• TFIDB EN
  • పౌర్ణమి
    UATelugu2h 47m
    పౌర్ణమి శివాలయంలో నాట్యం చేసే ఒక నృత్యకారిణి. ఆమె కుటుంబం తరతరాలుగా నాట్యం చేస్తుంటుంది. అయితే ఆమె హఠాత్తుగా కనిపించకపోవడంతో శివుడి ముందు నాట్యం చేసే వంతు పౌర్ణమి చెల్లెలకు వస్తుంది
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రభాస్
    శివ కేశవ నాయుడు
    త్రిష కృష్ణన్
    పౌర్ణమి
    ఛార్మీ కౌర్
    చంద్రకళ
    రాహుల్ దేవ్
    గ్రామం జమీందార్
    సింధు తోలానీ
    మల్లిక
    ముఖేష్ రిషి
    నరసింహ నాయుడు (కేశవ తండ్రి)
    గీతా కాదంబీ
    కేశవ తల్లి
    మధు శర్మ
    మోహిని
    కోట శ్రీనివాసరావు
    నాగేంద్ర నాయుడు
    చంద్ర మోహన్
    పౌర్ణమి & చంద్రకళ తండ్రి
    మంజు భార్గవి
    పౌర్ణమి సవతి తల్లి
    సునీల్
    పౌర్ణమి దత్తత సోదరుడు
    తనికెళ్ల భరణి
    కేశవ మామ
    అర్చన శాస్త్రి
    పౌర్ణమి మరియు చంద్రకళ పూర్వీకులు
    హర్ష వర్ధన్
    పౌర్ణమి మరియు చంద్రకళ సవతి మేనమామ
    సుబ్బరాజు
    నాగేంద్ర చిన్న కొడుకు
    బ్రహ్మాజీ
    నాగేంద్ర మధ్య కొడుకు
    శ్రవణ్నాగేంద్ర పెద్ద కొడుకు
    నర్సింగ్ యాదవ్
    మల్లిక సేవకుడు
    మల్లికార్జునరావు
    పూజారి
    ప్రభాస్ శ్రీను
    టీ అమ్మేవాడు
    అజయ్
    చంద్రకళ క్యాట్ కాలర్
    పరుచూరి బ్రదర్స్
    పౌర్ణమి పెంపుడు తండ్రి
    నర్రా వెంకటేశ్వరరావు
    జివి సుధాకర్ నాయుడు
    కేశవపై విషం కక్కిన టీ అమ్మేవాడు
    సిబ్బంది
    ప్రభుదేవా
    దర్శకుడు
    ఎంఎస్ రాజు
    నిర్మాత
    ఎంఎస్ రాజు
    రచయిత
    పరుచూరి బ్రదర్స్
    రచయిత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    కథనాలు
    <strong>HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;</strong>
    HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్‌ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్‌ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం. చదువులో యావరేజ్‌&nbsp; ప్రభాస్‌ చదువు పరంగా యావరేజ్‌ స్టూడెంట్‌. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్‌ పిరియడ్‌ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు. మతిమరుపు ఎక్కువ ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచి తన ఫ్రెండ్స్‌ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.&nbsp; ‘నువ్వు హీరో ఏంట్రా’ కెరీర్‌ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్‌ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్‌ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్‌ తీసుకున్నాక 'ఈశ్వర్‌' ఆఫర్‌ వచ్చింది.&nbsp; డార్లింగ్‌ పిలుపుకు కారణం ఇదే ప్రభాస్‌ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్‌ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్‌ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్‌ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్‌ సినిమా కూడా రావడం గమనార్హం. అతిథి పాత్రలు రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హిందీలో వచ్చిన 'యాక్షన్‌ జాక్సన్‌' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం గమనార్హం.&nbsp; పెదనాన్నతో రెండు చిత్రాలు దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్‌’ వంటి చిత్రాల్లో ప్రభాస్‌ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు. ముచ్చటగా మూడుసార్లు ప్రభాస్‌ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్‌ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.&nbsp; తొలి దక్షిణాది హీరో ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్‌ గుర్తింపు పొందాడు. ప్రభాస్‌ తర్వాత టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రీసెంట్‌గా రామ్‌చరణ్‌ ఈ ఘనత సాధించారు.&nbsp; నటుడు కాకుంటే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో వర్క్‌ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్‌ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్‌ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
    ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.&nbsp; ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.&nbsp; గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.&nbsp; అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.&nbsp; ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    &nbsp;SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp;&nbsp; గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?&nbsp; ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: శ్రీకాంత్‌ ఓదెల(srikanth odela) టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్‌ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్‌ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు.&nbsp; శ్రీకాంత్‌ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్‌ చెప్పారంటే ఈ డైరెక్టర్‌ టాలెంట్‌ అర్థమవుతోంది. https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20 బుచ్చిబాబు(Buchi Babu Sana) సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్‌ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్‌ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తారని స్వయంగా చరణ్‌ చెప్పే స్థాయికి ఎదిగాడు.&nbsp; పల్నాటి సూర్యప్రతాప్‌(Palnati surya pratap) సుకుమార్‌ డైరెక్షన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్‌ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ జంటగా ‘18 పేజెస్‌’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. కాగా, సుకుమార్‌ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశాడు.&nbsp; రాజమౌళి ఆసిస్టెంట్&nbsp; డైరెక్టర్లు: (Rajamouli assistant directors) G.R కృష్ణ( GR KRISHNA ) టాలీవుడ్ డైరెక్టర్‌ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. కరుణ కుమార్‌ ( KARUNA KUMAR) మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌ కరుణ కుమార్‌ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్‌, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.&nbsp; అశ్విన్‌ గంగరాజు (ASHWIN GANGA RAJU) డైరెక్టర్‌ అశ్విన్‌ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..! రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.&nbsp; జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.&nbsp; ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది.&nbsp; రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp;
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Bollywood Vs South Industries: బాలీవుడ్‌ - సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?</strong>
    Bollywood Vs South Industries: బాలీవుడ్‌ - సౌత్‌ ఇండస్ట్రీల మధ్య కోల్డ్‌వార్‌ మెుదలైందా?
    బాలీవుడ్‌ వర్సెస్‌ సౌతిండియాగా ప్రస్తుత పరిస్థితులు పరిణమిస్తున్నాయి. సౌతిండియా చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుండటాన్ని కొందరు బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయి అవార్డులు ఎక్కువగా హిందీ చిత్రాలకే వచ్చేవి. కలెక్షన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత నుంచి సౌత్ సినిమాల హవా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద గణనీయంగా పెరిగింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకట్రెండు మినహా సంచలనం సృష్టించిన సినిమాలు రిలీజ్‌ కాలేదు. దీంతో బాలీవుడ్‌ నటుల్లో సౌత్‌ సినిమాలపై అసహనం, అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అర్షిద్ వర్సి హీరో ప్రభాస్‌ పలుష పదజాలాన్ని ఉపయోగించడం వివాదస్పదమైంది. తాజాగా సౌతిండియన్‌ స్టార్‌ బాలీవుడ్‌ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్‌ - సౌత్ ఇండస్ట్రీల మధ్య కోల్డ్ వార్‌ మెుదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.&nbsp; ‘బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేస్తోంది’ కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి బాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని రిషబ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో కొందరు నెటిజన్లు రిషబ్‌ను సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1826135635754631603 ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటుడు అక్కసు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడారు. 'కల్కి 2898 ఏడీ' చిత్రం గురించి ప్రస్తావిస్తూ హీరో ప్రభాస్‌పై తనకున్న ఈర్ష్యను వెళ్లగక్కారు. ‘క‌ల్కి’ తాను చూశానని మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అర్షద్‌ చెప్పారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్‌ పాత్ర తేలిపోయిందన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్‌.