UATelugu
చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. NCC ఛానల్ సీఈవోగా ఉంటూ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎంపై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Prathinidhi 2 Review: జర్నలిస్టుగా ఆకట్టుకున్న నారా రోహిత్.. ‘ప్రతినిధి 2’తో సక్సెస్ కొట్టినట్లేనా?
నారా రోహిత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2 Review). గతంలో విడుదలై ప్రతినిధి చిత్రానికి కొనసాగింపుగ...read more
How was the movie?
తారాగణం
నారా రోహిత్
శ్రీలీల
సప్తగిరి
తనికెళ్ల భరణి
అజయ్ ఘోష్
పృధ్వీ రాజ్
సిబ్బంది
మూర్తి దేవగుప్తపుదర్శకుడు
కుమార్ రజా బత్తులనిర్మాత
ఆంజనేయులు శ్రీ తోటనిర్మాత
స్వర సాగర్ మహతిసంగీతకారుడు
కథనాలు
Prathinidhi 2 Review: జర్నలిస్టుగా ఆకట్టుకున్న నారా రోహిత్.. ‘ప్రతినిధి 2’తో సక్సెస్ కొట్టినట్లేనా?
నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
విడుదల తేదీ: 10-05-2024
నారా రోహిత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2 Review). గతంలో విడుదలై ప్రతినిధి చిత్రానికి కొనసాగింపుగా ఇది రూపొందింది. ప్రముఖ పాత్రికేయుడు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. ఏపీ ఎన్నికల సమయంలో ఈ పొలిటికల్ డ్రామా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. మే 10న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. ఫ్రీలాన్స్ రిపోర్టర్‌గా పని చేస్తూ నిజాలను ఎలాంటి భయం లేకుండా వెలుగులోకి తీసుకొస్తుంటాడు. దీంతో అతడ్ని NCC ఛానల్ ఏరికోరి సీఈవోగా నియమిస్తుంది. అప్పటి నుంచి చేతన్ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎం ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జర్నలిస్టు చేతన్ పాత్రలో నారా రోహిత్ (Prathinidhi 2 review In Telugu) అదరగొట్టాడు. భావోద్వేగాలు చక్కగా కనబరిచాడు. పోరాట సన్నివేశాలపైనా ప్రభావం చూపాడు. ఫస్టాఫ్‌లో అతడి నటన హైలెట్‌గా ఉంటుంది. హీరోయిన్ సిరి లెల్లా పాత్ర పరిమితమే. సెకండాఫ్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సీఎంగా సచిన్ ఖేడ్కర్ తనదైన ముద్ర వేశారు. అటు దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా. అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయభాను పాత్రలు మెప్పిస్తున్నాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మూర్తి (Prathinidhi 2 review In Telugu).. కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా మూవీని తెరకెక్కించారు. జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు. ఆరంభ సీన్స్‌లో హీరో నైజాన్ని, జర్నలిజం గొప్పతనాన్ని దర్శకుడు తెలియజేశాడు. తొలి సగభాగంలో కలం చేత పట్టిన హీరో.. ద్వితీయార్ధంలో కత్తి పడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఓటు విలువను చాటి చెబుతూ దర్శకుడు తీర్చిదిద్దిన సన్నివేశాలు మెప్పిస్తాయి. ముఖ్యంగా పొలిటికల్ యాంగిల్‌లో వచ్చే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. అయితే రాజకీయ కోణంలో తీసిన కొన్ని సీన్లు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే హీరో కుటుంబ నేపథ్యం చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. సీబీఐను దర్శకుడు సాదాసీదాగా చూపించడం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి బలం. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టాల్సింది. ముఖ్యంగా సెకాండాఫ్‌లో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకథలో ట్విస్టులుపొలిటికల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్‌లాజిక్స్‌కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 10 , 2024
This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
కృష్ణమ్మ
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ప్రతినిధి 2
నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
జితేందర్ రెడ్డి
ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్ వర్రే కథానాయకుడిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆరంభం
మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
హాలీవుడ్‌లో ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
గీతాంజలి మళ్లీ వచ్చింది
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.
ఆవేశం
పుష్ప ఫేమ్ విలన్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBodkin SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
మే 06 , 2024
This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో నారా రోహిత్ నిజాయతీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు.
రత్నం
విశాల్ (Vishal) హీరోగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రం ‘రత్నం’ (Rathnam movie). ప్రియా భవానీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
రుస్లాన్
ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా జంటగా కరణ్.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘రుస్లాన్’ (Ruslaan). జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
టిల్లు స్క్వేర్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ ప్రసారం కానుంది.
