• TFIDB EN
  • పూజ
    UTelugu
    కుటుంబ కలహాల కారణంగా రాము తను ప్రేమించిన లలితను వివాహం చేసుకోలేకపోతాడు. తనను పొందేందుకు యత్నిస్తున్న గౌరిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామకృష్ణ
    రామచంద్రరావు రాము
    మంజుల
    మంజుల
    వాణిశ్రీ
    గౌరి
    చంద్ర మోహన్
    ఆనంద్‌
    కాంత రావు
    రాముని తండ్రి
    సిబ్బంది
    మురుగన్-కుమారన్దర్శకుడు
    ఎం. మురుగన్నిర్మాత
    ఎం. కుమరన్నిర్మాత
    ఎం. శరవణన్నిర్మాత
    ఎం. బాలసుబ్రహ్మణ్యంనిర్మాత
    M. S. గుహన్నిర్మాత
    రాజన్-నాగేంద్ర
    సంగీతకారుడు
    S. మారుతీ రావు
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే  ముద్దు పేరు? పూజిత పూజా హెగ్డే వయస్సు ఎంత? 1990, అక్టోబర్ 13న జన్మించింది పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా? ఒక లైలా కోసం(2014) పూజా హెగ్డే ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు  పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్ణాటక పూజా హెగ్డే ఉండేది ఎక్కడ? ముంబై పూజా హెగ్డే  ఏం చదివింది? Mcom పూజా హెగ్డే  అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం? బిర్యాని, ఫిజా పూజా హెగ్డేకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్ పూజా హెగ్డే  పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. పూజా హెగ్డే  తల్లిదండ్రుల పేరు? లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే పూజా హెగ్డే  రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది పూజా హెగ్డే  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/hegdepooja/ పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ? రూ.50కోట్లు https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
    ఏప్రిల్ 16 , 2024
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్‌ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్‌ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్‌ లెగ్ ముద్ర వేస్తున్నారు.  అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్‌ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్‌ లెగ్‌ ట్యాగ్‌ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.  ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కాబోతోంది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌, వెంకటేష్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్‌ క్రియేట్‌ చేసింది. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వీరమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్‌ ఫర్హద్‌ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు తనపై పడ్డ ఐరన్‌ లెగ్‌ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి.
    ఏప్రిల్ 10 , 2023
    Pooja Hegde: పూజా హెగ్డేను  మరీ ఇంతా హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు..!
    Pooja Hegde: పూజా హెగ్డేను  మరీ ఇంతా హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరు..!
    నటి పూాాజా హెగ్డేకు సంబంధించిన బోల్డ్‌ ఫొటోలు, వీడియోలు ట్విటర్‌లో వైరల్‌ అవుతున్నాయి. గతంలో పూజా కనిపించిన హాట్‌ పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.  జిమ్‌లో కష్టపడుతూ పూజా దిగిన ఫొటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. పూజ ఫ్యాన్స్‌ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. https://twitter.com/Actresshugs/status/1576809620722843648?s=20 https://twitter.com/chandrakkala/status/1642863060569427969 కొంటే చూపుతో.. హాట్‌ హాట్‌ ఫొజులో కనిపించిన పూాాజా ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేశాడు.  https://twitter.com/brownsdenn/status/1640936367759962113 జిమ్‌లోకి ఎంటర్‌ అవుతూ పూజా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. టైట్‌ డ్రెస్‌లో పూాజా అందాలు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ఎద అందాలను ఆరబోస్తూ స్టైలిష్‌ లుక్‌లో ఉన్నపూజా  ఫొటో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. https://twitter.com/imashwini123/status/1641826344664465409 గార్జియస్‌ లుక్‌లో ఉన్న పూజా ఫోటో ఆకట్టుకుంటోంది. ఇందులో తన నడుము అందాలతో పూజా హల్‌చల్‌ చేసింది. https://twitter.com/navelmania/status/1603309893561110528 ముకుంద చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన పూజా తన నటనతో ఆకట్టుకుంది. వరుసగా తెలుగు సినిమాల్లో నటించి ప్రత్యేక స్థానం సంపాదించింది.  https://twitter.com/Actresshugs/status/1576809620722843648?s=20 https://twitter.com/babuvetriveeran/status/1642470057208070144 పూజా చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ మూవీ కిసి కా జాన్‌ కిసి కా భాయ్‌ చిత్రం ఏప్రిల్‌ 21న విడుదల కానుంది.  ఈ సినిమాలో టాలీవుడ్‌ నటుడు వెంకటేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌  సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ చిత్రంలోని ‘ఏంటమ్మా’ అనే పాటకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్‌ తాజాగా రిలీజ్‌ చేసింది. ఈ టీజర్‌లో వెంకటేష్‌, సల్మాన్‌ లుంగీలో కనిపించి అలరించారు. పూర్తి పాటను మంగళవారం రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  https://twitter.com/Freak4Salman/status/1642840365282762755?s=20 https://twitter.com/BeingSalmanKhan/status/1642837129574363137?s=20
    ఏప్రిల్ 03 , 2023
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్పులే మార్పులు ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్‌ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. అదే అసలు సమస్య డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది. తమన్ తప్పుకున్నట్లు ప్రచారం.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు.  ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు. https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20 పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్? పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్‌(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20 పూజా ఓవర్ యాటిట్యూడ్ అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు.  ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్‌ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు. https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20 పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.  మూవీ బృందం క్లారిటీ గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.  సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది. https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20 అల్లు అర్జున్‌తో మళ్లీ... మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
    జూన్ 20 , 2023
    Pooja Hegde: బ్లాక్‌ శారీలో స్కిన్‌ షో చేసిన పూజా.. నడుము అందంతో నలిపేస్తున్న బ్యూటీ!
