన్‌ హీరోగా అను ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’ (joruga husharuga). నిరీష్‌ తిరువిధుల నిర్మాతగా వ్యవహరించారు. పూజిత పొన్నాడ కథానాయిక. ‘బేబీ’తో ఆకట్టుకున్న విరాజ్‌ హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెంచేశాయి. యువతను మెప్పించేలా ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. డిసెంబరు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తికమక తాండ కవలలైన హరికృష్ణ, రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రం ‘తికమక తాండ’(tikamaka tanda). యాని, రేఖ నిరోషా కథానాయికలు. వెంకట్‌ దర్శకత్వం వహించారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చే క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘చే’. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం చెప్పుకోతగ్గ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ కావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపై పడింది. సరిగ్గా దీన్ని వినియోగించుకుంటున్న ఓటీటీ సంస్థలు ఈ వారం ఏకంగా 32 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో వీక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉండటం విశేషం. ఈవారం రిలీజ్‌ కాబోతున్న వాటిలో ముఖ్యమైనవి ఏవో ఇప్పుడు చూద్దాం.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTiger 3MovieTelugu/HindiAmazon PrimeDec 12Deaths GameSeriesEnglishAmazon PrimeDec 15Reacher Season 2SeriesEnglishAmazon PrimeDec 15FalimyMovieMalayalamDisney+HotstarDec 15The Freelancer Season 2SeriesHindiDisney+HotstarDec 15Japan MovieTeluguNetflixDec 11Single Inferno Season 3SeriesEnglish/KoreanNetflixDec 12The Crone Season - 6MovieEnglishNetflixDec 14Sesham Mike-il FathimaMovieMalayalamNetflixDec 15YellowMovieEnglishNetflixDec 15UstaadTv ShowTeluguEtv WinDec 15The BlackeningMovieEnglishJio CinemaDec 15Koose Munisamy VeerappanSeriesTelugu/TamilZee 5Dec 14
    డిసెంబర్ 11 , 2023
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో  ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే  నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.  సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం  మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి ఎమోషనల్.. ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాక‌తో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గ‌ర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాక‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.  https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20 అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు. https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది.  రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.  చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.  డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్,  డాక్టర్ రూమా సిన్హా  అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో  ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది. ఐకాన్ స్టార్ రాక.. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ‌అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/ANI/status/1671037419255373824?s=20  అటు చరణ్‌-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్‌ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో  అంతం చేస్తాడు. అటువంటి  బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.  భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.  కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.  కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.  రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో  రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.  పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.  అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.  పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.  ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.  సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.  బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.  అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు. 
    ఫిబ్రవరి 29 , 2024
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎవరి పోలికనో చెప్పేసిన రామ్‌చరణ్
    మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా కౌంపౌండ్‌లో సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన సుఖంగా ప్రసవించారు. ఉపాసన డెలివరీ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో జరిగింది. ఈ క్రమంలో జూన్ 23న మధ్యాహ్నం ఉపాసన డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో తొలిసారి బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చారు. ఈ తరుణంలో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నాడు.  పూలతో వెల్‌కం.. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆసుపత్రి నుంచి అడుగు పెట్టిన సమయంలో అభిమానులు వారిపై పూలాభిషేకం కురిపించారు. వెల్ కం టు మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఉత్సాహాన్ని చూపించారు. ఉపాసనకు సాధారణ ప్రసవం చేయడంతో మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. https://twitter.com/HumanTsunaME/status/1672171267259260931 దిష్టి తగలకుండా.. నవజాత శిశువులకు సాధారణంగానే దిష్టి తగులుతుందని అంటుంటారు. మరి, మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు రామ్ చరణ్, ఉపాసన. ఆసుపత్రి నుంచి బయటకు తెస్తుండగా అప్రమత్తంగా ఉన్నారు. బిడ్డకు తెల్లటి వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చారు. బేబీ మొఖం కనిపించకుండా చెర్రీ, ఉప్సి తమ చేతులను అడ్డంగా పెట్టుకున్నారు. మీడియాకు ఏమాత్రం కూడా బేబీ మొఖాన్ని చూపించలేదు. https://twitter.com/captain_india_R/status/1672177223032524800 లిటిల్ ప్రిన్సెస్ పేరు? ఇప్పటికే తమ కూతురి పేరును ఫిక్స్ చేసినట్లు రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను, ఉపాసన ఇప్పటికే ఒకట్రెండు పేర్లు అనుకున్నాం. సరైన సమయంలో మా బిడ్డ పేరుని నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని చెప్పాడు చెర్రీ. మరి, ఆ పేరు ఏంటా అని అప్పుడే నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. మంగళవారం పుట్టడం, మెగా ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దేవత పేరు కలిసొచ్చేలా నామకరణం చేసే అవకాశం ఉంది.  https://twitter.com/telugufilmnagar/status/1672177021508792320 పట్టరాని ఆనందం.. కుమార్తె పుట్టిన విషయం తెలిశాక మీ ఫీలింగ్ ఏంటని ఓ విలేకరి ప్రశ్నించారు. ప్రతి మగవాడు తొలిసారి తండ్రయితే ఎలాంటి అనుభూతి చెందుతాడో తనూ అలాగే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బిడ్డను చూడగానే పట్టరాని సంతోషం వేసిందని చెప్పాడు. 21 రోజుల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వెల్లడించాడు చెర్రీ.  https://twitter.com/MilagroMovies/status/1672177857207103488 ఎవరి పోలికంటే? బిడ్డ పుడితే ఎవరి పోలికా? అనే ప్రశ్న ఎదురవడం సర్వ సాధారణం. కొందరు అమ్మ పోలికలతో పుడతారు. మరికొందరికి నాన్న పోలికలు వస్తాయి. ఇంకొందరికి అమ్మమ్మ/నానమ్మ, తాతయ్యల పోలికలు వస్తాయి. ఇదే ప్రశ్న రామ్‌చరణ్‌కు ఎదురైంది. పాప ఎవరి పోలిక అని ఓ విలేకరి అడిగారు. దీంతో ‘కచ్చితంగా నాన్న పోలికే’ అంటూ గర్వంగా చెబుతూ వెంటనే బయలు దేరారు.  https://twitter.com/sivacherry9/status/1672174966002049025 బొడ్డు పేగు రక్తం ప్రిజర్వ్.. పాప బొడ్డు పేగు రక్తాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. బిడ్డ జన్మించాక బొడ్డు పేగును కత్తిరించి తల్లి నుంచి వేరు చేస్తారు. ఇలా కత్తిరించిన పేగులో రక్తకణాలు ఉంటాయి. ఇవి చికిత్సకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులపై పోరాడటానికి సహాయపడతాయి. అందుకే ఈ రక్తాన్ని పదిలంగా భద్రపరిచారట. మహేశ్ బాబుకు గౌతమ్ జన్మించిన సమయంలోనూ ఇలాగే చేశారట.  https://twitter.com/HoneYNavya_/status/1672182605385531392
    జూన్ 23 , 2023
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు.   తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.   అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.  https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -  మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.   https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.  https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)  - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.  https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.  https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.  https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.  https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.  https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.  https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.  https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.  https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.  ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.   ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 
    ఆగస్టు 14 , 2023
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.   మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల  మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్‌ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.  https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్  న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC  అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.  https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.  అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన  ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.  View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్‌ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్‌ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.  షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
    మే 14 , 2024
    S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్‌ మస్క్‌ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్‌ డైరెక్టర్‌గా రికార్డు!
    S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్‌ మస్క్‌ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్‌ డైరెక్టర్‌గా రికార్డు!
    భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్‌ దేశం అలెర్ట్‌ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం ‌అయిపోతాయి. రాజమౌళి రీసెంట్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకొని యావత్‌ దేశాన్ని గర్వించేలా చేసింది. ఇంతటి కీర్తిని గడించిన రాజమౌళి తాజాగా మరో ‌అందలం ఎక్కారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించారు. https://twitter.com/DVVMovies/status/1646532105067966466 2023 ఏడాదికి గాను ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రపంచ వ్యాప్త ప్రభావశీలుర జాబితాలో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ ఘనత సాదించిన తొలి ఇండియన్‌ డైెరెక్టర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో జక్కన్నతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌, రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయ నిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్ చోటు సంపాదించారు. అలాగే ప్రఖ్యాత గాయని బియాన్స్‌, సిరియా స్విమ్మర్స్‌ సారా మర్దిని, యుస్రా మర్దిని, సూపర్‌ మోడల్‌ బెల్లా హడిడ్‌ చోటు దక్కించుకున్నారు. ఇంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జక్కన్న స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు.  View this post on Instagram A post shared by Bella ? (@bellahadid) టైమ్‌ మేగజీన్‌లో S.S. రాజమౌళి గురించి ప్రముఖ బాలీవుడ్‌ నటి అలీయా భట్‌ ప్రొఫైల్‌ రాసింది. సినిమాపై రాజమౌళికి ఉన్న విజన్‌పై ప్రశంసలు కురిపించింది. ‘ఆడియన్స్‌ గురించి రాజమౌళికి బాగా తెలుసు. సినిమాను ఎలా తీస్తే హిట్‌ కొడుతుందో ఆయనకు కొట్టిన పిండి. కథల ఎంపికలో రాజమౌళికి ఎంతో నైపుణ్యం ఉంది. భారత్‌లోని జనాభా విభిన్న సంస్కృతులు, అభిరుచులను కలిగి ఉంటారు. వారందరినీ రాజమౌళి తన సినిమాల ద్వారా ఏకం చేశారు’ అని అలియా భట్ రాసుకొచ్చింది. అటు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ గురించి నటి దీపికా పదుకొనే కూడా ప్రొఫైల్‌ రాసింది. ప్రపంచ ప్రసిద్ధ నటుల్లో షారుక్‌ ఒకరిని పేర్కొంది. షారుక్‌.. గొప్ప మనసు, దాతృత్వం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.  https://twitter.com/TIME/status/1646737043290980354 రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్‌బాబుతో తీయబోతున్నారు. దీంతో ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించి రోజుకో  సంచలన విషయం వెలుగుచూస్తోంది. మహేష్‌ సినిమాను రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని రాజమౌళి ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌ రూ.1000 కోట్లు అని ఒకసారి షూటింగ్ స్టార్ట్‌ అయితే అది రూ.1500 కోట్లకు కూడా చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే సినిమా మూడు పార్ట్స్‌ రిలీజ్‌ చేయడానికి రాజమౌళి కనీసం 8 ఏళ్లు తీసుకుంటాడని కూడా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ‌అయింది. అయితే ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  https://twitter.com/Harmindarboxoff/status/1643961285615427586
    ఏప్రిల్ 14 , 2023
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.  తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు తదితరులు దర్శకత్వం: వేణు ఎల్దండి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc కథ: ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు.  సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ. ఎలా ఉంది:  చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.  నటీ నటులు: సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్‌ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. సాంకేతిక పనితీరు: దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్‌ క్యాస్ట్‌ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్‌ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.  బలాలు కథ కథా నేపథ్యం భావోద్వేగాలు కామెడీ పాటల్లో సాహిత్యం బలహీనతలు కొన్ని చోట్ల సాగదీత సీన్లు స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం ఒక్కమాటలో చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్‌ కాకూడని సినిమా. రేటింగ్‌ 3/5
    మార్చి 03 , 2023
    సంక్రాంతి పండగకి సందడి చేసిన తెలుగు పాటలు ఇవే!
    సంక్రాంతి పండగకి సందడి చేసిన తెలుగు పాటలు ఇవే!