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఎందుకో ఆయన లుక్‌ జోకర్‌లా ఉంది. మ్యాడ్‌ మ్యాక్స్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్‌ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’ అని అన్నారు. అర్షద్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/i/status/1825097374680621099 తెలుగు హీరోల స్ట్రాంగ్‌ కౌంటర్‌ ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు.&nbsp; అటు యువ నటుడు ఆది సాయికుమార్‌ సైతం అర్షద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.&nbsp; అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1825746561495871657 https://twitter.com/iamaadisaikumar/status/1825250706938380360 బాలీవుడ్‌కు ఏమైంది? : అల్లు అర్జున్‌ గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంటున్నాయి.&nbsp; ఈ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నిఖిల్‌ అడ్వాణీ ఇటీవల స్పందించారు. బాలీవుడ్‌ సినిమాపై అల్లు అర్జున్‌ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. ‘గతంలో అల్లు అర్జున్‌తో నేనొక సినిమా చేయాలనుకున్నా. అందుకోసం ఆయన్ని కలిశా. బాలీవుడ్‌ పరిస్థితిపై ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ‘బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరెందుకు మర్చిపోయారు?’ అని అడిగారు. ఆయన చెప్పింది నిజమే దక్షిణాది చిత్రాల్లో హీరోయిజం, అందులోని కీలక భావోద్వేగాలను చక్కగా చూపిస్తారు. ఆవిధంగా ప్రేక్షకులను కథకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. మంచి విజయాన్ని అందుకున్నాయి. నేడు హిందీ సినిమాల్లో అది లోపించింది’ అని నిఖిల్‌ అన్నారు.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    <strong>Prabhas: </strong><strong>పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!</strong>
    Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
    ప్రభాస్‌ అనగానే ముందుగా అతడి ఫిజిక్‌ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌ ఎదగడంలో అతడి కటౌట్‌ బాగా ఉపయోగపడింది. ప్రభాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాడంటే స్క్రీన్స్‌పై చూసేవాళ్లకు రియల్‌గా అనిపిస్తుంటుంది. యాక్షన్‌ ఒక్కటే కాదు పౌరాణిక పాత్రలకు సైతం అతడి కటౌట్‌ ఇట్టే సరిపోతుంది. ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్‌’లో రాముడిలా, ‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడిగా కనిపించాడు. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా పాత్రలోనూ కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. త్వరలో పరుశురాముడి పాత్రను సైతం అతడు పోషించనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పరుశురాముడిగా ప్రభాస్‌! ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం అనే అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో దర్శకుడు నితీష్‌ తివారి ఉన్నారట. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. కాబట్టి రాముడిగా రణబీర్‌కపూర్‌ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్‌ భావించారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను ఆ పాత్ర కోసం తీసుకోవాలని నితీశ్‌ తివారి భావిస్తున్నారట. ఈ విషయమై ప్రభాస్‌ను కూడా కలిసినట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. పరుశురాముడి పాత్ర చేసేందుకు ప్రభాస్‌ అంగీకరించినట్లు కూడా బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట. అయితే సినిమాలో ప్రభాస్‌ పాత్ర కొద్దిసేపే ఉండనుంది. అయినప్పటికీ కథపై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.&nbsp; విలన్స్‌గా స్టార్‌ కపుల్స్‌ ‘యానిమల్‌’ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘స్పిరిట్‌’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్‌ దశలో ఉంది. అయితే ఇందులో బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) నటించనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరగింది. కాగా, లేటెస్ట్ బజ్ ప్రకారం ‘స్పిరిట్‌’లో కరీనా కపూర్‌ సైతం నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రియల్‌ లైఫ్‌లో కపుల్స్‌ అయిన కరీనా, సైఫ్‌ ‘స్పిరిట్‌’ సినిమాలో విలన్స్‌గా కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని డైలాగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్‌ 10న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.&nbsp; పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్‌ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?
    Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్‌ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?
