• TFIDB EN
  • ప్రేమ నగర్
    UTelugu2h 50m
    జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అక్కినేని నాగేశ్వరరావు
    కళ్యాణ్
    వాణిశ్రీ
    లత
    ధూళిపాళ
    దివాన్జీ
    రమాప్రభ
    హంస
    ఎస్వీ రంగారావు
    కళ్యాణ్ తండ్రి
    గుమ్మడి
    లత తండ్రి
    కైకాల సత్యనారాయణ
    కేశవ వర్మ
    రాజా బాబు
    దాసు
    వి.నాగయ్య
    డాక్టర్
    రమణా రెడ్డి
    రావి కొండల రావు
    స్కూల్ టీచర్
    సాక్షి రంగారావు
    పూజారి
    శాంత కుమారి
    కళ్యాణ్ తల్లి
    హేమలత
    లత తల్లి
    సూర్యకాంతం
    S. వరలక్ష్మి
    ఇంద్రాణి
    చలపతి రావు
    డాక్టర్
    జ్యోతి లక్ష్మి
    ఐటమ్ నంబర్
    పుష్పలత
    అయ్యా
    వెంకటేష్
    యంగ్ కేశవ్ వర్మ
    కె.వి.చలంకుక్
    కాకరాలలత సోదరుడు
    పుష్ప కుమారిగౌరి
    మీనా కుమారికమల
    సిబ్బంది
    కెఎస్ ప్రకాశరావు
    దర్శకుడు
    డి. రామానాయుడు
    నిర్మాత
    ఆత్రేయ
    రచయిత
    కేవీ మహదేవన్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్‌ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  ‘నా మనసుకు నచ్చితే వస్తా’ రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్‌ భార్య తబిత ప్రెజెంట్‌ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్‌ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్‌, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్‌ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్‌ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/i/status/1826302303244091491 ‘నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి’ ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ. నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీని సెపరేట్‌ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చిరుకి సింపుల్‌ విషెస్‌..! నేడు (ఆగస్టు 22) మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్‌ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్‌ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.  https://twitter.com/alluarjun/status/1826438293350711467 బన్నీకి పవన్‌ చురకలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్‌ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్‌ వారే జరిగింది. 
    ఆగస్టు 22 , 2024
    వాలెంటైన్స్‌ డే స్పెషల్‌:  సినిమాతో పరిచయమై ప్రేమ ప్రయాణం చేసి పెళ్లితో ఒక్కటైన జంటలు
    వాలెంటైన్స్‌ డే స్పెషల్‌: సినిమాతో పరిచయమై ప్రేమ ప్రయాణం చేసి పెళ్లితో ఒక్కటైన జంటలు
    ]మణిరత్నం- సుహాసిని, వంశీ రమ్య కృష్ణ,  కృష్ణ- విజయ నిర్మల, శరత్‌ బాబు-రమాప్రభ ఇలా రీల్‌ టు రియల్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన జంటలు చాలానే ఉన్నాయి.
    ఫిబ్రవరి 14 , 2023
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.  హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.  https://twitter.com/i/status/1332879102211096577 ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్‌కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్‌ చెప్పాలని నిర్ణయించుకుందట. కిరణ్‌-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్‌’ (Meter), ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.  ప్రస్తుతం ‘దిల్‌ రుబా’ అనే చిత్రం కిరణ్‌ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్‌ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఇక రహస్య గోరక్‌ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్‌ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.  అదే ఏడాది 'బాయ్స్‌ ఇన్ స్కూల్‌' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్‌' అనే తమిళ్‌ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది. 
    మార్చి 11 , 2024
    <strong>Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;</strong>
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.&nbsp; విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!&nbsp; ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.&nbsp; https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.&nbsp;
    జూలై 27 , 2024
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని&nbsp; ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  కథేంటి కపిలేశ్వరపురం అనే ప‌ల్లెటూరులో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి ‘అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో’ న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?&nbsp; చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే చైత‌న్య‌రావ్&nbsp; న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా బాగుంది. చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది.&nbsp; కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు ఎలా సాగిందంటే క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.&nbsp; డైరెక్షన్‌ &amp; టెక్నికల్‌గా 1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా.. క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా&nbsp; ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ 1980 నాటి నేపథ్యంనటీనటులుకథలో మలుపులు మైనస్‌ పాయింట్స్‌ ఎడిటింగ్‌పాత పంథాలో సన్నివేశాలు రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=COPhzQh-wc8
    జూలై 21 , 2023
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
    ]తమిళ మూవీ ‘96’కు రీమేక్‌గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్‌తో సినిమా నిర్మించారు.జానుDownload Our App
    ఫిబ్రవరి 11 , 2023
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?
    REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?కార్తీకేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. వీరిద్దరూ మరోసారి 18 పేజేస్ అనే ప్రేమకథను పరిచయం చేసే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.సుకుమార్ కథను అందించడం, అతడి శిష్యుడి దర్శకత్వం, అల్లు అరవింద్ సమర్పణ ఎప్పటిలాగే అంచనాలు పెంచాయి. ఈ వారం విడుదలైన చిత్రాలతో పోటీ పడుతుందా? బాక్సాఫీస్‌ వద్ద నిలబడిందో లెేదో తెలుసుకోండి.సోషల్ మీడియా కారణంగా ప్రేమలో విఫలమైన కుర్రాడు అనుకోకుండా ఓ యువతి రాసిన డైరీ చదువుతాడు. ఆమెను చూడకపోయినా వ్యక్తిత్వంతో &nbsp;లవ్‌లో పడతాడు.కథఇక ఆమెను కలుసుకుందాం అనే సరికి యువతి గురించి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అసలు ఆమెకు ఏం జరిగింది? హీరో ఏం చేశాడు ? ఇలాంటివి తెరపై చూడాల్సిందే.సినిమా ప్రారంభంలో దర్శకుడు ప్రేమ కథను పరిచయం చేశాడు. అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిపోతాడు. ఇలాంటి సినిమాలు ఉన్నా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కామెడీ ట్రాక్స్‌తో చిత్రాన్ని సాఫీగా నెట్టుకొచ్చారు.సాఫీగా సాగిపోయే18 పేజేస్ ట్రైలర్, పాటలు చూస్తే కచ్చితంగా ప్రేమ కథ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ వెళ్లే సరికి సినిమాను థ్రిల్లర్‌ జోనర్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.ప్రేమకథ అన్నారు?తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేపి వదిలేశాడు. ప్రేమకథ అయినా చాలా ట్విస్టులు ఉన్నాయనే హీరో నిఖిల్ మాటలు గుర్తుకురాక తప్పదు.హీరోయిన్‌కు ఏం అయిందనే వేటలో నిఖిల్ చేసే ప్రయత్నాలతో సెకాండాఫ్ ప్రారంభమై ప్రీ క్లైమాక్స్ వరకు పరుగులు తీస్తుంది. అన్ని సినిమాల్లోగానే లాజిక్ లేని సీన్లు కొన్ని కనిపిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ముందే ఊహిస్తారు.కథనంలో వేగంసుకుమార్ కథ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ కథనం నడిపించడం బాగుంది.రచన, దర్శకత్వందర్శకుడు సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్‌తో హిట్ అందుకొని కాస్త అనుభవం సాధించారనే చెప్పాలి. కథను నడిపించిన తీరు ఫర్వాలేదు.సినిమాలో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.సాంకేతిక నిపుణులునిఖిల్ సిద్ధార్థ్ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటన బాగుంది. మిగతావారు పరిధి మేరకు నటించారు.ఎవరెలా చేశారు?కథ కథనం థ్రిల్లింగ్ అంశాలురేటింగ్ : 3 / 5ప్లస్ఊహించే సీన్లుమైనస్
    ఫిబ్రవరి 13 , 2023
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. &nbsp; తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.&nbsp;&nbsp; అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -&nbsp; మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)&nbsp; - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.&nbsp; https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.&nbsp; https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.&nbsp; https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రణ్‌బీర్ కపూర్‌ - అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (40)&nbsp; - అలియా భట్‌ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్‌ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.&nbsp; ఫహద్‌ - నజ్రియా మలయాళం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ (40) నటి నజ్రియా నజిన్‌ (28)ను 2014లో లవ్‌ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్‌ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.&nbsp; ప్రియాంక చోప్రా - &nbsp;నిక్ జోనాస్‌ బాలీవుడ్ ‌అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు నిక్ జోనాస్‌ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్‌ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి. సైఫ్ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్‌ అలీఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్‌ వైఫ్‌ అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.&nbsp; ఆర్య - సయేషా సైగల్&nbsp; తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్‌ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.&nbsp;&nbsp; ప్రకాష్‌ రాజ్‌ - పోనీ వర్మ ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌(58) కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్‌ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్‌ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.&nbsp; దిల్‌ రాజు - తేజస్విని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.&nbsp;&nbsp; అర్జున్‌ కపూర్‌ - మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు.&nbsp;
    మే 16 , 2023
    <strong>Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?</strong>
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్‌, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్‌ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్‌ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్‌ అభిమానుల ఫేవరేట్‌ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; సీతారామం 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.&nbsp; హాయ్‌ నాన్న ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; నిన్ను కోరి హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. తొలి ప్రేమ&nbsp; టాలీవుడ్‌లో వచ్చి కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్‌ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.&nbsp; నిన్నే పెళ్లాడతా కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.&nbsp; జాను శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp;
