• TFIDB EN
  • ప్రేమ కథా చిత్రమ్
    UATelugu2h 10m
    నలుగురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుధీర్ బాబు
    సుధీర్
    నందిత రాజ్
    నందిత
    సప్తగిరి
    గిరి
    ప్రవీణ్
    కడియాల ప్రవీణదెయ్యం
    శేఖర్
    డాన్స్ డైరెక్టర్ (అతి పాత్ర)
    సిబ్బంది
    జె. ప్రభాకర రెడ్డిదర్శకుడు
    మారుతీ దాసరినిర్మాత
    సుదర్శన్ రెడ్డినిర్మాత
    మారుతి
    రచయిత
    జీవన్ బాబుసంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    సుధీర్ బాబు (Sudheer Babu) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సుధీర్ బాబు (Sudheer Babu) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    "SMS" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సుధీర్ బాబు..విలక్షణ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. శ్రీదేవి సోడా సెంటర్, వీ, ప్రేమ కథా చిత్రమ్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. సుధీర్ బాబు అసలు పేరు? పోసాని నాగ సుధీర్ బాబు సుధీర్ బాబు ముద్దు పేరు? సుధీర్ సుధీర్ బాబు ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సుధీర్ బాబు తొలి సినిమా? ఏ మాయ చేసావే చిత్రంలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత SMS చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. సుధీర్ బాబు ఎక్కడ పుట్టాడు? విజయవాడ, ఏపీ సుధీర్ బాబు పుట్టిన తేదీ ఎప్పుడు? మే 11, 1977 సుధీర్ బార్య పేరు? ప్రియదర్శిని సుధీర్ బాబు పెళ్లి ఎప్పుడు జరిగింది? 2006 సుధీర్‌ బాబు ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి సుధీర్ బాబు ఫెవరెట్ హీరో? కృష్ణ, మహేష్ బాబు, హృతిక్ రోషన్ సుధీర్ బాబు తొలి హిట్ సినిమా? ప్రేమ కథా చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్, వి, చిత్రాలు హిట్లుగా నిలిచాయి. సుధీర్ బాబుకు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ బ్లూ సుధీర్‌బాబు ఇష్టమైన సినిమా? అల్లూరి సీతారామరాజు సుధీర్‌ బాబు తల్లిదండ్రుల పేరు? నాగేశ్వరరావు, రాణి సుధీర్ బాబు ఏం చదివాడు? BE, GMT, MBA సుధీర్ బాబు అభిరుచులు? సుధీర్‌బాబు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు ఇండియా టాప్ 10 బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌లో ఒకడు.  సుధీర్‌ బాబుకు నచ్చిన ప్రదేశం? విజయవాడ సుధీర్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు.  సుధీర్ బాబుకు ఇష్టమైన ఆహారం? గ్రిల్డ్ చికెన్ సుధీర్ బాబు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?  దాదాపు రూ.7 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సుధీర్ బాబుకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు కొడుకులు- చరిత్ మానస్, దర్శన్ https://www.youtube.com/watch?v=Dw1knnyUrLY
    మార్చి 21 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.  హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.  సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ  టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.  నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.  జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు. 