    నటినటులు: రాఘవ లారెన్స్‌, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్‌ దర్శకత్వం: కదిరేసన్ సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్‌ సంగీతం: G.V. ప్రకాష్‌ ఎడిటర్‌ : ఆంటోని నేపథ్య సంగీతం: శామ్‌ C.S రాఘవ లారెన్స్‌ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్‌ ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి పలు హిట్‌ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్‌ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ అందుకున్నాయి. దీంతో లారెన్స్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రుద్రుడు సినిమా ఇవాళ (ఏప్రిల్‌ 14) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా విజయం సాధించిందా? లారెన్స్‌ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? అసలు సినిమా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కథ: రుద్రుడు (లారెన్స్‌), అనన్య (ప్రియా భవానీ శంకర్‌) భార్య భర్తలు. ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే రుద్రుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఆనందంగా సాగిపోతున్న రుద్రుడు జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన భార్యను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేస్తారు. దీంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. తన భార్యను హతమార్చిన వారిని వదిలిపెట్టకూడదని రుద్రుడు నిర్ణయించుకుంటాడు. వారిని ఎలాగైన పట్టుకొని చంపేయాలని వేట మెుదలెడతాడు. అసలు అనన్యను ఎందుకు చంపారు? దుండుగల వెనక ఎవరు ఉన్నారు? విలన్లపై రుద్రుడు ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అనేది అసలు కథ. ఎవరెలా చేశారంటే: రుద్రుడు పాత్రలో రాఘవ లారెన్స్‌ చాలా బాగా నటించాడు. యాక్షన్‌, సెంటిమెంట్‌ సీన్లలో తనదైన నటనతో లారెన్స్‌ మెప్పిస్తాడు. ఇక డ్యాన్సుల్లో లారెన్స్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా లారెన్స్‌ అద్భుతంగా నటించాడు. యాక్షన్‌ సీన్స్‌లో లారెన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ సినిమాకే హైలెట్ ‌అని చెప్పాలి.&nbsp; అటు ప్రియా భవాని నటన కూడా పర్వేలేదనిపిస్తుంది. ఉన్న కొద్దిసేపైన లారెన్స్‌తో పోటీ పడి మరీ ఆమె నటించింది. ఇక విలన్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి పాత్రకు ప్రాణం పోశాడు. ‌ టెక్నికల్‌గా డైరెక్టర్‌ కదిరేసన్‌ ఒక రొటిన్‌ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడు. నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ సినిమాను ఎప్పుడో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో, హీరోయిన్ లవ్‌ సీన్స్‌, పెళ్లి చేసుకోవడం అంతా బాగుందనుకునే లోపే ప్రియా భవానీ హత్య జరగడం పెద్ద సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, ఆ తర్వాత హీరో రీవెంజ్‌ తీర్చుకునే సన్నివేశాలన్నీ పేలవంగా ‌అనిపిస్తాయి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది. G.V ప్రకాష్‌ సంగీతం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒకటిమాత్రమే వినసొంపుగా ఉంది. అయితే శామ్‌ C.S ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ లారెన్స్‌ నటననేపథ్య సంగీతంపతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసంగీతం రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 15 , 2023
    <strong>Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!</strong>
    Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సినిమా కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా.. హాట్‌ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్‌లో టికెట్ ధరలు భారీగా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జోరుగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టికెట్ల అమ్మకాల్లో కొన్ని థియేటర్లు అనుసరిస్తున్న వైఖరి వివాదస్పదమవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.&nbsp; ఫ్యాన్స్ అసంతృప్తి ఎందుకంటే? కల్కి సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని థియేటర్లు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్స్‌ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా.. బుక్‌ చేసుకునేందుకు వీలుపడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘బుక్‌మై షో’.. థియేటర్లలో టికెట్స్ ఉన్నట్లు గ్రీన్‌ కలర్‌లో షోవారిగా టికెట్స్‌ను చూపిస్తున్నాయి. అయితే వాటిని క్లిక్‌ చేస్తే అభిమానులకు ‘Sorry! Something is not right’ సందేశం వస్తోంది.దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతోనే థియేటర్‌ యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ అభిమాన హీరో అయినందువల్ల బుకింగ్స్‌ కోసం ట్రై చేస్తున్నట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ.. థియేటర్ యాజమన్యాల కక్కుర్తి చర్యలు.. అసహనానికి గురిచేస్తున్నాయని మండిపోతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో థియేటర్లకు రావాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; రూ.1000 కోట్ల క్లబ్‌లో.. ఇదిలా ఉంటే.. కల్కి సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా ఏదైనా స్టార్‌ హీరో సినిమా అంటే టైర్‌-1 సిటీస్‌లో ఎక్కువగా అడ్వాన్స్‌ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ, కల్కికి మాత్రం టైర్‌-2 సిటీస్‌లోనూ జోరుగా టికెట్స్‌ బుక్‌ అవుతున్నాయి. నగరవాసులు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రేక్షకులు సైతం కల్కి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ‘కల్కి’ ఈజీగానే రూ.1000 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు.&nbsp; ఫస్ట్‌డే టార్గెట్‌ ఎంతంటే? గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సలార్’ కూడా తొలిరోజు రూ.200 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ డే టార్గెట్ రూ.200 కోట్లు పైనే అని తెలుస్తోంది. రాజమౌళి బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ సోలోగా రూ.200 కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభాస్‌ ఈ ఫీట్‌ సాధిస్తే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలవడం ఖాయమని చెప్పవచ్చు.&nbsp; టికెట్ రెట్లు పెంపు కల్కి టికెట్‌ ధరలు పెంపునకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్స్‌ పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్‌ 27 నుంచి జులై 4 వరకూ సింగిల్ స్క్రీన్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకూ పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లకి రూ.75, మల్టీప్లెక్స్‌లకి రూ.125 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్‌ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సగటున ఒక్కో టికెట్‌కు రూ.500 (ట్యాక్స్‌లతో కలిపి) వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే సింగిల్‌ స్క్రీన్స్‌లో అయితే రూ.200-300 వరకూ పెట్టాల్సిందే. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఒక్కో టికెట్‌ రూ.3 వేలు..! కల్కి సినిమా ప్రభావం నార్త్‌లోనూ గణనీయంగా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ చిత్రాన్ని చూసేందుకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నాయి. దీన్ని గమనించిన థియేటర్‌ వర్గాలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో కల్కి అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్‌.. భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లో అయితే ఏకంగా రూ. 3000 రూపాయలకు విక్రయిస్తున్నారట. ఢిల్లీ మల్టీప్లెక్స్‌లో రూ.1300 నుంచి రూ.2000 వరకు టికెట్ రేట్లు ఉన్నట్లు సమాచారం. అటు బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధర రూ.1100-1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్‌లో బెనిఫిట్ షోకి రూ.3000 వరకూ టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నారని టాక్.&nbsp; అక్కడ కల్కి రికార్డ్‌ షోస్.. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభం అయిన అపర్ణ మల్టీప్లెక్స్‌లో తొలిరోజున కల్కి కోసం ఏకంగా 47 షోలు ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా అన్ని షోలకు సంబంధించిన టికెట్స్‌ సైతం ఇప్పటికే అమ్ముడి పోయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్‌&nbsp; పోస్టర్‌ను సైతం వారు రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/gopaladusumalli/status/1805502440420303323
    జూన్ 25 , 2024
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?
    నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ దర్శకత్వం: గుణశేఖర్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌ నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్‌ ఇవాళ (ఏప్రిల్‌ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్‌ డైరెక్టర్‌ కావడం, దిల్‌ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్‌ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం. కథ: విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్‌ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి&nbsp; ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే: శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మైనస్‌ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్‌ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్‌ మోహన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్‌, అనన్య, మధుబాల, జిషు సేన్‌ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.&nbsp; టెక్నికల్‌గా: శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్‌ గుణశేఖర్‌ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్‌ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ సమంత నటనమణిశర్మ సంగీతం&nbsp;విరామ, పతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 15 , 2023
    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది&nbsp; అందాల తారలు
    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది&nbsp; అందాల తారలు
    సాధారణంగా హీరోయిన్స్‌ అంటే గ్లామర్‌ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో&nbsp; కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్‌ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం. సమంత: సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్‌ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్‌ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్‌ 14న శాంకుతులం రిలీజ్‌ కానుండగా ఫ్యాన్స్‌ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి.&nbsp; కృతి సనన్‌:&nbsp; ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఆదిపురుష్‌’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్‌’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్‌ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్‌ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు.&nbsp; అలియా భట్‌: బాలీవుడ్‌ బ్యూటీ అలియభట్‌ వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్‌ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్‌’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న టక్త్‌ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది.&nbsp; త్రిష: నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్‌లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ పార్ట్‌ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు. ఐశ్వర్యరాయ్‌: బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్‌ గ్లామర్‌ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్‌ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్‌తో ‘జోదా అక్భర్‌’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా నటించారు.&nbsp; అనుష్క: టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్‌ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.&nbsp; కంగనా రనౌత్‌: బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్‌ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు.&nbsp; కాజల్‌: టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్‌ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం కాజల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో కాజల్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్‌ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్‌తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. రిచా పనాయ్: అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్‌’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్‌ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు. ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. రీమా సేన్: 2010లో టాలీవుడ్‌లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్‌ను రీమాసేన్‌ సంపాదించారు. అనితా పాండియన్‌ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్‌ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.
    మార్చి 29 , 2023
    <strong>EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; [toc] ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.&nbsp; శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.&nbsp;&nbsp; రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.&nbsp; బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.&nbsp; లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌&nbsp; రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.&nbsp; సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్‌ మూవీగా మరో రికార్డు!</strong>
    Devara Record: విదేశాల్లో చరిత్ర సృష్టించిన ‘దేవర’.. ఫస్ట్ ఇండియన్‌ మూవీగా మరో రికార్డు!
    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరో రెండ్రోజుల్లో సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటించింది. బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్ర పోషించారు. దీనికి తోడు తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే దేవర పలు రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తాజాగా తన పేరిట మరో రికార్డును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమాగా నిలిచింది.&nbsp; ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.&nbsp; బాహుబలి స్థాయిలో క్లైమాక్స్‌ ‘దేవర’ సినిమాలో చివరి 40 నిమిషాలు హైలైట్‌ అని ఎన్టీఆర్‌ (NTR) ఇటీవల స్వయంగా చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్‌ దేవర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు మాట్లాడుతూ దేవర క్లైమాక్స్‌ బాహుబలిని పోలి ఉంటుందని తెలిపారు.&nbsp; ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ మూవీపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌పైనా రత్నవేలు స్పందించారు. ఇందులో తారక్‌ మూడు పాత్రలు పోషించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.&nbsp; ఫ్యాన్స్‌కు నాగవంశీ రిక్వెస్ట్‌ దేవర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ అభిమానులకు ఎక్స్‌ వేదికగా ఓ రిక్వెస్ట్‌ చేశారు. ఈ సినిమాతోనైనా ఫ్యాన్‌ వార్‌కు ముంగింపు పలకాలని కోరారు. అలాగే ఫస్ట్‌ స్క్రీనింగ్‌లో సినిమా చూసే వారు సినిమాకు సంబంధించిన సీన్లను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టవద్దని కోరారు. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్‌ చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తారక్‌ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దామని పిలుపునిచ్చారు. పోస్ట్ చివర్లో 'దేవర సెప్పిండు అంటే సేసినట్టే' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ విజ్ఞప్తిని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1838795481406726608 రన్‌టైమ్‌లో మార్పులు ‘దేవర’ (Devara) సినిమా నిడివిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్‌ బోర్డు ఫైనల్‌ చేసిన నిడివిలో దాదాపు 7 నిమిషాలు ట్రిమ్‌ చేసినట్లు సమాచారం. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్‌టైమ్‌తో (Devara Movie RunTime) ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలాంటివి మినహాయిస్తే ఈ మూవీ లెంగ్త్‌ 2:42 గంటలుగా ఉండనుంది. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి ఇంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది. ప్రాధాన్యం లేని సన్నివేశాలను తీసివేసినట్లు తెలుస్తోంది.&nbsp; టికెట్ల రేటు పెంపు తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.&nbsp; మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp;
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?</strong>
    Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?