    Pooja Hegde: బ్లాక్‌ శారీలో స్కిన్‌ షో చేసిన పూజా.. నడుము అందంతో నలిపేస్తున్న బ్యూటీ!
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 18 , 2023
    Samantha: మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు… ఆ కోరిక తీరుతుందా?
    Samantha: మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు… ఆ కోరిక తీరుతుందా?
    ]మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండిWatch Now
    ఫిబ్రవరి 14 , 2023
    మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న‌ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే
    మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న‌ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే
    ]కొన్ని రోజుల క్రిత‌మే మాల్దీవ్స్ వెళ్లిన పూజా అప్పుడు పెట్టిన ఫోటోలు  వైర‌ల్‌గా మారాయిమాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌. ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుందిమాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుంది
    అక్టోబర్ 21 , 2022
    సల్మాన్ ఖాన్‌కి ఇంతమంది మాజీ ప్రేయసిలున్నారా!
    సల్మాన్ ఖాన్‌కి ఇంతమంది మాజీ ప్రేయసిలున్నారా!
    ]ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రస్తుతం బహు భాషా చిత్రాలతో బిజీగా గడుపుతోంది పూజా హెగ్దే. సల్లు భాయ్‌తో కలిసి ఈ అమ్మడు ‘కిసి కా భాయ్ కిసి కీ జాన్’ అనే సినిమా చేయబోతోంది. అయితే, వీరి మధ్య కూడా ఏదో నడుస్తోందని టాక్.పూజా హెగ్దే
    ఫిబ్రవరి 13 , 2023
    RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
    RC 17: రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
    మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్‌ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్‌ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్‌.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.  హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌.. రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్‌ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్‌ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్‌ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.  https://twitter.com/MythriOfficial/status/1772195858693698029 రంగస్థలం కాంబో రిపీట్‌! సుకుమార్‌ - రామ్‌చరణ్‌ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్‌ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది. రిలీజ్‌ ఎప్పుడంటే? రామ్‍చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని... 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
    మార్చి 25 , 2024
    My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్‌.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
    My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్‌.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: హన్సిక, ముర‌ళీశ‌ర్మ, న‌రేన్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, ప్రవీణ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్,   సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడ‌పు సంగీతం: మార్క్ కె రాబిన్‌  నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్,  సంస్థ‌: వైష్ణ‌వి ఆర్ట్స్‌ విడుద‌ల‌: 17 న‌వంబ‌ర్ 2023 టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్‌, నితీన్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్‌ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ `మై నేమ్ ఈజ్ శృతి`. హన్సిక చాలా రోజుల త‌ర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హన్సికకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? ఈ కథనంలో తెలుసుకుందాం.  కథ శృతి (హ‌న్సిక‌) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోవ‌డంతో తాత, అమ్మ పెంప‌కంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి  (న‌రేన్‌) ముఠా వ‌ల‌లో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ శృతికి తెలుస్తాయి. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెన‌క ఎవ‌రున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్‌ పెట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే శృతిగా హ‌న్సిక మోత్వాని మంచి న‌ట‌న‌ కనబరిచింది. ప్ర‌థ‌మార్ధంలో కుటుంబం, ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మ‌లుపుల‌తో కూడిన సీన్లలో మంచి అభిన‌యం ప్రదర్శించిది. పూజా రామ‌చంద్ర‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రేమ ఇందులో వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్ర‌లో కనిపించి మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో న‌రేన్ పర్వాలేదనిపించాడు. ముర‌ళీశ‌ర్మ‌, జయ‌ప్ర‌కాశ్, ప్రవీణ్ అల‌వాటైన పాత్ర‌ల్లో తమదైన నటన కనబరిచారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? చ‌ర్మంతో కూడా వ్యాపారం చేస్తార‌నే కొత్త అంశాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్ ఓం కార్ ఈ సినిమాలో చూపించారు. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్ర‌స్తావ‌న‌తో సినిమా మొద‌లుపెట్టినా పాత్ర‌ల ప‌రిచ‌యానికి, క‌థా నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఏడాది త‌ర్వాత‌, ఆరు నెల‌ల ముందు అంటూ ముక్క‌లు ముక్క‌లుగా క‌థ‌ని చెప్ప‌డం ప్రేక్ష‌కులను గందరగోళానికి గురిచేస్తుంది. కీలక స‌న్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌య్యాడు. అయితే ద్వితియార్థంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  సాంకేతికంగా  సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కిశోర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటనట్విస్ట్‌లుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ప్రథమార్థంపండని భావోద్వేగాలు  రేటింగ్‌ : 2.5/5