    ఫిబ్రవరి 13 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే  చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.  భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.  తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.  ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.  అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.  అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.  సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.  ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.   పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.  సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.  హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.  గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ మీకోసం..  1. ట్రైన్‌ సీన్‌ (వెంకీ) హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్‌ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.  https://www.youtube.com/watch?v=pcpuYeqwloY 2. బ్రహ్మీ vs నాజర్‌ (బాద్‌షా) బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్‌, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు.  https://www.youtube.com/watch?v=dxRDHXsQ2YQ 3. MS నారాయణ డైలాగ్స్‌ (దూకుడు) దూకుడు సినిమాలో ఎం.ఎస్‌ నారాయణ, మహేష్‌ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్‌ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్‌ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్‌ చెప్తున్న సమయంలో మహేష్‌ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది.  https://www.youtube.com/watch?v=uR3mdOT8DWY 4. సునీల్‌ కాలేజ్‌ సీన్స్ (సొంతం)  శ్రీను వైట్ల తీసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో  ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్‌ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్‌ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్‌ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు.  https://www.youtube.com/watch?v=d5rZgi9JHXU 5. బ్రహ్మీ ఫన్‌ వరల్డ్‌ సీన్స్‌ ( నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.  https://www.youtube.com/watch?v=D87NXZXotWY 6. క్విజ్‌ సీన్‌ (ఆగడు) ఆగడు సినిమాలో వచ్చే క్విజ్‌ సీన్‌ కూడా తెలుగు టాప్‌ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్‌ యాంకర్‌గా, వెన్నెల కిషోర్‌ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్‌గా నవ్వులు పూయించాడు.  https://www.youtube.com/watch?v=ufmXlnz9R4w 7. బ్రహ్మీ సీన్స్ (అతడు) మహేష్‌ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్‌ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు.  https://www.youtube.com/watch?v=UhmDHGt81l4 8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం) సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.  https://www.youtube.com/watch?v=9sUIkrR2U9c 9. ఎస్కేప్‌ సీన్‌ (నమో వెంకటేశా) ‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్‌ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది.  https://www.youtube.com/watch?v=Llwxco8Ek2o 10. బ్రహ్మీ రివేంజ్‌ (ఢీ) మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్‌, జయ ప్రకాష్‌ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్‌ తీర్చుకునే సీన్‌ సినిమాకే హైలెట్‌. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ‌అని చెప్పాలి.  https://www.youtube.com/watch?v=m7B4qtmgHkk
    మే 03 , 2023
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    ]తమిళ మూవీ ‘96’కు రీమేక్‌గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్‌తో సినిమా నిర్మించారు.జానుDownload Our App
    ఫిబ్రవరి 11 , 2023
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.  https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే  జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది. రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.  https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.  https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.  https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను  ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.  https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.  https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.  ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.   ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 
    ఆగస్టు 14 , 2023
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.  ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.  టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ.   బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.  బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో  ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao MovieHindiJio CinemaAugust 25Invasion 2 SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు స్పై(SPY) నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. సామజవరగమన(Samajavaragamana) శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.  ఇండియానా జోన్స్(Indiana Jones) సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్‌ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్,  తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. మాయా పేటిక(Mayaa Petika) శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్‌ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.  లవ్ యూ రామ్(Love You Ram) ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్‌తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
    జూన్ 26 , 2023