    ఫిబ్రవరి 13 , 2024
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు&nbsp; రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..&nbsp; టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.&nbsp; 1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్‌ గేమ్ ఓ థ్రిల్లర్‌ సర్వైవల్‌ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్‌ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి. https://www.youtube.com/watch?v=oqxAJKy0ii4 2. MY NAME మై నేమ్‌ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్‌ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్‌ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=ZOl7iOrD31Q 3. MR. SUNSHINE మిస్టర్‌ సన్‌ షైన్‌ లవ్‌ పొలిటికల్‌, హిస్టారికల్‌ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్‌ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్‌ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.&nbsp; https://www.youtube.com/watch?v=rPJSo4fhtRU 4. CRASH LANDING ON YOU రొమాంటిక్‌ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్‌ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్‌ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్‌ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. https://www.youtube.com/watch?v=eXMjTXL2Vks 5. OUR BLUES&nbsp; ఈ సిరీస్‌ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌. జెజూల్యాండ్‌ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్‌ ఇది.&nbsp; https://www.youtube.com/watch?v=vSBIJQOLKoY 6. SIGNAL షెర్‌లాక్‌, బ్రాడ్‌ చర్చ్‌ ఫ్యాన్స్‌ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్‌ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=OonjouzGJKk 7. ALL OF US ARE DEAD జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్‌ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్‌ ఎక్సపర్‌మెంట్‌ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్‌ చేస్తుంది. https://www.youtube.com/watch?v=IN5TD4VRcSM
    ఏప్రిల్ 26 , 2023
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌ దర్శకులు: వినోద్ గాలి సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్ ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్ విడుదల తేదీ : జులై 4, 2024 ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్‌ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి వరంగల్‌కు చెందిన మదన్‌ (సిద్ధూ పవన్‌).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్‌ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్‌)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్‌ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్‌ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్‌ ఎలా మ్యానేజ్‌ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్‌ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్‌ కథ.&nbsp; ఎవరెలా చేశారంటే సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే.. బోల్డ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ సిరీస్‌ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్‌ అయ్యారు. రొటీన్‌ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్‌ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్‌ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్‌ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్‌ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్‌ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్‌ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్‌ పరంగా రిఫ్రెష్‌మెంట్‌ ఫీల్‌ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది.&nbsp;క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ.. అది మెయిన్‌ క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్‌ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్ర‌మిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్‌ కామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసెకండ్‌ లవ్‌ ట్రాక్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    జూలై 04 , 2024
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు దర్శకుడు : కోనేటి శ్రీను నిర్మాత: ఎండీ పాషా సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి ఎడిటింగ్: వినయ్ రామస్వామి విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024 బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్‌ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’తో మెప్పించిన ఇతడు తాజాగా (ఫిబ్రవరి 2న) ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించగా సునీల్‌, ఇంద్రజ, అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ కోనేటి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సోహెల్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్ర‌జ‌) కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలరాజు - మహాలక్ష్మి ప్రేమించుకుంటారు. మరోవైపు బాలరాజును సిరి (సిరి హనుమంతు) కూడా ప్రేమిస్తుంటుంది. అయితే బాలరాజు - మహాలక్ష్మి ప్రేమ కథకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఇందులో సోహైల్‌.. హైపర్‌ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిలా (Bootcut Balaraju Review) మెప్పించాడు. చక్కటి