    నవంబర్ 17 , 2023
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.  మార్టిన్ లూథర్  కింగ్  పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల  ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న  దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.  బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Tollywood Actress Bikini Photos: టాలీవుడ్‌ హీరోయిన్లను ఇంత హాట్‌గా ఎప్పుడు చూసి ఉండరు
    Tollywood Actress Bikini Photos: టాలీవుడ్‌ హీరోయిన్లను ఇంత హాట్‌గా ఎప్పుడు చూసి ఉండరు
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ బికిని ఆందాలతో చెలరేగిపోతోంది. నటి సమంత కూడా గ్లామర్‌ డోస్‌ పెంచుతోంది. హాట్‌ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది పూజా హెగ్డే సైతం అందాల తెగింపుతో అలరిస్తోంది. బికినీతో ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. పెళ్లి తర్వాత మూవీలకు కాజల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రకూల్‌ నెట్టింట సొగసుల పంట పండిస్తోంది. హోయలతో సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది. తొలి నుంచి అందాల ఆరబోతకు శ్రుతి ముందుంటుంది. సినిమాల్లో తన మార్క్‌ చూపిస్తుంటుంది. తమన్న కూడా స్కిన్‌ షోతో ఆకట్టుకుంటోంది. ఎద అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాప్సీ పన్ను ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ ఆమెకు కలిసిరావట్లేదు. పెళ్లైన తర్వాత కూడా హన్సికా మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తోంది. బికినితో అలరిస్తోంది. విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ బికినీలో కనిపించి షాకిచ్చింది. 
    మే 16 , 2023
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్‌ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్‌ ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే: రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్‌ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం. ఎలా చేశారంటే: ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్‌ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్‌ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్‌ రోల్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు.  హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది.  టెక్నికల్‌గా: ఈ సినిమాను డైరెక్టర్‌ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్‌ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్‌ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్‌ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్‌ కార్తిక్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్‌, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌ బాగుంది. ముఖ్యంగా  బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్‌ పాయింట్స్‌  సినిమా ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్‌ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్‌ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్‌. రేటింగ్‌: 2.75/5
    ఏప్రిల్ 07 , 2023
    <strong>NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?</strong>
    NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?
    ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా గప్‌చుప్‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అందరినీ షాక్‌కి గురిచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వాటిని ట్రెండింగ్‌ చేస్తున్నారు.&nbsp; కుటుంబ సభ్యుల సమక్షంలో.. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. నేడు (ఆగస్టు 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.&nbsp; https://twitter.com/reddy_tarock/status/1821778632026751223 https://twitter.com/AllHailNTR/status/1821765706507284736 https://twitter.com/Sudha_NTR/status/1821785928798454169 విభిన్నమైన కథాంశంతో.. ప్రశాంత్‌ నీల్ సినిమా అనగానే భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే హీరోయిజం గుర్తుకువస్తాయి. కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల్లో యష్‌, ప్రభాస్‌లను చూపించినట్లుగానే తారక్‌ను కూడా చాలా పవర్‌ఫుల్‌గా ప్రశాంత్ నీల్‌ చూపిస్తారని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్‌ నీల్‌ ‘NTR 31’ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దీన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని పేర్కొన్నారు. దీంతో తారక్‌ను కేజీఎఫ్‌, సలార్‌కు మంచి సరికొత్తగా నీల్‌ మామా చూపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; డ్యూయల్‌ రోల్‌లో తారక్‌? తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్‌ చేసింది. ఆ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; భారీ బడ్టెట్‌.. తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp;
    ఆగస్టు 09 , 2024