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..  టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    Telugu OTT Releases: ఈ వారం (మే 29) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్‌ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అయితే ఈ వీక్‌ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్‌ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు అహింస ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా ‘అహింస’ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అభిరామ్‌ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. జూన్‌ 2న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలో రజత్‌ బేడి, గీతిక, సదా, రవికాలే, మనోజ్‌ టైగర్‌ తదితరులు నటించారు.  ఐక్యూ సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ పేరుతో ఈ సినిమాను శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించాడు. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ వంటి దిగ్గజ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా జూన్‌ 2వ తేదీనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రమని, మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది. నేను స్టూడెంట్‌ సార్‌! బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’. ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. జూన్‌ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. నేను స్టూడెంట్‌ సార్‌! సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు.  పరేషాన్ తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు.  జూన్‌ 2న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమా కొత్త రకమైన కామెడీని పరిచయం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. చక్రవ్యూహం విలక్షణ నటుడు అజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా జూన్‌ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మర్డర్‌ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా ఈ సినిమాలో జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateSulaikha ManzilMovieMalayalamDisney+ HotstarMay 30VishwakMovieTeluguZee5June 2Asur season 2SeriesHindiJio CinemaJune 1Fake ProfileSeriesEnglishNetflixMay 31A Beautiful LifeMovieEnglishNetflixJune 1New AmsterdamSeriesEnglishNetflixJune 1Infinity StormMovieEnglishNetflixJune 1ScoopSeriesHindiNetflixJune 2ManifestSeriesEnglishNetflixJune 2
    మే 29 , 2023
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు దర్శకత్వం : వియస్ ముఖేష్ సంగీతం: జో ఎన్మవ్   నేపథ్య సంగీతం: సృజన శశాంక సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి నిర్మాత: అఖిలేష్ కలారు విడుదల తేది: ఏప్రిల్‌ 19, 2024 ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం నటింటిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్‌ ముఖేష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్‌ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్‌ శంకర్‌ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్‌ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్‌ ఏం చేశాడు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్‌ అయ్యాడు. అటు మార్కెట్‌ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్‌ పాత్రలో ముక్కు అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్‌ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్‌ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్‌ శంకర్‌, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు వీఎస్‌ ముఖేష్‌ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్‌ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.  టెక్నికల్‌గా ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ హీరో, హీరోయిన్‌ నటనసందేశండైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5
    ఏప్రిల్ 19 , 2024
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్‌ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌ నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌. నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల: 07-12-2023 ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్‌ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో  ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే  నాని - మృణాల్ జోడీ, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్‌ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్‌ ‌అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్‌. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే నాని (Hero Nani) మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్ద‌రూ చాలా బాగా న‌టించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్‌ కూడా కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్‌ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది.  సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేష‌మ్ ఇచ్చిన సంగీతం ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్‌ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు సరిగ్గా కుదిరాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నాని, మృణాల్‌, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం  మైనస్‌ పాయింట్స్‌ ఊహకు అందే కథసాగదీత సీన్లు రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 07 , 2023
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  కథేంటి కపిలేశ్వరపురం అనే ప‌ల్లెటూరులో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి ‘అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో’ న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే చైత‌న్య‌రావ్  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా బాగుంది. చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది.  కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు ఎలా సాగిందంటే క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  డైరెక్షన్‌ & టెక్నికల్‌గా 1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా.. క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ 1980 నాటి నేపథ్యంనటీనటులుకథలో మలుపులు మైనస్‌ పాయింట్స్‌ ఎడిటింగ్‌పాత పంథాలో సన్నివేశాలు రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=COPhzQh-wc8