    ]సోగ్గాడి పెళ్లాంముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో మెహన్‌బాబు హీరోగా వచ్చిన చిత్రంలో “సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరాదాలు తెచ్చింది తుమ్మెద” అనే పాట ఇప్పటికీ మోగుతూనే ఉంటుంది.Watch Now
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
    Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 03 , 2023
    <strong>Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే</strong>
    Megastar Birthday Special: విశ్వంభర నుంచి క్రేజీ అప్‌డేట్, ఫ్యాన్స్‌కు పండగే
    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ చిత్రం 'విశ్వంభర'. ఇందులో చిరు సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం మెగా అభిమానులతో పాటు&nbsp; చిరంజీవి కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత చిత్రం ‘భోళా శంకర్‌’ డిజాస్టర్‌ నుంచి ఈ మూవీ సక్సెస్‌తో బయటపడాలని చిరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు. దీంతో ఆ రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని విశ్వంభర టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది.&nbsp; గ్రాండ్‌ ట్రీట్‌ లోడింగ్‌..! మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డేను మెగా అభిమానులు ఏ స్థాయిలో సెలబ్రేట్‌ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్లెక్సీలు కట్టించి కేక్‌ కటింగ్స్‌ చేయడంతో పాటు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలతో హంగామా చేస్తారు. చిరు గొప్పతనం గురించి గుర్తుచేసుకుంటారు. ఆ రోజున ఫుల్‌ జోష్‌లో ఉండే మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ‘విశ్వంభర’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్క్‌ కూడా మెుదలైపోయినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్/టీజర్‌ తాలుకూ ఫైనల్‌ వర్క్‌ జరుగుతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘ఇంద్ర’ మూవీ 4K వెర్షన్‌ రీరిలీజ్‌ సందర్భంగా థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను ప్రసారం చేయాలని విశ్వంభర టీమ్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/CinemaBrainiac/status/1825454972777197590 ‘ఇంద్ర’ రీ-రిలీజ్ రికార్డులు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను ఈసారి మరింత స్పెషల్‌ కాబోతోంది. చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇంద్ర’ను ఆగస్టు 22న రీరిలీజ్‌ చేయబోతున్నారు. 4K వెర్షన్‌లో రానున్న ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్‌ను శనివారం (ఆగస్టు 17) ప్రారంభించారు. అయితే రిలీజ్‌ చేసిన అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయినట్లు థియేటర్‌ వర్గాలు ప్రకటించాయి. అదనపు&nbsp; షోలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపాయి. అయితే ఇంద్ర రిలీజై ఇప్పటికీ 22 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతకాలం తర్వాత ఈ సూపర్‌ హిట్‌ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ‘ఇంద్ర’తో పాటు మరో బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ను సైతం రీరిలీజ్‌ చేయబోతున్నారు.&nbsp; విశ్వంభరలో సిస్టర్‌ సెంటిమెంట్‌! విశ్వంభర సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ కూడా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యువ నటి రమ్య పసుపులేటి క్లారిటీ ఇచ్చింది. 'మారుతినగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి గారి పక్కన సిస్టర్‌గా విశ్వంభర సినిమాలో చేస్తున్నాను. ఆయనతో చాలా సేపు స్క్రీన్ లో కనిపిస్తాను. ఆయనతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. నాకు చాలా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. కానీ హీరోయిన్‌గా చేద్దామనే అవేవి చేయలేదు. ఇపుడు ఓన్లీ చిరంజీవి పక్కన ఛాన్స్ అని మాత్రమే చెల్లి పాత్రకు ఒప్పుకున్నాను. నాతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవి పక్కన చెల్లెళ్లుగా చేస్తునారు’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/PraveeGv/status/1825121103187964326
    ఆగస్టు 20 , 2024
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; లవ్‌ గురు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ చిత్రం.. ‘లవ్‌ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్‌ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. డియర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌’ (Dear). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.&nbsp; బడేమియా ఛోటేమియా బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.&nbsp; మైదాన్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో చేశాడు. అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఓం భీమ్ బుష్‌ ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.&nbsp; గామి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.&nbsp; ప్రేమలు&nbsp; మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu&nbsp;AhaApril 09PremaluMovieTelugu&nbsp;AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
    ఏప్రిల్ 08 , 2024
    Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
    Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
    ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం ఈరోజు విడుదలైంది. బిగ్ బాస్ ఫేం సొహైల్, అందాల నటి మృణాలిని జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మరి, ఈ మామా అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించారా? ఎస్వీ కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటంటే? గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటాడు విజయ్(సొహైల్). ఇతడు హాసిని(మృణాలిని)తో ప్రేమలో పడతాడు. వెంకటరమణ(రాజేంద్రప్రసాద్) సంపన్నుడే కాదు పక్కా సాంప్రదాయవాది. గారాభంగా పెంచుకున్న కూతురు హాసిని విజయ్‌తో ప్రేమలో పడటం వెంకటరమణకు ఇష్టం ఉండదు. మరి వీరి ప్రేమని ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ. నటీనటులు హీరోగా సొహైల్ చక్కగా నటించాడు. అక్కడక్కడా తన నటనతో ప్రేక్షకుడిని మెప్పించాడు. మృణాలిని అందంగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలీ, కృష్ణ భగవాన్, సప్తగిరి, సునీల్ వంటి కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారు. కానీ, ఎక్కడా కామెడీ పండించలేక పోయారు. సునీల్ కాస్త ఫర్వాలేదనిపించాడు.&nbsp; ఎలా ఉంది? కథలో కొత్తదనం లోపించింది. డైరెక్టర్ పాత సినిమాల గుర్తులు ఇందులో కనిపించాయి. కథ, కథనంలో ప్రేక్షకుడు లీనం కాలేకపోయాడు.&nbsp; కామెడీ వెగటుగా ఉంది. కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అయ్యాయి. క్లైమాక్స్ బాగా ఉన్నప్పటికీ సినిమాను నడిపించడానికి అదొక్కటే సరిపోదు కదా. సాంకేతికంగా.. చాలా గ్యాప్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. టైటిల్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. కానీ, వాటిని అందుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. పాత కథనే తీసినట్లుగా అనిపించింది. అయితే, ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు, క్లైమాక్స్ కొద్దిమేరకు బాగున్నాయి. ఈ సినిమాకు స్వయంగా తానే సంగీతం అందించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒక పాట మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది.&nbsp; ప్లస్ పాయింట్స్ సొహైల్ నటన ఒక పాట నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ కథనం సాగతీత సన్నివేశాలు మ్యూజిక్ ఎడిటింగ్ చివరగా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వినోదాన్ని పండించలేకపోయారు. రేటింగ్: 2.25/5
    మార్చి 03 , 2023
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!&nbsp;
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.&nbsp; భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.&nbsp; వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.&nbsp; రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    <strong>New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!</strong>
    New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
    దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు లవ్‌రెడ్డి అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దీనిని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తోంది.&nbsp; సముద్రుడు రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; వీక్షణం రామ్ కార్తీక్ (Ram Karthik), క‌శ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకుడు. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 18న థియేటర్‌లో విడుదల కానుంది. చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.&nbsp; రివైండ్‌&nbsp; సాయి రోనక్‌ హీరోగా కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘రివైండ్‌’ (Rewind Movie). అమృత చౌదరి కథానాయిక. ఈ మూవీ అక్టోబరు 18న విడుదల కానుంది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు మనసుకు హత్తుకునే లవ్‌స్టోరీని జోడించి ఈ సినిమా తీసినట్లు మేకర్స్‌ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.&nbsp; ‘ఖడ్గం’ రీ-రిలీజ్‌ శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఖడ్గం’. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.&nbsp; అక్టోబరు 18న (khadgam re release date) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు 1000 బేబీస్‌ ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ '1000 బేబీస్ (1000 Babies). అక్టోబర్‌ 18న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. ఇందులో రెహమాన్‌, నీనా గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు. నజీమ్‌ దర్శకత్వం వహించారు.&nbsp; కలి&nbsp; ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి 'కలి' (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 17నుంచి ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ముఖ్య పాత్రలు పోషించారు. నేహా కృష్ణన్‌ హీరోయిన్‌గా చేసింది. శివ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న రిలీజై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. TitleCategoryLanguagePlatformRelease DateThe Linkan LawyerMovieEnglishNetflixOct 17Fabulous Lives vs Bollywood Wives S3SeriesEnglishNetflixOct 19The Pradeeps Of PittsburghSeriesEnglishAmazonOct 17Citadel Honey BunnySeriesTelugu/HindiAmazonNov 7Kali&nbsp;MovieTeluguETV WinOct 17Reeta SanyalMovieHindiHotstarOct 14NemesisMovieEnglish/DutchHotstarOct 161000 BabiesSeriesTelugu/MalayalamHotstarOct 18RivalsMovieEnglishHotstarOct 18Crime Reels&nbsp;MovieTeluguAhaOct 13Janaka Aithe GanakaMovieMovieAhaNov 5Maa Nanna Super HeroMovieMovieZee 5Nov 8
    అక్టోబర్ 14 , 2024

    @2021 KTree