భీమా
మ్యాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘భీమా’ (Bhimaa). మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా, ఈ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateFight for paradiseSeriesEnglishNetflixApril 23BrigantiSeriesEnglishNetflixApril 23Deliver meMovieEnglishNetflixApril 24City HunterMovieJapanese/EnglishNetflixApril 25Dead Boy DetectivesSeriesEnglishNetflixApril 25Tillu SquareMovieTeluguNetflixApril 26GoodBye EarthSeriesEnglish/KoreanNetflixApril 26Dil Dosti DilemmaMovieHindiAmazon PrimeApril 25BhimaaMovieTeluguDisney + HotstarApril 25CrackMovieHindiDisney + HotstarApril 26The ZenecksMovieEnglishJio CinemaApril 22We Are Hear S4SeriesEnglishJio CinemaApril 27Kung Fu Panda 4MovieEnglishBook My ShowApril 26
ఏప్రిల్ 22 , 2024
Tollywood Couples: నారా రోహిత్ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
రీల్ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహా, మహేశ్ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్ హీరో నారా రోహిత్ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
నారా రోహిత్ - సిరి లేళ్ల
ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.
నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్ చేసుకొని స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.
కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్’, ‘ఎఫ్3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్ హీరోగా చేసిన ‘వారియర్’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.
వరుణ్ సందేశ్ - వితిక షేరు
యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్’తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
అక్టోబర్ 17 , 2024
Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024
Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. సెట్స్‌పై సీక్వెల్ సినిమాలు.. లిస్ట్ చాలా పెద్దదే!
ఓ సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్ హిట్ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
పుష్ప 2
అల్లుఅర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ - 2
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి.
డబల్ ఇస్మార్ట్
రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్ డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్ ఇస్మార్ట్’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
గూఢచారి 2
యంగ్ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్, ప్రీ లుక్ టీజర్ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్ పార్ట్ తిరగనుందని సమాచారం.
హిట్ 3
తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ చిత్రం హిట్ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. హిట్-2 (HIT 2)లో అడవిశేష్ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్ పార్ట్ ఎండింగ్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను హింట్ ఇచ్చేశారు. ఇందులో అర్జున్ అనే పోలీసు ఆఫీసర్ పాత్రను నాని పోషించనున్నాడు.
ప్రతినిధి-2
యంగ్ హీరో నారా రోహిత్ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
టిల్లు స్క్వేర్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్ 15న టిల్లు స్క్వేర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
బింబిసార 2
గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్ రామ్.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రాజెక్ట్ K
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆగస్టు 02 , 2023
Shubra Aiyappa: స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర
శుభ్ర అయ్యప్ప తాజాగా హాటో ఫోటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
కంప్లీట్ క్రాప్ టాప్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. స్లీవ్ లెస్ టాప్‌లో నడుమందాలను చూపిస్తూ కవ్విస్తోంది.
ఈ గ్లామర్ పిక్స్ చూసిన ఆమె అభిమానులు లుకింగ్ హాట్, గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శభ్ర అయ్యప్ప తమిళ్ నటి. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
శుభ్ర అయ్యప్ప 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది.
బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
చిన్నప్పటి నుంచి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన 'రేయ్' సినిమాలో తొలిసారిగా కనిపించింది.
ఆ తర్వాత 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా శుభ్ర అయ్యప్ప(Shubra Aiyappa) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా యాక్ట్ చేసింది.
2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.
అదే ఏడాదిలో వచ్చిన 'వజ్రకాయ' అనే కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది.
ఈ సినిమాలో శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది.
శుభ్ర అయ్యప్ప గతేడాది జనవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త విశాల్ శివప్పతో ఆమె ఏడడుగులు వేసింది.
View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)
అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో….150 ఏళ్ల ప్రాచీన గృహంలో గురువారం వీరి వివాహం జరిగింది.
ప్రస్తుతం తమిళ్, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ... కన్నడలో మాత్రం దూసుకెళ్తోంది. అక్కడ తిమ్మయ్య తిమ్మయ్య, రామన అవతార వంటి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
ఏప్రిల్ 01 , 2024
Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్ సక్సెస్ చేసిన డైలాగ్స్ ఇవే..!
ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ అదరగొట్టాడని, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్ గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ సహా కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కల్కి మూవీ డైలాగ్స్
కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు.
కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా?
అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి.
కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు.
అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని.
కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం.
అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా?
కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి.
అశ్వత్థామ : నేనా?
కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి.
డైలాగ్
కాంప్లెక్స్ ఒక యువకుడిపై 5000 యూనిట్స్ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్ గ్యాంగ్ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్ భైరవ (ప్రభాస్)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది.
బుజ్జి : హేయ్.. స్టాప్. నన్ను షూట్ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్ వచ్చి మీ అందరిని స్మాష్ చేస్తాడు.
విలన్ గ్యాంగ్: ఎవరు మీ బాస్?
బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్. ఇంత వరకూ ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్ అండ్ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు)
భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు..
బుజ్జి : భైరవ గెటప్.. చాలా బిల్డప్ ఇచ్చాను లే.
భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్ 5 మినిట్స్ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఫైట్ ఉంటుంది)
డైలాగ్
సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.
సుప్రీమ్ యాస్కిన్: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్?
సైంటిస్టు : మంచి కోసం..
సుప్రీమ్ యాస్కిన్ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి?
సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి
సుప్రీమ్ యాస్కిన్ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా?
సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు?
సుప్రీమ్ యాస్కిన్ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది.
డైలాగ్
కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్ యస్కిన్ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్, డైలాగ్స్ హైలెట్‌గా నిలుస్తాయి.
రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు?
అశ్వత్థామ : నేను కాపాడతాను
రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా?
అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్ బీజీఎం వస్తుంది)
రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్.. ల్యాబ్ నుంచి ఎస్కేప్ అయిన మామూలు ప్రెగ్నెంట్ ఉమెన్. ఏమీ స్పెషల్ ఉమెన్ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం.
*ఆ డైలాగ్ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
డైలాగ్
మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్ మిస్మరైజింగ్ చేస్తాయి.
అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్ అమ్మా?
సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి?
అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా.
సుమతి : కానీ, నేనే ఎందుకు?
అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు.
అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత.
డైలాగ్
శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది.
భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు.
ఛటర్జీ : ముసలోడా?
భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్ చేయలేదు. నేను తప్పా.
ఛటర్జీ : వీడెవడు అసలు?
కమాండర్: భైరవ అని బౌంటీ ఎంటర్ సర్. మన వాళ్లని కొడితే బ్లాక్ లిస్ట్ చేశాను.
భైరవ: ఎలాగైనా బ్లాక్ లిస్ట్ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్ లేదు.
ఛటర్జీ : అంత ష్యూర్ ఆ..
భైరవ : రికార్డ్స్ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను.
డైలాగ్
కల్కి క్లైమాక్స్‌లో.. కమల్ హాసన్ మీద వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే 'జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను'.. అనే డైలాగ్ సెకండ్ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
View this post on Instagram A post shared by TELUGU SONGS OLD (@telugu_songs_old)
డైలాగ్
కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీనను షేక్ చేస్తాడు. ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి.
అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు.
కర్ణుడు: ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు.
అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు.
అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది.
కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు). నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా.
కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్ ముగుస్తుంది).
జూలై 02 , 2024
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా!
సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది.
నెట్టింట సందీప్ మేనియా
ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్ రెడ్డి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1760151102740464016
https://twitter.com/i/status/1760137348128358646
‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’
సందీప్ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సందీప్ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి.
https://twitter.com/i/status/1758682406754861236
సందీప్ ఫేవరేట్ స్టార్లు వారే!
సందీప్ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కాంపీటిషన్ పెడితే తాను ఫస్ట్ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/i/status/1757377128511778830
ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు
గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.
సందీప్‌పై హీరోయిన్ సెటైర్!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్ పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి ఫ్యాన్స్ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు.
మిగతా అవార్డులు..
ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ (సామ్ బహదూర్), ఉత్తమ గీత రచయితగా జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)గా వరుణ్ జైన్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి.
టీవీ విభాగంలో..
అటు టెలివిజన్ విభాగంలో దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్ సిరీస్ ఆఫ్‌ది ఇయర్‌గా ‘ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్ విభాగంలో క్రిటిక్స్ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్) నిలిచారు.
ఫిబ్రవరి 21 , 2024
#90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి?
నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు.
ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈటీవి విన్ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని ఓసారి విశ్లేషిద్దాం.
చంద్రశేఖర్(శివాజీ): ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.
https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20
రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది.
https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20
ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు. సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20
ప్రశాంత్ &దివ్య:
పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది.
https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20
https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
జనవరి 16 , 2024
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024