    హైదరాబాద్‌లో ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అకస్మాత్తుగా రద్దైన సంగతి తెలిసిందే. నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో గందరగోళం ఏర్పడి ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అటు తారక్‌ సైతం స్పెషల్‌ వీడియోను షేర్ చేసి మరి బాధపడ్డారు. అయితే కావాలనే దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్‌ ప్రకారమే ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లాజికల్‌గా కొన్ని ప్రశ్నలు సైతం సంధిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈ ప్రశ్నలకు ఆన్సర్‌ ఎక్కడ! 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి పని చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్‌, విలన్‌గా చేసిన సైఫ్‌ అలీఖాన్‌ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క ఎయిర్‌పోర్ట్‌ విజువల్ కూడా బయటకి రాలేదు. అంతేకాదు దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందే సైఫ్ అలీఖాన్‌ తన ఫ్యామిలితో ముంబయి వీధుల్లో కనిపించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌ రద్దు అనంతరం జాన్వీ పోస్టు చేసిన వీడియో కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. సదరు వీడియోలో తెలుగులో మాట్లాడిన జాన్వీ ఎక్కడా ఈవెంట్‌ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ముందుగానే ఈ వీడియోను సిద్ధం చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.&nbsp; https://twitter.com/SaiTweetzz/status/1838199126569447796 తారక్‌ పైనా అనుమానాలు! దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో తారక్‌ చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ను కలుసుకునే అవకాశం చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసుకున్న అదే రోజు రాత్రి 11 గంటలకు తారక్‌ అమెరికాకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈవెంట్‌ జరిగినా అది రాత్రి 9:30 వరకు ఉండేదని నెటిజన్లు అంటున్నారు. అంటే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను దాటుకొని గంటన్నర వ్యవధిలో తారక్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాలిపోవడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని అభిప్రాయపడుతున్నారు. ఈవెంట్‌ జరగదని ముందే తెలిసే తారక్‌ యూఎస్‌కు ఫ్లైట్ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాడని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్‌ టికెట్‌ను ఒక్కొటి రూ.1000-3000 మధ్య విక్రయించారని, వాటిని రిఫండ్‌ చేసిన దాఖలాలు కూడా లేవని పేర్కొంటున్నారు. టికెట్ల విషయంలోనూ పెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు.  టికెట్ల రేటు పెంపు తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.&nbsp; మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>Pushpa 2 vs NBK 109: అల్లు అర్జున్‌తో బాలకృష్ణ ‘ఢీ’.. బాక్సాఫీస్‌ వద్ద మరో బిగ్‌ ఫైట్‌ షురూ!</strong>
    Pushpa 2 vs NBK 109: అల్లు అర్జున్‌తో బాలకృష్ణ ‘ఢీ’.. బాక్సాఫీస్‌ వద్ద మరో బిగ్‌ ఫైట్‌ షురూ!