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, యోగి బాబు, మురళిశర్మ, హరీష్‌ పెరడి, మోహన్‌ రమన్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు కథ, దర్శకత్వం: హరి సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్‌ ఎడిటింగ్‌ : టీ.ఎస్‌. జై నిర్మాత : కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌ విడుదల తేదీ: 26 ఏప్రిల్‌, 2024 యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి ‘భరణి’, ‘పూజా’ ఘన విజయాలను సాధించాయి. దీంతో మూడోసారి ఈ హిట్‌ కాంబో రిపీట్‌ కావడంతో ‘రత్నం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశాల్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? రత్నం సినిమా అంచనాలు అందుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి? రత్నం (విశాల్‌).. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో జీవిస్తుంటాడు. జననీ (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో విశాల్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా భవానీ శంకర్‌ మెప్పించింది. విశాల్‌తో వచ్చే ఏమోషనల్‌ సీన్స్‌లో ఈ అమ్మడు పోటీపడి మరి నటించింది. కామెడియన్ యోగిబాబు మరోమారు తన మార్క్‌ కామెడీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని, మురళి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ హరి.. ఎప్పటిలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేశారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య వచ్చే ఏమోషన్ సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ కంటే సినిమాటిక్‌ టోన్‌ ఎక్కువగా ఉంది. యోగిబాబు కామెడీ సీన్లు తమిళ నేటివిటితో ఉండటం.. తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. ఇక డైరెక్టర్‌ హరి గత చిత్రాలతో పోలిస్తే స్క్రీన్‌ప్లే కూడా చాలా పూర్‌గా ఉంది. అయితే విశాల్‌ అభిమానులు, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చాలా ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండటం మూవీకి ప్లస్‌. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఎమోషనల్‌, యాక్షన్‌ సీక్వెన్‌లో దేవి ఇచ్చిన BGM.. ఆ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అటు ఎం. సుకుమార్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. టీ.ఎస్‌ జై ఎడిటింగ్‌ వర్క్స్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశాల్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కంటెంట్‌ లేకపోవడంఆసక్తి పెంచని స్క్రీన్‌ ప్లే Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    ఏప్రిల్ 26 , 2024
    RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
    RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్‌ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..! 'RC 17' చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్‌ యాక్షన్‌ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ‘ఓపెనింగ్‌ సీన్‌ అద్భుతం’ మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.&nbsp; ఈ ఏడాది చివర్లో ప్రారంభం! ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్‌ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్‌లోకి రామ్‌చరణ్‌ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.&nbsp; రేపు అదిరిపోయే ట్రీట్‌! రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp;
    మార్చి 26 , 2024
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ.&nbsp;
    మార్చి 25 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    Double iSmart Movie: రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో అదిరే ట్విస్ట్‌.. పూరి మార్క్ ఫ్లాష్‌ బ్యాక్‌!
    Double iSmart Movie: రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీలో అదిరే ట్విస్ట్‌.. పూరి మార్క్ ఫ్లాష్‌ బ్యాక్‌!
    టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ (Ram Pothineni), స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్‌ హిట్‌గా నిలవడంతో పార్ట్‌ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; క్రేజీ ఫ్లాష్‌ బ్యాక్‌..! ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్‌ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్‌ - థ్రిల్లర్‌ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.&nbsp; కసితో ఉన్న పూరి..! డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్టర్‌ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్‌ మూవీ ‘లైగర్‌’ (Liger Movie) బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్‌ కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో పూరి తన ఫోకస్‌ మెుత్తం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’పై పెట్టారట. దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; పాన్‌ ఇండియా స్థాయిలో.. ఆ కారణంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)లో రిలీజ్‌ చేసిన పూరి.. సెకండ్‌ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హీరో రామ్‌కూ కీలకమే! ఇక హీరో రామ్‌ కూడా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్‌ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్‌ చేసిన ‘వారియర్‌’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.&nbsp; ఛలో థాయిలాండ్‌! ‘డబుల్‌ ఇస్మార్ట్’ ఫస్ట్‌ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబయిలో పూర్తి చేసిన డైరెక్టర్.. తర్వాతి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తారని సమాచారం. ఇందుకోసం త్వరలోనే చిత్ర యూనిట్‌ థాయిలాండ్‌లో వాలిపోతుందని అంటున్నారు.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. బిగ్‌ బుల్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ గతంలో సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆ రోజున రిలీజ్‌ కష్టమే!(Double Smart Release Date) ‘డబుల్‌ ఇస్మార్ట్’ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల (మార్చి) 8న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనుకున్నంత వేగంగా షూటింగ్‌ జరగడం లేదని సమాచారం. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిలీజ్ తేదీ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంటున్నాయి.&nbsp;
    ఫిబ్రవరి 05 , 2024

    @2021 KTree