భావోద్వేగాలను పలికించాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్‌ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. బాలరాజు ఫ్రెండ్స్‌గా అవినాష్‌, సద్దాం కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి అలరించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోనేటి శ్రీను తీసుకున్న కథ, సోహెల్ - ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించాడు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్‌ అవడానికి ఏం చేశాడనేది చూపించాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా సీన్స్ సినిమాకి బలహీనతగా మారాయి. దర్శకుడు కంటెంట్‌ను స్క్రీన్‌పై బాగా ఎలివేట్ చేసినా.. రొటిన్‌, బోరింగ్ సీన్స్ వల్ల అది ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bootcut Balaraju Review).. భీమ్స్‌ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్యం సంగీతం కూడా కీలక సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ వినయ్ రామస్వామి తన కత్తెరకు మరింత పని కల్పించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ సోహేల్‌, ఇంద్రజ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్లు రేటింగ్‌: 3/5
    ఫిబ్రవరి 03 , 2024
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్‌ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సైంధవ్‌ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్‌, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు. ఎలా సాగిందంటే&nbsp; గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్‌ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు ‌అలాంటిదే.&nbsp; ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్‌ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్‌ కథను తీసుకున్నారు. 'సైంధవ్‌' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో&nbsp; చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్‌ 'విక్రమ్‌', రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్‌ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్‌ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్‌ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్‌. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం శైలేష్‌ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్‌ పక్కన పెడితే సైంధవ్‌ మెప్పిస్తాడు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ వెంకటేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్‌ రేటింగ్‌: 3/5
    జనవరి 13 , 2024
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    Samajavaragamana Review: కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీ విష్ణు హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: రాం అబ్బరాజు నిర్మాత: రాజేష్ దండ సంగీతం: గోపి సుందర్ ఎడిటర్: చోట కె ప్రసాద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ హీరో నటించిన ‘సామజవరగమన’ చిత్రం June 29న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి ఈ మూవీతో ఆ కోరిక తీరిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? బాలసుబ్రహ్మణ్యం(శ్రీవిష్ణు) ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. తాతకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ దానిని అనుభవించడానికి వీలుండదు బాలుకి. కారణం బాలు తండ్రి ఉమామహేశ్వర రావు(నరేశ్) డిగ్రీ పాస్ కాకపోవడమే. తన కొడుకు డిగ్రీ పాసైతేనే వంద కోట్ల ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తాడు ఉమా తండ్రి. దీంతో తండ్రిని చదివించడానికి బాలు నానా తిప్పలు పడతాడు. ఈ క్రమంలో సరయు(రెబా మోనిక)తో పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ, వీరి ప్రేమ పెళ్లికి ఓ విషయం అడ్డు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? చివరికి బాలు, సరయు ఒక్కటయ్యారా? అనేది తెరపై చూడాల్సిందే.&nbsp; ఎలా ఉంది? ప్రచార చిత్రాల్లో చూసినట్టుగా కథ తెలిసినట్టుగా అనిపించినా కథనం ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేవడు. పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఇస్తుంటుంది. మంచి హాస్య కథా చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. 2 గంటల 20 నిమిషాల స్క్రీన్ టైమ్‌ని ఆడియెన్స్ ఆస్వాదిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ములుపు, ద్వితియార్ధంలో వచ్చే సీక్వెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మ్యూజిక్ కాస్త రుచించదు.&nbsp; ఎవరెలా చేశారు? ఈ సినిమాకు నటీనటుల యాక్టింగే ప్రధాన బలం. బాలుగా శ్రీవిష్ణు ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌ని సంపూర్ణంగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేశాడు. ఇక, బాలు తండ్రిగా నరేశ్ గొప్పగా నటించాడు. ఈ పాత్రలో నరేశ్‌ని తప్పితే మరొకరిని ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రను వేశాడు. ఒకరకంగా సినిమాకు రెండో హీరో నరేశే. ఇక రెబా మోనిక తన పరిధి మేరకు నటించింది. రఘు బాబు, వెన్నెల కిశోర్ కామెడీతో మరోసారి నవ్వించారు.&nbsp; టెక్నికల్‌గా.. కథను ఊహించగలిగినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారు. చక్కని కామెడీ సన్నివేశాలను రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలపై మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఇక రాంరెడ్డి కెమెరా పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సరితూగింది.&nbsp; ప్లస్ పాయింట్స్ నటీనటులు కామెడీ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ మ్యూజిక్ సాగతీత సన్నివేశాలు రేటింగ్: 2.75/5
    జూన్ 30 , 2023

    @2021 KTree