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). ప్రస్తుతం స్పీడ్‌గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అల్లు ఆర్మీ ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ బరిలో ఇప్పటివరకూ ఏ సినిమా లేకపోడవంతో ఇక బాక్సాఫీస్‌ వద్ద ‘పుష్ప 2’కి తిరుగుండదని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే బన్నీ చిత్రానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపంలో గట్టి పోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య - బన్నీ ఒకరికొకరు తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; పుష్ప 2 వర్సెస్‌ NBK 109..! నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'NBK 109' వర్కింగ్‌ టైటిల్‌తో చాలా స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ మూవీని సంక్రాతి కానుకగా బరిలోకి దింపాలని తొలుత మేకర్స్‌ భావించారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం నెల రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 2న 'NBK 109'ను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్‌ వద్ద అల్లు అర్జున్‌ వర్సెస్‌ నందమూరి బాలయ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.&nbsp; అఖండ సెంటిమెంట్‌! డిసెంబర్‌ మెుదటి వీక్‌లోనే బాలయ్య తన చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ఓ సెంటిమెంట్‌ కూడా దోహదం చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda Movie) చిత్రం సరిగ్గా మూడేళ్ల క్రితం డిసెంబర్‌ 2న విడుదలైంది. ఆ చిత్రం ఏ స్థాయి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘NBK 109’ని కూడా అదే రోజు రిలీజ్‌ చేస్తే ఆ మూవీ సైతం సక్సెస్‌ సాధిస్తుందని మేకర్స్‌ బలంగా నమ్ముతున్నారట. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నిలిచింది. జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. దీంతో పాటు వెంకటేష్‌ - అనిల్‌ రావిపూడి చిత్రం, అజిత్‌ 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ', 'శతమానం భవతి 2' మూవీస్‌ సైతం సంక్రాంతి పోటీలో ఉన్నాయి. దీంతో జనవరి నుంచి ‘NBK 109’ వెనక్కి తగ్గాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; బాలకృష్ణ.. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్&nbsp; నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులను&nbsp; టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, రామ్‌చరణ్‌, పవన్‌ కల్యాణ్‌ తదితరులను వేడుకలకు ఆహ్వానించారు. అలాగే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌లను కూడా ఆహ్వానాలు అందాయి.&nbsp; బాలయ్య.. అన్‌స్టాపబుల్‌ నందమూరి బాలకృష్ణ గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం 109 సినిమాల్లో ఆయన నటించారు. అయితే బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌తో బాలయ్య నటించారు. ఇక ఆయన నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. సోషల్‌, పౌరాణిక, జానపద, బయోపిక్స్‌, సైన్స్ ఫిక్షన్‌, పీరియాడిక్ డ్రామాలు, యాక్షన్‌ ఇలా అన్ని జానర్స్‌లో బాలకృష్ణ సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా బాలయ్య సొంతం. 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు.&nbsp;
    ఆగస్టు 29 , 2024
    <strong>New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!</strong>
    New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!
    గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్న సినీ అభిమానులకు ఈ వారం గ్రాండ్ ట్రీట్‌ లభించబోతోంది. ఎప్పుడెప్పుడా అని యావత్‌ దేశం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. అయితే కల్కికి పోటీగా ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకపోవడం గమనార్హం. కాబట్టి ఈ వారం థియేటర్లో ప్రభాస్‌ ఒక్కరే సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు కల్కి 2898 ఏడీ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 27న (Kalki 2898 AD Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా అలరించనుంది. కాశీ, కాంప్లెక్స్‌, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పౌరాణిక పాత్రలను జత చేసి నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) హీరోయిన్‌గా చేసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించేందుకు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha).. ఈ సినిమాను జూన్‌ 27 నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.  మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWorst Roommates Ever 2SeriesEnglishNetflixJune 26SupacellSeriesEnglishNetflixJune 27That Nineties 2&nbsp;SeriesEnglishNetflixJune 27A Family AffairMovieEnglishNetflixJune 28Owning Maan HattenSeriesEnglishNetflixJune 28Civil WarMovieTelugu DubAmazon&nbsp;June 28Sharma Ji Ki BetiMovieHindiAmazon&nbsp;June 28Rautu Ka Raaz&nbsp;MovieHindiZee 5June 28The BearSeriesEnglishHotstarJune 27Land Of WomenMovieEnglishApple TV PlusJune 27Fancy Dance&nbsp;MovieEnglishApple TV PlusJune 28
    జూన్ 24 , 2024
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
    సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.&nbsp; మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.&nbsp; ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.&nbsp;
    మే 08 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’&nbsp; పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన&nbsp; జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన&nbsp; శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.&nbsp; బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&amp;v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.&nbsp; https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.&nbsp; Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.&nbsp; అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.&nbsp; విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.&nbsp; జ్యోతిక- సూర్య&nbsp; సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).&nbsp; అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.&nbsp; నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023

    @2021 KTree