    జూలై 21 , 2023
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్‌ చిత్రం.. హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: సుహాస్‌, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్‌, నితిన్‌ ప్రసన్న, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం: దుష్యంత్‌ సంగీతం: శేఖర్‌ చంద్ర సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌ ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, బన్నీవాస్‌, వెంకటేశ్‌ మహా (సమర్పణ) విడుదల: 02-02-2024 క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్‌ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘క‌ల‌ర్‌ఫొటో’, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్‌ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగ‌స్వామి కావడంతో పాటు ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మ‌ల్లి (సుహాస్‌) ఓ స‌భ్యుడు. చిర‌త‌పల్లిలో త‌న కుటుంబంతో నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ పుకారు మొద‌ల‌వుతుంది. ఓ కారణం చేత వెంక‌ట్‌బాబు - మల్లికీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఆ త‌ర్వాత ఏం జరిగింది? ల‌క్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మ‌లుపు తీసుకుంది? తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మ‌ల్లి పాత్ర‌లో సుహాస్ అదరగొట్టాడు. ప్ర‌థ‌మార్ధంలో అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌తో న‌వ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో క‌నిపిస్తూ ఎంతో స‌హ‌జంగా న‌టించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. ఇక హీరోయిన్‌ శివానీ నాగారం.. ల‌క్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్‌ ‌అక్కగా చేసిన శ‌ర‌ణ్య ప్ర‌దీప్ సినిమాకి మ‌రో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌. నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే? డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్‌ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్‌ దుష్యంత్‌ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్‌, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మ‌ధ్య అంత‌రాల్ని,  ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ ప్రేక్షకులను క‌థ‌కు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్‌ డ్రామాను ఆవిష్కరించారు. క‌థ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా.. బ‌ల‌మైన స‌న్నివేశాల‌ు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్‌ దుష్యంత్‌ పనితనం మెప్పిస్తుంది.  సాంకేతికంగా.. సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. శేఖ‌ర్ చంద్ర పాట‌లు, నేప‌థ్య సంగీతం, వాజిద్ బేగ్ త‌న కెమెరాతో చిర‌త‌ప‌ల్లిని ఆవిష్క‌రించిన తీరు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఎడిటింగ్‌, బ‌ల‌మైన ర‌చ‌న సినిమా గ‌మ‌నాన్నే మార్చేశాయి. మేకింగ్ ప‌రంగానూ ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ సుహాస్‌, శరణ్య నటనకథ, నేపథ్యంభావోద్వేగ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్ అక్కడక్కడ బోరింగ్ సీన్లు రేటింగ్‌: 3.5/5 ఓటీటీ వేదిక లాక్‌! ఇక ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్‌ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్‌ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్‌ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
    ఫిబ్రవరి 02 , 2024
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?కార్తీకేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. వీరిద్దరూ మరోసారి 18 పేజేస్ అనే ప్రేమకథను పరిచయం చేసే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.సుకుమార్ కథను అందించడం, అతడి శిష్యుడి దర్శకత్వం, అల్లు అరవింద్ సమర్పణ ఎప్పటిలాగే అంచనాలు పెంచాయి. ఈ వారం విడుదలైన చిత్రాలతో పోటీ పడుతుందా? బాక్సాఫీస్‌ వద్ద నిలబడిందో లెేదో తెలుసుకోండి.సోషల్ మీడియా కారణంగా ప్రేమలో విఫలమైన కుర్రాడు అనుకోకుండా ఓ యువతి రాసిన డైరీ చదువుతాడు. ఆమెను చూడకపోయినా వ్యక్తిత్వంతో  లవ్‌లో పడతాడు.కథఇక ఆమెను కలుసుకుందాం అనే సరికి యువతి గురించి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అసలు ఆమెకు ఏం జరిగింది? హీరో ఏం చేశాడు ? ఇలాంటివి తెరపై చూడాల్సిందే.సినిమా ప్రారంభంలో దర్శకుడు ప్రేమ కథను పరిచయం చేశాడు. అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిపోతాడు. ఇలాంటి సినిమాలు ఉన్నా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కామెడీ ట్రాక్స్‌తో చిత్రాన్ని సాఫీగా నెట్టుకొచ్చారు.సాఫీగా సాగిపోయే18 పేజేస్ ట్రైలర్, పాటలు చూస్తే కచ్చితంగా ప్రేమ కథ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ వెళ్లే సరికి సినిమాను థ్రిల్లర్‌ జోనర్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.ప్రేమకథ అన్నారు?తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేపి వదిలేశాడు. ప్రేమకథ అయినా చాలా ట్విస్టులు ఉన్నాయనే హీరో నిఖిల్ మాటలు గుర్తుకురాక తప్పదు.హీరోయిన్‌కు ఏం అయిందనే వేటలో నిఖిల్ చేసే ప్రయత్నాలతో సెకాండాఫ్ ప్రారంభమై ప్రీ క్లైమాక్స్ వరకు పరుగులు తీస్తుంది. అన్ని సినిమాల్లోగానే లాజిక్ లేని సీన్లు కొన్ని కనిపిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ముందే ఊహిస్తారు.కథనంలో వేగంసుకుమార్ కథ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ కథనం నడిపించడం బాగుంది.రచన, దర్శకత్వందర్శకుడు సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్‌తో హిట్ అందుకొని కాస్త అనుభవం సాధించారనే చెప్పాలి. కథను నడిపించిన తీరు ఫర్వాలేదు.సినిమాలో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.సాంకేతిక నిపుణులునిఖిల్ సిద్ధార్థ్ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటన బాగుంది. మిగతావారు పరిధి మేరకు నటించారు.ఎవరెలా చేశారు?కథ కథనం థ్రిల్లింగ్ అంశాలురేటింగ్ : 3 / 5ప్లస్ఊహించే సీన్లుమైనస్
    ఫిబ్రవరి 13 , 2023

    @2021 KTree